బ్రెన్హామ్ టెబర్నికల్

యొక్క

సంక్షిప్త చరిత్ర 

సహోదరుడు బ్రెన్హామ్ గారు మారుమనస్సుపొంది మరియు పరిచర్య కొరకు పిలువబడిన తర్వాత, డాక్టర్. రాయ్ ఈ. డేవిస్ అనే పేరుగల ఒక పాస్టర్ గారు అతడిని ఒక మిషినరీ బ్యాప్టిస్టు సంఘములో నియమించాడు. 1933 ప్రారంభములో మిషినరీ బ్యాప్టిస్టు సంఘము మంటలచేత పూర్తిగా కాలిపోయిన సమయములో డాక్టర్. డేవిస్ గారికి సహోదరుడు బ్రెన్హామ్ గారు సహకార సంఘకాపరిగా ఉన్నాడు. ఆ మంటల సంఘటన జరిగిన వెంటనే, డాక్టర్. డేవిస్ తన స్వంత రాష్ట్రమైన టెక్సాస్ కు తిరిగివెళ్ళాడు, మరి అతడు లేని సమయము నిమిత్తము, సంఘసమూహమును సహోదరుడు బ్రెన్హామ్ గారి చేతులలో వదిలిపెట్టాడు. మంటల కారణంగా, సంఘస్థులకు ఎటువంటి చర్చి భవనము లేకపోయినది, కావున సహోదరుడు బ్రెన్హామ్ గారు ఒక టెంటు వేసి జఫర్సన్విల్ లో బోధించడం కొనసాగించాడు, తరచుగా ఉజ్జీవ కూడికలను నిర్వహిస్తుండేవాడు.

1933 జూన్ లో, ఇటువంటి ఉజ్జీవకూడికలు జరిగిన తర్వాత నిర్వహించబడుతున్న బాప్తిస్మపు కూడికలో, సహోదరుడు బ్రెన్హామ్ గారు స్ప్రింగ్ స్ట్రీట్ దిగువున ఉన్న ఒహియో నదిలో నిలబడియున్నాడు, తన హృదయమును ప్రభువుకు ఇవ్వడానికి అంతకుముందు బలిపీఠము దగ్గరికి వచ్చిన ఎడ్వర్డ్ కాల్విన్ అనే పేరుగల ఒక వ్యక్తికి బాప్తిస్మము ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. ఒక మహత్యమైన విధానములో అగ్నిస్తంభము దిగివచ్చినది, మరియు ఒక స్వరము ఈ విధంగా కేక వేసినది, “క్రీస్తుయొక్క మొదటి రాకడను పరిచయము చేయడానికి యోహాను పంపబడినట్లే, నీ వర్తమానము భూమిని చుట్టి క్రీస్తుయొక్క రెండవ రాకడను పరిచయం చేస్తుంది.”

ఆ సంవత్సరములో తర్వాత, సహోదరుడు బ్రెన్హామ్ గారు తన క్రొత్త సంఘమునకు మూలరాయిని వేసాడు, దానికి సరిగ్గా సరిపోయే విధంగా “బ్రెన్హామ్ టెబర్నికల్” అని పేరుపెట్టబడినది. క్రొత్త సంఘమునకు సంఘకాపరత్వము చేస్తుండగానే, జీవన అవసరములను తీర్చడం కోసం అతడు ఇండియానా పబ్లిక్ సర్విస్ కంపెనీ కొరకు కూడా పనిచేశాడు మరియు అలాగే ఇండియానా వేట పర్యావేక్షకునిగా పనిచేసాడు.

“క్రీస్తుయొక్క మొదటి రాకడను పరిచయము చేయడానికి యోహాను పంపబడినట్లే, నీ వర్తమానము భూమిని చుట్టి క్రీస్తుయొక్క రెండవ రాకడను పరిచయం చేస్తుంది.”

1937 జనవరీలో, చరిత్రలో నమోదుచేయబడిన అత్యంత భయంకరమైన ఒహియో నది వరదలు జఫర్సన్విల్ ప్రాంతమును తాకినవి, వరద కట్టలను బ్రద్దలు చేసి ఊరును వరదలతో ముంచివేసినవి. లోతట్టు-ప్రాంతములో కట్టబడిన, టెబర్నికల్, వరద నీరుతో పూర్తిగా ముంచివేయబడినది. చర్చి లోపల పుల్పిట్ మీద సహోదరుడు బ్రెన్హామ్ గారి బైబిలు గ్రంథము ఉన్నది. నీరు పెరుగుచున్నాకొద్దీ, పుల్పిట్ మరియు చర్చిలో ఉన్న కుర్చీలన్నీ సీలింగు వద్దకు తేలినవి మరియు తర్వాత, నీరు తగ్గినాకొద్దీ, అవి తిరిగి సరిగ్గా వాటి స్థానములలోనికి చేరినవి, బైబిలు గ్రంథము అప్పటికి కూడా ఆ పుల్పిట్ మీదనే క్షేమంగా పొడిగా ఉన్నది.

1946 లోని మే నెలలో, సహోదరుడు బ్రెన్హామ్ గారు “ప్రపంచములోని ప్రజలకు దైవిక స్వస్థతా వరమును తీసుకెళ్ళడానికి” దూత నుండి ఆజ్ఞను పొందుకున్నాడు. సహోదరుడు గ్రాహమ్ స్నెల్లింగ్, అలాగే మరికొందరు, ప్రవక్త రంగములో ఉన్నప్పుడు సహకార సంఘకాపరులుగా వ్యవహరించారు, సహోదరుడు బ్రెన్హామ్ గారు నెవిల్ అను పేరుగల ఒక స్థానిక మెథడిస్టు సేవకుడిని మార్చి మరియు అతనికి బాప్తిస్మమిచ్చేవరకు ఆ విధంగా కొనసాగినది. 1950 లలోని ప్రారంభ సంవత్సరముల నుండి సహోదరుడు నెవిల్ గారు సహోదరుడు బ్రెన్హామ్ గారితో కలిసి టెబర్నికల్ కు సంఘకాపరత్వమును చేశాడు, 1965 లో సహోదరుడు బ్రెన్హామ్ గారు స్వర్గస్థులయ్యేవరకు ఇది కొనసాగినది.

1970 లలోని ప్రారంభ సంవత్సరముల వరకు సహోదరుడు నెవిల్ గారు సంఘమునకు సంఘకాపరత్వము చేయడం కొనసాగించాడు, ఆ సమయములో, సహోదరుడు నెవిల్ గారి స్థానములో సహోదరుడు విల్లార్డ్ కాలిన్స్ గారు సంఘకాపరిగా నియమించబడి మరియు 2015 లో రిటైర్ అయ్యేవరకు జఫర్సన్విల్ విశ్వాసులకు నమ్మకముగా పరిచర్య చేశాడు. పిదప సహోదరుడు జోసఫ్ బ్రెన్హామ్ గారు సంఘకాపరిగాను మరియు సహోదరుడు సామ్యేల్ బార్బర్ గారు సహకార సంఘకాపరిగాను ఎన్నుకోబడ్డారు.

సంవత్సరాలుగా చర్చి భవనములో కొన్ని మార్పులు జరిగినవి, అందులో విశేషమైనది 1963 లో జరిగినది, చర్చికి ఉత్తరము వైపున (పుల్పిట్ కు ఎదురుగా, ఎడమ వైపు) అదనపు భాగం నిర్మించబడినది, దీనివల్ల 400 మందికంటే ఎక్కువమంది ప్రజలకు సీట్లు కల్పించునట్లు, సీటింగ్ సామర్థ్యము 30% పెరిగినది.

ఈనాడు, ముందెన్నటికంటెను ఎక్కువమంది ప్రజలు టెబర్నికల్ లో హాజరవుతున్నారు. 2015 లో సహోదరుడు జోసఫ్ బ్రెన్హామ్ గారు ఎన్నుకోబడినప్పుడు, 8th అండ్ పెన్ స్ట్రీట్ లో ఉన్న భవనము సరిపోనంతగా సంఘసభ్యుల సంఖ్య వేగంగా పెరిగిపోయింది, తద్వారా టెబర్నికల్ లో పట్టేదానికంటే రెండు-లేదా మూడింతలు ఎక్కువమంది ప్రజలకు సరిపోయే స్థలమును మేము కనుగొనాల్సివచ్చింది. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి, వాయిస్ ఆఫ్ గాడ్ రికార్డింగ్సు ఇదివరకే సెల్లర్స్ బర్గ్ లో హాజరవ్వడానికి ఇష్టపడేవారందరి కొరకు చాలా స్థలము కలిగియుండి మరియు యవ్వనస్థుల కూడికల కొరకు ఉపయోగించబడుతున్న ఒక పెద్ద భవనాన్ని కలిగియున్నది. మేము ఆదివారపు కూడికలను అక్కడికి తరలించాము, కానీ ఇంకనూ అసలు ఇదంతా ఎక్కడైతే ప్రారంభమైనదో అట్టి ఆ చిన్న భవనములో వారములో కొన్నిసార్లు ప్రార్థన నిమిత్తము కూడుకుంటూ ఉంటాము.

ప్రస్తుతం, 2020 లో, మేము సెల్లర్స్ బర్గ్ లో ఉన్న భవనములో పునఃనిర్మాణములు చేస్తూ దానిని విశాలపరుస్తున్నాము, ఒక బాల్కనీని మరియు 1,100 మంది ప్రజలకు స్థిరమైన సీటింగును ఏర్పాటుచేస్తున్నాము. ఈ పునఃనిర్మాణము వలన మాకు పాఠశాల గదులు, పెద్ద జనసమూహముల కొరకు ప్రార్థనా మందిరమును విశాలపరచునట్లు అనుమతించే బహుళ ప్రయోజన గది, మరియెక్కువ పార్కింగ్ స్థలము, మరియు మరియెక్కువ సౌకర్యవంతమైన కుర్చీలు ఏర్పాటవుతాయి.

ప్రతి కూడికకు వెయ్యిమంది కంటే ఎక్కువ ప్రజలు హాజరవుతుండగా, సహోదరుడు జోసఫ్ గారు, కొన్ని కూడికలలో లేదా అనేక కూడికలలోనైనా కాదు గాని, ప్రతీ కూడికలోను సహోదరుడు బ్రెన్హామ్ గారి టేపులను ప్లే చేసే విషయంలో బలంగా నిలబడుతున్నాడు. మీరు సేదదీర్చుకొని మరియు మలాకీ 4 లోని ప్రవక్త యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడాన్ని వినగలిగే ఒక స్థలమునకు రావడానికి ఇష్టపడుచున్నట్లైతే, అప్పుడు బ్రెన్హామ్ టెబర్నికల్ లో మీరు మీ ఇంటివద్ద ఉన్నట్లే అనుభూతి చెందుతారు.