
మారుమనస్సు పొందిన ప్రియమైన వారలారా,
ప్లే ను నొక్కడం ద్వారా, మనం విఫలమవ్వజాలని దేవునియొక్క వాక్యమును వింటున్నాము. అది ప్రతీ వాక్యము సత్యమైయున్నది, దానిలోని ప్రతీ వాక్యభాగము సత్యమే. మనము పిలువబడి మరియు భద్రపరచబడియున్నాము, నింపబడి మరియు ప్రత్యేకపరచబడియున్నాము; పరిశుద్ధాత్మతో నింపబడి, మరియు ఇప్పుడు ఇదివరకే కనాను దేశములో ఉన్నాము. మనము దేనికీ భయపడము...దేనికీ, మనమెవరమో మనకు తెలుసు.
ఆయన మనకు చేయమని ఆజ్ఞాపించినదాని ప్రకారంగా, మనము ఆయనయొక్క వాక్యముతో నిలిచియున్నాము గనుక, ఆయన మనకు ఒక స్వాస్థ్యమును విడిచిపెట్టాడని ఆయన మనకు చెప్పబోవుచున్నాడు. తండ్రీ, దానిని నీవు ఎప్పుడు చేసావు? జగత్తుపునాది వేయబడకముందే నేను మిమ్మల్ని ఎన్నుకొని మరియు మీ పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథములో పెట్టినప్పుడైయున్నది.
మీరు నా కుమారులు మరియు కుమార్తెలుగా, చిన్న దేవుళ్ళుగా ఉండునట్లు మీరు మీ స్వాస్థ్యమును పొందుకొనుటకు, కాలము సంపూర్ణమైనప్పుడు, జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన, గొర్రెపిల్లయైన యేసును నేను పంపియున్నాను.
నేను మిమ్మల్ని స్థానములో పెట్టగలుగుటకుముందు వదులు శబ్దములు మరియు వదులైన చోట్ల కోసం నేను మిమ్మల్ని పరీక్షించవలసియున్నాను.
• “టేపులలో ఉన్న నా స్వరమును సంఘములో ప్లే చేయడం తప్పు అని మీరు నమ్ముచున్నారా?”
• “అవును, సంఘములో మీరు టేపులను ప్లే చేయకూడదు.”
• “దానిని ఖండిస్తున్నాను. వదులు శబ్దమా.”
• “టేపులలో ఉన్న నా వాక్యమునకు అనువాదము అవసరమని మీరు నమ్ముచున్నారా?”
• “అవును, దానిని ఎవరైనా ఒకరు వివరించడం అవసరమైయున్నది.”
• “వదులు శబ్దమా. దానిని తన్నివేయండి. మీరింకను సిద్ధమవ్వలేదు.”
మీరు సిద్ధపడియుంటే, మీరు ప్రతీ మాటకు, “ఆమేన్” అని చెప్తారు.
• “నేను నిన్నా, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాను అని మీరు నమ్ముచున్నారా?”
• “ఆమేన్.”
• “టేపులలోని నా స్వరము మీరు తప్పక వినాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన స్వరమని మీరు నమ్ముచున్నారా?”
• “ఆమేన్.”
• “టేపులోని నా స్వరము వధువును ఐక్యము చేస్తుందని మీరు నమ్ముచున్నారా?”
• “ఆమేన్.”
• “నా బలిష్టుడైన దూత మిమ్మల్ని నాకు పరిచయం చేస్తాడని మీరు నమ్ముచున్నారా?”
• “ఆమేన్.”
ఇప్పుడు మీరు బిగించబడుచున్నారు. వదులు శబ్దాలు మరియు వదులు చోట్ల కోసం నేను మిమ్మల్ని పరీక్షించాను. ద్వారము మూసివేయుటకు నేను సిద్ధంగా ఉన్నాను. నేను నా ముద్రను మీపై వేస్తాను. నా తనిఖీలో మీరు ఉత్తీర్ణులయ్యారు.
ఇప్పుడు నన్ను మీకు ఒక విషయమును చెప్పనివ్వండి, టేపు విను దేశములలోనున్న నా ప్రియమైన ప్రశస్తమైన ప్రజలారా; విదేశాలలో ఉన్నను మరియు మీరు ఎక్కడున్నను; మీరు భయపడకండి. సమస్తమూ సజావుగా ఉన్నది. జగత్తుపునాది వేయబడకముందే నేను మిమ్మల్ని ఎరిగియున్నాను. జరుగనైయున్న ప్రతీది నాకు తెలుసు.
త్వరలో నేను మీ కొరకు వచ్చుచున్నాను మరియు ఎటువంటి మరణము, ఎటువంటి విచారము, ఎటువంటి అసూయ, అటువంటిదేదియు లేకుండా; కేవలం పరిపూర్ణత, పరిపూర్ణమైన ప్రేమ మాత్రమే ఉండే చోటునకు మిమ్మల్ని తీసుకెళ్ళబోవుచున్నాను.
అప్పటివరకు, ఎన్నడూ మర్చిపోకండి, నేను మీకు నా వాక్యమును ఇస్తున్నాను, మీరు శరీరధారియైన నా వాక్యమైయున్నారు. మీకు ఏదైనా అవసరమున్నయెడల, దానిని పలుకండి, పిదప దానిని నమ్మండి; అది మీ స్వాస్థ్యమైయున్నది.
నేను మరలా ఈ ఆదివారము మీకు నా స్వరమును పంపించి మరియు దానంతటినీ మీకు వివరించబోవుచున్నాను. మీరు ఎవరు, మీరు ఎక్కడికి వెళ్ళుచున్నారు, మరియు అక్కడ ఎలాగుంటుంది అని సరిగ్గా ఇప్పుడే మరొకసారి నేను మీకు చెప్పబోవుచున్నాను.
ఈ ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, నేను నా వధువును సమకూర్చి పరలోక స్థలములలో కూర్చుండబెట్టగా వచ్చి వారితో చేరి, నా వాక్యము ద్వారా నేను మిమ్మల్ని స్థానము ప్రకారముగా స్థాపించుటను వినండి. 60-0522E పుత్ర స్వీకారము #4
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్