ఆదివారం
08 ఫిబ్రవరి 2026
64-0830M
Questions And Answers #3
కూడిక ఇంత సమయంలో ప్రారంభమవుతుంది:
0
రోజులు
19
గంటలు
40
నిమిషములు
35
క్షణములు

Sun Apr 26, 2020 10:00 AM EDT

క్రీస్తుకు జన్మించినట్టి ప్రియమైనవారలారా,

మన దినము కొరకైన ఆయన వాక్యముయొక్క నిజమైన ప్రత్యక్షతను తెలుసుకొనుటకు మన హృదయములలో ఉన్న ప్రేమను మరియు ఆనందమును అల్పమైన మర్త్యమైన మాటలలో ఎవరైనా ఎలా చెప్పగలరు? దానిలో మనము చేయవలసింది ఏమియు లేదు గాని, ఆయన, ఆ గొప్ప ఉన్నవాడు అనువాడు, ఆయన మనకు ఇవ్వగల అత్యంత గొప్ప సంగతియైనట్టి, మన దినము కొరకైన ఆయన వాక్యముయొక్క ప్రత్యక్షతను, మనము కలిగియుండుటకు తన స్వంత ఎన్నిక ద్వారా మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు, అని ఆలోచించుటకే ఎలాగున్నది కదా.

ఆయన మనతో మాట్లాడి మరియు ఇట్లు చెప్పడాన్ని మనము వినగలుగునట్లు, జీవవాయువును మనలో ఊదడానికి, కాలము సంపూర్ణమయ్యేంతవరకు ఆయన వేచియున్నాడు:

ఇప్పుడు, ప్రజలైన మీకు చెప్పడానికి మరియు ఒక తండ్రి తన పిల్లలను నడిపించినట్లు మిమ్మల్ని నడిపించడానికి నేను నా శాయశక్తులా ప్రయత్నించాను. మీరు నా పిల్లలైయున్నారు; నేను ప్రకటించే ఈ సువార్త ద్వారా నేను క్రీస్తుకు మిమ్మల్ని కనియున్నాను. చూశారా? మరియు నేను—నేను—నేను పూర్తిగా పరిపక్వము చెందిన చిన్నబిడ్డలను, లేదా—లేదా పిల్లలను పెంచగోరుతున్నాను. మరియు పౌలు చెప్పినట్లుగా, ఆ దినమున “ఒక పవిత్రురాలైన కన్యకగా” నేను మిమ్మల్ని క్రీస్తుకు సమర్పించగోరుతున్నాను. మీ హృదయము దానికి “ఆమేన్” అని చెప్పకుండా ఉండునట్టిది ఆ వాక్యములో ఒక్కటి కూడా లేదు.

దేవుడు, ఆయనయొక్క బలిష్ఠుడైన దూత ద్వారా మాట్లాడుతూ, యేసుక్రీస్తు యొక్క వధువైయున్న మనల్ని, నిర్దేశిస్తూ మరియు నడిపిస్తూ ఉన్నాడు. మనము ఆయనయొక్క పూర్తిగా పరిపక్వము చెందినట్టి, పవిత్రురాలైన కన్యకయైయున్నాము, పిల్లలమైయున్నాము. మరియు ఆయనయొక్క అద్భుతమైన కృప ద్వారా, మనము వినే ప్రతీ వాక్యమునకు మనము ఆమేన్ అని చెప్తున్నాము! అది దైవికమైన నిర్ధారణతో వస్తున్నట్టి వాక్యముయొక్క పరిపూర్ణమైన అనువాదమైయున్నది!

  • మనము టేపులలో వింటున్న స్వరము: వాక్యముయొక్క పరిపూర్ణమైన అనువాదమైనట్లైతే, యేసుక్రీస్తుయొక్క వధువునకు ఇంకేమి అవసరమున్నది?...ఏమియు అవసరము లేదు!

జాగ్రత్తగా-ఎంపిక చేయబడిన చిన్న గుంపుయైన మనల్ని, మన దినము కొరకైన ఆయన వాక్యముయొక్క నిజమైన ప్రత్యక్షతను కలిగియుండటానికి, ఆయన ఎన్నుకున్నాడు. వెయ్యేండ్ల పాలన సమయములో, భౌతికమైన శరీరములలో, భూమి మీద ఉండటానికి ఆయన మనల్నే ఎన్నుకున్నాడు.

నా స్నేహితులారా, ఒక్క నిమిషము మనము దాని గురించి చూద్దాము.

మనము సరిగ్గా ఇక్కడ భూమి మీదనే ఒక మహిమపరచబడిన శరీరమును కలిగియుంటాము. మనము తింటాము, త్రాగుతాము, ఇండ్లను కడతాము, సరిగ్గా మనమిప్పుడు జీవిస్తున్న విధంగానే వెయ్యేండ్లు జీవిస్తాము. ఎక్కడైతే వధువు (మనము) మరియు పెండ్లికుమారుడు (ప్రభువైన యేసుక్రీస్తు) ఒక్కటయ్యారో అటువంటి మన హనీమూన్ గా అది ఉంటుంది.

ప్రతి రోజులోని ప్రతి నిమిషము మనము ఈ మహిమకరమైన సమయము కొరకు కనిపెట్టుకొనుచు వేచియుంటున్నాము. మనము దాదాపు దానిని ముట్టుకోవచ్చు అన్నట్లు అగుపించేంత దగ్గరగా అది ఉన్నది. ఈనాడు మనకు జరుగుతున్నది ఇదేనని, నేను, నా హృదయమంతటితో నమ్ముతున్నాను:

ఓ, శరీరము వాక్యమవుతుండగా, మరియు వాక్యము శరీరమవుతూ, ప్రత్యక్షపరచబడుతూ, నిర్ధారించబడుతుండగా, ఇప్పుడు క్రీస్తు మరియు ఆయన వధువుయొక్క ఆ ఆత్మసంబంధమైన ఐక్యత సరిగ్గా ఈ దినమున ఏమి జరుగునని బైబిలు చెప్పినదో, దినదినము, అవి జరుగుచున్నవి. ఏమిటీ, అక్కడ బయట, ఆ ఎడారి ప్రాంతములలో అది ఎంత త్వరగా పెరుగుతూ, మరియు ఎటువంటి కార్యములు జరుగుతున్నాయంటే, నేను వాటితో త్వరగా కొనసాగలేకపోవుచున్నాను. ఎక్కడైతే వాక్యము వాక్యముగా మారుతుందో, అటువంటి చోట ఆయనయొక్క సంఘముతో ఐక్యమవ్వడం కొరకైన, యేసుయొక్క రాకడను మనము సమీపించియున్నాము.

మనము వింటున్న ప్రతి వర్తమానముతో, ఆయన మనకు మరింత ప్రత్యక్షతను ఇస్తున్నాడు. అది ఎంత త్వరగా పెరుగుతూ ఉందంటే మనము దానితో త్వరగా కొనసాగలేకపోవుచున్నాము. ముందెన్నడూ లేనివిధంగా వాక్యము వాక్యముగా మారడాన్ని మనము చూస్తున్నాము. ఒక్క సందేహపు ఛాయయైనా లేదు; ప్రత్యక్షత ద్వారా, మనము సరిగ్గా ఎవరమన్నది మనము ఎరిగియున్నాము.

సరిగ్గా ఆయన చేస్తానని చెప్పినట్లే ఆయన తన వధువును ఐక్యపరుస్తున్నాడు, మరియు మనము దానిలో భాగమైయున్నాము. అది సంభవించడాన్ని మనము మన స్వంత కన్నులతో చూస్తున్నాము. ఇతరులు దానిని చూడలేకపోవచ్చును లేదా దానిని గ్రహించలేకపోవచ్చును. అది వారి కొరకు కాదు, అది ఆయనకు పుట్టిన పిల్లలమైన, మన కొరకైయున్నది.

ప్రవక్తను అడగడానికి వధువు ప్రశ్నలను కలిగియున్నది.

టేపులలో ఉన్న దేవుని స్వరమును మాత్రమే వింటే సరిపోతుందా? దేవుడు జవాబునిచ్చి మరియు ఇట్లు చెప్పాడు: అవును!!

కేవలం టేపులను వినడం ద్వారా మా పిల్లలు కూడా క్రీస్తుయొక్క వధువుగా ఉండుటకు వారికి అవసరమున్న సమస్తమును పొందుకోగలరా: అవును!!

అందువలన, వధువుకు అవసరమైయున్నదంతా టేపులలోనే ఉన్నది.

దేవుడు ఆయన పిల్లల కొరకు అనేక ఇతర మార్గములను ఏర్పాటుచేశాడని కూడా మనకు తెలుసు.

“ఆయన పొందిన దెబ్బలచేత మీరు స్వస్థపరచబడ్డారు.” ఇప్పుడు, మొదటిగా వాక్యము ఆలాగు చెప్తున్నది, అది సరిపోవలసియున్నది, కానీ మీరు వాక్యములో దానిని నమ్మనట్లైతే, అప్పుడు సంఘములో వరములు ఉన్నాయి, ఎలాగంటే దానిని ఎలా బోధించాలో ఎరిగియుండుటకు ప్రేరేపించబడిన పురుషులు ఉన్నారు, వారు దానిని మీకు ఎంతో తేటపరచి, మరి, నమ్మడానికి విశ్వాసమును పొందుకునేటట్లు చేస్తారు.

స్వస్థను ఎలా బోధించాలన్నది మరియు ఆయనయొక్క వాక్యమును ఇతరులకు ఎలా తేటపరచాలన్నది ఎరిగియుండుటకు ప్రేరేపించబడిన పురుషులను దేవుడు ఏర్పాటు చేసినందుకు మనమెంతో కృతజ్ఞులమైయున్నాము, కానీ ఆయనయొక్క వధువు ఆయనయొక్క పరిపూర్ణమైన సమృద్ధియైన ఏర్పరచబడిన మార్గమును కోరుకుంటుంది. మనకు అవసరమైనదంతా అదేయైయున్నది.

ఈ ఆదివారము జఫరసన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయానికి మేము: ప్రశ్నలు మరియు జవాబులు #3 64-0830M అనుదానిని వినుచుండగా, వచ్చి బ్రెన్హామ్ టెబర్నికల్ తో చేరమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.

ఆయన వాక్యముయొక్క ప్రత్యక్షతను కలిగియుండి మరియు మనము శరీరధారియైన వాక్యమైయున్నామని ఎరుగుటకు ఎంత అద్భుతంగా ఉన్నది కదా.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్