ప్రియమైన ఎన్నుకొనబడిన వారలారా,
మన ప్రభువైన యేసు మనలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఎంతగా అంటే మన దినములో మనకు ఒక ప్రవక్తను పంపుటకు ఆయనకు ఇష్టమైనది. ఆయనకు 100% శాతం నమ్మకమున్నటువంటి ఆ ఒక్కడు. తన వధువును బయటకు పిలవడానికి ఆ మానవ శరీరము ద్వారా ఆయన తనను తాను బయలుపరచుకొనుటకు, ఆయన వచ్చి మరియు తనలో జీవించగల ఒక్కడైయున్నాడు.
ఆయన యొక్క ప్రవక్త మనలను ఎంతగానో ప్రేమించాడు, తద్వారా, ఏ క్రొత్త వర్తమానమైనా ఈ చిన్న ఆలయమునుండే వచ్చునని, ఆయన మనకును మరియు దేవునికిని ఒక ప్రమాణము చేశాడు. అతడు వెళ్ళిపోయిన తర్వాత కూడా, దేవుని యొక్క వధువు పోషించబడునట్లు ఆత్మీయ ఆహారమును కలిగియుండుటకై, అతడు దానిని రికార్డు చేసి, దానిని భద్రపరచేవాడు.
దేవుడు తన యొక్క దూతయైన ప్రవక్తను ఎంతగానో ప్రేమించాడు తద్వారా అతడు మనకిచ్చిన తన మాటను నిలబెట్టుకొనుటకు ఆయన తన ప్రవక్తకు సహాయం చేశాడు.
దేవుడు తన యొక్క బలిష్టుడైన దూత ద్వారా మాట్లాడి మరియు బైబిలు గ్రంథమంతటినీ మనకు పూర్తిగా బయలుపరచి మరియు అనువదించిన తర్వాత, అప్పుడు పిరమిడు-వంటి బండ యొక్క పైభాగమును ఆయన తెరిచాడు, దానిపై ఏమియు వ్రాయబడియుండలేదు, మరి దానిని ఆయన యొక్క దూతకు బయలుపరిచాడు, తద్వారా అతడు, ఆయన యొక్క వధువైయున్న మనకు ఆయన యొక్క దాచబడిన మర్మములన్నిటిని ఇచ్చుటకైయున్నది.
దేవుడు సహోదరుడు రాబర్సన్ కి ఒక దర్శనమును కూడా ఇచ్చాడు, అందులో అగ్నిస్తంభము ఆయన యొక్క ప్రవక్తను కొనిపోయి మరియు అతడిని పశ్చిమానికి తీసుకువెళ్ళి, పిదప అతడిని తిరిగి తీసుకొనివచ్చి మరియు ఎక్కడైతే అతడు మార్పుచెందాడో అట్టి ఆ బల్ల యొక్క శిరస్సు స్థానమునకు అతడిని తీసుకువచ్చుటను అతడు చూశాడు.
అప్పుడు పరిశుద్ధాత్మ అతనితో మాట్లాడి మరియు ఇట్లు చెప్పెను, “ఈయన నా సేవకుడు. మరియు ఈ కాలమునకు ప్రవక్తగా ఉండుటకు నేను అతడిని పిలుచుకున్నాను, సరిగ్గా మోషే వలెనె ప్రజలను నడిపించుటకైయున్నది. ఉనికిలోనికి పలుకుటకు అతనికి అధికారమివ్వబడినది.”
మోషే యొక్క పిలుపు ఏమిటి? అతడు ఏమి చేయవలసియున్నాడు? ప్రజలను వాగ్దాన దేశమునకు నడిపించమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. అయితే, “నిన్ను నీవు హెచ్చించుకొనుచున్నావు. సర్వసమాజములో నీ ఒక్కడికే అధికారము-ఉన్నట్లు చేయుటకు ప్రయత్నించుచున్నావు, ” అని చెప్పుచూ, దేవుడు మోషేకు ఇచ్చిన ఆజ్ఞ విషయంలో, కలుగజేసుకోవాలని నిర్ణయించుకొనిన వ్యక్తులు లేచారు.
ఈ క్రియ దేవుడిని ఎంతగానో బాధించినది, తద్వారా ఆయన మోషేతో ఇట్లు చెప్పెను, “వారి మధ్యనుండి నిన్ను నీవు ప్రత్యేకపరచుకొనుము. నేను ఆ గుంపంతటినీ చంపివేయుదును, మరియు నీ ద్వారా ఒక క్రొత్త తరమును ప్రారంభించుదును.” మరియు మోషే దేవుని సన్నిధిలో సాగిలపడి, అందుకు ఆయన అతడిని దాటవలసియున్నదని చెప్పాడు.
ఒకవేళ మన దినములో దేవుడు ప్రజలను నిర్మూలించబోవుచున్న యెడల, మోషే వలె ప్రజల కొరకు ఎవరు నిలబడతారు? మోషే వలె దేవుని చేత అంగీకరించబడే ఒకరిని, అట్లు నిలబడే ఒక వ్యక్తిని, లేదా నిలబడగలిగే ఒక వ్యక్తిని మనము ఎక్కడ కనుగొంటాము? దేవుని యొక్క ఉగ్రతను ఆపడానికి ఈ భూమి మీద ఆయనకు ఎంతో విలువైన ఒకే ఒక్క వ్యక్తి జీవితము కలదు, అది ఆయన యొక్క బలిష్టుడైన ఏడవ దూతయే.
దేవుడు ఎల్లప్పుడూ ఒక ప్రణాళికను కలిగియున్నాడు. ఆయన యొక్క వధువు అ ప్రణాళికను గుర్తిస్తుంది మరియు వాక్యము వెంబడి వాక్యముగా దానితో నిలబడుతుంది. వాగ్దాన దేశమును చేరాలంటే వారిని నడిపించడానికి దేవుని చేత ఎన్నుకోబడిన ఆ స్వరముతో వారు నిలిచియుండాలని వారికి తెలియును.
దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడి మరియు ఓడలో ఆ కాకి మరియు పావురముతో సరిగ్గా నోవహు చేసినట్లే, ఒక భిన్నమైన దిశగా వెళ్ళుటకు ఎంతో అవకాశాన్ని ఇచ్చాడు. అయితే ప్రతిసారి ఓడలోనికి తిరిగి వచ్చిన పావురమువలెనే, వధువు ఎల్లప్పుడూ ఈ వర్తమానము నొద్దకు, ఆ స్వరము నొద్దకు, ఆ టేపుల నొద్దకు తిరిగి వస్తుంది.
మన దినమునకు ప్రవక్త ఎవరు? కాలముల గుండా దేవుడు తన ప్రజలను నడిపించడానికి పిలుచుకొని మరియు పంపినట్టి గొప్ప ప్రవక్తలు ఇదివరకు ఉండియున్నారు: అబ్రాహాము, మోషే, ఏలియా, ఎలీషా, అయితే వారిలో ఎవ్వరునూ మన దినము యొక్క గొప్ప ప్రవక్త వలె లేరు. వారందరికంటెను ఎంతో ఉన్నతమైన కార్యాలయమునకు అతడు పిలువబడినాడు. తన మర్మములన్నిటినీ బయలుపరచుకొనుటకు అతడు దేవునిచేత ఎన్నుకొనబడినవాడు. ఏమి లేనిదానినుండి ఏదైనా కలుగునట్లు ఉనికిలోనికి పలుకడానికి దేవుడు అతడిని ఎన్నుకున్నాడు. మూడవ ఈడ్పును బయలుపరచడానికి అతడు ఎన్నుకోబడినవాడు. తన వధువును నడిపించడానికి దేవుడు ఎన్నుకున్నది ఇతడినే.
దేవుని యొక్క ఎన్నుకోబడిన వధువుగా, మనమెంత ధన్యులము కదా. మనము ఎలా దిగులుపడగలము? మనము ఎలా విచారపడగలము? సాతానుడు మనల్ని నిరుత్సాహపరచుటకు ప్రయత్నిస్తాడు, కానీ మనము జయమును పొందియున్నాము, మనము ఓడ లోపల, భద్రముగా ముద్రించబడియున్నాము. ద్వారములు మూసివేయబడినవి. ఏదియు మనకు హాని కలిగించలేదు. మనము ఆయన యొక్క పునరుద్ధరించబడిన ఆదాము అయ్యున్నాము.
తన యొక్క ఎన్నుకోబడిన వధువైయున్న మన కొరకు, ఆయన వచ్చుచున్నాడు. మనలో కొందరు మరణము రుచి చూడరు, కానీ ఒక్క క్షణములో, కనురెప్పపాటున మార్పు చెందుదురు. మహిమ!!
ఆయన వాక్యము, నాకు ఇవ్వబడిన నా ప్రత్యక్షత, దినదినము గొప్పదగుచుండగా, నేను కూడా, మీలో ప్రతిఒక్కరి వలెనే, అత్యుత్సాహముతో ఉన్నాను. నేను గొప్ప ఎదురుచూపులతో ఉన్నాను. ఆయన ఈ రోజు రానియెడల, బహుషా రేపు వస్తాడు, అయితే ఆయన త్వరగా వచ్చుచున్నాడని నేను ఎరిగియున్నాను మరియు ఆయన నా కొరకు మరియు మీ కొరకు వచ్చుచున్నాడు.
రండి ఈ ఆదివారము జఫర్సన్ విల్ కాలమానము ప్రకారము 12:00 P.M., గంటలకు, ఒక చిన్న చోటున దాచబడిన ఆహారమును వింటూ మరియు దీనిని మేము వీక్షిస్తూ మరియు వినుచుండగా మాతో కూడా చేరండి: ఖాళీలో నిలుచుట 63-0623M. మేము వర్తమానమును 27 వ ఫేరా నుండి ప్రారంభిస్తాము.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
వర్తమానమును వినడానికి ముందు చదవాల్సిన లేఖనములు:
సంఖ్యాకాండము 16:3-4
సంబంధిత కూడికలు
ప్రియమైన టేపు వధువా,
మనము ఎటువంటి దినములో జీవిస్తున్నాము గదా! ఎటువంటి ఒక గొప్ప సమయం! ఆ మర్మములు, రహస్యములు, అవన్నియు మనకు అనుదినము బయలుపరచబడుచున్నవి. కేవలం మనము దాటి వచ్చిన దానిని మనము చూడటం మాత్రమే కాదు గానీ, సరిగ్గా మనము జీవిస్తున్న ఈ ఘడియను మరియు ఖచ్చితంగా మీదటికి ఏమి ఉన్నదో దానిని మనము ఎరిగియున్నాము.
ఏమి సంభవించబోవుచున్నదో అది మనకు వచనం వెంబడి వచనం చెప్పబడుచున్నది. మనము ఎవరన్నది, అక్కడ ఎవరు ఉంటారన్నది, మరియు మనము ఏమి చేస్తామన్నది కూడా ఆయన మనకు తేటగా చెప్పుచున్నాడు. ఆ 144,000 మంది యూదులు, శ్రమల ద్వారా శుద్ధిచేయబడిన సంఘము, పట్టణములోనికి వారి మహిమను మరియు ఘనతను తీసుకొనివచ్చే ద్రాక్షాతోటలోని పనివారు.
అయితే పిదప అది మీరు కాదని ఆయన మనతో చెప్తాడు…ఓ కాదు, మీరు నా వధువైయున్నారు, మీరు నాతో కూడా ఆ పట్టణంలో ఉన్నారు. మీరు అక్కడ బయట ఆ ద్రాక్షాతోటలలో పనిచేయబోవడంలేదు, మీరు నా ప్రియురాలైయున్నారు. మీరు మీ రాజునైన నాతో కూడా ఉన్న, నా రాణియైయున్నారు. మీరు జగత్తు పునాది వేయబడకముందే నేను ఎన్నుకొనిన అయిదవ-భాగములోని ఒక్క-వంతువారై యున్నారు. నేను ఈ చోటును మీ కొరకు మాత్రమే చేసియున్నాను…మరియు సరిగ్గా మీకు ఇష్టమైన విధంగా చేశాను.
ఆయన తన అద్భుతమైన వాక్యమును మనకు బయలుపరచుచు, వారము వెంబడి వారము, రోజు వెంబడి రోజు, ఘడియ వెంబడి ఘడియ, మనతో మాట్లాడుచుండగా మనము ఆయన బల్ల చుట్టూ కూడుకొనుటను గూర్చి ఆలోచించుటయే, అద్భుతంగా ఉన్నది. మనము ఎవరమో; మరియు ఆయన మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో; ఏమి జరిగినదో, ఏమి జరిగుచున్నదో, మరియు ఏమి జరుగబోతుందో ఆయన మళ్ళీ మళ్ళీ మనతో చెప్పుచున్నాడు.
అది మనకు ఎంత విలువైనదో వ్యక్తపరచడానికి, లేదా ఆయన ఈ సంగతులను మనతో మాట్లాడుటను మనము విన్నప్పుడు ఎటువంటి అనుభూతిని పొందుతామో వ్యక్తపరచడానికి మాటలు లేవు. మనము ప్లే ను నొక్కి మరియు ఆ స్వరమును వింటున్నప్పుడు, మనము ఈ లోకమును విడిచిపెట్టి మరియు తక్షణమే పరలోకపు స్థలములలో ఆయనతో కూడా కూర్చొనుచున్నాము. మన ప్రాణములు ఆదరించబడినవి. పరిశుద్ధాత్మ మనల్ని పూర్తిగా తనయొక్క ఆత్మతో నింపుటను మనము అనుభూతిచెందుచున్నాము. అది ఒక వివరించలేనటువంటి ఆనందమైయున్నది. దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఆ టేపులలో పలుకబడిన ప్రతీ మాటను, ఆయన మన కొరకు పలికాడు. మనము ఏది వినడం అవసరమో మరియు దానిని మనము ఎప్పుడు వినడం అవసరమో ఖచ్చితంగా ఆయనకు తెలుసు…మరియు అనేకసార్లు మనము దానిని మళ్ళీ మళ్ళీ వినవలసిన అవసరం ఉన్నది….మరియు ప్రతీసారి అది మన ప్రాణములను ఉప్పొంగజేస్తుంది.
దర్శనాలు, కలలు, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, తెరకు ఆవల, మనలను తెల్లని వస్త్రములలో చూచుట, మూడవ ఈడ్పు, ఉడతలను సృష్టించుట, దేవుని యొక్క ఖడ్గము తన చేతిలో పరిపూర్ణముగా ఇమిడిపోవుట, దాచబడిన ఆహారము, బల్ల యొక్క తలవైపున కూర్చుండబెట్టబడటం, ఉరుములు, బలమైన దూతలు వచ్చి ఆయనను పైకి తీసుకొనివెళ్ళడం, ఆయనకు ఎంతో విలువైన ఆ ప్రత్యేకమైన ఏడవ దూత, BRANHAM అని ఉచ్చరించిన ఆ ఏడు పర్వత శికరముల యొక్క నిత్యమైన సూచన, ఆ టేపులపై ఉన్నదానిని మాత్రమే చెప్పండి అని, విఫమవ్వలేని మాటలను నేను కలిగియున్నాను అని, తాను ఒక ఉన్నతమైన పిలుపునకు పిలువబడినాడని, నేను మీకు నా ప్రత్యక్షతను చెప్తాను అని, నేను మీకు దేవుని స్వరమునైయున్నాను అని, టేపు బోధనతో నిలిచియుండండి అని, నేను మిమ్మల్ని వధువు అని పిలువబోవుచున్నాను అని ఆయన మనకు చెప్పుటను వినుటకు మనము ఎన్నడూ అలసిపోము, ప్రతీ దానిని, ప్రతీ చిన్న పదమును, ప్రతీ శ్వాసను...మనము దానంతటిని ప్రేమిస్తున్నాము.
ఇది నా దర్శనము. టేపులలో ఉన్న దేవుని యొక్క స్వరము దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తమైయున్నది, విరామ చిహ్నము. టేపులను ప్లే చేయడం దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తమైయున్నది, విరామ చిహ్నము. బోధకులు, ఉపదేశకులు, అపొస్తలులు, ప్రవక్తలు, సంఘ కాపరులు, చెప్పేది మీరు వినవచ్చును, కానీ టేపులే మీరు వినవలసిన ప్రాముఖ్యమైన స్వరమైయున్నది, మరియు అట్లుండవలసియున్నది, విరామ చిహ్నము. ఈయన మాట వినుడి, అని స్వయంగా దేవుడే చెప్పిన ఒకే ఒక్క స్వరము టేపులపై ఉన్న స్వరమేయైయున్నది, విరామ చిహ్నము.
నా సహోదరీ సహోదరులారా, నేను ఎవరికీ వ్యతిరేకిని కాను, నేను కేవలం ఆ స్వరము పక్షమున ఉన్నాను. ఈ వర్తమానమును నమ్మి, మరియు ప్రేమిస్తున్నామని చెప్పుకొను వారందరినీ, మనము ప్రేమించవలసియున్నది మరియు నేను ప్రేమిస్తున్నాను. ప్లే ను నొక్కమంటూ నేను ప్రజలకు తప్పును చెప్పుచున్నానని మీకు అనిపించినా గాని, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మరియు మీరును నన్ను ప్రేమిస్తున్నారని నేను నమ్ముచున్నాను. మనమందరము ఆయన యొక్క పరిపూర్ణమైన చిత్తములో ఉండగోరుచున్నాము. దయచేసి దేవుడు ఏమి చేయడానికి మిమ్మల్ని పిలిచాడో దానిని చేస్తూనే ఉండండి; బోధించండి, ఉపదేశించండి, ఒక కాపరిగా ఉండండి, కేవలం వారు వినవలసిన ప్రాముఖ్యమైన స్వరము ఏమిటో మీ మందకు చెప్పండి.
టేపు పై ఉన్న ఆ స్వరము మాత్రమే ప్రతీసారి ఒకే విషయాన్ని చెప్తుంది. అది ఎప్పుడూ మారదు. టేపులపై ఉన్న ప్రతీ మాటకు మాత్రమే వధువు ఆమేన్ అని చెప్పగలుగుతుంది, కానీ ఏ ఇతర వ్యక్తియైనా చెప్పే ప్రతీ మాటకు వధువు ఆమేన్ అని చెప్పలేదు, విరామ చిహ్నము.
మీరు దానిని నమ్మనియెడల, మీరు వధువు కాదు. మీరు దానిని నమ్మినయెడల, అప్పుడు టేపులను వినడమే వారు వినవలసిన ప్రాముఖ్యమైన స్వరమని మీ మందకు చెప్పడానికి మీకు ఎటువంటి సమస్య ఉండదు.
ఈ వ్యాఖ్యానములు చేయుట ద్వారా వారి సంఘ కాపరులు చెప్పేది వినవద్దని మరియు వారి సంఘములను విడిచిపెట్టమని నేను చెప్తున్నట్లు అనేకములైన పరిచర్యలనుండి నేను విన్నాను, ఇది నిజము కాదు. నేను ఎన్నడూ దానిని చెప్పను మరియు దానిని నమ్మకండి.
నేను ఎన్నడూ చెప్పనివాటిని, ఎన్నడూ నమ్మని వాటిని అనేకులు చెప్పుచున్నారన్నది వాస్తవము. నేను చెప్పినదానికి మరియు నేను నమ్ముచున్నదానికి తప్ప, నేను వాటికి జవాబుదారిని కాను. నేను ఖచ్చితంగా దేనిని నమ్ముచున్నాను అనుదానిని బహిరంగముగా స్పష్టంగా మాట్లాడి మరియు దానిని లేఖ రూపంలో పెట్టియున్నాను. నేను చెప్పుచున్నదానిని / నా భావమును వారు / మీరు మీకు అనుకూలంగా మలచుకొనుచున్నారు.
వధువు అంతయు ఒకే విషయాన్ని చెప్తుంది. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే విషయాన్ని చెప్పుట కాదు. ఒకే స్వరము. ఒకే ప్రవక్త. ఒకే వధువు.
ఆయన వధువుగా ఉండాలంటే, ప్రపంచవ్యాప్తంగా అనేకమంది విశ్వాసులు చేస్తున్నట్లు, మీరు సరిగ్గా ఒకే సమయానికి వర్తమానమును వినవలసియున్నదని నేను నమ్మడంలేదు, అయితే మీరు ఆదివారము ఉదయమున ఏడవ దూత వర్తమానికుని స్వరమును వినవలసియున్నదని నేను నమ్ముచున్నాను...మొదట ఆ స్వరమును ప్లే చేయండి.
మీరు మాతో కూడా దీనిని వినడానికి ఆహ్వానించబడినారు: ఏడవ ముద్ర 63-0324E, ఆదివారము 12:00 P.M., జఫర్సన్ విల్ కాలమానము ప్రకారము, ప్రపంచ వ్యాప్తంగానున్న వధువులో ఒక భాగంగా ఒకే సమయానికి ఆ స్వరమును వినండి.
సహోదరుడు. జోస్సఫ్ బ్రెన్హామ్
వర్తమానమును వినుటకు ముందు చదువవలసిన లేఖనములు:
ద్వితియోపదేశకాండము 29:16-19
I రాజులు 12:25-30
యెహేజ్కేలు 48:1-7, 23-29
మత్తయి 24:31-32
ప్రకటన 7
ప్రకటన 8:1
ప్రకటన 10:1-7
ప్రకటన 14
సంబంధిత కూడికలు
ప్రియమైన బ్రెన్హామ్ సహోదరుడా,
నీవు ఆయన వధువును బయటకు పిలువడానికి పంపబడిన దేవుని యొక్క ఏడవ దూత వర్తమానికుడవని నేను నా హృదయమంతటితో నమ్ముచున్నాను. నీవు లోకానికి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడును కలిగియున్న దేవుని యొక్క స్వరమైయున్నావు. బైబిలు గ్రంథము యొక్క మర్మములన్నిటిని బయలుపరచుకొనుటకు ఆయన చేత ఎన్నుకొనబడినవాడవు నీవేయని నేను నమ్ముచున్నాను. టేపులపై నీవు చెప్పు ప్రతి మాటను నేను నమ్ముచున్నాను.
నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్న ఒక ప్రశ్న నా హృదయములో ఉన్నది. క్రీస్తు యొక్క వధువుగా ఉండుట కొరకు మనము చేయవలసినవాటి గూర్చి ఎన్నో వివిధమైన విషయాలను చెప్పే, ఎంతోమంది ప్రజలు ఉన్నారు, ఎన్నో స్వరములు ఉన్నాయి. నేను ఆయన యొక్క పరిపూర్ణమైన చిత్తములో ఉండగోరుచున్నాను. నేను పరిపూర్ణమైన విశ్వాసమును కలియుండగోరుచున్నాను. నేను ఎవరికీ వ్యతిరేకిని కాను, అయితే నేను నీవు చెప్పేది వినగోరుచున్నాను.
వధువును సమకూర్చి మరియు మనకు అవసరమైయున్న ఆ ఎత్తబడే విశ్వాసమును మనకు ఏది ఇస్తుంది?
ఈ అంత్య దినములలో, ఎత్తబడే విశ్వాసము కొరకు వధువును సమకూర్చడానికి అవసరమైనది ఆ ఏడు ఉరుముల ద్వారా బయలుపరచబడుతుందని నేను నమ్ముచున్నాను.
బ్రెన్హామ్ సహోదరుడా, ఏడు మర్మములతో సమమైనటువంటి ఆ ఏడు ఉరుములు ఇదివరకే బయలుపరచబడినవా? అవి ఏడు ముద్రలలో బయలుపరచబడి, ఉరుములుగా ఇంకనూ మనకు తెలియకున్నవా?
కాదు, అవి ఏడు ముద్రలలో బయలుపరచబడినవి; ఆ ఉరుములు దాని గూర్చియేయై యున్నవి. అవి బయలుపరచవలసి...ఏడు ఉరుములు వాటి వాటి స్వరములను పలికియున్నవి మరియు అవి ఏమిటో ఎవరునూ కనుగొనలేకపోయారు...అవి ఏమిటో యోహానుకు తెలియును, కాని అతడు వాటిని వ్రాయుటకు అనుమతించబడలేదు. ఆయన ఇట్లు చెప్పాడు, “అయితే ఏడవ దూత, అతడు పలుకు దినములలో, ఏడు ఉరుముల యొక్క ఏడు మర్మములు బయలుపరచబడును.” మరియు ఏడవ దూత ఏడవ సంఘకాలమునకు ఒక వర్తమానికుడైయున్నాడు.
దేవునికి మహిమ. అదే నా జవాబైయున్నది. ఏడు ఉరుముల మర్మము బయలుపరచబడినది. అది టేపులపై ఉన్న దేవుని యొక్క స్వరమైయున్నది మరియు అది ఇప్పుడు వధువును ఏకముగా సమకూర్చుచూ మరియు మనకు అవసరమైన ఎత్తబడే విశ్వాసమును, మనకు ఇచ్చుచున్నది.
సహోదరుడా బ్రెన్హామ్, నా ప్రశ్నకు సమాధానమును ఇచ్చినందుకు, నీకు ధన్యవాదములు. నా హృదయములో ఉన్న ప్రశ్నకు జవాబు టేపులపై ఉంటుందని నేను ఎరిగియున్నాను.
నేను తెలుసుకోవలసినదంతా అదే. నేను అనుదినము ప్లే నొక్కడమును కొనసాగిస్తాను మరియు ఇంకా ఎక్కువగా ఎత్తబడే విశ్వాసమును పొందుకుంటాను.
ఈ ఆదివారము జఫర్సన్విల్ కాలమానము ప్రకారం, 12:00 P.M. గంటల సమయంలో, మేము దీనిని వినుచుండగా, వచ్చి మాతో కూడా ఎత్తబడే విశ్వాసమును పొందుకోండి: ముద్రలపై ప్రశ్నలు మరియు జవాబులు 63-0324M.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
ప్రసంగ తర్జుమాలు
సంబంధిత కూడికలు
ప్రియమైన దేవుని ప్రవక్త యొక్క ప్రజలారా,
వినండి, నేను మీకు చెప్పడానికి ఒక విషయాన్ని కలిగియున్నాను. అది ఎంతో మేలైనది, అది నా హృదయంలో మండుచున్నది. దానిని మీరు మర్చిపోలేదని నేను ఆశిస్తున్నాను, చూడండి see. ఆయన సన్నిధిలో, నన్ను దీనిని చెప్పనివ్వండి. ఆయన కృపవలన, కొద్ది కాలం క్రితం నా ప్రజలను, తెల్లని వస్త్రములలో ఉండుటను కూడా, ఆయన నాకు చూపించెను.
తూర్పు తీరము నుండి పశ్చిమము వరకు, దేశవ్యాప్తంగా, మనము కూడుకొనుచున్నాము. కాలములో మనము ఎన్నో గంటల వ్యవధిలో ఉన్నాము, కానీ దేవుని ప్రవక్త యొక్క ప్రజలముగా మనము కలిసేయున్నాము. మనము ఒక్కటై యున్నాము.
దేవుని యొక్క ప్రవక్త ఇక్కడ భూమిమీద ఉన్నప్పుడు, గొప్పదియును, మరియు వధువు ఉండగోరిన ఒకే ఒక స్థలము ఏదనగా, ఆ స్వరము, “శుభోదయం స్నేహితులారా,” అని చెప్పుటను వినడానికి వేచియుండి, టెలిఫోను-వద్ద కూడుకోవడమేయై యున్నది.
ఎనిమిది మరియు పెన్ స్ట్రీటు మూలన ఆ జనసమూహములో కూర్చొనియుండుటకు వారు ఎంతగా ఇష్టపడేవారు కదా. కేవలం ఒక్క కుర్చీని పొందుటకు, లేదా గోడలకు ఆనుకొని మరియు గంటల సేపు నిలబడియుండుటకు వారు సంతోషంగా ఆ రాత్రంతా పార్కింగ్ స్థలములో సమయము గడిపియుండేవారు. కేవలం ఆ ఒక్క కూటమునకు హాజరవ్వడానికి వీలవుతుందంటే, వారికున్నదంతయూ అమ్మియుండేవారు, వారి ఉద్యోగమును వదులుకొనియుండేవారు.
ప్రవక్త పలికిన ప్రతీ మాటపై వారి జీవితమంతా వ్రేలాడుకొనియున్నది. వారు ఒక్క విషయాన్ని కూడా తప్పిపోదలంచుకోలేదు. ఒక దినమున వారు టేపును పొందుకోగలరని వారు ఎరిగియున్నప్పటికినీ, దేవుడు మానవ పెదవుల ద్వారా మాట్లాడుచున్న ఆ క్షణములోనే వారు వధువుతో ఐక్యమైయ్యుండగోరినారు.
ఇదే వారి జీవితమైయున్నది. ప్రతీ వారము వారు దీని కొరకే వేచియుండేవారు. తదుపరి వర్తమానమును వినుటకంటే వారికి ప్రాముఖ్యమైనది మరేదియు లేదు. ఇప్పుడు, తమకుతాము, అందరూ ఒకేసారి, దేవుని యొక్క ఏడవ దూత ప్రవక్త చెప్పినదానిని, వాక్యము వెంబడి వాక్యముగా వినుటకు అవకాశమును కలిగియున్నారని, వారికి తెలిసియుండగా వారు ఎంతో అత్యుత్సాహంతో ఉండియున్నారు.
దేవుడు ఒక మార్గమును ఏర్పాటు చేశాడు. ఆయన యొక్క వధువు తన స్వరము చుట్టూ ఐక్యమవ్వాలని ఆయన కోరుకున్నాడు. ఆయన యొక్క వధువంతయూ ఒకేసారి తన స్వరమును వినాలని ఆయన కోరుకున్నాడు. ఆయన యొక్క వర్తమానికుడైన దూత ద్వారా పలుకబడిన ఆయన యొక్క స్వరము మాత్రమే తన వధువును ఐక్యము చేసే స్వరమైయున్నదని ఆయనకు తెలియును .
ఆయనయొక్క గొప్ప ప్రణాళిక జరుగుచుండినది.
అమెరికాలోని సంఘ కాపరులందరూ వారి సంఘములు ఖచ్చితంగా టెలిఫోన్-వద్ద కూడుకొనియుండునట్లు చూసుకున్నారు. ఆ స్వరమును వినుటకంటే ప్రాముఖ్యమైనది మరేదియు లేదన్న దర్శనమును వారు పట్టుకున్నారు.
వారు తమ సంఘస్తులకు దానినే నేర్పించారు. “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు తో దేవుడు ఒక ప్రవక్తను పంపియున్నాడు. అతడు అగ్నిస్తంభము చేత నిర్ధారించబడినాడు. ఇది మీకు దేవుని యొక్క స్వరమైయున్నది. ఇది మలాకీ 4, మరియు ప్రకటన 10:7 అయ్యున్నది. తన వధువును నడిపించుటకు అతడు దేవుడు పిలుచుకున్న వ్యక్తియైయున్నాడు. నేను మీకు చెప్పినదంతా ఈ ప్రవక్తను గూర్చియేయైయున్నది. ఇప్పుడు మనమందరమూ ఆయన చెప్పేది వినవలసియున్నది. ఆ పూర్వికుడైన యోహాను వలె, నేను తగ్గవలసియున్నది మరియు ఆయన హెచ్చవలసియున్నది.
దేవుని ప్రణాళిక ఇంకనూ నెరవేర్చబడుచున్నది. వధువు ఇంకనూ ఆయన స్వరము చుట్టూ ఐక్యమగుచున్నది. అయితే మనమిప్పుడు ప్రపంచమంతటి నుండి ఐక్యమగుచున్నాము. ప్రతీ ఆదివారము, వధువులో ఒక భాగము, ఒకే సమయంలో ప్రతీ మాటను వినుట కొరకు గొప్ప ఎదురుచూపుతో వేచియుంటున్నది.
బహుశా మనము ఇదివరకే ఈ వర్తమానమును కొన్ని వందల సార్లు వినియుండవచ్చును, అయిననూ ఈసారే మొదటిసారి వింటున్నట్లు అనిపిస్తుంది. ముందెన్నటి కంటెను ఒక గొప్ప ప్రత్యక్షతను మనము పొందుకోబోవుచున్నామని మనము ఎరిగియున్నాము.
వేరే ఏ స్థలములో మనము ఉండాలనుకోవడం లేదు. ఏదియు ప్రాముఖ్యమైనది కాదు. మనకైతే, ఇదే అది. ఇది మనకొరకైన దేవుని యొక్క ప్రణాళికయైయున్నది. ఈ స్వరము ఆయన యొక్క వధువును పిలుచుచు, ఐక్యము చేయుచూ మరియు పరిపూర్ణము చేయుచున్నది...మరియు మనమే ఆ వధువైయున్నాము.
ఈ ఆదివారమున జఫర్సన్ విల్ కాలమానం ప్రకారం, 12:00 P.M., గంటలప్పుడు, మేము కూడుకొని మరియు దేవుని యొక్క స్వరము మాకు దీనిని బయలుపరచుటను వినుచుండగా మీరు మాతో కూడా చేరాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను: ఆరవ ముద్ర 63-0323.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
వర్తమానమును వినుటకు ముందు వినవలసిన లేఖనములు:
నిర్గమకాండము 10:21-23
యెషయా 13:6-11
దానియేలు 12:1-3
మత్తయి 24:1-30
మత్తయి 27:45
పరిశుద్ధ. యోహాను 10:27v
ప్రకటన 6
ప్రకటన 11:3-6
ప్రసంగ తర్జుమాలు
సంబంధిత కూడికలు
ప్రియమైన పరిపూర్ణ వాక్య వధువా,
దేవుడు తన చివరి శక్తిని పంపించాడు. తిరిగి మన పితరుల యొక్క అసలైన విశ్వాసమునకు మనలను పునరుద్ధరించడానికి ఆయన తన యొక్క గొప్ప పక్షిరాజును క్రిందకు పంపాడు. ఇది పక్షిరాజు కాలమైయున్నది. ఇకమీదట ఏ జీవులు లేవు. ఇకమీదట ఏ వర్తమానికులు లేరు. ఇకమీదట ఏ మనుషుల గుంపు లేదు. అంతా పూర్తయినది. మనము అంతమున ఉన్నాము. ప్రకటన 10:7 లోని స్వరము వచ్చియున్నది మరియు ఆయన తన వధువును బయటకు పిలువడానికి తన గొప్ప పక్షిరాజు ప్రవక్తను ఉపయోగించుకున్నాడు.
ఆదివారమున మీరు గనుక మా పాస్టరు గారు అనగా దేవుని యొక్క గొప్ప పక్షిరాజు, చెప్పేది వినుచుండినయెడల, అతడు మాతో చెప్పినట్లే దీనిని మీకు చెప్పుటను మీరు వినియుంటారు:
“మీరు సరిగ్గా దేవుని యొక్క వాక్యమైయున్న, ఆ ఏడు ఉరుములను తీసుకొని; మరియు ముక్కలు చేసి మరియు చీల్చివేసి మరియు ఆకాశాములను సైతం మూసివేసే ఆ గుంపుయైయున్నారు. మీరు దీనిని మూసివేయగలరు, లేదా దానిని చేయగలరు, మీరు కోరినదల్లా చేయగలరు. శత్రువు మీ నోటి నుండి వచ్చే మాట ద్వారా వధించబడతాడు, ఏలయనగా అది రెండంచులు-గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడియైనది. మీరు ఒక వంద బిలియన్ టన్నుల ఈగలు కలుగును గాక అని పలుకగలరు ఒకవేళ మీరు కోరినయెడల అట్లు చేయగలరు. మీరు పలికేది, ఏదైనా జరుగుతుంది, ఎందుకనగా అది దేవుని నోట నుండి వచ్చుచున్న దేవుని యొక్క వాక్యమైయున్నది. అది ఆయన వాక్యమైయున్నది, కానీ దానిని జరిగించుటకు ఆయన ఎల్లప్పుడూ మానవుడిని వాడుకుంటాడు”.
దేవుడు పంపిన ఆ పక్షిరాజును వినుటకొరకు ప్లే నొక్కడం యొక్క ప్రాముఖ్యతను; నేను ఏ విధంగా నొక్కి చెప్పగలను? ఈ వర్తమానము ఎంతో ప్రాముఖ్యమైనది, ఎంతో పరిపూర్ణమైనది...ఎంతో పరిపూర్ణమైనది, ఎంతగా అంటే ఆయన దానిని ఒక దూతకైనా అప్పగించలేదు. ఆయన దానిని ఇవ్వడానికి ఏ ఇతర వ్యక్తియు లేడు, ఏ ఇతర మనుష్యుల గుంపు లేదు, తన గొప్ప పక్షిరాజు ప్రవక్త తప్ప, ఆయన దానిని ఇవ్వడానికి వేరెవ్వరునూ లేరు.
మనము దాని గురించి మాట్లాడవచ్చు, దానిని ఉపదేశించవచ్చు, దానిని ప్రసంగించవచ్చు కూడా, కానీ “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు,” ను కలిగియున్న స్వరము ఒకే ఒక్కటి ఉన్నది మరియు మీరు ప్రతీ మాటను నమ్మవలసియున్నది. మీరు మీ నిత్యత్వపు గమ్యమును దానిపై ఉంచగలుగునట్టి ఒకే ఒక్క స్వరము ఉన్నది. దేవుడు తన వధువును నడిపించుటకు ఎన్నుకొనిన ఒకే ఒక్క స్వరము ఉన్నది, మరియు ఆయన యొక్క వధువు మాత్రమే ఆ ప్రత్యక్షతను కలిగియుంటుంది.
ఆయన తన వాక్యమంతటినీ బయలుపరచుటకు జగత్తుపునాది వేయబడకముందే తాను ఎన్నుకున్న ఒకేఒక్క పక్షిరాజు ప్రవక్త ఉన్నాడు....అతడే విలియమ్ మారియన్ బ్రెన్హామ్, అతడు, మరియు అతడు మాత్రమే, ఈ దినమునకు దేవుని యొక్క పక్షిరాజు వర్తమానికుడైయున్నాడు. అతడు, మరియు అతడు మాత్రమే, దేవుని యొక్క వధువును నడిపించుటకు పంపబడినాడు.
నా పిలుపు, లేదా ఏ సేవకుల యొక్క పిలుపైనా, ఒకే ఒక్క విషయము కొరకైయున్నది: మిమ్మల్ని అతని యొద్దకు, దేవుని యొక్క ఆ గొప్ప పక్షిరాజు వద్దకు నడిపించుటకైయున్నది. ఆయన చేత ఎన్నుకొనబడినవాడు. ఆయన యొక్క అగ్నిస్తంభముచేత నిర్ధారించబడినవాడు. ఆయన గ్రంథమును తెరిచి, మరియు ఆ ముద్రలను విప్పి, మరియు వాటిని భూమి మీదకి పంపినప్పుడు, తన ప్రజలమైయున్న మనకు వాటిని బయలుపరచడానికి, ఆయనచేత ఎన్నుకొనబడినవాడు.
టేపుపై అతడు పలికిన మాటలు అతని మాటలు కావు, అవి పలుకబడి మరియు ఆయన యొక్క వధువు వినడానికి టేపుపై రికార్డు చేయబడిన దేవుని యొక్క ఆలోచనలైయున్నవి; మరియు కేవలం మీరు, ఆయన వధువైయున్న మీరు మాత్రమే దానియొక్క నిజ ప్రత్యక్షతను కలిగియున్నారు.
వధువా, కేవలం దాని గురించి ఆలోచించుము! మనము చేరుకున్నాము. అంతే. శాస్త్రీయ పరిశోధన దానిని ఋజువు చేసినది. వాక్యము యొక్క నిర్థారణ దానిని ఋజువు చేసినది. మరియు మనము ఇక్కడ ఉన్నాము! మరియు ఈ ప్రత్యక్షత దేవుని యొద్దనుండి వచ్చుచున్నది, మరియు అది సత్యమైయున్నది. మరియు మీరు దానిని గుర్తించుచున్నారు గనుక, మనము పూర్తిగా పునరుద్ధరించబడిన ఆయన యొక్క కుమారులము మరియు కుమార్తెలమైయున్నాము.
ఇక ఆలోచించేది ఏమీ లేదు. ఇక ప్రశ్నించేది ఏమీ లేదు. మనము ఆయన యొక్క పరిపూర్ణమైన వాక్య వధువైయున్నాము. మనము ఎవరమన్నది మనము గుర్తించాము. ఆయన తన పక్షిరాజుకు, తెల్లని వస్త్రాలను ధరించుకున్నవారిని చూచుటకు అనుమతించాడు, దేవుని కృపను బట్టి ఆ ప్రజలము మనమేయైయున్నాము.
వధువా ధైర్యము తెచ్చుకొనుము. మనము దాదాపు అక్కడికి చేరుకున్నాము. మనము దానిని అనుభూతి చెందగలుగుచున్నాము. ఇంతకు ముందెన్నడూ లేనంతగా అది ఇప్పుడు మనకు ఎంతో వాస్తవముగానున్నది. శతృవు మనలను ద్వేషిస్తున్నాడు, కానీ దేవుడు మనల్ని ప్రేమించుచున్నాడు. ఆయన కేవలం మనతో ఉండటం మాత్రమే కాదు కానీ, ఆయన మనలో ఉన్నాడు. మనము ఆయన యొక్క శరీధారియైన వాక్యమైయున్నాము.
మనము విఫలము అవ్వలేమని, మరియు విఫలము అవ్వమని, ఆయన సాతానుకి ఋజువు చేయుచున్నాడు. విశ్వాసము మరియు సందేహము మాత్రమే ఉన్నాయి. అయితే మనము కేవలం విశ్వాసమునే కలిగియున్నాము. మనయందు కాదు గాని, ఆయన యొక్క వాక్యములో విశ్వాసమును కలిగియున్నాము, మరియు అది విఫలమవ్వజాలదు. ఎందువలన? మనము వాక్యమైయున్నాము. దేవుడు ఆలాగున చెప్పెను!!
మీరు ఆయనను ఎన్నుకోలేదు కానీ, ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు. అసలు సాతానుడు మీకు ఏదైనా ఎలా చేయగలడు, దేవుడే మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ఆయన వాక్యమును నమ్ముటలో మీరు తప్పిపోరని ఆయన ఎరిగియున్నాడు గనుక ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు. సాతాను మీతో ఇలా చెప్తాడు, “కానీ నువ్వు విఫలమవుతావు, విఫలమవుతావు, విఫలమవుతావు”...నీవు చెప్పేది నిజమే, నేను నా శరీరములో విఫలమవుతాను, అయితే నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను, మరియు ప్రతీ వాక్యమును నమ్ముటలో నేను విఫలమవ్వను.
మనము దేవుని కొరకు పరీక్షించబడి మరియు శ్రమల గుండా వెళ్ళవలసియున్నది, తద్వారా ఆయన తనకి, మరియు మనకి శత్రువైనవానికి...మనము ఆయన యొక్క పరిపూర్ణమైన వాక్య వధువైయున్నాము అని ఋజువు చేయుటకైయున్నది.
ఈ ఆదివారము జఫర్సన్ విల్ కాలమానము ప్రకారముగా 12:00 P.M., కు దేవుని యొక్క గొప్ప పక్షిరాజు, ప్రత్యక్షతను తీసుకువచ్చుటను మనము వినుచుండగా, ఆ గొప్ప పరిశుద్ధాత్మ మీ గృహములను, మీ సంఘములను లేదా మీరు ఎక్కడున్నా మిమ్ములను నింపునుగాక: అయిదవ ముద్ర 63-0322.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
వర్తమానమును వినుటకుముందు చదవవలసిన లేఖనములు:
దానియేలు 9:20-27
అపొస్తుల కార్యములు 15:13-14
రోమా 11:25-26
ప్రకటన 6:9-11 / 11:7-8 / 22:8-9
ప్రసంగ తర్జుమాలు