

ప్రియమైన క్రీస్తుయొక్క వధువా,
కల్వరి ప్రతి దినము గుర్తుచేసుకోబడవలసియున్నది. మరియు మనము దాని గురించి ఎంతో విన్నాము, దాని గురించి ఎంతో చదివాము. కాలముయొక్క ఆరంభమునుండి, బోధకులు దానిపై ప్రసంగించారు. కాలములగుండా, గాయకులు దాని గురించి పాడారు. అది సంభవించడానికి నాలుగువేల సంవత్సరాల ముందే, ప్రవక్తలు దాని గురించి పలికారు. మరియు ఈ దినపు ప్రవక్తలు తిరిగి అది జరిగిన సమయము వైపుకు చూపిస్తుంటారు. అది అంతటి ఒక ప్రాముఖ్యమైన దినమైయున్నది! దేవుడు భూమి మీద ఉదయించుటకు అనుమతించిన దినములన్నిటిలోకల్లా అది ప్రాముఖ్యమైన దినమైయున్నది.
ఈ ఈస్టరు వారంతమున ప్రపంచవ్యాప్తంగా వధువు ఎటువంటి ఒక ప్రత్యేకమైన కూడికను కలిగియుంటుంది కదా. మనము మన తలుపులను మూసివేసి మరియు బయటి ప్రపంచమును మూసివేస్తాము. మన ధ్యాస మళ్ళించబడకుండునట్లు మనము మన పరికరములన్నిటిని ఆపు చేసి, మరియు ప్రతీ దినము ఆయనతో మాట్లాడుతాము. ఆయనను స్తుతించడానికి, ఆయనను ఆరాధించడానికి, మనము ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నామో ఆయనకు చెప్పడానికి, సమాధానముతో, ఏక మనస్సుతో మరియు ఏక ఆత్మతో మనము ఆయన తట్టు మన స్వరములను ఎత్తుతాము.
మనము మన జీవితాలను మరలా ఆయనకు ప్రతిష్ఠిస్తుండగా ఆయనయొక్క స్వరము మన హృదయాలతో మాట్లాడుటను మనము వింటాము. త్వరలో జరుగనైయున్న ఆయనయొక్క రాకడ కొరకు మనల్ని మనము సిద్ధపరచుకొనుచుండగా మనకు అంతకంటే విలువైనది ఏదియు ఉండదు. ముందెన్నడూ లేనట్లుగా వధువు తననుతాను సిద్ధపరచుకొనుచున్నది.
ఈ క్రిందనున్న ప్రణాళిక కొరకు మనమందరము ఐక్యమవ్వాలని నేను కోరుచున్నాను:
గురువారము
ఇశ్రాయేలు పిల్లలయొక్క నిర్గమమునకు ముందు తీసుకోబడిన పస్కాకు జ్ఞాపకార్ధంగా, ప్రభువైన యేసు తన శిష్యులతో చివరి భోజమును తీసుకున్నది గురువారము రాత్రియే. మన పవిత్రమైన వారంతమునకు ముందు, మన గృహములలో ప్రభురాత్రి భోజనమును చేయుటకు, మరియు మన పాపముల విషయమై మనల్ని క్షమించమని ఆయనను అడుగుటకు, మరియు మార్గములో మనకు అవసరమైయున్న ప్రతీదానిని అనుగ్రహించమని అడుగుటకు మనము ఎటువంటి ఒక అవకాశమును కలిగియున్నాము కదా.
ప్రభువా, దానిని అనుగ్రహించము. రోగులను స్వస్థపరచుము. అలసినవారికి ఆదరణ దయచేయుము. కృంగియున్నవారికి సంతోషము కలుగజేయుము. దిగులుతో ఉన్నవారికి సమాధానము దయచేయుము, ఆకలితో ఉన్నవారికి ఆహారము దయచేయుము, దాహముగలవారికి నీటిని దయచేయుము, విచారముతో ఉన్నవారికి ఆనందాన్ని దయచేయుము, సంఘానికి శక్తిని అనుగ్రహించుము. ప్రభువా, ఆయనయొక్క విరగగొట్టబడిన శరీరమును సూచిస్తున్న ప్రభురాత్రి భోజనమును తీసుకొనుటకు మేము సిద్ధపడుచుండగా, ఈ రాత్రి యేసును మా మధ్యకు తీసుకొనిరమ్ము. ప్రభువా, ఒక మహత్తరమైన విధానములో ఆయన మమ్మల్ని దర్శిస్తాడని, మేము ప్రార్థిస్తున్నాము...
ప్రభువా, దివిటీలు చక్కపరచబడి, పొగగొట్టాలు శుభ్రపరచబడి, మరియు అంధకార స్థలములలో సువార్త వెలుగు ప్రకాశించుచుండగా, ప్రపంచవ్యాప్తంగా, సంతోషముతో, ప్రభువుయొక్క రాకడ కొరకు ఎదురుచూస్తున్న ఇతరులను ఆశీర్వదించుము.
మనమందరము ప్రభు సంస్కారము 62-0204 వర్తమానమును వినడానికి మీ స్థానిక కాలమానం ప్రకారంగా సాయంకాలము 6:00 P.M. గంటల సమయమప్పుడు ప్రారంభించుకుందాము, మరియు పిదప మన ప్రవక్త మన ప్రత్యేకమైన ప్రభురాత్రి భోజనము మరియు పాద పరిచర్యలోనికి మనల్ని నడిపిస్తాడు, అది లైఫ్ లైన్ యాప్ లో (ఇంగ్లీషులో) ప్లే చేయబడుతుంది, లేదా క్రింద ఇవ్వబడిన లింకుపై నొక్కుట ద్వారా ఇంగ్లీషులోనైనా లేదా ఇతర భాషలలోనైనా ఆ కూడికను మీరు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
వర్తమానము తరువాత, మనము మన గృహములలో మన కుటుంబాలతో కూడుకొని మరియు ప్రభురాత్రి భోజనమును తీసుకుంటాము.
శుక్రవారము
మనల్ని మనము ఆయనకు ప్రతిష్ఠించుకొనుచుండగా మనతో ఉండమని మరియు మన గృహములను పరిశుద్ధాత్మతో నింపమని ప్రభువును ఆహ్వానిస్తూ, ఉదయము 9:00 A.M. గంటలప్పుడు, మరియు పిదప మరలా మధ్యాహ్నము 12:00 P.M. గంటలప్పుడు మనము మన కుటుంబాలతో కలిసి ప్రార్థనలో నిమగ్నమౌదాము.
మన మనస్సులు, 2000 సంవత్సరాల క్రితమునకు, ఆ కల్వరి దినము వద్దకు వెళ్ళును గాక, మరియు మన రక్షకుడు సిలువ మీద వ్రేలాడుటను చూసి పిదప అదే విధంగా ఎల్లప్పుడూ తండ్రికి ఆనందము కలుగజేసేదానిని చేయుటకు మనల్ని మనము సమర్పించుకొందుము గాక:
మరియు ఈ దినము, ఎంతో ప్రాముఖ్యమైనదైయ్యుండగా, అతిగొప్ప దినములలో ఒకటైయ్యుండగా, ఈ దినము మనకు ఏమైయున్నదని మనము మూడు భిన్నమైన సంగతులను చూద్దాము. మనము వందల కొలది సంగతులను తీసుకోవచ్చును. అయితే, ఈ ఉదయము, తదుపరి కొద్ది నిమిషాలు, కల్వరి మనకు ఏమైయున్నదని, మనం చూడటానికి, నేను కేవలం మూడు భిన్నమైన, ముఖ్యమైన సంగతులను ఎంచుకున్నాను. మరియు అది ఇక్కడున్న ప్రతి పాపిని గద్దించాలని; ప్రతి పరిశుద్ధుడిని మోకరించేటట్లు చేయాలని; ప్రతీ వ్యాధిగ్రస్తుడిని దేవునిపై తనకున్న విశ్వాసమును పెంచుకొని, మరియు స్వస్థపరచబడి, వెళ్ళేటట్లు చేయాలని ప్రార్థిస్తున్నాను; ప్రతీ పాపి, రక్షించబడాలని; ప్రతీ పడిపోయిన వ్యక్తిని తిరిగి వచ్చి, మరియు తనను గూర్చి తాను సిగ్గుపడాలని; మరియు ప్రతి పరిశుద్ధుడు, సంతోషిస్తూ, నూతన పట్టును మరియు నూతనమైన నిరీక్షణను తీసుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను.
పిదప 12:30 P.M. గంటల సమయమప్పుడు, కల్వరిలో ఆ దినము 60-0925 వర్తమానము వినుటకు మనము మన గృహములలో కూడుకుందాము.
పిదప మన ప్రభువుయొక్క సిలువ మరణానికి జ్ఞాపకార్థంగా మధ్యాహ్నం 3:00 P.M. గంటల సమయమప్పుడు ప్రార్థనలో మనము మరలా కూడుకుందాము.
శనివారము
మనమందరము మరొకసారి ఉదయము 9:00 A.M. గంటలప్పుడు మరియు మధ్యాహ్నము 12:00 P.M. గంటలప్పుడు ప్రార్థనలో కూడుకుందాము, మరియు మన మధ్యన ఆయన మనకొరకు చేయునట్టి గొప్ప కార్యముల కొరకు మన హృదయాలను సిద్ధపరచుకుందాము.
ఆయన ఇట్లు చెప్పడాన్ని నేను వినగలుగుచున్నాను, “సాతానా, ఇక్కడికి రా!” ఆయన ఇప్పుడు బాస్ అయ్యున్నాడు. ముందుకు జరిగి, వాని ప్రక్కనుండి మరణము మరియు పాతాళముయొక్క తాళపుచెవిని లాక్కొని, ఆయన తన ప్రక్కలో తగిలించుకున్నాడు. “నేను నిన్ను హెచ్చరించగోరుచున్నాను. ఎంతో కాలంగా నీవొక మోసగాడిలా ఉన్నావు. నేను కన్యక-జన్మ వలనైన సజీవ దేవుని కుమారుడినై యున్నాను. సిలువ మీద నా రక్తము ఇంకనూ తడిగానే ఉన్నది, మరియు పూర్తి వెల చెల్లించబడినది! నీకు ఇకమీదట ఎటువంటి హక్కులూ లేవు. నీవు ఒలిచివేయబడ్డావు. ఆ తాళపుచెవులను నాకు ఇవ్వు!”
పిదప మధ్యాహ్నం 12:30 P.M. గంటల సమయమప్పుడు, వాక్యమును వినడానికి మనమంతా కూదివద్దాము: భూస్థాపితము 57-0420.
ప్రపంచవ్యాప్తంగానున్న ఆయనయొక్క వధువుకు ఇది ఎటువంటి ఒక ప్రాముఖ్యమైన దినముగా ఉండబోవుచున్నది కదా.
పిదప మనము మరలా 3:00 P.M. గంటలప్పుడు ప్రార్థనలో కూడుకుందాము.
ఆదివారము
మొదటిగా తనయొక్క చిన్న స్నేహితుడైన, రాబిన్ పక్షి 5:00 A.M. గంటలకు ఆయనను లేపిన ఆ ఉదయమున సహోదరుడు బ్రెన్హామ్ గారు లేచినట్లే మనము కూడా తెల్లవారుజామున లేద్దాము. యేసును మృతులలోనుండి లేపినందుకు మనము ప్రభువుకు కృతఙ్ఞతలు చెల్లించుదాము:
ఈ ఉదయము ఐదు గంటలప్పుడు, ఎర్రని రొమ్ముగల నా చిన్న స్నేహితుడు కిటికీ వద్దకు ఎగిరి వచ్చి మరియు నన్ను నిద్రలేపాడు. "ఆయన లేచాడు,” అని చెప్తూ, దాని చిన్న గుండె పగిలిపోతుందేమో అన్నట్లు అగుపించినది.
మనము మరొకసారి 9:00 A.M. గంటలప్పుడు మరియు 12:00 P.M. గంటలప్పుడు, మన ప్రార్థనా గొలుసులో కూడుకుందాము, ఒకరికొరకు ఒకరము ప్రార్థిస్తూ మరియు దేవుని స్వరమును వినడానికి మనల్ని మనము సిద్ధపరచుకుందాము.
మనము 12:30 P.M. గంటలప్పుడు, మన ఈస్టరు వర్తమానమును వినడానికి కూడివద్దాము: నిజమైన ఈస్టరు ముద్ర 61-0402.
మనము మరొకసారి 3:00 P.M. గంటలప్పుడు, ప్రార్థనలో కూడుకుందాము, ఆయనతో మరియు ప్రపంచవ్యాప్తంగా ఆయనయొక్క వధువుతో ఆయన మనకిచ్చినట్టి అద్భుతమైన వారాంతమును బట్టి ఆయనకు కృతఙ్ఞతలు చెల్లించుదాము.
ఇతర దేశాలలో ఉన్న, నా సహోదరీ సహోదరులారా, గడిచిన సంవత్సరములో వలెనే, ఈ ప్రణాళికలోనున్న ప్రార్థనా సమయాలన్నిటికీ జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా, మాతో ఐక్యమవ్వడానికి మిమ్మల్ని ఆహ్వానించేందుకు నేను ఇష్టపడుచున్నాను. అయితే ఎలాగైనను, జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా, గురువారము, శుక్రవారము, మరియు శనివారము మధ్యాహ్నము టేపులను ప్లే చేయడం మీలో అనేకులకు చాలా కష్టంగా ఉంటుందని నేను గ్రహిస్తున్నాను, కావున దయచేసి మీకు అనుకూలంగా ఉన్న సమయానికి ఆ వర్తమానములను ప్లే చేసుకోవడానికి సంకోచించకండి. ఏది ఏమైనను, మన ఆదివారపు వర్తమానమును వినడానికి, ఆదివారమునాడు, జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా 12:30 P.M. గంటలప్పుడు, మనమందరము కూడుకోవాలని, నేను కోరుచున్నాను.
క్రియేషన్స్ ప్రాజెక్టులు, జర్నలింగ్, మరియు YF యూత్ ఫౌండేషన్ క్విజ్ లో పాలిభాగస్తులు అవ్వడానికి మిమ్మల్ని మరియు మీ పిల్లల్ని ఆహ్వానించుటకు నేను ఇష్టపడుచున్నాను, మీ కుటుంబమంతా కలిసి వాటిలో ఆనందించగలరు. మనము వినే వాక్యము మీదనే అవన్నియు ఆధారపడి ఉన్నాయి గనుక మీరు వాటిని బాగా ఇష్టపడతారని మేము అనుకుంటున్నాము.
వారాంతపు ప్రణాళిక నిమిత్తము, ప్రభురాత్రి భోజనముకై సిద్ధపరచుట కొరకు సమాచారము, క్రియేషన్స్ ప్రాజెక్టుల కొరకు అవసరమైన వస్తువులు, ఈస్టర్ క్విజ్ లు, మరియు ఇంకా ఇతర సమాచారము కొరకు, క్రింద ఇవ్వబడిన లింకులను దర్శించండి.
ఈస్టరు వారాంతమున, ఫోటోలను తీయడానికి, ఈ దినమునకు కొటేషన్ ను వినడానికి, థ టేబుల్ యాప్ నుండి, లైఫ్ లైన్ యాప్ నుండి, లేదా డౌన్ లోడ్ చేసుకొనుటకు ఇవ్వబడిన లింకునుండి టేపులను వినడానికి తప్ప మిగతా సమయమప్పుడు మన ఫోనులను స్విచ్ ఆఫ్ చేసేద్దాము.
ఆరాధన, స్తుతులు, మరియు స్వస్థతతో నిండిన ఒక వారాంతము కొరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వధువుతో కూడివచ్చుటకు మిమ్మల్ని మరియు మీ కుటుంబమును ఆహ్వానించడం నాకు ఎంతో ఘననీయముగా ఉన్నది. ఇది మీ జీవితాన్ని ఎప్పటికీ మార్చివేసే ఒక వారంతమైయున్నదని నేను నిజంగా నమ్ముచున్నాను.
సహోదరుడు జోసఫ్ బ్రెన్హామ్
ప్రసంగముయొక్క ఆడియో
ఈస్టరు వారాంతపు ప్రసంగములు క్రింద ఇవ్వబడినవి. గురువారపు ప్రభురాత్రి భోజనము/పాదపరిచర్య కూడిక డౌన్ లోడ్ లో భాగమైయున్నవి.
గురువారము- 6:00 PM (స్థానిక సమయం)
62-0204ప్రభు సంస్కారము (ప్రత్యేకమైన ప్రభురాత్రి భోజనము & పాద పరిచర్య కార్యక్రమము)
శుక్రవారము - 12:30 PM (స్థానిక సమయము)
60-0925కల్వరిలో ఆ దినము
శనివారము- 12:30 PM (స్థానిక సమయము)
57-0420భూస్థాపితము
ఆదివారము- 12:30 PM (జఫర్సన్ విల్ కాలమానం)
61-0402నిజమైన ఈస్టరు ముద్ర