ఆదివారం
08 నవంబర్ 2026
60-0522M
దత్త పుత్రత్వము మూడవ భాగము
కూడిక ఇంత సమయంలో ప్రారంభమవుతుంది:
0
రోజులు
19
గంటలు
40
నిమిషములు
35
క్షణములు

Sun Apr 26, 2020 10:00 AM EDT

కుమారులుగా స్వీకరించబడిన ప్రియమైనవారలారా,

“సిద్ధంగా ఉండండి, ప్రపంచ వినాశనము కొరకు సిద్ధపడండి. రాబోవుదాని కొరకు మీరు సిద్ధంగా ఉండునట్లు మీ కుటుంబము కొరకు ఆహారమును మరియు నీటిని భద్రపరచుకోండి,” అని ప్రపంచప్రభుత్వములు ప్రజలకు చెప్తున్నాయి. ప్రపంచమంతా ఒక భయభ్రాంతులలో ఉన్నది. ఏమి జరుగబోతున్నది? రేపటి దినము దేనిని తీసుకువస్తుంది?

మన కన్నుల ఎదుట ప్రవచనము నెరవేర్చబడటాన్ని మనము చూస్తున్నాము. ప్రపంచం తునాతునకలైపోవుచున్నది. ఏమి సంభవించబోతున్నదో తెలియక, భయము మరియు ఆందోళన ప్రపంచమంతటా వ్యాపిస్తున్నది. భవిష్యత్తు ఏమి కలిగియున్నది? మనము ఏమి చేయగలము? ఇది అంతమా?

ఈలోగా, తండ్రియైన దేవుడు మనల్ని కూడా హెచ్చరిస్తూ మరియు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన మన కొరకు ఇదివరకే మన ఆహారమును మరియు నీటిని భద్రపరిచాడు, మరియు మనము విందుచేసుకుంటూ మన బుగ్గబావి నుండి త్రాగుచూ ఉన్నాము. మనము సిద్ధంగా ఉన్నాము, ప్రపంచ వినాశనము కొరకు కాదు గానీ, ఎత్తబడుట కొరకైయున్నది!!

క్రీస్తుయొక్క వధువు ఇంతకంటే సంతోషముగా లేదా తృప్తిగా ఎన్నడూ లేదు. “ఏమాత్రము భయపడకండి, సంతోషించండి. మీరు నా ఎన్నుకోబడినవారైయున్నారు. ఒక ఎత్తబడుట కొరకు, మీ పెండ్లి దినము కొరకు నేను మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాను. ఈ గందరగోళము నుండి నేను మిమ్మల్ని బయటకు తీస్తున్నాను. మీరు నా దత్తపుత్రులు మరియు దత్తపుత్రికలైయున్నారు. కాలముయొక్క సంపూర్ణత వచ్చుచున్నది,” అని తండ్రియైన దేవుడు ప్రపంచవ్యాప్తంగానున్న తన చిన్న వధువుతో చెప్పుచున్నాడు.

మనము ఎటువంటి ఒక జూబిలీని కలిగియుంటున్నాము కదా. మనము వినే ప్రతీ మాట మనకు ఒక బంగారపు ఆణిముత్యమైయున్నది. మనము కేవలం దానిని తీసుకొని మరియు దానిని మరలా మరలా సానబెట్టుకుంటూ ఉంటాము. పిదప మనము ఇట్లంటాము:

“ప్రభువు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు.” “ప్రభువు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు.” “ప్రభువు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు.”

మనము కల్వరి వైపే మన దృష్టిని నిలిపియున్నాము, మరియు మనల్ని ఆపబోయేది ఏదియు లేదు! మనము రాజమార్గములో నడుస్తున్నాము, ప్రశస్తమైన అభిషేక తైలముతో అభిషేకించబడి, అతిపరిశుద్ధ స్థలములోకి వెళ్తున్నాము.

మనము నశించిపోయామని మరియు మనము ఆయనయొక్క వధువు కాదని శత్రువు మనకు చెప్పడానికి ప్రయత్నించినప్పుడు, మనము కేవలం ప్లే ను నొక్కుతాము మరియు ఆయన మనకు కేకవేసి మరియు ఇట్లు చెప్తాడు:

మీరు నశించిపోబోతున్నారు మరియు మీరు ఈ విధంగా అవ్వబోతున్నారు, మరియు మీరు దీనికి భయపడుతున్నారు అనేదానిని మీ మనస్సులోనుండి తీసివేయండి. దేనికీ భయపడకండి, ఏలయనగా మీరు ఎక్కడున్నారు, మీరు ఎవరు, మీరు ఏ విధంగా నిలబడియున్నారు అనేదానిని మీతో చెప్పడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు.

ప్రపంచము ఒక భయములో ఉన్నది, మరియు అదే సమయములో తండ్రియైన దేవుడు మనకు ఇట్లు చెప్తున్నాడు, “దేనికీ భయపడకండి, మీరు ఎవరన్నది మరియు మీరు ఎక్కడికి వెళ్తున్నారన్నది నేను మీకు చెప్తున్నాను.” …మహిమ!!

మన మానవ బలహీనతలో మనము అనుదినము విఫలమవుతుంటాము. మనము అనేక పొరపాట్లను చేస్తుంటాము. మనము చేయకూడని అనేక కార్యాలను మనము చేస్తుంటాము. అప్పుడు మనము ఏ విధంగా వధువైయ్యుండగలము అంటూ, అపవాది మనపై దెబ్బ మీద దెబ్బ వేస్తుంటాడు.

కానీ మనకు బోధించబడినది. సరిగ్గా ఏమి చేయాలో మనకు తెలుసు: తండ్రియైన దేవుడు ఏమి చెప్తాడో వినడానికి ప్లే ను నొక్కడమే.

ఇప్పుడు, నీవు తప్పుడు కార్యములను చేయవచ్చును, మరియు నీవు ఏదైనా తప్పును చేసిన ప్రతిసారు నీవు దానికి మూల్యం చెల్లించబోతున్నావు. అవును, అయ్యా, నీవు విత్తినదానినే నీవు కోస్తావు! కానీ దానితో నీ రక్షణకు ఎటువంటి సంబంధము లేదు. నీవు దేవుని ఆత్మమూలముగా జన్మించినప్పుడు, నీవు నిత్యజీవమును కలిగియున్నావు మరియు దేవుడు ఎలాగైతే మరణించలేడో సరిగ్గా అలాగే నీవును మరణించలేవు. నీవు దేవునిలో భాగమైయున్నావు, నీవు దేవుని కుమారుడవైయున్నావు.

మనల్ని ముందుగా ఏర్పరచుకోవడం దేవునికి ఇష్టమైనది. మనల్ని కుమారులుగా మరియు కుమార్తెలుగా చేయడం దేవునికి ఇష్టమైనది. మనల్ని కుమారులుగా స్వీకరించడం దేవునికి ఇష్టమైనది. ఆయన ఎవరు మరియు మనము ఎవరము అనేదానిని గూర్చిన నిజమైన ప్రత్యక్షతను మనకు ఇవ్వడం దేవునికి ఇష్టమైనది. మనము సంతోషించి మరియు ఎటువంటి భయము లేకుండా ఉండునట్లు ఆయనయొక్క దూతను కాలమనే తెర ఆవలకు తీసుకెళ్ళి మరియు ఆ ఆవలి వైపున ఆయనకు మనల్ని చూపించడానికి దేవునికి ఇష్టమైనది.

అనుకోకుండా, ఈ టేపులు అందరి కొరకు కాదు. అవి కేవలం ప్రవక్తయొక్క సంఘము కొరకేయైయున్నవి…మహిమ, అది మనమే. ప్రతి నిమిషము మనము ప్లే ను నొక్కగలము, మరియు మనము కూడుకున్న ప్రతిసారి, మనము చేయగోరే ఒకే ఒక్కటి ఏమిటంటే దేవుని స్వరమును వినడానికి ప్లే ను నొక్కడమే.

ఇతరులు కూడా దానిని బాగుగానే కలిగియున్నారు. అయితే వారు కేవలం మనము చూస్తున్న విధంగా దానిని చూడరు. వారు దానిని సరిగ్గా మనలాగే కలిగియున్నారు, కానీ మనకైతే… దానిని చూడటానికి ఎంతో బాగున్నది; ఏలయనగా అది ఈ దినమునకు తండ్రియైన దేవుడు ఏర్పాటు చేసిన మార్గమని మనకు తెలుసు.

ప్రతీ రోజు లోకము మరియు దానిలోని ప్రజలు ఇంకా ఎక్కువగా కృంగిపోతున్నారు. సమస్తము అంధకారముయముగాను నిరాశాజనకముగాను కనబడుతున్నది. కానీ వధువుకైతే, ప్రతీ దినము ప్రత్యక్ష్యత ద్వారా అధిక ఉత్తేజమును తీసుకొనివస్తున్నది. మనము ఆయనయొక్క పరిశుద్ధాత్మతో నింపబడి, ఏకముగా కలిసి పరలోకస్థలములలో కూర్చొని, విశ్రాంతిలో ఉన్నాము.

పెంతెకొస్తు దినమున వేగముగా వీచు బలమైన గాలి వచ్చి మరియు పరిశుద్ధాత్మ ఆ గదిని, మరియు అక్కడున్న ప్రతియొక్కరినీ నింపినప్పుడు అది ఏ విధంగా ఉన్నదో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

ఇక ఎంతమాత్రము ఊహించుకోకండి. ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా, మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు వచ్చి మాతో చేరండి, ఆయన తన పక్షిరాజులను సమకూర్చుతాడు, మీ గదిని ఆయనయొక్క పరిశుద్ధాత్మతో నింపుతాడు, మరియు ఆయనయొక్క భద్ర-పరచబడిన ఆహారమును మనకు తినిపించుట ద్వారా ఆయనయొక్క త్వరితమైన రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తాడు. మీరు ఆయనయొక్క గోదామునుండి, అనగా టేపులలో ఉన్న దేవునియొక్క స్వరము నుండి తినుచు మరియు త్రాగుచు ఉంటారు.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

వర్తమానము: పుత్రస్వీకారము #3 60-0522M

లేఖనములు:

మత్తయి 28:19
యోహాను 17:7-19
అపొస్తలుల కార్యములు 9:1-6, 18 మరియు 19వ అధ్యాయములు
రోమా 8:14-19
1 కొరింథీ 12:12-13
గలతి 1:8-18
ఎఫెసీ 1వ అధ్యాయము
హెబ్రీ 6:4-6, 9:11-12