
ప్రియమైన సజీవ స్మారకములారా,
టేపులలో మనం వింటున్న స్వరము ఆయనయొక్క వధువుకు దేవునియొక్క ఊరీము తుమ్మీము అయ్యున్నది. ఇప్పుడు అది ఆయనయొక్క వధువును పూర్తిగా దేవునియొక్క శక్తితో నింపబడి, ఒక నిజమైన ఆత్మ-నింపుదల గల సంఘముగా ఉండునట్లు ఏక హృదయము మరియు ఏక మనస్సుతో స్థిరముగా జతచేసినది, పరిశుద్ధాత్మ మన మధ్య కదలాడుచుండగా, పరలోక స్థలములలో కూర్చుని, ఆత్మసంబంధమైన బలులను, దేవునియొక్క స్తుతులను అర్పించునట్లు చేయుచున్నది.
ఆయనయొక్క ఏడవ దూత ద్వారా మాట్లాడి క్రీస్తుయొక్క స్వరూపములోనికి వ్యక్తిగతంగా మనల్ని కట్టడానికి క్రీస్తు మనకు తనయొక్క పరిశుద్ధాత్మను పంపించాడు, తద్వారా మనము ఆయనయొక్క వాక్యము ద్వారా, శక్తి గృహముగాను మరియు పరిశుద్ధాత్మయొక్క నివాస స్థలముగాను ఉండుటకైయున్నది.
మనం సమస్తమునకు వారసులమైయున్నాము. అది మన వ్యక్తిగత ఆస్థియైయున్నది, అది మనకు చెందియున్నది. అది మనకొరకైన దేవునియొక్క వరమైయున్నది, మరియు దానిని ఎవ్వరూ మన నుండి తీసివేయలేరు. అది మనదైయున్నది.
“మీరు తండ్రిని నా నామమున దేనిని అడుగుదురో, దానిని నేను చేతును.” అక్కడ ఎవరైనా దేనినైనా ఎలా నిరాకరించగలరు? “ఈ పర్వతముతో ‘కదిలిపొమ్ము,’ అని మీరు చెప్పి, మీ హృదయంలో సందేహించకుండా మీరు చెప్పినది జరుగునని నమ్మినయెడల, అప్పుడు మీరు చెప్పినది ఏదైనను మీరు పొందుకుంటారని, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” ఎటువంటి వాగ్దానములు కదా! కేవలం స్వస్థత వరకే పరిమితం కాదు గానీ, అడిగినది ఏదైనను.
దేవునికి మహిమ…మనం అడిగినది ఏదైనను!
కాలముయొక్క ప్రారంభము నుండి, దేవునియొక్క సృష్టియంతయు దేవుని కుమారులందరూ ప్రత్యక్షపరచబడే దినము కొరకు మూల్గుచు ఎదురుచూస్తున్నది. ఆ దినము వచ్చియున్నది. ఇదియే ఆ దినమైయున్నది. ఇదియే ఆ సమయమైయున్నది. మనమే ఆ దేవునియొక్క ప్రత్యక్షపరచబడిన కుమారులము మరియు కుమార్తెలమైయున్నాము.
ఆయన నడుస్తున్నటువంటి, ఆయన చూస్తున్నటువంటి, ఆయన మాట్లాడుతున్నటువంటి, ఆయన పనిచేస్తున్నటువంటి, దేవునియొక్క సజీవమైన సాధనములు మనమేయైయున్నాము. అది దేవుడే, మనలో ఉండి, రెండు పాదములతో నడచుటయైయున్నది.
మనుష్యులందరిచేత చదువబడుచున్న ఆయనయొక్క వ్రాయబడిన పత్రికలము మనమేయైయున్నాము. ఎన్నుకోబడి, ముందుగా నిర్ణయించబడిన, ఆయనయొక్క కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించబడినవారమై యున్నాము, మనల్ని ఆయన ఒక సజీవ మానవునిలోనికి, ఒక సజీవ రూపములోనికి, ఒక పరిపూర్ణ మానవునియొక్క స్వరూపములోనికి మలచుచున్నాడు.
ఒక సజీవుడైన దేవుని యెదుట, ఒక సజీవమైన సద్గుణము యెదుట, ఒక సజీవమైన జ్ఞానము యెదుట, ఒక సజీవమైన సహనము యెదుట, ఒక సజీవమైన దైవత్వము యెదుట, ఒక సజీవుడైన దేవుని నుండి వస్తున్నట్టి ఒక సజీవమైన శక్తి యెదుట మనము సాగిలపడినప్పుడు, అది ఒక సజీవ మానవుడిని దేవునియొక్క స్వరూపములోనున్న ఒక సజీవ రూపముగా చేస్తుంది.
అది క్రీస్తే, పరిశుద్ధాత్మ రూపములో మనపై ఉండుటయైయున్నది, తన పరిశుద్ధాత్మయొక్క నిజమైన బాప్తిస్మముతో, ఆయనయొక్క గుణలక్షణములన్నీ మనలో ముద్రించబడుటయైయున్నది. దేవుడే, గృహము అని పిలువబడే ఆలయమైయున్న మనలో నివసించుటయై యున్నది. ఆ పరిపూర్ణమైన తలరాయి మనపై పెట్టబడుటకు; సజీవ దేవుని నివాస స్థలముయొక్క, సజీవమైన ఆలయమైయున్నాము.
తన వధువును బయటకు పిలిచి మరియు నడిపించుట కొరకు దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ఆయన మొట్టమొదటిగా పూర్తిగా పునరుద్ధరించబడిన ఆయనయొక్క ఆదాముయై యున్నాడు, ఆయనయొక్క వధువునకు ఆయనయొక్క వాక్యమును బయలుపరచుటకు, మన దినములో ఒక పరిపూర్ణ మానవునియొక్క స్వరూపమైయున్నాడు.
నేను దానినుండి కదల్చబడను. ఏదియు నన్ను కదల్చలేదు. ఎవరు ఏమి చెప్పినా నేను లెక్కచేయను; అది నన్ను ఒక్క అంగుళమైనా కదిలించదు. నేను సరిగ్గా అక్కడే నిలిచియుంటాను.
నేను వేచియుంటాను, వేచియుంటాను, వేచియుంటాను, వేచియుంటాను. ఎటువంటి వ్యత్యాసమును కలిగించదు. అది సరిగ్గా అక్కడే ఉంటుంది. పిదప, ఒక రోజు, నేను మిగతా పరిశుద్ధులందరితో కలిసి ఏక మనస్సుతో ఇట్లు కేక వేస్తాను: “మేము ప్రతీ మాట మీద నిశ్చయతతో విశ్రాంతి తీసుకొనుచున్నాము! పిదప నీవు మమ్మల్ని ఆయనకు బహుకరిస్తావు. పిదప సదా జీవించుటకు, మనమందరమూ తిరిగి భూమి మీదకు వెళ్తాము.”
నేను, ఈ ఉదయము, నా హృదయమంతటితో, ఆయనకు ప్రమాణము చేస్తున్నాను, అదేమిటనగా, ఈ అవసరమైన విషయములన్నీ నాయొక్క ఈ చిన్న రూపములో ప్రవహించుటను నేను అనుభూతిచెందేవరకు, నేనే సజీవమైన క్రీస్తు ప్రత్యక్షపరచబడటం అయ్యేంతవరకు, ఆయనయొక్క సహాయము మరియు ఆయనయొక్క కృప ద్వారా, నేను అనుదినము, ఎడతెగక, ఎదురుచూడాలన్నదే నా ప్రార్థనైయున్నది.
నాకైతే, టేపులలో ఉన్న దేవుని స్వరమును వినడమే ఈ దినము కొరకైన దేవుని ప్రణాళికయైయున్నది. అదియే యేసుక్రీస్తు యొక్క సజీవ వాక్యమైయున్నది. దేవుని వాక్యం ప్రకారంగా అదియే నా సంపూర్ణతైయున్నది. అది ఈ దినమునకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గమైయున్నది.
అందువలన, ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారముగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, ఎవరైతే మన దినమునకు దేవునియొక్క స్వరమైయున్నాడని నేను నమ్ముచున్నానో, ఆ విలియమ్ మారియన్ బ్రెన్హామ్ గారు: ఒక పరిపూర్ణ మానవుని స్వరూపము 62-1014M గా ఎలా మారాలి అని, క్రీస్తుయొక్క వధువునకు బోధించుటను నేను వినుచుండగా వచ్చి నాతో చేరమని మిమ్మల్ని ఆహ్వానించుటకు నేను ఇష్టపడుచున్నాను.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
వర్తమానమునకు ముందు చదువవలసిన లేఖనములు:
పరిశుద్ధ. మత్తయి 5:48
పరిశుద్ధ. లూకా 6:19
పరిశుద్ధ. యోహాను 1:1 / 3:3 / 3:16 / 5:14 / 14:12
అపొస్తలుల కార్యములు 2:38 / 7:44–49 / 10వ అధ్యాయము / 19:11 / 28:19
ఎఫెస్సీ 4:11-13
కొలస్సీ 3వ అధ్యాయము
హెబ్రీ 10:5 / 11:1 / 11:32-40
యాకోబు 5:14
2 పరిశుద్ధ. పేతురు 1-7
యెషయా 28:19