ప్రియమైన పక్షిరాజు పిల్లలారా,
శరీరము ఎక్కడున్నదో, అక్కడే వధువు గుమిగూడుతుంది. మరియు మనకైతే, మనము ఆ తాజా మాంసపు మన్నాను పొందుకోగల ఒకేఒక్క చోటు ఉన్నది: మరది ప్లే ను నొక్కి మరియు టేపులలో ఉన్న దేవుని స్వరమును వినడం ద్వారాయైయున్నది.
తాజా మన్నా గురించి మాట్లాడండి, సరిగ్గా మన చేతివ్రేళ్ళ సమీపములో ఏమున్నది అనేదాని గురించి మనం అసలు ఆలోచించగలమా? స్వయంగా దేవునియొక్క స్వరమే టేపు ద్వారా ఆయనయొక్క వధువుతో మాట్లాడుచున్నది, మనము వింటున్నది, తన వధువుతో యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడును పలుకడానికి దేవుడే మానవ స్వరమును ఉపయోగించుకోవడమైయున్నది అనుటలో, ఇక ఎటువంటి అంచనా వేయడాలు లేవు, ఎంటువంటి ఆలోచించడాలు లేవు, ఎటువంటి ప్రశ్నించడాలు లేదా సందేహించడాలు కూడా లేవు.
మనము అక్కడికి వెళ్ళి మరియు మనము వింటున్న మాటలు ఒక మనుష్యుని మాట కాదని, లేదా అతనియొక్క అనువాదమైనా లేక ఆలోచనయైనా దానికి కలుపబడలేదు గాని, అది ఆయనయొక్క వాక్యమును బయలుపరుస్తూ, పక్షిరాజు పిల్లలమైయున్న మనతో మాట్లాడుచున్నట్టి స్వచ్ఛమైన దేవుని వాక్యమైయున్నదని మన అంతరాత్మలను దానిపై ఆధారముచేసుకోగల ఏకైక స్థలము అదేనని, ప్రత్యక్షత ద్వారా మనము నమ్ముతున్నాము.
మనము వాక్యము చుట్టూ సహవాసము కలిగియుంటాము. మనము మన బైబిలు గ్రంథములలో ఆయనయొక్క వాక్యమును చదువుతాము. దేవునిచేత అభిషేకించబడి మరియు పిలువబడిన పురుషులు ఆయనయొక్క పరిశుద్ధాత్మతో నింపబడి, దేవునియొక్క వాక్యమును ఉటంకించడాన్ని మరియు బోధించడాన్ని కూడా మనము వింటున్నాము, కానీ మన దినములో, ప్లే ను నొక్కడం ద్వారా, మనము ఆయనయొక్క పరిపూర్ణమైన వాక్యము పలుకబడుటను వినగల ఒక స్థలమును దేవుడు ఏర్పాటుచేశాడు.
మనకు పరిపూర్ణమైన జవాబు దొరుకునట్లు మన హృదయంలో ఉన్న ప్రశ్నలను అడగడానికి కూడా తండ్రి ఆయనయొక్క వధువుకు అవకాశం ఇచ్చాడు:
• పరిశుద్ధాత్మను కలిగియున్న వ్యక్తిలో భాషల వరమును లేదా ప్రవచన వరమును సాతానుడు వాడుకోగలడా?
• మత్తయి 12, 32 వ వచనంలో యేసుయొక్క భావము ఏమిటి?
• దయచేసి మొదటి కొరింథీ 13:8-12 వరకు వివరించండి.
• ఆరోగ్యవంతమైన భర్తను మరియు పిల్లలను కలిగియున్న స్త్రీలు ప్రజా వ్యవహారాలలో పనిచేయడానికి అనుమతి ఉందా?
• ఒక స్త్రీ తన జుట్టును ఉంగరాలు త్రిప్పుకోవడం తప్పా?
ఆయనయొక్క వధువును ఆశీర్వదించడానికి మరియు బలపరచడానికి దేవుడు అనేక మార్గములను ఏర్పాటుచేశాడు, కానీ ఆయనయొక్క వధువు తాము వినుచున్నది ఆయనయొక్క పరిపూర్ణమైన వాక్యమైయున్నదని 100% నమ్మకము కలిగియుండగల ఒకేఒక్క స్థలమును ఆయన ఏర్పాటుచేసాడు. కలుషితమవ్వడానికి ఒక్క అవకాశము కూడా లేనట్టి జీవజలపు ఊట ఒకేఒక్కటి ఉన్నది, పక్షిరాజు పిల్లలు అక్కడనుండి త్రాగగలుగుతాయి. ప్లే ను నొక్కండి.
ఈ ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, ఆ ఊటనుండి త్రాగడానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, అక్కడనుండి మనము 64-0823E “ప్రశ్నలు మరియు జవాబులు #2” ను వింటాము.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్