భద్రము చేయబడిన ఉత్తరములు
9, మార్చి 2024, శనివారం

వెలుగు సంబంధులైన పిల్లలారా,

మనము ఆయన వెలుగులో నడుచుచున్నందుకు ఎంత కృతజ్ఞులమైయున్నాము కదా. ఆ వెలుగులో భాగమైయ్యుండుటకు, ఆయన వెలుగుతో గుర్తించబడుటకు ఎంత కృతజ్ఞులమైయున్నాము కదా. ఆయన చేత ఎన్నుకోబడి మరియు పిలువబడినందుకు ఎంత కృతజ్ఞులమైయున్నాము కదా. మనము క్రీస్తుయొక్క వధువైయ్యుండి, ఆయనతో గుర్తించబడియున్నాము. ఇరువురు ఇప్పుడు ఒక్కటయ్యారు.

నేను దానిని ఎన్నిసార్లు రాసినా తక్కువే. మనము దానిని ఎన్నిసార్లు చెప్పినా సరిపోదు. ఈ వర్తమానమే మన సర్వస్వమైయున్నది. ఆయన వాక్యముయొక్క సత్య ప్రత్యక్షతను మనము కలిగియున్నామని తెలుసుకోవడం మనము మాటలలో చెప్పలేనటువంటి విషయమైయున్నది.

ఈ దినమున జీవిస్తూ మరియు జరుగుచున్నదానిలో భాగమవ్వడమనేది, దేవుడు మనకు అనుగ్రహించగల అత్యంత గొప్ప ఘనతయైయున్నది. బ్రెన్హామ్ టెబర్నికల్ వద్ద కూడికలలో కూర్చొని, దేవుని దూత ఈ వర్తమానాలను తీసుకొనిరావడాన్ని చూడటము మరియు వినడము ఎంతో గొప్ప విషయమైయ్యుండగా, ఈ దినములో, మరియు ఈ సమయములో జీవిస్తూ, మరియు ఆ వాక్యముయొక్క నెరవేర్పుయైయ్యుండటం ఇంకెంతో గొప్ప విషయమైయున్నది.

ఆయనయొక్క వాక్యముచేత పరిపూర్ణము చేయబడుటకై, ప్రపంచమంతటినుండి మనము కూడుకొని, అందరమూ ఒకే సమయములో దేవుని స్వరమును వినడానికి, దేవుడు, తన గొప్ప ప్రణాళికలో, ఒక మార్గమును కలుగజేశాడు. ఏ క్షణమునయైనా మన ఏడవ దూత వర్తమానికుడు ఇట్లు చెప్పడాన్ని వినుటకు వేచియుండుట;

“ఇదిగో లోకపాపములను మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్ల!”

కాలము ప్రారంభమైనప్పటినుండి అటువంటి ఒక విషయము ఎన్నడూ లేదు. దేవుని గొప్ప ప్రణాళికయొక్క ముగింపు, సరిగ్గా ఇప్పుడు, సంభవించుచున్నది, మరియు మనము దానిలో భాగమైయున్నాము. ప్రభువుయొక్క మహాదినము సమీపమైనది.

దేవునియొక్క వర్తమానికుడైన దూత ద్వారా మర్మములన్నియు వధువుకు బయలుపరచబడినవి. ముద్రలు, కాలములు, ఉరుములు, ఎత్తబడే విశ్వాసము, మూడవ ఈడ్పు…ప్రతీది పలుబడి మరియు వధువు మరలా మరలా వాటిని వినగలుగునట్లు టేపులలో ఉన్నవి, మరియు అది మనల్ని పరిపూర్ణము చేస్తుంది.

పరిశుద్ధాత్మ తిరిగి మరలా సంఘములో ఉన్నాడు; ఆయన వాగ్దానము చేసినట్లే సాయంకాల సమయములో, క్రీస్తు, తానే, మానవ శరీరములో బయలుపరచుకున్నాడు.

వధువా ఇప్పుడు జాగ్రత్తగా విను, దానిని పట్టుకో.

మనము వాక్యముచేత బయటకు పిలువబడినాము; స్వయంగా క్రీస్తే మనలను బయటకు పిలిచాడు. ఆయన తననుతాను మనకు తేటపరచుకున్నాడు; హెబ్రీ 13:8, లూకా 17:30, మలాకీ 4, హెబ్రీ 4:12, ఆయన మనకు వాగ్దానము చేసిన ఈ లేఖనములన్నిటిని తేటపరిచాడు.

ఈ దినము కొరకు ముందుగా నిర్ణయించబడిన ఈ లేఖనముల ద్వారా తననుతాను మనకు బయలుపరచుకున్నది, మరలా జీవించుచున్న, దేవుని కుమారుడైన, యేసే.

మరియు దానిని నమ్మడం, పరిశుద్ధాత్మను కలిగియున్నారనుటకు రుజువైయున్నది.

దేవుడు తన వధువును బయటకు పిలువడానికి తన ప్రవక్తను పంపాడు. ప్రవక్త అనగా, దేవునియొక్క సజీవ వాక్యము ప్రత్యక్షపరచబడటమే అని వాక్యము మనకు చెప్పుచున్నది. లోకము పొందుకునే చివరి సూచన అదేయైయున్నది; యెహోవా ఒక మానవ రూపములోనుండి మాట్లాడుట.

ఒక ప్రవక్త వలె, మానవ శరీరములో ఉన్న ఒక మనుష్యుడు, మరి అయిననూ తన వెనుకాల ఉన్న శారా హృదయములోని తలంపును వివేచించుచున్న ఆయన ఎలోహిం అయ్యున్నాడు. మరియు యేసు ఇట్లు చెప్పాడు, “లోతు దినములలో జరిగినట్లే, ప్రపంచముయొక్క ముగింపులో, మనుష్యకుమారుడు,” దేవుని కుమారుడు కాదు, “మనుష్యకుమారుడు ప్రత్యక్షపరచుకుంటున్నప్పుడు జరుగును.”

మీరు స్థిరంగా వాక్యములో ఉంటేనే తప్ప ఆయన ఎవరో మీరు తెలుసుకోలేరని, వధువు ఎరిగియున్నది. ప్లే నొక్కడం ద్వారా ప్రతీ రోజు ఆ స్వరమును తమయెదుట ఉంచుకోవడం ఎంత అవసరమో వారికి తెలుసు.

ఇప్పుడు ఏడవ బూరను ఊదడానికి, ప్రకటనలోని దేవునియొక్క ఇద్దరు ప్రవక్తలు రంగం మీద ప్రత్యక్షమవ్వగలుగునట్లు, వధువు దారిలోనుండి తప్పుకొని, మరియు పైకి వెళ్ళవలసియున్నది. క్రీస్తును వారికి తెలియజేయుటకైయున్నది.

ఈ ఆదివారము జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా 12:00 P.M., గంటల సమయమప్పుడు, దేవుని ప్రవక్త, బూరల పండుగ 64-0719M, అనే వర్తమానమును అందిస్తూ, మరియు తండ్రితో మాట్లాడుచు ఇట్లు చెప్పుచుండగా వచ్చి ప్రవచనముయొక్క నెరవేర్పులో భాగమవ్వండి,

ప్రపంచ వ్యాప్తంగా, బయట దేశములలో, తమ గృహములయందు లేదా తమ సంఘములయందు ఈ టేపు మాత్రమే వారిని కలిసేటటువంటి కొందరు ప్రజలు ఉండవచ్చును. ప్రభువా, కూడిక జరుగుచుండగా, ఎక్కడైతే—ఎక్కడైతే…లేదా టేపు ప్లే చేయబడుచుండగా, లేదా మేము ఏ స్థానములో ఉన్నా, లేదా—లేదా ఏ పరిస్థిలో ఉన్నా, ఈ ఉదయము దేవుడు మా హృదయములయొక్క ఈ యదార్థతను ఘనపరచి, మరియు అవసరతలో ఉన్నవారిని స్వస్థపరచాలని, వారికి అవసరమైనదానిని వారికి అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాము.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

వర్తమానము వినుటకు ముందు చదువవలసిన లేఖనములు:
లేవీయకాండము 16
లేవీయకాండము 23:23-27
యెషయా 18:1-3
యెషయా 27:12-13
ప్రకటన 10:1-7
ప్రకటన 9:13-14
ప్రకటన 17:8

 

 


సంబంధిత కూడికలు
2, మార్చి 2024, శనివారం

ప్రియమైన మహోన్నత కళాఖండపు కుటుంబమా,

క్రీస్తుయొక్క వధువుకి ఈ చివరి వర్తమానములు ఎంత ఖచ్చితమైన సంపూర్ణతగా ఉన్నవి కదా. దేవుడు, మనయెదుట తనను తాను ముసుగు తొలగించుకొనుచు, తనను తాను తేటగా బయలుపరచుకొనుచున్నాడు. లోకము దానిని చూడలేదు, కానీ ఆయనయొక్క వధువైయున్న, మనకైతే, మనం చూడగలిగేది అదేయైయున్నది.

మనము ఆ ముసుగునుండి లోపలికి చొచ్చుకొని మరియు ఆయనను తేటగా చూచుచున్నాము. దేవుడు, మానవ చర్మముల వెనుక ఉన్నాడు. సరిగ్గా లూకా 17 మరియు మలాకి 4 లో ఆయన వాగ్దానము చేసినట్లు, వాక్యము శరీరమైనది. ఆయన తననుతాను ఒక మానవ ముసుగులో, తన ప్రవక్తలో మరియు తన సంఘములో దాచుకున్నాడు.

దేవుడు తన వర్తమానికుడైన దూత ద్వారా మాట్లాడి మరియు మనతో ఇట్లు చెప్పుటను మనం విన్నప్పుడు మనము ప్రపంచములో అత్యంత సంతోషకరమైన ప్రజలమైయున్నాము,

నేను మీ విషయమై ఎంతో కృతజ్ఞుడనైయున్నాను. నేను మీతో కలిసియున్నందుకు ఎంతగానో ఆనందిస్తున్నాను. నేను మీలో ఒకడినైయున్నందుకు ఎంతగానో ఆనందిస్తున్నాను. దేవుడు మీకు తోడైయుండును గాక. ఆయన తోడైయుంటాడు. ఆయన మిమ్మల్ని ఎన్నడూ విడువడు. ఆయన మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన మిమ్మల్ని విడువడు. మీరు ఇప్పుడు ఆ తెరను చీల్చుకొని వచ్చేసారు.

మనము అందరికీ, మన స్వంత ప్రజలకు కూడా వింత వ్యక్తులమయ్యాము, కానీ ఈ దినమునకైన ఆయనయొక్క వాక్యమును గూర్చి ఆయన మనకిచ్చిన ప్రత్యక్షతకై, మనము ఎంతో అతిశయము కలిగియున్నాము, ఎంతో కృతజ్ఞులమైయున్నాము. క్రీస్తు కొరకు మరియు ప్రత్యక్షపరచబడిన ఆయన వాక్యము కొరకు వెఱ్ఱివారిగా ఉండుటకు కృతజ్ఞులమైయున్నాము.

మనము మన విశ్వాసమును ఆయన ప్రవక్తయొక్క విశ్వాసముతో కలిపాము, మరియు ఏకముగా ఐక్యపరచబడి, దేవునియొక్క గొప్ప భాగముగా మారాము. మనము లేకుండా ఆయన ఏమియు చేయలేడు; ఆ ప్రవక్త లేకుండా మనము ఏమియు చేయలేము; దేవుడు లేకుండా కూడా మనము ఏమియు చేయలేము. కావున ఏకముగా కలిసి, మనము ఒక గొప్ప భాగమును చేయుచున్నాము, ఆ సంబంధము; దేవుడు, తన ప్రవక్త, తన వధువు. మనము ఆయనయొక్క మహోన్నత కళాఖండముగా మారినాము.

ఆయనయొక్క మొదటి మహోన్నత కళాఖండమును చేయుటకు ఆయనకు నాలుగువేల సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు, ఆయనయొక్క మరొక మహోన్నత కళాఖండమును చేయుటకు, అనగా మనలను, తన వధువును, ఆయనయొక్క గొప్ప మహోన్నత కళాఖండపు కుటుంబమును, రెండవ ఆదాము మరియు రెండవ హవ్వను చేయుటకు ఆయనకు రెండువేల సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మనము తోట కొరకు, వెయ్యేండ్లపాలన కొరకు సిద్ధముగా ఉన్నాము. ఆయన మరలా మనలను తయారు చేసాడు మరియు మనము సిద్ధంగా ఉన్నాము.

మనము ఆయనయొక్క పరిపూర్ణ వాక్య వధువైయున్నాము, ఆయనయొక్క అసలైన సృష్టిలో భాగమైయున్నాము. కాండము, వెన్నులు, మరియు పొట్టు, ఇప్పుడు గింజను లోపలికి తెచ్చుచున్నవి, పునరుత్థానము కొరకు సిద్ధంగా ఉన్నది, మరియు కోత కొరకు సిద్ధంగా ఉన్నది. ఆల్ఫా ఒమేగగా మారినది. లోపలికి వెళ్ళిన విత్తనము, ఒక ప్రక్రియగుండా వెళ్ళి మరియు మరలా విత్తనముగా వచ్చినది.

ఏదెను తోటలో పడిన, ఆ విత్తనము, అక్కడ చనిపోయి, తిరిగి వచ్చినది. అక్కడ చనిపోయిన ఆ అసంపూర్ణమైన విత్తనము, పరిపూర్ణమైన విత్తనముగా, రెండవ ఆదాముగా తిరిగి వచ్చినది.

ఇప్పుడు మనము రండవ ఆదాముగా, నిజమైన వధువుగా ఉన్నాము, మరలా అసలైన వాక్యముతో తిరిగి వచ్చిన విత్తనమైయున్నాము. మనము విత్తనమైయ్యుండుటకు వాక్యమంతటినీ కలిగియుండవలసియున్నాము. మనము సగం విత్తనమును కలిగియుండలేము, మనము ఎదగలేము, మనము సంపూర్ణ విత్తనముగా ఉండవలసియున్నాము.

ఒకేఒక్కటి మిగిలియున్నది, కోత వచ్చియున్నది. మనము ఎంతగానో పరిపక్వత చెందాము. మనము రాకడ కొరకు సిద్ధంగా ఉన్నాము. ఇది కోత కాలమైయున్నది. విత్తనము తిరిగి దానియొక్క అసలైన స్థితిలోనికి వచినది. మహోన్నత కళాఖండపు కుటుంబము మరలా వచ్చియున్నది, క్రీస్తు మరియు ఆయనయొక్క వధువు.

ఆయనయొక్క ప్రవక్తను మరియు ఆయనయొక్క వధువును ప్రోత్సహించడానికి, ప్రభువు తన దూతకు ఒక గొప్ప దర్శనమును ఇచ్చాడు. ఆయన అతనికి మనలను గూర్చిన, అనగా ఆయన వధువును గూర్చిన ఒక ముంగుర్తును ఇచ్చాడు. మనము ఆయన ప్రక్కనుండి వెళ్ళుచుండగా, మనము చక్కగా-కనబడుచున్న చిన్న స్త్రీలమైయున్నామని, ఆయన చెప్పాడు. మనము వెళ్ళుచుండగా మనము నేరుగా ఆయన వైపే చూస్తూ ఉన్నామని, ఆయన చెప్పాడు.

మరియు ఆఖరిలో, కొందరు వరుసలోనుండి బయటకు తోలిగారు, మరియు తిరిగి వరుసలోనికి రావడానికి తమ సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అప్పుడు ఆయన చాలా ప్రాముఖ్యమైన ఒక విషయమును గమనించాడు, వారు బయట ఇంకెటువైపుకో చూస్తున్నారు గాని, ఆయనను చూడటంలేదు. వారు గందరగోళములోనికి వెళ్ళిపోయిన ఆ సంఘమును గమనిస్తున్నారు. అది, ముందువరుసలోనున్న మనము కాదని చెప్పుటకు, నేను ఎంతో అతిశయపడుచున్నాను మరియు ఎంతో కృతజ్ఞుడనైయున్నాను, మనమెన్నడూ వరుసను దాటలేదు లేదా మన దృష్టిని ఆయన వైపునుండి మళ్ళించలేదు.

కావున, మహోన్నత కళాఖండము మరియు దేవుని కుమారుడు, మహోన్నత కళాఖండము మరియు వధువు, మరది ఆయనలో ఒక భాగమైయున్నది, అది దేవునియొక్క వాక్యమును నెరవేర్చవలసిందిగా ఉన్నది. వాక్యము నెరవేర్చబడినది, మరియు మనము ప్రభువుయొక్క రాకడ కొరకు సిద్ధంగా ఉన్నాము.

మనము ఆయనయొక్క మహోన్నత కళాఖండముల కుటుంబమైయున్నామని, ఆయనయొక్క నిజమైన వధువైయున్నామని తెలుసుకొనుటకు మనమెంత కృతజ్ఞులమైయున్నాము కదా. వాక్యము నెరవేర్చబడినది, మరియు మనము ప్రభువుయొక్క రాకడ కొరకు సిద్ధంగా ఉన్నాము.

ఈ ఆదివారము జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా 12:00 P.M., గంటల సమయమప్పుడు, ప్రవక్త మాకు: మహోన్నత కళాఖండము 64-0705 అనే వర్తమానమును అందించడాన్ని మేము వినుచుండగా మాతో చేరి, మాతోపాటు వాక్యమును విని, మరియు దేవునియొక్క గొప్ప మహోన్నత కళాఖండపు కుటుంబములో భాగమవ్వడానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

కూటమునకు ముందు చదువవలసిన లేఖనములు:

యెషయా 53:1-12
మలాకీ 3:6
పరిశుద్ధ. మత్తయి 24:24
పరిశుద్ధ. మార్కు 9:7
పరిశుద్ధ. యోహాను 12:24 / 14:19

 

 


సంబంధిత కూడికలు
24, ఫిబ్రవరి 2024, శనివారం

ప్రియమైన స్నేహితులారా,

జఫర్సన్ విల్ లో మధ్యాహ్నం 12:00 P.M. గంటలు, ఆఫ్రికాలో సాయంత్రం 7:00 P.M. గంటలు, ఆరిజోనాలో ఉదయం 10:00 A.M. గంటలు; ప్రపంచమంతటినుండి వధువు కూడుకొనియున్నది. ఈ క్షణము కొరకే మనము వారమంతా వేచియున్నాము. తనయొక్క బలిష్టమైన ఏడవ దూత వర్తమానికుడి ద్వారా మానవ పెదవులగుండా దేవుడు మనతో మాట్లాడవలెనని వేచిచూస్తూ, మనము గొప్ప ఎదురుచూపుతో ఉన్నాము. “దేవా నన్ను సిద్ధపరచుము, నన్ను అభిషేకించుము, మరియు నీ వాక్య ప్రత్యక్షతను నాకు మరి ఎక్కువగా దయచేయుము,” అని మనము ప్రార్థించుచున్నాము.

ప్రవక్త, మరియు ప్రవక్త మాత్రమే, ఈ గడియ కొరకైన జీవపు మాటలను కలిగియున్నాడని, మనము నిశ్చయంగా ఎరిగియున్నాము గనుక, మనము సంతృప్తి కలిగియున్నాము. మనము దానినంతటిని వివరించలేకపోవచ్చును, కానీ మనము ప్రతీ మాటను నమ్ముచున్నామని మరియు వాటిపై విశ్రాంతి పొందుచున్నామని మనకు తెలియును.

ప్రభువు సరిగ్గా మోషేతో చేసినట్లే, దేవుడు మనయెదుట తన ప్రవక్తను మహిమపరబోవుచున్నాడని, మనకు తెలియును. ఆ సమయములో, ఆయన పర్వతములను కుదిపివేసాడు. ఈసారి, ఆయన భూమ్యాకాశములను కుదిపివేస్తున్నాడు.

ఆ క్షణము ఆసన్నమైనది. మన గుండెలు మనలో ఎంతో వేగంగా కొట్టుకొనుచున్నవి. మన జాతీయ గీతం మ్రోగుటను మనము వినుచున్నాము. ఏక మనస్సుతో, ప్రపంచవ్యాప్తంగా వధువు లేచి నిలబడి మరియు కేవలము నమ్ముము, సమస్తము సాధ్యమే, కేవలము నమ్ముము, అని పాడుతుంది. దేవుడు మనతో మాట్లాడనైయున్నాడు.

మనము దీనిని వింటాము: “స్నేహితులారా శుభోదయం.”

కేవలం ఈ సామాన్యమైన మూడు పదాలను వినడంతోనే మన హృదయములు ఆనందిస్తాయి. ఇప్పుడే ప్రవక్త నన్ను తన స్నేహితుడని పిలిచాడు. పిదప ఆయన మనతో ఇట్లు చెప్తాడు,

నేను మీ అందరిమీద బెంగ కలిగియున్నాను. నేను—నేను ఎక్కడికి వెళ్ళేది నేను లెక్కచేయను, నేను—నేను…అది, అది మీరు కాదు. ప్రపంచమంతటినుండి, నాకు స్నేహితులున్నారు, కానీ అది—అది—వారు మీరు కాదు. ఈ చిన్న గుంపు విషయమై ఏదో ఉన్నది…ఏమిటో నాకు తెలియదు. నేను వారిని గూర్చి ఆలోచిస్తుంటాను…ఈ గుంపులాగా, నాతో నిలబడే ఏ—ఏ గుంపును, భూమి మీద నేను ఎరుగను. రానైయున్న రాజ్యములో, మనము కలిసి అక్కడ ఉండేంతగా, దేవుడు మనలను విడదీయబడకుండునట్లు చేయును—చేయునుగాక; అదియే నా ప్రార్థనైయున్నది.

దేవుడు ఈ రోజు మనకు ఏ గొప్ప ప్రత్యక్షతను బయలుపరచుతాడు? మనము ఏమి వినబోవుచున్నాము? బహుశా ఇంతకుమునుపు మనము దానిని అనేకసార్లు వినియుండవచ్చును, కానీ ఈ రోజు అది భిన్నముగాను, మరియు ఇంతకుముందెన్నడూ లేని విధంగాను ఉంటుంది.

అదేమిటి? విశ్వాసియొక్క ఆహారము. మనము విందు చేసుకొనునట్టి పరలోకము నుండి వచ్చిన సముఖపు రొట్టెయైయున్నది. ఆయనయొక్క వధువైయున్న మనకు మాత్రమే చెందునట్టి, సముఖపు రొట్టెయైయున్నది. మనలను కుళ్ళిపోకుండునట్లు ఉంచేది ఆ సముఖపు రొట్టెలపై ఉన్న షెకినా మహిమయే.

వెలుపటనున్నవారు మనలను చూసి మరియు ఇట్లు అడుగుతారు, “మీరేమి చేస్తున్నారు? మీరు కేవలం టేపులను వినుచున్నారా? మీరు నిజంగా వింత వ్యక్తులే.”

మహిమ!! వింత వ్యక్తులుగా, ఆయన కొరకు మరియు ఆయనయొక్క నిర్ధారించబడిన వాక్యము కొరకు వెర్రివారిగా ఉన్నందుకు; మనమెంతో సంతోషిస్తున్నాము మరియు ప్రభువునకు ఎంతో కృతజ్ఞులమైయున్నాము. “అవును, టేపు పరిచర్యను నేను నమ్ముతాను. ప్లేను నొక్కడమును నేను నమ్ముతాను. మీరు వినగలిగే అత్యంత ప్రాముఖ్యమైన స్వరము అదేనని నేను నమ్ముతాను. అవును, టేపులను తిరిగి ప్రసంగ వేదికపై పెట్టడమును నేను నమ్ముతాను,” అని ప్రపంచానికి చెప్పుటకు మనము ఆనందిస్తాము.

ఆచారాల తెర తొలగించబడినప్పుడు, దేవుడు ఇంకనూ వాక్యమైయున్న దేవుడని మీరు చూడగలరు. ఆయన ఇంకనూ తన మాటను నిలబెట్టుకుంటాడు. ఆయన—ఆయనే దేవుడైయున్నాడు, తన వాక్యమును వ్రాసినది ఆయనే.

మిగతా ఎవ్వరు ఏమి చేసినాగాని, లేదా ఏమి చెప్పినాగాని, మనము మాత్రం దానిని నమ్ముతాము, మరియు పిదప మనము దాని ప్రకారంగా క్రియ చేస్తాము. మీరు దానిని చేయనియెడల, మీరు దానిని నమ్మనట్లే. మీరు తెరలోపల లేరు. ఆ తెర ఒక్క వ్యక్తికి మాత్రమే చెందియున్నది. ఆ వర్తమానము ఒక్కటేయైయున్నది.

దానిని నేరుగా చెప్పకుండా దేవుడు సంఘమునకు ఏమి తెలియజేయాలనుకుంటున్నాడో దానిని గూర్చిన ఆత్మసంబంధమైన గ్రహింపు మీకు వచ్చినదని నేను—నేను ఆశిస్తూ మరియు నమ్ముచున్నాను. చూశారా? అది ఎటువంటి సంగతనగా, కొన్నిసార్లు, పలచన చేసే విధంగా, కొంతమందిని బయటకు పంపించే విధంగా, కొంతమందిని వెళ్ళిపోయేలాగా, మరియు కొందరిని ఆలోచింప—జేసేలాగా—ఆ విధంగా, మనము విషయాలను చెప్పవలసియుంటుంది. అయితే అది ఉద్దేశ్యపూర్వకంగానే చేయబడుతుంది. అది ఆ విధంగానే చేయబడవలసియున్నది.

వాక్యము దేవునియొక్క ప్రవక్తకు బయలుపరచబడినది. పరిసయ్యులు, లేదా సద్దూకయిలు, లేదా ఒక ఫలానా వర్గము లేదా ఒక తెగ వంటి ఏ గుంపు లేదు. అది ప్రవక్త మాత్రమే! దేవుడు ఒక్క మనుష్యుడిని కలిగియున్నాడు. ఆయన రెండు లేదా మూడు భిన్నమైన మనస్సులను కలిగిలేడు. ఆయన ఒక్క మనుష్యుడినే తీసుకున్నాడు. అతడు వాక్యమును కలిగియున్నాడు, మరియు అతడు మాత్రమే కలిగియున్నాడు.

అటువంటప్పుడు కొందరు ఇట్లంటారు, “దేవుడు ఉద్దేశ్యపూర్వకంగా అటువంటి ఒక విషయమును చేస్తాడా?” ఆయన నిశ్చయంగా అట్లు చేసాడు. ఆయన ఇంకనూ అట్లు చేస్తాడు.

“కానీ దేవుడు పిలచిన ఇతర వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నారు”: అని కొన్ని వందల సంవత్సరాల క్రితము వారు అన్నట్లే, ఈనాడు మనము అదే విషయమును వింటున్నాము. అది నిజము. మరియు వారు దీనిని వెంబడిస్తూ దీనితో కొనసాగినంతకాలం, ఆమేన్, కానీ ఒకరు లేచి మరియు ఆయన ముందుగా నిర్ణయించుకొని మరియు ఆ పని కొరకు అభిషేకించిన మన ప్రవక్తకు, దేవుడు ఇచ్చిన దేవునియొక్క స్థానాన్ని తీసుకొనుటకు ప్రయత్నించినట్లైతే, అప్పుడు మనము ఆ నిర్ధారించబడిన వాక్యముతో, మన దినమునకైన దేవునియొక్క స్వరముతో నిలబడవలసియున్నది.

గమనించండి, ఇప్పుడు, దానికి దూరంగా ఉండటం మరణమే. మీరు ఈ తెరలోనుండి మాత్రమే దానిలోనికి వెళ్ళవలసియున్నది, లేదా మీరు వెళ్ళలేరు. దేవుడు వారిపై ఏ విధంగా కనికరము చూపించగలడో కదా, అయితే గుర్తుంచుకోండి, అదేమిటనగా దేవుడు ఆ తెర వెనుక ఉన్నదానిని ప్రత్యక్షపరచుచున్నాడు. ఆ తెర వెనుక ఏమి ఉన్నదో గమనించండి, వాక్యము ఉన్నది! అది దేనిని ముసుగుగా కప్పియున్నది? వాక్యమును! అదేమిటి? అది మందసములో ఉన్నది. ఆ తెర దాచినది వాక్యమునేయైయున్నది. చూశారా? మరియు యేసు ఆ వాక్యమైయ్యుండెను, మరియు ఆయనే ఆ వాక్యమైయున్నాడు, మరియు ఆయనయొక్క శరీరము అనే తెర దానిని దాచిపెట్టినది.

మనకైతే, అది ఒక కార్యరూపణయైయున్నది! అది ఇక ఎంతమాత్రము ఒక వాక్యము కాదు, అది ఒక వాస్తవమైయున్నది! ఆమేన్!

ఇతరులకు మనము వింత వ్యక్తులమని, మరియు మనము చెప్పేది లోకానికి ఒక వెఱ్ఱితనముగా అనిపించవచ్చునని మనకు తెలుసు, అయితే అది సమస్త జనులను ఆయన వైపుకు ఆకర్షించుచున్నది.

ఈ ఆదివారము జఫర్సన్ విల్ కాలమానము ప్రకారంగా మధ్యాహ్నం 12:00 P.M., గంటల సమయమప్పుడు, ఏ విధంగా మనము వింత వ్యక్తులు 64-0614E

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

వర్తమానమును వినుటకు ముందు చదువవలసిన లేఖనములు:
I కోరింథీ 1:18-25
II కోరింథీ 12:11

 

 


సంబంధిత కూడికలు
17, ఫిబ్రవరి 2024, శనివారం

ముసుగు లోపటనున్న ప్రియమైన వధువా,

“ప్లేను నొక్కడం మీరు చేయగల అత్యంత ముఖ్యమైన విషయము,” అని నేను మీకు మళ్ళీ మళ్ళీ ఎందుకని చెప్తూ ఉంటాను? “సహోదరుడు బ్రెన్హామ్ గారిని తిరిగి మీ ప్రసంగ వేదికల్లో పెట్టండి,” అని నేను సంఘకాపరులకి ఎందుకని చెప్తూ ఉంటాను?

అది కేవలం ఇంత సులువైన విషయమైయున్నది. ఎందుకనగా టేపులో ఉన్న ఏడవ దూత వర్తమానికుడి స్వరమును వినుట, సజీవమైన దేవుని స్వరమును వినుటయే.

ప్రజల యెదుట, దేవుడు మరలా ముసుగు ధరించుకొని మరియు మోషేను నిర్ధారించాడు, ముసుగు ద్వారా, తననుతాను అదే అగ్నితో, అదే అగ్నిస్తంభముతో ముసుగు ధరించుకొనుట ద్వారా క్రిందికి దిగివచ్చాడు. అప్పటి—అప్పటి నుండి...వారు, వారు దేవుని స్వరమును మాత్రమే వినగలుగుట కొరకైయున్నది. మీకు అది అర్థమైనదా? కేవలం వాక్యమును, వారు ఆయన స్వరమును విన్నారు, ఎందుకనగా, మోషే, వారికి, సజీవ వాక్యమైయున్నాడు.

సజీవ సేవకుని గురించి మాట్లాడండి! టేపులలో మనము వింటున్న స్వరము మన దినమునకైన సజీవ వాక్యమైయున్నది. అది దానికంటే ఇంకా గొప్పగా ఏమియు మారదు.

మోషే దినములో, శిభిరములో ఉన్న ఇశ్రాయేలు పిల్లలు మాత్రమే అతని స్వరమును వినగలిగారు. కానీ ఈనాడు, ప్రపంచమంతా తన స్వరమును వినాలని దేవుడు కోరాడు, కావున తన వధువు సజీవ వాక్యపు స్వరమును వినగలుగునట్లు, ఆయన టేపులో దానిని రికార్డు చేపించాడు.

దేవుడు తన మాటలను వారితో మాట్లాడటానికి, తనను తాను తన ప్రవక్తలో ముసుగు ధరించుకున్నాడు. ఆయన చేసినది అదేయైయున్నది. అగ్నిస్తంభము ద్వారా ముసుగు ధరించబడి, మోషేయే ప్రజలకు ఆ సజీవమైన వాక్యమైయున్నాడు.

మన దినమునకై దానిని గూర్చిన ప్రత్యక్షతను మీరు కలిగిలేకపోతే, మీరు క్రీస్తుయొక్క వధువు కాలేరు. మీరు కలిగియున్నయెడల, అప్పుడు మీరు యేసు క్రీస్తుయొక్క వధువైయున్నారు మరియు మీరు ఈ విధంగా చెప్పవలసియున్నారు, “టేపులను వినుటకంటే ప్రాముఖ్యమైన విషయం ఏమియు లేదు, ఎందుకనగా అది నేరుగా దేవుడే మీతో మాట్లాడుటయైయున్నది.

అనేకులు ప్రజలను భయపెట్టుటకు ప్రయత్నిస్తూ మరియు మనము ప్రవక్తను ఎంతో హెచ్చిస్తున్నామని; మనము ఆయనను ఆరాధిస్తున్నామని చెప్తుంటారు. నా స్నేహితులారా, ఈ సంగతులను చెప్పినది ఆయనే, నేను కాదు. నేను కేవలం ఆ వాక్యమును ఎత్తి చూపిస్తున్నాను.

ప్రతికాలములో అది చేయబడినట్లే, దైవత్వము మానవ శరీరములో ముసుగు ధరించబడియున్నది. గమనించండి, ఆయన అట్లు చేసాడు. ప్రవక్తలు, ముసుకు ధరించబడిన దైవత్వమైయున్నారు. వారు మానవ శరీరములో ముసుగు ధరించబడిన (అది సరియేనా?) దేవునియొక్క వాక్యమైయున్నారు. కావున, వారు మన మోషేను కూడా, చూడండి, అనగా యేసును కూడా వారు గుర్తించలేదు.

మనము ఒక మానవుడిని ఆరాధించడంలేదు, కానీ, ముసుగు ధరించుకొని మరియు ప్రవక్త ద్వారా తనను తాను బయలుపరచుకుంటున్న దేవుడిని ఆరాధిస్తున్నాము. దానిని అర్థం చేసుకొని మరియు దానిని నమ్ముటకు, మీరు దీనిని చేయవలసియున్నది.

చిన్నవారలారా, మీరు ఇక మీదట ఆ ముసుగుకు వెలుపల లేరు, దేవుడు పూర్తిగా మీ ఎదుటకు వచ్చియున్నాడు.

మనము ఇకమీదట ఎంతమాత్రము ఆ ముసుగుకు వెలుపల లేము, అది దేవుడే తననుతాను స్పష్టముగా బయలుపరచుకోవడమని మనము చూడగలుగుచున్నాము. టేపులలో ఉన్న ఆ స్వరమును వినడమంటే దేవుడే తన వధువుతో మాట్లాడుటయైయున్నదని బయలుపరచబడియున్నది. అది ఈ దినమునకై ఆయన ఏర్పాటు చేసిన మార్గమని మనము నమ్ముచున్నాము.

మనము ఆ స్వరమునకు మాత్రమే ఆమేన్ చెప్పగలుగుతాము, మరిదేనికినీ కాదు. మనము తెసులుకోవలసిన ప్రతిదానిని, ఆ స్వరమే మనకు ప్రసంగిస్తుంది, బోధిస్తుంది మరియు బయలుపరచుతుంది. ఆ స్వరము మనలను మన ప్రభువైన యేసు క్రీస్తుకు పరిచయము చేస్తుంది. మనకు కావలసినదంతా మరియు మనకు అవసరమైయ్యున్నదంతా ఆ స్వరమే. ప్రజలకు ఆ స్వరమును చూపించడానికి దేవుడు ఉపయోగించుకుంటున్న 5-రకాల పరిచర్య కొరకు మేము కృతజ్ఞులమైయున్నాము; దర్శనమును పట్టుకొని మరియు వారి సంఘములలో టేపులను ప్లే చేయడమే వారు తమ ప్రజల కొరకు చేయగలిగే అత్యంత గొప్ప కార్యమైయున్నది అనే ప్రత్యక్షతను కలిగియున్న సంఘకాపరులకు కృతజ్ఞులమైయున్నాము.

ఈ ఆదివారమునాడు జఫర్సన్ విల్ కాలమానము ప్రకారంగా 12:00 P.M., గంటల సమయమప్పుడు, ఆ గొప్ప సజీవ వాక్య స్వరము: ముసుగు తొలగించబడిన దేవుడు 64-0614M ను బయలుపరచడాన్ని మేము వినుచుండగా మీరును మాతో కలిసి దానిని వినవలెనని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

 


10, ఫిబ్రవరి 2024, శనివారం

ప్రియమైన మొలకెత్తిన విత్తనమా,

దేవునియొక్క ఏడవ దూత వర్తమానికుడు తాను ఏ విధంగా దేవుని సంకల్పమంతటినీ మీకు తెలుపకుండ దాచుకొనలేదో మీకు చెప్పడాన్ని కూర్చొని వినడం ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు అసలు ఊహించగలరా? మూడవ ఈడ్పు గురించి ఎంతో వివరంగా చెప్పుచు, మరియు ఇప్పుడది ఏ విధంగా నిర్ధారించబడినదో మీకు ఋజువు చేయుటను వినడం ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు ఊహించగలరా?

అబ్రాహాము కొరకు ఒక పొట్టేలును పలికినట్లే; దేవుడు ఏ విధంగా ఉడతలను ఉనికిలోనికి పలికాడన్న విషయము. ఖచ్చితంగా సరియైన విషయమును పలికిన హ్యాట్టీ అనే ఒక దీనమైన సహోదరితో అతడు మాట్లాడవలెనని మరియు ఆ ఉడుతలను ఉనికిలోనికి పలికిన అదే స్వరము ఆమె ఏమి కోరుతుందో దానిని ఇవ్వమనియు, మరియు సరిగ్గా అప్పుడే అది జరుగుతుందో లేదో చూడమన్నదనియు ఆమెతో చెప్పపని, ఏ విధంగా అదే స్వరము అతనితో చెప్పెనన్న విషయం.

ఏ విధంగా, ఒక దినమున తన స్నేహితులతో అడవిలో వేటాడుచున్నప్పుడు అతడు వెళ్ళిపోవునట్లు బలవంతపెట్టిన ఒక బలమైన తుఫాను వచ్చినదన్న విషయం. అయితే ఏ విధంగా దేవుడు అతనితో, నేరుగా మాట్లాడి మరియు, “భూమ్యాకాశములను సృష్టించినది నేనే. సముద్రములపై బలమైన గాలులను నిమ్మళపరచినది నేనే,” అని చెప్పిన విషయం.

ఆ స్వరము, “కేవలం ఆ తుఫానుతో మాట్లాడుము, మరది ఆగిపోతుంది, నీవు ఏది పలికితే, అది జరుగుతుంది, అని అతనితో చెప్పినప్పుడు ఏ విధంగా అతడు గంతువేసి మరియు తన టోపీని తీసివేసాడన్న విషయమును వినుట ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించగలరా.

అతడు అసలు ఆ స్వరమును ప్రశ్నించలేదు గాని, ఇట్లు పలికాడు, “తుఫానూ, నీవు ఆగిపొమ్ము. మరియు, సూర్యుడా, మేము ఇక్కడ నుండి వెళ్ళిపోయేవరకు, నాలుగు దినములు నీవు యదావిధిగా ప్రకాశించుము.”

అతడు దానిని పలికిన వెంటనే, ఆ వర్షము, మంచు, మరియు ప్రతీది ఆగిపోయినది. ఒక్క క్షణములోనే ఆ వేడి సూర్యుడు తన వీపు మీదుగా ఎలా ప్రకాశించాడో. గాలుల మారిపోయినవి మరియు ఆ మేఘములు, ఒక మర్మయుక్తమైనవాటివలె, గాలిలోనికి తెలిపోయినవి, మరియు కొద్ది నిమిషాలలోనే సూర్యుడు ప్రకాశించుచున్నాడు.

పిదప అది నెరవేరడానికి 16 సంవత్సరాలముందే, బ్రెన్హామ్ సహోదరియొక్క ఎడమప్రక్క అండాశయములో ఒక కణితి ఉన్నదని, మరియు అది అక్కడ ఎందుకు ఉంచబడినదని, దేవుడు ఏ విధంగా ఆయనకు చూపించాడో ఆయన మీకు చెప్తాడు. వారు దానిని తీసివేయమని ఎంతగా దేవుని ప్రార్థించారో. పిదప, అది కేవలం దేవుడు వారి విశ్వాసమును పరీక్షించడమని చెప్పాడు.

పిదప సరిగ్గా ఆపరేషన్ ద్వారా అది తీసివేయబడవలసి యుండుటకు ముందు, అతడు దేవునితో మాట్లాడుచు మరియు ఆమె అతనికి ఎంతటి ఒక అద్భుతమైన భార్యగా ఉన్నదో ఆయనకు చెప్పుచుండెను. అతడు ఎప్పుడూ ఇంటివద్ద ఉండకపోవడాన్ని గురించి ఆమె ఏ విధంగా ఎన్నడూ సణుగలేదో చెప్పుచుండెను. తాను కొంచెం విశ్రాంతి తీసుకొని మరియు ప్రభువుతో మాట్లాడుటకు, వేటకు వెళ్ళగోరినప్పుడు ఆమె ఎల్లప్పుడూ ఏ విధంగా ప్రతిదానిని తన కొరకు సిద్ధపరిచేదో చెప్పుచుండెను.

అప్పుడు అతను గదిలో ఏదో విన్నాడు. అతను పైకి చూడగా, ఆ స్వరము ఇట్లు చెప్పెను, “లేచి నిలబడుము,” మరియు అతనితో ఇట్లనెను, “ఇప్పుడు నీవు ఏది పలికితే, అది అట్లే జరుగుతుంది.”

అతను ఒక్క నిమిషము ఆగి, పిదప ఇట్లన్నాడు, “వైద్యుని హస్తము ఆమెను తాకడానికి ముందే, దేవుని హస్తము ఆ కణితిని తీసివేయును, మరియు ఆది అసలు కనుగొనబడదు.”

వైద్యుని హస్తము ఆమెను తాకడానికి ఒక్క క్షణము ముందే, ఆమె స్వస్థపరచబడినది. “శ్రీమతి. బ్రెన్హామ్, ఆ కణితి అక్కడ లేదని నేను మీకు నిశ్చయతను ఇవ్వగోరుచున్నాను. నీవు ఎటువంటి కణితిని కలిగిలేవు,” అని వైద్యుడు ఏ విధంగా అన్నాడో చెప్తాడు.

ప్రభువుయొక్క వాక్యము ఎంత పరిపూర్ణమైనది కదా!

అతని మనస్సులో ఇక ఎటువంటి సందేహము లేదని, మూడవ ఈడ్పు ఏమిటో మరియు అది ఏమి చేస్తుందో తాను ఎరిగియున్నాడని అతను మీకు చెప్పుటను వినడం ఎట్లుండును గదా. అతని అభిప్రాయములో, వెళ్ళిపోవుటకు, అది ఎత్తబడు విశ్వాసాన్ని ప్రారంభించేదిగా ఉంటుంది.

ఎప్పుడైతే దేవుడు మన కొరకు కొన్ని గొప్ప కార్యములను చేయబోవుచున్నాడో ఆ గడియ త్వరగా వచ్చును గనుక, మనము మర్యాదపూర్వకముగా ఉండవలెనని, మరియు మౌనముగా ఉండవలెనని చెప్తాడు. ఆ సమయము వచ్చినప్పుడు, ఆ ఒత్తిడి వచ్చినప్పుడు, అప్పుడు మనము ఏదైతే తాత్కాలికంగా చూసామో, అది దానియొక్క పూర్తి శక్తిలో ప్రత్యక్షపరచబడుటను చూస్తాము.

ఈ ఆదివారము జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా 12:00 P.M., గంటల సమయమప్పుడు మేము ఆ గొప్ప ఆశీర్వాదమును పొందుకుంటాము. మేము యేసు వైపు చూచుట 63-1229E అనే వర్తమానమును వినుచుండగా మీరు మాతో పాలిభాగస్థులవ్వాలని మిమ్మల్ని ఆహ్వానించుటకు నేను ఇష్టపడుచున్నాను.

ఒక మనుష్యుడు చెప్పేది వినుటకు మనము కూడుకొనుటలేదు; వీధులలో అనేకమంది మనుష్యులు ఉన్నారు, మరియు వారందరు చెప్పేది ఒకే విధంగా ఉంటుంది. మనము కేవలం ఒక సేవకుడిని లేదా సంఘకాపరిని చూడము, ఒక సేవకుడు లేదా ఒక సంఘకాపరి చెప్పేది వినము, మనము యేసుని చూస్తూ యేసు చెప్పేది వింటాము. ఆ మనుష్యుడు, ఆ దేవునియొక్క మనుష్యుడు, దేవుడైయ్యుండి, శరీరము దాల్చిన ఆ నజరేయుడైన యేసు, తన వధువుతో మాట్లాడటాన్ని వినడానికి మనము ప్రపంచమంటని నుండి కూడుకుంటాము.

మిమ్మల్ని మీరు ఈ విధంగా ప్రశ్నించుకోవలసియున్నారు, మీరు ఈనాడు దేనివైపు చూస్తున్నారు? మీరు చూసినప్పుడు, మీకేమి కనబడుచున్నది? మీరు వాక్యముగుండా ఆయను చూసినప్పుడే మీకు ఆయన కనబడతాడు.

ఆయన గలిలయలో నడిచినప్పుడు ఏమైయున్నాడో, ఈ రాత్రి జఫర్సన్ విల్ లో అదేయైయున్నాడు, బ్రెన్హామ్ ఆలయంలో ఆయన అదేయైయున్నాడు. మీరు ఏమి కనుగొనడానికి చూస్తున్నారు, ఒక స్థాపకుడినా, ఒక సంఘశాఖపరమైన వ్యక్తినా? మీరు యేసులో దానిని ఎన్నడూ కనుగొనలేరు. ఎవరో ఒక గొప్ప యాజకుడిని కనుగొనడానికి మీరు చూస్తున్నారా? మీరు యేసులో దానిని ఎన్నడూ కనుగొనలేరు. లేదండి. మీరు యేసును ఎలా చూస్తారు? దేవుని వాక్యము నెరవేర్చబడుటవలన చూస్తారు, ఎందుకనగా ఆయన దేవునియొక్క నెరవేర్చబడిన వాక్యమైయుండెను. ఆయన అప్పుడు ఏమైయున్నాడో, ఈ రాత్రి అదేయైయున్నాడు, మరియు ఎప్పటికి అదేయైయుంటాడు.

ఇప్పుడు యేసు వైపు చూచి మరియు బ్రతకండి; అది ఆయన వాక్యములో వ్రాయబడియున్నది, హల్లేలూయా! మనము కేవలం “చూచి మరియు బ్రతకడమే.”

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

ప్రసంగమును వినుటకు సిద్ధపడుటలో చదువవలసిన లేఖనములు:

సంఖ్యాకాండము 21:5-19
యెషయా 45:22
జెకర్యా 12:10
పరిశుద్ధ. యోహాను 14:12

 

 


సంబంధిత కూడికలు