ఆదివారం
24 మార్చి 2024
64-0726M
నీ యొక్క దినమును ఆ దినము వర్తమానమును గుర్తించుము

ప్రశస్తమైన ప్రియమైన వారలారా,

మనము ఆయనయొక్క ప్రశస్తమైన మరియు ప్రియమైన వధువైయున్నామని తెలుసుకోవడం ఎంత అద్భుతము కదా. మనము ప్రపంచమంతటినుండి చేయబడ్డాము, మనకు మనముగా ఆయన వాక్యము చుట్టూ కూడుకొనుచు, దేవునియొక్క స్వరము మన అంతరాత్మలను పోషించుచుండగా దానిని వినుచున్నాము.

దానియొక్క సంపూర్ణతలో మనము దానిని స్వీకరించాము, మరియు దాని నిర్థారణయొక్క శక్తిలో మరియు ప్రత్యక్షతలో మనము దానిని స్వీకరించాము. మనము దానిలో ఒక భాగమయ్యాము. అది మనలో ఉన్న ఒక విషయమైయున్నది. అది మనకు జీవముకంటే విలువైనది.

మనము: ఆయనయొక్క ఏడవ దూత వర్తమానికుడిని గుర్తించాము.

మనము: అస్తమయకాలపు వెలుగుయొక్క వర్తమానమును గుర్తించాము.

మనము: మనము ఎవరమన్నది గుర్తించాము.

దేవుడు తన ప్రవక్తయొక్క వాక్యమును తీసుకొని మరియు మనల్ని కత్తిరించాడు. ఆయన చేస్తానని వాగ్దానము చేసినట్లే, మలాకీ 4 ద్వారా ఆయన మనల్ని చెక్కాడు. మనము ప్రతీ వాక్యమును మన హృదయమంతటితో నమ్ముచున్నాము.

ప్రజల మధ్యన గొప్ప మేల్కొల్పు చోటుచేసుకుంటున్నది. ఆ స్వరమును వినడము యొక్క ప్రాముఖ్యతను వారు కూడా గుర్తిస్తున్నారు. తిరిగి వచ్చి మరియు తమ సంఘములలో టేపులను ప్లే చేసుకోవాలని వారు కోరుచున్నారు.

ఈ దినమునకు దేవుడు ఏర్పాటుచేసిన మార్గము ఇదేనని, పరిశుద్ధాత్మ ద్వారా వారికి తెలియజేయబడినది. వారు వినవలసిన స్వరము ఇదేనని వారు గుర్తిస్తున్నారు. ఆయనయొక్క వధువును పరిపూర్ణము చేయుటకు ఇది దేవునియొక్క నిలువ చేయబడిన ఆహారమైయున్నది.

వాక్యము దానిని వాగ్దానము చేసినది. టేపులు దానిని ప్రకటిస్తున్నవి. వారు దానిని నమ్ముచున్నారు.

అది ఏమి చేసినది? ఆ ప్రజలు సంఘాలను విడిచి వెళ్ళడాన్ని చూచుటకు, అది యాజకులకు ఇబ్బంది కలుగజేసినది. అతడు ఇట్లన్నాడు, “మీలో ఎవరైనా ఆయనయొక్క కూటమునకు హాజరైతే, మీరు వెలివేయబడతారు. మేము మిమ్మల్ని నేరుగా సంఘశాఖలనుండి బయటకు పంపివేస్తాము.”

ఇది అసలు నమ్మసఖ్యంగా లేదు, కానీ ఈనాడు అది సరిగ్గా ఆ విధంగానే మారిపోయినది. “దయచేసి, టేపులను ప్లే చేయండి,” అని మీరు చెప్తే వారు మిమ్మల్ని వారి సంఘాలనుండి వెలివేస్తారు. ఇదే ప్రజలను వేరుచేసేదిగా ఉంటుందని మనము ఎన్నడైనా ఊహించగలమా? మన సంఘాలలో దేవుని స్వరమును ప్లే చేయడం వలనా?

సంఘము వారి ప్రవక్తలను మరిచిపోయినది. తమకు “ఇక వారు ఎంతమాత్రము అవసరము లేదు,” అని వారు చెప్పుచున్నారు. కానీ ఆయన వారిని కలిగియుండవలసియున్నది అని దేవుడు ఎరిగియున్నాడు; ఆయన తన ప్రజలను ఆయనయొక్క వాక్యము ద్వారా చెక్కుతాడు. అయితే ఈ దినమున అది వారికి చాల పాత-పద్దతిలాగా అయిపోయినది.

మనము మన ప్రవక్తతో నిలిచియుంటాము. అది ఆయనయొక్క వధువును పిలుచుచున్న స్వరమని మనము నమ్ముచున్నాము. మనకైతే, ప్లేను నొక్కడముకంటే ప్రాముఖ్యమైనది ఏదియు లేదు.

ఓ, దేవుని గొర్రెపిల్లలారా, దేవునియొక్క స్వరమును వినండి! “నా గొర్రెలు నా స్వరమును వినును.”

ఈ ఆదివారము, జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా 12:00 P.M. గంటలప్పుడు, మేము, 64-0726M నీ దినమును దాని వర్తమానమును గుర్తించుట అను వర్తమానమును వినుచుండగా, వచ్చి మాతోపాటు ఆ స్వరమును గుర్తించండి.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్