
ప్రియమైన పవిత్రురాలైన కన్యక వధువా,
ప్లేను నొక్కి మరియు మన దినమునకైన దేవుని స్వరమును వినమని మిమ్మల్ని ప్రోత్సహించుటకు నేను ఎంతగానో ఇష్టపడతాను. ఏలయనగా అది మన దినముకైన దేవునియొక్క పరిపూర్ణమైన ప్రణాళికయని నాకు తెలుసు.
అది జోసఫ్ బ్రెన్హామ్ చెప్పే విషయమో లేదా నమ్మే విషయమో కాదు. అది దేవునియొక్క నిర్ధారించబడిన స్వరము మనకు చెప్పిన విషయమైయున్నది:
నేను మీకు దేవుని స్వరమునైయున్నాను.
మీకు ఈ వర్తమానమును గూర్చిన ప్రత్యక్షత ఏ మాత్రం ఉన్నా, మీరు తప్పక వినవలసిన అత్యంత ప్రాముఖ్యమైన స్వరము అదేనని; మీరు కలిసిన ప్రతీ ఒక్కరికీ, ప్రతీ విశ్వాసికి, మీ సంఘములకు మీరు చెప్పడానికి, ఆ ఒక్క చిన్న కొటేషన్ సరిపోతుంది.
మనము ప్లే నొక్కినప్పుడు మనము వినే మాటలు దేవుని స్వరమే నేరుగా మనతో మాట్లాడుటయైయున్నది అని, ఆలోచించుటకే ఎటువంటి విషయము కదా. మనము ప్రతీ దినములోని ప్రతీ క్షణము ప్లే నొక్కగలుగుటకు తండ్రి దానిని రికార్డు చేపించి మరియు భద్రపరిచాడు, తద్వారా ఆయన మనలను ప్రోత్సహించుటను, మనల్ని ఆశీర్వదించుటను, మన భయములను మరియు మన సంశయములను పారద్రోలడాన్ని మనము వినగలుగుటకైయున్నది, అంతయూ కేవలం ప్లే నొక్కడం ద్వారానే.
మనకు అవసరమున్నది ఏదైనా సరిగ్గా అప్పుడే, ప్లే నొక్కుతే, మరది అక్కడ ఉంటుంది. మనము వాక్యమైయున్నామని మనకు గుర్తు చేయుటకు ఆయన ఉన్నాడు. ఆయన మనతో, మన చుట్టూ, మనలో ఉన్నాడు. సాతానుడు ఒక మోసగాడు మాత్రమే. వాడు ఓడించబడ్డాడు. ఆ వాక్యమును మన వద్దనుండి ఏదియు తీసివేయలేదు. మనము ఆయనయొక్క వధువైయున్నామని ఎరిగియుండి, తన ముందుజ్ఞానముచేత దేవుడు దానిని మనకు ఇచ్చాడు. ఆదినుండి మనము ఆయనతో ఉన్నాము.
దేవునియొక్క స్వరము అని అగ్ని స్తంభముచేత నిర్ధారించబడిన ఆ ఒకే ఒక్క స్వరముకంటే గొప్పదిగా ఏ స్వరము ఉంటుంది?
వేరే ఏ స్వరము లేదు.
గడచిన వారము ఆ స్వరము మనకు ఏమి చెప్పినది?
నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని, నా సహోదరుడు మరియు సహోదరియని చెప్తుంటాను. మీరు నా పిల్లలైయున్నారు; సువార్తలో నేను—నేను మీ తండ్రినైయున్నాను, ఒక యాజకుని వలె తండ్రిని కాదు, పౌలు అక్కడ చెప్పినట్లుగా సువార్తలో నేను—నేను మీ తండ్రినైయున్నాను. క్రీస్తుకు నేను మిమ్మల్ని కనియున్నాను, మరియు ఇప్పుడు, నేను—నేను క్రీస్తుకు మిమ్మల్ని ప్రదానము చేసిని; అనగా పవిత్రురాలైన కన్యకగా మిమ్మల్ని క్రీస్తుకు నిశ్చితార్థము చేసితిని. నన్ను నిరాశపరచకండి! నన్ను నిరాశపరచకండి! మీరు ఒక పవిత్రురాలైన కన్యకగానే ఉండండి.
వాక్యమునకు, ఆ స్వరమునకు మనము ఒక పవిత్రురాలైన కన్యకగా ఉండాలి. మనము అట్లు చేస్తున్నామని సరిచూసుకోవడానికి మనకు, ఒకే ఒక్క మార్గము కలదు: ప్లేను నొక్కడమే.
మీరు చెప్పుచున్నట్లు, నేను దేవుని సేవకుడనని, ఒక ప్రవక్తనని మీరు నమ్మితే, నేను మీకు చెప్పుచున్నదానిని వినండి. చూశారా? మీరు దానిని గ్రహించలేకపోవచ్చు, మరియు మీరు గ్రహించలేకపోయినయెడల, అప్పుడు మీరు కేవలం నేను మీకు ఏమి చేయమని చెప్తున్నానో దానిని చేయండి.
అవును, పరిశుద్ధాత్మచేత అభిషేకించబడిన ఇతర పురుషులు ఉన్నారు, మరియు దేవుని కృపా మరియు కనికరమును బట్టి, నేను కూడా వారిలో ఒకడినని నేను ప్రార్థిస్తున్నాను. ఆయన వాక్యమును మీయెదుట ఉంచి మరియు ఈ వర్తమానమును, దేవుని వాక్యమును, ఆ స్వరమును మీకు చూపించుటకు నేను ఆయనచేత పిలువబడ్డానని నేను నమ్ముచున్నాను.
పేతురు చెప్పినట్లు, దేవుడు తన వాక్యమును బయలుపరచుకొనుటకు, పిలచుకున్న ఒకే ఒక్క స్వరము కలదని ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు నేను నిర్లక్ష్యము చేయను. దేవుడు నిర్ధారించిన ఒకే ఒక్క స్వరము. “ఈయన మాట వినుడి,” అని దేవుడు చెప్పిన ఆ ఒకే ఒక్క స్వరము. “నేను మీకు దేవుని స్వరమునైయున్నాను,” అని దేవుడు చెప్పిన ఒకే ఒక్క స్వరము.
దీనిని మీ హృదయమంతటితో జ్ఞాపకముంచుకోండి: ఆ వాక్యముతో నిలచియుండండి! మీరు ఆ వాక్యమును విడిచి పెట్టకండి! దానికి వ్యతిరేకముగా ఉన్నది, ఏదైనాసరే, దానిని వదిలేయండి. అది సరియైనదని అప్పుడు మీకు తెలుస్తుంది.
ఎందుకని నేను అంతగా అపార్ధము చేసుకొనబడుచున్నానో మరియు ఎందుకని అనేకులు నేను సేవకులందరికి వ్యతిరేకినని; ఎవ్వరూ ప్రసంగించకూడదని నమ్ముతానని అనుకుంటారో నేను నిశ్చయంగా అర్థంచేసుకోగలను. “సహోదరుడు బ్రెన్హామ్ గారు కాకుండా వేరొక సేవకుడు చెప్పేది మీరు వింటే, మీరు వధువు కాదు.” నేను అనేకసార్లు చెప్పినట్లుగా, నేను ఎన్నడూ అట్లనలేదు లేదా దానిని నమ్మలేదు.
ఖచ్చితంగా నేను ఎటువంటి అనుభూతిని కలిగియున్నాను మరియు నేను ఏమి నమ్ముచున్నాను అనేది ప్రవక్త గడిచిన వారం దానిని పరిపూర్ణముగా వివరించాడు.
సహోదరుడు బ్రెన్హామ్ గారు ఇక్కడున్నప్పుడు జఫర్సన్ విల్ ప్రాంతములో వర్తమానముకు చెందిన ఇతర సంఘములు కానీసం మూడు ఉన్నవి. గడిచిన ఆదివారపు వర్తమానములో, సాయంకాల కూడిక కొరకు స్థానిక సంఘకాపరులు అక్కడ హాజరు కాలేదని ఆయన చెప్పాడు. వారు తమ స్వంత సాయంకాల కూటములను కలిగియున్నారు. కావున, వచ్చి, సాయంకాల కూడికలో సహోదరుడు బ్రెన్హామ్ గారు చెప్పేది వినాలని వారికి అనిపించలేదు గాని వారు తమ సంఘములలో కూడికలను కలిగియుండగోరారు. అది వారి నిర్ణయమైయున్నది మరియు వారు ఏమి చేయుటకు నడిపించబడ్డారని వారికి అనిపించినదో అట్టి విషయమైయున్నది, మరియు సహోదరుడు బ్రెన్హామ్ గారు అంగీకరించాడు.
ఈనాడు జఫర్సన్ విల్ ప్రాంతములో ఇంకనూ అనేక సంఘములున్నవి. వారునూ ప్రభువు వారిని ఏ విధంగా నడిపిస్తున్నాడని వారికి అనిపించుచున్నదో ఆ ప్రకారమే చేయవలసియున్నారు. టేపులను ప్లే చేయాలని వారికి అనిపించకపోతే, ప్రభువుకు స్తోత్రం, ఏమి చేయుటకు వారు నడిపించాబడుచున్నారో వారు దానినే చేయుచున్నారు, మరియు వారు దానినే చేయవలసియున్నది. వారింకను మన సహోదరులు మరియు సహోదరీలే మరియు ఈ వర్తమానమును ప్రేమిస్తున్నవారే. అయితే మనము ఏమి చేయుటకు నడిపించబడుచున్నామో మనము దానినే చేయవలసియున్నది: ప్లేను నొక్కడమే. మనము ప్రవక్త చెప్పేది వినగోరుచున్నాము.
1964, ఆగస్టు 30 వ తేదీన సరిగ్గా సహోదరుడు బ్రెన్హామ్ గారు చేసినట్లే, జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా 12:00 P.M. గంటల సమయమప్పుడు, వచ్చి మాతో చేరమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, అది, ప్రవక్త ఈ వర్తమానమును అందించడాన్ని మేము మరొకసారి వింటున్న సమయములోయైయున్నది: 64-0830M ప్రశ్నలు మరియు జవాబులు#3.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్