
విశ్వాసపు తాళపుచెవిని కలిగియున్న ప్రియమైనవారలారా,
“నేనే గొర్రెల దొడ్డికి ద్వారమును. నేనే మార్గమును, ఏకైక మార్గమును, సత్యమును, జీవమును, మరియు నా ద్వారానే తప్ప ఎవడును తండ్రియొద్దకు రాడు. సమస్తవిషయములకు నేనే ద్వారమునైయున్నాను, మరియు మీరు ప్రవేశించే ద్వారమును తెరచు తాళపుచెవి విశ్వాసమైయున్నది.”
ఈ తాళపుచెవిని పట్టుకోగల ఒకేఒక్క చెయ్యి ఉన్నది, మరదియే విశ్వాసముగల చెయ్యి యైయున్నది. దేవునియొక్క వాగ్దానములన్నిటినీ తెరచు తాళపుచెవి విశ్వాసమేయై యున్నది. ఆయన ముగించిన కార్యమునందు విశ్వాసము కలిగియుండుట అనేది దేవుని రాజ్యములో ప్రతీ ధనమునకు ఉన్న ప్రతీ ద్వారమును తెరుస్తుంది. విశ్వాసమనేది అన్ని తాళపుబుర్రలకు పనిచేయునటువంటి దేవునియొక్క గొప్ప తాళపుచెవియైయున్నది అది ఆయనయొక్క వధువు కొరకు అన్ని ద్వారములను తెరుస్తున్నది మరియు మనము విశ్వాసముగల మన చేతిలో ఆ తాళపుచెవిని పట్టుకొనియున్నాము.
ఆ విశ్వాసము మన హృదయములలో ఉన్నది, మరియు మనము ఇట్లు చెప్పుచున్నాము, “అది దేవునియొక్క వాక్యమైయున్నది; అవి మన కొరకైన దేవుని వాగ్దానములైయున్నవి, మరియు మనము తాళపుచెవిని పట్టుకొయున్నాము”. మరియు పిదప, ఒక్క సందేహపు ముక్కయైనా లేకుండా, మనము కలిగుయున్న ప్రతి విశ్వాసపు అణువుతో, దేవుడు మన కొరకు కలిగియున్న ఆశీర్వాదములకు మరియు మనకు మధ్యనున్న ప్రతీ ద్వారమును మనము తెరుస్తాము. అది బలమైన అగ్ని జ్వాలలను చల్లారుస్తుంది. అది రోగుల కొరకు స్వస్థతను తెరుస్తుంది. అది మన రక్షణను తెరుస్తుంది. మనము ద్వారమునొద్దకు వచ్చియున్నాము మరియు మనము మాటచేతగాని లేదా క్రియచేతగాని ఏది చేసినను, మనము విశ్వాసపు తాళపుచెవిని కలిగియున్నామని ఎరిగియుండి, సమస్తమును ఆయన నామములో చేస్తాము; మరియు అది లేఖనము-ద్వారా చేయబడిన తాళపుచెవియైయున్నది.
ఎవరు ఏమి అనుకుంటారన్నది మనము లెక్కచేయము, ఒక్కటి మాత్రం నిశ్చయము: దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు, ఆయనయొక్క వాక్యమును మనకు బయలుపరచుకున్నాడు, మనము ఎవరమన్నది మనతో చెప్పియున్నాడు, మరియు ఆయన వాక్యమును వెంబడించాలని మనము తీర్మానించుకున్నాము, ఎందుకనగా ఆయన తనయొక్క వధువుగా ఉండుట కొరకు మనల్ని పిలచుకున్నాడు.
తండ్రి తన చేతిలో తనయొక్క ఏడు నక్షత్రములను, ఏడు కాలములకు, ఏడు వర్తమానికులను పట్టుకొనియున్నాడు. ఆయన వారిని తన చేతిలో పట్టుకొనియున్నాడు, అందునుబట్టియే వారు ఆయన శక్తితో సంబంధం కలిగియున్నారు. చెయ్యి దానినే సూచిస్తుంది. అది దేవునియొక్క శక్తిని సూచిస్తుంది! మరియు దేవునియొక్క అధికారమును సూచిస్తుంది.
మన విశ్వాసముగల చేతిలో మనము ఆయనయొక్క వాక్యమును పట్టుకొనియున్నాము, మన చేతులలో దేవునియొక్క శక్తి మరియు అధికారము ఉన్నదని అది సూచిస్తుంది మరియు మనకు అవసరత కలిగియున్న ప్రతిదాని కొరకు ప్రతి ద్వారమును తెరచుటకు ఆయన మనకు ఆ తాళపుచెవిని ఇచ్చాడు. అది ప్రతీ ద్వారమును తెరచునట్టి ప్రధానమైన తాళపుచెవియైయున్నది.
దేవుడు మన చేతికి 5 వ్రేళ్ళను ఎందుకిచ్చాడో ఇప్పుడు నాకు తెలుస్తుంది; 4 కాదు, 6 కాదు, అయితే 5, తద్వారా మనము మన చేతులవైపు చూసిన ప్రతిసారి, ప్రతి ద్వారమును తెరువగల విశ్వాసమును మనము కలిగియున్నామని మనకు గుర్తుకువస్తుంది.
ఆ విశ్వాసమును మన చేతులలో పట్టుకొనియున్నామని, ఎన్నడూ మర్చిపోకుండా; ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకొని మరియు ధైర్యము తెచ్చుకొనుటకు అది ఒక శాశ్వతమైన గురుతైయున్నది. మరియు మనయొక్క ఆవగింజంత విశ్వాసమును ఆయన హెచ్చించి మరియు ఎన్నడూ-విఫలమవ్వని, ఎన్నడూ తప్పిపోని నిత్యమైనటువంటి ఆయనయొక్క వాక్యమునందు ఆయనయొక్క గొప్ప విశ్వాసమును మనకు అనుగ్రహిస్తాడు!!!
మనము పరలోకము వైపునకు మన చేతులెత్తి, మన చేతులకు గల మనయొక్క 5 వ్రేళ్ళను చాపి ఆయనతో ఇట్లు చెప్పవచ్చును, “తండ్రీ, నీవు పలికిన ప్రతి మాటయందు మాకు విశ్వాసమున్నది మరియు మేము నమ్ముచున్నాము. అది నీ వాగ్దానమైయున్నది, నీ వాక్యమైయున్నది, మరియు మేము కేవలం నమ్మితే మాకు అవసరమైన విశ్వాసమును నీవు మాకు అనుగ్రహిస్తావు…మరియు మేము నమ్ముచున్నాము.”
ఆదివారము సాయంకాలము వరకు మనము ప్రభురాత్రి భోజనమును తీసుకొనబోవడంలేదు గనుక, ఆదివారము ఉదయము, మీకు అనుకూలమైన సమయములో, మీ సంఘముతో, కుటుంబముతో కలిసి వినుటకు, లేదా వ్యక్తిగతంగానైనా వినుటకు ఒక వర్తమానమును ఎన్నుకొనమని మిమ్మల్ని ప్రోత్సహించుటకు నేను ఇష్టపడుచున్నాను. మన విశ్వాసమును సరిచూసుకొనుటకు వాక్యమును వినుటకంటే నిజంగా ఏ ఉత్తమైన మార్గము లేదు; ఏలయనగా వినుటవలన విశ్వాసము కలుగును, వాక్యమును వినుటవలన కలుగును, మరియు వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చెను.
పిదప మనమందరమూ (మీ స్థానిక కాలమానం ప్రకారంగా) సాయంత్రం 5:00 గంటలప్పుడు, 62-1007 ద్వారమునకు తాళపుచెవి అను వర్తమానమును వినుటకు కూడుకుందాము. ప్రకటించబడిన ప్రకారంగా, నేను దీనిని ఒక ప్రత్యేకమైన ప్రభురాత్రి భోజనపు కార్యక్రమముగా చేయాలనుకుంటున్నాను, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా సాయంత్రం 5:00 గంటలప్పుడు ఇది వాయిస్ రేడియోలో ప్లే చేయబడుతుంది. ఇక్కడ నొక్కడం ద్వారా మీరు ఇంగ్లీషులోనైనా లేదా ఇతర భాషలలోనైనా డౌన్లోడ్ చేసుకొని మరియు దీనిని ప్లే చేసుకొనవచ్చును: LINK HERE.
గతంలో జరిగిన గృహ ప్రభురాత్రి భోజనపు కార్యక్రమముల వలె, టేపు ముగింపులో సహోదరుడు బ్రెన్హామ్ గారు రొట్టె మరియు ద్రాక్షరసమునకు ప్రార్థన చేస్తారు. మీరు ప్రభురాత్రి భోజనమును ముగించుకొనుటకు అనేక నిమిషములు పియానో సంగీతం ఉంటుంది. పిదప, సహోదరుడు బ్రెన్హామ్ గారు పాద పరిచర్యకు సంబంధించిన లేఖనమును చదువుతారు, మరియు ఆయన లేఖనమును చదివిన అనంతరం, మీరు పాద పరిచర్యను ముగించుకొనుటకు, అనేక నిమిషములు సువార్త గీతములు ఉంటాయి.
మన గృహములలో, సంఘములలో, లేదా మీరెక్కడుంటే అక్కడ మనతో భోజనము చేయుటకు ప్రభువైన యేసును ఆహ్వానించడానికి మనము ఎటువంటి భాగ్యమును కలిగియున్నాము కదా. మీరు ఆయనతో మాట్లాడినప్పుడు నా కొరకు ప్రార్థించండి, నేను కూడా నిశ్చయముగా మీ కొరకు ప్రార్థిస్తూ ఉంటాను.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక,
సహోదరుడు జోసఫ్ బ్రెన్హామ్