భూమికి ఉప్పైయున్న ప్రియమైనవారలారా,
ఓ ప్రియమైన వధువా, పరలోక స్థలములలో కూర్చొని, వాక్యముయొక్క సన్నిధిలో, పరిపక్వము చెందుతూ, మనము ఎవరమని, మనము ఎక్కడ నుండి వచ్చామని, మరియు మనము ఎక్కడికి వెళ్ళుచున్నామనేదానిని గుర్తిస్తూ మనము ఎటువంటి సమయమును కలిగియుంటున్నాము కదా.
మన హృదయలోతుల నుండి, ఇప్పుడు మనము దేవునియొక్క కుమారులము మరియు కుమార్తెలమై యున్నామని, ఎరుగుట. మనము అవుతాము అని కాదు గాని, మనము ఇప్పుడు అయ్యున్నాము. మనము దేవుని తలంపులయొక్క గుణలక్షణములైయున్నాము.
సాతానుడు మనపై దాడి చేసి, మరియు మన పొరపాట్లను, మన గతమును, మరియు మన అనుదిన వైఫల్యాలను మనకు చూపించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు; వాడి అబద్ధాలతో మన మనస్సులోను మరియు మన ఆత్మలోను మనలను కృంగదీయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మనము కేవలం వాడికి గుర్తు చేస్తూ ఇట్లు చెప్తాము, “జగత్తుపునాదికి ముందే, దేవుడు, నన్ను చూశాడు; అవును నన్ను చూశాడు మరియు నన్ను విమోచించుటకు ఆయన యేసును పంపాడు, సాతానా అది నిజము.” ఫాట్!
“ఇప్పుడు సాతనా, నన్ను విడిచి వెళ్ళు, ఎందుకనగా ఆయన కుమారునియొక్క రక్తము నా కొరకు మాట్లాడుచున్నది. నేను పాపము చేయలేను. నా పొరపాట్లు, అవును నా అనేక పొరపాట్లు, అవి దేవునికి అసలు కనిపించవు. ఆయనకు వినబడే ఒకేఒక్కటి ఆయనను ఆరాధిస్తూ మరియు స్తుతించుచున్న నా స్వరము మాత్రమే, మరియు ఆయన చూసే ఒకేఒక్కటి నా ప్రాతినిధ్యమును మాత్రమే.”
తూర్పు మరియు పడమరనుండి, ఉత్తరము మరియు దక్షిణమునుండి ఆయన వధువు కొరకు టేపులో ఆయన అనుగ్రహించిన వాక్యము క్రింద మన ప్రాతినిథ్యము మనలను సమకూర్చుచున్నది. ఆయన ఘనపరిచేది దానిని మాత్రమే; ఏలయనగా అది ఆయన ఏర్పాటు చేసిన మార్గమైయున్నది.
తరువాత ఆయన ఏమి చెప్పబోవుచున్నాడో మరియు ఏమి బయలుపరచనున్నాడో? ఆయన మన ప్రవక్త ద్వారా అనేకసార్లు మాట్లాడి మరియు మన నూతన గృహము ఎలా ఉంటుందో చెప్పడాన్ని మనము విన్నాము, కానీ ఈసారి దాని గురించి మనము ఇంతకుముందెన్నడూ వినని విధంగా అది ఉండబోవుచున్నది.
ఆ దైవికమైన నిర్మాణకుడు తన ప్రియురాలి కొరకు దీనిని రూపొందించాడు. చూశారా? ఓ, దైవీకమైన జీవమునకు కర్తయైన—ఆ దైవీకమైన దేవునిచేత, దైవీకముగా ఎన్నుకొనబడిన ఒక దైవీకమైన గుణలక్షణము కొరకు దైవీక స్వభావము, ఒక దైవీకమైన నిర్మాణకుడు దానిని నిర్మాణము చేసియుండగా, అది ఎటువంటి స్థలముగా ఉంటుందికదా! ఆ పట్టణము ఎలా ఉంటుంది కదా! దాని గురించి ఆలోచించండి.
మనము అస్సలు ఊరకే ఉండలేము. మన ఉత్సాహము మరియు మన ఎదురుచూపులు శిఖరపు ఎత్తులోనున్నవి. దేవుడు నేరుగా మనతో మాట్లాడి మరియు మనము నిత్యత్వమంతా ఆయనతో బ్రతుకునట్లు ఆయన ఇప్పుడు మన నూతన గృహమును రూపొందిస్తూ నిర్మాణిస్తున్నాడని చెప్పుటను వినడానికి మన హృదయములు వేగముగా కొట్టుకొనుచున్నవి.
మనము ఇంకేమి వింటామో, ముందు నిర్ణయము, ప్రాతినిథ్యము, యుగములు, ఎనిమిదవ దినము, పరిశుద్ధ పర్వతము, పిరమిడ్లు, మరియు పరిశుద్ధ సమాజముగా కూడుకొనడం గురించి ఆయన మనకు చెప్తుండగా, ఆదివారమునాడు మనకు ఏమి బయలుపరచబడుతుందో?
సరిగ్గా ఇప్పుడు ఏమి జరుగుచున్నదో దానిని మనము అర్థము చేసుకోగలమా? మన నూతన గృహము ఎలా ఉంటుందో ఆయన మనకు చెప్పగలుగునట్లు దేవుడు ప్రపంచమంతటినుండి ఆయన వధువును సమకూర్చుచున్నాడు. ఆయన మనకు ప్రతీ చిన్న వివరమును చెప్పబోవుచున్నాడు. మనము ఎటువంటి ఒక మహిమకరమైన సమయమును కలిగియుంటాము కదా.
మరో వైపు, మన పోరాటములు ఇంతకన్నా కష్టంగా ఎప్పుడూ లేవు. సాతానుడు ముందెన్నడూ లేని విధంగా మనపై దాడి చేయుచున్నాడు. వాడి దాడులు తగ్గినట్లుగాని లేదా వెళ్ళిపోయినట్లుగాని ఎన్నడూ అగుపించడంలేదు.
అయితే దేవునికి మహిమ, ఆయన వాక్యములో మన విశ్వాసము ఎప్పటికంటెనూ అధికముగా ఉన్నది. మనము కదల్చబడలేనట్లుగా, మనము ఎవరమన్నది ఎరిగియుండుటలోని విశ్వాసము, మన అంతరాత్మలో లోతుగా లంగరువేయబడియున్నది.
మనము భయపడటానికి ఏదియు లేదు; మనము చింతించడానికి ఏదియు లేదు. తండ్రి మనపట్ల పూర్తి బాధ్యతను కలిగియున్నాడు. ఆయన మన ప్రతీ అడుగును నడిపిస్తూ నిర్దేశిస్తాడు. ఆయన మనలను తన అరచేతిలో పట్టుకున్నాడు. సాతానుడు కేవలం ఒక మోసగాడు మాత్రమే, మరి వాడి అంతము సమీపమైనది మరియు వాడు దానిని ఎరిగియున్నాడు. భయపడేది వాడే, దేవునియొక్క పలుకబడిన వాక్యపు వధువుతో వాడు వ్యవహరిస్తున్నాడని వాడికి తెలుసు మరియు వాడు ప్రతీసారి ఓడించబడ్డాడు.
మనము వాక్యమైయున్నాము. ఆదినుండి మనము ఆయనలో ఉండియున్నాము. మనము ఏదో ఒక రోజు ఉండబోవుచున్నాము కాదు, మనము ఇప్పుడు ఉన్నాము. మనము వాక్యమైనయెడల, అప్పుడు మనము వాక్యమును పలుకగలము, కేవలం మనము నమ్మగలిగితే చాలు...మరియు మనము నమ్ముచున్నాము.
నీవు ఒక విశ్వాసివైనా అయ్యుంటావు (వాక్యముగా) లేదా నీవు ఒక సందేహించువాడవైనా అయ్యుంటావు (వాక్యము కానివాడిగా). ఒక్క వాక్యమునైనా నమ్మనటువంటి ఒక్క అణువైనా మన శరీరములలో లేదు. విషయం అదే! మనము వాక్యమైయున్నామని: సాతానుడికి మనము ఋజువు చేశాము. మనము పాదము క్రిందనున్నట్టి చర్మము కావచ్చును, కానీ అయినను మనము శరీరములో భాగమైయున్నాము!!!
కావున ఆ అబద్ధికుడు మనలో ఒకరి వెంటపడినప్పుడు, ప్రపంచమంతటినుండి వధువు కూడివచ్చి మరియు మనము వాడిని వాక్యముతో ఫాట్ ఫాట్ మని కొడతాము.
వ్యాధి మనలో ఒకరిమీదికి వచ్చినప్పుడు, మనము కలిసి కూడివచ్చి మరియు వాడిని ఫాట్ మని కొడతాము! మనలో ఒకరు నిరుత్సాహపడి మరియు దిగులుపడునప్పుడు, మనమంతా ఏమి చేస్తాము? వాడిని ఫాట్ మని కొడతాము!
వధువా, మనము ఇంటికి వెళ్ళుచున్నాము. సమయము వచ్చినది. వధువు తనను తాను సిద్ధపరచుకున్నది. మనము ఓడలో ఉన్నాము. ఆయన తలుపును మూసివేసాడు మరియు మనము సురక్షితముగా లోపల ఉన్నాము. వధువు ఆ మధ్యదారిగుండా నడిచి వచ్చి మరియు పెండ్లి కుమారునితో ఐక్యమగుటకు సంగీతమును మనము వినగలుగుచున్నాము.
1000 సంవత్సరాలు మనము మన హనీ మూన్ లో ఉంటాము, పిదప మనము ఒకరితో ఒకరము ఆయనతో కలిసి మన భవిష్యత్తు గృహముకు వెళ్తాము.
స్నేహితులారా, దానిని తప్పిపోకండి. దేవుని ద్వారా ఏర్పాటు చేయబడి మరియు నిర్ధారించబడిన ఒకేఒక్క మార్గము కలదు: అది టేపులే. అది అగ్నిస్తంభము మాట్లాడుచు మరియు ఆయన వధువును నడిపించుటయైయున్నది.
మీరేమి చేస్తున్నాగాని, ఈ ఆదివారము మీ యెదుట మరియు మీ కుటుంబము యెదుట ఆ స్వరమును ఉంచుకోండి. వినుట వలన, వాక్యమును వినుట వలన విశ్వాసము కలుగును, మరియు వాక్యము ప్రవక్తయొద్దకు వస్తుంది. మన దినమునకు టేపులద్వారా తన వధువుతో మాట్లాడుచున్న ప్రవక్త పరిశుద్ధాత్మయే అయ్యున్నాడు.
వధువులోని భాగము ఏకముగా కూడుకొని, దేవుడు తన బలిష్ఠుడైన దూత ద్వారా మాట్లాడి మరియు: పరలోక పెండ్లికుమారుడు మరియు భూలోక పెండ్లికుమార్తె యొక్క భవిష్యత్తు గృహము 64-0802 గురించి మనందరికీ చెప్పడాన్ని, అందరూ ఒకేసారి వినుచుండగా, ఈ ఆదివారము జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా 12:00 P.M. గంటల సమయమప్పుడు మీరు మాతో చేరడానికి మిమ్మల్ని స్వాగతించుచున్నాము.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
నీటిబుగ్గనుండి త్రాగే ప్రియమైనవారలారా,
ప్రభువు మనకిచ్చినట్టి ప్రాముఖ్యమైన ఈస్టరు వారంతము తరువాత వధువు ఇక ఎన్నడూ అదే విధంగా ఉండదు. వారాంతమంతా సహవాసము కలిగియుంటూ మరియు ఆయనను ఆరాధిస్తూ, మనము ఆయనతో మూసివేయబడియున్నాము. అయన సన్నిధి మన గృహములను మరియు మన సంఘములను నింపివేసినది.
మనము అటువంటి గొప్ప ఎదురుచూపులతో ఉండియున్నాము. ఇది మనకొరకు ప్రభువుయొక్క చిత్తమని మనము ఎరిగియున్నాము. దేవుడు ఏదో కార్యమును చేయనైయున్నాడు. మనము లోకమును మరియు దానియొక్క ఆటంకములన్నిటినీ వెలుపల ఉంచాము. మనము ప్రపంచమంతటినుండి ఏక మనస్సుతో కూడుకున్నాము. మనము పరలోక స్థలములలో కూర్చొనియున్నాము, మార్గములో ఆయన మనతో మాట్లాడుతాడని మనల్ని మనము సిద్ధపరచుకుంటూ ఉన్నాము.
మన హృదయములు ఈ విధంగా కేకలు వేస్తూ ఉన్నాయి, “ప్రభువా, నన్ను మరి ఎక్కువగా నీ వలె మార్చుము. త్వరలో జరుగనైయున్న నీ రాకడ కొరకు నన్ను సిద్ధపరచుము. నాకు మరి ఎక్కువ ప్రత్యక్షతను దయచేయుము. నాలోని ప్రతీ అణువు నీ పరిశుద్ధాత్మతో నింపబడును గాక.”
ప్రతి కూడిక మొదలవుతుండగా, మనలో మనము ఇట్లనుకున్నాము, “ఇది ఎలా సాధ్యం? నా జీవితమంతా నేను ఈ వర్తమానాలను విన్నాను, కానీ ఇప్పుడైతే, నేను వాటిని ఇంతకుముందెన్నడూ వినలేదన్నట్లు, అవన్నియు క్రొత్తగా అనిపించుచున్నవి.” ఇంతకుముందెన్నడూ లేనంతగా ఆయన తన వాక్యమును మన హృదయములకు మరియు మన అంతరాత్మలకు బయలుపరచుకొనుచున్నాడు.
ఆ ఉప్పొంగించే ప్రత్యక్షత మరలా మన హృదయములలోనికి వచ్చినది... అది ఆయనే...ఆయనే. స్వయంగా పరిశుద్ధాత్మయే నేరుగా మనతో మాట్లాడుచున్నాడు.
నేను కాదు! ఆయనే! అది ఆయనే! నేను ఇప్పుడే మీకు చెప్పాను, ఆయన కేవలం నా శరీరమును తీసుకున్నాడు. ఆయన నా నాలుకను తీసుకుంటాడు, నా కళ్ళను తీసుకుంటాడు, ఎందుకనగా నేను దానిని ఆయనకు అప్పజెప్పుకున్నాను అని ఆయనకు తెలుసు, కావున కేవలం ఆయనే వచ్చి మరియు నేను దానిని చేయునట్లు చేసాడు. కావున అది నేను కాదు! అది ఆయనే! మరియు అక్కడ బయట మీతో ఉన్నది నేను కాదు, అక్కడ బయట మీతో ఉన్నది ఆయనే. ఆయనే పునరుత్థానము మరియు జీవమునైయున్నాడు. ఓ, దేవా, దేవా; దానిని నమ్మండి. ఓ, ప్రజలారా: ఆయనను నమ్మండి. ఆయనను నమ్మండి. ఆయన ఇక్కడున్నాడు.
ఈ టేపులు ఈనాడు మనతో మాట్లాడుచున్న దేవునియొక్క స్వరమని తెలుసుకొనుటకు ఆయన మనకు ప్రత్యక్షతను ఇచ్చాడు. అవి ఆయన మాటలైయున్నవి, ఆయన స్వరమైయున్నది…ఆయన స్వరము, రికార్డు చేయబడి మరియు భద్రపరచబడినది తద్వారా నిత్యజీవపు మాటలను ఆయన మనతో మాట్లాడుచుండగా మనము వినుటకొరకైయున్నది. అవి తన వధువు కొరకు ఆయన ఏర్పాటు చేసిన మార్గమైయున్నది.
అది తాజాగా, శుభ్రముగా, ఉబుకుచున్న ఊటయొక్క నీళ్ళైయున్నవి. మనము త్రాగినా కొలది, ఇట్లు కేకలు వేసాము, “ఇంకా ప్రభువా, ఇంకా. నా గిన్నెను నింపు ప్రభువా, దానిని నింపు ప్రభువా.” మరియు ఆయన నింపాడు! మనము ఎంత త్రాగితే ఆయన మనకు అంతగా ఇస్తాడు.
పిదప సువార్తయొక్క శక్తి చేత సాతానుడు ఓడించబడ్డాడని తీర్పు తీర్చబడ్డాడు. తన దూతను అభిషేకించి మరియు మనకు సువార్తను ప్రకటించుటకు పంపిన పరలోకపు దేవుని చేత ఓడించబడ్డాడు. వాక్యమును వ్రాసి మరియు తన వాక్యమును నిర్ధారించుట కొరకు ఉన్నట్టి తన దూతను పంపిన దేవుని చేత ఓడించబడ్డాడు. “యేసు క్రీస్తు నామములో, ఆ ప్రజలనుండి బయటకు రా”.
వ్యాధితో ఉన్న ప్రతీ వ్యక్తినీ, బాధతో ఉన్న ప్రతీ వ్యక్తినీ, దయ్యము విడిచిపెట్టాల్సివచ్చింది. ఇప్పుడు దేవునియొక్క శక్తి మరలా మనలను మంచి ఆరోగ్యముతో మరియు బలముతో పైకి లేపినది.
పిదప, మన హృదయలోతుల నుండి మనము ఇట్లు చెప్పాము:
ఇప్పుడు నేను ఆ యేసు క్రీస్తును, పునరుత్థానము చెందిన దేవుని కుమారునిగా స్వీకరిస్తున్నాను, ఆయనే నా రక్షకుడు, ఆయనే నా రాజు, ఆయనే నన్ను స్వస్థపరచువాడు. ఇప్పుడు నేను స్వస్థపరచబడ్డాను. నేను రక్షించబడ్డాను. నా కోసం మరణించిన ఆయన కొరకు నేను జీవిస్తాను. నా కోసం తిరిగి లేచిన ఆయన…ఆయన కొరకు, నాకు సాధ్యమైనంత ఉత్తమమైనదానిని చేయడానికి, నూతన జీవముతో నేను ఇక్కడనుండి లేస్తాను. హల్లేలూయా!”
మనము అనుదినము త్రాగుచున్నది ఈ నీటి బుగ్గ నుండియే. ఇదొక్కటి మాత్రమే నేరుగా పరలోకమునుండి వచ్చి ఎల్లప్పుడూ ప్రవహించుచున్న ఊటయైయున్నది. అది స్వయం-సహకారం చేసుకోగలదు. ఎల్లప్పుడూ తాజాగా మరియు శుభ్రముగా ఉంటుంది. అది ఎన్నడూ మురికిగా అవ్వదు. అది స్థిరముగా మారుచు, మరియు ఎల్లప్పుడూ వధువుకు ఏదో క్రొత్త విషయమును బయలుపరుస్తున్న సజీవమైన జలములైయున్నవి.
అవి ఎప్పుడూ ఉబుకుతూనే ఉన్నాయి. మనము వాటిని పంపుకొట్టనక్కర్లేదు, తిప్పనక్కర్లేదు, మలచనక్కర్లేదు, లేదా దేనితోనో కలపనక్కర్లేదు. అది సజీవ జలములతో నిండిన దేవుని ఊటయైయున్నది, మరియు మరిదేనినుండైనా త్రాగడాన్ని మనము ఊహించలేము.
మనము ఈనాడు ఇట్లు వింటాము, “మీరు త్రాగగల అతి శ్రేష్ఠమైన నీరు మా నీళ్ళే. మాయొక్క 7 దశల వడపోత ప్రక్యియను మేము వాటికి జరిగించాము. పిదప ఆర్ద్రీకరణగా ఉండుటకు మీకు ఏదైతే అవసరమని మేము అనుకుంటున్నామో ఆ నీటిలో మేము వడపోసిన ఆ మినరల్స్ అన్నిటినీ తిరిగి కలిపాము.”
దేవునికి మహిమ, మనము ఏమి త్రాగుచున్నాము లేదా ఏమి కలపబడినది లేదా ఏమి వడపోయబడినది అని మనము ఒక అవకాశమునైనా లేదా ఒక్క ప్రశ్ననైనా తీసుకోవలసిన అవసరంలేదు. మనకు అవసరమైయున్న ప్రతీది మన నీటిలో ఉన్నది. మనము చేయవలసిందల్లా ప్లేను నొక్కి మరియు అది దూసుకొని వస్తుండగా దానిని త్రాగడమే.
ఈ నీళ్ళను త్రాగడంలో ఎటువంటి ఆదరణ ఉన్నది కదా. కేవలం దానివద్దనుండి త్రాగుటకు మనము ఎన్నో మైళ్ళ దూరముకు వెళ్తాము, అయితే మనమట్లు చేయనవసరంలేదు. మనము వెళ్ళే ప్రతీ చోటుకు మనము దానిని తీసుకొనివెళ్తాము. మన గృహములలో, మన సంఘములలో, పని దగ్గర, మన కారులను నడుచున్నప్పుడు, నడవడానికి వెళ్ళేటప్పుడు…మనము త్రాగుతూనే ఉంటాము, మనము త్రాగుతూనే ఉంటాము, మరియు మనము త్రాగుతూనే ఉంటాము.
ఓ లోకమా, వచ్చి దేవుడు ఏర్పాటు చేసిన ఊటనుండి త్రాగుము. “నేను త్రాగకూడని దేనినుండైనా పరిశుద్ధాత్మ నన్ను కాపాడాలని నేను ప్రార్థిస్తున్నాను,” అని చెప్తూ మీరు చింతించకుండా ఉండగలిగే ఒకేఒక్క స్థలము అదేయైయున్నది. అదంతా కూడా పరలోకమునుండి ప్రవహిస్తున్నట్టి స్వచ్ఛమైన నిర్ధారించబడిన వాక్యమైయున్నది.
ఆయనయొక్క వధువు త్రాగడానికి మరే చోటు లేదు!
ఆదివారము, జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 P.M. గంటల సమయమప్పుడు: బ్రద్దలైన తొట్లు 64-0726E అనే వర్తమానమును మేము వినుచుండగా, వచ్చి మాతోకలిసి మా నీటి బుగ్గ నుండి త్రాగండి.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
వర్తమానమును వినడానికి ముందు చదువవలసిన లేఖనములు:
కీర్తనలు 36:9
యిర్మియా 2:12-13
పరిశుద్ధ. యోహాను 3:16
ప్రకటన 13వ అధ్యాయము
సంబంధిత కూటములు
ప్రియమైన వధువా, ఈ రోజు మనమందరము కూడుకొని నిజమైన ఈస్టరు ముద్ర 61-0402 అను వర్తమానమును విందాము. జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా 12:30pm గంటల సమయమప్పుడు అది వాయిస్ రేడియోలో (ఇంగ్లీషులో) ప్లే చేయబడుతుంది.
సహోదరుడు జోసఫ్ బ్రెన్హామ్
ఈస్టరు ప్రణాళిక
సంబంధిత కూటములు
ప్రియమైన వధువా, మనమందరము ఈ రోజు కూడుకొని భూస్థాపితము 57-0420 అను వర్తమానమును విందాము. జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:30pm గంటలప్పుడు, అది వాయిస్ రేడియోలో ప్లే చేయబడుతుంది, కానీ విదేశాలలో ఉన్నవారు, మీ కుటుంబానికి అనుకూలంగా ఉండుటకు సరిపోయే ఏ సమయానికైనా దానిని వినుటకు సంకోచించకండి.
సహోదరుడు జోసఫ్ బ్రెన్హామ్
ఈస్టరు ప్రణాళిక
సంబంధిత కూటములు
ప్రియమైన వధువా, ఈ రోజు మనమందరము కూడుకొని కల్వరిలో ఆ దినము 60-0925 అను వర్తమానమును విందాము. జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:30pm గంటలప్పుడు, అది వాయిస్ రేడియోలో ప్లే చేయబడుతుంది, కానీ విదేశాలలో ఉన్నవారు, మీ కుటుంబానికి అనుకూలంగా ఉండుటకు సరిపోయే ఏ సమయానికైనా దానిని వినుటకు సంకోచించకండి.
సహోదరుడు జోసఫ్ బ్రెన్హామ్