ప్రియమైన కన్య వాక్య వధువా,
ఈ ఉదయము నేను ఇక్కడ కూర్చొని, ఆదివారము వధువు వినబోయే ఈ వర్తమానము వింటూ, చదువుతూ మరియు అధ్యయనము చేస్తుండగా, మహత్తరమైన అభిషేకమును నేను అనుభూతి చెందుతున్నాను. నా సమస్తము అభిషేకించబడినది. ప్రపంచమంతటి నుండి మనమందరమూ ఇదే అభిషేకముతో కూడివస్తామని ఎరిగియుండి, నా హృదయము అత్యానందముతో ఉబుకుచున్నది. ఆయన మనలో ప్రతి ఒక్కరితో మాట్లాడి మరియు ఆయనయొక్క వాక్యమును బయలుపరుస్తుండగా, ఒకే సమయములో, మనమందరమూ సంతోషిస్తూ మరియు ప్రభువును స్తుతిస్తూ ఉంటాము.
అభిషేకము ఎంత గొప్పగా ఉంటుందంటే, మనము మన స్తుతులతో మరియు ఆరాధనతో పరలోకమును ముంచెత్తుతుండగా, ప్రపంచమంతటా ఒకే సమయములో, “హల్లెలూయా, ఆమేన్, ప్రభువు నామమునకు స్తుతి కలుగునుగాక” అని అరవడము మరియు కేకలువేయడము ఉంటుంది.
ఏమి జరుగుతుంది? దేవుడు ఆయనయొక్క వధువును ఐక్యపరుస్తూ మరియు ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన తననుతాను బయలుపరచుకుంటూ మరియు తననుతాను మనకు ప్రత్యక్షపరచుకొనుచుండగా మనము ఒక్కటైయుంటాము, ఏక మనస్సుతోను మరియు ఏక ఆత్మతోను ఉంటాము.
మీరు వెళ్ళగల మరే గొప్ప స్థలము లేదు, మీరు వినగల మరే గొప్ప స్వరము లేదు; టేపులలో దేవునియొక్క స్వరము నేరుగా మీతో మాట్లాడటం కాకుండా మరే గొప్ప అభిషేకము లేదు.
దేవుడు ఆదినుండి ఆయనయొక్క వాక్యమును కనిపెట్టుకొనియున్నాడు మరియు తన పిల్లలందరూ వెళ్ళి ఆయన మాట్లాడటాన్ని మరియు ఆయన తన స్వంత వాక్యమును అనువదించడాన్ని వినగలుగునట్టి ఒక స్థలమును ఏర్పాటుచేశాడు. అది ఎటువంటి అంచనాలు, ఎటువంటి ఆశించడాలు, ఎటువంటి ఆలోచించడాలు లేనట్టి ఒక స్థలమైయున్నది; అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడును వినుటకు దేవుడు ఏర్పాటుచేసిన స్థలమైయున్నది.
అది మీకు బయలుపరచబడినప్పుడు, అది మీ హృదయములో మరియు మీ అంతరాత్మలో ఆన్ చేయబడినట్టి ఒక గొప్ప వెలుగుగా ఉన్నది…మీరు ఇట్లు కేకవేస్తారు, “విషయం ఇదే. నేను దానిని చూస్తున్నాను. నేను వాక్యముతో ఒక్కటైయున్నాను. నేనే వాక్యమైయున్నాను. నేను వధువైయున్నాను. నేను చేరుకున్నాను.”
అది జరుగుతున్నది, మరియు వారు దానిని ఎరుగకయున్నారు. చూడండి, విషయం అదే. చూశారా? అవును, అయ్యా. “ఏలయనగా శరీరము ఎక్కడుండునో, పక్షిరాజులు అక్కడ పోగవును,” అది ఎంతో ఖచ్ఛితమైయున్నది. చూశారా? అది దానినే చెప్పింది. శరీరము అంటే ఏమిటి? వాక్యమైయున్నది. ఆయనే వాక్యమైయున్న, ఆ శరీరమైయున్నాడు, క్రీస్తు! “మీలో ఉన్న క్రీస్తేయైయున్నాడు,” నిన్నా, నేడు, మరియు నిరంతరము ఒక్కటేరీతిగా ఉన్నవాడైయున్నాడు. అది ఎంత సత్యము కదా!
వాక్యమును వినడానికి మనము కూడివస్తుండగా, మన చింతలన్నీ, మన ఒత్తిడిలన్నీ, మన సమస్యలన్నీ, మటుమాయమైపోతాయి. మనము చింతించడానికి ఏదియు లేదని; మనము ఆయనయొక్క వధువైయున్నామని మనము గుర్తిస్తూండగా మనము సంతోషిస్తాము. ఆయన మనతో మాత్రమే కాదు గానీ, ఆయన మనలో ఉన్నాడు. మనము విత్తనపు వాక్య వధువైయున్నాము. సమస్తమూ సరిగ్గా ఉన్నది. ఆయన సమయము ఖచ్చితమైనది. మనము పరిపూర్ణులమైయున్నాము.
మనము ఆయనయొక్క కన్యక-జన్మ ద్వారాయైన శరీరధారియైన వాక్యమైయున్నామని చెప్పుటకు మనము ఎంతో తృప్తిచెందియున్నాము మరియు కృతజ్ఞులమైయున్నాము; నిన్నా, నేడు, మరియు నిరంతరము ఒక్కటేరీతిగా ఉన్న యేసుక్రీస్తు, మనలో జీవిస్తూ నివసిస్తున్నాడు. హల్లెలూయా!
మనము ఒక్క మాట విషయంలో కూడా రాజీపడలేము. మనము టేపులలో ఉన్న దేవునియొక్క స్వరమును వినవలసియున్నాము.
ఒక పక్షిరాజు రాజీపడటాన్ని మీరెన్నడైనా చూశారా? లేదు, అయ్యా. దానిలో రాజీపడటమనేది ఏదీ లేదు. అలాగే ఒక అసలైన క్రైస్తవుడు కూడా రాజీపడడు. అతడు మృదువుగా ఉండడు. అతడు దానిని కనుగొనేవరకు వేటాడుతాడు. ఆమేన్. అవును, అయ్యా. అతడు తన మాంసమును కనుగొంటాడు. అతనికి తాజా మన్నా కావాలి. అతడు అక్కడికి వెళ్ళి మరియు దానిని కనుగొనేవరకు త్రవ్వుతాడు. అతడు పైకి మరియు ఇంకా పైకి ఎగురుతాడు. ఈ లోయలో ఏదీ లేనట్లైతే, అతడు ఇంకొంచెం పైకి ఎగురుతాడు. మీరు ఎంత పైకి వెళ్తే, అంత ఎక్కువ చూడగలుగుతారు. కావున ఈ దినముయొక్క పక్షిరాజులు సంవత్సరాల క్రితం చంపబడిన ఈ రాబందు ఆహారము తింటూ జీవించకుండా, ఇంకా పైకి ఎగురుతూ, దేవునియొక్క వాగ్దానములలోనికి త్రవ్వుతూ ఉండే సమయం వచ్చినది; దానిలోనుండి బయటకు రండి.
వధువా సిద్ధపడుము, ఈ ఆదివారము, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, మనము: 65-0218 విత్తనము తొక్కతో వారసత్వము పొందదు అనుదానిని వినుచుండగా, అత్యంత గొప్ప అభిషేకము క్రింద కూర్చొని, ఆ తాజా మన్నాను భుజిస్తాము.
ఈ దినమునకు దేవుడు ఏర్పాటు చేసిన పరిపూర్ణమైన మార్గముపై విందునారగించుటకు ప్రపంచమంతటినుండి వధువును మేము ఆహ్వానిస్తున్నాము. అదియే వధువు ప్రతీ మాటకు ఆమేన్ చెప్పగల ఏకైక స్థలమైయున్నది. ప్లే ను నొక్కి మరియు వాక్యమును వినుచు మరియు దానిని స్వీకరించడం ద్వారా అక్కడ పరిశుద్ధాత్మయొక్క సర్వోన్నతమైన అభిషేకము మాట్లాడి మరియు ఆయన వధువును పరిపూర్ణము చేస్తుంది.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
లేఖనములు:
పరిశుద్ధ. మత్తయి 24:24
పరిశుద్ధ. లూకా 17:30
పరిశుద్ధ. యోహాను 5:24 / 14:12
రోమా 8:1
గలతి 4: 27-31
హెబ్రీ 13:8
1 యోహాను 5:7
ప్రకటన 10
మలాకీ 4