ఆదివారం
03 మార్చి 2024
64-0705
కళాఖండము

ప్రియమైన మహోన్నత కళాఖండపు కుటుంబమా,

క్రీస్తుయొక్క వధువుకి ఈ చివరి వర్తమానములు ఎంత ఖచ్చితమైన సంపూర్ణతగా ఉన్నవి కదా. దేవుడు, మనయెదుట తనను తాను ముసుగు తొలగించుకొనుచు, తనను తాను తేటగా బయలుపరచుకొనుచున్నాడు. లోకము దానిని చూడలేదు, కానీ ఆయనయొక్క వధువైయున్న, మనకైతే, మనం చూడగలిగేది అదేయైయున్నది.

మనము ఆ ముసుగునుండి లోపలికి చొచ్చుకొని మరియు ఆయనను తేటగా చూచుచున్నాము. దేవుడు, మానవ చర్మముల వెనుక ఉన్నాడు. సరిగ్గా లూకా 17 మరియు మలాకి 4 లో ఆయన వాగ్దానము చేసినట్లు, వాక్యము శరీరమైనది. ఆయన తననుతాను ఒక మానవ ముసుగులో, తన ప్రవక్తలో మరియు తన సంఘములో దాచుకున్నాడు.

దేవుడు తన వర్తమానికుడైన దూత ద్వారా మాట్లాడి మరియు మనతో ఇట్లు చెప్పుటను మనం విన్నప్పుడు మనము ప్రపంచములో అత్యంత సంతోషకరమైన ప్రజలమైయున్నాము,

నేను మీ విషయమై ఎంతో కృతజ్ఞుడనైయున్నాను. నేను మీతో కలిసియున్నందుకు ఎంతగానో ఆనందిస్తున్నాను. నేను మీలో ఒకడినైయున్నందుకు ఎంతగానో ఆనందిస్తున్నాను. దేవుడు మీకు తోడైయుండును గాక. ఆయన తోడైయుంటాడు. ఆయన మిమ్మల్ని ఎన్నడూ విడువడు. ఆయన మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన మిమ్మల్ని విడువడు. మీరు ఇప్పుడు ఆ తెరను చీల్చుకొని వచ్చేసారు.

మనము అందరికీ, మన స్వంత ప్రజలకు కూడా వింత వ్యక్తులమయ్యాము, కానీ ఈ దినమునకైన ఆయనయొక్క వాక్యమును గూర్చి ఆయన మనకిచ్చిన ప్రత్యక్షతకై, మనము ఎంతో అతిశయము కలిగియున్నాము, ఎంతో కృతజ్ఞులమైయున్నాము. క్రీస్తు కొరకు మరియు ప్రత్యక్షపరచబడిన ఆయన వాక్యము కొరకు వెఱ్ఱివారిగా ఉండుటకు కృతజ్ఞులమైయున్నాము.

మనము మన విశ్వాసమును ఆయన ప్రవక్తయొక్క విశ్వాసముతో కలిపాము, మరియు ఏకముగా ఐక్యపరచబడి, దేవునియొక్క గొప్ప భాగముగా మారాము. మనము లేకుండా ఆయన ఏమియు చేయలేడు; ఆ ప్రవక్త లేకుండా మనము ఏమియు చేయలేము; దేవుడు లేకుండా కూడా మనము ఏమియు చేయలేము. కావున ఏకముగా కలిసి, మనము ఒక గొప్ప భాగమును చేయుచున్నాము, ఆ సంబంధము; దేవుడు, తన ప్రవక్త, తన వధువు. మనము ఆయనయొక్క మహోన్నత కళాఖండముగా మారినాము.

ఆయనయొక్క మొదటి మహోన్నత కళాఖండమును చేయుటకు ఆయనకు నాలుగువేల సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు, ఆయనయొక్క మరొక మహోన్నత కళాఖండమును చేయుటకు, అనగా మనలను, తన వధువును, ఆయనయొక్క గొప్ప మహోన్నత కళాఖండపు కుటుంబమును, రెండవ ఆదాము మరియు రెండవ హవ్వను చేయుటకు ఆయనకు రెండువేల సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మనము తోట కొరకు, వెయ్యేండ్లపాలన కొరకు సిద్ధముగా ఉన్నాము. ఆయన మరలా మనలను తయారు చేసాడు మరియు మనము సిద్ధంగా ఉన్నాము.

మనము ఆయనయొక్క పరిపూర్ణ వాక్య వధువైయున్నాము, ఆయనయొక్క అసలైన సృష్టిలో భాగమైయున్నాము. కాండము, వెన్నులు, మరియు పొట్టు, ఇప్పుడు గింజను లోపలికి తెచ్చుచున్నవి, పునరుత్థానము కొరకు సిద్ధంగా ఉన్నది, మరియు కోత కొరకు సిద్ధంగా ఉన్నది. ఆల్ఫా ఒమేగగా మారినది. లోపలికి వెళ్ళిన విత్తనము, ఒక ప్రక్రియగుండా వెళ్ళి మరియు మరలా విత్తనముగా వచ్చినది.

ఏదెను తోటలో పడిన, ఆ విత్తనము, అక్కడ చనిపోయి, తిరిగి వచ్చినది. అక్కడ చనిపోయిన ఆ అసంపూర్ణమైన విత్తనము, పరిపూర్ణమైన విత్తనముగా, రెండవ ఆదాముగా తిరిగి వచ్చినది.

ఇప్పుడు మనము రండవ ఆదాముగా, నిజమైన వధువుగా ఉన్నాము, మరలా అసలైన వాక్యముతో తిరిగి వచ్చిన విత్తనమైయున్నాము. మనము విత్తనమైయ్యుండుటకు వాక్యమంతటినీ కలిగియుండవలసియున్నాము. మనము సగం విత్తనమును కలిగియుండలేము, మనము ఎదగలేము, మనము సంపూర్ణ విత్తనముగా ఉండవలసియున్నాము.

ఒకేఒక్కటి మిగిలియున్నది, కోత వచ్చియున్నది. మనము ఎంతగానో పరిపక్వత చెందాము. మనము రాకడ కొరకు సిద్ధంగా ఉన్నాము. ఇది కోత కాలమైయున్నది. విత్తనము తిరిగి దానియొక్క అసలైన స్థితిలోనికి వచినది. మహోన్నత కళాఖండపు కుటుంబము మరలా వచ్చియున్నది, క్రీస్తు మరియు ఆయనయొక్క వధువు.

ఆయనయొక్క ప్రవక్తను మరియు ఆయనయొక్క వధువును ప్రోత్సహించడానికి, ప్రభువు తన దూతకు ఒక గొప్ప దర్శనమును ఇచ్చాడు. ఆయన అతనికి మనలను గూర్చిన, అనగా ఆయన వధువును గూర్చిన ఒక ముంగుర్తును ఇచ్చాడు. మనము ఆయన ప్రక్కనుండి వెళ్ళుచుండగా, మనము చక్కగా-కనబడుచున్న చిన్న స్త్రీలమైయున్నామని, ఆయన చెప్పాడు. మనము వెళ్ళుచుండగా మనము నేరుగా ఆయన వైపే చూస్తూ ఉన్నామని, ఆయన చెప్పాడు.

మరియు ఆఖరిలో, కొందరు వరుసలోనుండి బయటకు తోలిగారు, మరియు తిరిగి వరుసలోనికి రావడానికి తమ సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అప్పుడు ఆయన చాలా ప్రాముఖ్యమైన ఒక విషయమును గమనించాడు, వారు బయట ఇంకెటువైపుకో చూస్తున్నారు గాని, ఆయనను చూడటంలేదు. వారు గందరగోళములోనికి వెళ్ళిపోయిన ఆ సంఘమును గమనిస్తున్నారు. అది, ముందువరుసలోనున్న మనము కాదని చెప్పుటకు, నేను ఎంతో అతిశయపడుచున్నాను మరియు ఎంతో కృతజ్ఞుడనైయున్నాను, మనమెన్నడూ వరుసను దాటలేదు లేదా మన దృష్టిని ఆయన వైపునుండి మళ్ళించలేదు.

కావున, మహోన్నత కళాఖండము మరియు దేవుని కుమారుడు, మహోన్నత కళాఖండము మరియు వధువు, మరది ఆయనలో ఒక భాగమైయున్నది, అది దేవునియొక్క వాక్యమును నెరవేర్చవలసిందిగా ఉన్నది. వాక్యము నెరవేర్చబడినది, మరియు మనము ప్రభువుయొక్క రాకడ కొరకు సిద్ధంగా ఉన్నాము.

మనము ఆయనయొక్క మహోన్నత కళాఖండముల కుటుంబమైయున్నామని, ఆయనయొక్క నిజమైన వధువైయున్నామని తెలుసుకొనుటకు మనమెంత కృతజ్ఞులమైయున్నాము కదా. వాక్యము నెరవేర్చబడినది, మరియు మనము ప్రభువుయొక్క రాకడ కొరకు సిద్ధంగా ఉన్నాము.

ఈ ఆదివారము జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా 12:00 P.M., గంటల సమయమప్పుడు, ప్రవక్త మాకు: మహోన్నత కళాఖండము 64-0705 అనే వర్తమానమును అందించడాన్ని మేము వినుచుండగా మాతో చేరి, మాతోపాటు వాక్యమును విని, మరియు దేవునియొక్క గొప్ప మహోన్నత కళాఖండపు కుటుంబములో భాగమవ్వడానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

కూటమునకు ముందు చదువవలసిన లేఖనములు:

యెషయా 53:1-12
మలాకీ 3:6
పరిశుద్ధ. మత్తయి 24:24
పరిశుద్ధ. మార్కు 9:7
పరిశుద్ధ. యోహాను 12:24 / 14:19