ప్రియమైన తండ్రి,
మేము చాలా కాలంగా ఆటలాడియున్నాము. చాలా కాలంగా మేము సంఘానికి వెళ్ళాము. గురుతు అను వర్తమానమును విన్నప్పటినుండి, అది నీ వధువును ఒక నిరాశలోనికి త్రోసివేసినది.
ఏదో జరగనైయున్నదని మేము ఎరిగియున్నాము. సమయము సమీపించినది. నీవు వచ్చి మమ్మల్ని ఈ లోకము నుండి తీసుకువెళ్ళవలసిందిగా మేము కోరుచున్నాము. మేము నీతో ఉండగోరుచున్నాము. మా ప్రాణాంతరంగములలో మేము తపించిపోతున్నాము.
మేము ఊరికే దాని గురించి మాట్లాడుకొనబోవుచున్నామా? మేము చాలినంతగా పరితపిస్తున్నామా? మేము రాత్రింబవళ్ళు చేయవలసినట్లుగా నీకు మొర్రపెట్టుచున్నామా?
ఓ, సంఘమా, లేచి మరియు నిన్ను నీవు జులిపించుకొనుము! నీ మనస్సాక్షికి గిచ్చుకొనుము, ఈ గడియలో, నిన్ను నీవు మేల్కొల్పుకొనుము! మనము పరితపిస్తూ ఉండాలి, లేదా నశించిపోతాము! ప్రభువు యొద్ద నుండి ఏదో వచ్చుచున్నది! అది యెహోవాఈలాగు సెలవిచ్చుచున్నాడుగా నాకు తెలియును. ఏదో వచ్చుచున్నది, మరియు మనము పరితపిస్తూ ఉండటం మంచిది. అది జీవమరణముల మధ్యన ఉన్నది. అది మనలను దాటి వెళ్తుంది మరియు మనము దానిని చూడకుందుము.
నిన్ను రంగము మీదకు తీసుకొనివచ్చుటకు ఆ తపన అవసరమైయున్నదని మేము ఎరిగియున్నాము. మేమిప్పుడే దానిని కలిగియుండాలి లేదా నశించిపోతామన్నట్లుగా ఉండవలసియున్నది. ప్రభువా, మునుపెన్నడూ లేనంతగా మమ్మల్ని పరితపించనిమ్ము, అప్పుడు నీవు రంగం మీదకు వచ్చి మరియు ఎదురుచూస్తున్న నీ వధువును తీసుకుంటావు.
తండ్రీ మేము దానిలోనికి చొచ్చుకొనిపోవులాగున సహాయము చేయుము. ఊరికే దానిలోనికి సులువుగా నడవటం కాదు గాని, దానిలోనికి చొచ్చుకొనిపోవునట్లు సహాయము చేయుము. కేవలం దాని గురించి మాట్లాడుచు మరియు మా అనుదిన జీవితాలతో కొనసాగడం కాదు. మేము మా హృదయమంతటితో, మా ప్రాణమంతటితో మరియు మా మనస్సంతటితో నిన్ను వెదకగోరుచున్నాము. ప్రభువా, మాకు సహాయము చేయుము.
ప్రభువా, మేము అనేకసార్లు నిన్ను విఫలపరిచాము, కాని మేము విఫలమైనా గాని, దానితో ఎటువంటి సంబంధము లేదని నీవు చెప్పావు; మేము ఆదినుండే విఫలమైనవారమే, అయితే నీవు అక్కడ నిలబడియుండి మరియు క్రిందకు చేరి మరియు బలమైన హస్తముతో మమ్మల్ని నీటి నుండి పైకి లేపుటకు మేము నిన్ను కలిగియున్నామని నీవు చెప్పావు.
గురుతు మాకు అనువర్తించబడియుండుటను నీవు చూసినప్పుడు మాత్రమే నీవు మమ్మల్ని దాటిపోవుదువని ప్రవక్త చెప్పియున్నాడు. ప్రభువా, మేము నీ సూచనలను పాటించి మరియు గురుతును అనువర్తించుకొని మరియు మా గృహములను టేపు సంఘముగా చేసుకొని, వాటిని వినుచూ మరియు ప్రతీ మాటను నమ్ముచున్నాము.
ఆయన ఆ—ఆ గురుతును మాత్రమే గుర్తిస్తాడు. అది ఈ గడియయొక్క వర్తమానమైయున్నది! అది ఈ దినపు వర్తమానమైయున్నది! అది ఈ కాలముయొక్క వర్తమానమైయున్నది! యేసు క్రీస్తు నామములో దానిని స్వీకరించండి!
మేము అనుకూలముగా ఉన్నాము, మరియు ప్రవక్త మాకు చెప్పినదాని ప్రకారంగా ప్రతిదానిని నమ్ముచు దానిని అనువర్తించుకొనుచున్నాము.
ప్రతీది నీ పరిపూర్ణమైన సమయములో జరుగుతు సంభవిస్తుందని మేము నమ్ముచున్నాము. అన్నియు వాటి స్థానములలో ఉన్నవి. మేము నీ అద్భుతాలన్నిటినీ చూశాము, మరియు వినియున్నాము మరియు గురుతు క్రిందకు వచ్చియున్నాము.
ఇప్పుడు మేము గురుతు క్రింద ఉండియుండగా, ఈ శనివారము ఒత్తిడితో మేము ప్రభురాత్రి భోజనమును తీసుకొనబోవుచున్నాము. ఏలయనగా తీర్పుతో నీవు తాకబోవుచున్నావని మేము ఎరిగియున్నాము.
అది ఎప్పుడైతే ఒక తొందరగల సమయములో, ఒక ఒత్తిడి సమయములో తీసుకొనబడినదో, అట్టి పస్కాకు చిహ్నంగా మేము దానిని తీసుకొందుము గాక. మరలా ఈనాడు మేము ఒత్తిడిలో ఉన్నాము తండ్రీ.
ప్రభువా, మేము ఈ సంవత్సరమును తిరిగి చూసి మరియు నీవు మా కొరకు చేసినవాటన్నిటినీ మేము చూడగలుగుచున్నందుకు కృతజ్ఞులమైయున్నాము. నీవు నీ వాక్యమును బయలుపరచి మరియు ముందెన్నడూ లేనంతగా ప్రత్యక్షతపై ప్రత్యక్షతను నీవు మాకు అనుగ్రహించియున్నావు.
మేము నీ కుమారులము మరియు కుమార్తెలమైయున్నామని మేము ఎరిగియున్నాము. మేము నీవు ఎంతో కాలంగా ఎదురుచూసినట్టి నీ పరిపూర్ణ వాక్యవధువైయున్నాము. మాలో జీవిస్తూ మరియు నివసిస్తున్నది, నీవేయైయున్నావు. నీవు మమ్మల్ని ఎన్నుకున్నావు, మమ్మల్ని ముందుగా నిర్ణయించుకున్నావు మరియు ఇప్పుడు నీవు మా కొరకు వచ్చుచున్నావు.
ప్రభువా, రాత్రింబగళ్ళు మేము నీకై కానిపెట్టుదుము గాక. మేము ఎంతో తపనతో నీకు మొర్రపెట్టుదుము గాక. ముందెన్నడూ లేనివిధంగా మేము దానిలోనికి చొచ్చుకొనిపోవుదుము గాక. ఈ సంవత్సరమే నీవు మా కొరకు వచ్చే సంవత్సరముగా ఉండును గాక. తండ్రీ, మేము నిన్ను ప్రేమిస్తున్నాము, మరియు నీ పరిపూర్ణ చిత్తములో ఉండగోరుచున్నాము. జఫర్సన్ విల్ కాలమానము ప్రకారంగా 5:00 P.M., గంటలప్పుడు మేము నీ స్వరము చుట్టూ కూడుకొనుచుండగా వచ్చి మాతో ఉండుము, మరియు మేము నిరాశలు 63-0901E లోనికి ఎట్లు వెళ్ళవలెనో నీవు చెప్పుటను మేము వినుచుండగా మాతో ఉండుము. పిదప మేము ఒత్తిడితో ప్రభురాత్రి భోజనములో పాల్గొనుచుండగా, మాతో ఉండుము.
ఇవి మా జీవితములలో అత్యంత గొప్ప దినములైయున్నవి తండ్రీ. ఏలయనగా నీతోపాటు మమ్మల్ని మా భవిష్యత్తు గృహమునకు తీసుకొనివెళ్ళుటకు నీవు త్వరగా వచ్చుచున్నావని మేము ఎరిగియున్నాము. మాకు ముందుగా వెళ్ళిన పరిశుద్ధుల కొరకు గొప్ప ఎదురుచూపుతో మేము అనుదినము ఎదురుచూస్తున్నాము. మేము వారిని చూసినప్పుడు, నీ రాకడ సమయము వచ్చియున్నదని మేము ఎరుగుదుము....మహిమ!!!
తండ్రీ, ఆ దినముకై మేము పరితపిస్తున్నాము.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్.
కూడికకు ముందు చదువవలసిన లేఖనములు:
నిర్గమకాండము 12:11యిర్మియా 29:10-14
పరిశుద్ధ. లూకా 16:16
పరిశుద్ధ. యోహాను 14:23
గలతీ 5:6
పరిశుద్ధ. యాకోబు 5:16
రొట్టెను/ద్రాక్షరసమును తయారు చేయుటకు సూచనలు
ప్రభురాత్రి భోజనపు ద్రాక్షరసమును/పాద పరిచర్య పాత్రలను పొందుకోడానికి సూచనలు
సంబంధిత కూడికలు
గురుతు అనువర్తించబడిన ప్రియమైన వధువా,
డిసెంబరు 31, ఆదివారమున, నూతన సంవత్సరం వేడుకకుగాను, ఎంతో ప్రత్యేకమైన గృహ ప్రభురాత్రి భోజనపు ఆరాధన కొరకు మనమందరము సిద్ధపరచుకోవాలని నేను కోరుచున్నాను. మనము, 63-0901E నిరాశలు, అనే వర్తమానమును వింటాము, దానిలో టేపుయొక్క ముగింపులో సహోదరుడు బ్రెన్హామ్ గారు ప్రభురాత్రి భోజనము మరియు పాద పరిచర్యను జరిగిస్తారు.
వర్తమానము వాయిస్ రేడియోలో (ఇంగ్లీషులో మాత్రమే) ప్రసారము చేయబడుతుంది, మరియు కూడికలో ప్రభురాత్రి భోజనపు ఆరాధన జరుగుచున్న సమయంలో పియానో సంగీతము, మరియు పాద పరిచర్య జరుగుచున్నప్పుడు సువార్త గీతాలతో, ఇదివరకు గృహ ప్రభురాత్రి భోజనపు ఆరాధనలలో మనము చేసినట్టి క్రమములోనే జరుగుతుంది. మేము కూడికను జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా 5:00 P.M గంటల సమయమప్పుడు ప్రారంభిస్తాము. ఇతర దేశాలలో ఉన్న మీరు, 2023 అర్ధరాత్రికి ముందు ప్రభురాత్రి భోజనమును తీసుకొనునట్లు మీ స్థానిక సమయం ప్రకారంగా టేపును ప్లే చేసుకొని మరియు ప్రభురాత్రి భోజనము తీసుకొనుటకు దయచేసి సంకోచించకండి.
ఈ 2023వ సంవత్సరమును ముగించుకొని, మరియు 2024 లో ప్రభువు కొరకు ఒక నూతన సేవను ప్రారంభించడానికి, ఆయన ముందు మౌనంగా ఉండి, ఆయన కొరకు ఇంకా అధికంగా తపించిపోతూ, ఆయన భోజనములో పాలిభాగస్తులమై, ఒకరి కొరకు ఒకరము ప్రార్థన చేస్తూ మరియు ఒకరినొకరము క్షమించుకుంటూ, ఆయన పరిశుద్ధుల పాదాలు కడుగుతూ, మరియు ఆయన వాక్యమును వినుచుండటం కంటే శ్రేష్ఠమైన ఒక దారి నాకు తట్టడంలేదు. ఇది ఎటువంటి ఒక ప్రత్యేకమైన సాయంకాల సమయముగా ఉంటుంది కదా.
ప్రభురాత్రి భోజనపు రొట్టెను మరియు ద్రాక్షరసమును పొందుకునే/తయారి చేసుకునే విధానాల కొరకు ఈ క్రింద లింకులు ఇవ్వబడినవి.
ఇటువంటి ఒక పవిత్రమైన సందర్భము కొరకు మనందరము ఏకముగా కూడుకొనుటకు ప్రభువు మన కొరకు ఒక మార్గమును ఏర్పాటు చేసినందుకు నేను ఎంతో కృతజ్ఞుడనైయున్నాను. మీ అందరిని ఆయన బల్ల వద్ద కలుసుకొనుటకు నేను నిశ్చయంగా ఎదురుచూస్తున్నాను.
ఈ ఆదివారము, జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా 12:00 P.M గంటల సమయమప్పుడు, మనము: అల్పమైన బెత్లహేము ఎందుకు? 58-1228 అనే క్రిస్మస్ వర్తమానమును వింటాము.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక,
సహోదరుడు జోసఫ్ బ్రెన్హామ్
ఆదివారము, డిసెంబరు 24, 2023
58-1228 అల్పమైన బెత్లహేము ఎందుకు?12:00 P.M. జఫర్సన్ విల్ కాలమానం
ఆదివారము, డిసెంబరు 31, 2023
63-0901E నిరాశలు/గృహ ప్రభురాత్రి భోజనపు ఆరాధన & పాద పరిచర్య5:00 P.M. జఫర్సన్ విల్ కాలమానం
రొట్టెను/ద్రాక్షరసమును తయారు చేయుటకు సూచనలు
ప్రభురాత్రి భోజనపు ద్రాక్షరసమును/పాద పరిచర్య పాత్రలను పొందుకోడానికి సూచనలు
సంబంధిత కూడికలు
నా అత్యంత ప్రియమైన వారలారా,
నేను నా దూత ద్వారా మీతో మాట్లాడుచుండగా, మీరందరూ కలిసి నా స్వరము చుట్టూ కూడుకొనుచు, నా వాక్యమును వినుటను నేను చూసినప్పుడు, నా హృదయం ఉప్పొంగుతుంది.
మీ కొరకు నా స్వరముగా ఉండుటకు నేను ఎన్నుకొనిన ఆ ఒకని గూర్చిన ప్రత్యక్షతను మీరు కలిగియున్నారని తెలుసుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలుగజేస్తుంది. అతడు పలికిన ప్రతి మాట, అతడి మాట కాదు గాని అది మీ కొరకైన నా మాట అని నమ్ముటయైయున్నది.
అది నాకు ఎంతో ప్రాముఖ్యమైనది, కాబట్టి మీరు దానిని మళ్ళీ మళ్ళీ వినగలుగునట్లు, నేను దానిని రికార్డు చేపించి మరియు మీ కొరకు దానిని భద్రపరచియుంచాను. నేను ఏదైతే మాట్లాడానో అది నా హృదయము నుండి మాట్లాడానన్న విషయమును మీరు మరచిపోవాలని నేను అనుకోవడంలేదు. మనం ఏకమైయుండులాగున, మీకు అవసరమైన ఆ పరిపూర్ణ విశ్వాసమును నేను మీకు ఇవ్వగలిగే మార్గము అదొక్కటే అని నేను ఎరిగియున్నాను.
నా వధువుతో మాట్లాడి మరియు నా వాక్యమును ఆమెకు బయలుపరచుటకు నేనెల్లప్పుడూ ఒక్క వ్యక్తినే వాడుకున్నాను. సరిగ్గా నేను మోషేతో చేసినట్లేయైయున్నది. అతడు దేనికొరకు పలికాడో, దానినే అతడు పొందుకున్నాడు, ఎందుకనగా అతడు కేవలం నా మాటలనే పలికాడు. నేను నిన్ను ఒక దేవునిగా చేస్తానని కూడా, నేను అతనికి చెప్పాను. నువ్వు ఒక దేవునిగా ఉంటావు, మరియు అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు. నేను నీ స్వరమును తీసుకొని, మరియు నీ ద్వారా సృష్టించుతాను. నేను మాట్లాడతాను, మరియు ప్రజలు దానిని నిరాకరించలేరు. నీవు పలికినదేదైనా, అది జరుగుతుంది.
ఇప్పుడు నా వాక్యములో మీరు పరిపూర్ణ విశ్వాసమును పొందుకున్నారు గనుక, నా స్వరముగా ఉండుటకు నేను మీకు పంపినవానిని మీరు గుర్తించుట మాత్రమే కాదు గాని, నా వాక్యము మీలో జీవిస్తుందనియు మరియు మీయందు నివసిస్తుందనియు, మరియు మీకు పరిపూర్ణ విశ్వాసమును ఇచ్చినదనియు ఇప్పుడు మీరు గుర్తించారు.
మీరెవరో మీరు ఎరిగియున్నారు. మీరు నాయందు, మరియు నా వాక్యము మీయందు నివసించుచున్నది. మీకు ఏది ఇష్టమో అడగండి; అది మీకు ఇవ్వబడుతుంది. నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొట్టుదురు; నేను వెళ్ళగొట్టుదును, కాదు, మీరు వెళ్ళగొట్టుదురు. మీరు ఈ కొండతో చెప్పినయెడల; నేను చెప్పినయెడల కాదు, మీరు ఈ కొండతో చెప్పినయెడల.
మీ శత్రువుకు ఇక మీపై ఎటువంటి అధికారము లేదు. మీరు మరియు నా వాక్యము ఏకమైయున్నారు. తాము ఉండవలసిన చోట లేనట్టి పిల్లలను లేదా ప్రియమైనవారిని మీరు కలిగియున్నయెడల, వారిని పొందుకోండి. అది మీపై పని చేసినయెడల, అప్పుడు మీయందు నిలచియున్న నా పరిపూర్ణ వాక్యముపై మీ పరిపూర్ణ విశ్వాసమును ఉంచండి, మరియు మీరు ఏమి అడుగుదురో దానిని మీరు పొందుకోగలరు.
ఓ, మీరు ఎవరన్నది మీరు గుర్తించాలని నేను చాలా కాలం ఎదురుచూసాను. నా వాక్యమును వినుటద్వారా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొనుటను చూడటానికి ఎదురుచూసాను. తుదకు ఆ సమయం వచ్చినందుకు నేను అత్యుత్సాహంగా ఉన్నాను.
నేను మీ కొరకు పలికి మరియు మీ కొరకు భద్రపరచిన ఆ పరిపూర్ణమైన వాక్యము ఈనాడు ప్రతీ విశ్వాసి కొరకైన నా గురుతుయైయున్నది. అది పరిశుద్ధాత్మయైయున్నది; ఒక రసాయనమైనట్టి, రక్తము కాదు గానీ, అది నా పరిశుద్ధాత్మయైయున్నది, నా వాక్యము, మీయందు జీవించుచు మరియు మీయందు నివసించుటయైయున్నది.
ఆ గురుతు ప్రదర్శించబడే ఘడియ వచ్చియున్నది. మీరు ఆ గురుతును రాత్రింబగళ్ళు మీతోపాటు తీసుకొని వెళ్ళవలసియున్నది; కేవలం ఆదివారం కాదు, మీరు అన్నివేళలా ప్లే ను నొక్కవలసియున్నారు.
ఆయన కేవలం ఆ—ఆ గురుతును మాత్రమే గుర్తిస్తాడు. అదే ఈ ఘడియ యొక్క వర్తమానము! అది ఈ దినపు వర్తమానమైయున్నది! అది ఈ కాలముయొక్క వర్తమానమైయున్నది! యేసు క్రీస్తు నామములో, దానిని పొందుకోండి!
బయట అక్కడ ఎన్నో వర్తమానములు కలవు, కానీ నా స్వరమే ఈ ఘడియ యొక్క వర్తమానమైయున్నది. మీరు ప్రతీ మాటను పొందుకొని మరియు నమ్మవలసియున్నది. దానిని సాయంకాల సమయములో అనువర్తించుకోవలసియున్నది.
ప్రపంచ వ్యాప్తంగా, టేపులను వింటున్న మీరు, ఘడియ యొక్క సూచన ఇక్కడ ఉన్నది. అనువర్తించుకోవలసిన ఒక గురుతు ఉన్నది, మరియు అది మరే ఇతర సమయములో వచ్చియుండలేదు....మీరు దానిని గ్రహించుచున్నారా?
ఈ ఆదివారము వచ్చి నా వధువుతో కలిసి మీ జీవితముకు నా గురుతును అనువర్తించుకోండి, జఫర్సన్ విల్ కాలమానము ప్రకారంగా మధ్యాహ్నం 12:00., గంటల సమయమప్పుడు వధువు కొరకైన: గురుతు 63-0901M అను నా వర్తమానమును మేము వినుచుండగా దానిని చేయండి.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
వర్తమానము వినడానికి ముందు చదువవలసిన లేఖనములు:
ఆదికాండము 4:10
నిర్గమకాండము 12వ అధ్యాయము
యెహోషువా 12వ అధ్యాయము
అపొస్తలుల కార్యములు 16:31 / 19:1-7
రోమా 8:1
1 కొరింథీ 12:13
ఎఫెసీ 2:12 / 4:30
హెబ్రీ 6:4 / 9:11-14 / 10:26-29 / 11:37 / 12:24 / 13:8, 10-20
పరిశుద్ధ. యోహాను 14:12
సంబంధిత కూడికలు
ప్రియమైన పరిపూర్ణ విశ్వాసపు వధువా,
మన విశ్వాసము వచ్చేది వినుట ద్వారాయైయున్నది, అది వాక్యమును వినుటద్వారా యైయున్నది. వాక్యము ప్రవక్త వద్దకు వస్తుంది.
ప్రవక్త అనగా:
శరీరధారియైన వాక్యము! హల్లేలూయా! ఒక పరిపూర్ణమైన ఎత్తబడుట కొరకు మీకు ఒక పరిపూర్ణమైన విశ్వాసమును తీసుకువచ్చుటకు, భౌతికమైన సూచనలు, వస్తుపరమైన సూచనలు, లేఖన సంబంధమైన సూచనల ద్వారా, వాక్యము పరిపూర్ణముగా, మానవ శరీరంలో పనిచేయుటయైయున్నది.
మనకు పరిపూర్ణమైన విశ్వాసమును ఇచ్చుటకు దేవుని యొక్క నిర్ధారించబడిన ఏకైక స్వరము మాట్లాడి మరియు మానవ శరీరముగుండా తన వాక్యమును బయలుపరచుటను వినడం ద్వారా వాక్యము మనకు ఏమి చేయమని చెప్పినదో సరిగ్గా దానినే మనము చేయుచున్నాము.
మీరు…ఆత్మ చెప్పేది గాక మరేదియు మీ చెవులకు వినపడదు. చూశారా? “చెవిగలవాడు (వినేవాడు), ఆత్మ సంఘములతో చెప్పుచున్నదానిని చూస్తాడు”; వినే సాధనమును కలిగియున్నవాడు, ఆత్మ సంఘములతో చెప్పుచున్నదానిని పట్టుకుంటాడు. చూశారా?
మనమే ప్రతీ వాక్యమును పట్టుకొనుచు మరియు నమ్ముచున్నటువంటి ఆయన యొక్క వినికిడి సాధనమైయున్నాము. ఆయన మనకు ఇట్టి ఆజ్ఞలను ఇచ్చినప్పుడు: “కేవలం టేపులలో ఉన్నదానినే చెప్పండి. నేను మీకు దేవుని స్వరమునైయున్నాను. మీరు నన్ను మీ యొక్క సంఘకాపరి అని పిలుస్తారు, నేను అదే గనుక, మీరు అట్లు పిలవడం యుక్తమే.” మనము వాటిని పాటిస్తాము. ఆయన ఏమి చెప్పినను, ఎక్కడ కూడ ఎటువంటి సందేహపు ఛాయ లేదు; మనము ముందుకు కొనసాగుతాము. ప్రభువు తన ప్రవక్త ద్వారా ఏమి మాట్లాడినను, ఏమి చెప్పికూడా దానినుండి మనలను మార్చగలిగేవారెవ్వరూ ఈ ప్రపంచములోనే లేరు, మనము కేవలం అలాగే కొనసాగిపోతాము.
ఇప్పుడు మీరు విఫలము కాలేని పరిపూర్ణమైన విశ్వాసము, పరిపూర్ణమైన పరిపూర్ణతలోనికి వచ్చుచున్నారు. ఆ విశ్వాసము ఎన్నడూ విఫలమవ్వదు.
ఇప్పుడు ఆయన వాక్యముపట్ల మనము పరిపూర్ణ విశ్వాసమును కలిగియున్నాము. మనము మనవైపు చూసుకోవడం లేదు. మనము యోబు వలె, దేనికీ భయపడటం లేదు. పేతురులాగా మనము పెద్ద పెద్ద అలలను చూసి భయపడుతూ నీళ్ళలో మునిగిపోవడంలేదు. ఆ రోజులు పోయినవి. ఇప్పుడు మనలో జీవిస్తూ మరియు నివసిస్తున్న పరిపూర్ణమైన వాక్యము వైపు మనము చూస్తున్నాము. మనము వధువు పదార్ధములోనికి వెళ్ళుచున్నాము. మనము ఎత్తబడు స్థితిలోనికి వెళ్ళుచున్నాము.
మనం ప్రార్థించినప్పుడు, మనం అడిగినదానిని మనము పొందుకుంటామని మనము నమ్ముచున్నాము, మరియు మనం దానిని పొందుకుంటాము; అది మనకు అనుగ్రహించబడుతుంది. కాలము, శూన్యము, మరేదియు దానిని ఎన్నడూ మార్చలేదు. అది జరిగినదని మనకు తెలుసు. అది ఇదివరకే ముగించబడినది. మనకు ఎలా తెలుస్తుంది? ఎందుకనగా అది మన వాక్యము కాదు గానీ, అది ఆయన పలికి మరియు మనకు ఇచ్చినట్టి, ఆయన యొక్క వాక్యమైయున్నది. దానిని పలుకుటకు మనము శక్తిని మరియు పరిపూర్ణ విశ్వాసమును కలిగియున్నాము.
సరిగ్గా యేసు తన విషయంలో చేసినట్లే, మనము ఎవరమైయున్నామని; మన స్థానమును మనము గుర్తించుచున్నాము. అప్పుడు మనము చేయవలసిన ఒకేఒక్క కార్యమేదనగా, మనమేమైయున్నామనే దానిలో విశ్వాసము ఉంచడమే. మనము ఏమైయున్నామని వాక్యము చెబుతుందో దానిలో విశ్వాసమును కలిగియుండండి! అప్పుడు దేవుని యొక్క వాక్యము మన లోపలికి వచ్చి మరియు దానినది ప్రత్యక్షపరచుకుంటుంది; ఏలయనగా మనము ఒక విశ్వాసియై యున్నాము. మరియు ఒక విశ్వాసి అనగా “మనలో కదలాడుచున్న దేవునియొక్క విశ్వాసమే.”
మరియు ఇప్పుడు, మనము అదే ఆత్మతో అభిషేకించబడుచున్నాము, యేసు క్రీస్తు యొక్క పునరుత్థానమును ప్రకాశింపజేయుటకు; అభిషేకించబడిన మెస్సీయాలమై యున్నాము; అంత్య దినమందు మెస్సీయాలమై యున్నాము, ఆయన మృతునిగా లేడు కాని, పరిశుద్ధాత్మ రూపంలో, ఆయన తన ప్రజలలో ఉన్నాడనియు; తన వధువుకు, ఒక ప్రేమ వ్యవహారముతో, తననుతాను ఆమెలోనికి కుమ్మరించుకుంటూ, ఆమె మధ్యన సంచరించుచున్నాడనియు చూపించుటకైయున్నది. వారు పెండ్లి విందు కొరకు ఒక్కటగుచున్నారు; మరియు అదే దేవుని ద్వారా, అదే వాక్యములో, వాగ్దానము చేయబడిన అవే సూచనలు, ఆయన యొక్క అవే కార్యరూపణలను చేయుచున్నవి.
దానిని నమ్మడం తప్ప మనము చేయుటకు ఇంకేమియు లేదు; మరియు ఒక పరిపూర్ణమైన విశ్వాసమును సృష్టించే పదార్థము అదేనని నమ్మటం తప్ప మరేమియు లేదు. దానిని మరలా వినండి, పరిపూర్ణమైన విశ్వాసమును సృష్టించే పదార్థము అదేనని నమ్మడమైయున్నది.
ఒక్క వాక్యమునైనా సందేహపడునట్టి ఒక్క అణువైనా మీ శరీరములో ఉన్నదా: లేదు
మీరు ప్రతీ వాక్యమును నమ్ముచున్నారా: అవును
ఈ వర్తమానముయొక్క ప్రత్యక్షతను ఆయన మీకు అనుగ్రహించాడా: అవును
వధువు మాత్రమే నిజమైన ప్రత్యక్షతను కలిగియుంటుందా: అవును
మీరు ఆయనయొక్క వధువైయున్నారని మీకు తెలుసా: అవును
ప్రతీ వాక్యమును నమ్ముటద్వారా అది మీకు పరిపూర్ణమైన విశ్వాసమును ఇస్తుందని ఆయన చెప్పాడా: అవును
అప్పుడు మీరు పరిపూర్ణమైన విశ్వాసపు వాక్య వధువైయున్నారు!!
ఆదివారమున నీ వాక్యమును వినుటకు మేము కూడుకొనుచుండగా ఓ ప్రభువా ముందెన్నడూ లేనట్లుగా మమ్మల్ని సిద్ధపరచుము. ఇక ఎన్నడూ మేము మావైపు చూసుకోకుండా, కేవలం నీవు మా కొరకు పలికినట్టి నీ వాక్యమును నమ్మునట్లు మాకు సహాయము చేయుము. మూడవ ఈడ్పు పనిచేయుటను మేము చూశాము మరియు అది మాలో నివసించుచున్నదని ఎరిగియున్నాము. మేము నీ వాక్యమును పలుకుచు మరియు నమ్ముచుండవలసియున్నది.
నీ యొక్క పరిపూర్ణమైన వాక్య వధువు కొరకు నీవు త్వరలో వచ్చుచున్నావని మేము ఎరిగియున్నాము. మాకు అవసరమైయున్నది ఏదైనా, తండ్రీ, మాకు అవసరమైయున్నది ఏదైనా, మేము దానిని పొందుకుంటామని మాకు తెలియును. ఏలయనగా అది నీవు ఇదివరకే మా కొరకు పలికినట్టి నీ వాక్యమైయున్నది. కేవలం దానిని నమ్మడం తప్ప చేయడానికి మరేదియు లేదు. మేము నమ్ముచున్నాము తండ్రీ, మేము నమ్ముచున్నాము. ఇప్పుడు మమ్మల్ని నీ వాక్యముపై పనిచేయనిమ్ము.
మా వైఫల్యాలను, పాపములను మరియు అతిక్రమములన్నిటినీ మేము ఒప్పుకొనుచున్నాము. ఎక్కడైతే నీ కృప మరియు కనికరముల ద్వారా మేము నీతిమంతులుగా తీర్చబడినామో అట్టి నీ కుమారుని రక్తముగుండా మమ్మల్ని చూడుము. ముందెన్నడూ లేనటువంటి మార్పు నీ వధువులో జరుగును గాక. నీ పరిశుద్ధాత్మను మాపై కుమ్మరించి మరియు మా అవసరతలన్నిటినీ నీవు మాకు అనుగ్రహించుదువు గాక.
రోగులు వారికున్న బాధలన్నిటి నుండి స్వస్థత పొందుదురు గాక. పడిపోయినవారు తిరిగి వాక్యము వద్దకు వచ్చుదురు గాక. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నీ వధువు ఈ దినముకై నీవు ఏర్పాటుచేసిన మార్గమును చూసి మరియు నమ్ముదురు గాక.
మీ పైన చేతులు ఉంచుటకు మీకు ఎవరూ లేనట్లైతే…మీ పైన మీరే చేతులు పెట్టుకోండి…మీరు ఒక విశ్వాసియై యున్నారు. మీరు వాక్యముగా మారినారు; మీరు వాక్యమును స్వీకరించియుండగా, మీరు వాక్యముగా మారినారు.
ప్రభువైన యేసూ రమ్ము, నీ వాక్యము యొక్క సన్నిధిలో పడియుండి పరిపక్వమగుచూ, నీ వధువు తననుతాను సిద్ధపరచుకొనుచున్నది. మేము నీ వాక్యముచేత అలంకరించబడి మరియు వస్త్రధారణ చేసుకొనగోరుచున్నాము.
ఈ ఆదివారము వచ్చి ముందెన్నడూ లేనివిధంగా మమ్మల్ని అభిషేకించుము, జఫర్సన్ విల్ కాలమానము ప్రకారంగా 12:00 P.M., గంటల సమయమప్పుడు, నీ వధువులోని భాగంగా మేము కూడుకొని మరియు నీవు మాట్లాడుటను వినుచుండగా: పరిపూర్ణమైన విశ్వాసము 63-0825E ను ఎలా పొందుకోవాలో మాకు బయలుపరచుము.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
కూడికకు ముందు చదువవలసిన లేఖనములు:
పరి. మార్కు 11:22-26 / 16:15-18
పరి. యోహాను 14:12 / 15:7
హెబ్రీ 11:1 / 4:14
యాకోబు 5:14
1 యోహాను 3:21
ప్రసంగ తర్జుమాలు
సంబంధిత కూడికలు
ప్రియమైన కొలను లిల్లీ,
ఆదివారమున మన ప్రభువు మాట్లాడి మరియు ఇప్పుడు ఏమి జరుగుతుందన్నదాని గూర్చి మనతో చెప్పుటను మనం విన్నప్పుడు మన హృదయములు ఆనందముతో ఎలా గంతులు వేసినవి కదా. మనము వాక్యముతో ఐక్యమవుతూ మరియు ఆయనతో ఏకమగుచున్నాము. మనకు ముందుగా వెళ్ళిన పరిశుద్ధులతో ఏకమగుటకు మనము త్వరలోనే వారితో ఐక్యమవుతాము. పిదప గొఱ్ఱెపిల్ల పెండ్లి విందు కొరకై మనమందరము ఒక్కటిగా క్రీస్తుతో ఐక్యమవుతాము.
ఒక క్షణములో, కనురెప్ప పాటులో అనే దాని గూర్చి ఆలోచించమని, ఆయన మనతో చెప్పినప్పుడు మన ఆత్మలు ఎటువంటి ఆనందముతో నిండినవి గదా, లోకానికి అసలు ఏమి జరుగుతుందో తెలియదు; కానీ అకస్మాత్తుగా, ముందుగా వెళ్ళిన మన ప్రియులను మనము మన కన్నుల యెదుట చూస్తాము, మరియు మనం వారితో మరలా ఐక్యమవుతాము.
ఒక్క క్షణములో, మన తండ్రులు, మన తల్లులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, భర్తలు, భార్యలు, పిల్లలు, ఇంకా మన ప్రవక్త కూడా మన యెదుట నిలబడియుడుండుటను మనము చూస్తామన్నదాని గూర్చి ఆలోచించడానికి, ఎటువంటి ఎదురుచూపులు మన హృదయములో నిండుచున్నవి కదా. మనము వారిని, శరీరంలో చూస్తాము!!
సరిగ్గా అప్పుడే, ఇది అదే; సమయం వచ్చేసింది, మనము సాధించాము, అది ముగిసింది అని మనము తెలుసుకుంటాము. ప్రత్యక్షత వలన కలుగు ఉత్తేజం గురించి మాట్లాడండి!! కేవలం ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తూ మరియు మాట్లాడుతుంటేనే, మహిమ, హల్లేలూయా, ప్రభువు నామము స్తుతింపబడును గాక అంటూ, మీరు కేకలు వేయడాన్ని నేను వినగలుగుచున్నాను.
మన కొరకు ఉంచబడిన ఈ ప్రేమలేఖలపై విందు చేసుకొనుచు, మనము ఎటువంటి ఒక సమయమును కలిగియుంటున్నాము కదా. మనము కోరిన ఏ సమయములోనైనా బయటకు తీసి మరియు వాటిని మళ్ళీ మళ్ళీ మళ్ళీ చదువుకోగలిగే ప్రేమలేఖలు. అది మాత్రమే కాదు గాని, ఇంకా గొప్ప విషయమేమిటంటే, మన ప్రభువు స్వయంగా తానే మానవ పెదవుల గుండా మాట్లాడి మరియు మనతో ఇట్లు చెప్పడాన్ని మనము వినగలుగుచున్నాము, “నా ప్రియమైన వారలారా, నేను ఈ ప్రేమలేఖలను కేవలం మీ కొరకే భద్రపరిచాను. నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాననియు మరియు మీరు నావారనియు నేను మీకు చెప్పుటను మీరు వినడం మీకు అవసరమయ్యే ఒక సమయము వస్తుందని నాకు తెలుసు.”
“శత్రువు మీపై దాడి చేసినప్పుడు, మీరు మీ పరీక్షలు మరియు శ్రమలన్నిటిగుండా వెళ్తున్నప్పుడు, మీరు నావారై యున్నారని ప్రతీ రోజు నేను మీకు చెప్పగోరుచున్నాను. నేను ఇదివరకే వెలను చెల్లించాను. నేను ఇదివరకే అది ఏదైనా గాని దానిని జయించాను...నా ప్రియమైనవారలారా నేను చెప్పేది మీకు వినిపించిందా? మీకు అవసరమైయున్నది ఏదైనా, నేను దానిని ఇదివరకే మీ కొరకు జయించాను, ఎందుకనగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.”
“ఒక ప్రపంచమనేది లేకమునుపే నేను మిమ్మల్ని ఎరిగియున్నాను. అప్పుడు మీరు నాలో ఒక భాగమైయున్నారు. అది మీకిప్పుడు జ్ఞాపకము లేదు, కాని నాకు జ్ఞాపకమున్నది. నేను మీకు చెప్పినదానిని మర్చిపోవద్దు, మీరు నా మాంసములో మాంసము, నా ఆత్మలో ఆత్మ, నా ఎముకలో ఎముకయై యున్నారు.”
“నేను మీకు దేని గూర్చియైతే చెప్పుచున్నానో ఇప్పుడు ఆ సమయము వచ్చియున్నది. బాధలు, పరీక్షలు మరియు శ్రమలు ఇకమీదట ఉండవు; ఆ రోజులు గతించిపోయినవి. ఇక ఇప్పుడు కేవలం మనమందరము కలిసి నిత్యత్వములో గడపడమేయైయున్నది.”
“ధైర్యము తెచ్చుకోండి. ముందుకు కొనసాగుతూ ఉండండి. ఆ దినము ఉదయించుటకు సమయమైనది. అనుదినము మీరు ఎదుర్కుంటున్న ఒత్తిడంతయు కేవలం మిమ్మల్ని నాకు ఇంకా దగ్గరగా తెచ్చుటకేయైయున్నది.”
“మీ మీదికి ఏదైనా వచ్చినప్పుడు, మరియు మీరు ఎంతగానో కృంగిపోయినట్లు, అలసిపోయినట్లు మరియు సోమ్మసిల్లినట్లు మీకు అనిపించుచు మరియు మీరు అసలు ఇక కొనసాగలేనట్లుగా అగుపించుచున్నప్పుడు, నేను సరిగ్గా మీతోనే ఉన్నానని, మీరెన్నడూ మర్చిపోకూడదు. నా వాక్యము మీలో జీవించుచున్నది. మీరే నా వాక్యమైయున్నారు.”
“మాట మాత్రము పలుకుడి, అని నేను మీతో చెప్పియున్నాను. మీరు కోరినవి ఏవైనా, మీరు ప్రార్థన చేసినప్పుడు, మీరు వాటిని పొందుకుంటారని నమ్మండి మరియు మీరు వాటిని పొందుకుంటారు. అవి మీకు ఇవ్వబడతాయి. నేను ఇదివరకే మీ కొరకు వాటిని జయించాను.”
ఈ మాటలు మనకు ఎంత విలువైనవి కదా. అనుదినము అవి మనలను పోషించుచున్నవి. అవి మన ఆత్మలను ఉత్సాహపరిచి మరియు మనలను ఆయనతో కూడ పరలోక స్థలములలో కూర్చుండబెడతాయి. మనము కేవలం దేవుని కొరకు మరియు ఆయన వాక్యము కొరకు బ్రదుకుచున్నాము. మనకు ఒక్క లక్ష్యమున్నది, అది యేసు క్రీస్తే. దానికి వెలుపల, ఏదియు లెక్కలోనికి రాదు.
మనము దర్శనమును పట్టుకున్నాము. తెర తొలగించబడినది మరియు మనము ఆయనను, ఆయన వాక్యము శరీరధారియై, మానవ పెదవులగుండా మనతో మాట్లాడుటను చూస్తున్నాము. మనము ఈ వాక్యముతో, ఈ వర్తమానముతో, ఆ స్వరముతో ప్రేమలో ఉన్నాము.
ఆదివారము జఫర్సన్ విల్ కాలమానము ప్రకారంగా 12:00 P.M., గంటల సమయమప్పుడు, వచ్చి మాతో చేరి మరియు మీ జీవితములోని అతిగొప్ప అనుభవాన్ని పొందుకోండి. సాతానుడు మీ మార్గాములోకి విసిరే ప్రతీ పోరాటమును ఎలా జయించాలో వినండి. మీరు యేసు క్రీస్తు యొక్క వధువైయున్నారని ఎరిగియుండి ఆనందముతో మరియు సంతోషముతో మీ హృదయములను నింపుకోండి.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
63-0825M నేనెలా జయించగలను?
కూడికకు ముందు చదువవలసిన లేఖనములు:
ప్రకటన 3:21-22