ప్రభురాత్రి భోజనపు రొట్టె
ప్రభురాతి భోజనపు రొట్టె “త్వరపడుచు తిను రొట్టె” లేదా “పస్కా రొట్టె” అని కూడా పిలువబడుతుంది. ఐగుప్తులో ఫరో దాస్యత్వము నుండి ఇశ్రాయేలు పిల్లలు విడుదల పొందినప్పుడు, సాధారణమైన పద్దతిలో పిండిని పులియజేసి, లేదా రొట్టెను పొంగేటట్లు చేసే పదార్థముతో, రొట్టెను కాల్చడానికి వారికి సమయము లేదు. వారి ప్రయాణము కొరకైన తొందరలో అది పులియని పిండితో చేయబడినది.
ప్రభువైన యేసు భూమి మీద చేసిన చివరి విషయాలలో ఒకటి ఏదనగా తన శిష్యులతో ప్రభురాత్రి భోజనమును తీసుకొనుటయే; మరియు వింతైన కార్యము ఏమిటనగా, సహోదరుడు బ్రెన్హామ్ గారు ప్రసంగించిన చివరి వర్తమానము కూడా 65-1212 ప్రభురాత్రి భోజనమే.
దేవునికి తమనుతాము ప్రతిష్టించుకొని మరియు సమర్పించుకున్న ప్రజలే ఆ రొట్టెను చేయవలెనని వాక్యము మనకు బోధించుచున్నది. కేవలం పరిశుద్ధాత్మ నింపుదలగల ఒక విశ్వాసి మాత్రమే ఆ ప్రభురాత్రి భోజనపు రొట్టెను తయారు చేయవలసియున్నది.
• ప్రభురాత్రి భోజనపు రొట్టెను చేయుటకు, మొదటిగా పిండిపొడిని మరియు నీళ్ళను కలపండి. ½ కప్పు వేడి నీళ్ళతో మొదలుపెట్టి మరియు అది మెత్తటి పిండి పదార్థంగా మారే వరకు అప్పుడప్పుడు చెంచాడు నీళ్ళను కలుపుతూ (చేతితోగాని లేదా గ్రైండర్ లో గాని కలపండి.)
• పిండి పదార్థమును కొద్దిగా పిసుకవలసియున్నది. దానిని పిండిపొడి చల్లిన పీటమీద చాలా సన్నగా పామండి.
• ఆ పిండి పదార్థాన్ని మూడు లేదా నాలుగు సార్లు ఫోర్కు చెంచాతో కుచ్చండి, తద్వారా అది కాలేటప్పుడు అది పొంగకుండా ఉంటుంది. పామిన పిండి పదార్థమును కాల్చడానికి ఉపయోగించే ట్రేలో కాల్చడానికి ఉపయోగించే తోలు కాగితముపై పెట్టండి.
• 400F వద్ద ముందుగా వేడిచేయబడిన ఒవెన్ లో 15 నిమిషాలు రొట్టెను కాల్చండి. లేదా, ముందుగా-వేడిచేయబడిన పెద్ద పెనముపై ఆ పిండిని పెట్టండి. ఆ రొట్టె రెండు ప్రక్కలా కాలునట్లు దానిని ఒకసారి త్రిప్పండి. నూనె అవసరము లేదు.
• ఇప్పుడు ఆ రొట్టెను మీ చేతులతో చిన్న ముక్కలుగా చేయండి. తుంపబడిన రొట్టె అంచులు విరగగొట్టబడిన ప్రభువైన యేసు యొక్క శరీరమును సూచించుచున్నవి.
ఇప్పుడు మిగిలిపోయిన రొట్టెకు ప్రార్థన చేయబడనందున, దానిని పారవేయవచ్చు.
ప్రభురాత్రి భోజనపు ఆరాధన వద్ద ఒక్కసారి రొట్టెకు ప్రార్థన చేయబడిన తర్వాత, మిగిలిన రొట్టె మరుసటి దినముకు ముందే కాల్చివేయబడవలసి యున్నది. రొట్టె కాల్చబడటం అనేది, అనుదినము ఆకాశము నుండి నూతన మన్నా కురియుచుండగా, అరణ్యములో ఇశ్రాయేలు యొక్క ప్రయాణమునకు సాదృశ్యముగా ఉన్నది. ముందు రోజు యొక్క రొట్టె కుళ్ళిపోయి మరియు ఎంతమాత్రము మంచిగా లేకున్నది. ఏ మనుష్యుడును పనిచేయుటకు, మరియు పొలాల నుండి క్రొత్త మన్నాను సేకరించుకోవడానికి అనుమతించబడనట్టి విశ్రాంతి దినముకు, అది మినహాయింపైయున్నది. ఈ సందర్భంగా, ఆహారము మునుపటి దినమున సమకూర్చబడి వారి గుడారములలో ఉంచబడుతుంది, మరియు వారు సబ్బాతు దినమున లేదా విశ్రాంతి దినమున తినునట్లు వారి కొరకు ప్రభువు దానిని భద్రపరిచాడు. (రిఫరెన్సు - నిర్గమకాండము 16)
తదుపరి సంఘకాలము తీసుకొనివచ్చే తాజా మన్నాకు దారి ఇవ్వడానికి ప్రతీ సంఘకాలము పూర్తిగా నశించిపోవలసియున్నది గనుక, సహోదరుడు బ్రెన్హామ్ గారు రొట్టె కాల్చివేయబడుటను ఏడు సంఘకాలములతో కూడా పోల్చియున్నాడు. ఇంకను, ఒక విశ్వాసి యొక్క వ్యక్తిగత అనుభవమునకు, మరియు అనుదినము పరిశుద్ధాత్మ మన జీవితాలలోనికి తాజాగా వచ్చునట్లు, మనము అనుదినము ఏ విధంగా చనిపోవలసియున్నది అనుదానికి కూడా ఆయన దానిని పోల్చి చెప్పాడు.
రొట్టె పూర్తిగా కాల్చివేయబడినదని సరిచూసుకొనుట కొరకు, ఆ రొట్టెను ఒక చిన్న కాగితపు సంచిలో ఉంచి, మరియు దానిని వేడి మంటలో వేయడం మంచిది. అది ఆ మిగిలినదానిని కాలిపోవునట్లు చేస్తుంది.
ఈ సిద్ధపరచబడిన రొట్టె, అది క్రైస్తవుల చేత చేయబడుతుంది. అది పులియని రొట్టెయైయున్నది. మరియు మీరు దానిని గమనించినట్లైతే, మీరు దానిని మీ నోటిలో పెట్టుకున్నప్పుడు, అది ఎంతో గరుకుగా, మరియు చేదుగా ఉంటుంది. అది నలిగిపోయి మరియు విరిగిపోయి, పిసుకబడియుంటుంది, అనగా అది మన ప్రభువైన యేసు యొక్క విరుగగొట్టబడిన, నలగగొట్టబడిన శరీరమును సూచిస్తుంది. ఓ, నేను దాని గురించి ఆలోచిస్తేనే, నా గుండె కొట్టుకోడం అగిపోయినట్లవుతుంది! ఆ నిర్దోషియైన దేవుని కుమారుడు, ఆయన నలుగగొట్టబడి మరియు గాయపరచబడి మరియు బాధింపబడ్డాడు అనుదాని గూర్చి నేను ఆలోచిస్తేనే! ఆయన దానిని ఎందుకు చేశాడో మీకు తెలుసా? నేను దోషిని గనుక అట్లు చేసాడు. ఆయనయొక్క బలియర్పణ ద్వారా నేను ఆయన వలె, ఒక దేవుని కుమారునిగా మారునట్లు, ఆయన నావలె, ఒక పాపిగా మారాడు. ఎటువంటి ఒక బలియర్పణ!
62-1231 పోటీ
ప్రభురాత్రి భోజనపు ద్రాక్షరసము
ప్రభురాత్రి భోజనపు ద్రాక్షరసము, మన పాపముల నుండి మనలను పరిశుద్ధపరిచే, ప్రభువైన యేసు యొక్క రక్తమును సూచిస్తుంది, మరియు అది ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుట కొరకు తీసుకొనబడుతుంది. ప్రభురాత్రి భోజనపు ద్రాక్షరసము, అది సమయము గడుస్తున్నాకొద్ది పులిసిపోయి మరియు పాడైపోయే, సాధారణ ద్రాక్షరసమై ఉండకూడదు, కానీ సమయం గడుస్తున్నా కొద్దీ, శ్రేష్ఠముగా మరియు బలంగా మారునట్టి, అసలైన ద్రాక్ష పానీయమై ఉండవలసియున్నది; అది ఎన్నడూ దాని బలమును కోల్పోదు.
కాలముతో పాటు పులిసిపోకుండా మరియు పాడైపోకుండా, రోజులు గడుస్తున్నాకొద్దీ విశ్వాసికి బలముగాను మరియు శ్రేష్ఠముగాను మారునట్టి యేసు క్రీస్తు రక్తము వలెనేయున్నది.
బైబిలు గ్రంథములో ద్రాక్షరసము, విశ్వాసికి వాక్యము బయలుపరచబడినప్పుడు, ఆ వాక్యమువలన కలుగు ఉత్తేజమును సూచిస్తుంది.
58 మరియు ద్రాక్షరసము, నాకు వచ్చిన దానిని బట్టి, ద్రాక్షరసము శక్తిని అది—అది ప్రత్యక్షతవలన కలిగిన ఉత్తేజముయొక్క శక్తిని సూచిస్తుందని, నేను చెప్పాను. చూశారా? మరియు అది ఏదైనా బయలుపరచబడినప్పుడై యున్నది. అది ప్రత్యక్షత ద్వారా అనుగ్రహించబడినది గనుక, అది విశ్వాసికి ఉత్తేజమును కలిగిస్తుంది. చూశారా? అది దేవుడు చెప్పిన విషయమైయున్నది. అది ఒక మర్మమైయున్నది; వారు దానిని గ్రహించలేరు, చూడండి. మరియు, కొంతసమయమైన తర్వాత, దేవుడు క్రిందకు దిగివచ్చి మరియు దానిని బయలుపరుస్తాడు, మరియు పిదప దానిని నిర్ధారిస్తాడు.
63-0321 – నాల్గవ ముద్ర
రొట్టె వలె ద్రాక్షరసమును “పరిశుద్ధమైన హస్తాలతో” చేయవలసిన అవసరంలేదు. సిద్ధపరచబడిన ద్రాక్షరసమును, లేదా పస్కా ద్రాక్షరసమును దుకాణము నుండి కొనుగోలు చేసుకొనవచ్చును. ఎట్లైనను, మీ స్వంత ద్రాక్షరసమును ఎలా చేసుకోవాలి అనుదాని గూర్చి సూచనల కొరకు ఈ పేజీలో ఉన్న తయారీ విధానము కార్డు వద్దకు వెళ్ళండి.
జఫర్సన్ విల్ లోని మా స్థానిక సంఘానికి మేము ద్రాక్షరసమును మరియు చిన్న ప్లాస్టిక్ పాత్రలను అందజేస్తాము. ప్రభురాత్రి భోజనము కొరకు, ద్రాక్షరసమును ఒకొక్కరి చొప్పున చిన్న కప్పులలోనైనా తీసుకోవచ్చు లేదా పెద్ద కప్పులలో ఒకరితో ఒకరు పంచుకోవచ్చు. ప్రభురాత్రి భోజనము తీసుకున్న తర్వాత, రొట్టె వలె కాకుండా, ద్రాక్షరసమును పారవేసినా పర్వాలేదు.
ప్రభువుయొక్క రక్తమును మరియు శరీరమును సూచించే, ప్రభురాత్రి భోజనమును తీసుకోవడం, ఎల్లప్పుడూ విశ్వాసికి “జయమును” సూచిస్తుంది. యేసు క్రీస్తుయొక్క మరణము వద్ద, ప్రభురాత్రి భోజనము ప్రారంభించడానికి వందల సంవత్సరాలకు ముందే, అబ్రాహాము దేవునితో ప్రభురాత్రి భోజనమును తీసుకున్నాడు.
తన సహోదరుడు, లోతును కాపాడుటకు రాజులను సంహరించుటలో ఒక గొప్ప విజయాన్ని పొందుకున్న తర్వాత, అబ్రాహాము మెల్కీసెదెకును కలుసుకున్నాడు, మరియు వారిరువురూ ప్రభురాత్రి భోజనమును తీసుకున్నారు.
మనము ప్రభురాత్రి భోజనమును తీసుకునే ప్రతీసారి, ఆ రొట్టె మరియు ద్రాక్షరసము, మన జీవితములో శత్రువుపై సాధించిన విజయాన్ని అది సూచిస్తుంది. మరియు ఒక దినమున ఆ పోరాటమంతా ముగించబడిన తర్వాత ఆ గొప్ప ప్రభురాత్రి భోజన కూడిక నిమిత్తమై అబ్రాహాముయొక్క సంతానము మన ప్రభువును ఆకాశములో కలుసుకుంటుంది, మరియు పెండ్లి విందులో, ఆయనతో ముఖాముఖిగా భోజనము చేస్తుంది.
గమనించండి, యుద్ధము ముగిసిన తర్వాత, తన విజయోత్సపు కుమారునికి మెల్కీసెదెకు, ప్రభురాత్రి భోజనమును ఇచ్చాడు; దాని గూర్చి ఆలోచించండి, ఆయనలో భాగమును ఇచ్చాడు! ఇప్పుడు మనము ఇక్కడ చూడగోరుచున్నాము. మాదిరిలో ఇక్కడ, ప్రభురాత్రి భోజనము, దృశ్యములో ఉన్నది. యుద్ధము తర్వాత, ఆయన తనలో భాగమును ఇచ్చుకున్నాడు, ఎందుకనగా ప్రభురాత్రి భోజనము అనగా క్రీస్తులో భాగమైయుండుట. మరియు పోరాటం ముగిసిన తర్వాత, మరియు మిమ్మల్ని మీరు వేరుచేసుకున్న తర్వాత, అప్పుడే మీరు క్రీస్తులో పాలిభాగస్తులు అవుతారు, ఆయనలో భాగమౌతారు. అది మీకు అర్థమైనదా?
యాకోబు రాత్రంతా పెనుగులాడాడు, మరియు ఆయన అతడిని ఆశీర్వదించేవరకు ఆయనను విడిచిపెట్టలేదు. అది నిజము. జీవము కొరకు పోరాడాడు! మరియు పోరాటము ముగిసిన తర్వాత, అప్పుడు దేవుడు తనను తాను మీకు ఇచ్చుకుంటాడు. అదే ఆయనయొక్క నిజమైన ప్రభురాత్రి భోజనమైయున్నది. ఆ చిన్న రొట్టె మరియు రొట్టె ముక్క కేవలం దానిని సూచిస్తుంది. మీరు పెనుగులాడి మరియు దేవునిలో భాగమవ్వనంతవరకు మీరు దానిని తీసుకోకూడదు.
గుర్తుంచుకోండి, ఈ సమయములో, ప్రభురాత్రి భోజనము అసలు నియమించబడలేదు, కొన్ని వందల సంవత్సరాల తర్వాత, యేసు క్రీస్తుయొక్క మరణమునకు ముందు అది ప్రారంభించబడినది.
కానీ మెల్కీసెదెకు, తన కుమారుడైన అబ్రాహాము జయము పొందిన తర్వాత, అతడిని కలుసుకొని రొట్టె ద్రాక్షరసమును ఇచ్చెను; ఈ భూలోక పోరాటం ముగిసిన తర్వాత, మనము ఆకాశములో ఆయనను కలుసుకొని మరియు మరలా ప్రభురాత్రి భోజనమును తీసుకుంటామని అది చూపించుచున్నది. అది పెండ్లి విందుగా ఉంటుంది. “నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసమును క్రొత్తదిగా త్రాగు దినమువరకు, ఇకను దానిని త్రాగను.” అది నిజమేనా?
మరలా గమనించండి, అబ్రాహాము ఇంటికి తిరిగి వెళ్ళడానికి ముందు మెల్కీసెదెకు అతడిని కలుసుకొనుటకు వెళ్ళాడు. మనము ఇక్కడ ఎటువంటి ఒక అందమైన సాదృశ్యమును కలిగియున్నాము కదా! యుద్ధము ముగిసిన తర్వాత, అబ్రాహాము ఇంటికి తిరిగి వెళ్ళడానికి ముందు, మెల్కీసెదెకు అతడిని కలుసుకొనుట.
మనము గృహమునకు వెళ్ళడానికి ముందు, యేసును ఆకాశములో కలుసుకుంటాము. అది నిజము, రెండవ థెస్సలోనికయ దానిని మనకు చెప్పుచున్నది, “మనము ఆయనను ఆకాశములో కలుసుకుంటాము.”
65-0221E ఈ మెల్కీసెదెకు ఎవరు?
తయారీ విధానము కార్డులు