ఆదివారం
30 జులై 2023
63-0319
రెండవ ముద్ర

ప్రియమైన వధువా,

1933 లో ఆ దినమున ఓహియో నదిపైన ఆ అగ్నిస్తంభము ప్రత్యక్షమైనప్పుటినుండి, ఈ వర్తమానము గూర్చియైనా లేదా దాని వర్తమానికుని గూర్చియైనా వధువు ఆశ్చర్యపోలేదు. ఆయన యొక్క వధువును పిలవడానికి విలియం మారియన్ బ్రాన్హామ్ భూమి మీదకి పంపబడిన దేవుని యొక్క శక్తివంతమైన 7వ వర్తమానికుడైన దూత అని మనము ఎరిగియున్నాము.

ఆ దినము నుండి, దేవుడు ఆయన రాకడ కొరకు తన వధువును సమకూర్చుచున్నాడు. ఇప్పుడు అది ఏ దినమైనా కావచ్చునని మనము ఎరిగియున్నాము గనుక; మనము చాలా గొప్ప ఎదురుచూపుతో ఉన్నాము.

మునుపెన్నడూ లేని విధంగా, ఆయన మన విశ్వాసమును కట్టుచున్నాడు, మనము ఆయన యొక్క విశ్వసనీయమైన వధువు అని మనకు చెప్పుచూ, మరలా మనకు నిశ్చయతను ఇచ్చుచున్నాడు. ఆయన యొక్క దాచబడిన-ఆహారముతో నిలిచియుండుటను బట్టి, మనకు ఏది అవసరమైనా గానీ, అది అక్కడ టేపులపై ఉన్నదని మనము ఎరిగియున్నాము.

అది ఖచ్చితంగా మనకు ఎలా తెలుసు? దేవుడు తన దాసులగు ప్రవక్తలకు బయలుపరచకుండా ఏమియు చేయడని వాక్యము చెప్పుచున్నది. కావున దేవుడు ఏదైనా బయలుపరచబోవుచున్న యెడల, లేదా ఏదైనా చేయబోవుచున్న యెడల, మనకు ఎత్తబడు విశ్వాసమును ఇవ్వబోవుచున్న యెడల, ఆయన మన ప్రవక్త ద్వారా, మరియు తన ప్రవక్త ద్వారా మాత్రమే దానిని ఉరమబోవుచున్నాడని మనము ఎరిగియున్నాము.

ఆశ్చర్యపోయే రోజులు గతించిపోయినవి. వధువు ఒక తీర్మానము తీసుకున్నది. టేపుల ద్వారా దేవుడు తన వధువుతో మాట్లాడుటను వినుటకంటె ప్రాముఖ్యమైనది ఏదియు లేదు. ఆ మాటలు మాత్రమే యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యున్నవని స్వయంగా దేవునిచేత నిర్ధారించబడినవి.

సమయము అయిపోయినది మరియు మన శత్రువు యొక్క చెడ్డశ్వాస యొక్క భారాన్ని మనము మన చుట్టూ స్పర్శించగలుగుచున్నాము. పోరాటములు వరుసగా ఉన్నవి మరియు సాతానుడు అన్ని వైపులా నుండి దాడి చేయుచున్నాడు, అయితే దేవునికి స్తోత్రములు మనము ఆత్మీయ ఆహారమును కలిగియున్నాము, మరియు మనము రాత్రింబవళ్ళు యజమానుని బల్ల వద్ద కూర్చుని, ఆ దాచబడిన మన్నాపై పోషించబడుచున్నాము. ఆయన అనుదినము అత్యధికముగా మనకు బయలుపరచుకొనుచు ఇట్లు చెప్పుచున్నాడు, “నా ప్రియా అంతా క్షేమమే. నేను నీతో ఉన్నాను. నేను నిన్ను ఎన్నడూ విడువను మరియు ఎడబాయను అని నేను నీతో చెప్పియున్నాను. కొనసాగుతూనే ఉండుము. ఆ దయ్యములను వెళ్ళగొట్టుము. నేను నీకు, నా వాక్యము అనే అణుబాంబును ఇచ్చియున్నాను, దానిని ఉపయోగించుము. నేను దానిని తలంచాను. పిదప అది వ్రాయబడినది, మరియు ఇప్పుడు, నీ దినములో, నేను నీకు ఇట్లు చెప్పుటను నీవు వినగలుగునట్లు నేను దానిని మాట్లాడాను, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు నా వధువైయున్నావు. నీవు శరీరధారియైన వాక్యమైయున్నావు.”

దేవుడు మానవ పెదవుల ద్వారా మాట్లాడి మరియు తన వాక్యమును మనకు ఇచ్చాడు; మనము దేనికీ భయపడాల్సిన అవసరం లేదు. అది మన వాక్యము, మన తలంపులు, మన ఊహా కాదు, అది దేవుడు మనకిచ్చిన తన వాక్యమైయున్నది. మన విశ్వాసము ఆయన వాక్యములో ఉన్నది మరియు ఆయన వాక్యము ఎన్నడూ విఫలమవ్వదు!

ఇప్పుడు, ఈ ముద్రలు తెరవబడుటను మనము వినుచుండగా, పరిశుద్ధాత్మ మరొక్కసారి మనతో మాట్లాడుచున్నాడు మరియు అక్కడ గొర్రెపిల్ల జీవ గ్రంథములో మన పేర్లు వ్రాయబడియుండుటను మనము చూడగలుగుచున్నాము. మనము ఊరకయుండలేకున్నాము...అవును, అక్కడ వ్రాయబడినది నా పేరే. ఆయన నా గురించియే మాట్లాడుచున్నాడు.

ఈ ఆదివారం జఫర్సన్ విల్ కాలమానము 12:00 P.M గంటలప్పుడు., మాతోపాటు కూడుకొనండి, మరియు మీ పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథములో వ్రాయబడినవని దేవుని యొక్క స్వరము మీతో చెప్పుచుండగా రెండవ ముద్రను 63-0319, వినండి.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

 


 

వర్తమానము వినుటకుముందు చదవాల్సిన లేఖనములు:

పరిశుద్ధ. మత్తయి 4:8 / 11:25-26 / 24:6
పరిశుద్ధ. మార్కు 16:16
పరిశుద్ధ. యోహాను 14:12
2వ థెస్సలోనిక 2:3
హెబ్రీ పత్రిక 4:12
ప్రకటన 2:6 / 6:3-4 / 17వ అధ్యాయము / 19:11-16
యోవేలు 2:25
ఆమోసు 3:6-7