ఆదివారం
04 మే 2025
60-0515E
దత్త పుత్రత్వము మొదటి భాగము

కుమారులుగా స్వీకరించబడిన ప్రియమైనవారలారా,

మనమిప్పుడు దేవునియొక్క బలమైన పదార్థములను తినుచున్నాము మరియు ఆయన వాక్యముయొక్క స్పష్టమైన అవగాహనను కలిగియున్నాము. దేవుడు మనకు ఆయన వాక్యముయొక్క సత్యమైన ప్రత్యక్షతను అనుగ్రహించాడు. మన ఆత్మసంబంధమైన మనస్సు గందరగోళమంతటి నుండి విడిపించబడినది.

ఆయన సరిగ్గా ఎవరన్నది మనకు తెలుసు. ఆయన సరిగ్గా ఏమైయున్నాడు అనేది మనకు తెలుసు. మనము సరిగ్గా ఎక్కడికి వెళ్ళుచున్నాము అనేది మనకు తెలుసు. మనము సరిగ్గా ఎవరమన్నది మనకు తెలుసు. మనము ఎవరియందు నమ్మికయుంచామన్నది మనకు తెలుసు మరియు మనము ఆయనకు అప్పగించినదానిని ఆ దినమువరకు ఆయన కాపాడగలడని ఒప్పించబడియున్నాము.

జగత్తుపునాది మొదలుకొని దాచబడియున్న మర్మములన్నిటినీ ఆయన పలికి మరియు మనకు బయలుపరిచాడు. ఇతరులు ఎల్లప్పుడూ ఏ విధంగా ఆయన ఏర్పాటు చేసిన మార్గమును త్రోసివేసి మరియు ఒక భిన్నమైన నాయకత్వము కొరకు ఆశించారో ఆయన మనకు చెప్పాడు, కానీ ఆయనయొక్క వాక్యమునకు నమ్మకముగా ఉండే ఒక చిన్న గుంపును ఆయన కలిగియుంటాడని చెప్పాడు.

ప్రపంచ వ్యాప్తంగా, వారు కార్యములను ఒకేవిధంగా కలిగియుండునట్లు ఒక్క స్థలములోనే కూడుకొనియుండరు. అయితే వారు చిన్న చిన్న గుంపులుగా భూమియందంతటా వ్యాపించియుంటారు.

మహిమ, మనము భూమియందంతట వ్యాపించియున్నాము, కానీ ప్లేను నొక్కి మరియు దేవుని స్వరము మనతో మాట్లాడుటను వినడం ద్వారా ఒక్కటిగా ఐక్యపరచబడియున్నాము.

మనము కేవలం తొంగిచూచి మరియు ఆదివారమున ఆయనయొక్క బలమైన దూతలోనుండి ఆయన మనకు ఏమి చెప్తుంటాడు అనేదానిని ముందే కొద్దిగా రుచి చూద్దాము.

నా ప్రియమైన ఎన్నుకోబడినవారలారా, మీరిప్పుడు కలిసి పరలోకపు స్థలములలో కూర్చొనియున్నారు. కేవలం బయట ఎక్కడో ఒక దగ్గర కాదు, కానీ “పరలోకపు” స్థలములలోయైయున్నది; ఒక విశ్వాసిగా అది మీ స్థానమైయున్నది. మీరు ప్రార్థించుకొని మరియు వర్తమానము కొరకు సిద్ధంగా ఉన్నారు. స్వయంగా మీరు కలిసి పరిశుద్ధులుగా కూడుకొనియున్నారు, పరిశుద్ధాత్మతో బాప్తిస్మము పొంది, దేవుని ఆశీర్వాదములతో నింపబడియున్నారు. మీరు ఎన్నుకోబడి, పిలువబడినారు, మరియు మీ ఆత్మ ఒక పరలోకపు వాతావరణములోనికి తీసుకొనిరాబడినది.

ఏమి సంభవించగలదు. నా పరిశుద్ధాత్మ ప్రతీ హృదయము మీదుగా కదలాడుతుంది. మీరు పునర్జీవమును పొంది మరియు క్రీస్తుయేసులో ఒక నూతన సృష్టిగా మారియున్నారు. మీ పాపములన్నీ రక్తము క్రిందనున్నవి. మీ చేతులు మరియు హృదయములు నా తట్టుకు ఎత్తబడి, మీరు పరిపూర్ణ ఆరాధనలో ఉన్నారు, కలిసి పరలోకపు స్థలములలో నన్ను ఆరాధించుచున్నారు.

మీరు నా ముందుజ్ఞానములో, ముందుగా ఏర్పరచబడినవారైయున్నారు, ఎన్నుకోబడినవారైయున్నారు. ముందునిర్ణయము ద్వారా ఎంపిక చేయబడి, పరిశుద్ధపరచబడి, నీతిమంతులుగా తీర్చబడినవారైయున్నారు. మీరు మోసపరచబడటం అసాధ్యము. జగత్తుపునాది వేయబడకముందే నేను మిమ్మల్ని నియమించియున్నాను. మీరు ఒక చిన్న దేవుడైయున్నారు, వాగ్దానపు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడియున్నారు; కుటుంబములోనికి జన్మించడం మాత్రమే కాదు గాని, పుత్ర స్వీకారము ద్వారా నా కుమారులు మరియు కుమార్తెలైయున్నారు.

దైవిక స్వస్థత, ముందుజ్ఞానము, ప్రత్యక్షత, దర్శనములు, శక్తులు, భాషలు, అనువాదములు, తెలివి, జ్ఞానము, మరియు సమస్తమైన పరలోకపు ఆశీర్వాదములతోను, చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషముతోను నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను.

ప్రతీ హృదయము నా ఆత్మతో నింపబడుతుంది. మీరు పరలోకపు స్థలములలో కలిసి నడుస్తారు, కలిసి కూర్చుంటారు. మీ మధ్యన ఒక్క దుష్ట తలంపు కూడా ఉండదు, ఒక్క సిగరెట్టు కూడా త్రాగబడదు, ఒక్క పొట్టి వస్త్రము కూడా ఉండదు, ఒక్క ఇది, అది లేదా ఇంకేదైనను ఉండదు, ఒక్క దుష్ట తలంపు కూడా ఉండదు, ఒకరి వ్యతిరేకముగా మరొకరు దేనినీ కలిగియుండరు, అందరూ ప్రేమతోను సమాధానముతోను మాట్లాడుతుంటారు, ఒక స్థలములో ప్రతీఒక్కరు ఏకమనస్సు కలిగియుంటారు.

పిదప హఠాత్తుగా వేగముగా వీచు బలమైన గాలివంటి ఒక ధ్వని ఆకాశమునుండి వస్తుంది మరియు సమస్తమైన ఆత్మీయ ఆశీర్వాదములతో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అప్పుడు మీరు సిగ్గుపడటంలేదని, మీరు నా టేపు వధువైయున్నారని లోకమునకు చెప్తూ, మీరు మందసము యెదుట నాట్యమాడుచున్న, దావీదు వలె ఉంటారు! మీరు ప్లేను నొక్కి మరియు నేను పలికిన ప్రతీ మాటను నమ్ముతారు. మీరు కదల్చబడరు, మరియు కదల్చబడజాలరు!

ఇతరులు దానిని త్రోసివేయవచ్చును, లేదా దానిని గ్రహించలేకపోవచ్చును, కానీ మీకైతే, అది నీయొక్క గౌరవ చిహ్నమైయున్నది. దావీదు తన భార్యతో చెప్పినట్లుగా ఉన్నది; “ఇదే పెద్ద విషయమని మీరు అనుకుంటున్నారా, కేవలం రేపటివరకు వేచియుండండి, మేము ఇంకా ఎక్కువ టేపులను వింటూ ఉంటాము, ఆయనయొక్క ఆత్మతో నింపబడి, ప్రభువును స్తుతిస్తూ ఉంటాము; ఏలయనగా మేము కనానులో జీవిస్తున్నాము, వాగ్దాన దేశమునకు బద్ధులమైయున్నాము.”

అప్పుడు నేను ఆకాశములనుండి క్రిందకు చూచి మరియు మీతో ఇట్లంటాను:

“మీరు నా హృదయానుసారమైన వధువైయున్నారు.”

ఈ ఆశీర్వాదములను మీరు కూడా పొందుకోవచ్చును. ఈ ఆదివారము, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 P.M. గంటల సమయమప్పుడు, ఈ దినమునకైన దేవుని స్వరము మాతో మాట్లాడి మరియు పుత్ర స్వీకారము #1 60-0515E అనే వర్తమానమును అందించడాన్ని మేము వినుచుండగా, వచ్చి మాతో చేరి మరియు ముందెన్నడూ లేని విధంగా ప్రభువుయొక్క సన్నిధిని అనుభవించండి.

గుర్తుంచుకోండి, ఇది సంఘముకే గాని, బయటివారికి కాదు. ఇది అతడికి పొడుపు కథలుగా ఉన్న ఒక మర్మమైయున్నది, ఎప్పటికీ అర్థం కానిదిగా ఉన్నది, అతని తల మీదుగా వెళ్ళిపోతుంది, అతనికి దాని గురించి ఏమియు తెలియదు. కానీ, సంఘముకైతే, ఇది బండలోని తేనే వలె ఉన్నది, ఇది చెప్పనశక్యము సంతోషమైయున్నది, ఇది ధన్యకరమైన నిశ్చయతయైయున్నది, ఇది అంతరాత్మకు లంగరుయైయున్నది, ఇది మన నిరీక్షణ మరియు మన ఆశ్రయమైయున్నది, ఇది యుగముల బండయైయున్నది, ఓ, మేలైన సమస్తము ఇదేయైయున్నది. ఏలయనగా భూమ్యాకాశములు గంతిచిపోవును గాని, దేవుని వాక్యము ఎల్లపుడూ నిలుచును.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

 

వర్తమానమునకు ముందు చదువవలసిన లేఖనములు:

యోవేలు 2:28
ఎఫెసీ 1:1-5
I కొరింథీ 12:13
I పేతురు 1:20
ప్రకటన 17:8
ప్రకటన 13