
వెలుగు సంబంధులైన పిల్లలారా,
మనము ఆయన వెలుగులో నడుచుచున్నందుకు ఎంత కృతజ్ఞులమైయున్నాము కదా. ఆ వెలుగులో భాగమైయ్యుండుటకు, ఆయన వెలుగుతో గుర్తించబడుటకు ఎంత కృతజ్ఞులమైయున్నాము కదా. ఆయన చేత ఎన్నుకోబడి మరియు పిలువబడినందుకు ఎంత కృతజ్ఞులమైయున్నాము కదా. మనము క్రీస్తుయొక్క వధువైయ్యుండి, ఆయనతో గుర్తించబడియున్నాము. ఇరువురు ఇప్పుడు ఒక్కటయ్యారు.
నేను దానిని ఎన్నిసార్లు రాసినా తక్కువే. మనము దానిని ఎన్నిసార్లు చెప్పినా సరిపోదు. ఈ వర్తమానమే మన సర్వస్వమైయున్నది. ఆయన వాక్యముయొక్క సత్య ప్రత్యక్షతను మనము కలిగియున్నామని తెలుసుకోవడం మనము మాటలలో చెప్పలేనటువంటి విషయమైయున్నది.
ఈ దినమున జీవిస్తూ మరియు జరుగుచున్నదానిలో భాగమవ్వడమనేది, దేవుడు మనకు అనుగ్రహించగల అత్యంత గొప్ప ఘనతయైయున్నది. బ్రెన్హామ్ టెబర్నికల్ వద్ద కూడికలలో కూర్చొని, దేవుని దూత ఈ వర్తమానాలను తీసుకొనిరావడాన్ని చూడటము మరియు వినడము ఎంతో గొప్ప విషయమైయ్యుండగా, ఈ దినములో, మరియు ఈ సమయములో జీవిస్తూ, మరియు ఆ వాక్యముయొక్క నెరవేర్పుయైయ్యుండటం ఇంకెంతో గొప్ప విషయమైయున్నది.
ఆయనయొక్క వాక్యముచేత పరిపూర్ణము చేయబడుటకై, ప్రపంచమంతటినుండి మనము కూడుకొని, అందరమూ ఒకే సమయములో దేవుని స్వరమును వినడానికి, దేవుడు, తన గొప్ప ప్రణాళికలో, ఒక మార్గమును కలుగజేశాడు. ఏ క్షణమునయైనా మన ఏడవ దూత వర్తమానికుడు ఇట్లు చెప్పడాన్ని వినుటకు వేచియుండుట;
“ఇదిగో లోకపాపములను మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్ల!”
కాలము ప్రారంభమైనప్పటినుండి అటువంటి ఒక విషయము ఎన్నడూ లేదు. దేవుని గొప్ప ప్రణాళికయొక్క ముగింపు, సరిగ్గా ఇప్పుడు, సంభవించుచున్నది, మరియు మనము దానిలో భాగమైయున్నాము. ప్రభువుయొక్క మహాదినము సమీపమైనది.
దేవునియొక్క వర్తమానికుడైన దూత ద్వారా మర్మములన్నియు వధువుకు బయలుపరచబడినవి. ముద్రలు, కాలములు, ఉరుములు, ఎత్తబడే విశ్వాసము, మూడవ ఈడ్పు…ప్రతీది పలుబడి మరియు వధువు మరలా మరలా వాటిని వినగలుగునట్లు టేపులలో ఉన్నవి, మరియు అది మనల్ని పరిపూర్ణము చేస్తుంది.
పరిశుద్ధాత్మ తిరిగి మరలా సంఘములో ఉన్నాడు; ఆయన వాగ్దానము చేసినట్లే సాయంకాల సమయములో, క్రీస్తు, తానే, మానవ శరీరములో బయలుపరచుకున్నాడు.
వధువా ఇప్పుడు జాగ్రత్తగా విను, దానిని పట్టుకో.
మనము వాక్యముచేత బయటకు పిలువబడినాము; స్వయంగా క్రీస్తే మనలను బయటకు పిలిచాడు. ఆయన తననుతాను మనకు తేటపరచుకున్నాడు; హెబ్రీ 13:8, లూకా 17:30, మలాకీ 4, హెబ్రీ 4:12, ఆయన మనకు వాగ్దానము చేసిన ఈ లేఖనములన్నిటిని తేటపరిచాడు.
ఈ దినము కొరకు ముందుగా నిర్ణయించబడిన ఈ లేఖనముల ద్వారా తననుతాను మనకు బయలుపరచుకున్నది, మరలా జీవించుచున్న, దేవుని కుమారుడైన, యేసే.
మరియు దానిని నమ్మడం, పరిశుద్ధాత్మను కలిగియున్నారనుటకు రుజువైయున్నది.
దేవుడు తన వధువును బయటకు పిలువడానికి తన ప్రవక్తను పంపాడు. ప్రవక్త అనగా, దేవునియొక్క సజీవ వాక్యము ప్రత్యక్షపరచబడటమే అని వాక్యము మనకు చెప్పుచున్నది. లోకము పొందుకునే చివరి సూచన అదేయైయున్నది; యెహోవా ఒక మానవ రూపములోనుండి మాట్లాడుట.
ఒక ప్రవక్త వలె, మానవ శరీరములో ఉన్న ఒక మనుష్యుడు, మరి అయిననూ తన వెనుకాల ఉన్న శారా హృదయములోని తలంపును వివేచించుచున్న ఆయన ఎలోహిం అయ్యున్నాడు. మరియు యేసు ఇట్లు చెప్పాడు, “లోతు దినములలో జరిగినట్లే, ప్రపంచముయొక్క ముగింపులో, మనుష్యకుమారుడు,” దేవుని కుమారుడు కాదు, “మనుష్యకుమారుడు ప్రత్యక్షపరచుకుంటున్నప్పుడు జరుగును.”
మీరు స్థిరంగా వాక్యములో ఉంటేనే తప్ప ఆయన ఎవరో మీరు తెలుసుకోలేరని, వధువు ఎరిగియున్నది. ప్లే నొక్కడం ద్వారా ప్రతీ రోజు ఆ స్వరమును తమయెదుట ఉంచుకోవడం ఎంత అవసరమో వారికి తెలుసు.
ఇప్పుడు ఏడవ బూరను ఊదడానికి, ప్రకటనలోని దేవునియొక్క ఇద్దరు ప్రవక్తలు రంగం మీద ప్రత్యక్షమవ్వగలుగునట్లు, వధువు దారిలోనుండి తప్పుకొని, మరియు పైకి వెళ్ళవలసియున్నది. క్రీస్తును వారికి తెలియజేయుటకైయున్నది.
ఈ ఆదివారము జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా 12:00 P.M., గంటల సమయమప్పుడు, దేవుని ప్రవక్త, బూరల పండుగ 64-0719M, అనే వర్తమానమును అందిస్తూ, మరియు తండ్రితో మాట్లాడుచు ఇట్లు చెప్పుచుండగా వచ్చి ప్రవచనముయొక్క నెరవేర్పులో భాగమవ్వండి,
ప్రపంచ వ్యాప్తంగా, బయట దేశములలో, తమ గృహములయందు లేదా తమ సంఘములయందు ఈ టేపు మాత్రమే వారిని కలిసేటటువంటి కొందరు ప్రజలు ఉండవచ్చును. ప్రభువా, కూడిక జరుగుచుండగా, ఎక్కడైతే—ఎక్కడైతే…లేదా టేపు ప్లే చేయబడుచుండగా, లేదా మేము ఏ స్థానములో ఉన్నా, లేదా—లేదా ఏ పరిస్థిలో ఉన్నా, ఈ ఉదయము దేవుడు మా హృదయములయొక్క ఈ యదార్థతను ఘనపరచి, మరియు అవసరతలో ఉన్నవారిని స్వస్థపరచాలని, వారికి అవసరమైనదానిని వారికి అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాము.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
వర్తమానము వినుటకు ముందు చదువవలసిన లేఖనములు:
లేవీయకాండము 16
లేవీయకాండము 23:23-27
యెషయా 18:1-3
యెషయా 27:12-13
ప్రకటన 10:1-7
ప్రకటన 9:13-14
ప్రకటన 17:8