ఆదివారం
22 నవంబర్ 2026
61-0730M
దానియేలునకు గాబ్రియేలు యొక్క ఉపదేశములు
కూడిక ఇంత సమయంలో ప్రారంభమవుతుంది:
0
రోజులు
19
గంటలు
40
నిమిషములు
35
క్షణములు

Sun Apr 26, 2020 10:00 AM EDT

బయటకు వచ్చిన ప్రియమైనవారలారా,

ప్రాయశ్చిత్తము చేయబడకముందు, అసలు పరిశుద్ధాత్మ కమ్మరించబడకముందు, పాతనిబంధన అంతా వ్రాయబడకముందు, ప్రత్యక్షపరచబడుటలు అనేవి ఉండటం సాధ్యం కాదు. అది ఈ సమయము వరకు వేచియుండాల్సియున్నది. ఆయన తనయొక్క ప్రవక్త కొరకు మరియు మనకొరకు వేచిచూస్తూ ఉన్నాడు!

ఇప్పుడు సమస్త కార్యములు ఒక తలరాయి వద్దకు, దేవుని కుమారులు తిరిగి వచ్చుటయొక్క వ్యక్తీకరణల యొద్దకు రూపుదిద్దుకుంటున్నాయి. దేవునియొక్క ఆత్మ ఆయనయొక్క బలమైన దూతలోకి ఎంత పరిపూర్ణముగా దిగి వచ్చినదంటే, ఆయనయొక్క పరిచర్య క్రీస్తుయొక్క పరిచర్యకు ఎంతో దగ్గరగా ఉన్నది, ఎంతగా అంటే అది ఆయనను మరియు ఆయనయొక్క సంఘమును కలిపి జతచేస్తుంది. రానున్న ఎత్తబడుట కొరకు దేవుడు ఆయనయొక్క పిల్లలను కుమారులుగా స్వీకరిస్తున్నాడు.

పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతూ మరియు ఆయనయొక్క వాక్యమును బయలుపరుస్తుండగా మనము ఎంతటి మహత్తరమైన సమయమును కలిగియుంటున్నాము కదా. లోకములోను, మరియు ప్రాముఖ్యంగా, వధువులోను, గొప్ప కార్యములు జరుగుతున్నాయి.

ప్రపంచవ్యాప్త కలహాలు అతి సమీపములో ఉన్నాయి. మనము ఏ క్షణములోనైనా బూడిదైపోవచ్చును. ఇంగితజ్ఞానము ఉన్న ఏ వ్యక్తియైనా గానీ వార్తలు విని, రాజకీయ అధికారులు చెప్పే సంగతులను విని, ఏదో జరుగబోతున్నదని గ్రహించగలడు. భయము లోకములోని ప్రజలను కమ్మివేస్తున్నది.

ఈ అంచనాను ఎంతమంది విన్నారు, జనవరి 1వ తేదీ కల్లా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు రష్యా ఈ రెండు కూడా అగ్నిపర్వతపు బూడిదెగా అయిపోతాయని అంచనా వేయబడినది ఎంతమంది విన్నారు? మనకు అవసరమైనదంతా అదేయైయున్నది. మనము అనుకుంటున్నదానికంటే ఆలస్యమైపోయింది. చూశారా? కాబట్టి, ఆఖరికి ఈ భూసంబంధమైన మనుష్యులు కూడా ఈ భయంకరమైన కార్యము జరుగనైయున్నదని అంచనావేసేంత సమీపముగా మనము ఉన్నట్లైతే, మనము మెలకువగా ఉండటం మంచిది, సమస్తమును సరిచేసుకొని, సమస్త ఒప్పుకోలులను చేసుకొని, సమస్తమును సిద్ధంగా కలిగియుండటం మంచిది, ఎందుకంటే ఇక ఏ సమయములో మన ప్రభువు మనల్ని పిలువబోతున్నాడో మనకు తెలియదు. మరియు, “పైకి రండి” అని ఆయన పిలుపులను ఇచ్చినప్పుడు, మనం సిద్ధంగా ఉండటం మంచిది. మరియు అది మీరు అనుకోని ఘడియలో రాబోవుచున్నది.

పరిశుద్ధాత్మ మన మధ్యన ఉన్నాడు, తనయొక్క ప్రవక్తగుండా మనతో మాట్లాడుతున్నాడు, పైకి వెళ్ళి మరియు యోర్దానును దాటడానికి మనల్ని సిద్ధపరుస్తున్నాడు. గ్రంథమును చదివి మరియు టేపులలో ఉన్న ఆయనయొక్క స్వరమును వినడం ద్వారా ఏమి జరుగుతున్నదో మనము గ్రహిస్తున్నాము. దేవుడు తన ప్రజలను ఆదరించి మరియు, “మనము అంత్యకాలమున ఉన్నాము, కానీ ఈ లోకమునకు భయపడకండి, ఏలయనగా నేను మీతోనూ, మీలోనూ ఉన్నాను. మీరు శరీరధారియైన నా వాక్యమైయున్నారు. మీరు దేనికీ భయపడనక్కర్లేదు,” అని వారికి చెప్పడానికి, ప్రపంచ-వ్యాప్తంగా టేపులలో ఆయనయొక్క దూత ద్వారా మాట్లాడుతున్నాడు.

కొన్ని నెలలుగా, ఆయన మనల్ని యేసుక్రీస్తుయొక్క ప్రత్యక్షత గ్రంథముయొక్క అధ్యయనములో ఉంచాడు. మనము సంఘకాలములు మరియు పుత్రస్వీకారముగుండా వచ్చాము, మరియు ఇప్పుడు దానియేలుయొక్క డెబ్బది వారములను వినడానికి మరియు అధ్యయనం చేయడానికి సిద్ధంగా ఉన్నాము.

పిదప ముద్రలు, తెగుళ్ళు, శ్రమలు, మిడతలు, సూర్యునిలో ఉన్న స్త్రీ, ఎర్రని ఘటసర్పమును తరుముట, ముద్రించబడుట, ఒక లక్షా నలభై-నాలుగువేల మంది, మరియు సమస్త విషయాలు వస్తాయి.

దానియేలు వలె, ప్రవక్త ఏమి సంభవిస్తుందని చెప్పాడో మనము దానిని చదువుతున్నాము మరియు వింటున్నాము. లేఖనము నెరవేర్చబడుచున్నది. లోకము అది ఈనాడు ఉన్నట్టి స్థితిలో ఉండగా వధువు ఇప్పుడు దీనిని వింటూ ఉండటం ఎంత సమయోచితమైన విషయము కదా.

సంఘము ముద్రించబడినది. దుష్టులు మరింత దుష్టత్వమును జరిగించుచున్నారు. సంఘములు మరింత సంఘపరముగా మారుతున్నాయి. పరిశుద్ధులు దేవునికి మరింత సమీపముగా చేరుతున్నారు. చిన్న చిన్న గుంపులలో ఆత్మ వరముల విస్తరించడం మొదలైనది. మనము అంత్యకాలమున ఉన్నాము.

అంత్యదినములలో ఒక క్షామము కలుగునని, అయితే అది అన్నపానముల కొరకు మాత్రమే కాదు గానీ, నిజమైన దేవుని వాక్యము దొరకకపోవుటవలన కలుగునని మనము గ్రహిస్తున్నాము. నిజమైన దేవుని వాక్యమును వినాలని వెదకుచు, ప్రజలు తూర్పునకు, పశ్చిమమునకు, ఉత్తరమునకు, మరియు దక్షిణమునకు వెళ్తారు. సంఘములు ఎంతగా సంస్థాగతమైపోయి బిగుసుకుపోయి ఉంటాయంటే వారు దానిని వినుటలో విఫలమవుతారు.

అయితే ఆయనయొక్క గ్రంథమును చదవడంవలన మరియు టేపులలో ఆయనయొక్క స్వరమును వినడంవలన మనము గ్రహిస్తున్నది ఏమిటంటే దావీనుండి ఒక చిగురు మొలకెత్తుతుంది. ఆ చిన్న గుంపు ప్లే ను నొక్కి మరియు టేపులలో ఉన్న దేవుని స్వరమును వింటుంది.

ఈ దినము, ఈ ప్రార్థన నెరవేర్చబడుచున్నది.

ప్రభువా, గ్రంథముల ద్వారా కూడా, అనగా నీ గ్రంథము ద్వారా, యెషయా గ్రంథము, యిర్మియా గ్రంథము, యాకోబు గ్రంథము, యోహాను, లూకా, మార్కు, మత్తయి, ప్రకటన గ్రంథము, నీ గ్రంథములన్నిటి ద్వారా, మేము అంతమునకు సమీపముగా ఉన్నామని మేము చూస్తున్నాము. మరియు ప్రభువా, మేము ఎక్కడ జీవిస్తున్నామో కనుగొనుటకు, ప్రార్థనయందును, యాచనలయందును, మా ముఖములను పరలోకము తట్టునకు త్రిప్పుకొనియున్నాము. వేకువ వెలుగు ప్రసరించడాన్ని మేము చూస్తున్నాము. మరియు, ప్రభువా, మేము నీ యొద్దకు వస్తున్నాము. మా విశ్వాసము ఇప్పుడు నీ వైవు చూస్తున్నది. ప్రతి భారమును, మమ్మల్ని సుళువుగా చిక్కులబెట్టు ప్రతి పాపమును, ప్రతి అవిశ్వాసమును ప్రక్కన పెట్టి, మా సమయము పరిమితి గలదని ఎరిగినవారమై, మేము ఇప్పుడు ఉన్నతమైన పిలుపుయొక్క గురియొద్దకే పరుగెత్తుచున్నాము.

భయము ప్రపంచమును నింపివేస్తుండగా మరియు వారు రానున్నదాని కొరకై ఆహారమును భద్రపరచుకొనుట ద్వారా సిద్ధమవ్వడానికి ప్రయత్నిస్తుండగా, మీరు వచ్చి మరియు ఆయన తన వధువు కొరకు ఇదివరకే సిద్ధపరచి మరియు భద్రపరచినట్టి దాచబడిన మన్నాను భుజించాలని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

 

వర్తమానము: 61-0730M దానియేలుకు గాబ్రియేలుయొక్క సూచనలు

సమయము: జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా, ఆదివారం మధ్యాహ్నం, 12:00 గంటలకు

లేఖనములు:

కీర్తన 99
ప్రకటన 1-3
యిర్మియా 32
ప్రకటన 5:8-14
యిర్మియా 25:8-17
దానియేలు 9
మత్తయి 24:15
ప్రకటన 7