
గురుతు అనువర్తించబడిన ప్రియమైన వధువా,
డిసెంబరు 31, ఆదివారమున, నూతన సంవత్సరం వేడుకకుగాను, ఎంతో ప్రత్యేకమైన గృహ ప్రభురాత్రి భోజనపు ఆరాధన కొరకు మనమందరము సిద్ధపరచుకోవాలని నేను కోరుచున్నాను. మనము, 63-0901E నిరాశలు, అనే వర్తమానమును వింటాము, దానిలో టేపుయొక్క ముగింపులో సహోదరుడు బ్రెన్హామ్ గారు ప్రభురాత్రి భోజనము మరియు పాద పరిచర్యను జరిగిస్తారు.
వర్తమానము వాయిస్ రేడియోలో (ఇంగ్లీషులో మాత్రమే) ప్రసారము చేయబడుతుంది, మరియు కూడికలో ప్రభురాత్రి భోజనపు ఆరాధన జరుగుచున్న సమయంలో పియానో సంగీతము, మరియు పాద పరిచర్య జరుగుచున్నప్పుడు సువార్త గీతాలతో, ఇదివరకు గృహ ప్రభురాత్రి భోజనపు ఆరాధనలలో మనము చేసినట్టి క్రమములోనే జరుగుతుంది. మేము కూడికను జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా 5:00 P.M గంటల సమయమప్పుడు ప్రారంభిస్తాము. ఇతర దేశాలలో ఉన్న మీరు, 2023 అర్ధరాత్రికి ముందు ప్రభురాత్రి భోజనమును తీసుకొనునట్లు మీ స్థానిక సమయం ప్రకారంగా టేపును ప్లే చేసుకొని మరియు ప్రభురాత్రి భోజనము తీసుకొనుటకు దయచేసి సంకోచించకండి.
ఈ 2023వ సంవత్సరమును ముగించుకొని, మరియు 2024 లో ప్రభువు కొరకు ఒక నూతన సేవను ప్రారంభించడానికి, ఆయన ముందు మౌనంగా ఉండి, ఆయన కొరకు ఇంకా అధికంగా తపించిపోతూ, ఆయన భోజనములో పాలిభాగస్తులమై, ఒకరి కొరకు ఒకరము ప్రార్థన చేస్తూ మరియు ఒకరినొకరము క్షమించుకుంటూ, ఆయన పరిశుద్ధుల పాదాలు కడుగుతూ, మరియు ఆయన వాక్యమును వినుచుండటం కంటే శ్రేష్ఠమైన ఒక దారి నాకు తట్టడంలేదు. ఇది ఎటువంటి ఒక ప్రత్యేకమైన సాయంకాల సమయముగా ఉంటుంది కదా.
ప్రభురాత్రి భోజనపు రొట్టెను మరియు ద్రాక్షరసమును పొందుకునే/తయారి చేసుకునే విధానాల కొరకు ఈ క్రింద లింకులు ఇవ్వబడినవి.
ఇటువంటి ఒక పవిత్రమైన సందర్భము కొరకు మనందరము ఏకముగా కూడుకొనుటకు ప్రభువు మన కొరకు ఒక మార్గమును ఏర్పాటు చేసినందుకు నేను ఎంతో కృతజ్ఞుడనైయున్నాను. మీ అందరిని ఆయన బల్ల వద్ద కలుసుకొనుటకు నేను నిశ్చయంగా ఎదురుచూస్తున్నాను.
ఈ ఆదివారము, జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా 12:00 P.M గంటల సమయమప్పుడు, మనము: అల్పమైన బెత్లహేము ఎందుకు? 58-1228 అనే క్రిస్మస్ వర్తమానమును వింటాము.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక,
సహోదరుడు జోసఫ్ బ్రెన్హామ్
ఆదివారము, డిసెంబరు 24, 2023
58-1228 అల్పమైన బెత్లహేము ఎందుకు?12:00 P.M. జఫర్సన్ విల్ కాలమానం
ఆదివారము, డిసెంబరు 31, 2023
63-0901E నిరాశలు/గృహ ప్రభురాత్రి భోజనపు ఆరాధన & పాద పరిచర్య5:00 P.M. జఫర్సన్ విల్ కాలమానం
రొట్టెను/ద్రాక్షరసమును తయారు చేయుటకు సూచనలు
ప్రభురాత్రి భోజనపు ద్రాక్షరసమును/పాద పరిచర్య పాత్రలను పొందుకోడానికి సూచనలు