ఆదివారం
21 సెప్టెంబర్ 2025
63-0707M
నేరారోపణ

నిర్దోషులుగా తీర్చబడిన ప్రియమైనవారలారా,

ఇప్పుడు, అక్కడ, “వారు,” పాపి కాదు. “వారు,” అనగా, ఆ దినపు సంఘము, వాక్యమైయున్న వ్యక్తితో పొరపాటును కనుగొన్నారు. అది నిజమేనా? వాక్యమైయున్న వ్యక్తితో వారు పొరపాటును కనుగొన్నారు. ఇప్పుడు వాక్యము ఒక వ్యక్తిలోనుండి పనిచేస్తున్నప్పుడు వారు పొరపాటును కనుగొంటున్నారు.

ప్రారంభమునుండే లోకము ఆయనను నిరాకరించినది, ఆయనను తిరస్కరించినది, వారి ఆచారములను, వారి మతసిద్ధాంతములను, వారి ఆలోచనలను పాటిస్తూ వాక్యముతో నిలిచియుండటానికి తిరస్కరించినది. వారు ఎల్లప్పుడూ దేవుని ప్రణాళికను తప్పిపోయారు; వాక్యమైయున్న దేవుడు, ఒక మానవునిగా రావడం, మరియు ఇప్పుడు వాక్యము మానవుడి ద్వారా పనిచేయడమైయున్నది.

అయితే మన దినములో ఆయన ఇట్లు చెప్పాడు, “నేను ఒక చిన్న గుంపును, ఎన్నుకోబడిన కొందరిని కలిగియుంటాను. ఆదినుండే వారు నాలో ఉన్నారు. వారు నన్ను స్వీకరిస్తారు మరియు నా వాక్యమును మరియు నా వాక్యమును బయలుపరచడానికి నేను ఎన్నుకున్న వ్యక్తిని నమ్ముతారు. వారికి అతడే నా స్వరమైయ్యుంటాడు.”

“నా స్వరమును ప్రకటించడానికి వారు సిగ్గుపడరు. నేను చేస్తానని నేను చెప్పినట్లే నేను మరలా వచ్చి మరియు మానవశరీరములో నన్ను నేను ప్రత్యక్షపరచుకున్నానని ప్రపంచానికి చెప్పడానికి వారు సిగ్గుపడరు. ఈసారి వారు ఆ మనిషిని ఆరాధించరు, కానీ ఆ మనిషిలోనుండి మాట్లాడునట్టి, వాక్యమైయున్న నన్ను, వారు ఆరాధిస్తారు. వారు నన్ను ప్రేమిస్తారు మరియు తమలోని ప్రతి అణువుతో నన్ను ప్రకటిస్తారు.”

“తద్వారా, నా వధువైయ్యుండుటకు వారికి అవసరమైయున్నదంతా నేను వారికి ఇచ్చాను. నా వాక్యముతో నేను వారి చుట్టూ కంచెను వేసాను; ఏలయనగా వారు శరీరధారియైన నా వాక్యమైయున్నారు. వారికి స్వస్థత అవసరమైతే, వారు నా వాక్యమును పలుకుతారు. వారిని ఆటంకపరిచే ఏ అడ్డంకైనా వారికి ఉన్నట్లైతే, వారు నా వాక్యమును పలుకుతారు. దారితప్పిన ఒక బిడ్డ వారికి ఉన్నట్లైతే, వారు నా వాక్యమును పలుకుతారు. వారికి ఏ అవసరత ఉన్నాగాని, వారు నా వాక్యమును పలుకుతారు, ఏలయనగా వారు తమలో శరీరము దాల్చిన నా వాక్యమైయున్నారు.”

“వారు ఎవరన్నది వారికి తెలుసు, ఏలయనగా నన్ను నేను వారికి బయలుపరచుకున్నాను. వారు నా వాక్యమునకు నమ్మకముగాను విశ్వాసనీయముగాను ఉన్నారు మరియు నా స్వరము చుట్టూ కలిసి ఐక్యమవుతున్నారు. ఏలయనగా నా స్వరమును, నా వాక్యమును, నా పరిశుద్ధాత్మను వారు ఎరిగియున్నారు. వాక్యము ఎక్కడున్నదో పక్షిరాజులు అక్కడ పోగవుతాయని, వారికి తెలుసు.”

ప్రవక్త ఆయనయొక్క వాక్యమును పలికి మరియు యేసుక్రీస్తును రెండవసారి సిలువవేసినందుకు ఈ తరముపై నేరారోపణ చేస్తూ వారి పనైపోయినదని ప్రకటిస్తుండగా, వధువు ఆనందిస్తూ ఉంటుంది. ఏలయనగా మనము ఆయనయొక్క వాక్యమును అంగీకరించి స్వీకరించిన వధువైయున్నామని మనకు తెలుసు. మనము మన హృదయలోతులనుండి కేకవేసి మరియు ఇట్లు చెప్తాము:

ప్రభువా, నేను నీవాడను. నాకు తెలిసినంత ఉత్తమముగా ప్రతిష్ఠించుకున్నవాడనై, నేను ఈ బలిపీఠము మీద పడియున్నాను. ప్రభువా, నా నుండి లోకమును తీసివేయుము. నశించిపోయే సంగతులను నా నుండి తీసివేసి; నశించిపోలేని సంగతులను, దేవునియొక్క వాక్యమును నాకు అనుగ్రహించుము. వాక్యము నాలో ఉండి, మరియు నేను వాక్యములో ఉండేంత సమీపముగా, నేను ఆ వాక్యమును జీవించగలుగుదును గాక. ప్రభువా, దానిని అనుగ్రహించుము. నేను ఎన్నడూ దానినుండి తొలగిపోకుందును గాక.

జీవము ఉన్నది, మరణము ఉన్నది. సరియైన మార్గము ఉన్నది, మరియు తప్పుడు మార్గము ఉన్నది. సత్యము ఉన్నది, మరియు అబద్ధము ఉన్నది. ఈ వర్తమానము, ఈ స్వరము, ఈ దినమునకై దేవుడు ఏర్పాటుచేసిన పరిపూర్ణమైన మార్గమైయున్నది. మేము ఆయనయొక్క బయలుపరచబడిన వాక్యము చుట్టూ కూడుకొని మరియు: నేరారోపణ 63-0707M అనే వర్తమానమును వినుచుండగా, వచ్చి దేవునియొక్క ఘనమైన వధువులోని ఒక భాగముతో చేరండి.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్