
ప్రియమైన స్నేహితులారా,
జఫర్సన్ విల్ లో మధ్యాహ్నం 12:00 P.M. గంటలు, ఆఫ్రికాలో సాయంత్రం 7:00 P.M. గంటలు, ఆరిజోనాలో ఉదయం 10:00 A.M. గంటలు; ప్రపంచమంతటినుండి వధువు కూడుకొనియున్నది. ఈ క్షణము కొరకే మనము వారమంతా వేచియున్నాము. తనయొక్క బలిష్టమైన ఏడవ దూత వర్తమానికుడి ద్వారా మానవ పెదవులగుండా దేవుడు మనతో మాట్లాడవలెనని వేచిచూస్తూ, మనము గొప్ప ఎదురుచూపుతో ఉన్నాము. “దేవా నన్ను సిద్ధపరచుము, నన్ను అభిషేకించుము, మరియు నీ వాక్య ప్రత్యక్షతను నాకు మరి ఎక్కువగా దయచేయుము,” అని మనము ప్రార్థించుచున్నాము.
ప్రవక్త, మరియు ప్రవక్త మాత్రమే, ఈ గడియ కొరకైన జీవపు మాటలను కలిగియున్నాడని, మనము నిశ్చయంగా ఎరిగియున్నాము గనుక, మనము సంతృప్తి కలిగియున్నాము. మనము దానినంతటిని వివరించలేకపోవచ్చును, కానీ మనము ప్రతీ మాటను నమ్ముచున్నామని మరియు వాటిపై విశ్రాంతి పొందుచున్నామని మనకు తెలియును.
ప్రభువు సరిగ్గా మోషేతో చేసినట్లే, దేవుడు మనయెదుట తన ప్రవక్తను మహిమపరబోవుచున్నాడని, మనకు తెలియును. ఆ సమయములో, ఆయన పర్వతములను కుదిపివేసాడు. ఈసారి, ఆయన భూమ్యాకాశములను కుదిపివేస్తున్నాడు.
ఆ క్షణము ఆసన్నమైనది. మన గుండెలు మనలో ఎంతో వేగంగా కొట్టుకొనుచున్నవి. మన జాతీయ గీతం మ్రోగుటను మనము వినుచున్నాము. ఏక మనస్సుతో, ప్రపంచవ్యాప్తంగా వధువు లేచి నిలబడి మరియు కేవలము నమ్ముము, సమస్తము సాధ్యమే, కేవలము నమ్ముము, అని పాడుతుంది. దేవుడు మనతో మాట్లాడనైయున్నాడు.
మనము దీనిని వింటాము: “స్నేహితులారా శుభోదయం.”
కేవలం ఈ సామాన్యమైన మూడు పదాలను వినడంతోనే మన హృదయములు ఆనందిస్తాయి. ఇప్పుడే ప్రవక్త నన్ను తన స్నేహితుడని పిలిచాడు. పిదప ఆయన మనతో ఇట్లు చెప్తాడు,
నేను మీ అందరిమీద బెంగ కలిగియున్నాను. నేను—నేను ఎక్కడికి వెళ్ళేది నేను లెక్కచేయను, నేను—నేను…అది, అది మీరు కాదు. ప్రపంచమంతటినుండి, నాకు స్నేహితులున్నారు, కానీ అది—అది—వారు మీరు కాదు. ఈ చిన్న గుంపు విషయమై ఏదో ఉన్నది…ఏమిటో నాకు తెలియదు. నేను వారిని గూర్చి ఆలోచిస్తుంటాను…ఈ గుంపులాగా, నాతో నిలబడే ఏ—ఏ గుంపును, భూమి మీద నేను ఎరుగను. రానైయున్న రాజ్యములో, మనము కలిసి అక్కడ ఉండేంతగా, దేవుడు మనలను విడదీయబడకుండునట్లు చేయును—చేయునుగాక; అదియే నా ప్రార్థనైయున్నది.
దేవుడు ఈ రోజు మనకు ఏ గొప్ప ప్రత్యక్షతను బయలుపరచుతాడు? మనము ఏమి వినబోవుచున్నాము? బహుశా ఇంతకుమునుపు మనము దానిని అనేకసార్లు వినియుండవచ్చును, కానీ ఈ రోజు అది భిన్నముగాను, మరియు ఇంతకుముందెన్నడూ లేని విధంగాను ఉంటుంది.
అదేమిటి? విశ్వాసియొక్క ఆహారము. మనము విందు చేసుకొనునట్టి పరలోకము నుండి వచ్చిన సముఖపు రొట్టెయైయున్నది. ఆయనయొక్క వధువైయున్న మనకు మాత్రమే చెందునట్టి, సముఖపు రొట్టెయైయున్నది. మనలను కుళ్ళిపోకుండునట్లు ఉంచేది ఆ సముఖపు రొట్టెలపై ఉన్న షెకినా మహిమయే.
వెలుపటనున్నవారు మనలను చూసి మరియు ఇట్లు అడుగుతారు, “మీరేమి చేస్తున్నారు? మీరు కేవలం టేపులను వినుచున్నారా? మీరు నిజంగా వింత వ్యక్తులే.”
మహిమ!! వింత వ్యక్తులుగా, ఆయన కొరకు మరియు ఆయనయొక్క నిర్ధారించబడిన వాక్యము కొరకు వెర్రివారిగా ఉన్నందుకు; మనమెంతో సంతోషిస్తున్నాము మరియు ప్రభువునకు ఎంతో కృతజ్ఞులమైయున్నాము. “అవును, టేపు పరిచర్యను నేను నమ్ముతాను. ప్లేను నొక్కడమును నేను నమ్ముతాను. మీరు వినగలిగే అత్యంత ప్రాముఖ్యమైన స్వరము అదేనని నేను నమ్ముతాను. అవును, టేపులను తిరిగి ప్రసంగ వేదికపై పెట్టడమును నేను నమ్ముతాను,” అని ప్రపంచానికి చెప్పుటకు మనము ఆనందిస్తాము.
ఆచారాల తెర తొలగించబడినప్పుడు, దేవుడు ఇంకనూ వాక్యమైయున్న దేవుడని మీరు చూడగలరు. ఆయన ఇంకనూ తన మాటను నిలబెట్టుకుంటాడు. ఆయన—ఆయనే దేవుడైయున్నాడు, తన వాక్యమును వ్రాసినది ఆయనే.
మిగతా ఎవ్వరు ఏమి చేసినాగాని, లేదా ఏమి చెప్పినాగాని, మనము మాత్రం దానిని నమ్ముతాము, మరియు పిదప మనము దాని ప్రకారంగా క్రియ చేస్తాము. మీరు దానిని చేయనియెడల, మీరు దానిని నమ్మనట్లే. మీరు తెరలోపల లేరు. ఆ తెర ఒక్క వ్యక్తికి మాత్రమే చెందియున్నది. ఆ వర్తమానము ఒక్కటేయైయున్నది.
దానిని నేరుగా చెప్పకుండా దేవుడు సంఘమునకు ఏమి తెలియజేయాలనుకుంటున్నాడో దానిని గూర్చిన ఆత్మసంబంధమైన గ్రహింపు మీకు వచ్చినదని నేను—నేను ఆశిస్తూ మరియు నమ్ముచున్నాను. చూశారా? అది ఎటువంటి సంగతనగా, కొన్నిసార్లు, పలచన చేసే విధంగా, కొంతమందిని బయటకు పంపించే విధంగా, కొంతమందిని వెళ్ళిపోయేలాగా, మరియు కొందరిని ఆలోచింప—జేసేలాగా—ఆ విధంగా, మనము విషయాలను చెప్పవలసియుంటుంది. అయితే అది ఉద్దేశ్యపూర్వకంగానే చేయబడుతుంది. అది ఆ విధంగానే చేయబడవలసియున్నది.
వాక్యము దేవునియొక్క ప్రవక్తకు బయలుపరచబడినది. పరిసయ్యులు, లేదా సద్దూకయిలు, లేదా ఒక ఫలానా వర్గము లేదా ఒక తెగ వంటి ఏ గుంపు లేదు. అది ప్రవక్త మాత్రమే! దేవుడు ఒక్క మనుష్యుడిని కలిగియున్నాడు. ఆయన రెండు లేదా మూడు భిన్నమైన మనస్సులను కలిగిలేడు. ఆయన ఒక్క మనుష్యుడినే తీసుకున్నాడు. అతడు వాక్యమును కలిగియున్నాడు, మరియు అతడు మాత్రమే కలిగియున్నాడు.
అటువంటప్పుడు కొందరు ఇట్లంటారు, “దేవుడు ఉద్దేశ్యపూర్వకంగా అటువంటి ఒక విషయమును చేస్తాడా?” ఆయన నిశ్చయంగా అట్లు చేసాడు. ఆయన ఇంకనూ అట్లు చేస్తాడు.
“కానీ దేవుడు పిలచిన ఇతర వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నారు”: అని కొన్ని వందల సంవత్సరాల క్రితము వారు అన్నట్లే, ఈనాడు మనము అదే విషయమును వింటున్నాము. అది నిజము. మరియు వారు దీనిని వెంబడిస్తూ దీనితో కొనసాగినంతకాలం, ఆమేన్, కానీ ఒకరు లేచి మరియు ఆయన ముందుగా నిర్ణయించుకొని మరియు ఆ పని కొరకు అభిషేకించిన మన ప్రవక్తకు, దేవుడు ఇచ్చిన దేవునియొక్క స్థానాన్ని తీసుకొనుటకు ప్రయత్నించినట్లైతే, అప్పుడు మనము ఆ నిర్ధారించబడిన వాక్యముతో, మన దినమునకైన దేవునియొక్క స్వరముతో నిలబడవలసియున్నది.
గమనించండి, ఇప్పుడు, దానికి దూరంగా ఉండటం మరణమే. మీరు ఈ తెరలోనుండి మాత్రమే దానిలోనికి వెళ్ళవలసియున్నది, లేదా మీరు వెళ్ళలేరు. దేవుడు వారిపై ఏ విధంగా కనికరము చూపించగలడో కదా, అయితే గుర్తుంచుకోండి, అదేమిటనగా దేవుడు ఆ తెర వెనుక ఉన్నదానిని ప్రత్యక్షపరచుచున్నాడు. ఆ తెర వెనుక ఏమి ఉన్నదో గమనించండి, వాక్యము ఉన్నది! అది దేనిని ముసుగుగా కప్పియున్నది? వాక్యమును! అదేమిటి? అది మందసములో ఉన్నది. ఆ తెర దాచినది వాక్యమునేయైయున్నది. చూశారా? మరియు యేసు ఆ వాక్యమైయ్యుండెను, మరియు ఆయనే ఆ వాక్యమైయున్నాడు, మరియు ఆయనయొక్క శరీరము అనే తెర దానిని దాచిపెట్టినది.
మనకైతే, అది ఒక కార్యరూపణయైయున్నది! అది ఇక ఎంతమాత్రము ఒక వాక్యము కాదు, అది ఒక వాస్తవమైయున్నది! ఆమేన్!
ఇతరులకు మనము వింత వ్యక్తులమని, మరియు మనము చెప్పేది లోకానికి ఒక వెఱ్ఱితనముగా అనిపించవచ్చునని మనకు తెలుసు, అయితే అది సమస్త జనులను ఆయన వైపుకు ఆకర్షించుచున్నది.
ఈ ఆదివారము జఫర్సన్ విల్ కాలమానము ప్రకారంగా మధ్యాహ్నం 12:00 P.M., గంటల సమయమప్పుడు, ఏ విధంగా మనము వింత వ్యక్తులు 64-0614E
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
వర్తమానమును వినుటకు ముందు చదువవలసిన లేఖనములు:
I కోరింథీ 1:18-25
II కోరింథీ 12:11