భద్రము చేయబడిన ఉత్తరములు
11, నవంబర్ 2023, శనివారం

ప్రియమైన చిన్న బ్యాలెన్సు స్ప్రింగు, ముఖ్యమైన స్ప్రింగు, రైతు మరియు గృహిణి,

మీరు చేయవలెనని దేవుడు మీకిచ్చినదేదైనా, మీరు దానిపై గృహనిర్వాహకత్వమును కలిగియున్నారు. మీరు దాని విషయమై దేవునికి జవాబునివ్వవలసియున్నారు. మీరు ఎంత అల్పమైనవారని శత్రువు మీకు చెప్పినా గాని మీరు దేవునికి ఎంతో ప్రాముఖ్యమైయున్నారు, ఎంతగా అంటే మీరు లేకుండా ఆయన యొక్క గొప్ప గడియారము నడువదు.

ఆయన మిమ్మల్ని పిలిచాడు, మిమ్మల్ని ఎన్నుకున్నాడు, మిమ్మల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు, మరియు తన గొప్ప అంత్యకాల వర్తమానము యొక్క ప్రత్యక్షతను మీకు అనుగ్రహించాడు. ఆయనకు మీపై 100% నమ్మకమున్నది. మీరు ఖచ్చితంగా యేసు క్రీస్తు యొక్క వధువైయున్నారు, ఆయన యొక్క ప్రియురాలైయున్నారు, మరియు ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమించుచున్నాడు.

దేశములన్నిటిలో ఉన్న ప్రజలను ఆయన స్థిరంగా ఇట్లు హెచ్చరించాడు, “పశ్చాత్తాప పడుడి, లేదా నశించిపోతారు”, “వాక్యమునొద్దకు తిరిగి రండి”, “సిద్ధపడండి, ఏదో సంభవించనైయున్నది.” చిట్టచివరకు ఆ ఘడియ వచ్చియున్నది. సరిగ్గా ఆయన వస్తాడని మనకు వాగ్దానం చేసినట్లే, దేవుడు తన వధువు కొరకు వచ్చుచున్నాడు. ఆయన చక్రము నుండి తన చక్రమును పిలిచాడు.

“ఆయన జరుగుతుందని ఏదైతే చెప్పాడో, అది జరగలేదు. సమస్త కార్యములు అలాగే ఉన్నవి,” అని చెప్పుచూ, ఈనాడు అనేకులు దేవుని యొక్క గొప్ప అంత్య-కాల వర్తమానము నుండి పడిపోయారు. దేవుని ప్రవక్తల యొక్క అనేక ప్రవచనములు నెరవేరడానికి ముందే అనేక తరములు గడిచిపోయినవి. మరి అయిననూ, అక్షరాల, సరిగ్గా వారు చెప్పినట్లే, అవి సంభవించినవి.

ఆయనయొక్క బైబిలు గ్రంథము మనకిట్లు చెప్పుచున్నది: “నోవహు దినములలో జరిగినట్లు, మనుష్య కుమారుని రాకడలో జరుగును”. దేవుడు ఆ గొప్ప జలప్రళయ కాలములో ప్రపంచమును నాశనము చేయడానికి తీర్పును పంపుటకు ముందు, దేవుడు లోకానికి ఒక ప్రవక్తను పంపాడు. ఆ ప్రవక్త ఏమి చేశాడు?

ఆయన ప్రజలను ఆ సమయము కొరకు సిద్ధపరిచాడు. నోవహు ప్రజలను సిద్ధపరిచాడు, మరియు అది తీర్పుకు ముందు ఒక కనికరపు పిలుపైయున్నది.

నోవహు దేనిగూర్చియైతే ప్రజలను హెచ్చరించాడో ఆ తీర్పు రావడానికి ముందే అతడు వారిని సిద్ధపరిచాడు. అది ఆ దినమునకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గమైయున్నది.

దేవుడు ఎన్నడూ తన ప్రణాళికను మార్చుకోడని దేవుని ప్రవక్త మనకు చెప్పాడు. ఆయన అప్పుడు ఏమి చేసాడో, దానినే ఈనాడు చేస్తాడు. మనము కేవలం ఈ దినము కొరకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గాముతో నిలిచియుండి మరియు ప్లేను నొక్కుతాము.

అప్పుడన్నట్లే, మనము దేవుని ప్రవక్తను అధికంగా హెచ్చిస్తున్నామని ప్రజలు అంటారు; అయితే అది విలియమ్ బ్రెన్హామ్ కాదుగాని, అది పరిశుద్ధాత్మయైయున్నాడు. మనము, ఆమేన్, అని చెప్తాము, మనము మనుష్యుడు చెప్పేది వినము, మనము కేవలం ఆయన చెప్పినది వింటాము.

పరిశుద్ధాత్మయే ఈ ఘడియకు ప్రవక్తయైయున్నాడు; ఆయన తన వాక్యమును నిర్థారించుచూ, దానిని ఋజువు చేయుచున్నాడు. మోషే యొక్క ఘడియకు పరిశుద్ధాత్మయే ప్రవక్తయైయున్నాడు. మీకాయా యొక్క ఘడియకు పరిశుద్ధాత్మయే ప్రవక్తయైయున్నాడు. వాక్యమును వ్రాసిన పరిశుద్ధాత్మయే, వచ్చి, మరియు వాక్యమును నిర్థారిస్తాడు.

అయితే గడిచిన వారమే సహోదరుడు బ్రెన్హామ్ దీనిని మీకు చెప్పారు;

ఇప్పుడు, చూడండి, మీరు ఏమి వినుచున్నారో దాని విషయమై జాగ్రత్తపడవలెనని నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని కోరాను. చూశారా? దానిలో కేవలం మానవ దృష్టినుండియైనవి అనేకములున్నవి.

దేవుడు నాకు దానిని చెప్పాడని నేను చెప్పడంలేదు. “నేను” దానిని నమ్ముచున్నాను, చూడండి. మరియు ఆ విధంగా చేయకూడదని నేను నమ్ముచున్నాను.

నాకు మరియు నా ఇంటివారి కొరకైతే, ఏ ఇతర సేవకుడు, బిషప్పు, లేదా ఏ మనుష్యుని కంటెను దేవుని యొక్క ఏడవ దూత వర్తమానికుడు ఏమి నమ్ముతాడో, ఏమి తలంచుతాడో లేదా కనీసం ఏమి అనుభూతి చెందుతాడో, దానినే నేను తీసుకుంటాను.

దేవుని ప్రవక్త నమ్ముచున్నది, అనుభూతి చెందుచున్నది, లేదా కనీసం తలంచేది, ప్రేరేపించబడినదో కాదో అని చూచుటకు దేవుడు ఎన్నడైనా ఎవరిని పంపాడు?…ఎవరని నేను అనుకొనుచున్నానో మీకు చెప్పనివ్వండి.

కోరహును చూడండి, దేవుడు ఒక వర్తమానముతో మోషేను పంపిన దినములలో, కోరహు మరియు దాతాను ఆలోచించి, మోషే వద్దకు వచ్చి, మరియు ఇట్లన్నారు, “ఇప్పుడు, ఒక్క నిమిషము ఆగుము, నిన్ను నీవు అధికముగా హెచ్చించుకొనుచున్నావు! సముద్రతీరాన ఉన్న ఏకైక స్పటికము నీవొక్కడివే అని; నీటి గుంటలోని బాతు, నీవొక్కడివే అని నీవు అనుకొనుచున్నావా. పరిశుద్ధులైన ఇతర ప్రజలు కూడా ఉన్నారని, నేను నీకు తెలియజేసెదను!”

హెచ్చరిక, తీర్పు సమీపమున ఉన్నది. అసలైన వాక్యము నొద్దకు తిరిగి రండి. మన దినమునకు నిర్థారించబడిన దేవుని స్వరమునొద్దకు తిరగి రండి. దేవుని ప్రవక్త వద్దకు తిరిగి రండి. ఈ వర్తమానమునొద్దకు, ఆయన స్వరమునొద్దకు తిరిగి రండి. అది మీకు మొట్టమొదటి విషయము మరియు అత్యంత ముఖ్యమైన విషయమై ఉండవలసియున్నది.

ఈ వర్తమానమును బోధించుటకు మరియు ప్రసంగించుటకు, ఇతరులు ఒక స్వరమును, మరియు ఒక పిలుపును కలిగియున్నారనుటలో ఎటువంటి సందేహము లేదు. అయితే మీరు దేవుని వధువైయ్యుండగోరిన యెడల, మీ గృహములలో, మీ కారులలో, మరియు ముఖ్యంగా, మీ సంఘాలలో మీరు వినగలిగే ఈ టేపులు, ఆ స్వరము, మీకు ప్రాముఖ్యమైన స్వరమైయ్యుండవలసియున్నది.

ప్రభువు రాకడ సమీపంలో ఉన్నదని దేవుని ప్రవక్త లోకాన్ని హెచ్చరిస్తుండగా, ఆదివారమునాడు, జఫర్సన్ విల్ కాలమానము ప్రకారంగా 12:00 P.M., సమయమప్పుడు, వచ్చి మాతో కలిసి ఆ స్వరమును వినండి. ఇదే చివరి సారి కావచ్చును.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

ముందు అతడిని హెచ్చరించకుండా దేవుడెన్నడూ మనుష్యుని తీర్పులోనికి పిలువడు 63-0724.

 

కూటముకు ముందు చదువవలసిన లేఖనములు:

యెషయా 38:1-5
ఆమోసు 1 అధ్యాయము

 

 


4, నవంబర్ 2023, శనివారం

ప్రియమైన సువార్త పిల్లలారా,

మనము భూమి మీద నడిచినవారిలో అత్యంత ధన్యులైన ప్రజలమైయున్నాము. దేవుని చేత ఎన్నుకోబడిన ఏడవ దూత వర్తమానికుడు మనతో ఈ మాటలను చెప్పుటను మనము అసలు ఊహించగలమా:

నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఓ, మీరు నా స్వంత పిల్లలు అన్నట్లుగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మరియు మీరు సువార్తలో నా పిల్లలైయున్నారు. సువార్త ద్వారా, క్రీస్తునకు నేను మిమ్ములను కనియున్నాను.

దేవుడు మన పట్ల ఎంతగా శ్రద్ధవహిస్తున్నాడంటే మనతో నడుచుచున్నది కేవలం ఈ వ్యక్తి కాదు గాని అది సరిగ్గా ఆయన పైన ఉన్నది దేవుడే అని మనకు తెలియజేయుటకు, ఆయన యొక్క నిర్ధారించబడిన ప్రవక్తను ఒక అగ్ని స్థంబపు సూచనతో మన వద్దకు పంపియున్నాడు. మార్గమున నడిపించుచున్నది ఆయనేయైయున్నాడు.

ఆయన మన పట్ల శ్రద్ధ వహిస్తున్నాడు గనుక, ఆ గొప్ప తీర్పు రావడానికి ముందే, రానున్న తీర్పులన్నిటి నుండి మనము విడిపించబడునట్లు ఆయన ఒక మార్గమును కలుగజేసెను. ఆ తప్పించుకునే మార్గము కేవలం ఎన్నుకొనబడిన, మనకు మాత్రమేయై యున్నది. మనము మాత్రమే ఈ జీవ కణమును అంగీకరించియున్నాము. దానిని చూచుటకు మనము మాత్రమే ముందుగా నిర్ణయించబడినాము. మనము మాత్రమే ఈ గొప్ప టేపు పరిచర్య యొక్క ప్రత్యక్షతను కలిగియున్నాము.

ఆయన ఈ పరిచర్య కొరకు మరణించాడు. ఈ దినమున పరిశుద్ధాత్మ ఇక్కడ ఉండి ఈ కార్యములను చూపించుట కొరకు ఆయన మరణించాడు. ఆయన మిమ్మును గూర్చి శ్రద్ధ వహించాడు. ఆయన దానిని ఇక్కడికి తేసుకొనివచ్చుటకు శ్రద్ధ వహించాడు. ఆయన ప్రకటన చేయుటకు శ్రద్ధ వహించాడు. ఆయన మిమ్మల్ని ప్రేమించాడు గనుక ఆయన మిమ్మును గూర్చి శ్రద్ధ వహించాడు. ఆయన దీనిని చేసేంతగా, దీని కొరకు, ఈ దినమున ఈ పరిచర్యను జరిగించుటకు పరిశుద్ధాత్మను పంపేంతగా ఆయన శ్రద్ధవహించాడు.

మీరు నిత్యజీవమునకై ముందుగా నిర్ణయించబడిన యెడల, మీరు దానిని వింటారు మరియు దానిలో ఆనందిస్తారు. ఇది మీకు ఆదరణయై యున్నది. ఇది మీ జీవితమంతా మీరు తృష్ణగొనిన విషయమైయున్నది. ఇది అమూల్యమైన ముత్యమైయున్నది. మనము ఈ వర్తమానము కొరకు, ఈ స్వరము కొరకు సమస్తమును విడిచిపెడతాము. ఇది మన ప్రభువైన యేసు క్రీస్తు మనతో మాట్లాడుటయైయున్నది.

ఎవ్వరూ మనల్ని బుజ్జగించనక్కర్లేదు, మనము విశ్వాసులమైయున్నాము, మనయొద్ద నుండి దానిని వేరుచేయునది ఏదియూ లేదు. ఎవరేమి చెప్పినా గాని మనము లెక్కచేయము, మనము ప్రతీ మాటను నమ్ముచున్నాము.

ఆయన మనకొరకు ఎంతగానో శ్రద్ధ వహిస్తున్నాడు; మనకు స్వస్థత అవసరమైన యెడల, మనం కేవలం ఆయన వాక్యమును మన హృదయ లోతులనుండి నమ్ముతాము. అప్పుడు ఇక ఏ సలహాదారుడు, ఏ ఆదరించువాడు, ఏ వైద్యుడు, ఏ ఆసుపత్రి, ఏ పరిశీలన ఏమి చెప్పినా లెక్కలేదు గాని, మనము కేవలం ఆయన వాక్యమును నమ్ముతాము. మనము దానిని ఎరిగియున్నాము! దాని విషయమై ఇంకేమియు చెప్పనవసరంలేదు; మనము దానిని ఎరిగియున్నాము.

ఆయన తన ప్రవక్త చేత తన వధువు కొరకు ఆహారమును భద్రము చేపించేంతగా ఆయన మన పట్ల శ్రద్ధవహించాడు. ఆయన ప్రతీ కాపరికి, సేవకునికి, మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల గుంపుకు వారి సహవాసములో లేదా వారి గుంపులలో ఆయన సూచనలను వెంబడించి మరియు ఈ టేపులను ప్లే చేయమని కూడా ఆయన సూచించాడు.

ఈ ఉదయము, ప్రార్థన చేపించుకోబోయే మీరు, మరియు ప్రపంచవ్యాప్తంగా, ఈ టేపును వినుచున్న మీరు, దీనిని చేస్తే చాలు, మరియు ఈ టేపు ప్లే చేయబడిన తర్వాత, మరియు ఒక సహవాసములో, అడవులలో ఉన్న గుంపులు లేదా మీరెక్కడున్నా గాని అక్కడ దానిని ప్లే చేయుచున్న ఆ సేవకుడు లేదా ఆ వ్యక్తి, మొదటిగా మీ యొక్క ఒప్పుకోలును స్పష్టంగా తెలియజేసి, మరియు పిదప మీ హృదయములో, విశ్వాసము తప్ప, మరేదియు లేకుండా వచ్చి, మరియు ప్రార్థన చేపించుకున్నయెడల, మరప్పుడు ఆ ఔషదము పని చేస్తుంది.

సంఘములో టేపులను ప్లే చేయమని ప్రవక్త ఎన్నడూ చెప్పలేదని మన విమర్శకులు చెప్తారని నేను అనుకున్నాను? వారి సంఘాలలో మాత్రమే కాదు గాని, అడవులలోనైనా లేదా మీరు ఎక్కడున్నా గాని...టేపులు ప్లే చేయండని ఆయన చెప్పాడు.

దేవుడు తన నిర్ధారించబడిన ఏడవ దూత వర్తమానికుడి ద్వారా పలికినదానికి మీరు లోబడి మరియు ఖచ్చితంగా దాని ప్రకారంగా చేసినయెడల, అప్పుడు మీరెన్నడూ కలిగిలెనటువంటి ఘనమైన విశ్వాసమును మీరు కూడా పొందుకోగలరు.

నేను, నేను...దీనిని సమీపించడానికి, మొదటిగా, ప్రజలు విశ్వాసముతో అభిషేకించబడవలసియున్నది. మీరు—మీరు, మీరు విశ్వాసమును కలిగిలేనియెడల, అప్పుడు అసలు—అసలు ప్రార్థన చేపించుకొనుటకు రావలసిన అవసరమే లేదు, ఎందుకనగా దానికి మీ విశ్వాసము మరియు నా విశ్వాసము అవసరమైయున్నది; ఆయనను నమ్ముటకు నా విశ్వాసము, ఆయనను నమ్ముటకు మీ విశ్వాసము అవసరమైయున్నది.

మనము అట్లు ఊహించుట లేదు, లేదా అంచనా వేయడం లేదు, లేదా ఆశించుట లేదు. టేపులు ఈ దినము కొరకై దేవుడు ఏర్పాటు చేసిన మార్గమైయున్నది. అది విలియమ్ మారియన్ బ్రెన్హామ్ అను పేరుగల ఒక మనుష్యుని యొక్క మాటలు కావుగాని, అవి మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క బయలుపరచబడిన మాటలైయున్నవి. అది ఖచ్చితంగా, “ఆమేన్!” అది మన యొక్క అంతిమమైయున్నది. అది సత్యమైయున్నది మరియు అది సత్యము గాక మరొకటి కాదు.

మరియు మీరు దేవుని యొక్క అంతిమమును, ఆయన వాక్యమును, ఒక ఫలానా విషయముపై ఒక వాగ్దానమును మీరు కనుగొనినయెడల మొదట అది దేవుని యొక్క వాక్యమని మీరు తెలుసుకోవలసియున్నది, నెరవేర్చబడుచున్నట్లు మీరు చూస్తున్న ఆ విషయము దేవుడే అని మీరు తెలుసుకోవలసియున్నది. అక్కడ—అక్కడ—ఇక “బహుశా అట్లుండవచ్చును, అది ఆ విధంగా జరుగవచ్చును, అది జరుగుతుంది అన్నట్లు అగుపించుచున్నది,” అనేవి ఇక ఉండవు. “అది దేవుడే!” పిదప మీరు ఆ స్థానమునకు వచ్చినపుడు, మరప్పుడు అది అమూల్యమైన ముత్యమైయున్నది, దానికి వ్యతిరేకంగా మీకు చెప్పుచున్న దేనినుండియైనా లేదా ఎవ్వరినుండియైనా మీరు దూరమవ్వవలసియున్నది. మనుష్యుడు ఏమి సాధించాడన్నదానివైపు మీరు చూడకూడదు.

ఈ ఆదివారము మనము ఒక గొప్ప పెద్ద ప్రేమ విందును కలిగియుండబోవుచున్నాము. దేవుని యొక్క నిర్ధారించబడిన ఏడవ దూత మనకు చెప్పినదానిని మనము చేయబోవుచున్నాము: ప్లే నొక్కి మరియు లోబడతాము.

మనకు అవసరమైనది ఏదైనా, మనము దానిని పొందుకుంటాము. ఆయనను నమ్మేందుకు ఆయన విశ్వాసముతోపాటు మనము మన విశ్వాసమును ఉంచుతున్నాము గనుక మనము దానిని పొందుకోబోవుచున్నాము. అప్పుడు మనమందరము ఇట్లు చెప్తాము:

ఈ సమయము నుండి, నా సమస్యలు తీరిపోయినవని నా హృదయములో ఏదో చెప్పుచున్నది. నేను—నేను బాగయ్యాను, నేను బాగవ్వబోవుచున్నాను అనియా”? మీరు దానిని నమ్ముచున్నారా? మీ చేతులను పైకెత్తండి, “నేను దానిని నమ్ముచున్నాను!” దేవుడు మిమ్మల్ని దీవించును గాక.

దేవుడు శ్రద్ధవహించుచున్నాడు గనుక, మీరు వచ్చి మాతో చేరవలెనని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను; లేదా మీ కాపరిని, మీ నాయకుడిని, ప్రవక్త యొక్క సూచనలను వెంబడించుటకు ప్రోత్సహించండి, మరియు ఈ ఆదివారము జఫర్సన్ విల్ కాలమానము ప్రకారంగా 12:00 P.M., సమయమప్పుడు మేము దీనిని వినుచుండగా దేవుని యొక్క ఏడవ దూత వర్తమానికుడు దేవుని యొక్క వాక్యమును పలుకుటను విని మరియు మీకు అవసరమైయున్న ప్రతిదానిని పొందుకోవలెనని కోరుచున్నాను: 63-0721 ఆయన శ్రద్ధ వహించుచున్నాడు. మీరు శ్రద్ధ వహించుచున్నారా?

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

కూటముకు ముందు చదువవలసిన లేఖనములు:

పరిశుద్ధ. యోహాను 5:24 / 15:26
1 పేతురు 5:1-7
హెబ్రీ 4:1-4

 

 


సంబంధిత కూటములు
28, అక్టోబర్ 2023, శనివారం

ప్రియమైన ఖైదీలారా,

మీరు నోవహు దినములలో, లేదా మోషే దినములలో జీవించియున్నయెడల అప్పుడు మీరు జీవించియుండే జీవితమును, ఇప్పుడు మీరు జీవిస్తున్న జీవితం ప్రతిబింబిస్తుంది, ఎందుకనగా మీరు అదే ఆత్మతో నింపబడియున్నారు. ఇప్పుడు మీలోనున్న అదే ఆత్మ అప్పుడు ప్రజలలో ఉన్నది.

మీరు నోవహు దినములలో జీవించియున్నయెడల, అప్పుడు మీరు ఎవరి పక్షమున నిలిచియుండేవారు? ఓడను నిర్మించి మరియు ప్రజలను నడిపించడానికి నోవహు దేవుని చేత ఎన్నుకోబడినవాడని నమ్ముచూ మీరు అతనితో కూడ ఓడలోనికి వెళ్ళియుండేవారా, లేదా, “నేను కూడా ఒక ఓడను నిర్మించగలను. నేను కూడా ఒక మంచి నావికుడను మరియు ఒక మంచి ఓడ నిర్మాణకుడనైయున్నాను” అని చెప్పియుండేవారా?

మోషే దినములలో మీరు జీవించియున్నయెడల విషయం ఏమిటి? మీరు మోషేతో నిలిచియుండి మరియు ప్రజలను నడిపించడానికి దేవుడు అతడిని ఎన్నుకున్నాడని నమ్మియుండేవారా, లేదా, “మేము కూడా పరిశుద్ధులమే, మేము చెప్పవలసిన విషయం ఒకటి ఉన్నది. దేవుడు మమ్మల్ని కూడా ఎన్నుకున్నాడు” అని కోరహు దాతానులు చెప్పినప్పుడు వారితో వెళ్ళియుండేవారా?

మనలో ప్రతీ ఒక్కరు, ఈ దినమున, జీవ మరణముల మధ్య ఒకదానిని ఎన్నుకోవలసియున్నది. మీరు దేని పక్షమున ఉన్నారని మీరు చెప్పేది నేను లెక్కచేయను. అనుదినము, మీరు ఏమి చేస్తారో, అదే, మీరు ఏమైయున్నారన్నది ఋజువు చేస్తుంది. మేము ప్రతీ రోజు ప్లే ని నొక్కుతాము.

మీరు ప్రతీ రోజు వాక్యములో ఉంటున్నారా? మీరు ప్రార్థించుచు, మీరు చేయుచున్న ప్రతిదానిలో ప్రభువు యొక్క పరిపూర్ణమైన చిత్తమును వెదకుచున్నారా? మీరు ప్రతీ రోజు ప్లేను నొక్కి మరియు దేవుని యొక్క నిర్ధారించబడిన స్వరమును వినుచున్నారా? ప్లే నొక్కడం ఖచ్చితంగా అవసరమని మీరు నమ్ముచున్నారా? టేపులలో ఉన్న ఆ స్వరము ఈ దినమునకైన దేవుని యొక్క స్వరమని మీరు నమ్ముచున్నారా?

మాకైతే, దానికి జవాబు అవును. మేము దేవుని యొక్క వాక్యమునకు, ఆయన వర్తమానమునకు, మన దినమునకై దేవుని యొక్క నిర్ధారించబడిన స్వరమునకు ఖైదీలమైయున్నామని ప్రపంచానికి చెప్పుచున్నాము. అవును, ప్లేను నొక్కడాన్ని మేము మా హృదయపూర్వకంగా నమ్ముచున్నాము. అవును, 7వ సంఘకాల వర్తమానికుడు వధువును నడిపించడానికి పిలువబడినాడని మేము నమ్ముచున్నాము. అవును, టేపులలో ఉన్న ఆ స్వరమే వినవలసిన అత్యంత ప్రాముఖ్యమైన స్వరమైయున్నది.

దేవుని యొక్క ప్రేమ, ఆయన స్వరము, ఈ వర్తమానము ఎంతో మహత్తరమైనది, అది మాకు, దాని నుండి మేము తొలగిపోలేనంతటి, ఒక గొప్ప ప్రత్యక్షతయైయున్నది. మేము దానికి ఒక ఖైదీయైపోయాము.

మేము సమస్తమును త్యజించుకున్నాము. ఎవరు ఏమి చెప్పినాగాని, మేము దీనికి కట్టుబడియున్నాము. మేము అసలు దానినుండి తొలగిపోలేనట్లు దానిలో ఏదో విషయమున్నది. అది మా జీవితముల యొక్క సంతోషమైయున్నది. అది లేకుండా మేము బ్రతుకలేము.

ప్రభువునకు మరియు ఆయన వర్తమానమునకు ఒక ఖైదీగా ఉండుటకు, మేము ఎంతో సంతోషించుచున్నాము, మరియు కృతజ్ఞులమైయున్నాము, మరియు ఎంతో అతిశయపడుచున్నాము; ఏలయనగా అవి ఒక్కటేయైయున్నవి. అది మాకు జీవము కంటె ఎక్కువైయున్నది. రోజురోజుకి మేము ఆయన వధువు అన్నది మాకు మరింత తేటగా మరియు మరింత వాస్తవముగా మారుచున్నది. మేము ఆయన యొక్క పరిపూర్ణ చిత్తములో ఉన్నాము. మేము వాక్యమును పలుకగలము, ఏలయనగా మేము శరీరధారియైన వాక్యమైయున్నాము.

క్రీస్తు మరియు ఈ ఘడియ కొరకైన ఆయన వర్తమానముతో తప్ప మేము మరి దేనితోను సంబంధము కలిగిలేము; కనీసం మా తండ్రితోనైనా, మా తల్లితోనైనా, మా సహోదరునితోనైనా, మా సహోదరితోనైనా, మా భర్తతోనైనా, మా భార్యతోనైనా, ఎవరితోనైనా సంబంధమును కలిగిలేము. మేము క్రీస్తుతో, మరి ఆయనతో మాత్రమే సంబంధమును కలిగియున్నాము. మేము ఈ వర్తమానముతో, ఈ స్వరముతో, సంబంధము కలిగియుండి మరియు జోడించబడియున్నాము, ఏలయనగా ఇది ఈ దినమునకు దేవుడు ఏర్పాటుచేసిన మార్గమైయున్నది, మరియు వేరే ఏ మార్గమూ లేదు.

మేము ఇకమీదట ఎంతమాత్రము మా స్వంత స్వార్ధమునకు, మా స్వంత ఆశయమునకు ఖైదీలము కాము. మమ్మల్ని మేము పూర్తిగా ఆయనకు అప్పగించుకొని మరియు ఆయనకు జోడించబడియున్నాము. మిగతా ప్రపంచమంతా ఏమనుకున్నాగాని, మిగతా ప్రపంచమంతా ఏమి చేసినాగాని, మేము ప్రేమ సంకెళ్ళతో, ఆయనకు మరియు ఆయన స్వరమునకు జోడించబడియున్నాము.

ఖైదీలుగా ఉన్నందుకు మేము ఎంతో కృతజ్ఞులమైయున్నాము. తండ్రీ, ప్రతీ దినములో, ప్రతీ నిమిషములోని, ప్రతీ క్షణము, ఏమి చేయవలెనో నాకు చెప్పుము. మేము చేసే ప్రతిదానిలో, మేము మాట్లాడే ప్రతి విషయములో, మరియు మేము ప్రవర్తించే విధానములో నీ స్వరము మమ్మల్ని నిర్దేశించును గాక. మేము నిన్ను తప్ప మరిదేనిని తెలుసుకొనగోరడం లేదు.

ఈ ఆదివారము, జఫర్సన్ విల్ కాలమానము ప్రకారంగా 12:00 P.M., సమయమప్పుడు ఒక ఖైదీగా ఎలా మారాలి అనుదానిని మేము వినుచుండగా వచ్చి మాతో కూడ చేరండి: ఒక ఖైదీ 63-0717.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్


 

వర్తమానమునకు ముందు చదువవలసిన లేఖనములు:

ఫిలేమోను 1:1

పీ ఎస్: సహోదరుడా బ్రెన్హామ్, మీరు ఫిలేమోను అని ఉచ్చరించే విధానము మాకు చాలా ఇష్టం, వధువుకు అది పరిపూర్ణమైనది.

 

 

 


సంబంధిత కూటములు
21, అక్టోబర్ 2023, శనివారం

ప్రియమైన దేవుని యొక్క ఆలయములారా,

నేను ఆయన సంఘమునైయున్నాను. మీరు ఆయన సంఘమైయున్నారు. మనము దేవుడు నివసించునట్టి ఆలయమైయున్నాము. మనము సజీవ దేవుని యొక్క సంఘమైయున్నాము; జీవముగల దేవుడు మనయందు జీవించుచున్నాడు. మన క్రియలు దేవుని యొక్క క్రియలైయున్నవి. మహిమ!!

ప్రపంచమంతటి నుండి చిన్న చిన్న స్థలములలో, మనమందరమూ కూడుకొనుచున్నాము; అందరమూ దేవుని యొక్క స్వరము చుట్టూ, ఈ దినము కొరకైన ఆయన వాక్యము చుట్టూ కూడుకొనుచున్నాము.

అది ఎంతో అద్భుతంగా ఉన్నది. దేనితో ఎటువంటి బంధాలు లేవు, కేవలం యేసు క్రీస్తు మరియు ఆయన వాక్యమునకు మాత్రమే కట్టుబడియున్నాము. అంతే, విరామ చిహ్నము. సాక్షాత్తు దేవుని స్వరము ద్వారానే పరిపూర్ణము చేయబడుతూ మనము కలిసి పరలోక స్థలములలో కూర్చొనియున్నాము.

మనము వెళ్ళుచున్నాము. మనమందరము వాగ్దాన దేశములోనికి వెళ్ళుచున్నాము. మనలో ప్రతీ ఒక్కరము! నీవు ఒక గృహిణివైనా గాని, ఒక చిన్న యువతివైనా గాని, ఒక వృద్ధురాలు, ఒక వృద్ధుడు లేదా ఒక యౌవ్వనస్థుడు, నీవెవరవైనా గాని, మనమందరమూ వెళ్ళుచున్నాము. మనలో ఒక్కరు కూడా విడిచిపెట్టబడరు. మనలో ప్రతీ ఒక్కరము వెళ్ళుచున్నాము, మరియు “మనము దేని కొరకును ఆగబోవడం లేదు.”

మనమందరము కలిసి ఉండాలని మనము నమ్ముచున్నాము. ఆ మహిమకరమైన రాకడ కొరకు ఎదురుచూస్తున్న, యేసు క్రీస్తు శరీరము యొక్క ఒక ఐక్యమైన గొప్ప గుంపైయున్నాము. మనము విడిపోకూడదు, కాని సువార్త బోధన యొక్క ఆ ఏర్పాటు చేయబడిన బాటను మానవుడు తప్పియున్నాడు.

ఏది సరియో ఏది తప్పో ఖచ్చితంగా చూపించుటకు ఏదో ఒక మార్గము ఉండవలసియున్నది. మరియు మీరు దానిని చేసే ఏకైక విధానమేదనగా, వాక్యమునకు ఎటువంటి అనువాదమునైనా ఇవ్వకుండా, కేవలం అది ఉన్న రీతిగానే దానిని చదివి మరియు ఆ విధంగానే దానిని నమ్మడమైయున్నది. ప్రతీ వ్యక్తి తన స్వంత అనువాదమును, మరియు అది దానిని ఏదో భిన్నమైనదిగా చెప్పునట్లు చేస్తుంది. వధువుకు దేవుని స్వరము కేవలం ఒక్కటి మాత్రమే ఉన్నది. ప్లే ను నొక్కండి!

నేను దీనిని ఈ టేపుపై చెప్పుచున్నాను, మరియు ఈ ప్రజల కొరకు చెప్పుచున్నాను, నేను పరిశుద్ధాత్మ ప్రేరేపణ క్రింద దీనిని చెప్పుచున్నాను: దేవుని పక్షమున ఉన్నవాడు ఎవడో, అతడు ఈ వాక్యము క్రిందకు వచ్చును గాక!

మన దినమునకైన వాక్యము ఒక స్వరమును కలిగియున్నది. మన ప్రవక్తయే ఆ స్వరమైయున్నాడు. ఆ స్వరము మన దినమునకు జీవించుచున్న వాక్యమైయున్నది. ఆ స్వరమును వినుటకు మరియు ఈ ఘడియను చూచుటకు మనము ముందుగా నిర్ణయించబడినాము, మరియు ఆ స్వరమును వినకుండా మనలను ఆపగలిగేది ఏదియు లేదు.

మన విశ్వాసము దానిని చూస్తుంది మరియు ఎవ్వరు ఏమన్నాగాని దానిని వినుటకు ఎంచుకుంటుంది. మనము వేరొక వైపుకు చూచుటకు మన గురిని మరల్చుకొనము. మనము మన గురిని ఖచ్చితంగా వాక్యము మీదనే ఉంచుతాము మరియు మన చెవులు ఆ స్వరమునకు శృతిచేయబడియున్నవి.

ప్రభువా, ఒక సమర్పణ భావముతో, మా హృదయముల నుండి నీ చెవుల యొద్దకు ఇది మా యొక్క యధార్థమైన ప్రార్థన.

అదేమిటనగా మా జీవితములు మారును గాక, ఈ దినము మొదలుకొని, మా ఆలోచనలో మరి ఎక్కువ సానుకూలముగా ఉందుము గాక. మేము దేవుడిని అడిగినది, దేవుడు ప్రతీ ఒక్కరికి అనుగ్రహిస్తాడని నమ్ముచు, మేము అంతటి మాదూర్యత మరియు సామాన్యతలో జీవించుటకు ప్రయత్నిస్తాము. మరియు మేము ఒకరికొకరమైనా లేదా, ఏ వ్యక్తికైనా వ్యతిరేకముగా కీడు పలుకము. మేము మా శత్రువులను ప్రేమించి మరియు వారి కొరకు ప్రార్థిస్తాము, మాకు కీడు చేయువారికి మేలు చేస్తాము. ఎవరు సరియో ఎవరు తప్పో అనుదానికి దేవుడే తీర్పరియైయున్నాడు.

ఆదివారమున, జఫర్సన్ విల్ కాలమానము ప్రకారము 12:00 P.M., సమయమప్పుడు వచ్చి మాతో కలిసి దేవుని స్వరమును వినుట ద్వారా మీ విశ్వాసమును అభిషేకించుకొనమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, అది మేము దీనిని వినుచున్నపుడైయున్నది: మొఱ్ఱపెట్టనేల? పలుకుము! 63-0714M.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

 


14, అక్టోబర్ 2023, శనివారం

ప్రియమైన గృహ సంఘపు వధువా, ఈ ఆదివారము, జఫర్సన్ విల్ కాలమానము ప్రకారంగా 5:00 pm, సమయమప్పుడు, మనమందరము కూడుకొని మరియు, నేరారోపణ 63-0707m అను వర్తమానమును విందాము.

వెనువెంటనే మనము, 63-0707e సహవాసము అను వర్తమానమును వినుచుండగా మన గృహములలో ప్రభురాత్రి భోజనములో పాల్గొనే పరిశుద్ధ అవకాశము కొరకు మనల్ని మనము సిద్ధపరచుకుందాము. పిదప ప్రభురాత్రి భోజనము మరియు పాద పరిచర్య కార్యక్రమములో పాల్గొందాము. నేరారోపణ టేపు లాగానే, సహవాసము టేపు కూడా వాయిస్ రేడియోలో (ఆంగ్లములో మాత్రమే) ప్లే చేయబడుతుంది, అటు తర్వాత పియానో సంగీతం, పాద పరిచర్యను ప్రారంభించుటకు ఒక కొటేషన్, మరియు సాధారణంగా మనము గృహములో ప్రభురాత్రి భోజనపు కూడికలలో చేసినట్లే, సువార్త గీతములు ప్లే చేయబడతాయి.

ప్రభురాత్రి భోజనపు ద్రాక్షారసమును మరియు రొట్టెను పొందుకునే/తయారుచేసే విధానాలను గూర్చిన లింకులు క్రింద ఇవ్వబడినవి.

ఆయనతో చాలా ప్రత్యేకమైన ఒక దినమును గడుపుటకు మనలో ప్రతి ఒక్కరి గృహములోనికి రాజులకు రాజును ఆహ్వానించుటకు ప్రభువు మనకు ఏర్పాటు చేసిన మార్గమును బట్టి నేను ఎంతో కృతజ్ఞుడనైయున్నాను. మీ అందరినీ ఆయన బల్ల వద్ద కలుసుకొనుటకు నిశ్చయంగా నేను ఎదురుచూస్తున్నాను.

దేవుడు మిమ్మల్ని దీవించును గాక,

సహోదరుడు జోసఫ్ బ్రెన్హామ్

 

 



రొట్టెను చేయుటకు / ద్రాక్షారసమును తయారు చేయుటకు సూచనలు

ప్రభురాత్రి భోజనపు ద్రాక్షారసమును / పాదములు కడుగు పాత్రలను పొందుకొనుటకు సూచనలు





 


సంబంధిత కూటములు