Sun Apr 26, 2020 10:00 AM EDT
ప్రియమైన రాజ్య సహపౌరులారా,
ఈ ఈస్టరు వధువు ఎన్నడూ కలిగిలేనంత గొప్ప ఈస్టరుగా ఉండబోతున్నదని ఖచ్చితంగా చెప్పవచ్చు. మనము కుమారునియొక్క సన్నిధిలో కూర్చొని, పరిపక్వము చెందుతూ, మనము ఎవరమన్నది గుర్తిస్తూ ఉన్నాము. ఆయనయొక్క వాక్యము, ఆయనయొక్క స్వరము, కేక వేయుచు, పక్షిరాజు పక్షిరాజుతో మాట్లాడుతూ, మనల్ని మన వివాహ విందునకు పిలుస్తుండగా, యేసుక్రీస్తు యొక్క సర్వపరిపూర్ణత మనలో ప్రతియొక్కరియందు ప్రత్యక్షపరచబడుచున్నది.
ప్రతీ సంవత్సరము ఈ సమయానికి రానున్న ఈస్టరు వారాంతము గురంచి వధువు గొప్ప ఎదురుచూపుతో ఉంటుంది. ఇది ప్రపంచమంతటి నుండి వరుసగా నాలుగు రోజులు, ఆయనను ఆరాధిస్తూ, ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఆయనను స్తుతించుటకు, ఆయన మనల్ని ఐక్యము చేసే సమయమైయున్నది; ఏలయనగా ఆయన తిరిగిలేచి మరియు మనలో ప్రతీయొక్కరిలో జీవిస్తున్నాడు. పెండ్లి కుమారుడు మరియు వధువు ఒక్కటవుతున్నారు.
మన చుట్టూ ఉన్న లోకసంబంధమైన కార్యములన్నిటికీ తలుపులు మూసివేసి మరియు ఆయనతో మాత్రమే సమయము గడపడానికి ఈ ప్రత్యేకమైన సమయమును ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. మనము ఆయనతో మన స్వంత ప్రపంచమును సృష్టించుకొనుచుండగా, ఈ లోకపు పరధ్యానాలు ఏవీ ఉండకూడదు. మన తలుపులు మూసివేసుకుని, మన పరికరములను మరియు అలాగే ఆయన నుండి మన దృష్టిని మళ్ళించే దేనినైనా ఆపివేద్దాము.
ఆయనకు మరింత దగ్గరగా ఉండాలన్నదే మనలో ప్రతీయొక్కరికీ ఉన్న అత్యంత గొప్ప కోరికయైయున్నది. మనము ఆయన కొరకు మరింతగా ప్రతిష్ఠించబడిన జీవితమును జీవించాలని; ఎల్లప్పుడూ ఆయనయొక్క పరిపూర్ణమైన చిత్తములో ఉండాలని కోరుతున్నాము. ఆయనయొక్క రాకడ కొరకు సిద్ధంగా ఉండాలని కోరుతున్నాము. ఈ ప్రపంచములోనైనా, లేదా మన జీవితములోనైనా, దీనికంటే ప్రాముఖ్యమైనది ఏదియు లేదు.
ఆయనతో సమయము గడపడానికి, ఆయనతో మాట్లాడటానికి మరియు ఆయనను ధ్యానించడానికి ఆయన మనకు ఈ ప్రత్యేకమైన సమయమును ఇచ్చాడు. ఆయన సన్నిధిలో చేరి మరియు ఆయన తట్టు మన హృదయములను తెరువడానికి ఈ సమయమును ఇచ్చాడు. ఆయనయొక్క వధువునకు ఇది జీవితమును మార్చివేసేదిగా ఉంటుంది!
మీలో పిల్లలను, కుటుంబమును, మరియు మనము కలిగియుండే ఇతర బాధ్యతలను కలిగియున్న కొందరికి అది కష్టమవుతుందని ఆయనకు తెలుసు, కానీ మనకు ఖాళీ దొరికిన ప్రతీ క్షణమును ఆయనతో మాట్లాడటానికి, ఆయనకు దగ్గరవ్వడానికి, ఆయనకు మన హృదయాలను తెరవడానికి వినియోగిస్తే, ఆయనతో మన ప్రయాణంలో ఎంతో మార్పు వస్తుంది, ఎంతగా అంటే మనమిక ఇదివరకు లాగా ఉండము.
మోషే దినములలో ఆయన తన పిల్లలను తమ గృహములలో చేర్చినప్పుడు, రక్తము పూయబడి మరియు వారు తమ నిర్గమము కొరకు సిద్ధపడుచుండగా ఆయన చేసినట్లే; ఆయన సిద్ధపరచిన ఈ ప్రత్యేకమైన ఈస్టరు వారాంతము మనలో ప్రతియొక్కరికీ ఆ విధంగానే ఉంటుంది.
గురువారము
ఇశ్రాయేలీయుల నిర్గమునకుముందు తీసుకోబడిన పస్కాకు జ్ఞాపకార్థముగా, ప్రభువు తన శిష్యులతో ఆఖరి భోజనమును చేసినది గురువారము రాత్రియేయైయున్నది. మన పవిత్రమైన వారాంతమునకు ముందు, మన గృహములలో ప్రభువుతో సహవాసము కలిగియుండి, మరియు మన పాపముల నిమిత్తము మనల్ని క్షమించమని, మరియు మన ప్రయాణములో మనకు అవసరమున్న ప్రతిదానిని అనుగ్రహించమని ఆయనను అడగడానికి మనము ఎటువంటి ఒక అవకాశమును కలిగియున్నాము కదా.
పరలోకపు తండ్రీ, నిత్యత్వమునకు ఈవలి వవైపున, కూడుకోడానికి ఈ మరొక సమయమును బట్టి, మేము కృతజ్ఞులమైయున్నాము. మరియు ముందున్న ప్రయాణము కొరకు మాకు ధైర్యమునివ్వడానికి, ఈ ఉదయము నీ యొద్దనుండి మా బలము నూతనపరచబడాలని మేము ఎదురుచూస్తున్నాము. రానున్న దినమంతా వారిని పోషించుటకు, రాత్రి కురిపించబడిన మన్నాను తీసుకోడానికి, ఆ హెబ్రీ పిల్లలు తెల్లవారుజామున వచ్చినట్లే మేము కూడుకొనియున్నాము. ప్రయాణము కొరకు మాకు బలమునివ్వడానికి, ఆత్మసంబంధమైన మన్నా కొరకు, మేము ఈ ఉదయం కూడుకొనియున్నాము.
మనమందరము ప్రభురాత్రి భోజనము 62-0204 అనేదానిని వినడానికి సాయంత్రం 6:00 గంటల సమయమప్పుడు ప్రారంభించుకుందాము, మరియు పిదప టేపు ముగిసినప్పుడు ప్రవక్త మనల్ని మన ప్రత్యేకమైన ప్రభురాత్రి భోజనము మరియు పాదపరిచర్య కూడికలోనికి నడిపిస్తాడు, అది లైఫ్ లైన్ లో (ఆంగ్లములో) ప్లే చేయబడుతుంది, లేదంటే క్రింద ఇవ్వబడిన లింకును నొక్కడం ద్వారా మీరు ఆంగ్లములోనైనా లేదా వేరే ఏ భాషలోనైనా దానిని డౌన్‌లోడ్ చేసుకోగలరు.
శుక్రవారము
మనల్ని మనము ఆయనకు సమర్పించుకొనుచుండగా వచ్చి మరియు మన కుటుంబాలను ఆయనయొక్క పరిశుద్ధాత్మతో నింపమని ప్రభువును ఆహ్వానిస్తూ, మనము మన కుటుంబాలతో కలిసి ఉదయం 9:00 గంటల సమయమప్పుడు, మరియు పిదప మరలా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు ప్రార్థనలో ఉందాము.
మన మనస్సులు దాదాపు 2000 సంవత్సరాల క్రితమునకు, కల్వరి వద్ద ఆ దినమునకు వెళ్ళి, మరియు మన రక్షకుడు సిలువ మీద వ్రేలాడుటను చూచును గాక. ఆయన మన కొరకు చెల్లించిన ఆ గొప్ప వెలను మనము జ్ఞాపకము చేసుకుందాము. ఆయన పాపరహితుడైన దేవుని కుమారుడైయున్నాడు, అయినప్పటికినీ మన పాపములు ఆయన మీద మోపబడినందున, ఏ ఇతర వ్యక్తి కూడా భరించలేనంత బాధను ఆయన అనుభవించాల్సివచ్చింది.
ఆయన ఆయనను శిక్షింపబడినవానిగా పాతాళమునకు పంపాల్సివచ్చింది (చూశారా?) ఎందుకనగా ఆయన మన పాపములను తీసుకున్నాడు. మరియు క్రీస్తు, నీతిమంతునిగా మరణించలేదు; క్రీస్తు ఒక పాపిగా మరణించాడు. చూశారా? క్రీస్తు స్వయంగా తాను ఎన్నడూ పాపము చేయలేదు గాని, ఆయన మన పాపములను తన మీద వేసుకున్నాడు.
పిదప మధ్యాహ్నం 12:30 గంటల సమయమప్పుడు, మనము: 57-0419 పరిపూర్ణత అనే వర్తమానమును వినడానికి మన గృహములలో కూడుకుందాము.
పిదప కూడిక ముగిసిన వెంటనే, మన ప్రభువుయొక్క సిలువ మరణమునకు జ్ఞాపకార్థంగా మనము ప్రార్థనలో మరలా కూడుకుందాము.
శనివారము
మనమందరము మరొకసారి ఉదయం 9:00 గంటల సమయమప్పుడు మరియు మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు ప్రార్థనలో ఐక్యమవుదాము, మరియు మన కొరకు మన మధ్యలో ఆయన చేసే గొప్ప సంగతుల కొరకు మన హృదయాలను సిద్ధపరచుకుందాము.
ఆయన, “సాతానా, ఇటు రా!” అని అనడాన్ని నేను వినగలుగుతున్నాను. ఆయన ఇప్పుడు బాస్ అయ్యున్నాడు. ముందుకు వచ్చి, వాడి నడుము ప్రక్కనుండి మరణముయొక్కయు పాతాళముయొక్కయు తాళపుచెవులను లాక్కొని, దానిని తన నడుము ప్రక్కలో పెట్టుకున్నాడు. ఇట్లన్నాడు, “నేను నీకు హెచ్చరికను జారీ చేస్తున్నాను. నీవు ఇంతవరకు మోసం చేసింది చాలు. నేను కన్యక ద్వారా జన్మించిన సజీవ దేవుని కుమారుడనైయున్నాను. సిలువ మీద నా రక్తము ఇంకను తడిగానే ఉన్నది, మరియు పూర్తి వెల చెల్లించబడినది! నీకు ఇక మీదట ఎటువంటి హక్కులు లేవు. నీవు ఒలిచివేయబడ్డావు. నాకు ఆ తాళపుచెవులను ఇమ్ము.”
పిదప మధ్యాహ్నం 12:30 గంటల సమయమప్పుడు, మనమందరము వాక్యమును: 57-0420 భూస్తాపితము ను వినడానికి కూడుకుందాము.
ప్రపంచవ్యాప్తంగా ఆయనయొక్క వధువునకు ఇది ఎటువంటి ఒక ప్రాముఖ్యమైన రోజుగా ఉండబోవుచున్నది కదా.
పిదప కూడిక ముగిసిన వెంటనే మనము మరలా ప్రార్థనలో కూడుకుందాము.
ఆదివారము
సహోదరుడు బ్రెన్హామ్ గారు, తన చిన్న స్నేహితుడైన, రాబిన్ పిట్ట, తెల్లవారుజామున 5:00 గంటలకు తనను నిద్రలేపినప్పుడు ఎలాగైతే లేచాడో, అలాగే మనము కూడా మొదటిగా తెల్లవారుజామునే నిద్రలేద్దాము. యేసును మృతులలోనుండి లేపినందుకు మనము ప్రభువునకు కృతజ్ఞతలు చెల్లించుకుందాము:
ఈ ఉదయం ఐదు గంటలకు, ఎర్రని వక్షస్థలముగల నా చిన్న నేస్తం కిటికీ దగ్గరకు ఎగిరివచ్చి నన్ను నిద్రలేపినది. “ఆయన తిరిగి లేచాడు,” అని చెప్తూ, దాని చిన్ని గుండె పగిలిపోతుందేమో అన్నట్లుగా అగుపించినది.
ఉదయం 9:00 గంటల సమయమప్పుడు మనం మరొకసారి మన గొలుసు ప్రార్థనలో కూడుకుందాము, ఒకరి కొరకు ఒకరము ప్రార్థించుకుంటూ మరియు దేవుని స్వరమును వినడానికి మనల్ని మనము సిద్ధపరచుకుందాము.
ఉదయం 9:30 గంటలప్పుడు, మనము: 65-0418M అది సూర్యోదయము అనే మన ఈస్టరు వర్తమానమును వినడానికి కూడుకుందాము.
మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు మనము ఆయనకు మన స్వరములనెత్తి పురిగొల్పే శక్తి కొరకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుదాము.
మధ్యాహ్నం 3:00 గంటల సమయమప్పుడు, మనము మరొకసారి ప్రార్థనలో ఐక్యమై, ఆయనతో మరియు ప్రపంచవ్యాప్తంగానున్న ఆయనయొక్క వధువుతో ఆయన మనకు అనుగ్రహించినట్టి అద్భుతమైన వారాంతమును బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుదాము.
విదేశాలలో ఉన్న నా సహోదరులు మరియు సహోదరీలారా, గడచిన సంవత్సరములో వలెనే, ఈ ప్రణాళికలోని ప్రార్థనా సమయాలన్నిటికీ జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మీరు మాతో ఐక్యమవ్వాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అయితే ఎలాగైనను, గురువారము, శుక్రవారము, మరియు శనివారము మధ్యాహ్నం జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా టేపులను ప్లే చేయడం మీలో అనేకులకు చాలా కష్టంగా ఉంటుందని నేను గ్రహిస్తున్నాను, కావున ఆ వర్తమానములను మీకు అనుకూలమైన సమయములో వినడానికి దయచేసి సంకోచించకండి. ఏది ఏమైనను, మన ఆదివారపు వర్తమానమును కలిసి వినడానికి, ఆదివారమునాడు, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా ఉదయం 9:30 గంటల సమయమప్పుడు మనమందరము కలిసి కూడుకోవాలని, నేను కోరుతున్నాను.
క్రియేషన్స్ ప్రాజెక్ట్స్ లోని, జర్నలంగ్, తయారీ విధానములు వంటి కార్యక్రమాలలో పాలిభాగస్థులవ్వడానికి మిమ్మల్ని మరియు మీ పిల్లల్ని ఆహ్వానించడానికి నేను ఇష్టపడుతున్నాను, వాటిని మీ కుటుంబమంతా కలిసి ఆనందించవచ్చు. అవన్నీ కూడా ఈ వారాంతము మనము వినబోయే వాక్యము మీదనే ఆధారపడియుంటాయి గనుక మీకు అవి చాలా బాగా నచ్చుతాయని మేము అనుకుంటున్నాము.
వారాంతపు ప్రణాళిక కొరకు, ప్రభురాత్రి భోజనమునకు సిద్ధపరచుకోడం గురించిన సమాచారము కొరకు, క్రియేషన్స్ ప్రాజెక్ట్స్ కొరకు అవసరమయ్యే సామాగ్రి కొరకు, మరియు ఇతర వివరాల కొరకు, క్రింద ఇవ్వబడిన లింకులను దర్శించండి.
ఫోటోలు తీయడం, ఈ దినమునకు కొటేషన్ ను వినడం, మరియు ద టేబుల్ యాప్ లో, లైఫ్ లైన్ యాప్ లో, లేదా డౌన్‌లోడ్ చేసుకోగల లింకు ద్వారా టేపులను ప్లే చేసుకోడానికి తప్ప ఈ ఈస్టరు వారాంతములో మన ఫోనులను ఆఫ్ చేసుకుందాము.
ఆరాధన, స్తుతి మరియు స్వస్థతతో నిండిన ఒక పూర్తి వారాంతము కొరకు ప్రపంచవ్యాప్తంగానున్న వధువుతో ఐక్యమవ్వడానికి మిమ్మల్ని మరియు మీ కుంటుంబాన్ని ఆహ్వానించడం నాకెంతో గౌరవప్రదమైన విషయముగా ఉన్నది. ఇది నిజంగా ఎప్పటికీ మీ జీవితాన్ని మార్చివేసే ఒక వారాంతమైయున్నదని నేను నమ్ముతున్నాను.
సహోరదుడు జోసఫ్ బ్రెన్హామ్
కూడిక ఆడియో
ఈస్టరు వారాంతమునకు ప్రసంగములు క్రింద ఇవ్వబడినవి. గురువారపు ప్రభురాత్రి భోజనము/పాద పరిచర్య డౌన్‌లోడ్ లో భాగమైయున్నది.
గురువారము- 6:00 PM (స్థానిక కాలమానం ప్రకారంగా)
62-0204ప్రభురాత్రి భోజనము(ప్రత్యేక ప్రభురాత్రి భోజనము & పాదపరిచర్య కూడిక)
శుక్రవారము - 12:30 PM (స్థానిక కాలమానం ప్రకారంగా)
57-0419పరిపూర్ణత
శనివారము- 12:30 PM (local time)
57-0420భూస్థాపితము
ఆదివారము- 9:30 AM (జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా)
65-0418Mఅది సూర్యోదయము