
టేపు వినే ప్రియమైనవారలారా,
నేను అసలు దానిని చాలినంతగా చెప్పలేను, మన దినమునకు ఆయనయొక్క నిర్ధారించబడిన వర్తమానికుడైన దూత ద్వారా దేవునియొక్క స్వరము మనతో మాట్లాడుటను వినడంకంటే ప్రాముఖ్యమైనది ఏదియు లేదు. ప్రత్యక్షత వెంబడి ప్రత్యక్షతను ప్రభువు మనకు బయలుపరచుచున్నాడు. దానికి అంతమే లేదు. ప్రతీ వర్తమానము మనము దానిని ముందెన్నడూ వినలేదన్నట్లుగా ఉన్నది. అది సజీవ వాక్యమైయున్నది, తాజా మన్నాయైయున్నది, దేవుడు తన వధువు కొరకు దాచిన ఆహారమైయున్నది, మరియు మనము చేయవలసిందల్లా ప్లేను నొక్కడమే.
త్వరలో జరుగనైయున్న మనయొక్క ఎత్తబడుట గురించి మనము వింటున్నాము. మనము వెళ్ళిపోవుచున్నాము…మహిమ, మనము వివాహ విందుకు వెళ్ళుచున్నాము. ఆయనయొక్క ముందుజ్ఞానము ద్వారా మనము అక్కడ ఉండుటకు ఆయన మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు, మరియు దానిని ఆపేది ఏదియు లేదు. వాక్యము ఇక్కడ వ్యక్తితో ఐక్యమౌతుంది, మరియు వారిరువురూ ఒక్కటౌతారు. అది మనుష్యకుమారుని ప్రత్యక్షపరుస్తుంది. వాక్యము మరియు సంఘము ఒక్కటౌతారు. మనుష్యకుమారుడు దేనిని చేసాడో, మరి ఆయన వాక్యమైయున్నాడు గనుక, సంఘము దానినే చేస్తుంది.
నేను ఇంకా చెప్పుటకు ముందు, మీరు దానిని మరలా చదువవలెను!! దయ్యము మనల్ని నిరుత్సాహపరచుటకు మనము ఎట్లు అనుమతించగలము? మనము దేనికొరకు ఎదురుచూస్తున్నామో వినండి. మనము ఎవరమైయున్నాము అనేదానిని వినండి. ఇప్పుడు ఏమి జరుచున్నది అనేదానిని వినండి.
మనము ఎక్కడికి వెళ్తున్నాము? ఆయనయొక్క ముందుజ్ఞానము ద్వారా దాని కొరకు ముందుగా నిర్ణయించబడిన మనము మనయొక్క వివాహ విందుకు వెళ్ళుచున్నాము, అక్కడ, ఆయనయొక్క వాక్యము మరియు సంఘమైయున్న మనము, ఆయనతో ఐక్యమౌతాము, మరియు మనుష్యకుమారుడు చేసిన ప్రదీదానిని, మనమును చేస్తాము!!
పిదప మనము మనయొక్క భవిష్యత్తు గృహము గురించి అంతా విన్నాము. దైవీకమైన నిర్మాణకుడు మనయొక్క నూతన పట్టణమును రూపొందించాడు, అక్కడ ఆయనయొక్క వధువైయున్న, మనతోపాటు ఆయన నివసిస్తాడు. ఆయన దానిని నిర్మాణము చేసి మరియు ప్రతీ చిన్నదానిని మనకు తగినట్లుగా; సరిగ్గా మనకు ఇష్టమయ్యేరీతిగా ఉంచాడు. అక్కడ మనకు ఒక దీపము అవసరముండదు, మన గొర్రెపిల్లయే మనకు దీపముగా ఉంటాడు. అక్కడ మన ప్రవక్త మన ఇంటి ప్రక్కనే నివసిస్తాడు; ఆయన మనకు పొరుగువాడైయ్యుంటాడు. మనము ఆ చెట్ల ఫలములను తింటాము, మనము ఆ బంగారు వీధులగుండా నడుచుకుంటూ వెళ్ళి ఆ ఊట వద్దనుండి త్రాగుతాము. దూతలు గానములు పాడుచు, భూమిపై ఎగురుచుండగా, మనము దేవునియొక్క పరదైసులో నడుస్తాము. మహిమ! హల్లేలూయా!
ఆయన వాక్యాన్ని మనకు ఋజువు చేస్తూ; లోకానికి “ఈయన మాట వినుడి,” అని చెప్పి మరియు నిర్ధారించడానికి, అగ్నిస్తంభమైయున్న ఆయన, తనయొక్క వర్తమానికుడైన దూతతో తన ఫోటోను తీయబడనిచ్చాడు. మనము ఒక్క మాటను కూడా సందేహించకూడదు, ఏలయనగా అది ప్రవక్త మాట కాదు గాని, అది దేవుడు తన వధువుతో మాట్లాడిన దేవుని మాటయైయున్నది. పిదప మనకు భరోసా ఇస్తూ, మనము ముందునిర్ణయము ద్వారా ప్రాతినిధ్యమును కలిగియున్నామని, ఆయన మనకు చెప్పాడు. ఆయన మనల్ని చూడడు, ఆయన యేసుయొక్క రక్తముగుండా కేవలం మన స్వరమును మాత్రమే వింటాడు. ఆయన దృష్టిలో మనము పరిపూర్ణులమైయున్నాము.
ముందెన్నడూ లేనివిధంగా కరడు కరడును పిలచుచున్నది, మరియు తండ్రి ఆయనయొక్క బయలుపరచబడిన వాక్యముతో మనలను నింపుతున్నాడు. మనము తెలుసుకోవలసిన ప్రతీది రికార్డు చేయబడి మరియు మనకు ఇవ్వబడినది. ఈ సజీవమైన వాక్య వర్తమానమునకు అసలు అంతమనేది లేనేలేదు. మనము ఆయనయొక్క వధువైయున్నామని తెలుసుకోవడం కంటే గొప్పదేదియు లేదు. ఆ స్వరమును వినడము, ప్లేను నొక్కడము, దేవునియొక్క పరిపూర్ణమైన చిత్తమని, ఆయన ఏర్పాటు చేసిన ఆయనయొక్క ప్రణాళిక అని తెలుసుకోవడంలోని నిశ్చయతకంటే గొప్పదేదియు లేదు.
ఇంకా ఎక్కువ రానైయున్నది! అది ఆయన వధువు కొరకైనట్టి తరిగిపోని సజీవమైన వాక్యపు జలమైయున్నది. మన జీవితమంతటిలో మనము ముందెన్నడూ ఇంతగా దప్పిగొనలేదు, అయితే మనకు కావలసినదంతా మనము త్రాగుచుండగా, మనము ఇంతకుముందెన్నడూ ఇంతగా ఉపశమనం పొందలేదు.
ప్రతీ ఆదివారము, తరువాత ఆయన ఏమి బయలుపరుస్తాడో వినడానికి, ప్రపంచమంతటి నుండియున్న వధువుయొక్క భాగముతో కూడుకొనుటకు వధువు ఎంతగానో ఉత్సాహభరితమౌతుంది. ఇక్కడ టెబర్నికల్ వద్దకు మనము రాలేకపోతే, ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సంఘమునకు వెళ్ళి; దాని వద్దకు వెళ్ళమని ఆయన మనతో చెప్పాడు.
ప్రవక్తయొక్క నివాసమువద్ద; ఆయన ఉంచబడినట్టి ఆయనయొక్క ప్రధాన కార్యాలయమువద్ద మనమందరమూ కూడుకోలేము, కానీ ఎక్కడైతే మనము ఆయనను ప్రసంగవేదిక మీద ఉంచుతామో అటువంటి సంఘాలుగా, మన సంఘములను, లేదా మన గృహములను మనము మార్చుకోవచ్చు. అక్కడ సరిగ్గా అది బయలుపరచబడిన రీతిగానే ఆ పరిపూర్ణ వాక్యముపై మనము పోషించబడగలము.
దేవునియొక్క స్వరమును వింటూ, పరలోక స్థలములలో కూర్చొనుట కంటే, ఏ గొప్ప కూడిక, ఏ గొప్ప అభిషేకము, ఏ గొప్ప స్థలము లేదు.
ఈ ఆదివారము జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా, మధ్యాహ్నం 12:00 P.M. గంటల సమయమప్పుడు, దేవుడు మరొకసారి ఆయనయొక్క వర్తమానికుడైన దూత ద్వారా మనతో మాట్లాడి మరియు మన హృదయములలో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానమిచ్చి, మరియు మనము ఆయనయొక్క వధువైయున్నామని భరోసా ఇస్తుండగా, మాతో కలిసి దేవునియొక్క నిర్ధారించబడిన స్వరమును వినడానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
Sunday’s Message: ప్రశ్నలు మరియు జవాబులు #1 64-0823M