
ప్రియమైన బ్రెన్హామ్ ఆలయమా,
మన కన్నులు చూచుచున్నవి గనుక; అవి ఎంత ధన్యమైనవి కదా. మన చెవులు వినుచున్నవి గనుక; అవి ఎంత ధన్యమైనవి కదా. ఎందరో ప్రవక్తలు మరియు నీతిమంతులు మనము చూచి మరియు వినిన సంగతులను చూచుటకును మరియు వినుటకును ఆశపడ్డారు, కానీ వారు చూడలేదు మరియు వినలేదు. మనము దేవుని స్వరమును చూశాము మరియు విన్నాము.
దేవుడు తానే తన ప్రవక్తల ద్వారా తన బైబిలు గ్రంథమును వ్రాయుటకు ఎన్నుకున్నాడు. దేవుడు ఈ అంత్య కాలములో తన ప్రవక్త ద్వారా తన వధువునకు తన మర్మములన్నిటినీ బయలుపరచుటకు కూడా ఎన్నుకున్నాడు. అది ఆయనయొక్క గుణలక్షణములైయున్నవి, ఆయనయొక్క వ్యక్తపరచబడిన వాక్యమైయున్నది, దానినంతా ఆయనలో భాగముగా చేయుచున్నది.
మన కాలము వచ్చినప్పుడు, ఆయన తన ప్రవక్తను సరిగ్గా అదే సమయములో ప్రవేశపెట్టాడు. ఆయన అతడిని ప్రేరేపించి మరియు అతని ద్వారా మాట్లాడినాడు. దానిని చేయుటకు అది ఆయనయొక్క ముందుగా నిర్ణయించబడిన ఏర్పరచబడిన మార్గమైయున్నది. అది మానవునియొక్క మాట కాదు గాని, బైబిలు గ్రంథమువలె, అది దేవునియొక్క వాక్యమైయున్నది.
మనమందరమూ ఒక సంపూర్ణతను కలిగియుండవలసియున్నాము, ఒక అంతిమమును; ఒక తుది వాక్యమును కలిగియుండవలసియున్నాము. టేపులలో చెప్పబడినది బైబిలు గ్రంథమునకు ఏదో భిన్నమైనదానిని చెప్పుచున్నట్లుగా, కొందరు టేపులలో చెప్పబడినది కాదు గాని; బైబిలు గ్రంథమే తమయొక్క సంపూర్ణత అని చెప్తారు. దేవుడు ఏ విధంగా తన వాక్యముయొక్క అసలైన ప్రత్యక్షతను అనేకులకు దాచిపెట్టి, మరి దానిని తన వధువునకు బయలుపరచి మరియు ఎంతో తేటగా చేసాడన్నది చాలా అద్భుతంగా ఉన్నది. ఇతరులు దానికి ఏమియు చేయలేరు, వారు గ్రుడ్డివారిగా చేయబడ్డారు మరియు దేవునియొక్క బయలుపరచబడిన వాక్యమును గూర్చిన సంపూర్ణ ప్రత్యక్షతను కలిగిలేరు.
దేవుడు ఆయనయొక్క వాక్యములో (బైబిలు గ్రంథములో) తన ప్రవక్త ద్వారా మాట్లాడి మరియు మనకు ఇట్లు చెప్పాడు, “పూర్వకాలమందు, నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు”. కావున, దేవుని ప్రవక్తలు బైబిలు గ్రంథమును వ్రాసారు. అది వారు కాదు గాని, దేవుడే వారి ద్వారా మాట్లాడుటయైయున్నది.
మనలను సర్వసత్యములోనికి నడిపించడానికి మన దినములో ఆయనయొక్క సత్యస్వరూపియైన ఆత్మను పంపుతాడని ఆయన చెప్పాడు. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక; వేటిని వినునొ, వాటిని బోధించి: సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును అని ఆయన చెప్పాడు.
టేపులలో ఉన్న వార్తమానము దేవునియొక్క బయలుపరచబడిన సత్యములైయున్నవి. దానికి ఎటువంటి అనువాదము అవసరములేదు. ఆయన దానిని టేపులలో మాట్లాడుచుండగా అది దేవుడు తానే తన వాక్యమును అనువదించుటయైయున్నది.
ఇతరులు మాట్లాడేదానిలో ఎటువంటి కొనసాగింపు లేదు, దేవుడు మాట్లాడుచున్నదానిలో మాత్రమే ఉన్నది. టేపులలో చెప్పబడిన స్వరము మాత్రమే ఎన్నడూ మారని స్వరమైయున్నది. మనుష్యులు మారతారు, ఆలోచనలు మారుతాయి, అనువాదములు మారుతాయి; దేవుని వాక్యము ఎన్నడూ మారదు. అది వధువుయొక్క సంపూర్ణతయైయున్నది.
ఒక బంతి ఆట వద్ద ఒక అంపైరు సంపూర్ణతగా ఉండుటను గూర్చి ప్రవక్త మనకు ఉదాహరణ ఇచ్చాడు. అతని మాటే అంతిమము. మీరు దానిని ప్రశ్నించలేరు. అతడేమి చెప్తే, ఇక అది అంతే, విరామ చిహ్నము. ఇప్పుడు అంపైరు పాటించవలసిన ఒక నియమాల పుస్తకమున్నది. ఒక ఫౌల్ బంతికి లేదా ఒక తప్పిపోయిన బంతికి స్థలములు ఏవి అనేది, మీరు ఎప్పుడు ఔటు కాలేదు మరియు మీరు ఎప్పుడు ఔట్ అయ్యారు అనేది; బంతి ఆటయొక్క నియమములు ఏమిటి అనేది అది అతనికి చెప్తుంది.
అతడు ఆ పుస్తకమును చదివి మరియు దానిని అధ్యయనం చేస్తాడు, కావున అతడు పలికి, మరియు అతని నిర్ణయములు ఇస్తున్నప్పుడు, మరదే న్యాయమైయున్నది, అదియే చివరి మాటయైయున్నది. మీరు అతడు చెప్పినదానితో నిలబడవలసియున్నది, ఏ ప్రశ్న లేదు, ఏ వాదన లేదు, అతడేమి చెప్తే, అది ఆ విధంగానే ఉండవలసియున్నది మరియు అది మార్చబడజాలదు. మహిమ.
సహోదరుడు బ్రెన్హామ్ గారు మీరు బోధించకూడదని, లేదా ఉపదేశించకూడదని చెప్పలేదు; దానికి భిన్నంగా, ఆయన బోధించమనియు, మరియు మీ సంఘకాపరులు చెప్పేది వినమనియు చెప్పాడు, కానీ టేపులలో ఉన్న దేవుని స్వరమే మీ సంపూర్ణతయై యుండవలసియున్నది అని చెప్పాడు.
మనము కట్టుబడియుండే ఒకటి ఉండవలసియున్నది; మరో మాటలో చెప్పాలంటే, ఒక అంతిమము ఉండవలసియున్నది. ప్రతీ ఒక్కరూ ఆ అంతిమమును కలిగియుండవలసియున్నది. అదే చివరి మాటయై యుండవలసియున్నది. దానిని పొందుకొనుటకు దేవుడు ఒకే ఒక్క స్థలమును ఏర్పాటు చేసాడు, అది టేపులలో ఉన్న దేవునియొక్క స్వరమేయైయున్నది. అదియే దేవుని వాక్యముయొక్క దైవీక అనువాదమైయున్నది. అదియే చివరి మాటయైయున్నది, ఆమేన్ అయ్యున్నది, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు యైయున్నది.
ఆయనయొక్క వాక్యమును పలికినవారిని మనము “దైవములు,” అని అంటామని స్వయంగా యేసే చెప్పాడు; మరి వారు దైవములైయున్నారు. ప్రవక్తలు దేవుని ఆత్మతో అభిషేకించబడినప్పుడు, వారు సరిగ్గా దేవుని వాక్యమునే తీసుకొనివచ్చారని ఆయన చెప్పాడు. వారి ద్వారా మాట్లాడుచున్నది దేవుని వాక్యమేనని ఆయన చెప్పాడు.
అందునుబట్టియే మన ప్రవక్త అంత ధైర్యముగా ఉన్నాడు. దేవునియొక్క తప్పిపోని వాక్యమును పలుకడానికి అతడు పరిశుద్ధాత్మ చేత కదిలించబడ్డాడు. మన కాలము కొరకు దేవుడు అతడిని ఎన్నుకున్నాడు. అతడు మాట్లాడబోయే వర్తమానమును ఆయన ఎన్నుకున్నాడు, మన ప్రవక్తయొక్క స్వభావమును మరియు మన కాలములో ఏమి జరుగుతుందో కూడా ఎన్నుకున్నాడు.
అతడు మాట్లాడిన మాటలు, అతడు ప్రవర్తించిన విధానము ఇతరులకు గ్రుడ్డితనము కలుగజేస్తున్నాయి కానీ, మన కన్నులను తెరచుచున్నాయి. అతడు వేసుకున్నటువంటి దుస్తులను సైతం ఆయన అతనికి ధరింపజేసాడు. అతని స్వభావము, అతని లక్ష్యము, ప్రతీది సరిగ్గా అతడు ఉండవలసిన విధంగానే ఉన్నది. దేవుని వధువైయున్న మన కొరకు, అతడు పరిపూర్ణముగా ఎన్నుకోబడ్డాడు.
ఆ కారణమునుబట్టియే, మనము కూడివచ్చినప్పుడు, వినడానికి మనము ఆ స్వరమునే మొదటిగా ఉంచాలని కోరతాము. దేవునియొక్క ఏర్పరచబడిన ఎన్నుకోబడిన వర్తమానికుడి నుండి స్వచ్ఛమైన పలుకబడిన వాక్యమును వింటున్నామని మనము నమ్ముచున్నాము.
ఇతరులు దానిని చూడలేరనియు లేదా గ్రహించలేరనియు మనము ఎరిగియున్నాము, అయితే అతడు తన సంఘముతో మాత్రమే మాట్లాడుచున్నాడని అతడు చెప్పాడు. కాయుటకు దేవుడు ఇతరులకు ఏమి ఇచ్చాడో దానికై ఆయన బాధ్యుడు కాడు; ఆయన మనలను ఎటువంటి ఆహారముతో పోషించుచున్నాడు అన్నదానికే ఆయన బాధ్యుడైయున్నాడు.
అందునుబట్టియే మనము బ్రెన్హామ్ ఆలయం అయ్యున్నామని మనము చెప్తాము, ఎందుకనగా వర్తమానము ఆలయములో ఉన్న తన ప్రజలకు మాత్రమేనని, టేపులను పొందుకొని మరియు వాటిని వినగోరిన చిన్నమందకు మాత్రమేనని అతడు చెప్పాడు. నడిపించడానికి దేవుడు అతనికి ఎవరిని ఇచ్చాడో అతడు వారితోనే మాట్లాడుచున్నాడు.
అతడు ఇట్లు చెప్పాడు, “బయట అక్కడ ప్రజలు ఆహారమును మరియు అట్టిదానిని సంకరము చేయగోరినయెడల, దేవుని వద్దనుండి ప్రత్యక్షతను పొందుకొని మరియు దేవుడు మీకు ఏమి చేయమని చెప్తాడో దానిని చేయండి. నేను కూడా అలాగే చేస్తాను. కానీ టేపులలో ఉన్న ఈ వర్తమానములు, ఈ సంఘమునకు మాత్రమేయైయున్నవి.”
ఆయనయొక్క వధువు దేవుని స్వరమును చూచి మరియు దానిని విని మరియు ఆయనయొక్క సూచనలను వెంబడించడానికి అతడు దానిని నిజముగా ఎంత సులువుగా చేసాడు కదా.
ఆ స్వరమును వినడానికి మీరు మాతో చేరాలనుకుంటే, ఈ ఆదివారము, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా 12:00 P.M గంటలప్పుడు, మేమంతా ఒకే సమయములో: 65-0822M - "క్రీస్తు తన స్వంత వాక్యమందు ప్రత్యక్షమాయెను" అనుదానిని వింటూ ఉంటాము.
మీరు మాతో చేరలేనియెడల, మీకు సాధ్యమైన ఏ సమయములోనైనా ఈ వర్తమానమును వినమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
వర్తమానమును వినడానికిముందు చదువవలసిన లేఖనములు:
నిర్గమకాండము 4:10-12
యెషయా 53:1-5
యిర్మియా 1:4-9
మలాకీ 4:5
పరిశుద్ధ. లూకా 17:30
పరిశుద్ధ. యోహాను 1:1 / 1:14 / 7:1-3 / 14:12 / 15:24 / 16:13
గలతి 1:8
2 తిమోతి 3:16-17
హెబ్రీ 1:1-3 / 4:12 / 13:8
2 పేతురు 1:20-21
ప్రకటన 1:1-3 / 10:1-7 / 22:18-19