ప్రియమైన దత్తపుత్రులారా,
పరిశుద్ధాత్మ ముందెన్నడూ లేని విధంగా వధువునకు ఆయనయొక్క వాక్యమును ప్రకాశిస్తుండగా మనము ఎటువంటి ఒక అద్భుతమైన చలికాలమును కలిగియుంటున్నాము కదా. బహుశా మనము మన జీవితమంతా విని, చదివి మరియు ధ్యానించిన విషయాలే అయ్యుండవచ్చును, అయితే ముందెన్నడూ లేని విధంగా ఇప్పుడు ముసుగు తొలగించబడుతున్నాయి మరియు బయలుపరచబడుతున్నాయి.
సరిగ్గా ఈ దినము కొరకే మానవుడు కొన్ని వేల సంవత్సరాలు వేచియున్నాడు. మనం చూస్తున్నవాటిని చూడటానికి మరియు మనం వింటున్నవాటిని వినడానికి వారందరూ పరితపించారు మరియు ప్రార్థించారు. నెరవేర్పును మరియు ప్రభువుయొక్క రాకడను చూడటానికి వారెంతగా కోరుకున్నారో. పాత కాలపు ప్రవక్తల సైతం ఈ దినము కొరకు పరితపించారు. వారు ప్రభువుయొక్క రాకడను మరియు నెరవేర్పును ఎంతగానో చూడగోరారు.
చివరికి యేసుయొక్క శిష్యులైన, పేతురు, యాకోబు, మరియు యోహాను కూడా, ఆయనతో నడిచి మరియు ఆయనతో మాట్లాడిన ప్రజలు కూడా, దాచబడినదానంతటినీ చూడటానికి మరియు వినడానికి పరితపించారు. వారి దినములో, వారి కాలములో అది ప్రత్యక్షపరచబడి బయలుపరచబడాలని వారు ప్రార్థన చేసారు.
ఏడు సంఘకాలముల గుండా, ప్రతీ వర్తమానికుడు, పౌలు, మార్టిన్, మరియు లూథర్, దాచబడిన మర్మములన్నిటినీ తెలుసుకొనగోరారు. వాక్యముయొక్క నెరవేర్పు వారి కాలములో జరుగుటను చూడాలన్నదే వారి కోరికయైయుండెను. వారు ప్రభువుయొక్క రాకడను చూడగోరారు.
దేవుడు ఒక ప్రణాళికను కలిగియున్నాడు. దేవుడు ఒక సమయమును కలిగియున్నాడు. తాను ఎదురుచూస్తున్నట్టి కొందరు ప్రజలను దేవుడు కలిగియున్నాడు…అది మనమే. కాలములన్నిటి గుండా, అందరూ విఫలమయ్యారు. కానీ ఆయనయొక్క మహిమకరమైన, పరిపూర్ణ వాక్య వధువైనట్టి: ఒక జనము ఉంటారని, ఆయనయొక్క ముందుజ్ఞానము ద్వారా, ఆయన ఎరిగియున్నాడు. వారు ఆయనను విఫలపరచరు. వారు ఒక్క వాక్యముపై కూడా రాజీపడరు. వారు ఆయనయొక్క స్వచ్ఛమైన కన్యక వాక్య వధువైయుంటారు.
ఇదే ఆ సమయమైయున్నది. ఇదే ఆ కాలమైయున్నది. ఆదాము పడిపోయి మరియు అతని హక్కును పోగొట్టుకున్నప్పటినుండి ఆయన ఎదురుచూసినటువంటి ఆ ఎన్నుకోబడినవారము మనమే. మనమే ఆయనయొక్క వధువైయున్నాము.
దేవుడు జరుగనైయున్నవాటన్నిటి గురించి ఒక ముందు ప్రదర్శనను యోహానుకు ఇచ్చాడు, కానీ అతనికి అన్ని అర్థాలు తెలియవు. అతడు పైకి పిలువబడినప్పుడు, సింహాసనమందు ఆసీనుడైనవాని కుడి చేతిలో వ్రాయబడియున్న ఒక గ్రంథము, ఏడు ముద్రలతో ముద్రించబడియుండుటను, అయితే దానిని తెరచుటకు యోగ్యులెవరూ లేకపోవుటను అతడు చూసాడు.
ఇక సమస్తము నశించిపోయినట్లేయని, ఏ నిరీక్షణ లేనందున యోహాను కేకవేసి బహుగా ఏడ్చాడు. కానీ ప్రభువుకు స్తోత్రం, పెద్దలలో ఒకరు అతనితో ఇట్లు చెప్పారు, “ఏడ్వకుము, ఏలయనగా ఇదిగో, దావీదు వేరైన, యూదా గోత్రపు సింహము, ఏడు ముద్రలను తీసి, మరియు ఆ గ్రంథమును విప్పుటకై జయముపొందెను”.
అది ఆ సమయమైయున్నది. అది ఆ కాలమైయున్నది. అతడు తాను చూసినదానంతటినీ వ్రాయడానికి దేవుడు ఎన్నుకొనిన మానవుడైయున్నాడు. కానీ అయినను, దానియొక్క అర్థమంతయు తెలియపరచబడకుండా ఉన్నది.
దేవుడు ఆయనయొక్క ఎన్నుకోబడిన పాత్ర, అనగా ఆయనయొక్క ఏడవ దూత వర్తమానికుడు, భూమి మీదికి రావడం కొరకు ఎదురుచూస్తూ వేచియున్నాడు, తద్వారా ఆయనయొక్క వధువునకు ఆయనయొక్క స్వరముగా ఉండునట్లు అతని స్వరమును ఉపయోగించుకొనుటకైయున్నది. ఆయన ఎటువంటి అపార్థములు ఉండకుండునట్లు నేరుగా నోటినుండి చెవికి మాట్లాడగోరాడు. ఆయన స్వయంగా తానే మాట్లాడి మరియు ఆయనయొక్క ప్రియులకు, ముందుగా నిర్ణయించబడినవారికి, పరిపూర్ణమైన, ప్రియమైన వధువునకు...మనకు ఆయనయొక్క మర్మములన్నిటినీ బయలుపరచగోరాడు!!
ఈ అద్భుతమైన సంగతులన్నిటినీ మనకు చెప్పడానికి ఆయన ఎంతగా పరితపించాడో. ఒక పురుషుడు తన భార్యకు అతడు ఆమెను ప్రేమిస్తున్నాడని మరలా మరలా ఎలాగైతే చెప్తాడో, మరియు దానిని వినడానికి ఆమెకు ఎలాగైతే ఎన్నడూ విసుగు రాదో, అలాగే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని, మనల్ని ఎన్నుకున్నాడని, మనకొరకు వేచియున్నాడని మరియు ఇప్పుడు మనకొరకు వస్తున్నాడని మనతో మరలా మరలా చెప్పడానికి ఆయన ఇష్టపడుతున్నాడు.
ఆయన దానిని మరలా మరలా చెప్పుటను వినడానికి మనమెంతగా ఇష్టపడతామో ఆయనకు తెలుసు, అందుకే ఆయన ఆయనయొక్క స్వరమును రికార్డు చేపించాడు, తద్వారా ఆయనయొక్క వధువు ‘ప్లేను నొక్కి’ ప్రతిరోజు, రోజంతా, ఆయనయొక్క వాక్యము తమ హృదయములను నింపడాన్ని వినగలుగుటకైయున్నది.
ఆయనయొక్క వాక్యముపై పోషించబడుట ద్వారా ఆయనయొక్క ప్రియమైన వధువు తననుతాను సిద్ధపరచుకున్నది. ఆయనయొక్క స్వరమును తప్ప, మరి దేనిని వినదు. ఏర్పాటు చేయబడిన ఆయనయొక్క స్వచ్ఛమైన వాక్యమును మాత్రమే మనము ఆరగించగలము.
మనము గొప్ప ఎదురుచూపులతో ఉన్నాము. మనము దానిని మన అంతరాత్మలలో అనుభూతి చెందుతున్నాము. ఆయన వచ్చుచున్నాడు. వివాహ సంగీతము వాయించబడటాన్ని మనము వింటున్నాము. ఆ నడవగుండా వచ్చుటకు వధువు సిద్ధంగా ఉన్నది. అందరూ లేచి నిలబడండి, వధువు తన వరుడితో ఉండటానికి వచ్చుచున్నది. సమస్తము సిద్ధము చేయబడినది. ఆ క్షణము వచ్చియున్నది.
ఆయన మనల్ని ఎవరూ ప్రేమించని విధంగా ప్రేమిస్తున్నాడు. మనము కూడా ఎవరినీ ప్రేమించని విధంగా ఆయనను ప్రేమిస్తున్నాము. మనము ఆయనతోను, మరియు మనము ప్రేమిస్తున్న వారందరితోను, నిత్యత్వమంతా ఏకమైయుండబోవుచున్నాము.
ఈ ఆదివారం జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు దేవుని స్వరము దీనిని బయలుపరచడాన్ని మేము వింటుండగా మాతో కలిసి మిమ్మల్ని మీరు వివాహమునకు సిద్ధపరచుకోడానికి మీరు ఆహ్వానించబడ్డారు, ప్రకటన గ్రంథము, ఐదవ అధ్యాయము భాగము I 61-0611.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
సంబంధిత కూడికలు
ప్రియమైన నిత్యత్వపు వారలారా,
మనయొక్క యుద్ధపు తలపాగాను తీసివేసి మరియు ఆత్మసంబంధమైన ఆలోచనను ధరించుటకు సమయమైనది, ఎందుకనగా దేవుడు ఆయనయొక్క వధువునకు ఆయనయొక్క వాక్యమును గూర్చిన మరి ఎక్కువ ప్రత్యక్షతను ఇచ్చుటకు సిద్ధపడుచున్నాడు.
ఆయన మనకు గతంలోని మర్మములన్నిటియొక్క ముసుగును తొలగిస్తుంటాడు. భవిష్యత్తులో ఏమి జరుగబోవుచున్నదో ఆయన మనకు చెప్తాడు. బైబిలు గ్రంథములో ఉన్న ఇతరులందరూ కేవలం ఏమి చూసారో లేదా ఏమి విన్నారో, ఆయన తనయొక్క ఆ వాక్యమును గూర్చిన ప్రతీ చిన్న వివరమును మరియు దానియొక్క అర్థమును మనకు బయలుపరుస్తాడు.
మనము బైబిలు గ్రంథములోని గురుతులను విని మరియు వాటిని గ్రహించబోవుచున్నాము: జీవులు, గాజువంటి సముద్రము, సింహము, దూడ, మనుష్యుడు, పక్షిరాజు, కరుణాపీఠము, కాపలాకాయువారు, పెద్దలు, స్వరములు, మృగము, జీవులు.
మనము పాత నిబంధనలోని కాపలాదారుల గురించి అంతా విని మరియు గ్రహిస్తాము. యూదా: తూర్పు కావలి; ఎఫ్రాయిము: పశ్చిమ కావలి; రూబేను: దక్షిణ కావలి; దాను: ఉత్తర కావలి.
ఆ గోత్రములను దాటకుండా ఏదియు ఆ కరుణాపీఠముయొక్క చుట్టుప్రక్కలకు రానేరదు. సింహము, మనుష్యునియొక్క తెలివి; ఎద్దు: పనిభారము గలది; పక్షిరాజు: దాని వేగము.
ఏ విధంగా పరలోకము, భూమి, మధ్యలో-ఉన్నదానంతటి, మరియు చుట్టూ ఉన్నదానంతతికి, కాపలాదారులు ఉన్నారు కదా. మరియు దాని మీద అగ్ని స్తంభము ఉన్నది. ఆ గోత్రములను దాటకుండా ఏదియును ఆ కరుణాపీఠమును తాకలేదు.
ఇప్పుడు క్రొత్త నిబంధనలో కాపలాదారులు ఉన్నారు: మత్తయి, మార్కు, లూకా, యోహాను, నేరుగా ముందుకు వెళ్ళుచున్నారు. తూర్పు ద్వారము సింహముచేత కాయబడుచున్నది, ఉత్తర ద్వారము ఎగురుచున్న పక్షిరాజుచేత కాయబడుచున్నది, యోహాను, సువార్తికుడు. పిదప ఈ వైపున ఉన్న వైద్యుడు, లూకా, మనుష్యుడు.
నాలుగు సువార్తలు సరిగ్గా అవి చెప్పినదానిని నిర్ధారించుటకు ప్రతి లేఖనమును కలిగియుండి పెంతెకొస్తు ఆశీర్వాదమును కాయుచున్నవి. మరియు ఇప్పుడు ఈనాడు యేసుక్రీస్తు నిన్నా, నేడు, మరియు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడని, ఆ నాలుగు సువార్తలతో కలిసి అపొస్తలుల కార్యములు నిర్ధారించుచున్నవి.
దేవునియొక్క అసలైన అభిషేకించబడిన వ్యక్తి మాట్లాడినప్పుడు, అది దేవునియొక్క స్వరమైయున్నది! మనము అసలు ఈ విధంగా కేకలు వేయగోరుచున్నాము, “ప్రభువు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు!”
దాని నుండి దూరంగా వెళ్ళుటకు దారే లేదు. నిజానికి, మనము దాని నుండి దూరంగా వెళ్ళలేము, ఎందుకనగా అది మననుండి దూరంగా వెళ్ళదు. మన విమోచనా దినమువరకు మనము ముద్రించబడియున్నాము. రాబోవునవియైనను, ఉన్నవియైనను, ఆపదలైనను, ఆకలియైనను, దప్పికయైనను, మరణమైనను, లేదా ఇంకేదియును, క్రీస్తుయేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాపనేరదు.
మన దినమునకైన ఈ వెలుగును చూడటానికి, ఈ స్వరమును స్వీకరించడానికి, ఈ వర్తమానమును నమ్మడానికి, పరిశుద్ధాత్మను పొందుకొని మరియు దానిలో నడవడానికి, జగత్తు పునాది వేయబడకముందే మన పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథములో పెట్టబడ్డాయి. గొర్రెపిల్ల వధించబడినప్పుడు, గొర్రెపిల్ల పేరు అక్కడ పెట్టబడిన అదే సమయములో మన పేర్లు కూడా ఆ గ్రంథములో పెట్టబడ్డాయి. మహిమ!!
కావున, ఏదియు ఈ వర్తమానము నుండి మనల్ని వేరు చేయలేదు. ఏదియు ఆ స్వరము నుండి మనల్ని వేరు చేయలేదు. ఏదియు ఈ వాక్యముయొక్క ప్రత్యక్షతను మనదగ్గర నుండి తీసివేయలేదు. అది మనది. దేవుడు మనల్ని పిలిచాడు మరియు మనల్ని ఎన్నుకున్నాడు మరియు మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు. ప్రతీది మనకు చెందియున్నది, అది మనదే.
దీనంతటినీ పొందుకోడానికి ఒకే ఒక్క మార్గమున్నది. మీరు వాక్యమనే ఉదక స్నానముచేత కడుగబడవలసియున్నది. మీరు దానిలోనికి ప్రవేశించుటకుముందు మీరు వాక్యమును వినవలసియున్నారు. మరియు మీరు దేవుడిని సమీపించగల ఒకే ఒక్క మార్గమున్నది, అది విశ్వాసము ద్వారానేయైయున్నది. మరియు వినుటవలన, అనగా అతిపరిశుద్ధ స్థలములోనుండి ఈ కాలముయొక్క వర్తమానికుడిలోనికి ప్రతిబింబించబడుచున్న దేవుని వాక్యమును వినుటవలన విశ్వాసము కలుగుతుంది.
కావున, ఇక్కడ, సంఘకాలపు దూత ఇక్కడున్న ఈయన ఎవరన్నదానిని ఆ నీటిలోనికి ప్రతిబింబిస్తున్నాడు, ఆయనయొక్క కనికరమును, ఆయనయొక్క మాటలను, ఆయనయొక్క తీర్పును, ఆయనయొక్క నామమును ప్రతిబింబిస్తున్నాడు. అదంతయు ఇక్కడ ప్రతిబింబించబడినది మరి దానిని నమ్ముటచేత మీరు వేరుచేయబడతారు. మీకు అది అర్థమైనదా?
టేపులను వినడం ఆపకండి, కేవలం వాటితో నిలిచియుండండి. వాక్యముతో దానిని పరిశోధించి మరియు అది సరియో కాదో చూడండి. అది ఈ దినమునకై దేవుడు ఏర్పాటు చేసిన మార్గమైయున్నది.
ఈ చలికాలము ప్రపంచ వ్యాప్తంగా మేము కూడుకొని మరియు దేవుని స్వరము ముందెన్నడూ లేని విధంగా ఆయనయొక్క వధువునకు ఆయనయొక్క వాక్యమును బయలుపరచుటను వింటుండగా వచ్చి మాతో చేరండి. ప్లేను నొక్కి మరియు ఆయన స్వరమును వినుటకంటె మరి గొప్ప అభిషేకము లేనే లేదు.
నా హృదయలోతులనుండి, నేను దీనిని చెప్పగలను: మీలో ప్రతి ఒక్కరితో కలిసి నేను వారిలో ఒకడినని చెప్పగలుగుచున్నందుకు నేనెంతగానో సంతోషిస్తున్నాను.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
వర్తమానము: 61-0108 – ప్రకటన గ్రంథము, నాలుగవ అధ్యాయము భాగము III
సమయము: 12:00 P.M. జఫర్సన్విల్ కాలమానం
సంబంధిత కూడికలు
ప్రియమైన గృహ సంఘపు వధువా,
ఈ ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా, మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు మనమందరము కూడుకొని మరియు, 61-0101 ప్రకటన గ్రంథము, నాలుగవ అధ్యాయము భాగము II అనే వర్తమానమును విందాము.
సహోదరుడు జోసఫ్ బ్రెన్హామ్
సంబంధిత కూడికలు
ప్రియమైన వధువా,
మీలో ప్రతి ఒక్కరూ మీ స్నేహితులతోను మరియు కుటుంబములతోను కలిసి ఒక అద్భుతమైన క్రిస్మసును కలిగియున్నారని నేను నమ్ముచున్నాను. ఈనాడు లోకము ఆయనను చూస్తున్న విధంగా మన ప్రభువైన యేసు ఒక పశులతొట్టిలోనే ఉండిపోలేదు గాని, ఆయన సజీవుడై మరియు తన వధువు మధ్యన ఉన్నాడని, ముందెన్నడూ లేనంతగా ఆయనయొక్క స్వరము ద్వారా తననుతాను బయలుపరచుకొనుచున్నాడని ఎరిగియుండుటకు నేను ఈ దినమున ఎంతో కృతజ్ఞుడనైయున్నాను, దేవునికి స్తోత్రం.
నేను ఇదివరకు ప్రకటించినట్లుగా, నూతన సంవత్సరమునకు ముందు దినమున, అనగా డిసెంబరు 31వ తేదీన, మరొకసారి మన గృహములలో/సంఘములలో ప్రభురాత్రి భోజనమును కలిగియుండగోరుచున్నాను. పాల్గొనాలని ఇష్టపడుచున్నవారికి చెప్పుచున్నాను, మేము, 62-1231 పోటీ, అనే వర్తమానమును వింటాము, మరియు పిదప నేరుగా ప్రభురాత్రి భోజనమును ప్రారంభిస్తాము, దానిని సహోదరుడు బ్రెన్హామ్ గారు వర్తమానముయొక్క ముగింపులో పరిచయం చేస్తారు.
స్థానిక విశ్వాసుల కొరకు, సాయంకాలం 7:00 గంటల సమయమప్పుడు మేము టేపును ప్రారంభిస్తాము. ఏదేమైనను, ఇతర కాలమండలములలో ఉన్నవారు, దయచేసి మీకు అనుకూలమైన సమయములో వర్తమానమును ప్రారంభించండి. సహోదరుడు బ్రెన్హామ్ గారు నూతన సంవత్సరమునకు ముందు దినపు వర్తమానమును అందించిన తర్వాత, 59 వ పేరా ముగింపులో మేము టేపును కొంత సమయం ఆపుతాము, మరియు మేము ప్రభురాత్రి భోజనమును తీసుకొనుచుండగా సుమారు 10 నిమిషాలపాటు పియానో సంగీతం వాయించబడుతుంది. పిదప సహోదరుడు బ్రెన్హామ్ గారు కూడికను ముగించుచుండగా మేము టేపును మరలా ప్లే చేస్తాము. ఈ టేపులో, ఆయన పాదపరిచర్య కార్యక్రమ భాగమును విడిచిపెడతారు, మేము కూడా దానిని విడిచిపెడతాము.
ద్రాక్షరసమును ఎలా పొందుకోవాలి, మరియు ప్రభురాత్రి భోజనపు రొట్టెను ఎలా కాల్చాలి అనేదానికి సూచనలు క్రింద ఇవ్వబడిన లింకులలో కనుగొనబడతాయి. మీరు వెబ్సైటు నుండి ఆడియోను ప్లే చేసుకొనవచ్చును లేదా డౌన్లోడు చేసుకొనవచ్చును, లేదా మీరు సులువుగా లైఫ్ లైన్ యాప్ లోని వాయిస్ రేడియో నుండి ఈ కూడికను ప్లే చేసుకొనవచ్చును (అది జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా సాయంత్రం 7:00 గంటల సమయమప్పుడు ఆంగ్లములో ప్లే చేయబడుతుంది.)
మన ప్రభువుయొక్క సేవలో మరొక సంవత్సరమును మనము సమీపిస్తుండగా, మొదటిగా ఆయన స్వరమును వినుట ద్వారా మనము మన ప్రేమను ఆయనకు వ్యక్తపరచుదాము, మరియు పిదప మనము ఆయనయొక్క భోజనములో పాలుపొందుదాము. మన జీవితములను ఆయనయొక్క సేవకై మరలా ప్రతిష్ఠించుకొనుచుండగా అది ఎటువంటి ఒక మహిమకరమైన పవిత్రమైన సమయముగా ఉంటుంది కదా.
దేవుడు మిమ్మును దీవించును గాక,
సహోదరుడు జోసఫ్
సంబంధిత కూడికలు
ప్రియమైన తెల్లని వస్త్రములు-ధరించిన పరిశుద్ధులారా,
దేవుని స్వరము మనతో మాట్లాడుటను మనము విన్నప్పుడు, మన అంతరంగపు లోతులలో ఏదో జరుగుతుంది. మన సమస్తము మార్చివేయబడుతుంది మరియు మన చుట్టూ ఉన్న ప్రపంచము పలచనబడిపోతుంది.
మనము వింటున్న ప్రతి వర్తమానముతో దేవుని స్వరము తన వాక్యమును బయలుపరచుచుండగా, మన హృదయములలో, మన మనస్సులలో, మన అంతరాత్మలో ఏమి జరుగుతుందన్న దానిని ఒకరు ఎలా వ్యక్తపరచగలరు?
మన ప్రవక్త వలె, మనము మూడవ ఆకాశములోనికి కొనిపోబడినట్లును మరియు మన ఆత్మ ఈ మర్త్యమైన శరీరమును విడిచిపోతున్నట్లును మనకు అనిపించుచున్నది. ముందెన్నడూ లేని విధంగా దేవుడు మనకు తన వాక్యమును బయలుపరుస్తుండగా మనకు కలిగే అనుభూతిని వ్యక్తపరచడానికి మాటలు లేనే లేవు.
యోహాను పత్మాసు ద్వీపంలో ఉంచబడ్డాడు మరియు తాను చూసినదానిని వ్రాసి మరియు దానిని ప్రత్యక్షత అనే గ్రంథములో పెట్టమని చెప్పబడినాడు, తద్వారా అది కాలములన్నిటిగుండా వెళ్ళుటకైయున్నది. ఆయనయొక్క ఎన్నుకోబడిన 7వ దూత వర్తమానికుడి ద్వారా మనకు బయలుపరచబడేవరకు ఆ మర్మములు దాచబడియున్నవి.
అప్పుడు యోహాను తన పైనుండి అదే స్వరమును విన్నాడు మరియు మూడవ ఆకాశమునకు కొనిపోబడ్డాడు. ఆ స్వరము అతనికి సంఘకాలములను, యూదులు వచ్చుటను, తెగుళ్ళు కుమ్మరించబడుటను, ఎత్తబడుటను, మరలా రాకడను, వెయ్యేండ్ల పాలనను, మరియు ఆయనయొక్క రక్షించబడినవారి నిత్య గృహమును చూపించినది. ఆయన అతడిని పైకి తీసుకెళ్ళి మరియు ఆయన చేస్తానని చెప్పినట్లే యోహానుకు పూర్తి కార్యమును ముందుగానే ప్రదర్శించాడు.
అయితే యోహాను ఆ ప్రదర్శనను చూసినప్పుడు అతడు ఎవరిని చూసాడు? వాస్తవంగా ఈనాటి వరకు ఎవరికీ తెలిసియుండలేదు.
రాకడలో అతడు మోషేను మొదటిగా చూసాడు. అతడు పునరుత్థానము కానున్న మృతులైన పరిశుద్ధులకు ప్రాతినిథ్యము వహించాడు; వారు ఆ ఆరు కాలములన్నిటిలో నిద్రించినవారు.
అయితే కేవలం మోషే మాత్రమే అక్కడ నిలబడియుండలేదు గాని, ఏలీయా కూడా అక్కడ ఉన్నాడు.
అక్కడ నిలబడియున్న ఏలీయా ఎవరు?
అయితే ఏలీయా అనగా; అంత్య దినపు వర్తమానికుడు, మార్పుచెందియున్న, ఎత్తబడియున్న, తన గుంపుతో అక్కడ ఉన్నాడు.
మహిమ…హల్లెలూయ…యోహాను అక్కడ ఎవరు నిలబడియుండటాన్ని చూసాడు?
అది మరెవరో కాదు గాని దేవునియొక్క 7వ దూత వర్తమానికుడే, విలియమ్ మారియన్ బ్రెన్హామ్, తన యొక్క మార్పుచెందిన, ఎత్తబడిన గుంపుతోనున్నాడు…మనలో ప్రతి ఒక్కరితోనున్నాడు!!
ఏలీయా మార్పుపొందిన గుంపునకు ప్రాతినిథ్యం వహించాడు. గుర్తుంచుకోండి, మొదటిగా మోషే, మరియు ఆ తర్వాత ఏలీయా. ఏలీయా చివరి దినమునకు వర్తమానికుడిగా ఉండవలసియున్నాడు, తద్వారా అతనితో మరియు అతని గుంపుతో పునరుత్థానము సంభవించుటకైయున్నది…సంభవించుటకై…సరి, నా భావమేమిటనగా, ఎత్తబడుట సంభవిస్తుంది. మోషే పునరుత్థానము చెందినవారిని తీసుకొనివచ్చాడు మరియు ఏలీయా ఎత్తబడిన గుంపును తీసుకొనివచ్చాడు. మరియు, అక్కడ, సరిగ్గా అక్కడే ఆ ఇరువురూ ప్రదర్శించబడ్డారు.
ముసుగు తొలగించబడుట గురించి, బయలుపరచుట గురించి, మరియు ప్రత్యక్షత గురించి మాట్లాడండి.
ఇదిగో విషయమిదే! మనము దానిని, అనగా పరిశుద్ధాత్మను, నిన్నా, నేడు, మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న యేసుక్రీస్తును సరిగ్గా ఇప్పుడు మనతో కలిగియున్నాము. మీరు…అది మీకు బోధిస్తున్నది, అది మీకు ఉపదేశిస్తున్నది, ఏది తప్పు ఏది సరియైనది అని మీరు చూచునట్లు చేయుటకు అది ప్రయత్నిస్తున్నది. అది స్వయంగా పరిశుద్ధాత్మ తానే మానవ పెదవుల ద్వారా మాట్లాడుతూ, మానవుల మధ్య పని చేయుచూ, కనికరమును మరియు కృపను చూపించుటకు ప్రయత్నించుటయైయున్నది.
జీవాహారమును తినడానికి భూమియందంతటి నుండి వస్తుండగా ఆయనయొక్క దూత చూసినట్టి ఆ తెల్లని వస్త్రములు-ధరించిన పరిశుద్ధులము మనమేయైయున్నాము. మనము ప్రధానము చేయబడి మరియు వివాహము చేయబడి మరియు మన హృదయములో ఆయనయొక్క నిశ్చితార్థ ముద్దును అనుభూతిచెందియున్నాము. మనల్ని మనము ఆయనకు మరియు ఆయనయొక్క స్వరమునకు ప్రతిజ్ఞ చేసుకొనియున్నాము. మనము ఏ ఇతర స్వరముతోను మనల్ని మనము పాడు చేసుకోలేదు మరియు ఇకను పాడు చేసుకోము.
యోహాను వెళ్ళినట్లే దేవుని సన్నిధిలోనికి; పైకి వెళ్ళుటకు వధువు సిద్ధపడుచున్నది. సంఘముయొక్క ఎత్తబడుటలో మనము కొనిపోబడతాము. అది మన అంతరాత్మలో ఏ విధంగా నిండిపోయి ఉన్నది కదా!
తర్వాత ఆయన మనకు ఏమి బయలుపరచబోవుచున్నాడు?
తీర్పులను; పద్మరాగము రాయిని, మరియు అది దేనిని సూచిస్తుంది; అది ఎటువంటి పాత్ర వహించినది అన్నదానిని బయలుపరుస్తాడు. సూర్యకాంతపు రాయిని, మరియు వివిధమైన రాళ్ళన్నిటిని బయలుపరుస్తాడు. ఆయన వీటన్నిటిని యెహేజ్కేలు నుండి తీసుకొని, వెనుక ఆదికాండములోనికి వెళ్ళి, తిరిగి ప్రకటన వద్దకు వచ్చి, బైబిలు గ్రంథపు మధ్య భాగమునకు వెళ్ళి, దానంతటినీ ముడివేసి; ఈ వివిధమైన రాళ్ళను మరియు రంగులను బయలుపరుస్తాడు.
అది అదే పరిశుద్ధాత్మ, అదే దేవుడు, అవే సూచనలను, అవే అద్భుతాలను చూపిస్తూ, సరిగ్గా ఆయన వాగ్దానము చేసినట్లు అదే కార్యమును చేయుటయైయున్నది. అది ఆయనయొక్క స్వరమును వినుటద్వారా యేసుక్రీస్తుయొక్క వధువు తననుతాను సిద్ధపరచుకొనుటయైయున్నది.
ఏలీయా, అనగా ఈ చివరి కాలమునకైన దేవునియొక్క వర్తమానికుడు, కాలములన్నిటి గుండా దాచబడియున్న మర్మములన్నిటిని బయలుపరచడాన్ని వినుటకు, మేము జఫర్సన్విల కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు పరలోక స్థలములలో కూడుకొనుచుండగా మాతో చేరమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
వర్తమానము: 60-1231 ప్రకటన గ్రంథము, నాలుగవ అధ్యాయము 1వ భాగము
• దయచేసి మన నూతన సంవత్సర వర్తమానమును గుర్తుపెట్టుకోండి, మంగళవారము రాత్రి: పోటీ 62-1231. నూతన సంవత్సరమును ప్రారంభించుటకు మరే శ్రేష్ఠమైన విధానము లేదు.