
ప్రియమైన శ్రీమతి. యేసుక్రీస్తు,
జీవముగల దేవుని ఆత్మా, మాపైన ఊదుము. ప్రభువా, నీ వడపోత సాధనమును తీసుకొని మరియు మమ్మల్ని దానిక్రింద బ్రతుకనిమ్ము. అనుదినము పరిశుద్ధాత్మయొక్క తాజా శ్వాసను మా ఊపిరితిత్తులలోనికి మరియు మా అంతరాత్మలలోనికి ఊదుము. మేము కేవలం నీ వాక్యము ద్వారా మాత్రమే జీవించగలము; మేము జీవిస్తున్న ఈ కాలము కొరకు నీ నోటనుండి వచ్చు ప్రతి మాటవలన మాత్రమే జీవించగలము.
మేము నీ పరలోకపు సంగతులను రుచి చూశాము మరియు నీ వాక్యమును మా హృదయాలలో కలిగియున్నాము. నీ వాక్యము మా యెదుట ప్రత్యక్షపరచబడుటను మేము చూసియున్నాము, మరియు మా ప్రాణమంతయు దానిలో నిమగ్నమైపోయినది. ఈ లోకము, మరియు ఈ లోక సంగతులన్నియు మాకు మృతమైయున్నవి.
మేము ఆది నుండి నీ లోపలనున్న నీయొక్క వాక్య విత్తనపు బీజమైయున్నాము, ఇక్కడ నిలబడి, నీయొక్క విత్తనపు జీవమును పీల్చుకొనుచున్నాము. నీయొక్క ముందుజ్ఞానమునుబట్టి నీ విత్తనము మా హృదయాలలో ఉన్నది. టేపులలోనున్న నీ వాక్యము నుండియు, నీ స్వరము నుండియు కాక, మరిదేని నుండియు మేము ఏదియు పొందుకొనకుండునట్లు నీవు మమ్మల్ని ముందుగా నిర్ణయించుకున్నావు.
కన్ను కాలము వచ్చియున్నది; నీ వధువు కొరకు నీవు రావడం తప్ప మరేదియు మిగిలిలేదు. నీ వాక్యమే మా వడపోత సాధనముమైయున్నది, మలాకి 4, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.
మేము మా హృదయాలలో నీ వాక్యమును విత్తుకొని, మరియు మేము కుడికైనను లేదా ఎడమకైనను తిరుగకుండా, మా జీవితకాలమంతయు దానికి నమ్మకముగా బ్రతుకనుద్దేశించుదుము గాక. తండ్రీ, జీవముగల పరిశుద్ధాత్మను మా మీదికి పంపించుము, మరియు మేము నిన్ను ప్రత్యక్షపరచునట్లు, నీ వాక్యమును మాయందు పురిగొల్పుము.
మేము నీకు నిజమైన కుమారులు మరియు కుమార్తెలుగా ఉండాలన్నదే మా హృదయములయొక్క కోరికయైయున్నది. మేము నీ స్వరముయొక్క సన్నిధిలో కూర్చొనియున్నాము, పరిపక్వము చెందుతూ, అతిత్వరలో నీతో జరుగనైయున్న పెండ్లి విందుకొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకొనుచున్నాము.
దేశములు బ్రద్దలైపోవుచున్నవి. ప్రపంచము తునాతునకలైపోవుచున్నది. నీవు మాతో అలా జరుగుతుందని చెప్పినట్లే భూకంపములు క్యాలిఫోర్నియాను కుదిపివేయుచున్నవి. అతి త్వరలో పదిహేను-వందల-మైళ్ళ విస్తీర్ణముతో; మూడు లేదా నాలుగు వందల మైళ్ళ వెడల్పుతోనున్న పెద్ద భూభాగము, అక్కడ ఆ పెద్ద చీలికలో, బహుశా నలభై మైళ్ళ లోతులోనికి మునిగిపోతుందని మాకు తెలుసు. ప్రకంపనాలు నేరుగా కెంటకీ రాష్ట్రముదాకా తాకుతాయి, మరియు అది జరిగినప్పుడు, అది ప్రపంచమును ఎంత ఘోరముగా కుదిపివేస్తుందంటే దానిపైనున్న ప్రతీది కుదిపివేయబడుతుంది.
నీ చివరి హెచ్చరిక బయలువెళ్ళుచున్నది. ప్రపంచము పూర్తి గందరగోళములో ఉన్నది, కానీ నీ వధువు మాత్రం అన్నివేళలా నీలోపల మరియు నీ వాక్యములోపల విశ్రాంతి పొందుచున్నది, నీవు మాతో మాటలాడుచు, మరియు మార్గమున మమ్మల్ని ఆదరించుచుండగా పరలోక స్థలములలో కూర్చొనియున్నది.
తండ్రీ, మేము తేలికగా “ప్లేను నొక్కి,” మరియు నీ స్వరము మాతో మాట్లాడి, మమ్మల్ని ప్రోత్సాహపరచి మరియు మాకు ఈ విధంగా చెప్పడాన్ని వినగలుగుచున్నందుకు, మేమెంతో కృతజ్ఞులమైయున్నాము:
చిన్న మందా భయపడకుడి. నేను అయ్యున్నదానంతటికీ, మీరు వారసులైయున్నారు. నా అధికారమంతయు మీదైయున్నది. నేను మీ మధ్యన నిలబడియుండగా నా సర్వశక్తియు మీదైయున్నది. భయమును మరియు ఓటమిని కాదు గాని, ప్రేమను మరియు ధైర్యమును మరియు సామర్థ్యతను తీసుకొనివచ్చుటకు నేను వచ్చియున్నాను. సర్వాధికారము నాకు ఇవ్వబడినది మరియు మీరు ఉపయోగించుటకు అది మీదైయున్నది. మీరు మాట మాత్రం పలుకండి మరియు నేను దానిని నెరవేర్చుదును. అది నా నిబంధనయైయున్నది మరియు అది ఎన్నడూ విఫలమవ్వజాలదు.”
ఓ తండ్రీ, మేము భయపడుటకు ఏదియు లేదు. నీవు నీ ప్రేమను, ధైర్యమును మరియు సామర్థ్యతను మాకిచ్చియున్నావు. మాకు అవసరమైనప్పుడు దానిని ఉపయోగించుటకు నీ వాక్యము మాలో ఉన్నది. మేము దానిని పలుకుతాము, మరియు నీవు దానిని నెరవేర్చుతావు. అది నీ నిబంధనయైయున్నది, మరియు అది ఎన్నడూ విఫలమవ్వజాలదు.
తండ్రీ, మేము ఏ విధంగా అనుభూతి చెందుతున్నామో మర్త్యమైన మాటలు వ్యక్తపరచలేవు, కానీ నీవు మా హృదయములలోనికి మరియు మా అంతరాత్మలలోనికి చూచుచున్నావని మాకు తెలుసు; ఏలయనగా మేము నీలో ఒక భాగమైయున్నాము.
ఈ అంత్య-కాలములో నీ స్వరమును వినడానికి లోకమునకు నీవు ఒక మార్గమును ఏర్పాటు చేసినందుకు మేమెంతో కృతజ్ఞులమైయున్నాము. నీవు మా కొరకు తిరిగి వచ్చేదాకా మమ్మల్ని పోషించుటకై దాచబడిన గొర్రెపిల్ల ఆహారమును నీవు మాకు అందించుచుండగా నీయొక్క వర్తామానికుడైన దూత చెప్పేది వినుటకు వచ్చి చేరమని, ప్రతీ వారము నీవు ప్రపంచమును ఆహ్వానించుచున్నావు.
తండ్రీ మేము నిన్ను ప్రేమిస్తున్నాము.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
వర్తమానము: 65-0822E ఆలోచనాపరుని వడపోత సాధనము
సమయము: 12:00 p.m., జఫర్సన్విల్ కాలమానం ప్రకారముగానే
లేఖనములు: సంఖ్యాకాండం 19:9 / ఎఫెసీ 5:22-26