ప్రసారము గూర్చి తరచుగా అడగబడిన ప్రశ్నలు FAQ
ప్రసారము అనేది ఒక డివైజులో ఇంటర్నెట్ ఉండగా మీడియాను ప్రత్యక్ష సమయములో ప్లే చేయుచూ మరొక డివైజులో సేవ్ చేసే చర్య. branhamtabernacle.org నుండి మీరు ఒక ఫైలును ప్రసారము చేసినప్పుడు, స్టోర్ చేయబడిన డేటా మా సర్వర్ల నుండి మీ డివైజుకు పంపబడుతుంది (లేదా "ప్రసారం") చేయబడుతుంది, అయితే ఆ ఫైలు మీ కంప్యూటర్ లో కాని లేదా మీ ఫోనులో కాని శాశ్వతంగా స్టోర్ చేయబడదు.
మరొక వైపు, డౌన్ లోడ్ అనేది మా సర్వర్ల నుండి ఒక ఫైలును "తీసుకొని" మరియు దానిని తరవాత ప్లే చేసుకొనుటకు మీ డివైజులో స్టోర్ చేయుటయైయున్నది.
“బఫ్ఫర్” అనగా డేటాను తాత్కాలికంగా స్టోర్ చేయుటకు కేటాయించబడిన కంప్యూటర్ మెమొరీ ప్రాంతం. నీటి వంటి ద్రవ్యమును స్టోర్ చేయుటకు ఉపయోగించే ఒక పాత్రకు దానిని పోల్చవచ్చు...
ఆ పాత్రకు అడుగున ఏ రంధ్రము లేకపోతే, ఆ పాత్ర పూర్తిగా నిండేంతవరకు దానిలో నీరు పోయవచ్చును. ఒకవేళ, ఎలాగైనాను, ఆ పాత్రకి అడుగున ఒక రంధ్రము ఉన్నచో, క్రమేణ నీరు కలుపబడకపొతే, ఆ పాత్ర ఖాళీ అయ్యేవరకు నీరు బయటకు పారుతూనే ఉంటుంది. ఆ పాత్రలో మంచి పరిధిని కొనసాగించుటకు సరిపోవునన్ని సార్లు నీరు కలుపబడుతున్నంత కాలం, నీరు ఒక స్థిరమైన రీతిలో బయటకు పారుతుంది. ఆ రంధ్రము పెద్దగా చేయబడిన యెడల, నీరు బయటకు వెళ్ళే ప్రవాహమును స్థిరముగా ఉంచుటకు ఇంకా తరచుగా నీటిని కలుపవలసి ఉంటుంది. బయటకు పారుతున్న నీటితో సరితూగుటకు అవసరమైనంత వేగముగా ఆ పాత్రలో నీరు కలుపబడని యెడల, ఆ పాత్ర తిరిగి-నింపబడే సమయానికి ఆ ప్రవాహము ఆగిపోతుంది.
ఈ విధానము ఆడియో ప్రసారముకు కూడా వర్తిస్తుంది. ఈ విషయములో, “పాత్ర” అనేది కంప్యూటర్ మెమొరీలో “బఫ్ఫర్” అయున్నది, మరియు లోపలికి వచ్చే ఆడియో డేటా “నీరు” అయున్నది.
మీరు ఒక ఆడియో ప్రసారమును వినప్పుడు, మీరు, వాస్తవంగా, బఫ్ఫర్ నుండి వచ్చే డేటాను వినుచున్నారు. బ్యాక్గ్రౌండ్ లో కమ్మ్యునికేషన్ సాఫ్ట్వేర్ పనిచేయడం ద్వారా బఫ్ఫర్ “నింపబడుతుంది.” బఫ్ఫర్ అనేది మరలా నింపబడే సమయముకంటే త్వరగా ఖాళీ అయిన యెడల, సాఫీగా ప్లే అవ్వడం కొరకు సరిపడా డేటాను పొందుకునేవరకు ఆడియో ఆగిపోతుంది లేదా “తడబడుతూ” వస్తుంది.
ఆడియో ప్లేబ్యాక్ సాఫీగా ఉండుటకు బఫ్ఫర్ ను నింపుతూ ఉండే ప్రక్రియను బఫ్ఫరింగ్ అంటారు.
అనేక కారనములను బట్టి, ఇంటర్నెట్ పై ప్రసారము యొక్క వేగము స్థిరముగా ఉండదని గుర్తుంచుకోవడం ముఖ్యం. వేగములోని ఈ తేడాలను సాఫీ చేయుటకు బఫ్ఫరింగ్ అవసరమైయున్నది. ఉపయోగించబడుచున్న కమ్యూనికేషన్ సాఫ్టువేరు ద్వారా బఫ్ఫర్ సైజు నిర్ధారించబడుతుంది. బఫ్ఫర్ ఎంత పెద్దగా ఉంటే, అంత తక్కువ సార్లు దానిని మరలా నింపవలసియుంటుంది.
కావున మనము బఫ్ఫర్ ను చేయగలిగినంత పెద్దగా చేసి మరియు ఎందుకని దాని గురించి మర్చిపోకూడదు? బహుశా మీరు ఊహించినట్లే, దానికి జవాబు అంత సులువైనది కాదు. బఫ్ఫర్ ఎంత పెద్దగా ఉంటే, ప్రారంభములో డేటాను నింపడానికి అంత ఎక్కువ సమయం పడుతుంది మరియు కావున ప్రాసారము ప్లే అవ్వడానికి ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది. డీఫాల్ట్ బఫ్ఫర్ సైజులు ఈ పరిగణల మధ్య రాజీ వలెయున్నవి.
(బహుశా కొన్ని వందల మెగాబైట్ల సైజు ఉండే) మీడియా ఫైల్సును ఉంచుకునేందుకు సరిపడా స్టోరేజి లేదు .
"అది జరుగుచుండగనే" కూటములో పాల్గొనాలని ఆశ.
వినియోగదారులు తాము డౌన్ లోడ్ చేసుకున్న ఏ ఫైల్సునైనా తరువాతి సమయములో ఇంటర్నెట్ పై ఆధారపడకుండానే ప్లే చేసుకోవచ్చు.
ఆన్ లైన్ ఆడియో కోసం (32 kbps) బ్యాండ్ విడ్త్ ను సంభాళించడానికి సరిపడా ఒక కనెక్షన్ మీకు అవసరమైయున్నది. అంత డేటా రావడాన్ని మీ కంప్యూటర్ భరించలేని యెడల అది ఆగిపోవచ్చు (లేదా డిస్కనెక్ట్ కూడా అవ్వవచ్చును). మీ కంప్యూటర్ దానిని “భరించలేకపోవడానికి” అనేక కారణాలు కలవు:
- మీ కంప్యూటర్ పాతదైన యెడల లేదా మీరు ఒక పాత సాఫ్టువేరును ఉపయోగిస్తున్న యెడల (అంటే., మీ బ్రౌజర్ గడువు ముగిసిన యెడల), ఆ డేటా ప్రసారమును సంభాళించుటకు సరిపడే “కంప్యూట్ శక్తిని” అది కలిగియుండకపోవచ్చును.
- మీరు ఒక ఆడియో ప్రసారమును వినడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు చేయుచున్న ఇతర చర్యల కొరకు CPU/మెమొరీ వనరులు ఉపయోగించబడవచ్చును. మీ ప్రసారము ప్లే అవుతున్నప్పుడు ఇతర చర్యలను అదుపు చేయండి.
- మీకు అవసరమైన స్థాయిలో డేటాను అందించడానికి తగినంత వేగంగా మీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండకపోవచ్చు.
- ఇంటర్నెట్ కూడా మీ సమస్యకు దోహదపడవచ్చు. మా సర్వర్ల నుండి మీ డివైజుకు చేరడానికి ఆడియో డేటా తీసుకునే మార్గము “రాతి మీద వ్రాయబడినది” కాదు మరియు మీరు కనెక్టు అయిన ప్రతీసారి మారుతుంది. ఈ మార్గాలలో కొన్ని కోరుకొనబడని ఆలస్యముకు పరిచయం చేసేవాటిగుండా వెళ్ళవచ్చును. అదే విషయం అయిన యెడల, చేయవలసిన ఉత్తమమైన విషయమేదనగా (బహుశా) మెరుగైన ఆలస్య లక్షణాలుతో ఉన్న భిన్నమైన మార్గామును పొందుకునేందుకు సర్వర్ కు మరలా కనెక్టు అవ్వడమే.
కొన్నిసార్లు, ఫైర్‌వాలుల వెనుక ఉన్న కంప్యూటర్‌లు కనెక్షన్‌ని పూర్తి చేయడంలో ఇబ్బంది పడతాయి. మీరు విజయవంతంగా కనెక్ట్ చేయగలరో లేదో చూడటానికి మీ ఫైర్‌వాల్ ను (తాత్కాలికంగా) నిలిపివేయడానికి ప్రయత్నించండి.
"లైవ్" ఆడియో ప్రసారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసులకు నిజమైన ఆశీర్వాదంగా ఉన్నది (మరియు అట్లు కొనసాగుతుంది).
అది చెప్పబడియుండగా, దీనిపై ఆధారపడే విధంగా ఇది పనిచేయునట్లు తయారుచేయడానికి వెనుకనున్న టెక్నాలజీ క్లిష్టమైనది, మరియు అందువలనే మీ ప్రసారపు అనుభవమును మెరుగుగా చేయడానికి కొన్ని సహాయకరమైన "సూచనలను" మేము తెలియజేయగోరుచున్నాము. ఎలాగైనను, మొదట, కొంచం నేపథ్యమును ఇస్తాము.
మీ డివైజుపై మీరు వినుచున్న ఆడియో అనేది ప్రక్రియలు మరియు ఈవెంట్ల యొక్క "గొలుసు" అయున్నది, మరియు చెప్పబడిన విధంగా; ఒక గొలుసు దాని యొక్క అత్యంత బలహీనమైన లింకు వద్దనే అత్యంత బలమైనది. మా సర్వీసుల నుండి ఆడియో ఇంటర్నెట్ దానిని సంభాళించే ఒక రూపంలోనికి ఎన్కోడ్ చేసేవాటి వద్దకు పంపబడుతుంది. అక్కడ నుండి, పంచబడుట కొరకు పబ్లిక్ ఇంటర్నెట్ పై ఒక కంటెంట్ డెలివరీ నెట్వర్కుకు పంపించబడుతుంది. మీరు ఒక ప్రసారము సర్విస్ కోడు పై నొక్కినప్పుడు, ఆ కోడు బ్యాక్గ్రౌండులో కంటెంట్ డెలివరీ నెట్వర్కుకు కనెక్షన్ చేసి మరియు ప్రసారమును ప్రారంభిస్తుంది. అప్పుడు, మీరు ప్రసారమును ఏ విధంగా వింటున్నారన్నది ముఖ్యమవుతుంది.
నెట్ వర్కు
ప్రాక్టికల్ గా అయితే, మీ లోకల్ ఏరియా నెట్వర్కుకు (LAN) ఒక వైర్ లెస్ WiFi కంటే వైర్ ఉన్న ఈథర్నెట్ కనెక్షన్ తో కనెక్ట్ చేయండి. ఇలా చేయడం ద్వారా “గొలుసు” లో ఒక లింకును తీసివేస్తుంది మరియు మరింత స్థిరమైన కనెక్షన్ ను ఇస్తుంది.
ఒకవేళ, ఎలాగైనా, వైర్ లెస్ కనెక్షన్ మాత్రమే మీకున్న అవకాశమైన యెడల, మీ కనెక్షన్ కు సహాయం చేయడానికి మీరు చేయగల కొన్ని సంగతులు కలవు. WiFi రేడియోపై ఆధారపడి ఉంటుంది. WiFi రూటర్ కు వీలైనంత దగ్గరగా కూర్చోండి. ఆ విధంగా, రేడియో సిగ్నల్ బలము పెరుగుతుంది మరియు కనెక్షన్ ఎక్కువ స్థిరంగా ఉంటుంది. మీరు రూటర్ నుండి చాలా దూరంలో కూర్చున్నట్లయితే, అప్పుడు WiFi సిగ్నల్ బలము తగ్గుతుంది మరియు కనెక్షన్ లో సమస్యలు ఏర్పడవచ్చును. మీరు సిగ్నల్ బలమును తెలుసుకొనుటకు మీ డివైజు డిస్ప్లే లో ఉండే “గీతల” యొక్క అంకెను ఉపయోగించవచ్చు.
డివైజు (కంప్యూటర్) వనరులు
ప్రసారము అనేది వనరులతో కూడిన తీవ్రమైన ప్రక్రియ. అంటే, ప్రసారము ఎంతో ఎక్కువ ప్రక్రియ శక్తిని మరియు మీ డివైజులో మెమొరీని తీసుకుంటుంది. మీరు చేయవలసింది ఏమిటంటే మీరు ప్రసారమును పొందుచున్నప్పుడు మీ డివైజుపై బ్రౌజర్ మాత్రమే పనిచేస్తుండేల చూసుకోవాలి. ప్రసారము ప్రారంభించుటకు ముందు వీటిని ప్రయత్నించండి:
1. మీ డివైజును మరలా ప్రారంభించండి. ఇది పనిచేయడానికి మీకు ఒక "కొత్త ప్రారంభామును" ఇస్తుంది.
2. నడుస్తున్న ప్రోగ్రామ్‌లను నిష్క్రమించండి, మూసివేయండి లేదా నిలిపివేయండి. విండోస్ ప్లాట్‌ఫారమ్‌లో, అవసరమైతే టాస్క్ మేనేజర్‌ని ఉపయోగించవచ్చు. గమనిక: ప్రోగ్రామ్‌ను కనిష్టీకరించడం సరిపోదు. కనిష్టీకరించబడిన ప్రోగ్రామ్‌లు ఇంకనూ కంప్యూటర్ వనరులను ఉపయోగిస్తాయి. మీకు యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ పనిచేస్తున్నట్లయితే, కనీసం ప్రసారము సమయంలో అది మీ సిస్టమ్‌ను స్కాన్ చేయకుండా చూసుకోండి. స్కానింగ్ చాలా వనరులను ఉపయోగించవచ్చు.
3. మీ బ్రౌజర్ ను ప్రారంభించి మరియు మీకు నచ్చిన ప్రస్స్రమును ఎంచుకోండి.
బ్రౌజర్ ఎంపిక
మీరు ఉపయోగించే బ్రౌజర్ మీ ప్రసారము పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. మార్కెట్‌లో అనేక బ్రౌజర్‌లు ఉన్నాయి, మరియు మీకు ఏది ఉత్తమంగా పని చేస్తుందో గుర్తించడానికి మీరు వాటిలో అనేకమైన వాటిని ప్రయత్నించాల్సి ఉంటుంది. IOS ప్లాట్‌ఫారమ్‌లో, AppStore కి వెళ్ళి "బ్రౌజర్" కోసం వెతకండి. ఆండ్రాయిడ్ కోసం, PlayStore కి వెళ్ళండి.
చాలామంది వినియోగదారులు వారి డివైజుతో వచ్చిన డిఫాల్ట్ బ్రౌజర్ ను ఉపయోగిస్తారు. సాధారణంగా అది సఫారీ, క్రోమ్, లేదా ఇంటర్నెట్ ఎక్ష్ప్లొరర్ అయ్యుంటుంది, అయితే ఇటీవల విజయవంతమైన ఒక బ్రౌజర్ ఏదనగా మొజిల్లా ద్వారాయైన ఫైర్ఫాక్స్. అనేకమంది వినియోగదారులు ఫైర్ఫాక్స్ తో ప్రసారము విజయవంతముగా ఉందని నివేదికను ఇచ్చారు. విండోస్ వినియోగదారులు, మైక్రోసాఫ్ట్ ద్వారాయైన ఎడ్జ్ బ్రౌజర్ కూడా పరిగణించవచ్చు.
మీ ప్రసారం అనుభవంతో మీ సంతృప్తి మాకు చాలా ముఖ్యమైనది. ప్రసారముకు సంబంధించి మీకు ఏవైనా సమస్యలు లేదా ప్రశ్నలు ఉంటే, Branhamtabernacle.orgలో ప్రసారము వెబ్‌పేజీలో అందించిన లింక్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి. ఈ లింక్ పేజీ దిగువన ఉంది, కనుక దాన్ని కనుగొనడానికి క్రిందికి స్క్రోల్ చేయండి.
దయచేసి ప్రసారము గూర్చిన మీ ప్రశ్నలతో/సమస్యలతో మమ్మల్ని సంప్రదించండి. మీకు సహాయము చేయడానికి మేము మా శాయశక్తులా ప్రయత్నిస్తాము.