భద్రము చేయబడిన ఉత్తరములు
21, అక్టోబర్ 2023, శనివారం

ప్రియమైన దేవుని యొక్క ఆలయములారా,

నేను ఆయన సంఘమునైయున్నాను. మీరు ఆయన సంఘమైయున్నారు. మనము దేవుడు నివసించునట్టి ఆలయమైయున్నాము. మనము సజీవ దేవుని యొక్క సంఘమైయున్నాము; జీవముగల దేవుడు మనయందు జీవించుచున్నాడు. మన క్రియలు దేవుని యొక్క క్రియలైయున్నవి. మహిమ!!

ప్రపంచమంతటి నుండి చిన్న చిన్న స్థలములలో, మనమందరమూ కూడుకొనుచున్నాము; అందరమూ దేవుని యొక్క స్వరము చుట్టూ, ఈ దినము కొరకైన ఆయన వాక్యము చుట్టూ కూడుకొనుచున్నాము.

అది ఎంతో అద్భుతంగా ఉన్నది. దేనితో ఎటువంటి బంధాలు లేవు, కేవలం యేసు క్రీస్తు మరియు ఆయన వాక్యమునకు మాత్రమే కట్టుబడియున్నాము. అంతే, విరామ చిహ్నము. సాక్షాత్తు దేవుని స్వరము ద్వారానే పరిపూర్ణము చేయబడుతూ మనము కలిసి పరలోక స్థలములలో కూర్చొనియున్నాము.

మనము వెళ్ళుచున్నాము. మనమందరము వాగ్దాన దేశములోనికి వెళ్ళుచున్నాము. మనలో ప్రతీ ఒక్కరము! నీవు ఒక గృహిణివైనా గాని, ఒక చిన్న యువతివైనా గాని, ఒక వృద్ధురాలు, ఒక వృద్ధుడు లేదా ఒక యౌవ్వనస్థుడు, నీవెవరవైనా గాని, మనమందరమూ వెళ్ళుచున్నాము. మనలో ఒక్కరు కూడా విడిచిపెట్టబడరు. మనలో ప్రతీ ఒక్కరము వెళ్ళుచున్నాము, మరియు “మనము దేని కొరకును ఆగబోవడం లేదు.”

మనమందరము కలిసి ఉండాలని మనము నమ్ముచున్నాము. ఆ మహిమకరమైన రాకడ కొరకు ఎదురుచూస్తున్న, యేసు క్రీస్తు శరీరము యొక్క ఒక ఐక్యమైన గొప్ప గుంపైయున్నాము. మనము విడిపోకూడదు, కాని సువార్త బోధన యొక్క ఆ ఏర్పాటు చేయబడిన బాటను మానవుడు తప్పియున్నాడు.

ఏది సరియో ఏది తప్పో ఖచ్చితంగా చూపించుటకు ఏదో ఒక మార్గము ఉండవలసియున్నది. మరియు మీరు దానిని చేసే ఏకైక విధానమేదనగా, వాక్యమునకు ఎటువంటి అనువాదమునైనా ఇవ్వకుండా, కేవలం అది ఉన్న రీతిగానే దానిని చదివి మరియు ఆ విధంగానే దానిని నమ్మడమైయున్నది. ప్రతీ వ్యక్తి తన స్వంత అనువాదమును, మరియు అది దానిని ఏదో భిన్నమైనదిగా చెప్పునట్లు చేస్తుంది. వధువుకు దేవుని స్వరము కేవలం ఒక్కటి మాత్రమే ఉన్నది. ప్లే ను నొక్కండి!

నేను దీనిని ఈ టేపుపై చెప్పుచున్నాను, మరియు ఈ ప్రజల కొరకు చెప్పుచున్నాను, నేను పరిశుద్ధాత్మ ప్రేరేపణ క్రింద దీనిని చెప్పుచున్నాను: దేవుని పక్షమున ఉన్నవాడు ఎవడో, అతడు ఈ వాక్యము క్రిందకు వచ్చును గాక!

మన దినమునకైన వాక్యము ఒక స్వరమును కలిగియున్నది. మన ప్రవక్తయే ఆ స్వరమైయున్నాడు. ఆ స్వరము మన దినమునకు జీవించుచున్న వాక్యమైయున్నది. ఆ స్వరమును వినుటకు మరియు ఈ ఘడియను చూచుటకు మనము ముందుగా నిర్ణయించబడినాము, మరియు ఆ స్వరమును వినకుండా మనలను ఆపగలిగేది ఏదియు లేదు.

మన విశ్వాసము దానిని చూస్తుంది మరియు ఎవ్వరు ఏమన్నాగాని దానిని వినుటకు ఎంచుకుంటుంది. మనము వేరొక వైపుకు చూచుటకు మన గురిని మరల్చుకొనము. మనము మన గురిని ఖచ్చితంగా వాక్యము మీదనే ఉంచుతాము మరియు మన చెవులు ఆ స్వరమునకు శృతిచేయబడియున్నవి.

ప్రభువా, ఒక సమర్పణ భావముతో, మా హృదయముల నుండి నీ చెవుల యొద్దకు ఇది మా యొక్క యధార్థమైన ప్రార్థన.

అదేమిటనగా మా జీవితములు మారును గాక, ఈ దినము మొదలుకొని, మా ఆలోచనలో మరి ఎక్కువ సానుకూలముగా ఉందుము గాక. మేము దేవుడిని అడిగినది, దేవుడు ప్రతీ ఒక్కరికి అనుగ్రహిస్తాడని నమ్ముచు, మేము అంతటి మాదూర్యత మరియు సామాన్యతలో జీవించుటకు ప్రయత్నిస్తాము. మరియు మేము ఒకరికొకరమైనా లేదా, ఏ వ్యక్తికైనా వ్యతిరేకముగా కీడు పలుకము. మేము మా శత్రువులను ప్రేమించి మరియు వారి కొరకు ప్రార్థిస్తాము, మాకు కీడు చేయువారికి మేలు చేస్తాము. ఎవరు సరియో ఎవరు తప్పో అనుదానికి దేవుడే తీర్పరియైయున్నాడు.

ఆదివారమున, జఫర్సన్ విల్ కాలమానము ప్రకారము 12:00 P.M., సమయమప్పుడు వచ్చి మాతో కలిసి దేవుని స్వరమును వినుట ద్వారా మీ విశ్వాసమును అభిషేకించుకొనమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, అది మేము దీనిని వినుచున్నపుడైయున్నది: మొఱ్ఱపెట్టనేల? పలుకుము! 63-0714M.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

 


14, అక్టోబర్ 2023, శనివారం

ప్రియమైన గృహ సంఘపు వధువా, ఈ ఆదివారము, జఫర్సన్ విల్ కాలమానము ప్రకారంగా 5:00 pm, సమయమప్పుడు, మనమందరము కూడుకొని మరియు, నేరారోపణ 63-0707m అను వర్తమానమును విందాము.

వెనువెంటనే మనము, 63-0707e సహవాసము అను వర్తమానమును వినుచుండగా మన గృహములలో ప్రభురాత్రి భోజనములో పాల్గొనే పరిశుద్ధ అవకాశము కొరకు మనల్ని మనము సిద్ధపరచుకుందాము. పిదప ప్రభురాత్రి భోజనము మరియు పాద పరిచర్య కార్యక్రమములో పాల్గొందాము. నేరారోపణ టేపు లాగానే, సహవాసము టేపు కూడా వాయిస్ రేడియోలో (ఆంగ్లములో మాత్రమే) ప్లే చేయబడుతుంది, అటు తర్వాత పియానో సంగీతం, పాద పరిచర్యను ప్రారంభించుటకు ఒక కొటేషన్, మరియు సాధారణంగా మనము గృహములో ప్రభురాత్రి భోజనపు కూడికలలో చేసినట్లే, సువార్త గీతములు ప్లే చేయబడతాయి.

ప్రభురాత్రి భోజనపు ద్రాక్షారసమును మరియు రొట్టెను పొందుకునే/తయారుచేసే విధానాలను గూర్చిన లింకులు క్రింద ఇవ్వబడినవి.

ఆయనతో చాలా ప్రత్యేకమైన ఒక దినమును గడుపుటకు మనలో ప్రతి ఒక్కరి గృహములోనికి రాజులకు రాజును ఆహ్వానించుటకు ప్రభువు మనకు ఏర్పాటు చేసిన మార్గమును బట్టి నేను ఎంతో కృతజ్ఞుడనైయున్నాను. మీ అందరినీ ఆయన బల్ల వద్ద కలుసుకొనుటకు నిశ్చయంగా నేను ఎదురుచూస్తున్నాను.

దేవుడు మిమ్మల్ని దీవించును గాక,

సహోదరుడు జోసఫ్ బ్రెన్హామ్

 

 



రొట్టెను చేయుటకు / ద్రాక్షారసమును తయారు చేయుటకు సూచనలు

ప్రభురాత్రి భోజనపు ద్రాక్షారసమును / పాదములు కడుగు పాత్రలను పొందుకొనుటకు సూచనలు





 


సంబంధిత కూడికలు
7, అక్టోబర్ 2023, శనివారం

ప్రియమైన దేవుని ప్రవక్త యొక్క మందా,

మనము ప్రార్థించుకుందాము.

పరలోకపు తండ్రీ, నిత్యత్వమునకు ఈవలి వైపున ప్రపంచమంతటి నుండి కూడుకొనుటకు మరొక సమయమును కలిగియున్నందుకు మేము ఎంతో కృతజ్ఞులమైయున్నాము. ఏక మనస్సు కలిగి మరియు నీతో ఏకాత్మలో ఉండుటకు; నీ స్వరము మాతో మాట్లాడుటను వినడానికి కృతజ్ఞులమైయున్నాము. ముందున్న ప్రయాణము కొరకు మమ్మల్ని ధైర్యపరచి మరియు బలపరచుటకు, నీ యొద్ద నుండి నూతన బలము రావలెనని మరొక్కసారి మేము ఎదురుచూస్తున్నాము.

మా కొరకు ఏర్పాటుచేయబడిన మన్నాను పొందుకోవడానికి మేము కూడుకొనుచున్నాము. అది ప్రయాణములో మాకు శక్తిని ఇచ్చుటకు నీవు దాచిపెట్టిన ఆ ఆత్మీయ మన్నాయైయున్నది. కేవలం అది మాత్రమే రాబోవు దినములలో మమ్మల్ని కాపాడగలదు.

నీవు నీ సంఘమును క్రమములో పెట్టగలుగుటకు ముందు, నీవు ఒక్క చోట, మమ్మల్ని సమకూర్చి, మరియు ఒక్క ఆత్మలోకి మమ్మల్ని తీసుకొనిరావలసియున్నదని, నీవు చెప్పావు. పిదప నాయకత్వం వహించుటకు నీవు నీ యొక్క పరిశుద్ధాత్మను పంపెదవు, ఏదో ఒక సార్వత్రిక సంఘ సమైఖ్యనో, ఏదో ఒక మనుషుల గుంపునో కాదు గాని, పెదవి నుండి చెవికి అన్నట్లు మాతో మాట్లాడేందుకు నీ పరిశుద్ధాత్మను పంపుతావు.

నీవు నీ యొక్క దూత ద్వారా మాట్లాడి మరియు మాకు ఇట్లు చెప్పావు:

“మీరు మీ సంఘ కాపరితో నిలబడాలని మరియు ఇక్కడ బోధించబడిన బోధనతో నిలబడాలని నేను కోరుచున్నాను. ఈ వాక్యముతో నిలిచియుండండి, దానిని విడిచిపెట్టకండి! ఏది ఏమైనా గానీ మీరు సరిగ్గా వాక్యముతో నిలిచియుండండి, ఆ వాక్యముతోనే నిలిచియుండండి!”

తండ్రీ, మేము నీ వాక్యమునకు విధేయులమై మరియు మా సంఘ కాపరితో నిలిచియుంటున్నాము. అది ఈ దినమునకు దేవుని యొక్క స్వరమైయున్నది, మా దినమునకు ప్రత్యక్షపరచబడి మరియు నిర్ధారించబడిన నీ యొక్క స్వచ్చమైన వాక్యమును మాత్రమే అతడు మాట్లాడుతాడు.

సొదొమ దినములలో జరిగినట్లు, మనుష్యకుమారుని రాకడలో జరుగునని నీవు మాకు చెప్పావు; మమ్మల్ని నడిపించుటకు మేము రెండు సంగతులను కలిగియుంటామని, మరియు మిగతా ప్రపంచము రెండు సంగతులను కలిగియుంటుందని నీవు చెప్పావు. వారి యొక్క రెండు సంగతులు ఇద్దరు ప్రసంగికులైయున్నారు.

కాని నీ యొక్క ఆత్మీయ సంఘమునకు, ముందుగా నిర్ణయించబడి, ఎన్నుకొనబడిన నీ యొక్క వధువుకు, మా రెండు సంగతులు ఏవనగా నీవు, ఒక మానవ శరీరములో ప్రత్యక్షపరచుకొని, అగ్నిస్తంభము ద్వారా మమ్మల్ని నడిపించడమైయున్నది.

గాలులు వీచనిమ్ము. తుఫానులు కుదుపనిమ్ము. మేము మాత్రం, ఎప్పటికీ సురక్షితంగా ఉన్నాము. మేము సరిగ్గా అక్కడ నీ వాక్యముపై విశ్రాంతి పొందుచున్నాము. సమయం ఆసన్నమైనది. ఆత్మీయ నిర్గమము వచ్చియున్నది. మేము నీ స్వరమును వినుచు, అనుదినము నీతో మాట్లాడుచు మరియు నీతో నడుచుచున్నాము. మేము నీతో ఒక స్థిరమైన సహవాసములో ఉన్నాము.

మేము నీ చేతులుగాను, నీ కళ్ళుగాను, నీ నాలుకగాను ఉండగోరుచున్నాము. నీవు ద్రాక్షావల్లివి, మేము నీ తీగెలమైయున్నాము. తండ్రీ, నీ ఫలమును మేము ఫలించుటకు, మమ్మల్ని ఉత్తేజపరచుము. నీ సువార్తకు యోగ్యమైన జీవితమును కలిగియుండాలన్నదే మా ఏకైక కోరికయైయున్నది.

తండ్రీ, నీ పనిని కొనసాగించుటకు మరియు నీ వాగ్దాన వాక్యమును నెరవేర్చుటకు, నిన్ను నీవు మా ద్వారా ప్రతిబింబించుకొనుము. నీతి యావత్తును నెరవేర్చడానికి, ఈ దినమునకు నీ వర్తమానికులుగా ఉండాలన్నదే మా కోరికయైయున్నది.

నీవు మాతో ఈ విధంగా చెప్పుటను వినాలని మేము కోరుచున్నాము:

రేడియో ద్వారా వినుచున్నవారు లేదా…టేపు రంగములో ఉన్నవారు, మరియు ఇక్కడున్నవారి కొరకు, నా ప్రార్థన ఇదే. “నేను బహుగా ఆనందించాను. జగత్తు పునాది వేయబడక ముందే మీ కొరకు సిద్ధపరచబడిన నిత్యత్వపు సంతోషాలలోనికి ప్రవేశించండి,” అని దేవుడు చెప్పునటువంటి జీవితమును, ఈ రాత్రి మొదలుకొని, ఇకమీదటను మనము జీవించునట్లు, పరలోకము యొక్క, కృపగల దేవుడు, మనందరిమీద తన యొక్క ధన్యకరమైన పరిశుద్ధాత్మను ప్రకాశింపజేయును గాక. పరలోకపు దేవుడు మీ అందరిమీద తన ఆశీర్వాదములను కుమ్మరించును గాక.

మహిమ…తండ్రీ అది మేమే, టేపు రంగములో ఉన్న నీ వధువైయున్నాము. నిజముగా, నీవు నీ ఆశీర్వాదములను మా మీదకు పంపుచున్నావు, మేము వింటున్న ప్రతీ వర్తమానము ద్వారా, నీవు బహుగా ఆనందించుచున్నావనియు, మేము నీ వదువైయున్నామనియు మాతో చెప్పుచున్నావు.

మా సంఘకాపరి చెప్పేది, దేవుడు తన వధువును బయటకు పిలిచి మరియు ఆమెను నడిపించుటకై లోకమునకు పంపినట్టి తన కాపరి చెప్పేది మీరు వినగోరిన యెడల, ఆదివారము, జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా, 12:00 P.M., సమయముకు, వచ్చి మాతో కూడా చేరండి, దేవుని యొద్ద నుండి అతడు ఈ వర్తమానమును తెచ్చుచుండగా, అతడు నిత్యజీవపు మాటలు చెప్పడాన్ని వినేందుకు, మాతో కూడా చేరండి: నీ జీవితం సువార్తకు యోగ్యమైనదిగా ఉన్నదా? 63-0630E.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

 


 

ప్రత్యేకమైన ప్రకటన: ప్రభువు చిత్తమైతే, వచ్చే ఆదివారం రాత్రి, అక్టోబరు 15న మేము గృహ ప్రభు సంస్కారమును / పాద పరిచర్య కూడికను కలిగియుండబోవుచున్నాము.

 


30, సెప్టెంబర్ 2023, శనివారం

ప్రియమైన నిర్గమపు వధువా,

ఈనాడు సంభవించుటను మనము చూస్తున్న ఈ కార్యములు, ఒక ఇరవై సంవత్సరాల క్రితం లేదా నలభై సంవత్సరాల క్రితం జరిగియుండేవి కావు; అవి ఈనాడు మాత్రమే జరుగుచున్నవి. ఇదే ఘడియయైయున్నది! ఇదే సమయమైయున్నది! అది నెరవేరుటకు ఇదే సమయమైయున్నది. దేవుడు దానిని వాగ్దానము చేశాడు, మరియు ఇదిగో అది ఇక్కడ ఉన్నది.

మనము ఆత్మీయ అవగాహనను కలిగియున్నాము; ఈ దేశము యొక్క అక్రమము సంపూర్ణమైనది. ఘడియ వచ్చియున్నది. వాగ్దాన దేశమునకు వెళ్ళుటకు సమయమైనది. కేవలం మరొక దేశమునకు వెళ్ళడం కాదు గాని, మనము ఎదురుచూసినటువంటి మన భవిష్యత్తు గృహమునకు వెళ్ళుటయైయున్నది.

కేవలం దాని గూర్చి ఆలోచించండి, మనల్ని నడిపించేది ఒక ప్రవక్త కంటే గొప్పదైయున్నది. అది దానిని నిరూపించుటకు తన వాక్యముతో, దేవుడే మన మధ్య శరీరధారియగుటయై యున్నది. ఏ ఇతర ప్రవక్త కంటెను వెయ్యి రెట్లు అధికముగా నిరూపించిన ఒక ప్రవక్త. ఆ వాగ్దాన దేశమునకు, ఆ వెయ్యేండ్ల పాలనకు మనల్ని నడిపించుచున్నది అగ్నిస్తంభమైయున్నది.

అతడు తప్పిపోకుండా ఉండటం కోసం, ఆయన మన ప్రవక్తను ఎన్నుకొని మరియు అతనికి అగ్నిస్తంభమనే ఒక సహజాతీతమైన సూచనను ఇచ్చాడు. ప్రవక్త చెప్పినవి స్వయంగా దేవుని యొక్క మాటలే. ఆయన తననుతాను మనకు నిర్ధారించుకొని, మరియు ఆయన యొక్క సంపూర్ణ వాక్య ప్రత్యక్షతను మనకు ఇవ్వడానికి, ఆయన మన ప్రవక్తను తీసుకొని, అతనికి తర్ఫీదు ఇచ్చి, పిదప అగ్నిస్తంభముతో అతణ్ణి మన వద్దకు పంపించాడు.

మనము ఆ వాగ్దాన దేశమునకు వెళ్ళగోరినయెడల, దేవుడు తన ప్రణాళికను మార్చలేడని, మరియు ఆయన దానిని మార్చడని, మనము ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆయన దేవుడైయున్నాడు, మరియు ఆయన అలా చేయలేడు. ఆయన ఎన్నడూ ఒక గుంపుతో వ్యవహరించడని ఆయన మనకు చెప్పాడు. ఆయన ఎన్నడూ ఆ విధంగా వ్యవహరించలేదు. ఆయన ఒక్కొక్కరిగా మనతో వ్యవహరిస్తాడు. మనలను ఈ దేశానికి నడిపించేందుకు మనకు మలాకీ 4 ను పంపుతాడని ఆయన తన వాక్యములో మనకు వాగ్దానం చేసాడు, మరియు ఆయన పంపించాడు.

అయితే మీరు చూడండి, ఆహాబు ఒక పద్దతిని కలిగియున్నాడు, అది దేవుని యొద్ద నుండి వచ్చినదని అతడు అనుకున్నాడు. అతడు ఇట్లన్నాడు, “విద్యావంతులు మరియు తర్ఫీదు పొందినవారైన, నాలుగు వందల మందిని నేను కలిగియున్నాను.” మరియు ఈనాడు పరిచారక గుంపులు చెప్పుకొనుచున్నట్లే, తాము హెబ్రీ ప్రవక్తలని వారు చెప్పుకున్నారు.

అనేకులు దీనిని స్వీకరించగోరరు, కానీ పాత కాలపు ఏలియా వలెనే, దేవుని యొక్క ఏడవ దూత వర్తమానికుడైన, మన కాపరి, ఆయన యొక్క వధువును నడిపించుటకు ప్రపంచానికే కాపరియైయున్నాడు.

ఆయన మలాకీ 4:5, మరియు ప్రకటన 10:7 అయ్యున్నాడు. ఆయన తన గురించి బైబిలు గ్రంథము ముందుగా చెప్పిన లేఖనాలన్నింటి యొక్క నెరవేర్పుయై యున్నాడు. ఈ వర్తమానమే, ఈ స్వరమే, తన వధువును పిలుచుచున్న దేవుని యొక్క స్వరమైయున్నది. ఇది ఈ దినము కొరకైన దేవుని యొక్క నమూనాయైయున్నది.

అది అదే అభిషేకించబడిన పద్దతి ద్వారా, అదే అగ్ని స్తంభమైయున్నది. అదే దేవుడు అవే కార్యములను చేయుచున్నాడు.

ఇప్పుడు వాక్యము శరీరధారియై మరియు ఆయన యొక్క వాక్య వధువైయున్న మన శరీరములో, మన మధ్య నివసించుచున్నది.

మనము ఆయనకు కేకలు పెట్టి మరియు ఆయనకు కృతఙ్ఞతలు చెల్లించుదాము, ఆయనను స్తుతించుదాము, ఆయన మన కొరకు చేసిన దానంతటికి: మనలను రక్షించినందుకు, మనలను ముందుగా ఏర్పరచుకున్నందుకు, మనలను నీతిమంతులుగా తీర్చినందుకు ఆయనను ఆరాధించుదాము.

సరిగ్గా ఇప్పుడు ఆయన మన కొరకు ఏమి చేస్తున్నాడంటే; మనము ఎవరమన్నది మనకు చెప్పుచూ, ప్రత్యక్షత వెంబడి ప్రత్యక్షతను మనకు ఇచ్చుచున్నాడు. మరియు ఆయన మన కొరకు చేయబోయేదంతా ఏమిటంటే… వచ్చి మరియు ఆయన వధువుగా మనలను తీసుకొని మరియు నిత్యత్వమంతా మనము ఆయనతో ఉండటానికి, ఆయన మన కొరకు చేసిన భవిష్యత్తు గృహముకు మనలను తీసుకొనిపోవడమైయున్నది.

మనకు అవసరమైన దేనికొరకైనా, ఆయనకు మొఱ్ఱపెట్టండి. తన పిల్లలు దానిని చేయాలనే ఆయన కోరుచున్నాడు. మనము తృప్తిచెంది మరియు మనకు అవసరమైనదానిని పొందుకునేంత వరకు ఆయనకు మొఱ్ఱ పెట్టండి.

వచ్చి మరియు ఆయన యొక్క వధువులో ఒక భాగముతో ఐక్యమై జఫర్సన్ విల్ కాలమానం ప్రకారము ఆదివారము 12:00 P.M., గంటలకు ప్రపంచానికి దేవుని యొక్క కాపరియైయున్న, విలియమ్ మారియన్ బ్రెన్హామ్ గారు, మనకు దీనిని చెప్పుటను వినండి: తృతీయ నిర్గమము 63-0630M.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

 


 

వర్తమానమునకు ముందు చదువవలసిన లేఖనాలు:

నిర్గమకాండము 3:1-12
ఆదికాండము 37 వ అధ్యాయము
ఆదికాండము 43 వ అధ్యాయము

 


సంబంధిత కూడికలు
23, సెప్టెంబర్ 2023, శనివారం

ప్రియమైన నిర్భయమైన వధువా,

హెచ్చరిక!! హెచ్చరిక!! ఎఱ్ఱని దీపము ప్రకాశించుచున్నది. తెర దించబడే సమయం సమీపించియున్నది. మనము ప్రతీది, ప్రతీదానిని ప్రక్కకు పెట్టి, మరియు సిద్ధముగా ఉండవలసియున్నది. మనము అంతమున ఉన్నాము. మనము ఆది నుండి ఎదురుచూస్తూ ఉండిన సమయము ఆసన్నమైనది. ప్రవచనము ఇప్పుడు నెరవేర్చబడుచున్నది.

1963 ను దాటి అరవై సంవత్సరాలకు ముందు ఈ దినమును అనగా సెప్టెంబరు 2023 ను చూడటానికి, మన దినములో జరిగే ప్రతీదానిని చూచుటకు…ప్రపంచము ఉండే స్థితిని, స్త్రీల యొక్క అనైతికతను, సంఘము ఉన్నటువంటి స్థితిని, ప్రజల యొక్క పిచ్చితనమును; దుర్మార్గముగా, గ్రుడ్డిదై, దిగంబరియై, ప్రభుత్వము యొక్క శాఖలన్నిటిలోను ఉన్నటువంటి ఆ మహా వేశ్యను, రాజకీయములో కుళ్ళును చూచుటకు దేవుడు తన గొప్ప పక్షిరాజు వర్తమానికుడిని ఆకాశాములోనికి కొనిపోయాడు, మరియు అతడు సంభవించబోవువాటి గూర్చి మనలను హెచ్చరించాడు.

అది ఎలా ఉంటుందని అతడు మనకు చెప్పాడో సరిగ్గా అలాగే అది మన కన్నులయెదుట నెరవేరియుండుటను మనము ఇప్పుడు చూస్తున్నాము. ఈ సంగతులన్నియూ జరుగుటను చూసినది మనమే. ప్రతీది దాని స్థానములో ఉన్నది. అది మురికితో నిండిన ఒక పెద్ద కుండవలె అయిపోయినది.

ప్రపంచమంతయూ ఒక భయాందోళనతో ఉన్నది. ఏ నిరీక్షణయూ మిగిలిలేదని వారికి తెలుసు. రోజురోజుకి అది ఇంకా దరిద్రముగా మారుచున్నది. భూమిమీదంతట భయము వ్యాపించుచున్నది. ఆర్ధిక వ్యవస్థ కూలిపోయినది, కారణము లేకుండా హత్యలు జరుగుచున్నవి, స్త్రీలు పురుషులుగా ఉండగోరుచున్నారు, పురుషులు స్త్రీలుగా ఉండగోరుచున్నారు. ఏదైనను మరియు ప్రతీదియును అంగీకరించబడుచున్నది. ఏ క్షణములో ఏమి జరుగవచ్చునో గదా? అది ఒక అగ్ని పర్వతమువలె ఉన్నదని వారికి తెలుసు; అది ఏ క్షణములోనైనా పేలబోవుచున్నది. వారి ముఖములపైనను, వారి క్రియలలోను మీరు దానిని చూడవచ్చు, ఏ నిరీక్షణ లేదు, భయమేయున్నది.

క్రైస్తవులని-చెప్పుకునేవారు కూడా లింగ-మార్పిడి చేసుకున్నవారిని సంఘ కాపురులుగా, ప్రజల యొక్క ఆత్మీయ నాయకులుగా స్వీకరిస్తున్నారు. ఇది సొదొమ గొమొఱ్ఱా కంటెను దరిద్రముగా మారినది. సాతానుడు మరియు వాడి రాజ్యము ఐక్యమగుచు ఒక్కటైపోయినది. వాడు వాని లక్ష్యమును సాధించాడు.

అయితే దేవునికి మహిమ, ఈ గందరగోళము మరియు ఈ భయమంతటి మధ్య, తండ్రి, తన యొక్క ఎన్నుకోబడిన ప్రజల గుంపును మరియు తన యొక్క ప్రియ వధువునుయైన, మనలను తన చేతులలో భద్రముగా ఉంచాడు మరియు ముందెన్నడూ లేనంతగా ఆయనతో ఒక ఆత్మీయ ఐక్యతను మనము కలిగియుంటున్నాము. ఇది మన జీవితాలలో అతి గొప్ప ఘడియయైయున్నది. ఇది అద్భుతమైనది. ఇది మహిమకరమైనది. ఇది సహజాతీతమైనది. ఇది మనము వ్యక్తపరచగలిగే మాటలకు మించియున్నది.

మన శరీరము వాక్యమగుచున్నది, మరియు వాక్యము శరీరమగుచున్నది; వ్యక్తపరచబడుచున్నది, నిర్ధారించబడుచున్నది. ఈ దినమున ఏమి జరుగునని బైబిలు గ్రంథము చెప్పెనో, దినదినము, సరిగ్గా అదే జరుగుచున్నది.

కార్యములు, మనము వాటితో కొనసాగలేకపోయేంత వేగముగా జరుగుచు, నెరవేరుచున్నవి. మనము ఆయనతో ఐక్యమవ్వుటకు; మన ప్రభువైన యేసు యొక్క రాకడకు మనమెంతో సమీపమున ఉన్నాము, అక్కడ వాక్యము వాక్యముగా మారుతుంది.

మన చుట్టూ ఈ సంగతులన్నీ జరగడంతో, ఇంతకంటే సంతోషముగా, ఇంతకంటే సంతుష్టిగా లేదా ఇంతకంటే పరిపూర్ణ సంతృప్తితో మనము ఎన్నడూ లేము. మన హృదయములు మరియు అంతరాత్మలు చెప్పలేని ఆనందముతో మరియు మహిమతో నిండి ఉబుకుచున్నవి. ఇది ఒక నమ్మలేని నిజము.

ఆది నుండియే మనము దేవుని యొక్క కుమారుడిగా మరియు కుమార్తెగా ఉండుటకు, ఏర్పర్చబడ్డామని ఎరిగియుండి, మనము ముందెన్నడూ లేని విధంగా ఆదరణ పొందుచున్నాము.

మనము క్రీస్తు యొక్క రక్తములో కడుగబడిన, క్రీస్తు యొక్క పరిశుద్ధ వధువైయున్నాము. ప్రశస్తమైన, పరిశుద్ధమైన, పాపములేని దేవుని కుమారుడు, తన స్వంత రక్తపు నీటిలో తాను కడిగినటువంటి ఒక నిష్కలంకమైనదై, సంకరము లేని వాక్య-వధువుతో నిలబడియున్నాడు. కాలము ప్రారంభమవ్వుటకు ముందే, ఆయన వలెనే, మనము తండ్రి యొక్క రొమ్మున ఏర్పరచబడియున్నాము...మహిమ!! హల్లేలూయా!

మనము అది మాత్రమే కాదు గాని, అతి త్వరలో, ఏర్పరచబడినవారి యొక్క పెండ్లి ఉంగరమును ధరించుకొని, మనము ఆకాశములో ఆ వివాహములోనికి వెళ్ళుచున్నాము. ఆయన మనలను ఎరిగియున్నాడు…కేవలం దానిని ధ్యానించండి, జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మనలను ఎరిగియున్నాడు, కావున అక్కడే ఆయన మనకు ఆ పెండ్లి ఉంగరమును తొడిగి మరియు మన పేరును తన యొక్క నూతన గొర్రెపిల్ల జీవగ్రంథములో ఉంచాడు, క్షమించబడుట మాత్రమే కాదు గాని, నీతిమంతులుగా తీర్చబడియున్నాము.

దీనంతటినీ పొందుకోవడానికి ఒకే ఒక్క మార్గము కలదు, మీరు దేవుడు ఏర్పాటుచేసిన ఒకే ఒక్క మార్గము ద్వారా రావలసియున్నది. అసలైన వాక్యము ద్వారాయైయున్నది, ప్లే నొక్కండి.

మేము ఈ ప్రత్యక్షతను కలిగియున్నందుకు ఎంతో కృతజ్ఞులమైయున్నాము. అది మాకెంతో తేట తెల్లముగా ఉన్నది. రక్తమాంసములు దీనిని మాకు బయలుపరచలేదు, కానీ పరలోకమందున్న మా తండ్రి మాకు దీనిని బయలుపరిచాడు మరియు దానికై మేము ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నామో ఆయనకు వ్యక్తపరిచేందుకు మాటలు లేనేలేవు...అద్భుతమైన కృప.

పెదవి నుండి చెవికి అన్నంత సమీపముగా దేవుని యొక్క స్వరము మీతో మాట్లాడుటను వినుటకు మించినది మరేదియు లేదు. మన అంతరాత్మను నింపివేసే ఆనందము. ఆలోచించడమనేది లేదు, ఊహించడమనేది లేదు, లేదు, కనీసం నిరీక్షించడమనేది కూడా లేదు, అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అని, మనకు తెలియును. టేపు మీద తప్ప మరే స్థలములోను అటువంటి 100% నిశ్చయతను మీరు కలిగియుండలేరు.

మనము జీవించుచున్న దినమును గూర్చి, దేవుడు మాకు చెప్పడాన్ని మేము వింటుండగా, తన యొక్క గొప్ప పక్షిరాజు ప్రవక్త ద్వారా ఆయన మాట్లాడుచు మరియు ఈ వర్తమానమును మాకు ఇచ్చుచుండగా మీరును మాతో చేరవలెనని నేను మిమ్మల్ని ఆహ్వానించగోరుచున్నాను: ఆయన రాకడను సూచించే ప్రకాశించుచున్న ఎఱ్ఱని దీపము 63-0623E.

ప్రపంచవ్యాప్తంగా, జఫర్సన్ విల్ కాలమానము ప్రకారంగా 12:00 P.M గంటలకు., మేము కూడుకుంటాము. మీరు మాతో కలవలేనియెడల, మీరు ఎక్కడున్నా గాని, మీరు ఏమి చేస్తున్నా గాని, ప్లేను నొక్కి మరియు ఆ నిత్యజీవపు మాటలను వినండి.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

 


 

వర్తమానమును వినుటకు ముందు చదవాల్సిన లేఖనములు:

పరి. మత్తయి 5:28 / 22:20 / 24వ అధ్యాయము
2 తిమోతీ 4వ అధ్యాయము
యూదా 1:7
ఆదికాండము 6వ అధ్యాయము