భద్రము చేయబడిన ఉత్తరములు
18, ఏప్రిల్ 2025, శుక్రవారం

ప్రియమైన వధువా, ఈ రోజు మనమందరము కూడుకొని మరియు 63-0323 ఆరవ ముద్ర అను వర్తమానమును విందాము. అది జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:30pm గంటల సమయమప్పుడు, వాయిస్ రేడియోలో ప్లే చేయబడుతుంది, అయితే విదేశములలో ఉన్నవారు, మీ కుటుంబ ప్రణాళికకు సరిపోయే ఏ సమయములోనైనా దానిని వినడానికి సంకోచించకండి.

సహోదరుడు జోసఫ్ బ్రెన్హామ్

సంబంధిత కూడికలు
15, ఏప్రిల్ 2025, మంగళవారం

క్రీస్తుయొక్క ప్రియమైన వధువా,

ఈ ఈస్టరు వారాంతమున వధువు ఎటువంటి ఒక మహిమకరమైన సమయమును కలిగియుంటుంది కదా. అది మన జీవితములలో ముఖ్య ఘట్టములలో ఒకటిగా ఉంటుందని; మనమెన్నడూ మర్చిపోలేని ఒక సమయముగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఒక అత్యంత-ముఖ్యమైన వారాంతము.

మనము మన పరికరములన్నిటినీ ఆపివేసి మరియు లోకసంబంధమైన అంతరాయములన్నిటినీ ఆపివేయడం ద్వారా బయటి ప్రపంచమునకు మన తలుపులను మూసివేసి, మరియు మనం కేవలం మన జీవితములను మరలా ఆయనకు ప్రతిష్ఠించుకొనుచుండగా, ప్రతీ ఈస్టరు వధువునకు ఒక ప్రత్యేకమైన సమయముగా ఉండినది. మనము ప్రతి రోజు ఆయనతో మాట్లాడి, మరియు పిదప ఆయనయొక్క వాక్యమును వినుచుండగా, అది ఆయనకు ప్రతిష్ఠించబడిన ఒక వారాంతమైయున్నది.

శత్రువు మన జీవితములలో ఎంతో అంతరాయమును కలుగజేసాడు మరియు జీవితములోని అనేక విషయాలతో తీరికలేకుండా చేసాడు ఎంతగా అంటే అసలు లోకమును పూర్తిగా ప్రక్కన పెట్టి ఆయనతో మాట్లాడటం ఎంతో కష్టంగా మారిపోయినది. చివరికి వాక్యమును వినడానికి మనము ఉపయోగిస్తున్న పరికరాలను సైతం, సాతానుడు మన సమయమును వృధా చేయడానికి ఉపయోగిస్తాడు.

అయితే ఈ వారాంతము భిన్నముగాను, మరియు మనము ముందెన్నడూ కలిగిలేనటువంటి ఈస్టరు వారాంతముగాను ఉంటుంది.

ముద్రలు వినాలని ప్రభువు నా హృదయములో పెట్టినప్పుడు, తేదీలు ఎలా వస్తాయి అనేదాని గురించి నాకు కొంచెమైనా అవగాహన లేదు. అయితే ఎప్పటిలాగానే, ఆయనయొక్క సమయము పరిపూర్ణమైనది. రెండు ఆదివారముల క్రితం, ప్రవక్తగారి పుట్టినరోజైనట్టి, 6వ తేదీన, పక్షిరాజు కాలమైనట్టి, 4వ ముద్రను వినే భాగ్యమును మనము కలిగియున్నాము; అది ఎంత సముచితంగా ఉన్నది కదా.

అయితే ఇప్పుడు, ప్రభువు మన కొరకు ఇంకా ఎక్కువ కలిగియున్నాడు. నేను చెప్పినట్లుగా, ముద్రలను ప్లే చేయమని ప్రభువు నా హృదయంలో పెట్టినప్పుడు, ఆ శీర్షికలో 10 వర్తమానములు ఉన్నాయి గనుక వాటిని వినడం పూర్తి చేయుటకు అనేక వారములు పడుతుందని నేను ఎరిగియున్నాను.

నేను క్యాలెండరు వైపు చూడగా, మనము ఆ శీర్షికయంతటినీ వినడం పూర్తి చేయడానికిముందే ఈస్టరు వస్తుందని నేను చూసాను. మనము ముద్రలను వినడం ఆపవలసియుంటుందేమో మరియు ఈస్టరు కొరకు ఆయన నాకు వర్తమానములను ఇస్తాడేమో అని, నాలో నేను అనుకున్నాను.

ఒక్క క్షణములోనే…అది పరిపూర్ణముగా ఉంటుందని నేను చూసాను. ఈస్టరు ఆదివారపు ఉదయమున ఏడవ ముద్ర ప్లే చేయబడుతుండే విధంగా మనము ముద్రలను ప్లే చేయడం కొనసాగించవచ్చును. నేను దానిని నమ్మలేకపోయాను, అది ప్రణాళికలో పరిపూర్ణముగా సరిపోయినది. సరిగ్గా అప్పుడే, ప్రభువా, ఇది నీవే అని నేను తెలుసుకున్నాను.

ఒకరితోనొకరము, మరియు ఆయనతోను కలిసి మనము కలిగియుండే మన ఈస్టరు సమయము కొరకు నేను ఎంతో ఉత్సాహభరితుడనయ్యాను మరియు గొప్ప ఎదురుచూపుతో ఉన్నాను. ఆయనే మన కొరకు ప్రణాళికను తయారు చేసాడని నాకు తెలుసు.

అందునుబట్టి, ప్రభువు చిత్తమైనయెడల, మనము మన ప్రత్యేకమైన ఈస్టరు వారాంతముగుండా ముద్రలను వినడం కొనసాగిస్తాము.

 

గురువారము

ఇశ్రాయేలు పిల్లలయొక్క నిర్గమమునకు ముందు జరిగినట్టి పస్కాకు జ్ఞాపకార్థముగా, ప్రభువైన యేసు తన శిశువులతో కలిసి ఆఖరి భోజనమును చేసినది గురువారము రాత్రియైయున్నది. మన పవిత్రమైన వారాంతమునకు ముందు, మనము మన గృహములలో ప్రభువుతో ప్రభురాత్రి భోజనమును కలిగియుండి, మన పాపములను క్షమించమని, మరియు మన ప్రయాణములో మనకు అవసరమైయున్న సమస్తమును మనకు అనుగ్రహించమని కోరడానికి మనము ఎటువంటి అవకాశమును కలిగియున్నాము కదా.

ప్రభువా, దానిని దయచేయుము. రోగులను స్వస్థపరచుము. అలసినవారికి ఆదరణ దయచేయుము. బాధింపబడినవారికి ఆనందము దయచేయుము. అలసినవారికి విశ్రాంతి దయచేయుము, ఆకలిగొనుచున్నవారికి ఆహారమును, దప్పిగొనుచున్నవారికి త్రాగుటకును, విచారముతో నింపబడినవారికి ఆనందమును, సంఘమునకు శక్తిని దయచేయుము. ప్రభువా, ఆయనయొక్క విరువబడిన శరీరమును సూచిస్తున్న ప్రభురాత్రి భోజనమును తీసుకొనుటకు మేము సిద్ధపడుచుండగా, ఈ రాత్రి యేసును మా మధ్యలోనికి తీసుకొనిరమ్ము. ప్రభువా, ఒక అసాధారణమైన విధానములో ఆయన మమ్మల్ని దర్శిస్తాడని, మేము ప్రార్థిస్తున్నాము...

ప్రభువా, ఇతరులను ఆశీర్వదించుము, ప్రపంచవ్యాప్తంగా, ప్రభువుయొక్క రాకడ కొరకు ఆనందముతో వేచియుండి, దివిటీలను చక్కపరచుకొని, మరియు పొగగొట్టములను శుభ్రపరచుకొనియున్నవారిని, మరియు చీకటి స్థలములలో ప్రకాశిస్తున్న సువార్త వెలుగును ఆశీర్వదించుము.

మనందరము సహవాసము 62-0204 అను వర్తమానమును వినడానికి, మీ స్థానిక కాలమానం ప్రకారంగా సాయంత్రం 6:00 P.M గంటల సమయమప్పుడు ప్రారంభించుదాము, మరియు పిదప ప్రవక్తగారు మనల్ని మనయొక్క ప్రత్యేకమైన ప్రభురాత్రి భోజనము మరియు పాద పరిచర్యలోనికి మనల్ని నడిపిస్తారు, అది లైఫ్ లైన్ యాప్ లో (ఆంగ్లములో) ప్లే చేయబడుతుంది, లేదా క్రింద ఇవ్వబడిన లింకును నొక్కడం ద్వారా మీరు ఆంగ్లములోనైనా లేదా ఇతర భాషలలోనైనా ఆ కూడికను డౌన్లోడ్ చేసుకోవచ్చును.

వర్తమానము తర్వాత, మనము మన గృహములలో మన కుటుంబాలతో కూడుకొని మరియు ప్రభువు భోజనమును తీసుకుంటాము.

 

శుక్రవారము

మనల్ని మనము ఆయనకు ప్రతిష్ఠించుకొనుచుండగా మనతో ఉండమని మరియు మన కుటుంబాలను పరిశుద్ధాత్మతో నింపమని ప్రభువును ఆహ్వానిస్తూ మనము ఉదయం 9:00 A.M. గంటల సమయమప్పుడు, మరియు పిదప మరలా మధ్యాహ్నం 12:00 P.M. గంటల సమయమప్పుడు, మన కుటుంబాలతో కలిసి ప్రార్థనలోనికి ప్రవేశించుదాము.

మన మనస్సులు, సుమారు 2000 సంవత్సరాల క్రితం, కల్వరి వద్ద జరిగిన ఆ దినముయొద్దకు వెళ్ళి మరియు మన రక్షకుడు సిలువపై వ్రేలాడుటను చూచును గాక, మరియు పిదప అదే విధంగా ఎల్లప్పుడూ తండ్రికి ఇష్టమైనదానినే చేయడానికి మనల్ని మనము సమర్పించుకొందుము గాక:

మరియు ఈ రోజు, ఎంతో ప్రాముఖ్యమైనదైయుండగా, అత్యంత గొప్ప దినములలో ఒకటైయుండగా, ఆ రోజు మనకు ఏమైయున్నదనే మూడు భిన్నమైన విషయాలను మనము చూద్దాము. మనము కొన్ని వందల విషయాలను తీసుకోవచ్చును. అయితే, ఈ ఉదయం, కల్వరి మనకు ఏమైయున్నదని, తదుపరి కొన్ని నిమిషములు, మనము చూడగోరుతున్న మూడు భిన్నమైన, ముఖ్యమైన సంగతులను మాత్రమే నేను ఎన్నుకున్నాను. మరియు అది ఇక్కడున్న ప్రతి పాపిని ఖండిస్తుందని; ప్రతి పరిశుద్ధుడిని తన మోకాళ్ళ మీద పడునట్లు చేస్తుందని; ప్రతి వ్యాధిగ్రస్తుడిని దేవుని వైపునకు తన విశ్వాసమును పెంచుకొని, మరియు స్వస్థపరచబడి, వెళ్ళునట్లు చేస్తుందని; ప్రతి పాపి, రక్షించబడునట్లును; భక్తి విడచిన ప్రతి వ్యక్తి తిరిగివచ్చి, మరియు తన విషయమై తాను సిగ్గుపడునట్లును; మరియు ప్రతి పరిశుద్ధుడు, ఆనందిస్తూ, క్రొత్త పట్టును మరియు క్రొత్త నిరీక్షణను పొందుకునేటట్లును చేస్తుందని నేను ప్రార్థిస్తున్నాను.

పిదప మధ్యాహ్నం 12:30 P.M. గంటల సమయమప్పుడు, దీనిని వినడానికి మనము మన గృహములలో కూడుకుందాము: 63-0323 ఆరవ ముద్ర.

పిదప కూటము ముగిసిన వెంటనే, మన ప్రభువుయొక్క సిలువ మరణమునకు జ్ఞాపకార్థముగా మనము ప్రార్థనలో మరలా కూడుకుందాము.

 

శనివారము

మరొకసారి మనమందరము ఉదయం 9:00 A.M. గంటల సమయమప్పుడు మరియు మధ్యాహ్నం 12:00 P.M. గంటల సమయమప్పుడు ప్రార్థనలో కూడుకొని, మరియు ఆయన మన కొరకు మన మధ్యన చేయనైయున్న గొప్ప కార్యముల కొరకు మన హృదయములను సిద్ధపరచుకుందాము.

ఆయన ఇట్లు చెప్పడాన్ని నేను వినగలుగుచున్నాను, “సాతానా, ఇటు రా!” ఇప్పుడు ఆయన యజమానియైయున్నాడు. ముందుకు జరిగి, ఆ మరణము మరియు పాతాళముయొక్క తాళపుచెవిని వాని ప్రక్కనుండి లాక్కొని, మరియు దానిని తన ప్రక్కలో తగిలించుకున్నాడు. “నేను నీకు హెచ్చరిక ఇవ్వాలనుకుంటున్నాను. నీవు ఎంతో కాలంగా ఒక మోసగాడివైయున్నావు. నేను కన్యక-ద్వారా జన్మించినట్టి సజీవ దేవుని కుమారుడినైయున్నాను. సిలువ మీద నా రక్తము ఇంకను తడిగానే ఉన్నది, మరియు పూర్తి వెల చెల్లించబడినది! నీకు ఇకమీదట ఎటువంటి హక్కులు లేవు. నీవు ఒలిచివేయబడ్డావు. నాకు ఆ తాళపుచెవులను ఇవ్వు!”

పిదప మధ్యాహ్నం 12:30 P.M. గంటల సమయమప్పుడు, వాక్యమును వినడానికి మనమందరము కూడుకుంటాము: 63-0324m ముద్రల మీద ప్రశ్నలు మరియు జవాబులు.

ప్రపంచ వ్యాప్తంగానున్న ఆయనయొక్క వధువునకు ఇది ఎటువంటి ఒక అత్యంత-ముఖ్యమైన దినముగా ఉండబోవుచున్నది కదా.

పిదప కూటము ముగిసిన వెంటనే మనము తిరిగి ప్రార్థనలో కూడుకుందాము.

 

ఆదివారము

ఆయనయొక్క చిన్న స్నేహితుడైన, రాబిన్ పక్షి, ఉదయం 5:00 A.M. గంటల సమయానికి ఆయనను మేల్కొల్పినప్పుడు, సహోదరుడు బ్రెన్హామ్ గారు లేచినట్లే మనము కూడా మొదట తెల్లవారుజామునే మేల్కొందాము. యేసును మృతులలోనుండి లేపినందుకు మనము కేవలం ప్రభువునకు కృతఙ్ఞతలు చెల్లించుదాము:

ఈ ఉదయం ఐదు గంటలప్పుడు, ఎర్రని రొమ్ముగల నా చిన్న స్నేహితుడు కిటికీ దగ్గరికి ఎగురుకుంటూ వచ్చి మరియు నన్ను నిద్రలేపాడు. "ఆయన లేచియున్నాడు,” అని చెప్తూ, దాని చిన్న గుండె బ్రద్దలైపోద్దేమో అన్నట్లు అగుపించినది.

ఉదయం 9:00 A.M. గంటల సమయమప్పుడు మరియు మధ్యాహ్నం 12:00 P.M. గంటల సమయమప్పుడు, మనము మరలా మన ప్రార్థన గొలుసులో కూడుకొని, ఒకరి కొరకు ఒకరము ప్రార్థించుకుంటూ మరియు దేవునియొక్క స్వరమును వినడానికి మనల్ని మనము సిద్ధపరచుకుందాము.

మధ్యాహ్నం 12:30 P.M. గంటల సమయమప్పుడు, మన ఈస్టరు వర్తమానమును వినడానికి మనము కూడుకుంటాము: 63-0324e ఏడవ ముద్ర.

మధ్యాహ్నం 3:00 P.M. గంటల సమయమప్పుడు, మనము మరలా ఒకసారి ప్రార్థనలో ఐక్యమై, ఆయనతోను మరియు ప్రపంచ వ్యాప్తంగానున్న ఆయనయొక్క వధువుతోను ఆయన మనకు అనుగ్రహించిన అద్భుతమైన వారాంతము కొరకై ఆయనకు కృతఙ్ఞతలు చెల్లించుదాము.

విదేశాలలో ఉన్న నా సహోదరీ సహోదరులకు చెప్తున్నాను, గడచిన సంవత్సరము వలెనే, ఈ ప్రణాళికలో ఉన్న ప్రార్థనా సమయములన్నిటికీ జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా, మాతో ఐక్యమవ్వడానికి మిమ్మల్ని ఆహ్వానించుటకు నేను ఇష్టపడుచున్నాను. ఏది ఏమైనను, గురువారము, శుక్రవారము, మరియు శనివారము మధ్యాహ్నము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా టేపులను ప్లే చేయడం మీలో చాలా మందికి ఎంతో కష్టమని, నేను గ్రహిస్తున్నాను, కావున దయచేసి మీకు అనుకూలమైన సమయములో ఆ వర్తమానములను ప్లే చేసుకోడానికి సంకోచించకండి. ఎలాగైనను, కలిసి మన ఆదివారపు వర్తమానమును వినడానికి, ఆదివారము మాత్రం జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా, మధ్యాహ్నం 12:30 P.M. గంటల సమయమప్పుడు, మనమందరము ఏకముగా కూడుకోవాలని నేను కోరతాను.

క్రియేషన్స్ ప్రాజెక్టులు, జర్నలింగ్, మరియు యంగ్ ఫౌండేషన్ క్విజ్ లలో కూడా మీరు మరియు మీ పిల్లలు పాలిభాగస్థులవ్వాలని మిమ్మల్ని ఆహ్వానించుటకు నేను ఇష్టపడుచున్నాను, వాటిని మీ కుంటుంబమంతా కలిసి ఆనందించవచ్చును. అవన్నియు ఈ వారాంతములో మనము వినే వాక్యము మీదనే ఆధారపడియున్నవి గనుక మీరు వాటిని ఇష్టపడతారని మేము అనుకుంటున్నాము.

వారాంతపు ప్రణాళిక కొరకు, ప్రభురాత్రి భోజనమునకు సిద్ధపరచుకొనుటకై కావలసిన సమాచారము కొరకు, క్రియేషన్స్ ప్రాజెక్టులకై అవసరమయ్యే పదార్థముల కొరకు, ఈస్టర్ క్విజ్ లు, మరియు ఇతర సమాచారము కొరకు, క్రింద ఇవ్వబడిన లింకులను చూడండి.

ఫోటోలు తీసుకోడానికి, ఈ దినమునకు కొటేషన్ ను వినడానికి, ద టేబుల్ యాప్ నుండి, లైఫ్ లైన్ యాప్ నుండి, లేదా డౌన్లోడు చేసుకోగల లింకు నుండి టేపులను వినడానికి తప్ప మిగతావాటన్నిటికీ మన ఫోనులను ఆపివేసుకుందాము.

ఆరాధనతో, స్తుతులతో మరియు స్వస్థతతో నిండిన ఒక వారాంతము కొరకు ప్రపంచ వ్యాప్తంగానున్న వధువుతో కూడివచ్చుటకు మిమ్మల్ని మరియు మీ కుటుంబమును ఆహ్వానించడం నాకు ఒక గొప్ప భాగ్యమైయున్నది. ఇది నిజముగా మీ జీవితమును ఎప్పటికీ మార్చివేసేటటువంటి ఒక వారాంతమైయున్నదని నేను నమ్ముచున్నాను.

సహోదరుడు జోసఫ్ బ్రెన్హామ్

 

 


ఆడియో కూడిక

ఈస్టరు వారాంతము కొరకైన వర్తమానములు క్రింద ఉన్నాయి. గురువారపు ప్రభురాత్రి భోజనము/పాద పరిచర్య డౌన్లోడులో భాగమైయున్నవి.

గురువారము- 6:00 PM (స్థానిక సమయము)

62-0204
ప్రభురాత్రి భోజనము (ప్రత్యేక ప్రభురాత్రి భోజనము & పాద పరిచర్య)
1 గంట 51 నిమిషములు కూడికను చూపించు


శుక్రవారము - 12:30 PM (స్థానిక సమయము)

63-0323
ఆరవ ముద్ర
2 గంటల 40 నిమిషములు కూడికను చూపించు


శనివారము- 12:30 PM (స్థానిక సమయము)

63-0324M
ముద్రల మీద ప్రశ్నలు మరియు జవాబులు
3 గంటల 5 నిమిషములు కూడికను చూపించు


ఆదివారము- 12:30 PM (జఫర్సన్విల్ కాలమానం ప్రకారముగా)

63-0324E
ఏడవ ముద్ర
2 గంటల 33 నిమిషములు కూడికను చూపించు
సంబంధిత కూడికలు
12, ఏప్రిల్ 2025, శనివారం

విశ్రాంతినొందుచున్న ప్రియమైన వారలారా,

మనమిక్కడ ఉన్నాము. మనము వచ్చేసాము. ఈ వర్తమానముయొక్క మన ప్రత్యక్షత దేవుని యొద్దనుండి వస్తుందని వాక్యముయొక్క నిర్థారణ ఋజువు చేసినది. టేపులలో ఉన్న దేవునియొక్క స్వరముతో నిలిచియుండుట ద్వారా మనము ఆయనయొక్క పరిపూర్ణ చిత్తములో ఉన్నాము.

ప్లేను నొక్కడం ఎంత ప్రాముఖ్యము? మనము టేపులలో వినుచున్న మాటలు ఎంతో గుర్తించదగినవి, ఎంతో పవిత్రమైనవి, ఎంతగా అంటే స్వయంగా దేవుడే వాటిని ఒక దేవదూతకు అప్పగించుటకు నమ్మికయుంచలేదు…ఆయనయొక్క పరలోకపు దేవదూతలలో ఒకరికి ఇవ్వడానికైనా నమ్మికయుంచలేదు. అది ప్రత్యక్షపరచబడి మరియు ఆయనయొక్క ప్రవక్తచేత ఆయనయొక్క వధువునకు తీసుకొనిరాబడవలసియున్నది, ఎందుకనగా దేవునియొక్క వాక్యము వారియొద్దకే, అనగా, ఆయనయొక్క ప్రవక్తయొద్దకు మాత్రమే వస్తుంది.

దేవుడు ముద్రలను చీల్చివేసి, వాటిని ఆయనయొక్క భూమి మీదనున్న ఏడవ దూత వర్తమానికుడికి అందించాడు, మరియు ప్రత్యక్షత గ్రంథమంతటినీ ఆయనకు బయలుపరిచాడు. పిదప, దేవుడు భూమి మీదనున్న ఆయనయొక్క దూత ద్వారా మాట్లాడి మరియు ఆయనయొక్క వధువునకు సమస్తమును బయలుపరిచాడు.

ప్రతి చిన్న వివరము పలుకబడి మరియు మనకు బయలుపరచబడినది. దేవుడు మన కొరకు ఎంత ఎక్కువగా శ్రద్ధవహించాడంటే ఆయన మనకు కాలము ఆరంభమైనప్పటినుండి ఏమి జరిగినదో చెప్పడం మాత్రమే కాదు గాని, ఆయన తనయొక్క దూత ద్వారా మాట్లాడి మరియు పరదైసువంటి స్థలములో సరిగ్గా ఇప్పుడు ఏమి జరుగుతున్నదో కూడా మనకు చెప్పాడు.

మనము ఈ భూసంబంధమైన గుడారమును విడిచిపెట్టినప్పుడు భవిష్యత్తు మన కొరకు ఏమి పట్టుకొనియుంటుంది అనుదాని విషయములో మనము చింతించాలని గాని, లేదా నిశ్చయత లేకుండా ఉండాలని గాని ఆయన కోరలేదు. కావున, ఆయనయొక్క బలమైన ఏడవ దూత, దానిని చూడగలుగుటకు, దానిని అనుభూతి చెందగలుగుటకు, ఇంకా ఆ ఆవలిన ఉన్నవారితో మాట్లాడగలుగుటకు సైతం స్వయంగా దేవుడే ఆయనను కాలమనే తెర ఆవలికి తీసుకొనివెళ్ళాడు. అది ఒక దర్శనము కాదు, ఆయన అక్కడ ఉన్నాడు.

ఆయన తిరిగివచ్చి మరియు మనకు ఇట్లు చెప్పడానికి దేవుడు ఆయనను అక్కడికి తీసుకొనివెళ్ళాడు: “నేను అక్కడ ఉన్నాను, నేను దానిని చూసాను. అది సరిగ్గా ఇప్పుడు జరుగుచున్నది…వెళ్ళిపోయిన మన తల్లులు, మన తండ్రులు, సహోదరులు, సహోదరీలు, కుమారులు, కుమార్తెలు, భార్యలు, భర్తలు, అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు, మోషే, ఏలీయా, ఇంకా పరిశుద్ధులందరు అక్కడ తెల్లని వస్త్రములు ధరించుకొని, విశ్రాంతి తీసుకొనుచు మరియు మన కొరకు ఎదురుచూస్తున్నారు”.

మనము ఇక ఎంతమాత్రము ఏడ్వము, ఎందుకనగా ఇక అంతా ఆనందమే ఉంటుంది. మనము ఇక ఎంతమాత్రము విచారముతో ఉండము, ఎందుకనగా ఇక అంతా సంతోషమే ఉంటుంది. మనమెన్నడూ మరణించము, ఎందుకనగా అదంతా జీవమైయున్నది. మనము వృద్ధులముగా మారలేము, ఎందుకనగా మనమందరము ఎప్పటికీ యవ్వనస్థులమైయుంటాము.

అది పరిపూర్ణత…మరియు పరిపూర్ణత…మరియు పరిపూర్ణతైయున్నది, మరియు మనము అక్కడికి వెళ్ళుచున్నాము!! మరియు మోషే వలె, మనము కనీసం ఒక్క డెక్కనైనా విడిచిపెట్టము, మనమందరము…మన కుటుంబమంతా వెళ్ళుచున్నాము.

ఆ బలమైన ఏడవ దూతను ప్రేమించడం ఎంత ప్రాముఖ్యము?

మరియు అది కేక వేసి, ఇట్లన్నది, “నీవు ప్రేమించిన వారందరినీ…” మరి నా సేవకు బహుమానమైయున్నది. అయితే నాకు ఎటువంటి బహుమానము అవసరములేదు. ఆయన ఇట్లన్నాడు, “నీవు ప్రేమించిన వారందరినీ, మరియు నిన్ను ప్రేమించిన వారందరినీ, దేవుడు నీకు అనుగ్రహించాడు.

దయచేసి మనము దానిని మరలా చదువుదాము: ఆయన ఏమి చెప్పాడు?…దేవుడు నీకు!! అనుగ్రహించాడు.

మరియు మనము వారితో చేరి మరియు ఇట్లు కేక వేస్తాము, “మేము దానిపై విశ్రాంతినొందుచున్నాము”

మనము మనయొక్క నిత్యమైన గమ్యమును దేనిపై ఆనబెట్టుచున్నాము? టేపులలో పలుకబడిన ప్రతి మాటపై ఆనబెట్టుచున్నాము. వధువు చేయవలసిన అత్యంత ప్రాముఖ్యమైన సంగతి ప్లేను నొక్కడమే అన్న నిజమైన ప్రత్యక్షతను అయన మనకు ఇచ్చినందుకు నేను ప్రభువునకు ఎంతో కృతజ్ఞుడనైయున్నాను.

మాతో పాటు విశ్రాంతినొందుటకు మీరు ఇష్టపడుచున్నారా? ఈ ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, దేవునియొక్క స్వరము మాతో మాట్లాడి మరియు: ఐదవ ముద్ర 63-0322 తెరుస్తున్నప్పుడు, భవిష్యత్తు ఏమి కలిగియున్నది, మనము ఎక్కడికి వెళ్ళుచున్నాము, మరియు అక్కడికి ఎలా చేరుకోవాలి అనేదాని గురించి మేము వినుచుండగా వచ్చి మాతో చేరండి.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

 

వర్తమానమును వినడానికిముందు చదువవలసిన లేఖనములు:

దానియేలు 9:20-27
అపొస్తలుల కార్యములు 15:13-14
రోమా 11:25-26
ప్రకటన 6:9-11 / 11:7-8 / 22:8-9

5, ఏప్రిల్ 2025, శనివారం

పరలోకమున-పుట్టిన ప్రియమైన పరిశుద్ధులారా,

తండ్రి ఆయనయొక్క వాక్యము ద్వారా మనల్ని సమకూర్చుచున్నాడు, మరియు ఆ ప్రత్యక్షతయొక్క నిర్ధారణ మనకు ఉత్తేజమును కలిగించుచున్నది. జగత్తుపునాది వేయబడకముందే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, ఎందుకనగా మన స్వంత ఎన్నిక ద్వారా మనము ఆయనయొక్క వాక్యమునకు విశ్వాసనీయంగా ఉంటామని ఆయన ఎరిగియున్నాడు.

అది లోతుగా నాటబడులాగున నన్ను దానిని మరలా చెప్పనివ్వండి. ఆయన కాలమంతటిగుండా చూసాడు, కాలముయొక్క ముగింపు వరకు చూసాడు, మరియు మనల్ని చూసాడు…మీరు దానిని వింటున్నారా? ఆయన నిన్ను చూసాడు, ఆయన నన్ను చూసాడు, మరియు మనల్ని ప్రేమించాడు, ఎందుకనగా మన స్వంత ఎన్నిక ద్వారా, మనము ఆయనయొక్క వాక్యముతో నిలిచియుంటాము.

సరిగ్గా అప్పుడే, ఆయన తన దూతలను మరియు కెరూబులందరినీ ఒక దగ్గరికి పిలిచి మరియు మన వైపు చూపించి మరియు ఇట్లు చెప్పియుండవచ్చును: “ఆమెనే,” “నా వధువు ఆమెనే,” “నేను వేచియున్నది వారి కొరకే!”

యోహాను వలె, ఆ కారణమును బట్టియే మనము ఈ కేకలు వేయడం మరియు అరవడం, మరియు ప్రభువుని స్తుతించడం చేస్తున్నాము, మనము క్రొత్త ద్రాక్షరసముతో ఉత్తేజింపబడ్డాము, మరియు మనము ఆయనయొక్క వధువైయున్నామని, నిస్సందేహముగా ఎరిగియున్నాము.

ఇక్కడ జఫర్సన్విల్ లో మనకు ఈ వారమంతా కురిసిన వర్షము మరియు ఉరుములతో కూడిన తుఫానుల వలె అది ఉన్నది…మనము కూడా లోకమునకు ఒక హెచ్చరికను పంపుచున్నాము.

వధువు ఒక ప్రత్యక్షతతో కూడిన తుఫానును పొందుకుంటున్నది, మరియు అది ప్రత్యక్షత వరదను ఉత్పత్తి చేస్తున్నది. వధువు తననుతాను సిద్ధపరచుకున్నది మరియు తామెవరో గుర్తించియున్నది. వెంటనే సురక్షితమైన చోటుకు వెళ్ళండి. ప్లేను నొక్కండి లేదా నశింపజేయబడండి.

మనము సింహపు కాలములో, లేదా ఎద్దు కాలములో, లేదా మనుష్యుని కాలములోనైనా జీవించడంలేదు; మనము పక్షిరాజు కాలములో జీవిస్తున్నాము, మరియు దేవుడు తన వధువును బయటకు పిలిచి మరియు ఆమెను నడిపించడానికి, మనకు ఒక బలమైన పక్షిరాజును, మలాకీ 4 ను పంపించాడు.

ఈ ఆదివారము, మనము నాలుగవ ముద్రను వినుచు ఏకముగా కూడుకొనియుండగా అది ఎంత ఖచ్చితంగా సరిపోవునట్లు ఉంటుంది కదా. అది దేవునియొక్క బలమైన పక్షిరాజు ప్రవక్తయొక్క పుట్టినరోజై యుంటుంది.

ఆయనయొక్క పక్షిరాజు వర్తమానికుడిని మనకు పంపినందుకు మనము ఈ అద్భుతమైన దినమును ఉత్సవముగా జరుపుకొని మరియు ప్రభువునకు కృతఙ్ఞతలు చెల్లించుదాము, మనల్ని బయటకు పిలిచి మరియు ఆయనయొక్క వాక్యమును బయలుపరచడానికి ఆయన అతణ్ణి పంపించాడు.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

వర్తమానము: నాలుగవ ముద్ర 63-0321

సమయము: 12:00 P.M., జఫర్సన్విల్ కాలమానం ప్రకారముగా

 

 

సిద్ధపాటులో చదువవలసిన లేఖనములు.

పరిశుద్ధ. మత్తయి 4
పరిశుద్ధ. లూకా 24:49
పరిశుద్ధ. యోహాను 6:63
అపొస్తలుల కార్యములు Acts 2:38
ప్రకటన 2:18-23, 6:7-8, 10:1-7, 12:13, 13:1-14, 16:12-16, 19:15-17
ఆదికాండము 1:1
కీర్తనలు 16:8-11
II సమూయేలు 6:14
యిర్మియా 32
యోవేలు 2:28
ఆమోసు 3:7
మలాకీ 4

29, మార్చి 2025, శనివారం

ప్రియమైన ఆత్మ సంబంధమైన హవ్వా,

ఈ రోజు నా ఉత్తరమును దేవునియొక్క ఆటంబాంబుతో ప్రారంభించనివ్వండి; .22 తుపాకీ కాదు గాని, యేసుక్రీస్తుయొక్క వధువు కొరకైన ఒక అణుబాంబు.

ఇప్పుడు, మీరు గనుక వాటిని వ్రాసుకొనగోరితే; మంచిది, అవి మీ అందరికీ తెలుసు: యేసు, యోహాను 14:12; మరియు యోవేలు, యోవేలు 2:38; పౌలు, రెండవ తిమోతి 3; మలాకీ, 4వ అధ్యాయము; మరియు ప్రత్యక్ష్యపరచువాడైన యోహాను, ప్రకటన 10:17, 1-17. చూడండి, ఇప్పుడు సరిగ్గా ఏమి జరుగునో అదియే!

గమనిక మరియు హెచ్చరిక: మీరు నమ్ముతున్నయెడల క్రింద ఇవ్వబడిన కొటేషన్ మీకు కాదు.

“మనము దేవునియొక్క ప్రవక్తకు అతిగా ప్రాముఖ్యతను ఇస్తున్నాము.” “మీరు కేవలం ప్రవక్త చెప్పిన దానినే వింటున్నయెడల మీరు వధువు కాలేరు.” “సంఘములో టేపులు ప్లే చేయడం తప్పు.” “దీపం ముందుకు ఇవ్వబడినది; ఈ రోజు పరిచర్యను వినడమే ప్రాముఖ్యమైన విషయము.” “అందరూ ఒకేసారి ప్లేను నొక్కడమనేది ఒక సంఘశాఖయైయున్నది.”

సంఘమునకు, అదేమిటి? రూపుదాల్చిన వాక్యము మరలా ఆయనయొక్క ప్రజల మధ్యన శరీరధారియగుట! చూశారా?

కబూం…కావున ప్లేను నొక్కడం వలన, ఆయన తన వాక్యమును బయలుపరుస్తుండగా, రూపుదాల్చిన వాక్యము నేరుగా మనతో మాట్లాడుటను మనము వినగలము.

మరియు అది మీరు వినగలిగేంత ప్రాముఖ్యమైన స్వరమేమీ కాదు కదా? అని కొందరు అంటారు. అలాంటి వారి కొరకే ఈ కొటేషన్.

మరియు వారు దానిని అసలు నమ్మరు.

ప్రభువు మనకు ఆయనయొక్క వాక్య ప్రత్యక్షతను, మనము ఎవరమన్నదాని ప్రత్యక్షతను ఇచ్చిన కొలది, ఆ ప్రత్యక్షతకు వెలుపటనున్నవారందరూ దూరంగా వెళ్తారు.

నన్ను దానిని చెప్పనివ్వండి, నిజంగా, తద్వారా మీరు…అది లోతుంగా నాటబడుతుంది. ఇది అర్థం అవ్వాలని నేను కోరుతున్నాను. ఈనాడు మీతో సమస్య అదే, చూడండి, మీరు వాక్యమును ఎరుగరు! చూశారా?

ఈ వర్తమానమును ప్రసంగించడానికి మనుష్యులను అభిషేకించాడు, అయితే ఒకే ఒక్క సంపూర్ణత ఉన్నది: అది వాక్యమే. ఒక సేవకుడు చెప్పినదైనా, లేదా ఎవరు మాట్లాడినదైనా మీరు వినప్పుడు, అతడు చెప్పేది సరిగ్గా దేవునియొక్క ప్రవక్త ఇదివరకు చెప్పినదే అని నమ్మగల విశ్వాసము మీకు ఉండవలసియున్నది. వారి వాక్యము, వారి ప్రత్యక్షత, వారి అనువాదము విఫలమవ్వవచ్చును; అయితే టేపులలో ఉన్న దేవుని స్వరము ఎన్నటికీ విఫలమవ్వదు.

ప్లేను నొక్కడం ద్వారా దేవుడు సామాన్యతలో ఉండటను గురించి మాట్లాడండి…ఆయన దానిని మరలా చెప్తాడు.

వారు ఆయనను అనగా, వాగ్దానము చేయబడిన వాక్యము ద్వారా, శరీరములో ప్రత్యక్షపరచబడిన సజీవమైన వాక్యమును వారు తప్పిపోతున్నారు. ఈ కార్యములు చేయబడునని వాక్యము వాగ్దానము చేసినది. అంత్య దినములలో ఈ విధంగా ఉంటుందని, వాగ్దానము చేయబడినది.

ఆయనయొక్క ఉరుమును వినండి. ఒక ఉరుము అనగా దేవునియొక్క స్వరమైయున్నది. విలియమ్ మారియన్ బ్రెన్హామ్ గారు ఈ తరమునకు దేవునియొక్క స్వరమైయున్నాడు.

ఆ—ఆ వధువు ఇంకను ఒక ఉజ్జీవమును పొందుకోలేదు. చూశారా? ఎటువంటి ఉజ్జీవము సంభవించలేదు, వధువును కుదుపడానికి ఇంకను దేవునియొక్క ప్రత్యక్షత అక్కడ లేదు. చూశారా? ఇప్పుడు మనము దాని కొరకు ఎదురుచూస్తున్నాము. ఆమెను మరలా మేల్కొల్పడానికి, ఆ తెలియబడని ఏడు ఉరుములు అవసరమవుతాయి, చూడండి. అవును, ఆయన దానిని పంపుతాడు. ఆయన దానిని వాగ్దానము చేసాడు. ఇప్పుడు గమనించండి.

మీరు కోరినయెడల మీరు దానిని మలచగలరు, కానీ ఏడు ఉరుములు వధువునకు ప్రత్యక్షత వలన కలుగు ఉత్తేజమును మరియు ఎత్తబడు విశ్వాసమును దయచేస్తాయి, అది పరిశుద్ధాత్మ దేవుని ప్రవక్త ద్వారా మాట్లాడుటవలన మాత్రమే వచ్చును. అది సరిగ్గా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుచున్నది. దేవుడు ఆయనయొక్క వధువును వాక్యముతో ఉత్తేజపరిచాడు.

అది మాత్రమే కాదు, ఏమి చేయాలో ఆయన ఇదివరకే మన శత్రువుకు చెప్పియున్నాడు.

నీవు వారి మీద నీ చేతులను వేయవద్దు. వారు ఎక్కడికి వెళ్తున్నారో వారికి తెలుసు, ఏలయనగా వారు నా నూనెతో అభిషేకించబడ్డారు. మరియు నా నూనెతో అభిషేకించబడుటను బట్టి, వారు ఆనందపు ద్రాక్షారసమును కలిగియున్నారు, ఎందుకనగా ‘నేను వారిని మరలా లేపబోవుచున్నాను’ అనే నా వాగ్దాన వాక్యమును వారు ఎరిగియున్నారు. దానికి హానీ కలిగించవద్దు! వారిని పాడుచేయుటకు ప్రయత్నించవద్దు.

ఆయన శత్రువుకు వాడి మురికి చేతులను మన మీద వేయకూడదని చెప్పాడు. అయితే వ్యాధి ఇంకను మనపై దాడి చేయవచ్చా? అవును. మనము ఇంకను సమస్యలను కలిగియుంటున్నామా? అవును. అయితే మనము ఏమి చేయాలో కూడా ఆయన మనకు చెప్పాడు.

అది లోతుగా ఉన్నది. దానిని నెమ్మదిగా మరలా మరలా చదవండి.

ఒక వాక్యముకంటే ముందు, అది ఒక తలంపైయున్నది. మరియు ఒక తలంపు సృష్టించబడవలసియున్నది. మంచిది. కావున, దేవుని తలంపులు, ఒక వాక్యము ద్వారా పలుకబడినప్పుడు అవి సృష్టిగా మారతాయి. అది ఎప్పుడనగా ఆయన దానిని—దానిని ఒక తలంపుగా, ఆయనయొక్క తలంపుగా, నీకు ప్రదర్శించినప్పుడు, మరియు అది నీకు బయలుపరచబడినప్పుడై యున్నది. పిదప, నీవు దానిని పలికేవరకు అది ఇంకను ఒక తలంపేయైయున్నది.

ఆయన ఆలోచనలు పలుకబడినప్పుడు సృష్టిగా మారాయి. పిదప, ఆయనయొక్క ఆలోచనలు ప్రదర్శించబడి మరియు వాక్యముగా మనకు బయలుపరచబడ్డాయి. ఇప్పుడు మనము దానిని పలికేవరకు అది ఇంకను మనలో ఉన్న ఒక ఆలోచనేయైయుంటుంది. కావున మనము దానిని పలుకుతాము…మరియు దానిని నమ్ముతాము.

నేను అబ్రాహాముయొక్క రాజ సంతానమైయున్నాను. నేను క్రీస్తుయొక్క వధువునైయున్నాను. ఆయనయొక్క వధువుగా ఉండుటకు జగత్తుపునాది వేయబడకముందే నేను ఎన్నుకోబడ్డాను మరియు ముందుగా నిర్ణయించబడ్డాను, మరి ఏదియు దానిని మార్చజాలదు. బైబిలు గ్రంథములో ఉన్న ప్రతీ వాగ్దానము నాదే. అది నా కొరకైన ఆయనయొక్క వాక్యమైయున్నది. నేను ప్రతీ వాగ్దానమునకు వారసుడనైయున్నాను. నా వ్యాధులన్నిటినీ స్వస్థపరచు ప్రభువైన దేవుడు ఆయనే. నాకు అవసరమున్న ప్రతీది నాదే, దేవుడు ఆలాగు చెప్పాడు.

దేవుడు సామాన్యతలో ఉండుట: వినుటవలన, వాక్యమును వినుటవలన విశ్వాసము కలుగుతుంది. వాక్యము ప్రవక్త యొద్దకు వస్తుంది.

అందరూ వారి ఆలోచనలను, వారి ఊహలను, వారి వర్తమానమును ఋజువు చేసుకోడానికి “కొటేషన్లను” ఉపయోగించగోరుతున్నారు. మరియు వారు సరియే, నేను కూడా అలా చేస్తాను, అందునిమిత్తమే దీనిని చెప్పడానికి నేను మీకు కొటేషన్లనే ఇస్తుంటాను: టేపులతో నిలిచియుండండి. ఆ స్వరమును వినండి. ఆ స్వరము దేవుని స్వరమైయున్నది. ఇంకెవరైనా చెప్పేది కాదు గాని, టేపులలో ఉన్న ప్రతీ మాటను మీరు నమ్మవలసియున్నారు. అదియే మీరు వినవలసిన అత్యంత ప్రాముఖ్యమైన స్వరమైయున్నది.

ఇతరులు మిమ్మల్ని వారి పరిచర్య నొద్దకు, వారి సంఘమునకు, వారి అనువాదము నొద్దకు, వారి ప్రత్యక్షత నొద్దకు నడిపించుకోడానికి కొటేషన్లను ఉపయోగిస్తారు. “మీ సంఘకాపరితో నిలిచియుండండి.” (మంచిది, అది నాకు కూడా ఇష్టమే, ఎందుకనగా మేము నిలిచియుంటాము, అయితే కేవలం వేరే సంఘకాపరితోయైయున్నది.) “ఆయన మాత్రమే ప్రత్యేకమైనవాడు కాడు.” “సంఘములో టేపులను ప్లే చేయమని ఆయన ఎన్నడూ చెప్పలేదు.”

దానికి ఎటువంటి వ్యక్తిగత అనువాదమును ఇవ్వకండి. కనీసం ఊరకే సరసోక్తులు చెప్పేదియైనా కాదు గాని, ఒక స్వచ్ఛమైన, సంకరములేనిదానిని ఆయన కోరుచున్నాడు. నా భార్య వేరే ఎవరో ఒక పురుషుడితో సరసమాడటాన్ని నేను కోరుకోను. మరియు మీరు దానిని కాకుండా, ఎటువంటి హేతువులకైనా చెవి యొగ్గినప్పుడు, మీరు వింటున్నారు, మీరు సాతానుడితో సరసమాడుతున్నారు. ఆమేన్! అది మీకు భక్తిపూర్వకమైన అనుభూతి కలిగించడంలేదా? మీరు సంకరము లేనివారిగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. సరిగ్గా అక్కడే ఆ వాక్యముతో నిలిచియుండండి. సరిగ్గా దానితోనే నిలిచియుండండి. మంచిది.

నేనును నా యింటివారునుయైతే, మేము ప్లేను నొక్కి మరియు ఆయనయొక్క ఏడవ దూత వర్తమానికుడి గుండా మాట్లాడుతున్నట్టి రూపము దాల్చిన దేవుని వాక్యమును వెంబడిస్తాము. మేము దానికి మా వ్యక్తిగత అనువాదమును జతచేయము; మేము ఎటువంటి హేతువాదముతో సరసమాడము లేదా దానికి చెవియెగ్గము. అది టేపులలో పలుకబడినట్లుగానే మేము ఆ వాక్యముతో నిలిచియుంటాము. అది సామాన్యతలో ఉన్న దేవుడైయున్నాడు.

ఈ ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా, మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, మనము: మూడవ ముద్ర 63-0320 వింటుండగా మనము ఎటువంటి ఒక మహిమకరమైన సమయమును కలిగియుంటాము కదా. ఈ దినమునకైన వాక్యము కొరకు ప్రపంచ వ్యాప్తంగా మేము కూడుకొనుచుండగా మాతో చేరమని మిమ్మల్ని ఆహ్వానించడానికి నేను ఇష్టపడుతున్నాను.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

 

వర్తమానమును వినడానికిముందు చదువవలసిన లేఖనములు:

పరిశుద్ధ. మత్తయి 25:3-4
పరిశుద్ధ. యోహాను 1:1, 1:14, 14:12, 17:17
అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము
I తిమోతి 3:16
హెబ్రీ 4:12, 13:8
I యోహాను 5:7
లేవీయకాండము 8:12
యిర్మియా 32వ అధ్యాయము
యోవేలు 2:28
జెకర్యా 4:12

 

దానిని మరలా ఒకసారి స్పష్టపరచడానికి నన్ను ఈ అవకాశమును తీసుకోనివ్వండి. నేను ఐదు-మడతల పరిచర్యకు విరుద్ధంగా లేను. నేను ఐదు-మడతల పరిచర్యను నమ్ముతాను. ఒక దైవసేవకుడు చెప్పేదానిని వినడం తప్పని నేను భావించను. దేవుడు మిమ్మల్ని ఎక్కడైతే పెట్టాడో అట్టి మీ సంఘకాపరి చెప్పేదానిని మీరు వినాలని నమ్ముతాను. నేను చెప్పేది ఏమిటంటే, దేవుడు మన దినములో ఒక ప్రవక్తను పంపినాడని నేను నమ్ముతాను. దేవుడు ఆయనయొక్క ప్రవక్తకు ఆయనయొక్క వాక్యమును బయలుపరిచాడు. నేను తప్పైయుండవచ్చును, మీ సంఘకాపరి తప్పైయుండవచ్చును, కానీ (ఈ వర్తమానము సత్యమని మరియు సహోదరుడు బ్రెన్హామ్ గారు దేవునియొక్క ప్రవక్తయని మనము నమ్ముతున్నామని మనము చెప్పుకుంటున్న యెడల) అప్పుడు టేపులలో చెప్పబడినది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యున్నదని మనము తప్పక అంగీకరించవలసియున్నాము. మీరు దానిని నమ్మకపోతే, అప్పుడు మీరు ఈ వర్తమానమును నమ్మడంలేదన్నట్లే. కావున, అదియే మీరు వినవలసిన అత్యంత ప్రాముఖ్యమైన స్వరము అని నేను నమ్ముతున్నాను. నేను చెప్పేదానిని మీరు వినవలసిన అవసరంలేదు, ఇంకెవరైనా చెప్పేదానిని మీరు వినవలసిన అవసరంలేదు, కానీ టేపులలో ఉన్న ఆ స్వరమును మాత్రం మీరు తప్పక వినవలసియున్నారు.

సంబంధిత కూడికలు