భద్రము చేయబడిన ఉత్తరములు
18, మే 2024, శనివారం

ప్రియమైన టేపు కుటుంబమా,

నా భావమేదనగా, నా కుటుంబమైయున్న మీరు, మరియు ఎక్కడైతే…ఎక్కడికైతే మన టేపులు వెళ్తాయో అక్కడ బయట ప్రపంచములోనున్న కుటుంబము.

అది మనమే, ప్రవక్తయొక్క టేపు కుటుంబము; ప్రపంచమంతటా చెదిరియున్న ఆయనయొక్క పిల్లలము, ఆయనచేత క్రీస్తునకు కనబడినవారము. ఈ అంత్య దినములలో తండ్రి ఎవరికైతే స్వయంగా తనను గూర్చిన ప్రత్యక్షతను ఇచ్చాడో అట్టివారము.

ఈ దినములలో ఏదో ఒక రోజు నేను వారందరినీ సమకూర్చాలని కోరుచున్నాను, చూడండి, తండ్రి సమకూర్చుతాడు, మరియు పిదప మనము—మనము ఇక ఎంతమాత్రము తిరగవలసిన అవసరంలేని ఒక గృహమును కలిగియుంటాము.

నేను వారందరినీ సమకూర్చగోరుచున్నాను. అది సరిగ్గా ఇప్పుడు జరుగుచున్నది. ఈ వర్తమానము, ఆయన వాక్యము, ఈ టేపులు సరిగ్గా దానినే చేయుచున్నవి: వధువునంతయూ సమకూర్చుతూ, ప్రపంచమంతటినుండి మనలను ఒక్కటిగా ఐక్యము చేయుచున్నది. ఆయనయొక్క వధువును సమకూర్చగలిగేది, ఆయనయొక్క స్వరము తప్ప, టేపులలో ఉన్న దేవునియొక్క స్వరము తప్ప మరేదియు లేదు.

మరియు మీరు, మీరు ఆత్మతో నింపబడినప్పుడు, నేను ఎరిగియున్నట్టి అత్యుత్తమమైన గురుతులలో ఒకటి ఏమిటంటే: మీరు క్రీస్తుతో ఎంతగానో ప్రేమలో ఉంటారు మరియు ఆయన చెప్పే ప్రతీ మాట సత్యమని నమ్ముతారు. చూశారా? మీరు పరిశుద్ధాత్మను కలిగియున్నారనుటకు సాక్ష్యాధారము అదే. మరియు మీ జీవితం ఆనందముతో నిండియుంటుంది, మరియు—మరియు ఓ మై, ప్రతీది ముందున్న విధానం నుండి (చూశారా?) భిన్నముగా మారిపోతుంది. పరిశుద్ధాత్మ అనగా అదియే.

మన హృదయములు, మనస్సులు మరియు అంతరాత్మలు ఆనందము, ప్రేమ మరియు ప్రత్యక్షతతో ఎంతగానో నిండియున్నవి, మనము అసలు ఊరకుండలేకపోవుచున్నాము. మనము వినే ప్రతీ వర్తమానము ఇంకా ఎక్కువ ప్రత్యక్షతను తీసుకొనివస్తుంది. మనము ఎవరమన్నది మనము చూస్తున్నాము మరియు ఆయనయొక్క పరిపూర్ణమైన చిత్తములో ఉండుటకు మనమేమి చేయవలెనన్నది చూస్తున్నాము. దేవుడు మన హృదయములలో పెట్టినదాని నుండి మనలను కదిలించేది ఏదియు లేదు. ప్లేను నొక్కడమే ఈ దినమునకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గమైయున్నది. అంచనావేయడమనేది లేదు, నిరీక్షించడమనేది లేదు, పరిశుద్ధాత్మను ఈ విధంగా ప్రశ్నించడమనేది లేదు, “నేను కేవలం ఇప్పుడే విన్నది సత్య వాక్యమేనా?” “దానిని నేను వాక్యముతో సరిచూసుకోవలసియున్నదా?”

మనము అట్లు కాదు. టేపులలో మనము వినేది వాక్యమైయున్నది. టేపులలో మనము వినే ఆ వాక్యమే వధువునకు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యున్నదని, స్వయంగా పరిశుద్ధాత్మచేత, అగ్నిస్తంభముచేత నిర్ధారించబడిన ఏకైక వాక్యమైయున్నది.

ఎవరైనా మనకిట్లు చెప్పవచ్చును, “అభిషేకించబడిన వాక్యము కాకుండా, కేవలం సహోదరుడు బ్రెన్హామ్ గారే మాట్లాడటమైయున్న అనేక విషయాలు టేపులలో చెప్పబడ్డాయి. అది కేవలం మానవుడు మాత్రమే. పరిశుద్ధాత్మ మనలను వాక్యమునొద్దకు మరియు కేవలం సహోదరుడు బ్రెన్హామ్ గారు మాట్లాడుచున్నవాటి వద్దకు నడిపించాడు.”

అయితే మనకు అలా కాదు. ప్రవక్త దేనిని మర్చిపోవద్దని మనకు చెప్పాడో మనము కేవలం దానిని నమ్ముతాము.

మీరు ఎన్నడూ ఆ వాక్యమును మర్చిపోవద్దని నేను కోరుచున్నాను. మోషే చెప్పినదానిని, దేవుడు ఘనపరిచాడు, ఎందుకనగా దేవునియొక్క వాక్యము మోషేలో ఉన్నది.

ప్రవక్త చెప్పినదానిని మనము ఎన్నడూ మర్చిపోము, మరియు మనము దానిని నమ్ముతాము; ఏలయనగా అది ఇనుపపోగరతో మన హృదయముల మీద చెక్కబడినది. టేపులలో ఆయన ఏదైతే చెప్పాడో, దేవుడు దానిని ఘనపరిచాడు, మరియు మనము దానిని నమ్ముచున్నాము.

కూర్చొని మరియు దేవునియొక్క స్వరము మనతో మాట్లాడుటను వినడంకంటే గొప్ప ఘనత ఏదియు లేదు. ఈ ఆదివారము జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా 12:00 P.M. గంటల సమయమప్పుడు, ఆయన తన వధువుతో మాట్లాడుచు, మరియు ప్రశ్నలకు జవాబులనిస్తుంటాడు: 64-0830E ప్రశ్నలు మరియు జవాబులు #4. మీరు మాతో ఐక్యమవ్వుటకు మిమ్మల్ని ఆహ్వానించడానికి నేను ఇష్టపడుచున్నాను. ఇది మీరెన్నడూ పశ్చాతాప్పపడలేనట్టి ఒక నిర్ణయమైయున్నది.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

 

సంబంధిత కూటములు
11, మే 2024, శనివారం

ప్రియమైన పవిత్రురాలైన కన్యక వధువా,

ప్లేను నొక్కి మరియు మన దినమునకైన దేవుని స్వరమును వినమని మిమ్మల్ని ప్రోత్సహించుటకు నేను ఎంతగానో ఇష్టపడతాను. ఏలయనగా అది మన దినముకైన దేవునియొక్క పరిపూర్ణమైన ప్రణాళికయని నాకు తెలుసు.

అది జోసఫ్ బ్రెన్హామ్ చెప్పే విషయమో లేదా నమ్మే విషయమో కాదు. అది దేవునియొక్క నిర్ధారించబడిన స్వరము మనకు చెప్పిన విషయమైయున్నది:

నేను మీకు దేవుని స్వరమునైయున్నాను.

మీకు ఈ వర్తమానమును గూర్చిన ప్రత్యక్షత ఏ మాత్రం ఉన్నా, మీరు తప్పక వినవలసిన అత్యంత ప్రాముఖ్యమైన స్వరము అదేనని; మీరు కలిసిన ప్రతీ ఒక్కరికీ, ప్రతీ విశ్వాసికి, మీ సంఘములకు మీరు చెప్పడానికి, ఆ ఒక్క చిన్న కొటేషన్ సరిపోతుంది.

మనము ప్లే నొక్కినప్పుడు మనము వినే మాటలు దేవుని స్వరమే నేరుగా మనతో మాట్లాడుటయైయున్నది అని, ఆలోచించుటకే ఎటువంటి విషయము కదా. మనము ప్రతీ దినములోని ప్రతీ క్షణము ప్లే నొక్కగలుగుటకు తండ్రి దానిని రికార్డు చేపించి మరియు భద్రపరిచాడు, తద్వారా ఆయన మనలను ప్రోత్సహించుటను, మనల్ని ఆశీర్వదించుటను, మన భయములను మరియు మన సంశయములను పారద్రోలడాన్ని మనము వినగలుగుటకైయున్నది, అంతయూ కేవలం ప్లే నొక్కడం ద్వారానే.

మనకు అవసరమున్నది ఏదైనా సరిగ్గా అప్పుడే, ప్లే నొక్కుతే, మరది అక్కడ ఉంటుంది. మనము వాక్యమైయున్నామని మనకు గుర్తు చేయుటకు ఆయన ఉన్నాడు. ఆయన మనతో, మన చుట్టూ, మనలో ఉన్నాడు. సాతానుడు ఒక మోసగాడు మాత్రమే. వాడు ఓడించబడ్డాడు. ఆ వాక్యమును మన వద్దనుండి ఏదియు తీసివేయలేదు. మనము ఆయనయొక్క వధువైయున్నామని ఎరిగియుండి, తన ముందుజ్ఞానముచేత దేవుడు దానిని మనకు ఇచ్చాడు. ఆదినుండి మనము ఆయనతో ఉన్నాము.

దేవునియొక్క స్వరము అని అగ్ని స్తంభముచేత నిర్ధారించబడిన ఆ ఒకే ఒక్క స్వరముకంటే గొప్పదిగా ఏ స్వరము ఉంటుంది?

వేరే ఏ స్వరము లేదు.

గడచిన వారము ఆ స్వరము మనకు ఏమి చెప్పినది?

నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని, నా సహోదరుడు మరియు సహోదరియని చెప్తుంటాను. మీరు నా పిల్లలైయున్నారు; సువార్తలో నేను—నేను మీ తండ్రినైయున్నాను, ఒక యాజకుని వలె తండ్రిని కాదు, పౌలు అక్కడ చెప్పినట్లుగా సువార్తలో నేను—నేను మీ తండ్రినైయున్నాను. క్రీస్తుకు నేను మిమ్మల్ని కనియున్నాను, మరియు ఇప్పుడు, నేను—నేను క్రీస్తుకు మిమ్మల్ని ప్రదానము చేసిని; అనగా పవిత్రురాలైన కన్యకగా మిమ్మల్ని క్రీస్తుకు నిశ్చితార్థము చేసితిని. నన్ను నిరాశపరచకండి! నన్ను నిరాశపరచకండి! మీరు ఒక పవిత్రురాలైన కన్యకగానే ఉండండి.

వాక్యమునకు, ఆ స్వరమునకు మనము ఒక పవిత్రురాలైన కన్యకగా ఉండాలి. మనము అట్లు చేస్తున్నామని సరిచూసుకోవడానికి మనకు, ఒకే ఒక్క మార్గము కలదు: ప్లేను నొక్కడమే.

మీరు చెప్పుచున్నట్లు, నేను దేవుని సేవకుడనని, ఒక ప్రవక్తనని మీరు నమ్మితే, నేను మీకు చెప్పుచున్నదానిని వినండి. చూశారా? మీరు దానిని గ్రహించలేకపోవచ్చు, మరియు మీరు గ్రహించలేకపోయినయెడల, అప్పుడు మీరు కేవలం నేను మీకు ఏమి చేయమని చెప్తున్నానో దానిని చేయండి.

అవును, పరిశుద్ధాత్మచేత అభిషేకించబడిన ఇతర పురుషులు ఉన్నారు, మరియు దేవుని కృపా మరియు కనికరమును బట్టి, నేను కూడా వారిలో ఒకడినని నేను ప్రార్థిస్తున్నాను. ఆయన వాక్యమును మీయెదుట ఉంచి మరియు ఈ వర్తమానమును, దేవుని వాక్యమును, ఆ స్వరమును మీకు చూపించుటకు నేను ఆయనచేత పిలువబడ్డానని నేను నమ్ముచున్నాను.

పేతురు చెప్పినట్లు, దేవుడు తన వాక్యమును బయలుపరచుకొనుటకు, పిలచుకున్న ఒకే ఒక్క స్వరము కలదని ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు నేను నిర్లక్ష్యము చేయను. దేవుడు నిర్ధారించిన ఒకే ఒక్క స్వరము. “ఈయన మాట వినుడి,” అని దేవుడు చెప్పిన ఆ ఒకే ఒక్క స్వరము. “నేను మీకు దేవుని స్వరమునైయున్నాను,” అని దేవుడు చెప్పిన ఒకే ఒక్క స్వరము.

దీనిని మీ హృదయమంతటితో జ్ఞాపకముంచుకోండి: ఆ వాక్యముతో నిలచియుండండి! మీరు ఆ వాక్యమును విడిచి పెట్టకండి! దానికి వ్యతిరేకముగా ఉన్నది, ఏదైనాసరే, దానిని వదిలేయండి. అది సరియైనదని అప్పుడు మీకు తెలుస్తుంది.

ఎందుకని నేను అంతగా అపార్ధము చేసుకొనబడుచున్నానో మరియు ఎందుకని అనేకులు నేను సేవకులందరికి వ్యతిరేకినని; ఎవ్వరూ ప్రసంగించకూడదని నమ్ముతానని అనుకుంటారో నేను నిశ్చయంగా అర్థంచేసుకోగలను. “సహోదరుడు బ్రెన్హామ్ గారు కాకుండా వేరొక సేవకుడు చెప్పేది మీరు వింటే, మీరు వధువు కాదు.” నేను అనేకసార్లు చెప్పినట్లుగా, నేను ఎన్నడూ అట్లనలేదు లేదా దానిని నమ్మలేదు.

ఖచ్చితంగా నేను ఎటువంటి అనుభూతిని కలిగియున్నాను మరియు నేను ఏమి నమ్ముచున్నాను అనేది ప్రవక్త గడిచిన వారం దానిని పరిపూర్ణముగా వివరించాడు.

సహోదరుడు బ్రెన్హామ్ గారు ఇక్కడున్నప్పుడు జఫర్సన్ విల్ ప్రాంతములో వర్తమానముకు చెందిన ఇతర సంఘములు కానీసం మూడు ఉన్నవి. గడిచిన ఆదివారపు వర్తమానములో, సాయంకాల కూడిక కొరకు స్థానిక సంఘకాపరులు అక్కడ హాజరు కాలేదని ఆయన చెప్పాడు. వారు తమ స్వంత సాయంకాల కూటములను కలిగియున్నారు. కావున, వచ్చి, సాయంకాల కూడికలో సహోదరుడు బ్రెన్హామ్ గారు చెప్పేది వినాలని వారికి అనిపించలేదు గాని వారు తమ సంఘములలో కూడికలను కలిగియుండగోరారు. అది వారి నిర్ణయమైయున్నది మరియు వారు ఏమి చేయుటకు నడిపించబడ్డారని వారికి అనిపించినదో అట్టి విషయమైయున్నది, మరియు సహోదరుడు బ్రెన్హామ్ గారు అంగీకరించాడు.

ఈనాడు జఫర్సన్ విల్ ప్రాంతములో ఇంకనూ అనేక సంఘములున్నవి. వారునూ ప్రభువు వారిని ఏ విధంగా నడిపిస్తున్నాడని వారికి అనిపించుచున్నదో ఆ ప్రకారమే చేయవలసియున్నారు. టేపులను ప్లే చేయాలని వారికి అనిపించకపోతే, ప్రభువుకు స్తోత్రం, ఏమి చేయుటకు వారు నడిపించాబడుచున్నారో వారు దానినే చేయుచున్నారు, మరియు వారు దానినే చేయవలసియున్నది. వారింకను మన సహోదరులు మరియు సహోదరీలే మరియు ఈ వర్తమానమును ప్రేమిస్తున్నవారే. అయితే మనము ఏమి చేయుటకు నడిపించబడుచున్నామో మనము దానినే చేయవలసియున్నది: ప్లేను నొక్కడమే. మనము ప్రవక్త చెప్పేది వినగోరుచున్నాము.

1964, ఆగస్టు 30 వ తేదీన సరిగ్గా సహోదరుడు బ్రెన్హామ్ గారు చేసినట్లే, జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా 12:00 P.M. గంటల సమయమప్పుడు, వచ్చి మాతో చేరమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, అది, ప్రవక్త ఈ వర్తమానమును అందించడాన్ని మేము మరొకసారి వింటున్న సమయములోయైయున్నది: 64-0830M ప్రశ్నలు మరియు జవాబులు#3.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

 

సంబంధిత కూటములు
4, మే 2024, శనివారం

ప్రియమైన పరిపూర్ణ వాక్యవధువా,

మనము ప్రభువుయొక్క రాకడ కొరకు వేచిచూస్తున్నాము. మన దీపములను శుభ్రముగా ఉంచుకొని, నూనెతో నింపబడి, రాత్రింబవళ్ళు బయలుపరచబడిన వాక్యమును వినుచున్నాము. ప్రతీ ఘడియ, ప్రార్థన చేసుకుంటున్నాము; ప్రతీ రోజు కాదు గాని, ప్రతీ ఘడియ. లోపల ఉండి, ప్రతీ వాక్యమును, నమ్ముట ద్వారా మనల్ని మనము సిద్ధపరచుకొని యుంటున్నాము.

మొదటగా, సమాధులలో నిద్రించువారు మేల్కొల్పబడుటకు, మనము ప్రతీ నిమిషము ఎదురుచూస్తున్నాము. ఒక క్షణములో, మనము వారిని చూస్తాము; తండ్రులు, తల్లులు, భర్తలు, భార్యలు, సహోదరులు మరియు సహోదరీలు. అక్కడ, వారు సరిగ్గా మనయెదుట నిలబడియుంటారు. మనము చేరుకున్నామని, ఘడియ వచ్చియున్నదని, ఆ క్షణములో మనమెరుగుదుము. ఎత్తబడు విశ్వాసము మన అంతరాత్మలను, మన మనస్సులను మరియు మన శరీరములను నింపివేస్తుంది. అప్పుడు ప్రభువుయొక్క ఎత్తబడు కృపలో ఈ క్షయమైన శరీరములు అక్షయతను ధరించుకుంటాయి.

మరియు అప్పుడు మనమందరము కూడుకోవడం ప్రారంభిస్తాము. సజీవులమై నిలిచియుండు మనము మార్పుపొందెదము. ఈ మర్త్యమైన శరీరములు మరణమును చూడవు. అకస్మాత్తుగా, ఏదో మన మీదుగా వెళ్ళి కప్పబడినట్లు అవుతుంది….మనము మార్పు చెందుతాము. ఒక వృద్ధుడినుండి యౌవ్వనస్థుడిగా, ఒక వృద్ధురాలినుండి ఒక యౌవ్వనస్థురాలిగా మార్పు చెందుతాము.

కొంత సమయము తరువాత, ఇదివరకే పునరుద్ధరించబడినవారితో మనము ఒక తలంపువలె ప్రయానిస్తుంటాము. పిదప…మహిమ…ఆకాశములో ప్రభువును కలుసుకోవడానికి మనము వారితోపాటు కొనిపోబడతాము.

మన కొరకు ఎటువంటి ఒక సమయము వచ్చుచున్నది కదా. మనల్ని కొట్టి, నిరాశతో, మరియు నిస్పృహతో ఉంచవలెనని శత్రువు ప్రయత్నిస్తాడు, అయితే దేవునికి మహిమ, వాడు అట్లు చేయలేడు. ఆయన ఎవరైయున్నాడు అనే ప్రత్యక్షతను మనము కలిగియున్నాము; మనల్ని బయటకు పిలవడానికి ఆయన ఎవరిని పంపించాడు; మనము ఎవరము, మనము ఎవరైయ్యుండబోవుచున్నామో కాదు, మనము ఎవరము అనే ప్రత్యక్షతను కలిగియున్నాము. ఇప్పుడు అది మన అంతరాత్మలో, మనస్సులో మరియు ఆత్మలో లంగరువేయబడియున్నది, మరియు దానిని మననుండి తీసివేసేది ఏదియు లేదు. అది మనకెలా తెలుసు? దేవుడు ఆలాగు చెప్పాడు!

ఇది మా గృహము కాదు, ఇదంతా నీదే, సాతానుడా, నీవు దానిని తీసుకోవచ్చు. దానిలో మాకు ఏ భాగమూ వద్దు మరియు అది మాకు ఇక ఎంతమాత్రమును అక్కరలేదు. మా కొరకు నిర్మించబడిన ఒక భవిష్యత్తు గృహమును మేము కలిగియున్నాము. మరియు దయ్యమా, ఇంకో విషయమేమిటంటే, అది సిద్ధంగా ఉన్నది అని మాకు సమాచారం వచ్చినది. నిర్మాణము పూర్తైనది. తుది మెరుగులన్నీ చేయబడినవి. మరియు నీ కొరకు ఇంకొక వార్తాకూడా నా వద్దనున్నది, మమ్మల్ని తీసుకొనిపోవుటకు, అతి త్వరలో, ఆయన వచ్చుచున్నాడు తద్వారా మేము ఆయనతో 1000 సంవత్సరాలు ఎడతెగని హనీ మూన్ కలిగియుండుటకైయున్నది, మరియు నీవు ఆహ్వానించబడలేదు, మరియు నీవు అక్కడ ఉండవు.

మనము ప్లేను నొక్కిన ప్రతీసారి ఈ వర్తమానము ఎటువంటి మహిమకరమైన సంగతులను మనకు బయలుపరచుతుంది కదా. ఈ కార్యములను ఆయన మనతో చెప్పగలుగుటకు, దేవుడు తానే దిగివచ్చి మరియు మానవ పెదవుల ద్వారా మాట్లాడియున్నాడు. ఆయన మనలను ఎన్నుకొని మరియు తనను గూర్చిన నిజమైన పూర్తి ప్రత్యక్షతను ఇచ్చియున్నాడు.

ఆయన శరీరధారియైన వాక్యమైయున్నాడు, మోషే దినముకైన వాక్యము కాదు, మోషే ఆ దినపు వాక్యమైయున్నాడు; నోవహు దినములకైన వాక్యము కాదు, నోవహు ఆ దినమునకు వాక్యమైయున్నాడు; ఆ దినము…ఏలీయా దినమునకైన వాక్యము కాదు, ఏలీయా ఆ దినమునకు వాక్యమైయున్నాడు; అయితే ఆయన ప్రస్తుతకాలపు వాక్యమైయున్నాడు, మరియు వారు ఆ వెనుక జీవించుచున్నారు.

మీరు సిద్ధంగా ఉన్నారా?…. ఇదిగో అది వచ్చుచున్నది. అది రెండు గొట్టాలుకలిగి మరియు భారీగా లోడ్ చేయబడిన తుపాకీయైయున్నది, మరియు మనము దానిని ఎంతగానో ప్రేమించుచున్నాము!!

అదే విషయము పునరావృతం అవుతుంది! దేవుడు మీకు బయలుపరచినప్పుడు మరియు అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అని మీరు దానిని చూసి, మరియు దానిని స్వీకరించినప్పుడు, అదియే పరిశుద్ధాత్మకు రుజువైయున్నది. మీరు ఇప్పుడేమైయున్నారు అనేది కాదు, మీరు ఇంతకుమునుపు ఏమైయున్నారు అనేది కాదు, లేదా అటువంటిదేది కాదు, అది దేవుడు ఇప్పుడు మీ కొరకు ఏమి చేసాడన్నదైయున్నది. ఋజువు అదేయైయున్నది.

హల్లేలూయా, ఆయన మేకును దిగగొట్టాడు. ఇప్పుడు ఆయన దానిని బిగించుటను మనము విందాము.

పరిశుద్ధాత్మకు ఋజువును ఆయన మనకు ఇచ్చాడు, యోహాను 14. ఆయన ఇట్లన్నాడు, “నేను మీకు చెప్పుటకు అనేక సంగతులు కలవు. దానిని చేయుటకు నాకు సమయము లేదు, అయితే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, ఆయన మీకు చెప్తాడు, నేను మీకు చెప్పినవాటి గురించి మీకు జ్ఞాపకము చేస్తాడు, మరియు సంభవింపబోవు సంగతులను కూడా మీకు చూపిస్తాడు.” మీరు చూడటం లేదా? ఋజువు అదేయైయున్నది. అది ముందుగా చెప్పుచూ మరియు...వ్రాయబడిన వాక్యముయొక్క దైవీకమైన అనువాదమును కలిగియుండుట యైయున్నది. ఇప్పుడు, ఒక ప్రవక్తకు ఋజువు అది కాదా?

ప్రతి కాలమునకు పరిశుద్ధాత్మయే ప్రవక్తయైయున్నాడు. ఆయన మన కాలమునకు ప్రవక్తయైయున్నాడు. వాక్యము ఆ ప్రవక్తయొద్దకు మాత్రమే వచ్చును. అది దేవుడే తన ప్రవక్తలోనుండి మాట్లాడుచూ తనను తాను బయలుపరచుకోవడమైయున్నది. ఆయనే ఈ దినపు వాక్యమైయున్నాడు. టేపులో ఉన్న, ఈ వర్తమానము, దైవీకమైన నిర్థారణతో, వాక్యముయొక్క పరిపూర్ణమైన అనువాదమైయున్నది.

“ఆ పరిపూర్ణమైనది వచ్చినప్పుడు, పరిపూర్ణము కానిది నిరర్థకమగును.” కావున ఒక చిన్న బాలుడి వలె పైకి క్రిందకి దూకుడం వంటి ఈ చిన్న విషయాలు, భాషలలో మాట్లాడుటకు ప్రయత్నించుట, మరియు ఈ ఇతర విషయాలన్నియు, పరిపూర్ణమైన...మరియు దేవుని సహాయము ద్వారా, ఈనాడు మనము, దైవీకమైన నిర్థారణతో వాక్యముయొక్క పరిపూర్ణమైన అనువాదమును కలిగియున్నాము! పిదప పరిపూర్ణముకానిది నిరర్థకమైపోయినది. “నేను పిల్లవాడనైయున్నప్పుడు, పిల్లవానివలె మాటలాడితిని, పిల్లవానివలె తలంచితిని; కాని నేను పెద్దవాడనైనప్పుడు, పిల్లవాని చేష్టలు మానివేసితిని.” ఆమేన్!

ఆ పరిపూర్ణమైనది; వాక్యముయొక్క ఆ పరిపూర్ణమైన అనువాదము. ప్లేను నొక్కండి. ఆయనయొక్క వధువుకు అవసరమైయున్నదంతయూ, మరియు ఆమె కోరునదంతయూ అదేయైయున్నది.

ఈ ఆదివారమున జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా, 12:00 P.M. గంటల సమయమప్పుడు, వచ్చి మరియు మాతో కలిసి ప్లేను నొక్కి, మరియు మేము దీనిని వినుచుండగా, దైవీకమైన నిర్థారణతో, ఒక పరిపూర్ణమైన అనువాదముతో వచ్చుచున్న, పరిపూర్ణమైన వాక్యమును వినండి:

ప్రశ్నలు మరియు జవాబులు #264-0823E

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

 

సంబంధిత కూటములు
27, ఏప్రిల్ 2024, శనివారం

టేపు వినే ప్రియమైనవారలారా,

నేను అసలు దానిని చాలినంతగా చెప్పలేను, మన దినమునకు ఆయనయొక్క నిర్ధారించబడిన వర్తమానికుడైన దూత ద్వారా దేవునియొక్క స్వరము మనతో మాట్లాడుటను వినడంకంటే ప్రాముఖ్యమైనది ఏదియు లేదు. ప్రత్యక్షత వెంబడి ప్రత్యక్షతను ప్రభువు మనకు బయలుపరచుచున్నాడు. దానికి అంతమే లేదు. ప్రతీ వర్తమానము మనము దానిని ముందెన్నడూ వినలేదన్నట్లుగా ఉన్నది. అది సజీవ వాక్యమైయున్నది, తాజా మన్నాయైయున్నది, దేవుడు తన వధువు కొరకు దాచిన ఆహారమైయున్నది, మరియు మనము చేయవలసిందల్లా ప్లేను నొక్కడమే.

త్వరలో జరుగనైయున్న మనయొక్క ఎత్తబడుట గురించి మనము వింటున్నాము. మనము వెళ్ళిపోవుచున్నాము…మహిమ, మనము వివాహ విందుకు వెళ్ళుచున్నాము. ఆయనయొక్క ముందుజ్ఞానము ద్వారా మనము అక్కడ ఉండుటకు ఆయన మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు, మరియు దానిని ఆపేది ఏదియు లేదు. వాక్యము ఇక్కడ వ్యక్తితో ఐక్యమౌతుంది, మరియు వారిరువురూ ఒక్కటౌతారు. అది మనుష్యకుమారుని ప్రత్యక్షపరుస్తుంది. వాక్యము మరియు సంఘము ఒక్కటౌతారు. మనుష్యకుమారుడు దేనిని చేసాడో, మరి ఆయన వాక్యమైయున్నాడు గనుక, సంఘము దానినే చేస్తుంది.

నేను ఇంకా చెప్పుటకు ముందు, మీరు దానిని మరలా చదువవలెను!! దయ్యము మనల్ని నిరుత్సాహపరచుటకు మనము ఎట్లు అనుమతించగలము? మనము దేనికొరకు ఎదురుచూస్తున్నామో వినండి. మనము ఎవరమైయున్నాము అనేదానిని వినండి. ఇప్పుడు ఏమి జరుచున్నది అనేదానిని వినండి.

మనము ఎక్కడికి వెళ్తున్నాము? ఆయనయొక్క ముందుజ్ఞానము ద్వారా దాని కొరకు ముందుగా నిర్ణయించబడిన మనము మనయొక్క వివాహ విందుకు వెళ్ళుచున్నాము, అక్కడ, ఆయనయొక్క వాక్యము మరియు సంఘమైయున్న మనము, ఆయనతో ఐక్యమౌతాము, మరియు మనుష్యకుమారుడు చేసిన ప్రదీదానిని, మనమును చేస్తాము!!

పిదప మనము మనయొక్క భవిష్యత్తు గృహము గురించి అంతా విన్నాము. దైవీకమైన నిర్మాణకుడు మనయొక్క నూతన పట్టణమును రూపొందించాడు, అక్కడ ఆయనయొక్క వధువైయున్న, మనతోపాటు ఆయన నివసిస్తాడు. ఆయన దానిని నిర్మాణము చేసి మరియు ప్రతీ చిన్నదానిని మనకు తగినట్లుగా; సరిగ్గా మనకు ఇష్టమయ్యేరీతిగా ఉంచాడు. అక్కడ మనకు ఒక దీపము అవసరముండదు, మన గొర్రెపిల్లయే మనకు దీపముగా ఉంటాడు. అక్కడ మన ప్రవక్త మన ఇంటి ప్రక్కనే నివసిస్తాడు; ఆయన మనకు పొరుగువాడైయ్యుంటాడు. మనము ఆ చెట్ల ఫలములను తింటాము, మనము ఆ బంగారు వీధులగుండా నడుచుకుంటూ వెళ్ళి ఆ ఊట వద్దనుండి త్రాగుతాము. దూతలు గానములు పాడుచు, భూమిపై ఎగురుచుండగా, మనము దేవునియొక్క పరదైసులో నడుస్తాము. మహిమ! హల్లేలూయా!

ఆయన వాక్యాన్ని మనకు ఋజువు చేస్తూ; లోకానికి “ఈయన మాట వినుడి,” అని చెప్పి మరియు నిర్ధారించడానికి, అగ్నిస్తంభమైయున్న ఆయన, తనయొక్క వర్తమానికుడైన దూతతో తన ఫోటోను తీయబడనిచ్చాడు. మనము ఒక్క మాటను కూడా సందేహించకూడదు, ఏలయనగా అది ప్రవక్త మాట కాదు గాని, అది దేవుడు తన వధువుతో మాట్లాడిన దేవుని మాటయైయున్నది. పిదప మనకు భరోసా ఇస్తూ, మనము ముందునిర్ణయము ద్వారా ప్రాతినిధ్యమును కలిగియున్నామని, ఆయన మనకు చెప్పాడు. ఆయన మనల్ని చూడడు, ఆయన యేసుయొక్క రక్తముగుండా కేవలం మన స్వరమును మాత్రమే వింటాడు. ఆయన దృష్టిలో మనము పరిపూర్ణులమైయున్నాము.

ముందెన్నడూ లేనివిధంగా కరడు కరడును పిలచుచున్నది, మరియు తండ్రి ఆయనయొక్క బయలుపరచబడిన వాక్యముతో మనలను నింపుతున్నాడు. మనము తెలుసుకోవలసిన ప్రతీది రికార్డు చేయబడి మరియు మనకు ఇవ్వబడినది. ఈ సజీవమైన వాక్య వర్తమానమునకు అసలు అంతమనేది లేనేలేదు. మనము ఆయనయొక్క వధువైయున్నామని తెలుసుకోవడం కంటే గొప్పదేదియు లేదు. ఆ స్వరమును వినడము, ప్లేను నొక్కడము, దేవునియొక్క పరిపూర్ణమైన చిత్తమని, ఆయన ఏర్పాటు చేసిన ఆయనయొక్క ప్రణాళిక అని తెలుసుకోవడంలోని నిశ్చయతకంటే గొప్పదేదియు లేదు.

ఇంకా ఎక్కువ రానైయున్నది! అది ఆయన వధువు కొరకైనట్టి తరిగిపోని సజీవమైన వాక్యపు జలమైయున్నది. మన జీవితమంతటిలో మనము ముందెన్నడూ ఇంతగా దప్పిగొనలేదు, అయితే మనకు కావలసినదంతా మనము త్రాగుచుండగా, మనము ఇంతకుముందెన్నడూ ఇంతగా ఉపశమనం పొందలేదు.

ప్రతీ ఆదివారము, తరువాత ఆయన ఏమి బయలుపరుస్తాడో వినడానికి, ప్రపంచమంతటి నుండియున్న వధువుయొక్క భాగముతో కూడుకొనుటకు వధువు ఎంతగానో ఉత్సాహభరితమౌతుంది. ఇక్కడ టెబర్నికల్ వద్దకు మనము రాలేకపోతే, ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సంఘమునకు వెళ్ళి; దాని వద్దకు వెళ్ళమని ఆయన మనతో చెప్పాడు.

ప్రవక్తయొక్క నివాసమువద్ద; ఆయన ఉంచబడినట్టి ఆయనయొక్క ప్రధాన కార్యాలయమువద్ద మనమందరమూ కూడుకోలేము, కానీ ఎక్కడైతే మనము ఆయనను ప్రసంగవేదిక మీద ఉంచుతామో అటువంటి సంఘాలుగా, మన సంఘములను, లేదా మన గృహములను మనము మార్చుకోవచ్చు. అక్కడ సరిగ్గా అది బయలుపరచబడిన రీతిగానే ఆ పరిపూర్ణ వాక్యముపై మనము పోషించబడగలము.

దేవునియొక్క స్వరమును వింటూ, పరలోక స్థలములలో కూర్చొనుట కంటే, ఏ గొప్ప కూడిక, ఏ గొప్ప అభిషేకము, ఏ గొప్ప స్థలము లేదు.

ఈ ఆదివారము జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా, మధ్యాహ్నం 12:00 P.M. గంటల సమయమప్పుడు, దేవుడు మరొకసారి ఆయనయొక్క వర్తమానికుడైన దూత ద్వారా మనతో మాట్లాడి మరియు మన హృదయములలో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానమిచ్చి, మరియు మనము ఆయనయొక్క వధువైయున్నామని భరోసా ఇస్తుండగా, మాతో కలిసి దేవునియొక్క నిర్ధారించబడిన స్వరమును వినడానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

Sunday’s Message: ప్రశ్నలు మరియు జవాబులు #1 64-0823M

 

 

సంబంధిత కూటములు
20, ఏప్రిల్ 2024, శనివారం

ప్రియమైన వధువు-సంఘమా,

మనుష్యకుమారుడు వచ్చి మరియు మానవ శరీరములో తననుతాను తన వధువుకు బయలుపరచుకున్నాడు. ఆయనే దానిని చెప్పాడు, మనము దానిని నమ్ముచున్నాము, మరియు ఆయన దానిని ఋజువు చేసాడు. మనము ఆయన నోటనుండి వచ్చిన ప్రతీ మాటను వింటూ మరియు నమ్మడం ద్వారా మనల్ని మనము సిద్ధపరచుకున్న ఆయనయొక్క వధువు-సంఘమైయున్నాము.

మృతుల పునరుత్థానము కలదు. ఆయనే దానిని ఋజువు చేస్తాడు. సంఘముయొక్క ఎత్తబడుట కలదు. ఆయనే దానిని ఋజువు చేస్తాడు. ఒక వెయ్యేండ్ల పాలన కలదు. ఆయనే దానిని ఋజువు చేస్తాడు. ఒక క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమి కలవు. ఆయనే దానిని ఋజువు చేస్తాడు, ఎందుకనగా ఆయనయొక్క వాక్యము దానిని చెప్పినది.

అక్కడ ఉండేది మనమే. ఆయనే దానిని ఋజువు చేస్తాడు. ఈ వాక్యములో భాగముగా చేయబడినది మనమే. అక్కడ ఉండుటకు ఆయన మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు. ఆయనయొక్క ముందుజ్ఞానము ద్వారా ఒక ఎత్తబడుట జరుగబోవుచున్నది మరియు దానిని ఆపేది ఏదియు లేదు, మనము అక్కడ ఉండబోవుచున్నాము!

ఒక్క పలుకబడిన మాటను ప్రజలు సందేహపడునట్లు చేయడానికి సాతానుడు చాలాకాలంగా ప్రయత్నించాడు. మీరు అట్లు చేయకండి. సరిగ్గా ప్రతీ మాటను నమ్మండి. అక్కడ ఉండటానికి మీరు ప్రతీ మాటను నమ్మవలసియున్నది. రికార్డు చేయబడి మరియు టేపులలో నిలువచేయబడినది, ప్రవక్తయొక్క మాట కాదు గాని, అది దేవునియొక్క మాటయైయున్నది.

ప్రధాన యాజకుడా, బిషప్పా, మత గురువా, సంఘకాపరా? “దేవుడు! దేవుని నోటనుండి వచ్చు ప్రతీ మాట.” అది దేవునియొక్క వాక్యమని మనకు ఎలా తెలుస్తుంది? ఆయన దానిని చెప్పి, పిదప ఆయనే దానిని ఋజువు చేస్తాడు. ఆయన తన వాక్యామును ఋజువు చేస్తాడు.

దేవుని నోటనుండి వచ్చు ప్రతీ మాటను మీరు తప్పక నమ్మవలసియున్నది. టేపులలో ఉన్నది ఆయనయొక్క మాటయేనని ఆయన ఋజువు చేసాడు. విలియమ్ మారియన్ బ్రెన్హామ్ ఆయనయొక్క ఏడవ దూత వర్తమానికుడనియు; మన దినమునకు దేవునియొక్క స్వరమనియు ఆయన ఋజువు చేసాడు. వర్తమానమును మరియు వర్తమానికుడిని నమ్మని వారందరూ నశించిపోతారు.

ఇప్పుడు, నేను సరిగ్గా ఇక్కడున్న ఈ జనసమూహముతోనే మాట్లాడుటలేదు. ఇది టేపు చేయబడుచున్నది, మీరు చూడండి, మరియు ఇది ప్రపంచమంతటికీ వెళ్తుంది. ప్రపంచములోని ప్రజలారా, మీకు అర్థమౌతుందా, ఒక్క మాట, ఒక్క మాట, ఒక వాక్య వరుసంతా కాదు, ఒక ప్యారా మొత్తం కాదు, ఒక్క మాట, హవ్వ అవిశ్వాసముంచినది ఆ ఒక్క మాటనే.

ఆయన వాక్యమైయున్నాడు, మరియు మనము ఆయన వాక్యములో భాగమైయున్నాము. ఆ కారణముచేతనే, జీవితములో మన స్థానాన్ని నిర్ధారించుకొనుటకు మనము ఇక్కడున్నాము. ప్రతీ మాటను నమ్ముటకైయున్నది. వాక్యముతో నిలిచియుండుటకైయున్నది. టేపులలో ఉన్న ప్రతీ మాటను వధువుకు చూపించుటకైయున్నది.

మన దినములో, మనుష్యకుమారుడు బయలుపరచబడినాడు. ఆయన సంఘమును శిరస్సుతో ఐక్యపరచినాడు; వధువుయొక్క వివాహమును జతకలిపినాడు. పెండ్లి కుమారుని పిలుపు వచ్చియున్నది. ఇరువురిని ఐక్యపరచుటకు మనుష్యకుమారుడు మానవ శరీరములో వచ్చియున్నాడు. ఆయన వాక్యమైయున్నాడు. మనము ఆయనయొక్క వాక్యమైయున్నాము, మరియు ఇరువురు ఐక్యపరచబడుచున్నారు.

దానికి మనుష్యకుమారుని బయలుపరిచే ప్రత్యక్షత అవసరమైయున్నది… ఒక మత గురువు కాదు… యేసుక్రీస్తు, మన మధ్యకు మానవ శరీరములో వచ్చి, మరియు ఆయనయొక్క వాక్యమును ఎంతో వాస్తవం చేస్తాడు, ఎంతగా అంటే అది సంఘమును, అనగా వధువును మరియు ఆయనను ఒక్కటిగా ఐక్యపరుస్తుంది, పిదప పెండ్లివిందు కొరకు గృహమునకు వెళ్ళుటయైయున్నది. ఆమేన్.

వాక్యముయొక్క ప్రత్యక్షతయే వధువును ఐక్యపరుస్తుంది. అది సంఘముయొక్క వేదపండితులను కాదు గాని, మరలా మనుష్యకుమారుడిని ప్రత్యక్షపరుస్తుంది. మనుష్యకుమారుడిని! వాక్యము మరియు సంఘము ఒక్కటవుతారు. మనుష్యకుమారుడు చేసిన ప్రతీది వాక్యమైయున్నది. ఆయనయొక్క వధువైయున్న, మనము కూడా, అదే కార్యమును చేస్తాము.

మనము పరిశుద్ధాత్మ ద్వారా, ఆయనయొక్క వాక్యము ద్వారా, ఆయనయొక్క స్వరము ద్వారా ఐక్యమైయున్నాము, మరియు పెండ్లి విందుకు వెళ్ళడానికి సిద్ధపడుచున్నాము. వాక్యము మనల్ని ఐక్యపరచినది, మరియు ఇరువురము ఒక్కటయ్యాము.

టేపులు, టేపులు, టేపులు అని మనము అంటాము. మీ గృహములలో, మీ సంఘములలో మీరు టేపులను ప్లే చేసుకోవలసియున్నది. టేపులను ప్లే చేసే విషయానికి మేము అంతగా ప్రాధాన్యతను ఇస్తున్నందుకు మేము విమర్శించబడుచున్నాము. మేము దానిని ఎందుకు చెప్తున్నాము? టేపులలో మనతో మాట్లాడేది ఎవరు?

ఇప్పుడు, గుర్తుంచుకోండి, అబ్రాహాముతో మాట్లాడుచూ, తన వెనుకనున్న శారాయొక్క మనస్సులోని తలంపులను వివేచించగలిగినది యేసు కాదు. అది యేసు కాదు, ఆయన అప్పిటికీ పుట్టనేలేదు. అయితే అబ్రాహాము “సర్వశక్తిమంతుడైన, ఎలోహిం” అని పిలచినది, మానవ శరీరములో ఉన్న ఒక మానవుడినైయున్నది.

మన దినములో మనుష్యకుమారుడు బయలుపరచబడ్డాడని; దేవుడే మానవ పెదవుల ద్వారా మాట్లాడుచున్నాడని మీరు నమ్ముచున్నయెడల, మీరు వినవలసిన అత్యంత ప్రాముఖ్యమైన స్వరముగా ఆ స్వరమును ఉంచుకొనుటలోగల ప్రాధాన్యతను చూడకుండా ఎవరైనా ఎలా ఉండగలరు?

మేము నమ్ముచున్నదానిని చూడకుండా మరియు నమ్మకుండా ఉండే ఇతరులను నేను విమర్శించడంలేదు; వారు మన సహోదరులు మరియు సహోదరీలైయున్నారు, కానీ ఆయన వధువు కొరకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గము ఇదేనని నేను ఎంతో నిశ్చయతను కలిగియుండి, ఎంతో నింపబడి, ఎంతో సంతృప్తిగా ఉన్నాను. నేను వేరే దేనితో వెళ్ళలేను. నాకు మరియు నా ఇంటివారికైతే, ప్లేను నొక్కడమే మార్గమైయున్నది.

ఆదివారము జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 P.M. గంటలకు, మేము: ఆయనయొక్క వాక్యమును ఋజువు చేయుట 64-0816 అను వర్తమానమును వినుచుండగా వచ్చి మాతో ఐక్యమవ్వాలని నేను ప్రపంచాన్ని మరొకసారి ఆహ్వానిస్తున్నాను.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

కూటమునకు ముందు చదువవలసిన లేఖనములు:

పరిశుద్ధ. మత్తయి 24:24
పరిశుద్ధ. మార్కు 5:21-43 / 16:15
పరిశుద్ధ. లూకా 17:30 / 24:49
పరిశుద్ధ. యోహాను 1:1 / 5:19 / 14:12
రోమా 4:20-22
I థెస్సలొనీకయ 5:21
హెబ్రీ 4:12-16 / 6:4-6 /13:8
I రాజులు 10:1-3
యోవేలు 2:28
యెషయా 9:6
మాలాకీ 4

 

 

సంబంధిత కూటములు