ఆదివారం
05 మే 2024
64-0823E
Questions And Answers #2

ప్రియమైన పరిపూర్ణ వాక్యవధువా,

మనము ప్రభువుయొక్క రాకడ కొరకు వేచిచూస్తున్నాము. మన దీపములను శుభ్రముగా ఉంచుకొని, నూనెతో నింపబడి, రాత్రింబవళ్ళు బయలుపరచబడిన వాక్యమును వినుచున్నాము. ప్రతీ ఘడియ, ప్రార్థన చేసుకుంటున్నాము; ప్రతీ రోజు కాదు గాని, ప్రతీ ఘడియ. లోపల ఉండి, ప్రతీ వాక్యమును, నమ్ముట ద్వారా మనల్ని మనము సిద్ధపరచుకొని యుంటున్నాము.

మొదటగా, సమాధులలో నిద్రించువారు మేల్కొల్పబడుటకు, మనము ప్రతీ నిమిషము ఎదురుచూస్తున్నాము. ఒక క్షణములో, మనము వారిని చూస్తాము; తండ్రులు, తల్లులు, భర్తలు, భార్యలు, సహోదరులు మరియు సహోదరీలు. అక్కడ, వారు సరిగ్గా మనయెదుట నిలబడియుంటారు. మనము చేరుకున్నామని, ఘడియ వచ్చియున్నదని, ఆ క్షణములో మనమెరుగుదుము. ఎత్తబడు విశ్వాసము మన అంతరాత్మలను, మన మనస్సులను మరియు మన శరీరములను నింపివేస్తుంది. అప్పుడు ప్రభువుయొక్క ఎత్తబడు కృపలో ఈ క్షయమైన శరీరములు అక్షయతను ధరించుకుంటాయి.

మరియు అప్పుడు మనమందరము కూడుకోవడం ప్రారంభిస్తాము. సజీవులమై నిలిచియుండు మనము మార్పుపొందెదము. ఈ మర్త్యమైన శరీరములు మరణమును చూడవు. అకస్మాత్తుగా, ఏదో మన మీదుగా వెళ్ళి కప్పబడినట్లు అవుతుంది….మనము మార్పు చెందుతాము. ఒక వృద్ధుడినుండి యౌవ్వనస్థుడిగా, ఒక వృద్ధురాలినుండి ఒక యౌవ్వనస్థురాలిగా మార్పు చెందుతాము.

కొంత సమయము తరువాత, ఇదివరకే పునరుద్ధరించబడినవారితో మనము ఒక తలంపువలె ప్రయానిస్తుంటాము. పిదప…మహిమ…ఆకాశములో ప్రభువును కలుసుకోవడానికి మనము వారితోపాటు కొనిపోబడతాము.

మన కొరకు ఎటువంటి ఒక సమయము వచ్చుచున్నది కదా. మనల్ని కొట్టి, నిరాశతో, మరియు నిస్పృహతో ఉంచవలెనని శత్రువు ప్రయత్నిస్తాడు, అయితే దేవునికి మహిమ, వాడు అట్లు చేయలేడు. ఆయన ఎవరైయున్నాడు అనే ప్రత్యక్షతను మనము కలిగియున్నాము; మనల్ని బయటకు పిలవడానికి ఆయన ఎవరిని పంపించాడు; మనము ఎవరము, మనము ఎవరైయ్యుండబోవుచున్నామో కాదు, మనము ఎవరము అనే ప్రత్యక్షతను కలిగియున్నాము. ఇప్పుడు అది మన అంతరాత్మలో, మనస్సులో మరియు ఆత్మలో లంగరువేయబడియున్నది, మరియు దానిని మననుండి తీసివేసేది ఏదియు లేదు. అది మనకెలా తెలుసు? దేవుడు ఆలాగు చెప్పాడు!

ఇది మా గృహము కాదు, ఇదంతా నీదే, సాతానుడా, నీవు దానిని తీసుకోవచ్చు. దానిలో మాకు ఏ భాగమూ వద్దు మరియు అది మాకు ఇక ఎంతమాత్రమును అక్కరలేదు. మా కొరకు నిర్మించబడిన ఒక భవిష్యత్తు గృహమును మేము కలిగియున్నాము. మరియు దయ్యమా, ఇంకో విషయమేమిటంటే, అది సిద్ధంగా ఉన్నది అని మాకు సమాచారం వచ్చినది. నిర్మాణము పూర్తైనది. తుది మెరుగులన్నీ చేయబడినవి. మరియు నీ కొరకు ఇంకొక వార్తాకూడా నా వద్దనున్నది, మమ్మల్ని తీసుకొనిపోవుటకు, అతి త్వరలో, ఆయన వచ్చుచున్నాడు తద్వారా మేము ఆయనతో 1000 సంవత్సరాలు ఎడతెగని హనీ మూన్ కలిగియుండుటకైయున్నది, మరియు నీవు ఆహ్వానించబడలేదు, మరియు నీవు అక్కడ ఉండవు.

మనము ప్లేను నొక్కిన ప్రతీసారి ఈ వర్తమానము ఎటువంటి మహిమకరమైన సంగతులను మనకు బయలుపరచుతుంది కదా. ఈ కార్యములను ఆయన మనతో చెప్పగలుగుటకు, దేవుడు తానే దిగివచ్చి మరియు మానవ పెదవుల ద్వారా మాట్లాడియున్నాడు. ఆయన మనలను ఎన్నుకొని మరియు తనను గూర్చిన నిజమైన పూర్తి ప్రత్యక్షతను ఇచ్చియున్నాడు.

ఆయన శరీరధారియైన వాక్యమైయున్నాడు, మోషే దినముకైన వాక్యము కాదు, మోషే ఆ దినపు వాక్యమైయున్నాడు; నోవహు దినములకైన వాక్యము కాదు, నోవహు ఆ దినమునకు వాక్యమైయున్నాడు; ఆ దినము…ఏలీయా దినమునకైన వాక్యము కాదు, ఏలీయా ఆ దినమునకు వాక్యమైయున్నాడు; అయితే ఆయన ప్రస్తుతకాలపు వాక్యమైయున్నాడు, మరియు వారు ఆ వెనుక జీవించుచున్నారు.

మీరు సిద్ధంగా ఉన్నారా?…. ఇదిగో అది వచ్చుచున్నది. అది రెండు గొట్టాలుకలిగి మరియు భారీగా లోడ్ చేయబడిన తుపాకీయైయున్నది, మరియు మనము దానిని ఎంతగానో ప్రేమించుచున్నాము!!

అదే విషయము పునరావృతం అవుతుంది! దేవుడు మీకు బయలుపరచినప్పుడు మరియు అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అని మీరు దానిని చూసి, మరియు దానిని స్వీకరించినప్పుడు, అదియే పరిశుద్ధాత్మకు రుజువైయున్నది. మీరు ఇప్పుడేమైయున్నారు అనేది కాదు, మీరు ఇంతకుమునుపు ఏమైయున్నారు అనేది కాదు, లేదా అటువంటిదేది కాదు, అది దేవుడు ఇప్పుడు మీ కొరకు ఏమి చేసాడన్నదైయున్నది. ఋజువు అదేయైయున్నది.

హల్లేలూయా, ఆయన మేకును దిగగొట్టాడు. ఇప్పుడు ఆయన దానిని బిగించుటను మనము విందాము.

పరిశుద్ధాత్మకు ఋజువును ఆయన మనకు ఇచ్చాడు, యోహాను 14. ఆయన ఇట్లన్నాడు, “నేను మీకు చెప్పుటకు అనేక సంగతులు కలవు. దానిని చేయుటకు నాకు సమయము లేదు, అయితే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, ఆయన మీకు చెప్తాడు, నేను మీకు చెప్పినవాటి గురించి మీకు జ్ఞాపకము చేస్తాడు, మరియు సంభవింపబోవు సంగతులను కూడా మీకు చూపిస్తాడు.” మీరు చూడటం లేదా? ఋజువు అదేయైయున్నది. అది ముందుగా చెప్పుచూ మరియు...వ్రాయబడిన వాక్యముయొక్క దైవీకమైన అనువాదమును కలిగియుండుట యైయున్నది. ఇప్పుడు, ఒక ప్రవక్తకు ఋజువు అది కాదా?

ప్రతి కాలమునకు పరిశుద్ధాత్మయే ప్రవక్తయైయున్నాడు. ఆయన మన కాలమునకు ప్రవక్తయైయున్నాడు. వాక్యము ఆ ప్రవక్తయొద్దకు మాత్రమే వచ్చును. అది దేవుడే తన ప్రవక్తలోనుండి మాట్లాడుచూ తనను తాను బయలుపరచుకోవడమైయున్నది. ఆయనే ఈ దినపు వాక్యమైయున్నాడు. టేపులో ఉన్న, ఈ వర్తమానము, దైవీకమైన నిర్థారణతో, వాక్యముయొక్క పరిపూర్ణమైన అనువాదమైయున్నది.

“ఆ పరిపూర్ణమైనది వచ్చినప్పుడు, పరిపూర్ణము కానిది నిరర్థకమగును.” కావున ఒక చిన్న బాలుడి వలె పైకి క్రిందకి దూకుడం వంటి ఈ చిన్న విషయాలు, భాషలలో మాట్లాడుటకు ప్రయత్నించుట, మరియు ఈ ఇతర విషయాలన్నియు, పరిపూర్ణమైన...మరియు దేవుని సహాయము ద్వారా, ఈనాడు మనము, దైవీకమైన నిర్థారణతో వాక్యముయొక్క పరిపూర్ణమైన అనువాదమును కలిగియున్నాము! పిదప పరిపూర్ణముకానిది నిరర్థకమైపోయినది. “నేను పిల్లవాడనైయున్నప్పుడు, పిల్లవానివలె మాటలాడితిని, పిల్లవానివలె తలంచితిని; కాని నేను పెద్దవాడనైనప్పుడు, పిల్లవాని చేష్టలు మానివేసితిని.” ఆమేన్!

ఆ పరిపూర్ణమైనది; వాక్యముయొక్క ఆ పరిపూర్ణమైన అనువాదము. ప్లేను నొక్కండి. ఆయనయొక్క వధువుకు అవసరమైయున్నదంతయూ, మరియు ఆమె కోరునదంతయూ అదేయైయున్నది.

ఈ ఆదివారమున జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా, 12:00 P.M. గంటల సమయమప్పుడు, వచ్చి మరియు మాతో కలిసి ప్లేను నొక్కి, మరియు మేము దీనిని వినుచుండగా, దైవీకమైన నిర్థారణతో, ఒక పరిపూర్ణమైన అనువాదముతో వచ్చుచున్న, పరిపూర్ణమైన వాక్యమును వినండి:

ప్రశ్నలు మరియు జవాబులు #264-0823E

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్