ఆదివారం
01 నవంబర్ 2026
60-0518
దత్త పుత్రత్వము రెండవ భాగము
కూడిక ఇంత సమయంలో ప్రారంభమవుతుంది:
0
రోజులు
19
గంటలు
40
నిమిషములు
35
క్షణములు

Sun Apr 26, 2020 10:00 AM EDT

ప్రియా,

దేవునియొక్క ప్రత్యక్షపరచబడిన మరియు పిల్లలుగా స్వీకర్ణించబడిన కుమారులారా మరియు కుమార్తెలారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వధువుతో ఐక్యమై, పరలోక స్థలములలో కలిసి కూర్చోడానికి, దేవునియొక్క స్వరము నేరుగా మీతో మాట్లాడటాన్ని వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?

అవును!!! దేవుని స్వరము సరిగ్గా మనము ఎవరమనేది చెప్పుటను వినడానికి మనము సిద్ధంగా ఉన్నాము.

నేను మిమ్మల్ని “ప్రియా” అని పిలిచాను, ఎందుకంటే మీరు అదేయైయున్నారు. మీరు—మీరు నా ప్రియురాళ్ళైయున్నారు. విషయమేమిటో మీకు తెలుసా? ఆ…ఇక్కడ ఒక లేఖనము వస్తుంది. పౌలు ఇట్లన్నాడు, “దేవాసక్తితో నేను మీ పట్ల (ఆయనయొక్క సంఘము) పట్ల ఆసక్తి కలిగియున్నాను, ఏలయనగా నేను మిమ్మును ప్రధానము చేసితిని.” విషయము అదేయైయున్నది, దానిలోనే ఉన్నది. విషయం అదియే. “ఏలయనగా పవిత్రురాలైన కన్యకగా, నేను మిమ్మల్ని ప్రధానము చేశాను, మిమ్మల్ని క్రీస్తుకు ప్రధానము చేశాను.”

దేవునికి మహిమ, ఆయనయొక్క దూత మనల్ని ఆయనకు ప్రధానము చేశాడు. ఆయనయొక్క వాక్యమునకు, ఈ వర్తమానమునకు, టేపులలో ఉన్న ఆయనయొక్క స్వరమునకు మనము పవిత్రురాలైన కన్యకలమైయున్నాము. మనమిప్పుడు క్రీస్తుకు ప్రధానము చేయబడియున్నాము.

ఆదివారము మనము సిద్ధముగా ఉంటాము మరియు గొప్ప ఎదురుచూపుతో ఉంటాము. మనము మన వ్రేళ్ళను కొరుక్కునేటంత అతురతతో, మన అంతరాత్మను గిద్దించుకుంటూ, మరియు మన హృదయాలను కుదిపివేసుకుంటూ ఉండబోతున్నాము. జగత్తుపునాదికి ముందే దేవుడు మన పేర్లను తన గ్రంథములో పెట్టినప్పుడు, వారు రక్షణ ప్రణాళికను చూసినప్పుడు, సరిగ్గా ఉదయ నక్షత్రములు ఏకముగా పాడి మరియు దేవుని కుమారులు సంతోషముతో కేకలు వేసినప్పటివలెనే, మరొకసారి మనము కేకలు వేస్తూ, ప్రభువును స్తుతించుచు, “ఆమేన్, హల్లెలూయ” అని ఎలుగెత్తి అరుస్తూ ఉంటాము.

ప్రపంచముయొక్క ఆది మొదలుకొని, ఈ దినమువరకు కూడా, తండ్రియైన దేవుడు, మన కొరకు వేచియుండటాన్ని మనము అసలు అర్థం చేసుకోగలమా? ఈ అంత్య దినములలో మనము ప్రత్యక్షపరచబడేదానిని ఆయన చూశాడు, మరియు ఈ దినము వరకు దాచబడిన రహస్య విషయాలను మనకు బయలుపరచడం కొరకు మనము పరోశుద్ధాత్మయొక్క శక్తితో పైకి లేవాలని ఆయన ఎదురుచూస్తూ మూలుగుతూ ఉన్నాడు.

కాలములన్నిటి గుండా, ఈ కార్యములు కనపరచబడుటకు ఈ కడవరి దినముల కొరకే ప్రవక్తలందరూ వేచియున్నారు. ఆయనయొక్క సంఘము లూథరను కాలమునుండి, బ్యాప్టిస్టు కాలమునుండి, మెథడిస్టు కాలమునుండి, పెంతెకొస్తు కాలమునుండి, మరియు ఇప్పుడు నేరుగా ఆ తలరాయి అమర్చబడే స్థాయికి ఎదిగేవరకు తాను వేచియున్నాడని తండ్రియైన దేవుడు చెప్పాడు. అప్పుడు భవనము పూర్తవుతుంది.

ప్రభువు మాట్లాడి మరియు పరితపించినట్టి వాగ్దాన దినములు ఇప్పుడు చోటుచేసుకుంటున్నాయి మరియు మన యెదుట నెరవేర్చబడుతున్నాయి…మరియు మనలో నెరవేర్చబడుతున్నాయి. మనము ఇప్పుడు క్రీస్తుయేసులో ఉన్నాము, ఎక్కడైతే సమస్తము మనదేయై యున్నదో, అట్టి పరలోకస్థలములలో కూర్చొనియున్నాము, పరలోకపు ఆశీర్వాదములలో, పరలోకపు ఆత్మలో ఉండియున్నాము. మనము వాగ్దాన దేశములో ఉన్నాము మరియు సమస్తము మన స్వాధీనములో ఉన్నది.

ఆయనయొక్క మొదటి విత్తనము సంపూర్ణ పరిపక్వతలోకి వచ్చినది మరియు ఆయనయొక్క వధువు యెదుట అల్లాడించబడినది. పరిశుద్ధాత్ముడు తండ్రియైన దేవునికి నివేదించి మరియు ఆయనయొక్క బలిష్ఠుడైన దూత గురించి దీనిని చెప్పాడు:

నీ దూత కృపలో ఎదుగుతున్నాడు! అతడు అడవులలో ఫిరంగి దాడులు చేస్తున్నాడు. అతడు ఆ గొర్రెలను తీసుకొని మరియు సరిగ్గా నీవు వ్యవహరించినట్లే అతడు వారితో వ్యవహరించగలుగుతాడు. అతడు వారికి సముద్రపు నాచును ఎన్నడూ ఇవ్వడు. అతడు వారికి కలుపు మొక్కలను ఎన్నడూ ఇవ్వడు. ‘మేము సంఘములో చేరాలనుకుంటున్నాము’ అని చెప్తూ వారు వచ్చినప్పుడు, అతడు ఇట్లంటాడు, ‘మీ నోరు మూసుకోండి, మీకు అది అవసరము లేదు! లేదు, అయ్యా. మీకు అవసరమైనది ఏమిటో వినండి, “పశ్చాత్తాపపడి, పాప క్షమాపణ నిమిత్తము, మీలో ప్రతివాడును యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందండి. మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందెదరు.”’

“ఓ, అతడు నిజంగా ఆ విధంగా అంటాడా?”

“అవును, అయ్యా, అతడు నిశ్చయంగా అట్లు చెప్తాడు.”

“మంచిది, నేను దానిని వ్రాసినది సరిగ్గా అట్లేయైయున్నది.”

“అతడు దానిని సరిగ్గా అట్లే చెప్తాడు.”

“ఏమిటో నీకు తెలుసా? అతడు ‘ఈ టౌనుకు వచ్చి మరియు కూడికను నిర్వణించడం కుదరదని’ ఒక ఫలానా-ఫలానా ఆర్చ్ బిషప్పు అతనితో చెప్పడాన్ని నేను చూశాను. కానీ, నీకు తెలుసా, నేను ఒక విధంగా అతణ్ణి నడిపించాను, ‘ఎలాగైనా వెళ్ళు’ అని, నేను చెప్పాను. అతడు తన టేపులన్నిటినీ వెనుకకు తీసుకోవడం మంచిదని, మరియు అవి బయటకు పంపిణీ చేయబడుటకు అనుమతించవద్దని వారు అతనితో చెప్పారు. అయితే ఎలాగైనా మేము వెళ్ళాము!”

“నేను ఎవరికొరకైతే ఎదురుచూస్తున్నానో అట్టి నా దత్తపుత్రుడు అతడే. ఇప్పుడు నేను అతనిలోనుండి మాట్లాడి మరియు నా దాచబడిన మర్మములన్నిటినీ నా గొర్రెలకు బయలుపరచగలను.”

“తండ్రియైన దేవా అద్భుతము.”

“ఇప్పుడు నేను నీ ఇతర పిల్లల గురించి కూడా నీకు చెప్పాలని కోరుతున్నావా?”

“అవును, వారు ఎలా సాగుతున్నారు?”

“ఓ తండ్రీ…నీవు వారి విషయమై ఎంతో గర్వపడతావు. వారు కూడా అతనివంటివారే. ఆ ఆర్చ్ బిషప్పులు ఇంకను వారికి అదే విషయాన్ని చెప్తున్నారు, నీ స్వరమును వినడానికి ఆ టేపు సంఘాలకు వెళ్ళవద్దని చెప్తున్నారు. వారు వినవలసిన అత్యంత ప్రాముఖ్యమైన స్వరము టేపులు కాదని; ఇప్పుడు తామే ప్రాముఖ్యమైన స్వరములని వారు చెప్తారు.”

“నీ గొర్రెలు ఆ బోధకులతో ఏమంటాయో నీకు తెలుసా?”

“మీ నోరు మూసుకోండి, మేము టేపులతో నిలిచియుంటున్నాము, మేము దేవునియొక్క స్వరముతో నిలిచియుంటున్నాము.”

“వారు నిజంగా అట్లంటారా?”

“అవును, అయ్యా, వారు సరిగ్గా నీ వలెనే ఉన్నారు.”

“ఓ, ఎంత అద్భుతము. అది నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. నేను వారి కొరకు ఎంతో కాలంగా వేచి చూస్తున్నాను. ఇప్పుడు పుత్రస్వీకారము కొరకు వారు కూడా సిద్ధంగా ఉన్నారు!!”

“నీ స్వరమును వినడానికి, వారు ఈ ఆదివారము, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, వారియొక్క విధినిర్వహణలో ఉంటారు. ప్రపంచమంతటినుండి వారు కూడుకుని ఐక్యమైయ్యుండి మరియు ప్రతియొక్కరినీ వారితో చేరమని ఆహ్వానిస్తారు.”

“అద్భుతము, నేను వారితో అక్కడ ఉంటాను.”

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

గమనిక: డేలైట్ సేవింగ్ సమయము గురించి మర్చిపోకండి.

 

వర్తమానము: పుత్రస్వీకారము #2 60-0518

లేఖనములు:

ఆదికాండము 1:26
ఎఫెసీ మొదటి అధ్యాయము
రోమా 8:19
గలతి 1:6-9
హెబ్రీ ఆరవ అధ్యాయము
యోహాను 1:17