ప్రియమైన పక్షిరాజు పిల్లలారా,
దేవుని యొక్క స్వరము మనము ముందెన్నడూ వెళ్ళనంత ఎత్తుకి మనల్ని తీసుకొనివెళ్ళి, మరియు ఆయన వాక్యమును బయలుపరుచుచున్నది. ఆయన మనల్ని ఆకాశంలో ఎంతో ఎత్తుకు తీసుకువెళ్తుండగా మనము ఆయన బలమైన రెక్కలలోనికి మన ముక్కులను గుచ్చియుంచాము. మనము ఆ నీలాకాశంలో కారుమబ్బులకు పైగా ఎగురుచున్నాము. మనము నిత్యత్వములోనికి చూడగలుగుచున్నాము. అది మనకు పూర్తిగా ఒక నూతన ప్రత్యక్షతయైయున్నది. ఆయన మనల్ని ఎత్తుకు తీసుకువెళ్తున్నాకొద్దీ, అది అంత స్పష్టమౌతూ ఉంటుంది. మనము ఇట్లు కేకలు వేస్తాము: దానిని చూస్తున్నాను...నేను దానిని చూస్తున్నాను.
ఆయన ఇప్పుడు తన బలమైన రెక్కలను తీసుకొని, వాటిని గట్టిగా ఊపి మరియు మనతో ఇట్లు చెప్పాడు, “ఎగరండి, నా చిన్న పిల్లలారా ఎగరండి.” ప్రారంభంలో మనము ఎంతగానో భయపడ్డాము. శత్రువు మన మెదడులను అనేక సందేహాలతో నింపుతుండేవాడు. నేను చెయ్యలేను, నేను అస్సలు చెయ్యలేను. పిదప ఆయన తిరిగి మనకు కేకవేసి మరియు ఇట్లు ఉరుముటను మనము విన్నాము, “మీరు ఎగరగలరు, మీరు నా పక్షిరాజులు, కేవలం మీ రెక్కలను ఆడించడం మొదలుపెట్టండి!!”
అప్పుడు, ఒక్కసారిగా మన చిన్న రెక్కలు వాటంతట అవే రెపరెపలాడటం మొదలైనది. మనము ఎవరమన్నదాని గూర్చి మరియు ఏమి చేయవలెనన్నదాని గూర్చి ఆయన వాక్యము నిశ్చయతను ఇచ్చుటను మనము వింటున్నాకొద్దీ, మన రెక్కలు అంతకంతకు బలపడినవి. రెపరెప, రెపరెప, రెపరెప....ప్లే నొక్కు, ప్లే నొక్కు, ప్లే నొక్కు... పిదప ఉన్నట్టుండి, మనము ఎగురుచున్నాము. మనము పక్షిరాజులము.
ఏదైనా ఒక చిన్న భయం మన మనస్సులలోనికి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు, మనము కేవలం వెతికి మరియు ఆయన స్వరమును వినడం మొదలుపెట్టాము. అక్కడే ఆయన ఉన్నాడు, ఒకవేళ మనము పడిపోతుంటే మనల్ని పట్టుకోడానికి మన ప్రక్కనే ఎగురుతూ ఉన్నాడు. మనము దేనికీ భయపడాల్సిన అవసరం లేదని మనము గ్రహించాము, తండ్రి పక్షిరాజు సరిగ్గా మనతోనే ఉన్నాడు. మనము చేసే ప్రతీ కదలికను ఆయన గమనిస్తున్నాడు. ఆయన మనకు ఏమీ జరగనివ్వడు.
మనము ముందెన్నడూ అనుభవించనటువంటి ఒక స్వేచ్ఛ మరియు నిశ్చయత. మీరు నా పక్షిరాజులు, అని ఆయన మనకు చెప్తూనే ఉంటాడు. నేను మీ కొరకు విడిచిపెట్టిన స్వరముతో నిలిచియుండుట ద్వారా మీరు విధేయులై మరియు సరిగ్గా నేను మీకు చేయమని చెప్పిన దానినే చేస్తున్నారు.
టేపులపై ఆయన మనకు దేనినైనా చెప్పినప్పుడు, అది ఆయన యొక్క మాట అని మనము ఎరిగియున్నాము గనుక, మనము వెళ్ళి దానిని చేస్తామని ఆయనకు తెలియును. ఆయన సరిగ్గా దాని వెనుక నిలబడతాడు. అది బైబిలు గ్రంథములో వ్రాయబడనప్పటికిని, ఎలాగైనా, ఆయన దాని పక్షమున నిలబడతాడు.
అది దానికి వెలుపటనున్నయెడల, ఆయన దానిని తన ప్రవక్తకు బయలుపరుస్తాడని, మనకు తెలియును. దేవుని యొక్క సమస్త మర్మములు తన ప్రవక్తకు, మరియు అతనికి మాత్రమే తెలియజేయబడినవని మనము గ్రహించాము, కావున మనము తెలుసుకోవలిసినది ఏదైనా, అది టేపుపైనున్నది.
ఉత్తేజమును కలుగజేసే ప్రత్యక్షత యొక్క శక్తిని గూర్చి మాట్లాడండి. దానిని మనము గట్టిగా గొంతెత్తి కేకవేయగోరుచున్నాము. లోకము ఇట్లు తెలుసుకోవాలని మనము కోరుచున్నాము, నేనొక టేపు పక్షిరాజును!
దేవుని తలంపులు, ఒక మాట ద్వారా పలుకబడినప్పుడు అవి సృష్టిగా మారతాయి. అది, ఆయన తన తలంపును, ఒక తలంపుగా మీకు—మీకు ప్రదర్శించినప్పుడైయున్నది, మరియు అది మీకు బయలుపరచబడియున్నది. అప్పుడు, మీరు దానిని పలికేంత వరకు అది ఇంకనూ ఒక తలంపైయున్నది.
అది మనకు బయలుపరచబడినది. మహిమ. ఇప్పుడు మనము దానిని పలుకగోరుచున్నాము. మనము యేసుక్రీస్తు యొక్క వధువైయున్నాము. ఆయన నన్ను ఎరిగియున్నాడు, జగత్తు పునాది వేయబడకముందే నన్ను ఏర్పరచుకున్నాడు. నేను శరీరధారియైన ఆయన యొక్క సజీవ వాక్యమునైయున్నాను. అడుగుడి మరియు మీకియ్యబడును అని ఆయన నాతో చెప్పాడు. తట్టుడి, తీయబడును. మనకు అవసరమున్న ఏదైనా, మనము దానిని పలుకుతాము.
ఇది పక్షిరాజు కాలము మరియు మనం ఆయన యొక్క పక్షిరాజులమైయున్నాము. మనము మన జీవితములో ఇంతకంటే సంతోషముగా లేదా సంతృప్తిగా ఎప్పుడూ లేము. ఏ భయము లేదు. ఏ చింత లేదు.
మీరు వచ్చి ఈ ఆదివారము జఫర్సన్ విల్ కాలమానం ప్రకారం, 12:00 P.M., గంటలప్పుడు మాతో కలిసి నూతన ఎత్తులకు ఎగరవలెనని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, దేవునియొక్క బలమైన పక్షిరాజు కేకవేయుచూ మనకు దీనిని బయలుపరచునప్పుడైయున్నది నాలుగవ ముద్ర 63-0321.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
ఈ ప్రసంగమును వినడానికి సిద్ధపడుటకు చదవాల్సిన లేఖనములు నాలుగవ ముద్ర 63-0321.
పరిశుద్ధ. మత్తయి 4
పరిశుద్ధ. లూకా 24:49
పరిశుద్ధ. యోహాను 6:63
అపొస్తలుల కార్యములు 2:38
ప్రకటన 2:18-23, 6:7-8, 10:1-7, 12:13, 13:1-14, 16:12-16, 19:15-17
ఆదికాండము 1:1
కీర్తనలు 16:8-11
II సమూయేలు 6:14
యిర్మీయా 32
యోవేలు 2:28
ఆమోసు 3:7
మలాకీ 4
ప్రసంగ తర్జుమాలు
సంబంధిత కూడికలు
ప్రియమైన ఉత్తేజపరచబడిన వధువా,
సిద్ధపడండి, ఈ ఆదివారము మీ జీవితంలో మీరు మునుపెన్నడూ పొందనంత ఉత్తేజమును ప్రత్యక్షత ద్వారా పొందుకొనబోవుచున్నారు. మీరు కేవలం వాక్యముతో మత్తులగుతారు. అది ఎంతో మంచిగా, మరియు తేటగా...మరియు ఆయన దానిని మట్లాడినప్పటి కంటెను ఇంకా స్పష్టంగా ఉంటుంది. మరియు దానిని పొందుకోడానికి ఒకే ఒక్క మార్గము ఉన్నది, మీరు చేయవలసిందల్లా ప్లే అనుదానిని నొక్కడమే!
ఆ టేపులను పొందుకోండి, వాటిని చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకనగా, మీరు దానిని టేపులో పొందుకుంటారు,ఎందుకనగా వారు ఆ టేపులను మరలా ప్లే చేయుచున్నారు, మరియు అవి ఎంతో మంచిగాను మరియు ఎంతో తేటగాను ఉన్నవి. కావున, మీరు వాటిని అక్కడ ఇంకా తేటగా పొందుకుంటారు.
దేవుని యొక్క ఏడవ దూత వర్తమానికుడు ఇప్పుడే ఏమి చెప్పాడు? అతడు బైబిలు గ్రంథములోని మర్మములన్నిటిని బయలుపరచుటకు దేవుడు ఎన్నుకొనినవాడు; ఏడు ముద్రలు, ఏడు ఉరుములు, మరియు తన వాక్యమంతటి యొక్క ప్రత్యక్షతను ఇచ్చుటకు ఆయన చేత ఎన్నుకొనబడినవాడు. ఆయన యొక్క వధువును బయటకు పిలచుటకు ఆయన ఎన్నుకొనిన దూత. అంత్య దినములలో ఆయన యొక్క స్వరముగా ఉండుటకు ఆయన చేత ఎన్నుకొనబడినవాడు.
మనము ఏమి చేయవలెనని ఆయన చెప్పాడో దానిని మనము గ్రహించులాగున కేవలం మరొక్కసారి ఆ కొటేషన్ ను మనము చదువుదాము.
“మీరు దానిని పొందుకుంటారు”, ఎక్కడ?
“మీరు దానిని ఇంకా తేటగా పొందుకుంటారు”, ఎక్కడ?
దీని గూర్చి అనగా ప్లే బటన్ ను నొక్కిPress Play మరియు ఆ టేపులను వినడము యొక్క ప్రాముఖ్యతను గూర్చి మాట్లాడండి. మహిమ!! ఇది నా మాట కాదు, ఇది, దానిని అక్కడ...ఆ టేపులపై పొందుకోండి అని తన వధువుతో చెప్పుచున్న దేవుని యొక్క మాటయైయున్నది. బోధకులారా, నన్ను విమర్శించడం ఆపివేయండి.
ఈ వర్తమానమును నమ్ముచున్నామని చెప్పుకొను ఎవరైనా, టేపులను ప్లే చేయడమనేది వధువు చేయగల గొప్ప విషయము కాదని ఎలా చెప్పగలరు? ఒక సంఘకాపరి ప్రవక్త పరిచర్యకు పైగా తన పరిచర్యను ఎలా హెచ్చించుకోగలడు? కేవలం దానిని చెప్పడానికి కాదు...సరిగ్గా ఇప్పుడు నేను దానిని చేయుచున్నాను, అయితే వారు దానిని “అక్కడ ఇంకా తేటగా పొందుకొనుటకు” ఆ స్వరమును ఆయన పిల్లలకు ప్లే చేయుటకైయున్నది.
ప్రపంచములో ఉన్న అత్యంత గొప్ప పరిచర్య టేపు పరిచర్యయైయున్నది. దీని కంటే గోప్పదేదియు లేదు అనగా ప్లే ను నొక్కుట కంటే గొప్పది లేదు. ఆయన యొక్క వధువుకు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు గా ఉండుటకు దేవుని చేత అభిషేకించబడిన ఒకే ఒక్క స్వరము కలదు, అది టేపులపై ఉన్న స్వరము.
మరొక్కసారి నన్ను తేటగా చెప్పనివ్వండి. ఒక సేవకుడు ప్రసంగించుటకు నేను వ్యతిరేకిని కాను, లేదా ఒక సేవకుడు బోధించకూడదని లేక ఉపదేశించకూడదని నేను భావించడంలేదు. కాని నా మట్టుకు మరియు నా పరిచర్య మట్టుకైతే, రికార్డు చేయబడి మరియు అయస్కాంత టేపుపై స్టోర్ చేయబడిన, శరీరధారియైన వాక్యమును వినమని లోకముకు చెప్పుటకే నేను పిలువబడ్డాను. అది దేవుని యొక్క స్వరమని నేను నమ్ముచున్నాను, మరియు అది, మరియు అది మాత్రమే, మీ ప్రశ్నలన్నిటికీ జవాబునిస్తుంది. ఎత్తబడు విశ్వాసముతోసహా, మీకు అవసరమైన ప్రతిదానిని అది మీకు ఇస్తుంది, ఏలయనగా అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యున్నది.
వధువుకు నా మాట అవసరం లేదు, ఇతర సేవకులందరి వలెనే నేను కేవలం వాక్యమును కోట్ చేస్తున్నాను. మీరు కోట్ చేసి మరియు మీ పరిచర్యను మరియు మీ పిలుపును వినడం ఎంత ముఖ్యమో చెప్తారు, ప్రభువునకు స్తోత్రం. అయితే అత్యంత ప్రాముఖ్యమైన పరిచర్య, టేపు పై ఉన్న దేవుని యొక్క స్వరమే అని నేను ప్రజలకు చెప్పుచున్నాను. దానికంటే గొప్పది ఏదియు లేదు. వారు మరిదేనిని కలిగియుండనక్కర్లేదు.
ఏ సేవకుని పట్లయైన లేదా ఏ పరిచర్య పట్లయైన ప్రజలు తప్పుడు ఆత్మను లేదా తప్పుడు ఉద్దేశ్యమును కలిగియుండాలని నేను ఈ సంగతులు చెప్పడంలేదు, దేవుడు దానిని దూరపరచును గాక. నేను వారిని ప్రేమిస్తున్నాను. వారు నా సహోదరులు. దేవుడు వారి జీవితములలో ఒక పిలుపును పెట్టాడు. దేవుడు అభిషేకించిన మనుషులకు వ్యతిరేకంగా మాట్లాడుటకు నేను ధైర్యము చేయను, అయితే వధువు వినవలసిన అత్యంత ప్రాముఖ్యమైన స్వరముగా టేపుపై ఉన్న దేవుని యొక్క స్వరమును ఉంచకుండా అనేకులు తమ స్వంత పరిచర్యకే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారని చెప్పుటకు నేను బలవంతపెట్టబడుచున్నాను.
నేను కేవలం, “సహోదరుడు బ్రెన్హామ్ ను తిరిగి మీ ప్రసంగ వేదికలపై ఉంచండి,” అని చెప్పాను మరియు చాలామంది సేవకులు సహోదరుడు బ్రెన్హామ్ దానిని టేపుపై ఎన్నడూ చెప్పలేదని, మరియు వారు వాక్యమును తీసుకొని మరియు దానిని ప్రజలకు ఇవ్వడానికి పిలువబడ్డారని తమ ప్రజలకు చెప్పడం ప్రారంభించారు; వారి సంఘములలో టేపులు ప్లే చేయకుండా ఉండేందుకు సాకులను చెప్పుచున్నారు.
ఒక సంఘ కాపరి తన సంఘములో టేపులను ప్లే చేయడం తప్పు అని వారంటారు, వారి సంఘములలో, వారి పరిచర్యను కాకుండా కేవలం టేపులను వినుచున్నయెడల, వారు వధువు కాదని చెప్తూ, ప్రజలను విమర్శిస్తారు.
వారు ఉపయోగించి మరియు ప్రజలకు చెప్పే అనేక సాకులను నేను విన్నాను. “మీరు వినవలసిన అత్యంత ప్రాముఖ్యమైనవి టేపులు,” అని వారు అసలు వారి ప్రజలకు చెప్పరు. వారు అట్లు చేసినయెడల, అప్పుడు ప్రజలు వారిని ఇట్లడుగుతారు… “అది అత్యంత ప్రాముఖ్యమైనయెడల మరప్పుడు ఎందుకని మనము మన సంఘములో టేపులను ప్లే చేయకూడదు?”
ఆదివారము మనము వినబోవుచున్నది ఇదే:
దేవుడు మానవుడిలో తననుతాను ప్రత్యక్షపరచుకున్నాడు, మరియు ఆయన వెనుక ఎవరు ఉన్నారో; మరియు ఆ గుడారము లోపల శారా నవ్వుతూ, ఏమి చేసినదో చెప్పాడు. మరియు మలాకీ, మరియు మొదలగు వాటి యొక్క, ఈ లేఖనములన్నియు, అంత్య దినమునకై ముందుగా చెప్పబడినవి. హెబ్రీ 4 ఇట్లు చెప్పెను, ఆ “వాక్యము” తిరిగి వచ్చినప్పుడు. మలాకీ 4 ఇట్లు చెప్పెను అది ఒక మనుష్యుని ద్వారా తిరిగి వస్తుంది.
ఆ వాక్యము ఒక మనుష్యుని ద్వారా తిరిగి వచ్చినది మరియు మేము ఆయన స్వరమును టేపుపై రికార్డు చేసియున్నాము మరియు దానిని మేము ప్రతీ ఆదివారము వినబోవుచున్నాము.
మరొకసారి దీనిని ప్రకటించుటకు నేను ఆనందిస్తున్నాను, ఈ ఆదివారం 12:00 P.M గంటలకు., జఫర్సన్ విల్ కాలమానము, అయస్కాంత టేపుపై రికార్డు చేయబడిన శరీరధారియైన వాక్యమును మేము వింటాము. అది మాకు దీనిపై ప్రత్యక్షతను ఇస్తుంది: మూడవ ముద్ర 63-0320.
వధువా, మనము ఎటువంటి ఒక సమయమును కలిగియుంటాము. ఎటువంటి సంతోషము మన హృదయాలలో నింపబడుతుంది గదా. “వారిని విడిచిపెట్టుము. ఆయన స్వచ్చమైన వాక్యము యొక్క నూనెతో మరియు ద్రాక్షారసముతో నింపబడిన నా చిన్న మంద, వారిలో ఒక్కరినైనా నీవు పట్టుకున్నయెడల, ‘ధన్య మరియ’, అని గాని లేదా నీ సిద్ధాంతాలలో దేనినైనా గాని పలుకునట్లు వారిని బలవంతపెట్టకుము. వారి నుండి దూరముగా పొమ్ము. వారు ఎక్కడికి వెళ్ళుచున్నారు వారికి తెలియును, ఏలయనగా వారు నా నూనెతో అభిషేకించబడి మరియు ఆనందమనే ద్రాక్షారసమును కలిగియున్నారు, ఎందుకనగా వారు నా వాగ్దాన వాక్యమును ఎరిగియున్నారు. ‘నేను వారిని మరలా లేపబోవుచున్నాను.’ దానిని గాయపరచవద్దు! వారితో ఆటలాడుటకు ప్రయత్నించవద్దు…కేవలం వారికి దూరముగా ఉండుము,” అని స్వయంగా దేవుడే సాతనుతో చెప్పుటను మనము వినుచుండగా: అది మన ఆత్మలకు ఎటువంటి శాంతిని అనుగ్రహించును కదా.
మనము దేనికి భయపడవలసిన అవసరంలేదు. మనము వాక్యమును కలిగియున్నాము. మనమే వాక్యమైయున్నాము. మనము దేని కొరకునూ ఆగము. మనము దేవుని కుమారులము మరియు కుమార్తెలమైయున్నాము. సాతానా, ఇచ్చివేయుము, ప్రతీది మాకు చెందియున్నది. దేవుడు అట్లు చెప్పెను. అది వ్రాయబడియున్నది!
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
వర్తమానము వినుటకు ముందు చదవవలసిన లేఖనములు:
పరిశుద్ధ. మత్తయి 25:3-4
పరిశుద్ధ. యోహాను 1:1, 1:14, 14:12, 17:17
అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము
I తిమోతీ 3:16
హెబ్రీ 4:12, 13:8
I యోహాను 5:7
లేవీకాండము 8:12
యిర్మీయా 32వ అధ్యాయము
యోవేలు 2:28
జకర్య 4:12
సంబంధిత కూడికలు
ప్రియమైన వధువా,
1933 లో ఆ దినమున ఓహియో నదిపైన ఆ అగ్నిస్తంభము ప్రత్యక్షమైనప్పుటినుండి, ఈ వర్తమానము గూర్చియైనా లేదా దాని వర్తమానికుని గూర్చియైనా వధువు ఆశ్చర్యపోలేదు. ఆయన యొక్క వధువును పిలవడానికి విలియం మారియన్ బ్రాన్హామ్ భూమి మీదకి పంపబడిన దేవుని యొక్క శక్తివంతమైన 7వ వర్తమానికుడైన దూత అని మనము ఎరిగియున్నాము.
ఆ దినము నుండి, దేవుడు ఆయన రాకడ కొరకు తన వధువును సమకూర్చుచున్నాడు. ఇప్పుడు అది ఏ దినమైనా కావచ్చునని మనము ఎరిగియున్నాము గనుక; మనము చాలా గొప్ప ఎదురుచూపుతో ఉన్నాము.
మునుపెన్నడూ లేని విధంగా, ఆయన మన విశ్వాసమును కట్టుచున్నాడు, మనము ఆయన యొక్క విశ్వసనీయమైన వధువు అని మనకు చెప్పుచూ, మరలా మనకు నిశ్చయతను ఇచ్చుచున్నాడు. ఆయన యొక్క దాచబడిన-ఆహారముతో నిలిచియుండుటను బట్టి, మనకు ఏది అవసరమైనా గానీ, అది అక్కడ టేపులపై ఉన్నదని మనము ఎరిగియున్నాము.
అది ఖచ్చితంగా మనకు ఎలా తెలుసు? దేవుడు తన దాసులగు ప్రవక్తలకు బయలుపరచకుండా ఏమియు చేయడని వాక్యము చెప్పుచున్నది. కావున దేవుడు ఏదైనా బయలుపరచబోవుచున్న యెడల, లేదా ఏదైనా చేయబోవుచున్న యెడల, మనకు ఎత్తబడు విశ్వాసమును ఇవ్వబోవుచున్న యెడల, ఆయన మన ప్రవక్త ద్వారా, మరియు తన ప్రవక్త ద్వారా మాత్రమే దానిని ఉరమబోవుచున్నాడని మనము ఎరిగియున్నాము.
ఆశ్చర్యపోయే రోజులు గతించిపోయినవి. వధువు ఒక తీర్మానము తీసుకున్నది. టేపుల ద్వారా దేవుడు తన వధువుతో మాట్లాడుటను వినుటకంటె ప్రాముఖ్యమైనది ఏదియు లేదు. ఆ మాటలు మాత్రమే యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యున్నవని స్వయంగా దేవునిచేత నిర్ధారించబడినవి.
సమయము అయిపోయినది మరియు మన శత్రువు యొక్క చెడ్డశ్వాస యొక్క భారాన్ని మనము మన చుట్టూ స్పర్శించగలుగుచున్నాము. పోరాటములు వరుసగా ఉన్నవి మరియు సాతానుడు అన్ని వైపులా నుండి దాడి చేయుచున్నాడు, అయితే దేవునికి స్తోత్రములు మనము ఆత్మీయ ఆహారమును కలిగియున్నాము, మరియు మనము రాత్రింబవళ్ళు యజమానుని బల్ల వద్ద కూర్చుని, ఆ దాచబడిన మన్నాపై పోషించబడుచున్నాము. ఆయన అనుదినము అత్యధికముగా మనకు బయలుపరచుకొనుచు ఇట్లు చెప్పుచున్నాడు, “నా ప్రియా అంతా క్షేమమే. నేను నీతో ఉన్నాను. నేను నిన్ను ఎన్నడూ విడువను మరియు ఎడబాయను అని నేను నీతో చెప్పియున్నాను. కొనసాగుతూనే ఉండుము. ఆ దయ్యములను వెళ్ళగొట్టుము. నేను నీకు, నా వాక్యము అనే అణుబాంబును ఇచ్చియున్నాను, దానిని ఉపయోగించుము. నేను దానిని తలంచాను. పిదప అది వ్రాయబడినది, మరియు ఇప్పుడు, నీ దినములో, నేను నీకు ఇట్లు చెప్పుటను నీవు వినగలుగునట్లు నేను దానిని మాట్లాడాను, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు నా వధువైయున్నావు. నీవు శరీరధారియైన వాక్యమైయున్నావు.”
దేవుడు మానవ పెదవుల ద్వారా మాట్లాడి మరియు తన వాక్యమును మనకు ఇచ్చాడు; మనము దేనికీ భయపడాల్సిన అవసరం లేదు. అది మన వాక్యము, మన తలంపులు, మన ఊహా కాదు, అది దేవుడు మనకిచ్చిన తన వాక్యమైయున్నది. మన విశ్వాసము ఆయన వాక్యములో ఉన్నది మరియు ఆయన వాక్యము ఎన్నడూ విఫలమవ్వదు!
ఇప్పుడు, ఈ ముద్రలు తెరవబడుటను మనము వినుచుండగా, పరిశుద్ధాత్మ మరొక్కసారి మనతో మాట్లాడుచున్నాడు మరియు అక్కడ గొర్రెపిల్ల జీవ గ్రంథములో మన పేర్లు వ్రాయబడియుండుటను మనము చూడగలుగుచున్నాము. మనము ఊరకయుండలేకున్నాము...అవును, అక్కడ వ్రాయబడినది నా పేరే. ఆయన నా గురించియే మాట్లాడుచున్నాడు.
ఈ ఆదివారం జఫర్సన్ విల్ కాలమానము 12:00 P.M గంటలప్పుడు., మాతోపాటు కూడుకొనండి, మరియు మీ పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథములో వ్రాయబడినవని దేవుని యొక్క స్వరము మీతో చెప్పుచుండగా రెండవ ముద్రను 63-0319, వినండి.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
వర్తమానము వినుటకుముందు చదవాల్సిన లేఖనములు:
పరిశుద్ధ. మత్తయి 4:8 / 11:25-26 / 24:6
పరిశుద్ధ. మార్కు 16:16
పరిశుద్ధ. యోహాను 14:12
2వ థెస్సలోనిక 2:3
హెబ్రీ పత్రిక 4:12
ప్రకటన 2:6 / 6:3-4 / 17వ అధ్యాయము / 19:11-16
యోవేలు 2:25
ఆమోసు 3:6-7
సంబంధిత కూడికలు
ప్రియులారా...నేను మిమ్మల్ని పెండ్లి కుమార్తె అని పిలువబోవుచున్నాను,
గొప్ప సృష్టికర్త, ఆల్ఫా మరియు ఒమేగా, లోయలోని పద్మము, షారోను పుష్పము, ప్రకాశమానమైన వేకువ చుక్క, తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్ధాత్మ, అగ్నిస్తంభము, అయిన దేవుడు, స్వయంగా దేవుడే, భూమి మీదకు వచ్చి మరియు మానవ పెదవుల ద్వారా మనతో మాట్లాడెను, మహిమ!, దానిని అయస్కాంత టేపుపై ఉంచెను, తద్వారాఆయన మిమ్మల్ని...“మిమ్మల్ని” తన పెండ్లి కుమార్తెఅని పిలుచుటను మీరు వినగలుగుటకైయున్నది.
నా స్నేహితులారా దానిని ఊహించండి. మన ప్రభువైన యేసు క్రీస్తు, మిమ్మల్ని కళ్ళలోనికి చూస్తూ మరియు మీతో ఇట్లు చెప్పుటను ఊహించండి: “నీవు నా పెండ్లి కుమార్తెవు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను ఎంతో కాలంగా నీ కొరకు వేచియున్నాను. నాకైతే, నీవు పరిపూర్ణమైనదానవు. నీవు నా మాంసములో మాంసము, నా ఎముకలో ఎముకవైయున్నావు. నేను భూమినైనా లేదా నక్షత్రాలనైనా చేయకముందే నేను నిన్ను ఎన్నుకొనియున్నాను. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. మనము కలిసి నిత్యత్వమును గడిపెదము. ఇప్పుడు, నేను నీ కొరకు వచ్చుచున్నాను.”
అదియే మనలో ప్రతీయొక్కరికి ఎత్తబడు విశ్వాసమును ఇవ్వవలసియున్నది. మీకు హాని కలుగునట్లు, దయ్యము మీ మీదకు ఏమి విసరగలదు, ఏమి చెప్పగలదు, ఏమి ఉంచగలదు? ఏదియు లేదు, మీరు క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెయైయున్నారు! మీరు శరీరధారియైన ఆయన వాక్యమైయున్నారు, మీరు శ్రీమతి. యేసు క్రీస్తు.
అది మనకు ఎంత విలువైనదో, ఎవరైనా, ఏ భాషలోనైనా వ్రాసి మరియు ఎలా వ్యక్తపరచగలరు? మీరసలు అలా చేయలేరు.
మీకు సరియైన ప్రత్యక్షత మరియు ప్రెస్ ప్లే లేకుండా ఈ మాటలను వినే భాగ్యమును మరియు ఘనతను మీరు కలిగియుండే చోటు ప్రపంచములో ఎక్కడా లేదు.
కాలము ఆరంభమైనది మొదలుకొని లోకము ఎదురుచూస్తున్న ఆ గొప్ప సంఘటనలు, సరిగ్గా ఇప్పుడు జరుగుచున్నవి, మరియు మనము అందులో భాగమైయున్నాము. మీరు ఆయనయొక్క గొప్ప ప్రణాళికను నెరవేర్చి మరియు దానిని అమలు చేయడానికి, ఈ దినము కొరకు, ఈ ఘడియ కొరకు, ఈ ప్రజల కొరకు; అనగా మీ కొరకు, ఆయన వేచియున్నాడు.
ఏడు ముద్రల మర్మము యొక్క ప్రత్యక్షత, ఉరుములు ప్రత్యక్షపరచబడుట, మన పరిపూర్ణత, పూర్తిగా పునరుద్ధరించబడిన ఆయన యొక్క ఆదాము, ఆయన యొక్క రాకడ, ఈ కార్యములన్నియు, ఆయన యొక్క పెండ్లి కుమార్తెయైన మీలో, ఇప్పుడు కార్యరూపణ దాల్చుకొని మరియు నెరవేరుచున్నవి!
మోషే దినములలో కాదు. నోవహు దినములలో కాదు. యేసు దినములలో కాదు, యోహాను లేదా పౌలు దినములలో కూడా కాదు; అది ఇప్పుడే, సరిగ్గా ఇప్పుడే, మీతో జరుగుచున్నది.
మనము దానిని తప్పిపోగోరుటలేదు. మనము ఆయన యొక్క రాకడకై సిద్ధంగా ఉండగోరుచున్నాము. దానిని చేయుటకు, మన జవాబులకై వాక్యమునొద్దకు వెళ్ళవలెనని మనకు ఆజ్ఞాపించబడినది. నా ఆలోచన కాదు, లేదా ఎవరో ఒక మనుష్యుని ఆలోచన లేదా తలంపులు కాదు గాని, దేవుని యొక్క నిర్ధారించబడిన వాక్యము ఏమి చెప్తుందో అదేయైయున్నది.
పెండ్లి కుమార్తె ప్రతీ వాక్యమునకు “ఆమేన్” అని చెప్పి మరియు ఒక్కటిగా ఐక్యమై ఉండవలసియున్నదని మనము ఎరిగియున్నాము. కావున పెండ్లి కుమార్తెను ఐక్యపరిచేది ఏమిటని చూచుటకు మనము దేవుని యొక్క వాక్యములోనికి చూడవలసియున్నది.
మరియు పిదప అసలు వ్రాయబడనటువంటి ఏడు మర్మయుక్తమైన ఉరుములు వచ్చును. అది నిజము. మరియు, ఎత్తబడు విశ్వాసము కొరకు పెండ్లి కుమార్తెను సమకూర్చడానికి, ఈ చివరి దినములలో ఆ ఏడు ఉరుములు ప్రత్యక్షపరచబడునని నేను నమ్ముచున్నాను.
అది సరిగ్గా అక్కడ వాక్యములోనే ఉన్నది. ఎత్తబడు విశ్వాసము కొరకు పెండ్లి కుమార్తెను సమకూర్చడానికి మన దినములలో ఆ ఏడు ఉరుములు ప్రత్యక్షపరచబడును.
పిదప మనము తెలుసుకోవలసిన తదుపరి ప్రశ్న ఎదనగా: ఉరుములు అనగా ఏమిటి?
ఎప్పుడైతే, “ఉరిమినదో.” గుర్తుంచుకోండి, ఒక ఉరుము యొక్క పెద్ద చప్పట్లవంటి శబ్ధము దేవుని యొక్క స్వరమైయున్నది. బైబిలు దానినే చెప్పుచున్నది, చూడండి, “ఒక ఉరుము యొక్క ధ్వని.” అది ఒక ఉరుము అని వారు అనుకున్నారు, కాని అది దేవుడైయుండెను. ఆయన దానిని గ్రహించాడు, ఏలయనగా అది ఆయనకు బయలుపరచబడినది. చూశారా? అది ఒక ఉరుము.
కావున ఉరుములు అనేవి పెండ్లి కుమార్తెను సమకూర్చి మరియు వారికి (మనకు) ఎత్తబడు విశ్వాసమును అనుగ్రహించే దేవుని యొక్క స్వరమైయున్నది. అదే మన జవాబైయున్నది.
పెండ్లి కుమార్తెకు దేవుని యొక్క స్వరము ఎవరు? విలియమ్ మారియన్ బ్రెన్హామ్.
ఇప్పుడు, దేవుని యొక్క కృపను బట్టి, నేను కేవలం మీ సహోదరుడను, అయితే ప్రభువు యొక్క దూత క్రిందకు దిగివచ్చినప్పుడు, అప్పుడు అది, మీకు, దేవుని యొక్క స్వరము అవుతుంది…నా అంతట నేను ఏదియు మీకు చెప్పలేను, అయితే ఆయన నాకు దేనిని చూపించునో, దానినే నేను చెప్తాను. మీరు దానిని నమ్మి మరియు ఏమి జరుగుతుందో గమనించండి.
మనము కూడుకొని, ఆయన తన పెండ్లి కుమార్తెకు ఉరుముటను వినుచూ, ఎత్తబడు విశ్వాసమును పొందుకొనుచుండగా, ఈ ఆదివారము దానిని నమ్మి ఏమి జరుగుతుందో మరియు ఏమి సంభవిస్తుందో గమనించండి.
“ఇప్పుడు పరలోక స్థలములలో కూర్చొనుటను” గూర్చి మాట్లాడుతారా? అది ఏమైయుంటుంది గదా! ఎత్తబడుటకు ముందు, మనము ఇప్పుడున్న ఈ పరిస్థితిలో, క్రింద ఇక్కడ భూమి మీద కూర్చొని, మనము ఈ విధంగా అనుభూతి చెందగలిగిన యెడల; మరియు కేవలం దీనిని వినుటకు, మనము గోడల ప్రక్కగా నిలుచుని, మరియు వర్షములో నిలబడి, ఆనందించగలుగుచున్న యెడల; ఆయన అక్కడ కూర్చొనియుండుటను మనము చూసినప్పుడు అది ఎట్లుండునో గదా! ఓ, మై! ఓ, అది ఒక మహిమకరమైన సమయముగా ఉంటుంది.
ఈ మహిమకరమైన సమయాన్ని తప్పిపోకండి. మేము దీనిని వినుచుండగా మీరు ఆహ్వానించబడినారు: మొదటి ముద్ర 63-0318, 12:00 P.M. గంటలకు, జఫర్సన్ విల్ సమయము.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
వర్తమానమును వినడానికి సిద్దపాటులో చదవవలసిన లేఖనములు:
పరిశుద్ధ. మత్తయి సువార్త 10:1 / 11:1-14 / 24:6 / 28:19
పరిశుద్ధ. యోహాను 12:23-28
అపొస్తలుల కార్యములు 2:38
2 థెస్సలొనీక 2:3-12
హెబ్రీ 4:12
ప్రకటన 6:1-2 / 10:1-7 / 12:7-9 / 13:16 / 19:11-16
మలాకీ 3వ మరియు 4వ అధ్యాయములు
దానియేలు 8:23-25 / 11:21 / 9:25-27
సంబంధిత కూడికలు
ప్రియమైన చిన్న కొలను లిల్లీలారా,
మనము బురద నీటికి పైగా మనల్ని మనము నెట్టుకొని వచ్చాము మరియు మన రెక్కలను చాచియున్నాము. మన చిన్న రేకులు బయటకు వెళ్ళి మరియు ఇప్పుడు ఆ లోయలోని లిల్లీని ప్రతిబింబిస్తున్నాయి. మనము మన జీవితాలను పూర్తిగా దేవునికి మరియు ఆయన వాక్యమునకు సమర్పించుకున్నాము.
మనము అంత్య-కాలములో ఉన్నాము మరియు తూర్పు మరియు పడమర, ఉత్తరం మరియు దక్షిణం నుండి వచ్చుచూ, ఎత్తబడుట కొరకు సిద్ధపడుచున్నాము. మన నరనరాలు పరిశుద్ధాత్మతో నింపబడేవరకు కొద్ది నిమిషాలు మనల్ని మనము స్థిరంగా ఉంచుకొనుచున్నాము. మనము పైకి వెళ్ళుటకు సిద్ధపడుచున్నాము.
దినము వచ్చియున్నది. తనతో ఒక నిజమైన ఏకత్వములోనికి ఆయన తన ప్రజలను తన వద్దకు పిలుచుకొనుచున్నాడు. మన శరీరములో తన ఆత్మతో నివసిస్తూ, ప్రపంచానికి ఒక గురుతుగా చేసిన అవే క్రియలను చేయుచున్నది యేసుక్రీస్తే.
లేఖనములోని అత్యంత ఘనమైన కార్యము మన దినములో జరుగుచున్నది. గొర్రెపిల్ల తప్ప, ఒక దూత గాని, మరేది గాని, దానిని చేయలేని ఒక క్రియయైయున్నది. ఆయన వచ్చి మరియు సింహాసనమందు ఆసీనుడైనవాని కుడిచేతి నుండి గ్రంథమును తీసుకున్నాడు, దానిని తెరిచి, ముద్రలను విప్పి, మరియు దానిని భూమి మీదకి పంపాడు, మనకు, అనగా అయన యొక్క వధువుకు బయలుపరచుటకు, తన ఏడవ దూత వద్దకు పంపాడు.
జరుగుచున్న కార్యములు; అనుదినము ఆయన మనకు బయలుపరచుచున్న వాక్యము, మాటలలో చెప్పలేనిది. మనము మన స్వరములను ఎత్తి, మరియు హల్లెలూయా అని అరచుచు మరియు కేకలు వేయుదుము! ఆ అభిషేకము, ఆ శక్తి, ఆ మహిమ, ఆ కార్యరూపణ, ఆయన వాక్యము యొక్క ఆ ప్రత్యక్షత అనాది కాలము నుండి ఎప్పుడూ లేనంత గొప్పగా ఉన్నది.
పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోను ఉన్న ప్రతి సృష్టముతో, మరియు వాటిలోనున్న సమస్తముతో మనమును కేక వేయుచున్నాము: సింహాసనాసీనుడై యున్నవానికి, గొర్రెపిల్లకును, స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగాయుగములు కలుగునుగాక, ఆమేన్! ఆమేన్, మరియు ఆమేన్!
కాలము యొక్క ప్రారంభమునుండి ప్రతి సృష్టము, ప్రతి మనిషి ఈ దినము కొరకు ఎదురుచూసెను. ఆయన వచ్చి గ్రంథమును తీసుకొని, దానిని తెరిచి మరియు తన మర్మములన్నింటిని తన యొక్క ఎన్నుకొనబడిన వధువుకు బయలుపరచుటకు ముందు ఆయన యొక్క ఏర్పరచబడిన దూత భూమి మీదకి వచ్చేవరకు స్వయంగా దేవుడు కూడా వేచియున్నాడు.
కాలము యొక్క ప్రారంభము నుండి, భూమి మీద ఏ మనుష్యునికి ఎన్నడూ తెలియనటువంటి దానిని, మనము ఇప్పుడు ఎరిగియున్నాము. పడిపోయినప్పుడు తప్పిపోయిన ప్రతీదైయున్నది. ఆయన వాక్యములో దాచబడియున్న ప్రతీదైయున్నది. పెండ్లి కుమార్తెకి అవసరమైన ప్రతీది రికార్డు చేయబడి మరియు దేవుని యొక్క ఒక చిన్న గోదాములో ఉంచబడినది.
ఆయన కాలమనే తెరకు ఆవలినున్నదానిని మనకు చూపించాడు మరియు మనము ఆలవి గట్టున ఆయనతోపాటు మనల్ని మనము చూసుకున్నాము. వాక్యమును వినుట ద్వారా పెండ్లి కుమార్తె తనను తాను సిద్ధపరచుకున్నది.
మనము తర్ఫీదులో ఉండియున్నాము. మనము దేవుని యొక్క సర్వాంగ కవచమును ధరించుకున్నాము. ఏదియు మనల్ని కదల్చలేదు. ఏదియు మనల్ని భయపెట్టజాలదు. ఏదియు మనకు హాని చేయలేదు. ఒక్క వాక్యము విషయములో కూడా ఏదియు మనల్ని రాజీపడునట్లు చేయలేదు. మనము వాక్యమైయున్నాము.
మన చేతులలో పుష్పగుత్తితో మనము ఆయన కొరకు వేచియున్నాము. సమయము సమీపించినది. ఆ పాత ఘడియారము తిరుగుచున్నది. గుర్రముల యొక్క పరుగును మనము వినుచున్నాము, చక్రముల క్రింద ఇసుక దొర్లుచున్నది. ఆ పాత జట్కాబండి ఆగనైయున్నది.
ఆయన వచ్చినప్పుడు మనము ఈ పాత ప్రపంచము నుండి నేరుగా ఆయన హస్తాలలోనికి దూకుతాము. ఆయన మనలను హత్తుకొని మరియు ఇట్లు చెప్తాడు, “నీకు స్థలమును సిద్ధపరచుటకు నేను వెళ్ళియున్నాను, అయితే ప్రియా, ఇప్పుడంతయు పూర్తైనది”.
ఆయన రాకడ చాలా సమీపముగా ఉన్నది. మునుపెన్నడూ లేనంత ఎదురుచూపుతో మనము ఉన్నాము. ఆయన మనలను మరొక్కసారి ఏడు ముద్రలను వినమని కోరుటను బట్టి మనము అత్యుత్సాహంతో ఉన్నాము. మనము వినే ప్రతీ వర్తమానము మనము దానిని ముందెన్నడూ విననట్లుగా ఉండుటవలన, మనము ఇంకా ఎక్కువ ప్రత్యక్షతను పొందుకోబోవుచున్నామని మనము ఎరిగియున్నాము.
అది రికార్డు చేయబడినప్పటి కంటెను ఈనాడు జీవిస్తూ మరియు ఈ వర్తమానమును వినుట ఎంతో గొప్ప విషయమైయున్నది. ఆయన ఇప్పుడు ఇంకా ఎక్కువగా మనకు బయలుపరచుకొనుచున్నాడు. ఏమి జరుగునో గదా?
వచ్చి మాతోపాటు కూడుకొనండి12:00 p.m., జెఫర్సన్ విల్ సమయము, మరియు దీనిని వినుచు ఆనందించండి: 63-0317E ఏడు సంఘకాలములకు మరియు ఏడు ముద్రలకు మధ్య ఎడమ. ఇది తన పెండ్లి కుమార్తె తినుట కొరకు ప్రభువు సిద్ధపరచి మరియు దాచియుంచిన ఆహారమైయున్నది.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
వర్తమానము వినడానికై సిద్ధపడుటకు చదవవలసిన లేఖనములు:
లేవీయకాండము: 25:47-55
యిర్మియా: 32:1-15
జకర్యా: 3:8-9 / 4:10
రోమా: 8:22-23
ఎఫెసీ: 1:13-14 / 4:30
ప్రకటన: 1:12-18 / 5వ అధ్యాయం / 10:1-7 / 11:18