ప్రియమైన స్నేహితులారా,
జఫర్సన్ విల్ లో మధ్యాహ్నం 12:00 P.M. గంటలు, ఆఫ్రికాలో సాయంత్రం 7:00 P.M. గంటలు, ఆరిజోనాలో ఉదయం 10:00 A.M. గంటలు; ప్రపంచమంతటినుండి వధువు కూడుకొనియున్నది. ఈ క్షణము కొరకే మనము వారమంతా వేచియున్నాము. తనయొక్క బలిష్టమైన ఏడవ దూత వర్తమానికుడి ద్వారా మానవ పెదవులగుండా దేవుడు మనతో మాట్లాడవలెనని వేచిచూస్తూ, మనము గొప్ప ఎదురుచూపుతో ఉన్నాము. “దేవా నన్ను సిద్ధపరచుము, నన్ను అభిషేకించుము, మరియు నీ వాక్య ప్రత్యక్షతను నాకు మరి ఎక్కువగా దయచేయుము,” అని మనము ప్రార్థించుచున్నాము.
ప్రవక్త, మరియు ప్రవక్త మాత్రమే, ఈ గడియ కొరకైన జీవపు మాటలను కలిగియున్నాడని, మనము నిశ్చయంగా ఎరిగియున్నాము గనుక, మనము సంతృప్తి కలిగియున్నాము. మనము దానినంతటిని వివరించలేకపోవచ్చును, కానీ మనము ప్రతీ మాటను నమ్ముచున్నామని మరియు వాటిపై విశ్రాంతి పొందుచున్నామని మనకు తెలియును.
ప్రభువు సరిగ్గా మోషేతో చేసినట్లే, దేవుడు మనయెదుట తన ప్రవక్తను మహిమపరబోవుచున్నాడని, మనకు తెలియును. ఆ సమయములో, ఆయన పర్వతములను కుదిపివేసాడు. ఈసారి, ఆయన భూమ్యాకాశములను కుదిపివేస్తున్నాడు.
ఆ క్షణము ఆసన్నమైనది. మన గుండెలు మనలో ఎంతో వేగంగా కొట్టుకొనుచున్నవి. మన జాతీయ గీతం మ్రోగుటను మనము వినుచున్నాము. ఏక మనస్సుతో, ప్రపంచవ్యాప్తంగా వధువు లేచి నిలబడి మరియు కేవలము నమ్ముము, సమస్తము సాధ్యమే, కేవలము నమ్ముము, అని పాడుతుంది. దేవుడు మనతో మాట్లాడనైయున్నాడు.
మనము దీనిని వింటాము: “స్నేహితులారా శుభోదయం.”
కేవలం ఈ సామాన్యమైన మూడు పదాలను వినడంతోనే మన హృదయములు ఆనందిస్తాయి. ఇప్పుడే ప్రవక్త నన్ను తన స్నేహితుడని పిలిచాడు. పిదప ఆయన మనతో ఇట్లు చెప్తాడు,
నేను మీ అందరిమీద బెంగ కలిగియున్నాను. నేను—నేను ఎక్కడికి వెళ్ళేది నేను లెక్కచేయను, నేను—నేను…అది, అది మీరు కాదు. ప్రపంచమంతటినుండి, నాకు స్నేహితులున్నారు, కానీ అది—అది—వారు మీరు కాదు. ఈ చిన్న గుంపు విషయమై ఏదో ఉన్నది…ఏమిటో నాకు తెలియదు. నేను వారిని గూర్చి ఆలోచిస్తుంటాను…ఈ గుంపులాగా, నాతో నిలబడే ఏ—ఏ గుంపును, భూమి మీద నేను ఎరుగను. రానైయున్న రాజ్యములో, మనము కలిసి అక్కడ ఉండేంతగా, దేవుడు మనలను విడదీయబడకుండునట్లు చేయును—చేయునుగాక; అదియే నా ప్రార్థనైయున్నది.
దేవుడు ఈ రోజు మనకు ఏ గొప్ప ప్రత్యక్షతను బయలుపరచుతాడు? మనము ఏమి వినబోవుచున్నాము? బహుశా ఇంతకుమునుపు మనము దానిని అనేకసార్లు వినియుండవచ్చును, కానీ ఈ రోజు అది భిన్నముగాను, మరియు ఇంతకుముందెన్నడూ లేని విధంగాను ఉంటుంది.
అదేమిటి? విశ్వాసియొక్క ఆహారము. మనము విందు చేసుకొనునట్టి పరలోకము నుండి వచ్చిన సముఖపు రొట్టెయైయున్నది. ఆయనయొక్క వధువైయున్న మనకు మాత్రమే చెందునట్టి, సముఖపు రొట్టెయైయున్నది. మనలను కుళ్ళిపోకుండునట్లు ఉంచేది ఆ సముఖపు రొట్టెలపై ఉన్న షెకినా మహిమయే.
వెలుపటనున్నవారు మనలను చూసి మరియు ఇట్లు అడుగుతారు, “మీరేమి చేస్తున్నారు? మీరు కేవలం టేపులను వినుచున్నారా? మీరు నిజంగా వింత వ్యక్తులే.”
మహిమ!! వింత వ్యక్తులుగా, ఆయన కొరకు మరియు ఆయనయొక్క నిర్ధారించబడిన వాక్యము కొరకు వెర్రివారిగా ఉన్నందుకు; మనమెంతో సంతోషిస్తున్నాము మరియు ప్రభువునకు ఎంతో కృతజ్ఞులమైయున్నాము. “అవును, టేపు పరిచర్యను నేను నమ్ముతాను. ప్లేను నొక్కడమును నేను నమ్ముతాను. మీరు వినగలిగే అత్యంత ప్రాముఖ్యమైన స్వరము అదేనని నేను నమ్ముతాను. అవును, టేపులను తిరిగి ప్రసంగ వేదికపై పెట్టడమును నేను నమ్ముతాను,” అని ప్రపంచానికి చెప్పుటకు మనము ఆనందిస్తాము.
ఆచారాల తెర తొలగించబడినప్పుడు, దేవుడు ఇంకనూ వాక్యమైయున్న దేవుడని మీరు చూడగలరు. ఆయన ఇంకనూ తన మాటను నిలబెట్టుకుంటాడు. ఆయన—ఆయనే దేవుడైయున్నాడు, తన వాక్యమును వ్రాసినది ఆయనే.
మిగతా ఎవ్వరు ఏమి చేసినాగాని, లేదా ఏమి చెప్పినాగాని, మనము మాత్రం దానిని నమ్ముతాము, మరియు పిదప మనము దాని ప్రకారంగా క్రియ చేస్తాము. మీరు దానిని చేయనియెడల, మీరు దానిని నమ్మనట్లే. మీరు తెరలోపల లేరు. ఆ తెర ఒక్క వ్యక్తికి మాత్రమే చెందియున్నది. ఆ వర్తమానము ఒక్కటేయైయున్నది.
దానిని నేరుగా చెప్పకుండా దేవుడు సంఘమునకు ఏమి తెలియజేయాలనుకుంటున్నాడో దానిని గూర్చిన ఆత్మసంబంధమైన గ్రహింపు మీకు వచ్చినదని నేను—నేను ఆశిస్తూ మరియు నమ్ముచున్నాను. చూశారా? అది ఎటువంటి సంగతనగా, కొన్నిసార్లు, పలచన చేసే విధంగా, కొంతమందిని బయటకు పంపించే విధంగా, కొంతమందిని వెళ్ళిపోయేలాగా, మరియు కొందరిని ఆలోచింప—జేసేలాగా—ఆ విధంగా, మనము విషయాలను చెప్పవలసియుంటుంది. అయితే అది ఉద్దేశ్యపూర్వకంగానే చేయబడుతుంది. అది ఆ విధంగానే చేయబడవలసియున్నది.
వాక్యము దేవునియొక్క ప్రవక్తకు బయలుపరచబడినది. పరిసయ్యులు, లేదా సద్దూకయిలు, లేదా ఒక ఫలానా వర్గము లేదా ఒక తెగ వంటి ఏ గుంపు లేదు. అది ప్రవక్త మాత్రమే! దేవుడు ఒక్క మనుష్యుడిని కలిగియున్నాడు. ఆయన రెండు లేదా మూడు భిన్నమైన మనస్సులను కలిగిలేడు. ఆయన ఒక్క మనుష్యుడినే తీసుకున్నాడు. అతడు వాక్యమును కలిగియున్నాడు, మరియు అతడు మాత్రమే కలిగియున్నాడు.
అటువంటప్పుడు కొందరు ఇట్లంటారు, “దేవుడు ఉద్దేశ్యపూర్వకంగా అటువంటి ఒక విషయమును చేస్తాడా?” ఆయన నిశ్చయంగా అట్లు చేసాడు. ఆయన ఇంకనూ అట్లు చేస్తాడు.
“కానీ దేవుడు పిలచిన ఇతర వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నారు”: అని కొన్ని వందల సంవత్సరాల క్రితము వారు అన్నట్లే, ఈనాడు మనము అదే విషయమును వింటున్నాము. అది నిజము. మరియు వారు దీనిని వెంబడిస్తూ దీనితో కొనసాగినంతకాలం, ఆమేన్, కానీ ఒకరు లేచి మరియు ఆయన ముందుగా నిర్ణయించుకొని మరియు ఆ పని కొరకు అభిషేకించిన మన ప్రవక్తకు, దేవుడు ఇచ్చిన దేవునియొక్క స్థానాన్ని తీసుకొనుటకు ప్రయత్నించినట్లైతే, అప్పుడు మనము ఆ నిర్ధారించబడిన వాక్యముతో, మన దినమునకైన దేవునియొక్క స్వరముతో నిలబడవలసియున్నది.
గమనించండి, ఇప్పుడు, దానికి దూరంగా ఉండటం మరణమే. మీరు ఈ తెరలోనుండి మాత్రమే దానిలోనికి వెళ్ళవలసియున్నది, లేదా మీరు వెళ్ళలేరు. దేవుడు వారిపై ఏ విధంగా కనికరము చూపించగలడో కదా, అయితే గుర్తుంచుకోండి, అదేమిటనగా దేవుడు ఆ తెర వెనుక ఉన్నదానిని ప్రత్యక్షపరచుచున్నాడు. ఆ తెర వెనుక ఏమి ఉన్నదో గమనించండి, వాక్యము ఉన్నది! అది దేనిని ముసుగుగా కప్పియున్నది? వాక్యమును! అదేమిటి? అది మందసములో ఉన్నది. ఆ తెర దాచినది వాక్యమునేయైయున్నది. చూశారా? మరియు యేసు ఆ వాక్యమైయ్యుండెను, మరియు ఆయనే ఆ వాక్యమైయున్నాడు, మరియు ఆయనయొక్క శరీరము అనే తెర దానిని దాచిపెట్టినది.
మనకైతే, అది ఒక కార్యరూపణయైయున్నది! అది ఇక ఎంతమాత్రము ఒక వాక్యము కాదు, అది ఒక వాస్తవమైయున్నది! ఆమేన్!
ఇతరులకు మనము వింత వ్యక్తులమని, మరియు మనము చెప్పేది లోకానికి ఒక వెఱ్ఱితనముగా అనిపించవచ్చునని మనకు తెలుసు, అయితే అది సమస్త జనులను ఆయన వైపుకు ఆకర్షించుచున్నది.
ఈ ఆదివారము జఫర్సన్ విల్ కాలమానము ప్రకారంగా మధ్యాహ్నం 12:00 P.M., గంటల సమయమప్పుడు, ఏ విధంగా మనము వింత వ్యక్తులు 64-0614E
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
వర్తమానమును వినుటకు ముందు చదువవలసిన లేఖనములు:
I కోరింథీ 1:18-25
II కోరింథీ 12:11
సంబంధిత కూటములు
ముసుగు లోపటనున్న ప్రియమైన వధువా,
“ప్లేను నొక్కడం మీరు చేయగల అత్యంత ముఖ్యమైన విషయము,” అని నేను మీకు మళ్ళీ మళ్ళీ ఎందుకని చెప్తూ ఉంటాను? “సహోదరుడు బ్రెన్హామ్ గారిని తిరిగి మీ ప్రసంగ వేదికల్లో పెట్టండి,” అని నేను సంఘకాపరులకి ఎందుకని చెప్తూ ఉంటాను?
అది కేవలం ఇంత సులువైన విషయమైయున్నది. ఎందుకనగా టేపులో ఉన్న ఏడవ దూత వర్తమానికుడి స్వరమును వినుట, సజీవమైన దేవుని స్వరమును వినుటయే.
ప్రజల యెదుట, దేవుడు మరలా ముసుగు ధరించుకొని మరియు మోషేను నిర్ధారించాడు, ముసుగు ద్వారా, తననుతాను అదే అగ్నితో, అదే అగ్నిస్తంభముతో ముసుగు ధరించుకొనుట ద్వారా క్రిందికి దిగివచ్చాడు. అప్పటి—అప్పటి నుండి...వారు, వారు దేవుని స్వరమును మాత్రమే వినగలుగుట కొరకైయున్నది. మీకు అది అర్థమైనదా? కేవలం వాక్యమును, వారు ఆయన స్వరమును విన్నారు, ఎందుకనగా, మోషే, వారికి, సజీవ వాక్యమైయున్నాడు.
సజీవ సేవకుని గురించి మాట్లాడండి! టేపులలో మనము వింటున్న స్వరము మన దినమునకైన సజీవ వాక్యమైయున్నది. అది దానికంటే ఇంకా గొప్పగా ఏమియు మారదు.
మోషే దినములో, శిభిరములో ఉన్న ఇశ్రాయేలు పిల్లలు మాత్రమే అతని స్వరమును వినగలిగారు. కానీ ఈనాడు, ప్రపంచమంతా తన స్వరమును వినాలని దేవుడు కోరాడు, కావున తన వధువు సజీవ వాక్యపు స్వరమును వినగలుగునట్లు, ఆయన టేపులో దానిని రికార్డు చేపించాడు.
దేవుడు తన మాటలను వారితో మాట్లాడటానికి, తనను తాను తన ప్రవక్తలో ముసుగు ధరించుకున్నాడు. ఆయన చేసినది అదేయైయున్నది. అగ్నిస్తంభము ద్వారా ముసుగు ధరించబడి, మోషేయే ప్రజలకు ఆ సజీవమైన వాక్యమైయున్నాడు.
మన దినమునకై దానిని గూర్చిన ప్రత్యక్షతను మీరు కలిగిలేకపోతే, మీరు క్రీస్తుయొక్క వధువు కాలేరు. మీరు కలిగియున్నయెడల, అప్పుడు మీరు యేసు క్రీస్తుయొక్క వధువైయున్నారు మరియు మీరు ఈ విధంగా చెప్పవలసియున్నారు, “టేపులను వినుటకంటే ప్రాముఖ్యమైన విషయం ఏమియు లేదు, ఎందుకనగా అది నేరుగా దేవుడే మీతో మాట్లాడుటయైయున్నది.
అనేకులు ప్రజలను భయపెట్టుటకు ప్రయత్నిస్తూ మరియు మనము ప్రవక్తను ఎంతో హెచ్చిస్తున్నామని; మనము ఆయనను ఆరాధిస్తున్నామని చెప్తుంటారు. నా స్నేహితులారా, ఈ సంగతులను చెప్పినది ఆయనే, నేను కాదు. నేను కేవలం ఆ వాక్యమును ఎత్తి చూపిస్తున్నాను.
ప్రతికాలములో అది చేయబడినట్లే, దైవత్వము మానవ శరీరములో ముసుగు ధరించబడియున్నది. గమనించండి, ఆయన అట్లు చేసాడు. ప్రవక్తలు, ముసుకు ధరించబడిన దైవత్వమైయున్నారు. వారు మానవ శరీరములో ముసుగు ధరించబడిన (అది సరియేనా?) దేవునియొక్క వాక్యమైయున్నారు. కావున, వారు మన మోషేను కూడా, చూడండి, అనగా యేసును కూడా వారు గుర్తించలేదు.
మనము ఒక మానవుడిని ఆరాధించడంలేదు, కానీ, ముసుగు ధరించుకొని మరియు ప్రవక్త ద్వారా తనను తాను బయలుపరచుకుంటున్న దేవుడిని ఆరాధిస్తున్నాము. దానిని అర్థం చేసుకొని మరియు దానిని నమ్ముటకు, మీరు దీనిని చేయవలసియున్నది.
చిన్నవారలారా, మీరు ఇక మీదట ఆ ముసుగుకు వెలుపల లేరు, దేవుడు పూర్తిగా మీ ఎదుటకు వచ్చియున్నాడు.
మనము ఇకమీదట ఎంతమాత్రము ఆ ముసుగుకు వెలుపల లేము, అది దేవుడే తననుతాను స్పష్టముగా బయలుపరచుకోవడమని మనము చూడగలుగుచున్నాము. టేపులలో ఉన్న ఆ స్వరమును వినడమంటే దేవుడే తన వధువుతో మాట్లాడుటయైయున్నదని బయలుపరచబడియున్నది. అది ఈ దినమునకై ఆయన ఏర్పాటు చేసిన మార్గమని మనము నమ్ముచున్నాము.
మనము ఆ స్వరమునకు మాత్రమే ఆమేన్ చెప్పగలుగుతాము, మరిదేనికినీ కాదు. మనము తెసులుకోవలసిన ప్రతిదానిని, ఆ స్వరమే మనకు ప్రసంగిస్తుంది, బోధిస్తుంది మరియు బయలుపరచుతుంది. ఆ స్వరము మనలను మన ప్రభువైన యేసు క్రీస్తుకు పరిచయము చేస్తుంది. మనకు కావలసినదంతా మరియు మనకు అవసరమైయ్యున్నదంతా ఆ స్వరమే. ప్రజలకు ఆ స్వరమును చూపించడానికి దేవుడు ఉపయోగించుకుంటున్న 5-రకాల పరిచర్య కొరకు మేము కృతజ్ఞులమైయున్నాము; దర్శనమును పట్టుకొని మరియు వారి సంఘములలో టేపులను ప్లే చేయడమే వారు తమ ప్రజల కొరకు చేయగలిగే అత్యంత గొప్ప కార్యమైయున్నది అనే ప్రత్యక్షతను కలిగియున్న సంఘకాపరులకు కృతజ్ఞులమైయున్నాము.
ఈ ఆదివారమునాడు జఫర్సన్ విల్ కాలమానము ప్రకారంగా 12:00 P.M., గంటల సమయమప్పుడు, ఆ గొప్ప సజీవ వాక్య స్వరము: ముసుగు తొలగించబడిన దేవుడు 64-0614M ను బయలుపరచడాన్ని మేము వినుచుండగా మీరును మాతో కలిసి దానిని వినవలెనని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
సంబంధిత కూటములు
ప్రియమైన మొలకెత్తిన విత్తనమా,
దేవునియొక్క ఏడవ దూత వర్తమానికుడు తాను ఏ విధంగా దేవుని సంకల్పమంతటినీ మీకు తెలుపకుండ దాచుకొనలేదో మీకు చెప్పడాన్ని కూర్చొని వినడం ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు అసలు ఊహించగలరా? మూడవ ఈడ్పు గురించి ఎంతో వివరంగా చెప్పుచు, మరియు ఇప్పుడది ఏ విధంగా నిర్ధారించబడినదో మీకు ఋజువు చేయుటను వినడం ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు ఊహించగలరా?
అబ్రాహాము కొరకు ఒక పొట్టేలును పలికినట్లే; దేవుడు ఏ విధంగా ఉడతలను ఉనికిలోనికి పలికాడన్న విషయము. ఖచ్చితంగా సరియైన విషయమును పలికిన హ్యాట్టీ అనే ఒక దీనమైన సహోదరితో అతడు మాట్లాడవలెనని మరియు ఆ ఉడుతలను ఉనికిలోనికి పలికిన అదే స్వరము ఆమె ఏమి కోరుతుందో దానిని ఇవ్వమనియు, మరియు సరిగ్గా అప్పుడే అది జరుగుతుందో లేదో చూడమన్నదనియు ఆమెతో చెప్పపని, ఏ విధంగా అదే స్వరము అతనితో చెప్పెనన్న విషయం.
ఏ విధంగా, ఒక దినమున తన స్నేహితులతో అడవిలో వేటాడుచున్నప్పుడు అతడు వెళ్ళిపోవునట్లు బలవంతపెట్టిన ఒక బలమైన తుఫాను వచ్చినదన్న విషయం. అయితే ఏ విధంగా దేవుడు అతనితో, నేరుగా మాట్లాడి మరియు, “భూమ్యాకాశములను సృష్టించినది నేనే. సముద్రములపై బలమైన గాలులను నిమ్మళపరచినది నేనే,” అని చెప్పిన విషయం.
ఆ స్వరము, “కేవలం ఆ తుఫానుతో మాట్లాడుము, మరది ఆగిపోతుంది, నీవు ఏది పలికితే, అది జరుగుతుంది, అని అతనితో చెప్పినప్పుడు ఏ విధంగా అతడు గంతువేసి మరియు తన టోపీని తీసివేసాడన్న విషయమును వినుట ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించగలరా.
అతడు అసలు ఆ స్వరమును ప్రశ్నించలేదు గాని, ఇట్లు పలికాడు, “తుఫానూ, నీవు ఆగిపొమ్ము. మరియు, సూర్యుడా, మేము ఇక్కడ నుండి వెళ్ళిపోయేవరకు, నాలుగు దినములు నీవు యదావిధిగా ప్రకాశించుము.”
అతడు దానిని పలికిన వెంటనే, ఆ వర్షము, మంచు, మరియు ప్రతీది ఆగిపోయినది. ఒక్క క్షణములోనే ఆ వేడి సూర్యుడు తన వీపు మీదుగా ఎలా ప్రకాశించాడో. గాలుల మారిపోయినవి మరియు ఆ మేఘములు, ఒక మర్మయుక్తమైనవాటివలె, గాలిలోనికి తెలిపోయినవి, మరియు కొద్ది నిమిషాలలోనే సూర్యుడు ప్రకాశించుచున్నాడు.
పిదప అది నెరవేరడానికి 16 సంవత్సరాలముందే, బ్రెన్హామ్ సహోదరియొక్క ఎడమప్రక్క అండాశయములో ఒక కణితి ఉన్నదని, మరియు అది అక్కడ ఎందుకు ఉంచబడినదని, దేవుడు ఏ విధంగా ఆయనకు చూపించాడో ఆయన మీకు చెప్తాడు. వారు దానిని తీసివేయమని ఎంతగా దేవుని ప్రార్థించారో. పిదప, అది కేవలం దేవుడు వారి విశ్వాసమును పరీక్షించడమని చెప్పాడు.
పిదప సరిగ్గా ఆపరేషన్ ద్వారా అది తీసివేయబడవలసి యుండుటకు ముందు, అతడు దేవునితో మాట్లాడుచు మరియు ఆమె అతనికి ఎంతటి ఒక అద్భుతమైన భార్యగా ఉన్నదో ఆయనకు చెప్పుచుండెను. అతడు ఎప్పుడూ ఇంటివద్ద ఉండకపోవడాన్ని గురించి ఆమె ఏ విధంగా ఎన్నడూ సణుగలేదో చెప్పుచుండెను. తాను కొంచెం విశ్రాంతి తీసుకొని మరియు ప్రభువుతో మాట్లాడుటకు, వేటకు వెళ్ళగోరినప్పుడు ఆమె ఎల్లప్పుడూ ఏ విధంగా ప్రతిదానిని తన కొరకు సిద్ధపరిచేదో చెప్పుచుండెను.
అప్పుడు అతను గదిలో ఏదో విన్నాడు. అతను పైకి చూడగా, ఆ స్వరము ఇట్లు చెప్పెను, “లేచి నిలబడుము,” మరియు అతనితో ఇట్లనెను, “ఇప్పుడు నీవు ఏది పలికితే, అది అట్లే జరుగుతుంది.”
అతను ఒక్క నిమిషము ఆగి, పిదప ఇట్లన్నాడు, “వైద్యుని హస్తము ఆమెను తాకడానికి ముందే, దేవుని హస్తము ఆ కణితిని తీసివేయును, మరియు ఆది అసలు కనుగొనబడదు.”
వైద్యుని హస్తము ఆమెను తాకడానికి ఒక్క క్షణము ముందే, ఆమె స్వస్థపరచబడినది. “శ్రీమతి. బ్రెన్హామ్, ఆ కణితి అక్కడ లేదని నేను మీకు నిశ్చయతను ఇవ్వగోరుచున్నాను. నీవు ఎటువంటి కణితిని కలిగిలేవు,” అని వైద్యుడు ఏ విధంగా అన్నాడో చెప్తాడు.
ప్రభువుయొక్క వాక్యము ఎంత పరిపూర్ణమైనది కదా!
అతని మనస్సులో ఇక ఎటువంటి సందేహము లేదని, మూడవ ఈడ్పు ఏమిటో మరియు అది ఏమి చేస్తుందో తాను ఎరిగియున్నాడని అతను మీకు చెప్పుటను వినడం ఎట్లుండును గదా. అతని అభిప్రాయములో, వెళ్ళిపోవుటకు, అది ఎత్తబడు విశ్వాసాన్ని ప్రారంభించేదిగా ఉంటుంది.
ఎప్పుడైతే దేవుడు మన కొరకు కొన్ని గొప్ప కార్యములను చేయబోవుచున్నాడో ఆ గడియ త్వరగా వచ్చును గనుక, మనము మర్యాదపూర్వకముగా ఉండవలెనని, మరియు మౌనముగా ఉండవలెనని చెప్తాడు. ఆ సమయము వచ్చినప్పుడు, ఆ ఒత్తిడి వచ్చినప్పుడు, అప్పుడు మనము ఏదైతే తాత్కాలికంగా చూసామో, అది దానియొక్క పూర్తి శక్తిలో ప్రత్యక్షపరచబడుటను చూస్తాము.
ఈ ఆదివారము జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా 12:00 P.M., గంటల సమయమప్పుడు మేము ఆ గొప్ప ఆశీర్వాదమును పొందుకుంటాము. మేము యేసు వైపు చూచుట 63-1229E అనే వర్తమానమును వినుచుండగా మీరు మాతో పాలిభాగస్థులవ్వాలని మిమ్మల్ని ఆహ్వానించుటకు నేను ఇష్టపడుచున్నాను.
ఒక మనుష్యుడు చెప్పేది వినుటకు మనము కూడుకొనుటలేదు; వీధులలో అనేకమంది మనుష్యులు ఉన్నారు, మరియు వారందరు చెప్పేది ఒకే విధంగా ఉంటుంది. మనము కేవలం ఒక సేవకుడిని లేదా సంఘకాపరిని చూడము, ఒక సేవకుడు లేదా ఒక సంఘకాపరి చెప్పేది వినము, మనము యేసుని చూస్తూ యేసు చెప్పేది వింటాము. ఆ మనుష్యుడు, ఆ దేవునియొక్క మనుష్యుడు, దేవుడైయ్యుండి, శరీరము దాల్చిన ఆ నజరేయుడైన యేసు, తన వధువుతో మాట్లాడటాన్ని వినడానికి మనము ప్రపంచమంటని నుండి కూడుకుంటాము.
మిమ్మల్ని మీరు ఈ విధంగా ప్రశ్నించుకోవలసియున్నారు, మీరు ఈనాడు దేనివైపు చూస్తున్నారు? మీరు చూసినప్పుడు, మీకేమి కనబడుచున్నది? మీరు వాక్యముగుండా ఆయను చూసినప్పుడే మీకు ఆయన కనబడతాడు.
ఆయన గలిలయలో నడిచినప్పుడు ఏమైయున్నాడో, ఈ రాత్రి జఫర్సన్ విల్ లో అదేయైయున్నాడు, బ్రెన్హామ్ ఆలయంలో ఆయన అదేయైయున్నాడు. మీరు ఏమి కనుగొనడానికి చూస్తున్నారు, ఒక స్థాపకుడినా, ఒక సంఘశాఖపరమైన వ్యక్తినా? మీరు యేసులో దానిని ఎన్నడూ కనుగొనలేరు. ఎవరో ఒక గొప్ప యాజకుడిని కనుగొనడానికి మీరు చూస్తున్నారా? మీరు యేసులో దానిని ఎన్నడూ కనుగొనలేరు. లేదండి. మీరు యేసును ఎలా చూస్తారు? దేవుని వాక్యము నెరవేర్చబడుటవలన చూస్తారు, ఎందుకనగా ఆయన దేవునియొక్క నెరవేర్చబడిన వాక్యమైయుండెను. ఆయన అప్పుడు ఏమైయున్నాడో, ఈ రాత్రి అదేయైయున్నాడు, మరియు ఎప్పటికి అదేయైయుంటాడు.
ఇప్పుడు యేసు వైపు చూచి మరియు బ్రతకండి; అది ఆయన వాక్యములో వ్రాయబడియున్నది, హల్లేలూయా! మనము కేవలం “చూచి మరియు బ్రతకడమే.”
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
ప్రసంగమును వినుటకు సిద్ధపడుటలో చదువవలసిన లేఖనములు:
సంఖ్యాకాండము 21:5-19
యెషయా 45:22
జెకర్యా 12:10
పరిశుద్ధ. యోహాను 14:12
సంబంధిత కూటములు
ప్రియమైన యేసుక్రీస్తు యొక్క ప్రతిబింబమా,
మన గృహములలో మరియు సంఘములలో కూర్చొని, టేపులను వింటున్న మనము పిచ్చివారమని, ప్రజలు అనుకుంటారు. మనము ఆకలితో చనిపోవుచున్నామని వారు అనుకుంటారు. అయితే ఆగస్టు మాసపు కుమారుని వెలుగు యొక్క సన్నిధిలో మనము కూర్చొని, పరిపక్వము చెందుతూ, శాలలో దూడలవలె భద్రపరచబడిన ఆహారముతో మేపబడుచున్నామని వారు కొంచెమైనా గ్రంహించుటలేదు.
మనము ఎంతగానో ఎదిగి, తీసుకొనిపోబడుటకు సిద్ధంగా ఉన్న గోధుమయైయున్నాము. వారు వారి ఆచారములలో జీవించగోరినయెడల, అలాగే వెళ్ళనివ్వండి. మనము అట్లు కాదు, మనము మన దినపు వెలుగులో జీవించుచున్నాము.
మన దినపు వెలుగు ఏమిటి? దేవుడు తన వధువును నడిపించుటకు తన బలిష్ఠుడైన ఏడవ దూతను ఈ లోకానికి పంపించాడు. ఆయన ఏమైయున్నాడు? ఆయన ఒక ప్రవక్తయైయున్నాడు. ఆయన ఏమి చెప్పాడో అవి జరిగినవి. ఆయన ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యమైయున్నాడు. ఆయన దేవుని వాక్యపు వెలుగు ప్రత్యక్షపరచబడుటయై యున్నాడు. ఆయన ఈ దినమునకైన దేవునియొక్క వెలుగైయున్నాడు.
ఏది ఏమైనను, మోషే అలాగే ముందుకు కొనసాగిపోయాడు, ఎందుకనగా అతడు జీవమైయున్నాడు, అతడు ఆ గడియయొక్క వెలుగైయున్నాడు. అతడు కలిగియున్నది, అది ఏమిటి? దేవుడు తన వాగ్దాన వాక్యమును మోషే ద్వారా నెరవేర్చడమైయున్నది, మరియు మోషే ఆ వెలుగైయున్నాడు.
ఏలియా వెలుగైయున్నాడు... ఆ వెలుగు! హల్లేలూయా! అతడు వెలుగైయున్నాడు. ఆ వెలుగైయున్నాడు! అతడు ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యమైయున్నాడు.
యోహాను, అతడు భూమి మీదకు వచ్చినప్పుడు... యేసు ఇట్లు చెప్పాడు, “అతడు మండుచు ప్రకాశించుచున్న వెలుగైయ్యుండెను.” హల్లేలూయా! ఎందుకు? అతడు ప్రత్యక్షపరచబడిన వాక్యమైయున్నాడు.
అలాగైతే వాక్యము ప్రకారంగా, దేవుని ప్రవక్తయైన విలియం మారియన్ బ్రెన్హామే, మన దినమునకు వెలుగైయున్నాడు. “నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకుండునట్లు, దానిని విడిచి బయటకు రండి,” అని బబులోను అరణ్యములో కేకవేయుచున్నవాడు ఆయనే.
ఆయన మలాకీ 4:5, మరియు ప్రకటన 10:7 యొక్క నెరవేర్పుయైయున్నాడు. ఆయన కేవలం పలికి, “అది అక్కడ కలుగుతుంది,” అని అన్నాడు, మరి అక్కడ ఏదియు లేకుండానే అది కలిగినది. ఆయనకు ముందుగా అక్కడ ఏ ఉడతలు లేకుండెను; అసలు అక్కడ ఏమియు లేకుండెను. ఆయన కేవలం, “కలుగును గాక,” అని పలికాడు, మరి అవి అక్కడ కలిగినవి.
దేవుని వాక్యము విఫలమవ్వజాలనిది, మరియు అది తప్పక నెరవేర్చబడవలసియున్నది. మనము ఆ వెలుగును చూశాము; ఈ దినమునకు ఆయన వాగ్దానము చేసిన తన వాక్యమును చూశాము. అది సత్యమని ఋజువు చేయబడి నిర్ధారించబడినది. అది ఈ గడియయొక్క వెలుగైయున్నది.
మనము వినుచున్నది ఈ దినమునకు నెర్వేర్చబడిన వాక్యమైయున్నది అని ఎరిగియుండటములో ఇక ఎలాంటి ప్రత్యామ్నయము లేదు. దానిలో ఎటువంటి పురుగులులేవు... అస్సలు లేనే లేవు. ఇతరులు వేరేదేనితోనైనా తృప్తిచెందుతే, అలాగే వెళ్ళనివ్వండి, కాని మనము అట్లు కాదు.
దాని అర్థం మీరు మీ సంఘకాపరి చెప్పేది వినకూడదని కాదు, లేదా ఆ సేవకుడు బోధించకూడదని కాదు; అసలు కానేకాదు, అయితే టేపులో ఉన్న ఈ వర్తమానమైయున్న, దేవుని గొప్ప వడపోత సాధనముగుండా మీరు వినే ప్రతీ మాటను మీరు వడగట్టవలసి యున్నారు.
ఒక్క మనుష్యుని వర్తమానపు దినములు గతించిపోయినవి అని వారంటే, అది పురుగులైయున్నవి. ఈ వర్తమానము వారియొక్క సంపూర్ణత కాదని వారు చెప్తే, అది పురుగులైయున్నవి. టేపులను వింటే సరిపోదు అని వారు చెప్తే, అది పురుగులైయున్నవి.
ప్రతీ మాటకు మీరు ఆమేన్ చెప్పగలరని ఎరిగియుండి, ప్లే నొక్కడం కంటె గొప్పది ఏదియు లేదు. ఈ గడియయొక్క వర్తమానము వినేటప్పుడు కాక మరెక్కడా మీరు దానిని చేయలేరు.
ఇప్పుడు మనము ఈ దినము కొరకు యేసుక్రీస్తు యొక్క ప్రతిబింబమైయున్నాము. మనము ఆయనయొక్క ప్రత్యక్షపరచబడిన వాక్యమైయున్నాము. ఆయనయొక్క గొప్ప అంత్య-కాల ప్రత్యక్షతను పొందుకొనువారిగా ఆయన మనలనే ఎన్నుకున్నాడు. మనము ఆయనయొక్క వధువైయున్నాము.
కేవలం ఆయనయొక్క వధువు మాత్రమే ఈ దినమునకైన వెలుగును గూర్చిన అసలైన ప్రత్యక్షతను కలిగియుంటుంది. ఈ వెలుగు వారిని పరిపూర్ణము చేస్తుందని, వారు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ తనయొక్క వర్తమానికుడైన దూతలోనుండి మాట్లాడటమే ఈ వెలుగైయున్నది.
ఈ గడియకైన దేవుని వెలుగుయొక్క సన్నిధిలో కూర్చోవడానికి మీరు ఇష్టపడెదరా? అలాగైతే ఆదివారము జఫర్సన్ విల్ కాలమానము ప్రకారంగా, 12:00 P.M., గంటల సమయమప్పుడు, మేము వెలుగును ప్రసరింపజేయగల ఒకాయన ఇక్కడ ఉన్నాడు 63-1229M అను వర్తమానమును వినుచుండగా వచ్చి మాతో కూడుకొనమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
కూడికకు ముందు చదువవలసిన లేఖనములు:
ఆదికాండము 1:3, 2వ అధ్యాయము
కీర్తన 22
యోవేలు 2:28
యెషయా 7:14, 9:6, 28:10, 42:1-7
పరిశుద్ధ. మత్తయి 4:12-17, 24 మరియు 28 అధ్యాయములు
పరిశుద్ధ. మార్కు 16వ అధ్యాయము
ప్రకటన 3వ అధ్యాయము
ప్రియమైన విశ్వాసి,
నేను విశ్వాసిని, అని చెప్పడానికి ఎంత అద్భుతంగా ఉంది కదా. ఒక మాతాచారములో కాదు గాని; వాక్యమునందు విశ్వసించువారమైయున్నాము! ఒక సంఘశాఖలో కాదు గాని; వాక్యమునందు విశ్వసించువారమైయున్నాము! ఎవరో చెప్పినది కాదు గాని; వాక్యము ఏమి చెప్తుందో దానిని నమ్మేవారమైయున్నాము!
మనము దేనిని ప్రశ్నించము, మనము కేవలం దానిని నమ్ముతాము. వినడానికి అది ఎలా ఉన్నా గాని లేదా దాని గూర్చి ఎవరు ఏమి చెప్పదలచుకున్నా గాని, మనము ఒక అసలైన విశ్వాసియైయున్నాము. మనము వాక్యముయొక్క ఆత్మీయ ప్రత్యక్షతను కలిగియున్నాము.
మనము జీవిస్తున్న ఘడియను మనము చూస్తున్నాము. ఈ ఘడియయొక్క వర్తమానమును మనము చూస్తున్నాము. ఈ ఘడియయొక్క వర్తమానికుణ్ణి మనము చూస్తున్నాము. దేవుడు తననుతాను తన వాక్యములో బయలుపరచుకొనుటను మనము చూస్తున్నాము. ఈ వర్తమానము, ఈ వర్తమానికుడు, ఈ వాక్యము తప్ప మరేదియు లేదని మనము చూస్తున్నాము.
ఒక నిజమైన విశ్వాసి వాక్యమును తప్ప మరిదేనిని వినడు. అంతే. అతడు వాక్యమును గమనిస్తాడు. అతడు ఎటువంటి లొసుగుల కొరకు చూడటంలేదు. అతడు ఎటువంటి యుక్తుల కొరకు వెదకడంలేదు. అతడు దేవుడిని నమ్ముతాడు, మరియు అదే దానిని స్థిరపరుస్తుంది, మరియు అతడు కేవలం కొనసాగుతూనే ఉంటాడు. చూశారా? విశ్వాసి అంటే అతడే.
మనము వాక్యమును తప్ప మరిదేనిని వినలేము; ప్రవక్త వద్దకు వచ్చే వాక్యమును మాత్రమే వింటాము. ఎటువంటి లొసుగులు కాదు, ఎవరో ఇచ్చిన అనువాదము కాదు, వధువు కొరకు పలుకబడి మరియు టేపులపై ఉంచబడిన స్వచ్చమైన వాక్యమును వింటాము.
ఆత్మ ఆ వాక్యమును మనయందు పురిగొల్పినది మరియు అది జీవము దాల్చినది. విశ్వాసము ద్వారా, మనము దానిని చూస్తున్నాము, మరియు దానిని నమ్ముచున్నాము. పరలోకమునుండి ఒక శబ్ధం వస్తుంది, అది వధువులోనికి ఎటువంటి ఒక పరిశుద్ధాత్మ బాప్తిస్మమును తీసుకువస్తుందంటే, అది మనలను ఒక ఎత్తబడు క్రుపలో, భూమి మీద నుండి తీసుకువెళ్తుంది. దేవుడు దానిని వాగ్దానము చేసాడు.
మనము అన్నివేళలా, ప్రతీ దినము పరీక్షించబడుచున్నాము. మనకు కలిగే పరీక్షలు మరియు శ్రమలను గూర్చి అది దేవుడు మనలను శిక్షించడమైయున్నదని మనకు చెప్పుడానికి సాతానుడు ప్రయత్నిస్తాడు. కానీ దేవునికి స్తోత్రం, అది అట్లు కాదు, అది అపవాదే దానిని చేస్తుండగా మరి దేవుడు దానిని అనుమతించడమైయున్నది.
మనము ఏమి చేస్తామని చూచుటకు, దేవుడు మనలను సానబట్టుచూ మలచుచున్నాడు. మనము ఎక్కడ నిలబడతామని చూచుటకు, మనలను కుదిపివేయడానికి, మనలను అట్టడుగునకు పడవేయడానికి పరీక్ష వస్తుంది. అయితే మనము ప్రతీ పోరాటమును జయిస్తాము, ఏలయనగా మనము సజీవమైన మాదిరిలుగా ఉన్నాము; దేవునియొక్క వాక్యము మనలో మరియు మన ద్వారా జీవించుచున్నది.
మనము ఆయన దృష్టిలో ఎంత ప్రాముఖ్యమైనవారము?
అది ఎంత అల్పమైనది అయినా, ఎవ్వరూ నీ స్థానమును తీసుకోలేరు. “నేను కేవలం ఒక గృహిణిని,” అని నీవు అనవచ్చును. ఎవ్వరూ నీ స్థానమును తీసుకోలేరు. దేవుడు, తనయొక్క గొప్ప వ్యవస్థలో, క్రీస్తుయొక్క శరీరమును, ఎంత స్థిరంగా క్రమపరచాడంటే, నీ స్థానమును తీసుకోగలవారు, ఎవ్వరూ లేరు.
అది ఎంత అద్భుతంగా ఉంది కదా? మనలో ప్రతి ఒక్కరికీ ఒక స్థానము ఉన్నది. దేవుడు ప్రపంచమును ఉనికిలోనికి పలికినప్పుడు మనలో ప్రతి ఒక్కరము ఇక్కడ ఉండియున్నాము. సరిగ్గా అప్పుడే ఆయన మన శరీరమును ఇక్కడ ఉంచాడు. తన వాక్యమును నెరవేర్చి మరియు మనకు నిత్యజీవమును ఇచ్చుటకు, దేవుడు ఈ సమయమున మనలను భూమి మీద ఉంచాడు.
ప్రతి ఒక్కరూ ఒక నిర్ణయము తీసుకోవలసియున్నది. ఈ వాక్యము, ఈ వర్తమానము, ఈ వర్తమానికుడి విషయంలో మీరెక్కడ నిలబడతారు? టేపులలో పలుకబడిన ఆ వాక్యమును వినడం అనేది ఎంత ప్రాముఖ్యము?
టేపు పరిచర్యల ద్వారా, ప్రపంచములోని వివిధమైన ప్రాంతములన్నిటికి, ఈ టేపులు అందజేయబడతాయి.
ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన వధువు కొరకు దేవునియొద్ద నుండి పంపబడిన టేపు పరిచర్యయైయున్నది. నీవు ఎక్కడున్నావన్నది, నీవు ఎవరివన్నది, మరియు నీవు వాక్యములోని విశ్వాసివా కాదా అన్నది ఇది నీకు ఖచ్చితంగా చెప్తుంది.
ఈ తరగతులలో నీవు ఏదో ఒకదానిలో ఉన్నావు. ప్రస్తుతం మీరున్న స్థితిలో, ప్రస్తుత మానసిక స్థితిలో, ప్రత్యక్షంగా ఈ జనసమూహములో ఉన్న మీరు, మరియు తర్వాత పరోక్షంగా ఈ టేపులను వినేవారు, ఈ టేపును వినిన తర్వాత, మీ యొక్క మానసిక స్థితియే, మీరు ఏ తరగతిలో ఉన్నారో మీకు ఋజువు చేస్తుంది.
ఈ టేపును విన్న తర్వాత, మీరు ఏ తరగతి ప్రజలకు చెందినవారని అది ఋజువు చేస్తుంది. ఈ టేపులలో పలుకబడిన స్వచ్ఛమైన వాక్యము కంటే ఎక్కువైనదేదో అవసరమని కొంతమంది నమ్ముతారు. ఒక-మనుష్యుని వర్తమానము వంటి దినములు గతించిపోయినవని; మీరు మీ సంఘకాపరి చెప్పేదానిని వినాలని లేదా మీరు నశించినట్లే అని కొంతమంది నమ్ముతారు.
టేపులను వినుటకు ప్రాముఖ్యతను ఇచ్చే విషయములోనే ఈనాడు వర్తమానములో అత్యంత గొప్ప విభజన కలుగుచున్నది. సంఘములో టేపులను ప్లే చేయడం తప్పని; సంఘకాపరి మాత్రమే పరిచర్య చేయాలనీ కొంతమంది బోధిస్తారు. కొంతమంది అవి సమముగా ఉండవలసియున్నవని చెప్తారు, కానీ వారు సంఘములో టేపులను ఎన్నడూ ప్లే చేయరు, ఒకవేళ చేసినా ఎప్పుడో ఒకసారి మాత్రమే అట్లు చేస్తారు.
వాక్యమును గూర్చి అనేక ఉద్దేశములు, అనేక ఆలోచనలు, అనేక అనువాదములు ఉండగా, ఎవరు చెప్పేది నిజం? మీరు ఎవరిని నమ్మాలి? అది మనలో ప్రతి ఒక్కరమూ మనల్ని మనము ప్రశ్నించుకోవలసిన ప్రశ్నయైయున్నది.
ఎవరో చెప్పేదానితో కాదు గాని, వాక్యముతో దానిని సరిచూడమని ప్రవక్త మనకు చెప్పియున్నాడు. మీరు దానిని ఎలా చేస్తారు? దానిని చేయడానికి ఒకేఒక్క మార్గమున్నది, ప్లేను నొక్కడమే.
ఒక సరియైన జవాబు, ఒక సరియైన మార్గము ఉండవలసియున్నది. ప్రతీఒక్కరూ తమకు తాముగా నిర్ణయించుకోవలసియున్నది. ఈ వర్తమానము వినే ప్రతీఒక్కరి భవిష్యత్తును ఈ ఆదివారము నిర్ధారిస్తుంది.
మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవలసిన విషయం: యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుతో ఉన్న ఒకేఒక్క వ్యక్తి ఎవరు? అగ్నిస్తంభము ఎవరిని నిర్ధారించినది? యేసుకు మనలను ఎవరు పరిచయం చేస్తారు? విఫలమవ్వని వాక్యమును పలికినది ఎవరు? భూమి మీద పలుకబడిన ఎవరి మాటలు, పరలోకములో ప్రతిధ్వనించేంతగా ప్రాముఖ్యమైయున్నవి?
సరియైన జవాబులను మీరు పొందగోరుచున్నయెడల, ఈ ఆదివారము, జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా 12:00 P.M., గంటల సమయమప్పుడు వచ్చి: 63-1124E — మూడు రకముల విశ్వాసులు అనే వర్తమానమును వినమని మిమ్మల్ని ఆహ్వానించగోరుచున్నాను.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
కూటమునకు ముందు చదువవలసిన లేఖనములు:
పరిశుద్ధ. యోహాను 6:60-71