ఆదివారం
23 జులై 2023
63-0318
మొదటి ముద్ర

ప్రియులారా...నేను మిమ్మల్ని పెండ్లి కుమార్తె అని పిలువబోవుచున్నాను,

గొప్ప సృష్టికర్త, ఆల్ఫా మరియు ఒమేగా, లోయలోని పద్మము, షారోను పుష్పము, ప్రకాశమానమైన వేకువ చుక్క, తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్ధాత్మ, అగ్నిస్తంభము, అయిన దేవుడు, స్వయంగా దేవుడే, భూమి మీదకు వచ్చి మరియు మానవ పెదవుల ద్వారా మనతో మాట్లాడెను, మహిమ!, దానిని అయస్కాంత టేపుపై ఉంచెను, తద్వారాఆయన మిమ్మల్ని...“మిమ్మల్ని” తన పెండ్లి కుమార్తెఅని పిలుచుటను మీరు వినగలుగుటకైయున్నది.

నా స్నేహితులారా దానిని ఊహించండి. మన ప్రభువైన యేసు క్రీస్తు, మిమ్మల్ని కళ్ళలోనికి చూస్తూ మరియు మీతో ఇట్లు చెప్పుటను ఊహించండి: “నీవు నా పెండ్లి కుమార్తెవు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను ఎంతో కాలంగా నీ కొరకు వేచియున్నాను. నాకైతే, నీవు పరిపూర్ణమైనదానవు. నీవు నా మాంసములో మాంసము, నా ఎముకలో ఎముకవైయున్నావు. నేను భూమినైనా లేదా నక్షత్రాలనైనా చేయకముందే నేను నిన్ను ఎన్నుకొనియున్నాను. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. మనము కలిసి నిత్యత్వమును గడిపెదము. ఇప్పుడు, నేను నీ కొరకు వచ్చుచున్నాను.”

అదియే మనలో ప్రతీయొక్కరికి ఎత్తబడు విశ్వాసమును ఇవ్వవలసియున్నది. మీకు హాని కలుగునట్లు, దయ్యము మీ మీదకు ఏమి విసరగలదు, ఏమి చెప్పగలదు, ఏమి ఉంచగలదు? ఏదియు లేదు, మీరు క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెయైయున్నారు! మీరు శరీరధారియైన ఆయన వాక్యమైయున్నారు, మీరు శ్రీమతి. యేసు క్రీస్తు.

అది మనకు ఎంత విలువైనదో, ఎవరైనా, ఏ భాషలోనైనా వ్రాసి మరియు ఎలా వ్యక్తపరచగలరు? మీరసలు అలా చేయలేరు.

మీకు సరియైన ప్రత్యక్షత మరియు ప్రెస్ ప్లే లేకుండా ఈ మాటలను వినే భాగ్యమును మరియు ఘనతను మీరు కలిగియుండే చోటు ప్రపంచములో ఎక్కడా లేదు.

కాలము ఆరంభమైనది మొదలుకొని లోకము ఎదురుచూస్తున్న ఆ గొప్ప సంఘటనలు, సరిగ్గా ఇప్పుడు జరుగుచున్నవి, మరియు మనము అందులో భాగమైయున్నాము. మీరు ఆయనయొక్క గొప్ప ప్రణాళికను నెరవేర్చి మరియు దానిని అమలు చేయడానికి, ఈ దినము కొరకు, ఈ ఘడియ కొరకు, ఈ ప్రజల కొరకు; అనగా మీ కొరకు, ఆయన వేచియున్నాడు.

ఏడు ముద్రల మర్మము యొక్క ప్రత్యక్షత, ఉరుములు ప్రత్యక్షపరచబడుట, మన పరిపూర్ణత, పూర్తిగా పునరుద్ధరించబడిన ఆయన యొక్క ఆదాము, ఆయన యొక్క రాకడ, ఈ కార్యములన్నియు, ఆయన యొక్క పెండ్లి కుమార్తెయైన మీలో, ఇప్పుడు కార్యరూపణ దాల్చుకొని మరియు నెరవేరుచున్నవి!

మోషే దినములలో కాదు. నోవహు దినములలో కాదు. యేసు దినములలో కాదు, యోహాను లేదా పౌలు దినములలో కూడా కాదు; అది ఇప్పుడే, సరిగ్గా ఇప్పుడే, మీతో జరుగుచున్నది.

మనము దానిని తప్పిపోగోరుటలేదు. మనము ఆయన యొక్క రాకడకై సిద్ధంగా ఉండగోరుచున్నాము. దానిని చేయుటకు, మన జవాబులకై వాక్యమునొద్దకు వెళ్ళవలెనని మనకు ఆజ్ఞాపించబడినది. నా ఆలోచన కాదు, లేదా ఎవరో ఒక మనుష్యుని ఆలోచన లేదా తలంపులు కాదు గాని, దేవుని యొక్క నిర్ధారించబడిన వాక్యము ఏమి చెప్తుందో అదేయైయున్నది.

పెండ్లి కుమార్తె ప్రతీ వాక్యమునకు “ఆమేన్” అని చెప్పి మరియు ఒక్కటిగా ఐక్యమై ఉండవలసియున్నదని మనము ఎరిగియున్నాము. కావున పెండ్లి కుమార్తెను ఐక్యపరిచేది ఏమిటని చూచుటకు మనము దేవుని యొక్క వాక్యములోనికి చూడవలసియున్నది.

మరియు పిదప అసలు వ్రాయబడనటువంటి ఏడు మర్మయుక్తమైన ఉరుములు వచ్చును. అది నిజము. మరియు, ఎత్తబడు విశ్వాసము కొరకు పెండ్లి కుమార్తెను సమకూర్చడానికి, ఈ చివరి దినములలో ఆ ఏడు ఉరుములు ప్రత్యక్షపరచబడునని నేను నమ్ముచున్నాను.

అది సరిగ్గా అక్కడ వాక్యములోనే ఉన్నది. ఎత్తబడు విశ్వాసము కొరకు పెండ్లి కుమార్తెను సమకూర్చడానికి మన దినములలో ఆ ఏడు ఉరుములు ప్రత్యక్షపరచబడును.

పిదప మనము తెలుసుకోవలసిన తదుపరి ప్రశ్న ఎదనగా: ఉరుములు అనగా ఏమిటి?

ఎప్పుడైతే, “ఉరిమినదో.” గుర్తుంచుకోండి, ఒక ఉరుము యొక్క పెద్ద చప్పట్లవంటి శబ్ధము దేవుని యొక్క స్వరమైయున్నది. బైబిలు దానినే చెప్పుచున్నది, చూడండి, “ఒక ఉరుము యొక్క ధ్వని.” అది ఒక ఉరుము అని వారు అనుకున్నారు, కాని అది దేవుడైయుండెను. ఆయన దానిని గ్రహించాడు, ఏలయనగా అది ఆయనకు బయలుపరచబడినది. చూశారా? అది ఒక ఉరుము.

కావున ఉరుములు అనేవి పెండ్లి కుమార్తెను సమకూర్చి మరియు వారికి (మనకు) ఎత్తబడు విశ్వాసమును అనుగ్రహించే దేవుని యొక్క స్వరమైయున్నది. అదే మన జవాబైయున్నది.

పెండ్లి కుమార్తెకు దేవుని యొక్క స్వరము ఎవరు? విలియమ్ మారియన్ బ్రెన్హామ్.

ఇప్పుడు, దేవుని యొక్క కృపను బట్టి, నేను కేవలం మీ సహోదరుడను, అయితే ప్రభువు యొక్క దూత క్రిందకు దిగివచ్చినప్పుడు, అప్పుడు అది, మీకు, దేవుని యొక్క స్వరము అవుతుంది…నా అంతట నేను ఏదియు మీకు చెప్పలేను, అయితే ఆయన నాకు దేనిని చూపించునో, దానినే నేను చెప్తాను. మీరు దానిని నమ్మి మరియు ఏమి జరుగుతుందో గమనించండి.

మనము కూడుకొని, ఆయన తన పెండ్లి కుమార్తెకు ఉరుముటను వినుచూ, ఎత్తబడు విశ్వాసమును పొందుకొనుచుండగా, ఈ ఆదివారము దానిని నమ్మి ఏమి జరుగుతుందో మరియు ఏమి సంభవిస్తుందో గమనించండి.

“ఇప్పుడు పరలోక స్థలములలో కూర్చొనుటను” గూర్చి మాట్లాడుతారా? అది ఏమైయుంటుంది గదా! ఎత్తబడుటకు ముందు, మనము ఇప్పుడున్న ఈ పరిస్థితిలో, క్రింద ఇక్కడ భూమి మీద కూర్చొని, మనము ఈ విధంగా అనుభూతి చెందగలిగిన యెడల; మరియు కేవలం దీనిని వినుటకు, మనము గోడల ప్రక్కగా నిలుచుని, మరియు వర్షములో నిలబడి, ఆనందించగలుగుచున్న యెడల; ఆయన అక్కడ కూర్చొనియుండుటను మనము చూసినప్పుడు అది ఎట్లుండునో గదా! ఓ, మై! ఓ, అది ఒక మహిమకరమైన సమయముగా ఉంటుంది.

ఈ మహిమకరమైన సమయాన్ని తప్పిపోకండి. మేము దీనిని వినుచుండగా మీరు ఆహ్వానించబడినారు: మొదటి ముద్ర 63-0318, 12:00 P.M. గంటలకు, జఫర్సన్ విల్ సమయము.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

 


 

వర్తమానమును వినడానికి సిద్దపాటులో చదవవలసిన లేఖనములు:

పరిశుద్ధ. మత్తయి సువార్త 10:1 / 11:1-14 / 24:6 / 28:19
పరిశుద్ధ. యోహాను 12:23-28
అపొస్తలుల కార్యములు 2:38
2 థెస్సలొనీక 2:3-12
హెబ్రీ 4:12
ప్రకటన 6:1-2 / 10:1-7 / 12:7-9 / 13:16 / 19:11-16
మలాకీ 3వ మరియు 4వ అధ్యాయములు
దానియేలు 8:23-25 / 11:21 / 9:25-27