ఆదివారం
18 మే 2025
60-0522m
దత్త పుత్రత్వము మూడవ భాగము

ప్రియమైన పవిత్రురాలైన కన్యక,

మనము ప్లేను నొక్కినప్పుడు, అది బండలోనున్న తేనెయైయున్నది, అది చెప్పనశక్యము కాని ఆనందమైయున్నది, అది ధన్యకరమైన నిశ్చయతయైయున్నది, అది మన అంతరాత్మకు ఒక లంగరుయైయున్నది, అది మన నిరీక్షణ మరియు ఆశ్రయమైయున్నది, అది యుగముల బండయైయున్నది, అది సమస్తమైన మంచియైయున్నది, అది ఈ దినము కొరకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గమైయున్నది.

మనము ప్లేను నొక్కుతాము గనుక, దేవునియొక్క స్వరము మనలను; ఒక పవిత్రురాలైన కన్యకగా ఆయనయొక్క వాక్యమునకు నిశ్చితార్థం చేసి, క్రీస్తునకు ప్రధానము చేసినది. మనకు ఒకే ఒక్క బోధకుడు ఉన్నాడు, ఒకే ఒక్క స్వరము ఉన్నది, ఒకే ఒక్క ప్రవక్త ఉన్నాడు, ఆయన మనల్ని పరిశుద్ధాత్మ ద్వారా నడిపించుచున్నాడు.

అయితే ఇది సంఘమైయున్నది, నేను మీకు బోధిస్తున్నాను. ఈ టేపు కొనసాగుతూనే ఉంటుంది. టేపులను వినేవారు ఇది నా సంఘము కొరకైయున్నదని జ్ఞాపకముంచుకోవాలని నేను కోరుచున్నాను.

మనము ఆయనయొక్క పరిపూర్ణమైన చిత్తములో ఉన్నామని మనకు ఎటువంటి ఒక నిశ్చయత కదా. టేపులు ఆయనయొక్క సంఘము కొరకైయున్నవి. ఆయన మనకు బోధిస్తున్నాడు. టేపులను వినండి అని, ఆయన మనకు చెప్తున్నాడు.

కేవలం కొద్ది దినముల క్రితము ఏమి జరిగినదో చెప్తూ ఆయన పుత్ర స్వీకారము శీర్షికను మొదలుపెట్టాడు. పిదప, ప్రతీ వర్తమానములో, ఆయన మార్పుచెందినదాని గురించి మాట్లాడుతున్నాడు. ఏమి జరిగినదో మరియు వధువు ఆయనతో ఏమి చెప్పినదో వినడం వధువుకు ఎంత ముఖ్యము కదా.

మన ప్రవక్త తాను బోధించి మరియు టేపులలో విడిచిపెట్టిన వాక్యము ద్వారా తీర్పు తీర్చబడతాడు. మరొక వైపు ఆయన మన ప్రభువుచేత స్వీకరించబడతాడని వధువు ఆయనతో చెప్పినది. పిదప తన పరిచర్యయొక్క విజయ చిహ్నములుగా ఆయన మనల్ని ఆయనకు బహుకరిస్తాడు, పిదప సదా జీవించడానికి మనము తిరిగి భూమి మీదకు వెళ్తాము.

మనము వినే ప్రతీ మాట ఒక ఆణిముత్యమైయున్నది. మనము పరిశీలించి చదువుతుండగా ఆయన మనకు ఇంకా ఎక్కువగా బయలుపరుస్తున్న కొలది మనము దానిని ఇంకా ఇంకా మెరుగుదిద్దుతూ ఉంటాము.

మన సహోదరులతో మరియు సహోదరీలతో దానిని పంచుకోవడానికి మనము ఎంతగా ఇష్టపడతాము కదా, “నీవు దీనిని విన్నావా?”

“అసలు ఒక ప్రపంచమనేది లేకమునుపే ఆయన మనల్ని ఆయనలో ఎన్నుకున్నాడు”? అదే మన స్వాస్థ్యమైయున్నది. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, మరియు యేసు వచ్చి వెల చెల్లించులాగున చేశాడు. అది ఎందుకొరకు? ఆయనయొక్క రక్తము చిందించబడుట ద్వారా, ఏ పాపము మనపై మోపబడకుండుటకైయున్నది. మీరు చేసేది ఏదియు కాదు.

పిదప, దాని తరువాత వెంటనే, నీవు దీనిని పట్టుకున్నావా?

“పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ప్రభువు.” మీరు మీ కనుదృష్టిని కల్వరి వైపునకు గురిపెట్టియుంచారు, మరియు మిమ్మల్ని ఆపేది ఏదియు లేదు! మీయొక్క జీవితపు నడకయే, మీరు రాజమార్గములో నడుచుచున్నారు, ప్రశస్తమైన అభిషేకపు తైలముతో అభిషేకించబడ్డారు, అతిపరిశుద్ధ స్థలములోనికి కదులుచున్నారు. ఫ్యూ! ఆమేన్.

మనము సరిగ్గా అహారోను చేతి కర్రవలె ఉన్నాము, అతడు నలభై సంవత్సరాలు అరణ్యముగుండా తన వెంటబెట్టుకున్నట్టి ఒక పాత ఎండిపోయిన కర్ర. కానీ ఇప్పుడు, మనము టేపులలో ఉన్న దేవుని స్వరము మనతో మాట్లాడుటను వినుట ద్వారా దానిని పరిశుద్ధ స్థలములో ఉంచాము గనుక, మనము మొలకెత్తాము మరియు చిగురించాము, పూర్తిగా ఆయనయొక్క పరిశుద్ధాత్మతో నింపబడ్డాము, మరియు ఆయనయొక్క వధువైయ్యుండి గట్టిగా ఈ విధంగా కేకలు వేస్తున్నాము:

• పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ప్రభువే, టేపులే మా హృదయములలో మొదటి స్థానమును కలిగియున్నవి.

• పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ప్రభువే, జగత్తుపునాది వేయబడకమునుపే ఆయన మమ్మల్ని ఎన్నుకున్నాడు.

• పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ప్రభువే, మేము యేసుక్రీస్తు యొక్క వధువైయున్నాము.

• పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ప్రభువే, ఎవ్వరూ ఏమి చెప్పినా ఎటువంటి వ్యత్యాసమును కలిగించదు, మేము టేపులను గుర్తుతెచ్చుకోవడంలేదు, మేము ఇంకా ఎక్కువ ప్లే చేస్తున్నాము.

• పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ప్రభువే, మేము మా కన్నులను కల్వరి వైపునకు గురిపెట్టియుంచాము, మరియు మమ్మల్ని ఆపేది ఏదియు లేదు.

ఇది దేవునియొక్క విఫలమవ్వజాలని వాక్యమైయున్నదని ఎరిగియున్న అనేకులతో ఇక్కడ నేను హృదయము జతచేయుటకు ఎంతో సంతోషిస్తున్నాను. పిదప అది, అది ప్రతీ వాక్యము, దానిలోని ప్రతీ మాట, దానిలోని ప్రతీ భాగము సత్యమైయున్నది. మరియు ఏదో ఒక దినమున మనము వెళ్ళునట్టి ఆ దేశమును, దేవుని కృపనుబట్టి చూచుటకు భాగ్యవంతుడనయ్యాను.

ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, ప్రవక్త ప్రతి మాటను తీసుకొని మరియు దానిని మెరుగు దిద్దుచుండగా వచ్చి మాతో చేరండి. ఆయన దానిని ఆదికాండమునకు తీసుకొనివెళ్ళి మరియు దానిని మెరుగు దిద్దుతాడు, దానిని నిర్గమకాండమునకు తీసుకొనివెళ్ళి మరియు మరలా దానిని మెరుగు దిద్దుతాడు, మరియు ప్రకటన గ్రంథమునకు కూడా తీసుకెళ్తాడు; మరియు అది ప్రతీ అణువు యేసుయైయున్నాడు!

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

 

వర్తమానము:

పుత్ర స్వీకారం #3 60-0522M

 

లేఖనములు:

మత్తయి 28:19
యోహాను 17:7-19
అపొస్తలుల కార్యములు 9:1-6, అధ్యాయములు 18 మరియు 19
రోమా 8:14-19
1 కొరింథీ 12:12-13
గలతి 1:8-18
ఎఫెసీ అధ్యాయము 1
హెబ్రీ 6:4-6, 9:11-12