
ప్రియమైన ఓటమిలేని దేవుని సైన్యమా,
తండ్రి ఎన్నుకొని మరియు తనను గూర్చిన నిజ ప్రత్యక్షతను అనుగ్రహించినవారము మనమే; ఆయనయొక్క ఒకేఒక్క నిజమైన సంఘమైయున్నాము. ఆయనయొక్క గొప్ప కార్యములను చేయుటకు ఆయన ఎన్నుకున్నవారమైయున్నాము. ఏలయనగా ఆయన ఆత్మ ద్వారా, మనము సాతానుడియొక్క క్రీస్తువిరోధి ఆత్మను వివేచించి మరియు దానిని ఎదుర్కోగలము. వాడు మనయెదుట శక్తిలేనివాడైయున్నాడు, ఎందుకనగా మనము ఆయనయొక్క ఓటమిలేని సైన్యమైయున్నాము.
సాతానుడు ప్రత్యక్షతయంతటినీ ద్వేశిస్తాడు, కానీ మనము దానిని ప్రేమిస్తాము; ఏలయనగా మనము ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యమును ప్రేమించువారమైయున్నాము. మన జీవితములో ఆయనయొక్క అసలైన ప్రత్యక్షతను కలిగియుండగా, పాతాళలోక ద్వారములు మనయెదుట నిలువనేరవు; శత్రువుపై మనము జయము పొందుతాము. ప్రతీ దయ్యము మన పాదముల క్రిందనున్నది. మనము ఆయనయొక్క వాక్యమైయున్నాము గనుక, మనము ఆయనతో ఒక్కటైయ్యుండి మరియు వాక్యమును పలుకగలవారమై యున్నాము.
మనము ఏడుసంఘకాలములను అధ్యయనం చేస్తూ మరియు వాటిని వినవలెనని ప్రభువు నా హృదయములో పెట్టాడు. మనలో ప్రతీ ఒక్కరికీ ఇవి ముఖ్యమైన వారములుగా ఉండబోవుచున్నవి. ఆయనయొక్క జయించు శక్తిద్వారా, ముందెన్నడూ లేనివిధంగా ఆయన మనకు ఆయనయొక్క వాక్యమును బయలుపరుస్తూ ఉంటాడు.
ఇప్పుడు సమయమైనది. ఇప్పుడు తగిన ఋతువైయున్నది. ప్రత్యక్షతవలన మనకు ఉత్తేజమునిచ్చుట ద్వారా, ఆయన మనల్ని పురిగొల్పుతుంటాడు, మనల్ని ప్రోత్సహిస్తుంటాడు, మరియు అది మన అంతరాత్మలను రగుల్చుతుంది!!
యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత ఒక ప్రవచనాత్మకమైన పుస్తకమైయున్నది, అది ప్రవచనాత్మకమైనవాటిని చూడగల దృష్టిని కలిగియున్న ఒక ప్రత్యేకమైన తరగతి ప్రజలకు, అనగా మనకు, ఆయన వధువుకు మాత్రమే అర్థమవుతుంది. మనకు సహజాతీతమైన సూచనలను ఇస్తున్నట్టి, ఆయనయొక్క ఎన్నుకోబడిన దూతయైన వర్తమానికుడి ద్వారా వస్తున్న దేవునియొక్క స్వరమును మీరు వింటున్నారని మరియు చదువుతున్నారని ఎరుగుటకు నిజమైన ప్రత్యక్షత అవసరమైయున్నది.
అన్ని కాలములలోని క్రైస్తవుల విషయమై అది యోహానుకు ఇవ్వబడిన యేసుక్రీస్తుయొక్క ప్రత్యక్షతయైయున్నది. బైబిలు గ్రంథమంతటిలో, యేసు స్వయంగా తానే, వ్యక్తిగంతంగా ఒక లేఖికుడికి ప్రత్యక్షమై వ్రాయించిన ఏకైక పుస్తకము ఇదేయైయున్నది.
ప్రకటన 1:1-2, “యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు, దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో సంభవింపనైయున్నవి; ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను: అతడు దేవుని వాక్యమును గూర్చియు, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు, తాను చూచినంతమట్టుకు సాక్ష్యమిచ్చెను.
ప్రకటన గ్రంథమనేది స్వయంగా దేవునిచేత వ్రాయబడినటువంటి దేవునియొక్క స్వంత తలంపులైయున్నవి. అయితే ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి మరియు తన దాసుడైన యోహానుకు దానిని సూచించాడు. యోహానుకు దాని అర్థము తెలియదు; అతడు కేవలం తాను చూసినదానిని మరియు వినినదానిని వ్రాసాడు.
అయితే ఈనాడు, ఈ గొప్ప ప్రత్యక్షతను ఆయనయొక్క వధువునకు బయలుపరచడానికి దేవుడు తనయొక్క బలిష్ఠుడైన దూతను భూమిమీదికి పంపించాడు, తద్వారా మనము సంఘకాలములన్నిటిలో ఏమి జరిగినదో చదివి మరియు వినగలుగుటకైయున్నది. ప్రతి కాలములోనూ వాక్యమునకు నమ్మకముగాను మరియు విశ్వసనీయముగాను నిలిచియున్న ఆయనయొక్క చిన్న గుంపును మనము చూడగలము.
దేవుడు తన దూత ద్వారా మాట్లాడి మరియు ఈ అంత్యదినములలో, ఆయనయొక్క ఏడవ సంఘకాల వర్తమానికుని స్వరము పలుకుటను ప్రారంభించినప్పుడు, ఆయన పౌలుకు బయలుపరచినట్లే దేవునియొక్క మర్మములను బయలుపరుస్తాడని చెప్పాడు. ఆ ప్రవక్తను తన స్వంత నామమందు స్వీకరించువారు ఆ ప్రవక్త పరిచర్యయొక్క ఫలమును పొందుకుంటారు.
మహిమ, మనము ఆ ప్రవక్తను తన స్వంత నామమందు స్వీకరించి, ప్లేను నొక్కే దేవుని వధువైయున్నాము, మరియు మనము దానియొక్క లాభమును పొందుచున్నాము. అది తన వధువుతో మాట్లాడుచు మరియు మరియు ఆమెను నడిపించుచున్న దేవునియొక్క స్వరమైయున్నదని మనము నమ్ముచున్నాము.
ఓ సంఘమా, ఈ రానున్న వారములలో మనము ఏమి చదువుచు మరియు ఏమి వినబోవుచున్నాము కదా. ఆయనకైతే, మనము శుద్ధసువర్ణముతో పోలినవారమైయున్నాము. ఆయన ఏమైయున్నాడో, మనము అదేయైయున్నాము. మనము ఆయనయొక్క నిజమైన ద్రాక్షావల్లియై యున్నాము. మనము జయించియున్నాము. మనము పరిపూర్ణులుగా చేయబడ్డాము, స్థిరపరచబడ్డాము, బలపరచబడ్డాము. ఆయనయొక్క ఎన్నికయైన ప్రేమద్వారా ఏర్పరచుకొనబడ్డాము. దేనికీ భయపడవలసిన అవసరము లేదు. మనము వర్తమానికుడిని మరియు ఆయనయొక్క వర్తమానమును విని మరియు దానిని తీసుకొని మరియు దానిని జీవించిన గుంపుయైయున్నాము.
ప్రతి వారము మనము ఇట్లు చెప్తుంటాము, “దారిలో ఆయన మనతో మాట్లాడి మరియు ఆయనయొక్క వాక్యమును మనకు బయలుపరుస్తుండగా మన హృదయములు మనలో మండలేదా”.
మీరు ఆయన పరిశుద్ధాత్మయొక్క అభిషేకమును అనుభూతి చెందగోరుచున్న యెడల, దేవుని వాక్యమును గూర్చి మరింత ప్రత్యక్షతను పొందగోరుచున్న యెడల, మరియు కుమారునియొక్క సన్నిధిలో కూర్చొని మరియు పరిపక్వమవ్వగోరుచున్న యెడల, మరియు ఎత్తబడు విశ్వాసమును పొందగోరుచున్న యెడల, ఆదివారము, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు: యేసుక్రీస్తుయొక్క ప్రత్యక్షత 60-1204M పై మేము మాయొక్క గొప్ప అధ్యయనమును ప్రారంభిస్తుండగా వచ్చి మాతో చేరండి.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
సంఘకాలముల పుస్తకము నుండి, ప్రతి ఆదివారము మనము వినినట్టి అధ్యాయమును, ఆ వారములో మీరు వినవలెనని లేదా చదవవలెనని ప్రోత్సహించుటకు నేను ఇష్టపడుచున్నాను.