Sun Apr 26, 2020 10:00 AM EDT
బహుగా ప్రేమించబడిన ప్రియమైనవారలారా,
అనేక గొప్ప కార్యములు జరుగుతున్నాయి మరియు మన కొరకు భద్రపరచబడినవి అనేక గొప్ప కార్యములు ఉన్నాయి. దేవుడు తన వాక్యమును బయలుపరుస్తున్నాడు మరియు అనుదినము దానిని నెరవేర్చుచున్నాడు. మనము ఎప్పడు పైకి వెళ్తామో మనము కనుగొంటున్నాము, మరియు మనల్ని మనము సిద్ధపరచుకుంటున్నాము. మనము ప్రార్థనల ద్వారా మరియు యాచనల ద్వారా మన ముఖములను దేవుని తట్టునకు త్రిప్పుకొనియున్నాము, మరియు మనము జీవిస్తున్న ఘడియను ఆయన మనకు బయలుపరుస్తున్నాడు. సమయము అయిపోయినది; ఆయనయొక్క బహుగా ప్రేమించబడిన వధువైయున్న మనకొరకు, ఆయన వస్తున్నాడు.
కానీ మొదట, వారు ఆయన మాటలను వినాలని దేవుడు తన దూత ద్వారా కేకలు వేసి తన ప్రజలను హెచ్చరిస్తాడు. “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆయనయొక్క సంఘము స్వదేశములోనికి, ఈ ఘడియయొక్క వర్తమానము నొద్దకు తిరిగి వచ్చేంతవరకు దేవుడు ఆమెతో వ్యవహరించడు. అసలైనదాని వద్దకు తిరిగిరండి!”
నేను దానిని ఎంతగానో ఇష్టపడుతున్నాను. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుతో ఒక పర్వక్త నిలబడటాన్ని నేను వినినప్పుడు, సహోదరుడా, ఇక అంతే. నాకైతే, అది దానిని స్థిరపరుస్తుంది. విషయమంతా అదేయైయున్నది.
ఓ, మనము కూడా దానిని ఎంతగా ఇష్టపడుతున్నాము కదా. అది మన విషయంలో దానిని స్థిరపరుస్తుంది. సరిగ్గా ఆయన మనకు తర్ఫీదునిచ్చినట్లే మనము చేస్తున్నాము. వాస్తవానికి, మనము ఆయనయొక్క అసలైన వాక్యమును ఎన్నడూ విడిచిపెట్టలేదు, మనమెల్లప్పుడు టేపులలో ఉన్న దేవుని స్వరముతోనే నిలిచియున్నాము, ఏలయనగా అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యున్నది!!
పలుకబడి మరియు మనకు బయలుపరచబడినదానంతటినీ మనము అర్థం చేసుకోలేకపోవచ్చును, కానీ మనము ఎరిగియున్న ఒక్క విషయం మాత్రం ఏమిటంటే, టేపులలో ఉన్న ప్రతీ మాటను మనము నమ్ముతాము. మీరు ఆయనయొక్క వధువు అని తెలుసుకోవడంలో అది నిజమైన కొలమానమైయున్నది.
మనము, కాలమనే తెరకు ఆవల ప్రవక్త చూసినటువంటి ఆ గుంపు ప్రజలమైయున్నాము. “నీవు మాట్లాడిన ప్రతీ మాటపై మేము విశ్రాంతి పొందుచున్నాము” అని, కేకలు వేస్తున్నది మన స్వరములేయైయున్నవి. మన కన్నులను పరలోకము తట్టునకు త్రిప్పుకొని, ఆయనయొక్క రాకడ కొరకు ఎదురుచూస్తూ మనము పరితపించుచున్నాము మరియు ప్రార్ధించుచున్నాము.
సరిగ్గా దానియేలుకు వలెనే, ఆయన మన ప్రార్థనలు విని మరియు యూదుల కొరకు మరియు యెరూషలేము కొరకు, యుగసమాప్తివరకును ఆయన నిర్ణయించినవాటిని; ఆ సమస్తమును బయలుపరచడానికి ఆయన దిగివచ్చాడు. “ఈ మాటలను మరుగుచేసి మరియు అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రించుము,” అని ఆయన దానియేలుతో చెప్పాడు.
ఆ అంత్య-కాల దినము ఇప్పుడేయైయున్నది. మనము వచ్చేశాము. మనము, ఆయన ఎవరికొరకైతే ఎదురుచూస్తున్నాడో అట్టి ఆయనయొక్క బహుగా ప్రేమించబడిన వధువైయున్నాము. ఇది చివరి సంఘకాలమైయున్నది. వర్తమానము మరియు వర్తమానికుడు ఒక్కటైయున్నారు మరియు సమస్త కార్యములను బయలుపరుస్తున్నారు. ఈ సమయము వరకు ముద్రించబడియున్న, యేసుక్రీస్తుయొక్క నిజమైన ప్రత్యక్షత, ఇప్పుడు ముసుగు తీయబడినది.
ఒక మూడవ వ్యక్తి కాదు, రెండవ వ్యక్తి కాదు, మూడవ వ్యక్తి కాదు, కానీ దేవుడే. దేవునియొక్క ఈ ఇతర మర్మములన్నీ బయలుపరచబడతాయి, ఎందుకంటే అవి ఇక్కడ ఈ గ్రంథములో వ్రాయబడినవి, మరియు అవి అంత్య-కాల తరమునకు బయలుపరచబడతాయి.
ఎత్తబడుట కొరకు మరియు గృహమునకు వెళ్ళడం కొరకు సంఘమును క్రమపరచడానికి దేవుని వాక్యము ముందెన్నడూ లేని విధంగా బయలుపరచబడుతున్నది!! సంఘము టేపులయొద్దకు తిరిగి రావలసియున్నది. స్వదేశమునకు, ఆదియొద్దకు తిరిగి రావలసియున్నది. ఈ ఘడియయొక్క వర్తమానము నొద్దకు తిరిగి రావలసియున్నది, మిమ్మల్ని పిలిచిన ఆ అసలైన స్వరమునొద్దకు తిరిగి రావలసియున్నది. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు యొద్దకు తిరిగి రావలసియున్నది.
ఈ ఆదివారము, “మనము దేవునియొక్క అసలైన స్వరమును విందాము. దేవుడు తన కొరకు తానే మాట్లాడటానికి ఎన్నుకున్నటువంటి స్వరమును విందాము. మన ప్రభువైన యేసు వచ్చినప్పుడు మనల్ని ఆయనకు పరిచయం చేసేటటువంటి స్వరమును విందాము. నేను మీకు దేవుని స్వరమునైయున్నాను, అని స్వయంగా దేవుడే చెప్పినటువంటి స్వరమును విందాము,” అని మీ సంఘకాపరితో చెప్పండి.
ఆ స్వరముకంటే గొప్ప స్వరము ఉండజాలదు. అది దానిలోని ప్రతీ మాటకు మనము ఆమేన్ చెప్పగలిగేటటువంటి స్వరమైయున్నది.
దేవుడు మాట్లాడి మరియు తన రాకడయొక్క ఖచ్చితమైన సమయమును బయలుపరుస్తుండగా ప్రపంచవ్యాప్తంగానున్న వధువులోని ఒక భాగముతో పాల్గొనడానికి మీకు స్వాగతం. అది మీరు ఎన్నడూ విననటువంటి ఒక గొప్ప అభిషేముగా ఉంటుంది.
మేము: 61-0730E - "గాబ్రియేలు దానియేలును దర్శించుటకుగల ఆరు కారణములు" అనుదానిని వినడానికి, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా, మధ్యాహ్నం 12:00 గంటలకు కూడుకుంటాము.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్