
ప్రియమైన క్రైస్తవ సైనికులారా,
దీనిని ఆలోచించండి! ఇది అంత్యకాలమైయున్నది, హల్లెలూయా! మనమిక్కడ ఉన్నాము. తన వధువు కొరకైన ప్రభువు రాకడయొక్క మహాదినము సమీపించియున్నది. ప్రపంచ నలుమూలల నుండి మనం స్వయంగా మనకు మనము కూడుకొనుచు, దేవునియొక్క స్వరమును వినుటద్వారా పరిపూర్ణులుగా చేయబడుచున్నాము. మన ప్రియులు ప్రత్యక్షమగుటకు మనము వేచిచూస్తూ మరియు ఎదురుచూస్తున్నాము...ఇప్పుడు అది ఏ రోజైనా కావచ్చును.
మనం చేయవలెనని మనకు ఇవ్వబడిన ఒకే ఒక్క ఆజ్ఞ ఏదనగా “వాక్యముతో నిలిచియుండుడి”. మనము యేసునే చూస్తున్నాము, మరియు ఆయన శరీరధారియైన వాక్యమైయున్నాడు. అదియే మన దినముయొక్క ప్రత్యక్షతయైయున్నది. అదియే ఆయన వధువు కొరకైన దేవునియొక్క శిబిరమైయున్నది.
ఎత్తబడుట కొరకు మనకు అవసరమైనదంతా ఈ వర్తమానము, ఈ స్వరము, ఈ టేపులే. మనకు ఇంకేదియు అవసరంలేదు. మనము బయటకు పిలువబడినాము, ఆ స్వరము తప్ప ప్రతీదానినుండి వేరు చేయబడ్డాము. ఆ స్వరమే ఈ దినము కొరకు దేవుడు ఏర్పాటుచేసిన మార్గమని మనము ఒప్పించబడ్డాము.
దీనిని ఆలోచించండి, అన్నికాలములోకంటే అత్యంత గొప్ప ప్రవక్తను ఆయన మనకు అనుగ్రహించాడు. “ఈయన నా బలిష్టుడైన దూత. మీ కొరకైన నా స్వరము ఈయనే. ఈయన భూమి మీద మాట్లాడినప్పుడు, నేను పరలోకములో ప్రతిధ్వనిస్తాను. ఈయన వంటివారు ఎవ్వరును లేరు,” అని ఆయన ప్రపంచానికి చెప్పగలుగునట్లు అగ్నిస్తంభము తానే ఈయనతో ఫోటోను తీయబడనిచ్చిన ఒక వ్యక్తియైయున్నాడు.
“నేను జగత్తు పునాది వేయబడకముందు నుండి దాచిన నా మర్మములన్నిటిని, నేను ఈయనకు, ఈయనకు మాత్రమే అప్పగించాను. ఈ లోకమునుండి మిమ్మల్ని నాయొద్దకు పిలుచుటకు నేను ఈయననే ఏర్పరచుకున్నాను. మిమ్మల్ని నడిపించుటకు, మార్గములో తీసుకొనివెళ్ళుటకు, నిర్దేశించుటకు నేను ఈయననే ఎన్నుకున్నాను. ఈయన మాట వినుడి, అని నేను మీకు ప్రకటించుచున్నాను, ఏలయనగా మాట్లాడుచున్నది ఈయన కాదు, అది గొప్ప ఉన్నవాడనైయున్న నేనే!”
ప్రపంచానికి దీనిని ప్రకటించుటకు నేను బలిష్టులైన ప్రజలను ఏర్పరచుకొని పిలుచుకున్నాను, “మలాకీ 4, ప్రకటన 10:7, మరియు లూకా 17:30 లోని లేఖనములు, ఈ దినమున మీ కన్నులయెదుట నెరవేరినవి. లేఖములు చెప్పినట్లుగా, ఆయనయొక్క బలిష్టుడైన దూత వచ్చాడు. ఆయన చేస్తానని చెప్పినట్లే దేవుడు తననుతాను మానవ శరీరములో బయలుపరచుకుంటూ, దేవుడు ఇక్కడ మన మధ్యన ఉన్నాడు.”
అది నిన్నా, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగానున్న యేసు క్రీస్తుయైయున్నాడు. ఆయనను, అనగా ఆ దేవుని దూతను మీకు చూపించుటకు మేము పిలువబడ్డాము. ఆయనయొక్క వధువును బయటకు పిలుచుటకు మరియు నడిపించుటకు పరిశుద్ధాత్మ ఎన్నుకున్నది ఆయననే. ప్రధాన యాజకునిగా ఎవరు ఉండబోవుచున్నారని; ఇది, అది, లేదా ఇంకేదో ఎవరు అవుతారని తర్కించుకోకండి, గొనగకండి, గొడవపడకండి మరియు మదనపడకండి. ఆ స్వరముతో నిలిచియుండండి. ఏలయనగా నిర్ధారించబడిన దేవుని స్వరము కేవలం ఒకే ఒక్కటి ఉన్నది మరియు అతని పేరే విలియమ్ మారియన్ బ్రెన్హామ్.
మనము ఆ స్వరముతో నిలిచియుండునట్లు ఎంతో జాగ్రత్తపడవలసియున్నాము, ఏలయనగా మిమ్మల్ని దానినుండి దూరంగా నడిపించుటకు అనేకులు ఉన్నారు. వారి ఆచారములు ఆ నిజమైన స్వరమును ప్రజలనుండి దూరంగా ఉంచుతున్నాయి. వారిలో అనేకులకు ఆయన ఒక అపరిచితుడైయ్యాడు. వారి స్వరము, ఆ స్వరముయొక్క స్థానమును తీసుకున్నవి, ఎంతగా అంటే, దేవుడు టేపుల ద్వారా వారిని దర్శించినప్పుడు, ఆయన వారికి ఒక పరదేశిగా ఉన్నాడు.
ఆ గొప్ప ఘనమైన సన్నిధి మనతో ఉన్నది. ఆత్మయొక్క స్పర్శను కలిగియున్న ఏ వ్యక్తియైనా ఆ స్వరము దేవునియొక్క స్వరమని చెప్పగలడు. అది ఈ దినమునకైన దేవునియొక్క శిబిరమైయున్నది.
క్రీస్తుయొక్క వధువు అని చేపుకొనుచున్న ప్రతీ వ్యక్తి తాము ఏ శిబిరములో ఉన్నారో నిర్ణయించుకోవలసియున్నది. వారు తమకు తాము ఈ సాధారణమైన ప్రశ్నను వేసుకోవలసియున్నది: వధువు అంతయూ ఏ స్వరమునకు “ఆమేన్” అని చెప్పగలదు?
మీరు ఈ దినమునకైన నిజ ప్రత్యక్షతను కలిగి, నిజంగా మీరు క్రీస్తుయొక్క వధువైనయెడల, అప్పుడు ఒకేఒక్క జవాబు ఉన్నది: అది టేపులలో ఉన్న దేవునియొక్క స్వరమే. అవును సాతానుడు ఎన్నో భిన్నమైన విధానాలలో దానిని తారుమారు చేయుటకు ప్రయత్నిస్తాడు, కానీ వధువుకు ఇంకే ఇతర జవాబు లేదు. అది అంత సామాన్యముగా ఉన్నది.
మనల్ని విభాగించుటకు సాతానుడు ఆ జవాబును ఉపయోగిస్తున్నాడని మనందరికీ తెలుసు. అయితే వధువు ఐక్యపరచబడియుండాలని వాక్యము మనకు చెప్పుచున్నది…మనల్ని ఐక్యపరిచే ఆ ఒకే ఒక్క స్వరముచేత మనము ఐక్యపరచబడియున్నాము.
వచ్చి మాతో ఐక్యమవ్వండి, ఏలయనగా సమయం గతించిపోవుచున్నది.
“నేను శిబిరము వెలుపటికి వెళ్ళగోరుచున్నాను. దాని కొరకు నేను ఏమి చెల్లించవలసి వచ్చినాగాని, నేను నా సిలువను తీసుకొని మరియు ప్రతీ దినము దానిని మోస్తాను. నేను శిబిరమును దాటి వెళ్తాను. ప్రజలు నా గురించి ఏమి అన్నాగాని, శిబిరము వెలుపటికి నేను ఆయనను వెంబడించగోరుచున్నాను. నేను వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నాను.”
మీరు ఈనాడు దేవుని శిబిరములో ఉండగోరినయెడల, మీరు వినవలసిన అత్యంత ప్ర్రాముఖ్యమైన స్వరము టేపులలో ఉన్న దేవునియొక్క స్వరమేనని మీరు నమ్మవలసియున్నారు.
ఈ ఆదివారము జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా 12:00 P.M., గంటల సమయమప్పుడు, దేవుడు తన వధువును నడిపించుట కొరకు ఎన్నుకున్న ఆ స్వరము, శిబిరము వెలుపలికి వెళ్ళుట 64-0719E అనే వర్తమానమును అతడు అందించడాన్ని మేము వినుచుండగా వచ్చి వధువులోని భాగములో చేరండి.
అది “ఒక శిబిరము కాదు”; అది “ఆ శిబిరమైయున్నది.”
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
కూటమునకు ముందు చదువవలసిన లేఖనములు:
హెబ్రీ 13:10-14
మత్తయి 17:4-8