ఆదివారం
22 సెప్టెంబర్ 2024
65-0829
సాతాను యొక్క ఏదెను

ప్రియమైన దేవుని గుణలక్షణమా,

మనం సాక్షాత్తు మన పరలోకపు తండ్రియొక్క గుణలక్షణమైయున్నాము; ఏలయనగా ఆదిలో మనము ఆయనలో ఉన్నాము. మనకు ఇప్పుడు అది జ్ఞాపకముండదు, కానీ మనము ఆయనతో ఉండియున్నాము, మరియు ఆయన మనల్ని ఎరిగియున్నాడు. ఆయన మనల్ని ఎంతగా ప్రమించాడంటే, ఆయన మనతో సంబంధము కలిగియుండుటకు, మనతో మాట్లాడుటకు, మనల్ని ప్రేమించుటకు, మనతో కరచాలనము కూడా చేయుటకు ఆయన మనల్ని శరీరులుగా చేశాడు.

అయితే సాతానుడు వచ్చి మరియు దేవునియొక్క అసలైన వాక్యమును, ఆయన రాజ్యమును, మనకొరకైన ఆయన ప్రణాళికను వంకర చేశాడు. వాడు స్త్రీ పురుషులను మలిచివేసి మరియు వంకర చేయుటలో మరియు మనము నివసిస్తున్న ఈ ప్రపంచమును చేజిక్కించుకొనుటలో సఫలమయ్యాడు. వాడు భూమిని వాని రాజ్యముగా, వాని ఏదెను తోటగా చేసియున్నాడు.

ఇది ఎన్నడూ లేనటువంటి అత్యంత మోసపూరితమైన మరియు ద్రోహపూరితమైన ఘడియయైయున్నది. అపవాది ఒక పెద్ద మోసగాడు కాబట్టి; వాడు బిగించగల ప్రతీ కుయుక్తిగల ఉచ్చును బిగించాడు. ఏ కాలములోనైనా ఉన్నదానికంటే ఈ దినమునే ఒక క్రైస్తవుడు ఎంతో మెలకువగా ఉండవలసియున్నాడు.

అయితే అదే సమయములో, అన్ని కాలములలో కంటే ఇదే అత్యంత మహిమకరమైన కాలమైయున్నది, ఎందుకనగా మనము ఆ గొప్ప వెయ్యేండ్ల పాలనను ఎదుర్కొంటున్నాము. ఎక్కడైతే మనం పరిపూర్ణమైన ప్రేమను మరియు దేవునియొక్క ప్రేమను గూర్చి పరిపూర్ణమైన అవగాహనను కలిగియుంటామో, అట్టి మన ఏదెను తోట త్వరలో వచ్చుచున్నది. మనం మన ఏదెనులో ఆయనతోపాటు నిత్యమూ సజీవులుగాను మరియు సురక్షితంగాను ఉంటాము.

ఈ దినమున మనం ఎంత జాగ్రత్తగా ఉండాలన్నది మత్తయి 24లో యేసు మనకు చెప్పాడు. ఎన్నడూ లేనటువంటి అత్యంత మోసపూరితమైన దినముగా ఇది ఉంటుందని ఆయన మనల్ని హెచ్చరించాడు, “సాధ్యమైతే దేవునిచేత ఏర్పరచబడినవారిని సైతం మోసపరిచేంత సమీపంగా అది ఉంటుంది”; ఏలయనగా అపవాదియొక్క కుయుక్తి, ప్రజలను వారు క్రైస్తవులు కాకుండానే వారు క్రైస్తవులని నమ్మున్నట్లు చేస్తుంది.

అయితే ఈ కాలము మోసపోని, మోసపరచబడలేని, ఆయనయొక్క స్వచ్ఛమైన వాక్య వధువును కూడా తీసుకొనివస్తుంది; ఏలయనగా వారు ఆయనయొక్క అసలైన వాక్యముతో నిలిచియుంటారు.

యెహోషువ మరియు కాలేబు వలె, వారికిలాగానే మన వాగ్దాన దేశము కూడా కనబడేంత సమీపంగా వచ్చుచున్నది. యహోషువ అనగా అర్థము, “యెహోవాయే-రక్షకుడు” అని మన ప్రవక్త చెప్పియున్నాడు. అసలైన నాయకుడిగా పౌలు వచ్చినట్లే, సంఘమునకు వచ్చునటువంటి అంత్య-కాలపు నాయకుడికి అతడు ప్రాతినిధ్యము వహించాడు.

యెహోషువతో నమ్మకముగా నిలబడినవారికి కాలేబు ప్రాతినిధ్యము వహించాడు. ఇశ్రాయేలు పిల్లల వలెనే ఉన్నది, దేవుడు తనయొక్క వాక్యముతో వెళ్తున్న ఒక కన్యక వలె వారిని బయటకు నడిపించాడు; కానీ వారు భిన్నమైనదానిని కోరుకున్నారు. మన ప్రవక్త ఇట్లన్నాడు, “ఈ అంత్య-దినపు సంఘము కూడా అలాగే చేస్తుంది.” కావున దేవుడు, ఆయనయొక్క స్వంత నియామక కాలము వచ్చేదాకా ఇశ్రాయేలును వాగ్దాన దేశములోనికి వెళ్ళనివ్వలేదు.

ప్రజలు, దేవుడు వారికి అనుగ్రహించినట్టి నాయకుడైన యెహోషువను ఒత్తిడిచేసి, మరియు ఇట్లన్నారు, “ఆ దేశము మనది, మనము వెళ్ళి దానిని స్వాధీనపరచుకుందాము. యెహోషువా, నీ పని అయిపోయినది, నీవు నీ ఆజ్ఞను కోల్పోయినట్లున్నావు. నీవు ఇదివరకు కలిగియుండే శక్తిని ఇప్పుడు కలిగిలేవు. నీవు ఇంతకుముందు దేవునియొద్దనుండి విని మరియు దేవునియొక్క చిత్తమును ఎరిగి, మరియు వెంటనే పనిచేసేవాడివి. నీతో ఏదో సమస్య ఉన్నది.”

యెహోషువ దేవునిచేత పంపబడిన ప్రవక్తయైయున్నాడు, మరియు అతడు దేవుని వాగ్దానములను ఎరిగియున్నాడు. మన ప్రవక్త మనతో ఇట్లు చెప్పాడు:

“దేవుడు పూర్తి నాయకత్వమును యెహోషువ చేతులలో పెట్టాడు ఎందుకనగా అతడు వాక్యముతో నిలిచియున్నాడు. దేవుడు యెహోషువను నమ్మగలిగాడు కానీ, ఇతరులను కాదు. అటువంటిదే ఈ అంత్య దినమున మరలా జరుగుతుంది. అదే సమస్య, అవే ఒత్తిడులు”.

దేవుడు సరిగ్గా యెహోషువతో చేసినట్లే, పూర్తి నాయకత్వమును తనయొక్క దూత ప్రవక్తయైన, విలియమ్ మారియన్ బ్రెన్హామ్ చేతులలో పెట్టాడు; ఏలయనగా ఆయన అతడిని నమ్మగలడు కానీ, ఇతరులను నమ్మలేడని ఆయన ఎరిగియున్నాడు. ఒక్క స్వరము, ఒక్క నాయకుడు, ఒక్క ఆఖరి మాట ఉండవలసియున్నది, అప్పుడును, మరియు ఇప్పుడును అంతే.

టేపులను వినేవారు వేలకు వేల మంది ఉంటారని ప్రవక్త మనకు చెప్పినదానిని నేను ఇష్టపడుచున్నాను. టేపులు ఒక పరిచర్యయై యున్నవని ఆయన చెప్పాడు. దేవునియొక్క ముందుగా ఏర్పరచబడిన విత్తనమును పట్టుకోవడానికి మనలో కొందరు ఒక టేపుతో (ఆయనయొక్క పరిచర్యతో) గృహములలోనికి మరియు సంఘములలోనికి వెళతామని చెప్పాడు.

మనము తిరిగి వచ్చి మరియు ఇట్లు చెప్పినప్పుడు, ప్రభువా, మేము నీ ఆజ్ఞలకు విధేయత చూపాము, మరియు మేము టేపులను ప్లే చేసినప్పుడు నమ్మినట్టి ప్రజలు ఉండుటను మేము కనుగొన్నాము. ఇప్పుడు మేము దానిని, ప్రపంచవ్యాప్తంగా ప్రకటించియున్నాము, నీవు దానిని ఘనపరచుదువా?

ఆయన ఇట్లంటాడు: “దానిని చేయుటకే నేను మిమ్మల్ని పంపించాను.”

దేవుడు దానిని ఘనపరుస్తాడు. మీ ఇల్లు ఎన్నడూ కూలిపోదు. సమస్తమును నాశనము చేయమని దేవుడు సైగ చేసినప్పుడు, మీ కుటుంబమంతా, మీరు కలిగియున్నదంతా, మీ ఇంటిలో సురక్షితముగా ఉంటుంది. మీరు అక్కడ నిలబడగలరు. మీరు కిటికీనుండి బయటకు చూడనవసరంలేదు, యుద్ధము జరుగుచుండగా కేవలం ప్లేను నొక్కండి.

నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని: సైన్యములకు అధిపతివగు యెహోవా, దేవా నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాట నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నది.

ఈ ఆదివారము, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా 12:00 P.M. గంటల సమయమప్పుడు, దేవునియొక్క గొప్ప, ప్రత్యక్ష, అంత్య-కాల పరిచర్యను మేము తినుచుండగా, వచ్చి మాతో చేరమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, మనము: సాతానుని ఏదెను 65-0829 అనుదానిని వింటాము.

సాధ్యమైతే, మేము ప్రభువుయొక్క రాకడ వరకు జీవించియుందుము గాక. మేము మా శక్తి కొలది, ప్రేమతోను మరియు గ్రహింపుతోను, ఈనాడు దేవుడు, ప్రతి తప్పిపోయిన గొర్రెపిల్లను కనుగొనుచున్నాడనే గ్రహింపుతోను, సమస్తమును చేయుదుము గాక. మరియు ప్రభువా, మేము ప్రేమతో నిండిన ప్రార్థనను మరియు దేవుని వాక్యమును కలిగి వారితో మాట్లడుదుము గాక, తద్వారా మేము ఈ పాత సాతానుని ఏదెను నుండి బయటకు వచ్చి, మరియు గృహమునకు వెళ్ళగలుగునట్లు, మేము ఆ చివరిదానిని కనుగొనుటకైయున్నది.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

వర్తమానమును వినుటకు ముందు చదువవలసిన లేఖనములు:

2 తిమోతి 3:1-9
ప్రకటన 3:14
2 థెస్సలొనిక 2:1-4
యెషయా 14:12-14
మత్తయి 24:24