ఆదివారం
18 ఫిబ్రవరి 2024
64-0614M
ముసుగు తీయబడిన దేవుడు

ముసుగు లోపటనున్న ప్రియమైన వధువా,

“ప్లేను నొక్కడం మీరు చేయగల అత్యంత ముఖ్యమైన విషయము,” అని నేను మీకు మళ్ళీ మళ్ళీ ఎందుకని చెప్తూ ఉంటాను? “సహోదరుడు బ్రెన్హామ్ గారిని తిరిగి మీ ప్రసంగ వేదికల్లో పెట్టండి,” అని నేను సంఘకాపరులకి ఎందుకని చెప్తూ ఉంటాను?

అది కేవలం ఇంత సులువైన విషయమైయున్నది. ఎందుకనగా టేపులో ఉన్న ఏడవ దూత వర్తమానికుడి స్వరమును వినుట, సజీవమైన దేవుని స్వరమును వినుటయే.

ప్రజల యెదుట, దేవుడు మరలా ముసుగు ధరించుకొని మరియు మోషేను నిర్ధారించాడు, ముసుగు ద్వారా, తననుతాను అదే అగ్నితో, అదే అగ్నిస్తంభముతో ముసుగు ధరించుకొనుట ద్వారా క్రిందికి దిగివచ్చాడు. అప్పటి—అప్పటి నుండి...వారు, వారు దేవుని స్వరమును మాత్రమే వినగలుగుట కొరకైయున్నది. మీకు అది అర్థమైనదా? కేవలం వాక్యమును, వారు ఆయన స్వరమును విన్నారు, ఎందుకనగా, మోషే, వారికి, సజీవ వాక్యమైయున్నాడు.

సజీవ సేవకుని గురించి మాట్లాడండి! టేపులలో మనము వింటున్న స్వరము మన దినమునకైన సజీవ వాక్యమైయున్నది. అది దానికంటే ఇంకా గొప్పగా ఏమియు మారదు.

మోషే దినములో, శిభిరములో ఉన్న ఇశ్రాయేలు పిల్లలు మాత్రమే అతని స్వరమును వినగలిగారు. కానీ ఈనాడు, ప్రపంచమంతా తన స్వరమును వినాలని దేవుడు కోరాడు, కావున తన వధువు సజీవ వాక్యపు స్వరమును వినగలుగునట్లు, ఆయన టేపులో దానిని రికార్డు చేపించాడు.

దేవుడు తన మాటలను వారితో మాట్లాడటానికి, తనను తాను తన ప్రవక్తలో ముసుగు ధరించుకున్నాడు. ఆయన చేసినది అదేయైయున్నది. అగ్నిస్తంభము ద్వారా ముసుగు ధరించబడి, మోషేయే ప్రజలకు ఆ సజీవమైన వాక్యమైయున్నాడు.

మన దినమునకై దానిని గూర్చిన ప్రత్యక్షతను మీరు కలిగిలేకపోతే, మీరు క్రీస్తుయొక్క వధువు కాలేరు. మీరు కలిగియున్నయెడల, అప్పుడు మీరు యేసు క్రీస్తుయొక్క వధువైయున్నారు మరియు మీరు ఈ విధంగా చెప్పవలసియున్నారు, “టేపులను వినుటకంటే ప్రాముఖ్యమైన విషయం ఏమియు లేదు, ఎందుకనగా అది నేరుగా దేవుడే మీతో మాట్లాడుటయైయున్నది.

అనేకులు ప్రజలను భయపెట్టుటకు ప్రయత్నిస్తూ మరియు మనము ప్రవక్తను ఎంతో హెచ్చిస్తున్నామని; మనము ఆయనను ఆరాధిస్తున్నామని చెప్తుంటారు. నా స్నేహితులారా, ఈ సంగతులను చెప్పినది ఆయనే, నేను కాదు. నేను కేవలం ఆ వాక్యమును ఎత్తి చూపిస్తున్నాను.

ప్రతికాలములో అది చేయబడినట్లే, దైవత్వము మానవ శరీరములో ముసుగు ధరించబడియున్నది. గమనించండి, ఆయన అట్లు చేసాడు. ప్రవక్తలు, ముసుకు ధరించబడిన దైవత్వమైయున్నారు. వారు మానవ శరీరములో ముసుగు ధరించబడిన (అది సరియేనా?) దేవునియొక్క వాక్యమైయున్నారు. కావున, వారు మన మోషేను కూడా, చూడండి, అనగా యేసును కూడా వారు గుర్తించలేదు.

మనము ఒక మానవుడిని ఆరాధించడంలేదు, కానీ, ముసుగు ధరించుకొని మరియు ప్రవక్త ద్వారా తనను తాను బయలుపరచుకుంటున్న దేవుడిని ఆరాధిస్తున్నాము. దానిని అర్థం చేసుకొని మరియు దానిని నమ్ముటకు, మీరు దీనిని చేయవలసియున్నది.

చిన్నవారలారా, మీరు ఇక మీదట ఆ ముసుగుకు వెలుపల లేరు, దేవుడు పూర్తిగా మీ ఎదుటకు వచ్చియున్నాడు.

మనము ఇకమీదట ఎంతమాత్రము ఆ ముసుగుకు వెలుపల లేము, అది దేవుడే తననుతాను స్పష్టముగా బయలుపరచుకోవడమని మనము చూడగలుగుచున్నాము. టేపులలో ఉన్న ఆ స్వరమును వినడమంటే దేవుడే తన వధువుతో మాట్లాడుటయైయున్నదని బయలుపరచబడియున్నది. అది ఈ దినమునకై ఆయన ఏర్పాటు చేసిన మార్గమని మనము నమ్ముచున్నాము.

మనము ఆ స్వరమునకు మాత్రమే ఆమేన్ చెప్పగలుగుతాము, మరిదేనికినీ కాదు. మనము తెసులుకోవలసిన ప్రతిదానిని, ఆ స్వరమే మనకు ప్రసంగిస్తుంది, బోధిస్తుంది మరియు బయలుపరచుతుంది. ఆ స్వరము మనలను మన ప్రభువైన యేసు క్రీస్తుకు పరిచయము చేస్తుంది. మనకు కావలసినదంతా మరియు మనకు అవసరమైయ్యున్నదంతా ఆ స్వరమే. ప్రజలకు ఆ స్వరమును చూపించడానికి దేవుడు ఉపయోగించుకుంటున్న 5-రకాల పరిచర్య కొరకు మేము కృతజ్ఞులమైయున్నాము; దర్శనమును పట్టుకొని మరియు వారి సంఘములలో టేపులను ప్లే చేయడమే వారు తమ ప్రజల కొరకు చేయగలిగే అత్యంత గొప్ప కార్యమైయున్నది అనే ప్రత్యక్షతను కలిగియున్న సంఘకాపరులకు కృతజ్ఞులమైయున్నాము.

ఈ ఆదివారమునాడు జఫర్సన్ విల్ కాలమానము ప్రకారంగా 12:00 P.M., గంటల సమయమప్పుడు, ఆ గొప్ప సజీవ వాక్య స్వరము: ముసుగు తొలగించబడిన దేవుడు 64-0614M ను బయలుపరచడాన్ని మేము వినుచుండగా మీరును మాతో కలిసి దానిని వినవలెనని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్