
ప్రియమైన రాజరికపు యాజకత్వమా,
ప్రతీ ఒక్కరూ మీ వ్రేలును కొరుక్కోండి, మీ అంతరాత్మను గిచ్చుకోండి, మరియు మీ హృదయమును పెకిలించుకోండి. ఈ రోజు, యేసుక్రీస్తు యొక్క వధువు ఇట్లు కేక వేయుచున్నది:
ఈ దినమున, మన కన్నులయెదుట ఈ ప్రవచనము నెరవేరినది.
ఈ మహిమకరమైన దినములలో ఏదో ఒక రోజు, ఈ సంఘసమైఖ్య కలిసికట్టుగా వెళ్ళినప్పుడు, మరియు ప్రవచనము ప్రకారముగా అమెరికా సంయుక్త రాష్ట్రముల నుండి క్రొత్త పోపు తీసుకొనిరాబడి మరియు అక్కడ పెట్టబడినప్పుడు, అప్పుడు వారు మృగమువంటి ఒక ప్రతిమను తయారు చేస్తారు, అని నేను నమ్ముతున్నాను.
1954, డిసెంబరు 19న దేవుని ప్రవక్తయొక్క స్వరము దానిని పలికినది, మరియు దానికి 9 నెలల తరువాత, ఇప్పుడు పోపు లియో XIV గా తెలియబడుచున్న, రాబర్ట్ ప్రెవోస్ట్, జన్మించాడు. అతడే ఇప్పుడు రోమ్ యొక్క క్రొత్త పోపు అయ్యున్నాడు. “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు” నెరవేరినది.
అతనికి ఆజ్ఞను ఇచ్చి మరియు ఇతడే నా బలమైన ఏడవ దూత వర్తమానికుడని, ప్రపంచమునకు నా స్వరమైయున్నాడని ప్రకటించుటకు, దేవుడు 1946, మే 7వ తేదీన, తన ప్రవక్తను ఇండియానాలోని, గ్రీన్స్ మిల్ లో ఉంచాడు. ఈయన మాట వినుడి.
ఎనిమిది సంవత్సరాల క్రితం, ఇండియానా, గ్రీన్స్ మిల్ లో ప్రభువుయొక్క దూత నన్ను కలిసినప్పుడు, ఒక పిల్లవాడిగా ఉన్నప్పటినుండి, నన్ను వెంబడిస్తూ, దర్శనములను చూపిస్తూ ఉన్న తర్వాత, నేను ఆయనను కలవడానికి వెళ్ళినప్పుడు, ఆయన ఇట్లన్నాడు, “నీవు యథార్ధంగా ఉంటే, ప్రజలు నిన్ను నమ్మునట్లు చేస్తే, ఆ ప్రార్థన యెదుట ఏదియు నిలబడదు.”
విలియమ్ మారియన్ బ్రెన్హామ్ గారు ప్రపంచమునకు దేవుడు ఎన్నుకొనిన స్వరమైయున్నాడు. దేవునియొక్క వాక్యము ఎవరియొద్దకు వచ్చునో అటువంటి ఒక బలమైన ప్రవక్తయైయున్నాడు. వాక్య ప్రకారముగా, ఆయన మాత్రమే దేవుని వాక్యమును దైవికముగా అనువదించువాడైయున్నాడు.
స్వయంగా దేవునిచేత, అగ్నిస్తంభము ద్వారా ఆయన నిర్ధారించబడినాడు.
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడును నెరవేర్చడానికి, 2025, మే 7వ తేదీన, వారికి క్రీస్తుకు బదులుగా ఉండువానిని ఎన్నుకొనుటకు సాతానుడు సిస్టీన్ ప్రార్థనా మందిరములో వానియొక్క మతాధికారుల రహస్య సమావేశమును నిర్వహించాడు.
అతడు తెల్లని పొగతో మనుష్యుల చేత నిర్ధారించబడినాడు.
ప్రవక్తయొక్క ప్రవచనము నెరవేర్చబడుటను, మనము వినుచుండగా, మరియు మన స్వంత కన్నులతో చూస్తుండగా, ప్రపంచవ్యాప్తంగానున్న క్రీస్తుయొక్క వధువు ఆనందిస్తూ, కేకలు వేస్తూ, అరుస్తూ మరియు ప్రభువును స్తుతిస్తున్నది.
ఎర్ర సముద్రమును మన కన్నులయెదుట తెరవబడుటను చూస్తున్నట్లుగా ఉన్నది. తాజా మన్నా ఆకాశము నుండి కురియుచున్నది. లక్షల కొలది పూరెడు పక్షులు వధువును పోషించుచున్నవి. బండనుండి నీరు వచ్చుచున్నది. ఏలియా ద్వారా అగ్ని దిగివచ్చి మరియు బల్యర్పనణను దహించుచున్నది.
ప్రతి రోజు ప్రవచనము నెరవేర్చబడుచున్నది. దేవునియొక్క వాగ్దాన వాక్యము మన జీవితములలో నెరవేర్చబడుచున్నది. మన చుట్టూ కార్యములు జరుగుచున్నవి. వాక్యమును వినుట ద్వారా మరియు నమ్ముట ద్వారా వధువు తననుతాను సిద్ధపరచుకున్నది. మనము వాక్యము శరీరమైయున్నాము.
నిజముగా, మనము వచ్చియున్నాము. సమయము సమీపించినది. వధువు ముందెన్నడూ లేని విధంగా ఆనందించుచున్నది మరియు ప్రపంచమంతటినుండి ఐక్యమగుచున్నది. మనము దేవునియొక్క రాజరికపు యాజకత్వమైయున్నామని, ఒక పరిశుద్ధ దేశమైయున్నామని, ఎన్నుకోబడి, ఏర్పరచుకోబడి, బయటకు పిలువబడి, మరియు ప్రత్యేకపరచబడిన ఒక వింతైన జనము అయ్యున్నామని మనకు చెప్పడం ద్వారా ప్రవక్త వధువునకు మరలా నిశ్చయతను ఇచ్చుచున్నాడు.
దేవునియొక్క ఆత్మ ద్వారా నడిపించబడుచు, మనము ఇప్పుడు దేవుని కుమారులము మరియు కుమార్తెలమైయున్నాము; మనుష్యుని ద్వారా కాదు, కానీ ఆత్మ ద్వారా నడిపించబడుచున్నాము. ఒక్క సందేహపు ఛాయయైనా లేకుండా, మనము ఆయనయొక్క వధువు అని, మనము ఎరిగియున్నాము. అనుదినము మన విశ్వాసము ఉన్నత స్థాయికి ఎదుగుచున్నది. మనల్ని ఆపడమనేది గాని లేదా మనల్ని మెల్లగా వెళ్ళునట్లు చేయడమనేది గాని లేదు, దేవుడు దానిని బయలుపరచి మరియు మన హృదయములో మరియు మన అంతరాత్మలో దానిని లంగరు వేసియున్నాడు.
మనము ఎవరమన్నది వధువు పూర్తిగా గుర్తించినది. మనము మన ఆత్మసంబంధమైన వాగ్దాన దేశములో ఉన్నాము, సమస్తమును స్వాధీనపరచుకున్నాము. మనము పరలోకపు సమాధానమును, పరలోకపు ఆశీర్వాదములను, పరలోకపు ఆత్మను కలిగియున్నాము. సమస్తము మనదైయున్నది. తదుపరి ఆయన మనకొరకు దేనిని కలిగియున్నాడో మనం కేవలం దాని కొరకు సిద్ధపడుచున్నాము.
దేవుని బూర మ్రోగుతుంది, మరియు క్రీస్తు నందు మృతులు మొదట లేతురు. ఈ పరలోకసంబంధమైన శరీరములు క్రిందకి వచ్చి మరియు భూసంబంధమైన, మహిమ శరీరములను ధరిస్తాయి మరియు ఒక్క క్షణములో, కనురెప్పపాటున మార్పు చెందుతాయి. మనము వారితో కూడ, ప్రభువును ఆకాశములో కలుసుకొనుటకు కొనిపోబడతాము.
ఎటువంటి ఒక దినము. ఎటువంటి ఒక సమయము. మనమందరము మన అంతరాత్మలలో ఎటువంటి ఒక అనుభూతిని కలిగియుంటున్నామో మానవ పదములలో వివరించుటకు నాకు అసాధ్యము. మన గుండెలు వేగముగా కొట్టుకొనుచున్నవి. అది జరిగేటట్లు మనమేమి చేయడంలేదు గాని, పరిశుద్ధాత్మ మన లోపలనుండి ఉబుకుచున్న ఒక నీటి బుగ్గవలె ఉన్నది. ఆదాముయొక్క దినముల నుండి వధువు ఈ క్షణము కొరకు వేచియుంటున్నది...మరియు మనము ఇప్పుడు ఇక్కడ ఉన్నాము.
మేము మిమ్మల్ని స్వాగతిస్తున్నాము. మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మేము మిమ్మల్ని బ్రతిమాలుచున్నాము. ఈ ఆదివారము, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా, మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు మేము 60-0518 పుత్ర స్వీకారము #2 ను వినుచుండగా, దేవునియొక్క స్వరము ఆయనయొక్క వాక్యమును బయలుపరచడాన్ని మేము వినుచుండగా, లోకము ముందెన్నడూ ఎరుగనటువంటి అత్యంత అద్భుతమైన సమయము కొరకు వచ్చి మాతో చేరండి.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
వర్తమానమునకు ముందు చదువవలసిన లేఖనములు:
ఆదికాండము 1:26
ఎఫెసీ మొదటి అధ్యాయము
రోమా 8:19
గలతీ 1:6-9
హెబ్రీ ఆరవ అధ్యాయము
యోహాను 1:17