ఆదివారం
20 అక్టోబర్ 2024
60-1205
The Ephesian Church Age

ప్రియమైన నిజ వధువా,

ఆయనయొక్క జీవము మనలో మరియు మనగుండా ప్రవహించుచు మరియు నాడివలె కొట్టుకొనుచు, మనకు జీవమునిస్తుండగా మనము ఎటువంటి ఒక అద్భుతమైన సమయమును కలిగియుంటున్నాము కదా. ఆయన లేకుండా, జీవమనేది ఉండదు. ఆయనయొక్క వాక్యము సాక్షాత్తు మన ఊపిరియైయున్నది.

ఈ ఘోరమైన అంధకార దినములో, మనము ఆయనయొక్క పైకి లేచినట్టి చివరి కాలపు గుంపుయైయున్నాము; ఆత్మ చెప్పుదానిని అనగా మన దినమునకైన దేవుని స్వరమును మాత్రమే వినునట్టి, చివరి దినమునకైన ఆయనయొక్క నిజ వధువైయున్నాము.

“నాకైతే, మీరు శుద్ధసువర్ణమును పోలియున్నారు. మీ నీతి నా నీతియైయున్నది. మీ గుణలక్షణములు నా మహిమకరమైన గుణలక్షణములైయున్నవి. మీరు నాయొక్క ప్రియమైన నిజ వధువైయున్నారు,” అని ఆయన మనతో చెప్పుటను వినడానికి మనమెంతంగా ఇష్టపడుచున్నాము కదా.

ప్రతి వారము మన పోరాటములు కఠినమగుచున్నా కొద్దీ, ఆయన మనతో మాధూర్యముగా మాట్లాడి మరియు, “చింతించకండి, మీరు నా సువార్తకు తగినవారైయున్నారు. మీరు సౌందర్యమైనదియు మరియు సంతోషకరమైనదియునైన ఒక సంగతియైయున్నారు. ఈ జీవితములో మీ శోధనలు మరియు పరీక్షలగుండా మీరు శతృవును జయించడాన్ని చూచుటకు నేను ఇష్టపడతాను,” అని చెప్పుటను వినడానికి మనము కేవలం ప్లేను నొక్కుతాము.

ప్రేమతో కూడిన మీ ప్రయాసను నేను చూస్తున్నాను; అది నన్ను సేవించడానికి మీ జీవితమునకు ఇవ్వబడిన ఉన్నతమైన పిలుపుయైయున్నది. మీ కొరకు నా స్వరముగా ఉండుటకు నేను పంపే నాయొక్క బలిష్ఠుడైన దూతను మీరు గుర్తిస్తారని జగత్తుపునాది వేయబడకముందే నేను ఎరిగియున్నాను; ఆ భయంకరమైన తోడేళ్ళు సరిసమానమైన ప్రత్యక్షతను కలిగియున్నారని చెప్పుకొనుచూ వచ్చిప్పుడు ఏ విధంగా మీరు మోసపరచబడకుండా ఉంటారో నేను ఎరిగియున్నాను. మీరు ఒక్క క్షణమైనా గాని, ఒక్క పొల్లుయంతైనా గాని, నా వాక్యమునుండి తొలగిపోరు. మీరు నా వాక్యముతో, నా స్వరముతో నిలిచియుంటారు.

నేను మీకు నా వాక్యమును బయలుపరచుచుండగా ఏదెను తోటలో ఆరంభమైన నిజ ద్రాక్షావల్లి మరియు కారు ద్రాక్షావల్లి కాలములగుండా ఏ విధంగా కలిసి ఎదుగుతాయని మీరు గ్రహిస్తారు.

ఆదిమ సంఘములో ప్రారంభమైనది ప్రతి కాలములో కొనసాగుతుందని గ్రహిస్తారు. మొదటి సంఘకాలములో, సాతానుడి కారు ద్రాక్షావల్లి లోపలికి జొరబడటం ప్రారంభించి మరియు వానియొక్క నికోలాయితు ఆత్మతో ఏ విధంగా ప్రజలను జయించాడన్నది గ్రహిస్తారు. అయితే నా ఎన్నుకోబడిన వధువుయైనట్టి మీరు మాత్రమే, మోసపరచబడరు అనే విషయమును నేను ఎంతగానో ఇష్టపడుచున్నాను.

ఈ వారము, సర్ప సంతానమును గూర్చిన గొప్ప మర్మమును బయలుపరచుట ద్వారా నేను నా వాక్యమును మీలో దృఢపరుస్తాను. ఏదెను తోటలో ఏమి జరిగినది; సాతానుడు ఏ విధంగా మానవజాతిలో కలిసాడు అన్నదాని గురించి ప్రతీ వివరమును నేను మీకు బయలుపరుస్తాను.

ఏదెను తోటలో జీవవృక్షమునై, ఆదాముయొక్క పతనమువలన ఇప్పటివరకును సమీపించబడలేకుండా ఉన్న నేను, ఇప్పుడు నాయొక్క జయించినవారైనా మీకు ఇవ్వబడ్డాను, అనే విషయమును మీరు గుర్తించినప్పుడు, అది ఎంతో ఉత్తేజకరమైన ఒక తలంపుగా ఉంటుంది.

ఇది మీకు బహుమానముగా ఉంటుంది. దేవుని పరదైసుయొక్క భాగ్యమును; అనగా నాతో ఒక స్థిరమైన సహవాసమును నేను మీకు ఇచ్చెదను. మీరెన్నడూ నానుండి వేరు చేయబడరు. నేను వెళ్ళు ప్రతిచోటుకు, నా వధువైన, మీరును వెళ్ళుదురు. నాకు చెందిన ప్రతిదానిని, నా ప్రియులైన మీతో, నేను పంచుకుంటాను.

మనము ఈ మాటలను చదువుతుండగా ఏ విధంగా మన హృదయములు మనలో వేగముగా కొట్టుకుంటాయి కదా. ఆయన వాగ్దానములయొక్క నెరవేర్పు త్వరగా సమీపిస్తున్నదని మనము ఎరిగియున్నాము, మరియు వేచియుండలేకపోవుచున్నాము. మనము ఆయన వాక్యమునకు విధేయులగుటకు త్వరపడుచు మరియు దానిద్వారా ఆయన మహిమను పంచుటకై మన అర్హతను ఋజువు చేసుకుందాము.

ఎక్కడైతే దేవుడు ఆయనయొక్క ఏర్పాటు చేయబడిన మార్గము ద్వారా, అనగా ఆయనయొక్క ఏడవ దూత వర్తమానికుడి ద్వారా ఆయనయొక్క వాక్యమును మనకు బయలుపరచుచున్నాడో, అట్టి ఏడు సంఘకాలములను గూర్చిన మా గొప్ప అధ్యయనమును మేము కొనసాగిస్తుండగా వచ్చి మాతో చేరమని మిమ్మల్ని ఆహ్వానించుటకు నేను ఇష్టపడుచున్నాను.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

ఆదివారము 12:00 P.M., జఫర్సన్విల్ కాలమానం.

60-1205 ఎఫెసు సంఘకాలము