భద్రము చేయబడిన ఉత్తరములు
26, సెప్టెంబర్ 2026, శనివారం

ప్రియమైన దేవుని గుణలక్షణములారా,

మీరు ఈ దినము కొరకు వాగ్దానము చేయబడిన ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యమైయున్నారు.

మీరు ఎల్లప్పుడూ అదేయైయున్నారు. మీరు అవ్వబోతున్నారు కాదు గాని, ఇప్పుడే మీరు దేవుని కుమారులు మరియు కుమార్తెలైయున్నారు; ఏలయనగా దేవుడు, కరుణా సంపన్నుడైయుండి, ఆదిలోనే మిమ్మల్ని తన ఆలోచనలో కలిగియున్నాడు.

ఆయన ఇక్కడ భూమి మీద ఈ భౌతిక రూపాన్ని దాల్చకముందే; అసలు ఏదియు లేకముందే, మీరు ఆయన గుణలక్షణములలో ఒకటైయున్నారు. మీ పేరు ఏమైయుంటుందో ఆయన ఎరిగియున్నాడు. మీరు ఏ రంగు జుట్టును కలిగియుంటారో ఆయన ఎరిగియున్నాడు. ఆయన మీ గురించి సమస్తమును ఎరిగియున్నాడు.

పిదప, ఆయన స్వరము మీ ఎదుట ప్రకాశించడాన్ని మీరు వినినప్పుడు, మీలో కేకవేసినట్టిది ఏదో మీ లోపల ఉన్నది; మీరు ఎక్కడనుండి వచ్చారో మీకు తెలుసు మరియు మీరు దాని వద్దకు వచ్చారు. అది సత్యమని మీకు తెలిసినది. ఆ విత్తనము ఎల్లప్పుడూ మీలో ఉన్నది గనుక అది దేవుడు ఏర్పాటుచేసిన మార్గమని మీకు తెలిసినది.

ఆయన ఇప్పుడు పక్షిరాజు రెక్కల మీద మనల్ని మోసుకొనివెళ్తున్నాడు. ఆయన తన ప్రవక్తలను ఎల్లప్పుడూ వాక్యముతో పోల్చాడని వాక్యము మనకు చెప్తున్నది. విలియం మారియన్ బ్రెన్హామ్ గారు ఈ దినమునకు దేవునిచేత నిర్ధారించబడిన పక్షిరాజు వర్తమానికుడైయున్నాడు. వాగ్దాన దేశమునకు మనము మోసుకొనిపోబడే పక్షిరాజు రెక్కలు అదేయైయున్నది, ఎందుకంటే ఆయన, అనగా దేవునియొక్క పక్షిరాజు ప్రవక్త, దేవుని వర్తమానమును మోసుకొనివెళ్తున్నాడు, ఆయనయొక్క వధువును బయటకు పిలుస్తూ మరియు వాక్యమును మాట్లాడుతూ, ఆమెను పరిపూర్ణురాలిగా చేస్తున్నాడు.

మనము ఆయనయొక్క విడుదలా వర్తమానముతో విలియం మారియన్ బ్రెన్హామ్ గారిని వెంబడిస్తుండగా మనము దేవుడిని వెంబడిస్తున్నాము. మరియు బైబిలు ఇట్లు చెప్పినది, “…విశ్వసించనివారితో పాటు వారు నశింపకపోయెను.” ఎందుకంటే దేవుడు వారిపట్ల కరుణా సంపన్నుడైయున్నాడు; ఎందుకంటే వారు ఆయనయొక్క ఆజ్ఞలను వెంబడిస్తున్నారు.

మనము ఆయనయొక్క ఆజ్ఞలను వెంబడించాలని దేవుడు కోరుతున్నాడు, మరియు ఆయనయొక్కఆజ్ఞలు ఇట్లు చెప్పినవి: నేను మీకు దేవుని స్వరమునైయున్నాను. ఆ టేపులలో ఉన్నవాటిని మాత్రమే చెప్పండి. నా స్వరము మాత్రమే విఫలమవ్వజాలని మాటలు పలుకుతున్న స్వరమైయున్నది. అది పరిపూర్ణముగా పలుకబడినది మరియు మీరు నా స్వరము నుండి దానిని పరిపూర్ణముగా పొందుకుంటారు. తద్వారా, మీకు అవసరమైయున్నదంతా టేపులలో ఉన్న దేవుని స్వరమేయైయున్నది, ఎందుకంటే నేను, నా కరుణలో సంపన్నుడనైన దేవుడను, దానిని మీ కొరకు ఏర్పాటుచేశాను. అది ఈ దినము కొరకు నేను ఏర్పాటుచేసిన నా మార్గమైయున్నది.

కరుణా సంపన్నుడైన దేవుడు మీరు ఆ స్వరమును వినడానికి ఆ ప్రత్యక్షతను కలిగియుండునట్లు మిమ్మల్ని ఎన్నుకొని మరియు ముందుగా నిర్ణయించాడు. వర్తమానము గురించి ఎంతో తప్పుడు అవగాహన, అనేక భిన్నమైన స్వరములు మరియు అనువాదములు ఉండే ఈ అంత్య కాలములో, మనము వెళ్ళి మరియు ఆయన తన వధువుకు ఏమి చెప్పాలనుకున్నాడో సరిగ్గా దానినే, వాక్యము వెంబడి వాక్యముగా, స్వయంగా మనమే వినగలుగునట్లు మనకు ఒక పరిపూర్ణమైన స్వరము, మరియు పరిపూర్ణమైన మార్గము అవసరమైయున్నదని ఎరిగియున్నాడు.

కేవలం ఎవరో చెప్పినదానిని మీరు తీసుకోలేరు. దేవుడు చెప్పినదానినే మీరు తీసుకోవలసియున్నారు. ఆయన ఇట్లు చెప్పాడు, “ప్రతీ మనుష్యుని మాట అబద్ధమే గాని, నా మాట సత్యము.”

కాబట్టి, దేవుడు, తన కరుణయందు సంపన్నుడైయుండి, ఆయనయొక్క వధువు ప్లే ను నొక్కడం ద్వారా, సంవత్సరములో 365 రోజులు, రోజుకి 24 గంటలు ఆయనయొక్క స్వరమును వినగలుగునట్లు, మరియు దేవునియొక్క స్వరము నేరుగా వారి హృదయాలతో ముఖాముఖిగా మాట్లాడుటను వినుట ద్వారా పురిగొల్పబడునట్లు ఒక మార్గమును ఏర్పాటుచేశాడు.

మనము శరీరధారియైన ఆయనయొక్క వాక్యమైయున్నాము. మనకు ఎటువంటి శక్తి లేదు గాని, ఆయన మనకు ఆయనయొక్క అధికారమునిచ్చాడు. మనలో ప్రతియొక్కరము దానిని కలిగియున్నాము. మీరు దానిని తృణీకరిస్తే, మీరెక్కడున్నారో మీరు అక్కడే ఉంటారు. కానీ మనము దానిని అంగీకరిస్తే, అది అత్యధికమైన కార్యములను చేస్తుంది, ఎందుకంటే దేవుడు కరుణా సంపన్నుడైయున్నాడు.

మరియు ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ, మీరు ఎటువంటి స్థితిలో ఉన్నారో నేను లెక్కచేయను, ఒక వాగ్దాన మూలముగా, మీరు దేవుని అధికారాన్ని కలిగియున్నారు, ఎందుకంటే ఆయన సంపన్నుడైయుండి అత్యధికముగా చేస్తానని వాగ్దానము చేశాడు. “మీరు ఈ పర్వతముతో ‘కదిలిపొమ్ము’ అని చెప్పి, మరియు మీ హృదయములో సందేహింపక, మీరు చెప్పినది జరుగునని నమ్మినయెడల, మీరు చెప్పినదానిని మీరు పొందుకోవచ్చు.” మీరు ఎటువంటి శక్తిని కలిగిలేరు, కానీ మీరు అధికారమును కలిగియున్నారు.

ఈ దినము కొరకు ఏర్పాటుచేయబడిన ఆయనయొక్క పరిపూర్ణమైన వాక్యమును: ఆయనయొక్క స్వరమును వినుట ద్వారా మాత్రమే వధువు పరిపూర్ణము చేయబడగలదు మరియు ఐక్యము చేయబడగలదు. వధువును ఐక్యము చేసి మరియు పరిపూర్ణము చేయగల ఒకే ఒక్క స్వరము అదేయైయున్నది. మనము తప్పక విని మరియు వెంబడించవలసియున్నామని దేవుడు చెప్పిన స్వరము అదేయైయున్నది. మోషే వలె, సహోదరుడు బ్రెన్హామ్ గారు పిల్లలమైన మనల్ని వాగ్దాన దేశములోకి తీసుకెళ్ళడానికి ఎన్నుకోబడినవాడు తానే అని ఎరిగియున్నాడు ఎందుకంటే ఆ వాగ్దానము ఆయనకు ఇవ్వబడినది. మరియు ఆయనే మనల్ని వాగ్దాన దేశమునకు తీసుకెళ్ళవలసియున్నాడు.

మన ప్రవక్త పక్షిరాజు మనకు సాదృశ్యములలో బోధించాడు. పాతనిబంధన క్రొత్తనిబంధనకు ఛాయయైయున్నది. ఈ అంత్య-కాలములో మనము ఎంత జాగ్రత్తగా ఉండాలో మరియు దేనిపట్ల మెలకువగా ఉండాలో ఆయన మనకు చెప్పాడు. వారు అనుకరించడానికి ప్రయత్నించగా, కోరహు ఆత్మ గురించి, మరియు దాతాను గురించి, మరియు వారియొక్క అవిశ్వాస గుంపు గురించి ఆయన మనల్ని హెచ్చరించాడు. వారు దేవుని కార్యక్రమములో దేనినో జొప్పించడానికి ప్రయత్నించారు.

ఒక్క-వ్యక్తి నాయకత్వం వారికి నచ్చలేదు. వారికి అది నచ్చలేదు. వారు కూడా ఏదో ఒకటి చేయాల్సిందే అన్నట్లుగా వారు ప్రవర్తించారు. కోరహు ఇట్లన్నాడు, “ఏంటి, మోషే, నీకంటే పరిశుద్ధులు చాలామంది ఉన్నారు. నీవు ఒక్కడివే సముద్రము అన్నట్లు…లేదా సముద్రపు ఒడ్డున నునుపైన రాయివి నీవొక్కడివే అన్నట్లు నీవు ప్రవర్తిస్తున్నావు.” మరియు ఇంకా ఇట్లన్నాడు, “నేను—నేను…నీవు అలా చేయకూడదు. మరియు ఇక్కడ చాలామంది ఉన్నారు.”

సహోదరులారా మరియు సహోదరీలారా, ఈ సంగతులను చెప్పడం ద్వారా మరియు ఉటంకించడం ద్వారా నేను సంఘాలను వేరుచేయడానికి ప్రయత్నించడం లేదు, పరిశుద్ధాత్మయే వేరుచేస్తున్నాడు. మనము వినబోయే ఈ వర్తమానమును వినండి. దేనిపట్ల మెలకువగా ఉండాలని వధువును హెచ్చరిస్తున్నది ప్రవక్తయేయైయున్నాడు. అప్పుడు ఆ ఆత్మ ఏమి చేసినదో, మరియు మన దినములో అది మరలా ఏమి చేస్తుందో ఆయన మనకు చెప్తున్నాడు.

నిజముగా, ఐదు-విధముల పరిచర్య చుట్టూ ప్రజలను సమకూర్చడానికి నేను ప్రయత్నించడం లేదు, వారు అసలు వధువును ఐక్యము చేయలేరు. దేవునియొక్క సంకరములేని, స్వచ్ఛమైన వాక్యము చుట్టూ, వధువును ఐక్యము చేయగల ఒకేఒక్క స్వరము చుట్టూ వారిని ఐక్యము చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను.

మనము ఈనాడు కూడా అటువంటి విషయాలనే వినగలుగుతున్నాము, వర్తమానమును ప్రకటించగలిగేది సహోదరుడు బ్రెన్హామ్ ఒక్కడే కాదు, మేము కూడా వర్తమానమును ప్రకటించడానికి పిలువబడ్డాము. నిజముగా వారు పిలువబడ్డారు, కానీ పిదప, దేవుని స్వరమును వారి సంఘాలలో ప్లే చేయకుండా ఉండటానికి సాకులు చెప్తూ, మరియు వారి పరిచర్యను ఎక్కువ ప్రాముఖ్యమైనదిగా చేస్తూ, ఆ స్వరమును విని మరియు అది ఒక్క-వ్యక్తి వర్తమానమని నమ్మడంలో ఉన్న ప్రాముఖ్యతను గుర్తించడంలో వారు విఫలమవుతున్నారు.

మరియు బైబిలు ఇట్లు చెప్పినది, “మరియు వారు బిలాము నడిచిన త్రోవను పోయిరి, మరియు కోరహు వలె తిరస్కారము చేసి నశించిరి.” తిరస్కారము చేసి నశించిరి! కోరహుయొక్క తిరస్కారము ఏమిటి? “ఏంటీ, నీవొక్కడివే పరిశుద్ధుడవని నీవు అనుకుంటున్నావా? అంతెందుకు, దేవునియొక్క…మేమందరమూ పరిశుద్ధులమే. సంఘమంతా బాగానే ఉన్నది. ప్రతి…మనమందరము కలిసిపోదాము, మనము దానినే చేయవలసియున్నాము.” వారు నశించినది అక్కడే, అక్కడేయైయున్నది. మరియు మనము నిజముగా దానికి తగినవారమైయున్నాము. మనము దానికి పాత్రులమైయున్నాము.

ఈ వర్తమానము, ఆయనయొక్క స్వరము మాత్రమే, స్పష్టముగా పలుకబడి మరియు వధువుచేత స్పష్టముగా స్వీకరించబడుతున్న ఏకైక స్వరమైయున్నది. నమ్మకమైన పరిచర్య ఏదంటే వర్తమానమును ప్రకటించడం ద్వారా మరియు ఉటంకించడం ద్వారా ప్రజలను ఆ స్వరముతో నిలిచియుండమని ప్రోత్సాహించడమేయున్నది. అయితే కేవలం దానిని ప్రకటించడం మాత్రమే కాదు, కానీ వారు దానిని వారి సంఘములలో ప్లే చేయవలసియున్నారు, మరియు అదియే అత్యంత ప్రాముఖ్యమైన స్వరమని తమ ప్రజలకు చెప్పవలసియున్నారు, తద్వారా వధువు నేరుగా దేవుని నుండే, దేవుని స్వరమును వినగలుగుటకైయున్నది.

దేవుని స్వరమును వినడం కంటే గొప్పది ఏదియు లేదు. టేపులలో ఉన్న అభిషేకము కంటే గొప్ప అభిషేకము ఏదియు లేదు. టేపులలో ఉన్న దేవుని స్వరము ద్వారా తప్ప వధువును ఐక్యము చేయడానికి వేరే ఏ మార్గము లేదు. ప్లే ను నొక్కి మరియు మీరు వింటున్న ప్రతీ మాటను నమ్మడం ద్వారా తప్ప పరిపూర్ణమైన మార్గము మరేదియు లేదు. అది నిజంగా దేవుడు, తన వధువు పట్ల, కరుణా సంపన్నుడిగా ఉండుటయై యున్నది. అది ఈ దినము కొరకు ఆయనయొక్క ఏర్పాటుచేయబడిన పరిపూర్ణమైన మార్గమైయున్నది.

ఈ ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, దేవుడు మాట్లాడి మరియు కరుణా సంపన్నుడైన దేవుడు 65-0119 అనే వర్తమానమును అందించుట ద్వారా పరిపూర్ణ వాక్యమును ఆయనయొక్క పిల్లలకు బోధించడాన్ని మేము వినుచుండగా, మీరు వచ్చి మరియు మన దినముయొక్క అత్యంత గొప్ప అభిషేకము క్రింద ఐక్యమవ్వాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

చదువవలసిన లేఖనములు: ఎఫెసీ 2:1-5

 

 

19, సెప్టెంబర్ 2026, శనివారం

వారిలో ఒకరైన ప్రియమైనవారలారా,

ప్రజలు మనల్ని ఇట్లు అడిగినప్పుడు:

Q: దేవునియొక్క వధువును బయటకు పిలువడానికి దేవుడు విలియం మారియన్ బ్రెన్హామ్ ను పంపించాడని నమ్మేటటువంటి “ప్లే ను నొక్కు” అనే టేపు ప్రజలలో నీవు ఒకడివా?

A: అవును, నేను వారిలో ఒకడిని.

Q: ఆ టేపులలో పలుకబడిన ప్రతీ మాటను నీవు నమ్ముతావా?

A: ప్రభువుకు స్తోత్రం, నేను వారిలో ఒకడిని.

Q: అలాగైతే నీవు క్రీస్తుయొక్క వధువైయుండటానికి తప్పకుండా ప్లే ను నొక్కి ఆయన స్వరమును వినాలి అని కూడా ఖచ్చితంగా నమ్ముతావు కదా?

A: మహిమ, నేను సరిగ్గా అదేయైయున్నది, నేను పూర్తిగా అదేయైయున్నాను…నేను వారిలో ఒకడిని.

Q: నీవు ఆయనయొక్క వాక్యమును నమ్మడానికి, ఆయనయొక్క వధువుగా ఉండటానికి, జగత్తుపునాది మొదలుకొని ముందుగా నిర్ణయించబడిన ఆయనయొక్క ఎంపిక చేయబడిన, ఎన్నుకోబడిన రాజసంతానమని, మరియు ఆయన దృష్టిలో పరిపూర్ణముగా, ఎటువంటి పాపము లేకుండా ఉన్నావని, నిన్ను అసలు మోసపరచడం సాధ్యమే కాదని నీవు నిజంగా నమ్ముతున్నావని నాకు చెప్తున్నావా?

A: హల్లెలూయా, నీకు అది అర్థమైంది, అది 110% నేనేయైయున్నాను, నేను వారిలో ఒకడిని.

స్వయంగా యేసు ప్రకారంగా మనము ఆయన వాక్యముయొక్క అనువాదమైయున్నాము. రాజ్యపు పిల్లలమైయున్నాము. పరిశుద్ధాత్మయొక్క వ్యక్తీకరణైయున్నాము. ఈ కాలముయొక్క రాజ్యపు సంతానమైయున్నాము.

విషయమేమిటో మీకు తెలుసా? ఎటువంటి పొరపాటు ఉండకుండునట్లు సరిగ్గా మనము ఎవరమన్నది ప్రతీ ఒక్కరూ ఎరుగవలసిన సమయం వచ్చినది. మేము దేవుడిని తన ప్రవక్త ద్వారా మాట్లాడనిచ్చి మరియు మీ కొరకు దానంతటినీ సమకూర్చియుంచుతాము.

ప్రపంచాన్ని ఉనికిలోకి పలికిన అదే శక్తి పరిశుద్ధాత్మను కలిగియున్న ఆ ప్రజలలో ఉన్నది. అది నిజము. పురుషులారా మరియు స్త్రీలారా, మీరు ఎవరన్నది కనుగొనే సమయమైనది. దయ్యము మిమ్మల్ని వెనుకకు దాచడానికి ప్రయత్నిస్తున్నాడు, ఏదో అణిచివేయబడినవారని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. మీరు అది కాదు. మీరు దేవుని కుమారులు మరియు కుమార్తెలైయున్నారు.

దైవత్వము పరలోకములో లేదు, అది మీలోనే ఉన్నది. హల్లెలూయ!

 

A: దైవత్వము పరలోకములో లేదు, అది మనలో ప్రతీ ఒక్కరిలో నివసిస్తూ జీవిస్తున్నది!

మనము ఎవరము అనేదాని గురించి ఆయన మనకు ఇచ్చిన ప్రత్యక్షత, ప్రతీ నూతన దినముతో, మనము తీసుకునే ప్రతీ శ్వాసతో, అంతకంతకు అధికమగుచున్నది. మనము శరీరములో నివసిస్తున్న సజీవ వాక్యమైయున్నాము.

మనకు ఇది ఎలా తెలుసంటే ఆయన మన దినములో పంపినట్టి ప్రత్యక్షతను ఆయన మనకు ఇచ్చాడు; ఆయనయొక్క వాక్యమును ప్రకటించడానికి మరియు ఉపదేశించడానికి మన దినములో ఆయనను పంపిస్తానని ప్రకటన 22లో దేవుడు తానే చెప్పాడు.

సంఘములలో ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమివ్వడానికి యేసునైయున్న నేను నా దూతను పంపియున్నాను.

ఆయన తన దూతను పంపించాడు: ఆయనయొక్క సంఘములలో మాట్లాడటానికి, విలియం మారియన్ బ్రెన్హామ్ ను పంపించాడు…నా స్నేహితుడా దాని అర్థమే మీ సంఘములలో టేపులను ప్లే చేయండి అనియైయున్నది. దానికి ప్రత్యక్షత కూడా అవసరం లేదు, మీరు కేవలం దానిని చదివితే చాలు.

వాక్యము ప్రకారంగా, ఇది ప్రపంచ చరిత్రలోనే అత్యంత మోసపూరితమైన సమయమైయున్నది. సత్యము మరియు అబద్ధపు ఆత్మ సాధ్యమైతే ఏర్పరచబడినవారిని సైతం మోసపరిచేంత దగ్గరగా ఉంటాయి.

దేవుడు తన దూతను సంఘములకు పంపించాడు. మనం ఆయన స్వరమును మన చేతివ్రేళ్ళకు అందుబాటులో కలిగియున్నాము. ఆయన పలికినదానిని మనం పదముకు పదము పొల్లుపోకుండా వినవచ్చును. దానికి ఎటువంటి వివరణ లేదా ఎటువంటి అనువాదము అవసరంలేదు, వధువు చేయవలసినదల్లా ప్లే ను నొక్కి మరియు నమ్మడమే.

ఆయన మనల్ని ఇట్లు హెచ్చరించాడు, టేపులలో ఉన్నవాటిలో ఒక్క పొల్లైన లేదా సున్నైన మార్చకండి. మీ అవగాహననైనా లేదా మీ ఆలోచనలనైనా పెట్టకండి, కేవలం నా స్వరమును వినండి మరియు నమ్మండి. ఈ దినము వరకు కూడా, అది సాధ్యపడలేదు; కానీ ఈ దినమున అది సాధ్యమైనది ఎందుకంటే అది ఈ దినము కొరకు దేవుడు ఏర్పాటుచేసిన మార్గమైయున్నది.

మనం ఈ మధ్యనే ఏడు సంఘ కాలములను విన్నాము మరియు ప్రతి కాలములోను, ప్రజలను నిజమైన వాక్యమునుండి తీసుకుపోడానికి ఏ విధంగా ఆ ఆత్మలు లేచాయో విన్నాము. ప్రతి కాలములోను, ఆ వర్తమానికుడు వెళ్ళిపోయిన తర్వాత, వారు ప్రజలను ఒక మతాచారమునొద్దకు లేదా మతసిద్ధాంతమునొద్దకు; స్వయంగా తమ దగ్గరకు మరియు మనుష్యుని ఆలోచనయొద్దకు నడిపించడానికి ఏమి చేశారో విన్నాము.

ఈనాడు వారు మన పలుకుబడిని చంపేసి మరియు, “ఓ, మీరు వినవలసిన అత్యంత ముఖ్యమైన స్వరము టేపులేనని వారు నమ్ముతారు. మీ సంఘములో టేపులను ప్లే చేయాలని అంటారు…అది బుద్ధిహీనతైయున్నది. సంఘములో టేపులను ప్లే చేయమని బ్రెన్హామ్ సహోదరుడు చెప్పలేదు. ఇప్పుడు మీరు వినవలసినది పరిచర్యయొక్క స్వరమైయున్నది” అని అంటారు.

నాకైతే, అది భేదమైన విత్తనమైయున్నది! మీరు ప్లే ను నొక్కి మరియు మీ సంఘములలో దేవుని స్వరమును వినవలసియున్నారు ఎందుకంటే స్వయంగా దేవునిచేత నిర్ధారించబడిన ఏకైక స్వరము అదేయైయున్నది. దేవుడు పలికిన ప్రతీ మాటకు మీరు లోబడవలసియున్నారు.

సంఘములలో ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమివ్వడానికి యేసునైయున్న నేను నా దూతను పంపియున్నాను.

ఆ నిర్ధారించబడిన దూత మా సంఘములో మాట్లాడుతాడు, కావున జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా, మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనుసంధానమైయున్న తన వధువుతో కలిసి ఆ స్వరమును వినడానికి మీరు వచ్చి మాతో చేరి, మరియు 65-0118 - "భేదమైన విత్తనము" ను వినమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

 

12, సెప్టెంబర్ 2026, శనివారం

ప్రియమైన క్రీస్తు వధువా, ఈ ఆదివారము, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా, మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, 60-1211E లవొదికయ సంఘ కాలమును వినడానికి మనమందరమూ కూడివద్దాము.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

 

5, సెప్టెంబర్ 2026, శనివారం

ప్రియమైన క్రీస్తు వధువా, ఈ ఆదివారము, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా, మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, 60-1211M పదిమంది కన్యకలు, మరియు ఒక లక్షా నలభై-నాలుగు వేలమంది యూదులు అనేదానిని వినడానికి మనమందరమూ కూడివద్దాము.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

 

29, ఆగస్టు 2026, శనివారం

ప్రియమైన క్రీస్తు వధువా, ఈ ఆదివారము, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, 60-1210 ఫిలదెల్ఫియ సంఘ కాలమును వినడానికి మనమందరము కూడివద్దాము.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

 

సంబంధిత కూడికలు