ఆదివారం
13 అక్టోబర్ 2024
60-1204E
The Patmos Vision

ప్రియమైన పరిపూర్ణ వాక్యపు వధువా,

ప్రపంచవ్యాప్తముగానున్న వధువులో ఏమీ జరుగుచున్నది? మనము ఆత్మలోనికి ప్రవేశించుచున్నాము, పైకి లేచుచున్నాము మరియు కేకలు వేయుచున్నాము, “మహిమ! హల్లెలూయా!” దేవుడు మనలను పరవశింపజేయుచున్నాడు మరియు ఆయన వధువునకు ఆయనయొక్క వాక్యమును బయలుపరచుచున్నాడు.

మన జీవితమంతా మనము చదివి మరియు మనము వినిన సంగతులు ఇప్పుడు నెరవేర్చబడుచున్నవి. ఒక గొప్ప పురిగొల్పు చోటుచేసుకొనుచున్నది. మనము ముందెన్నడూ లేని విధంగా వాక్యము ద్వారా వెలిగింపబడుచున్నాము.

మనము దానిని మన ఆత్మలోని అంతరంగములలో అనుభూతి చెందుచున్నాము. ఏదో భిన్నముగా ఉన్నది, ఏదో సంభవించుచున్నది. పరిశుద్ధాత్మ మనలను అభిషేకిస్తూ, మన హృదయములను మరియు మన మనస్సులను వాక్యముతో నింపుటను మనము అనుభూతిచెందుతున్నాము.

ఆయన ఈ విధంగా మనతో మాట్లాడుటను మనము వినగలుగుచున్నాము: ముందెన్నడూ లేని విధంగా శత్రువు మీతో పోరాడుచున్నాడని నాకు తెలియును, కానీ చిన్నవారలారా భయపడకుడి, మీరు నా వారైయున్నారు. నేను మీకు నా ప్రేమను, ధైర్యమును మరియు సామర్థ్యతను ఇస్తాను. మాట మాత్రం పలుకుడి, మరియు నేను దానిని జరిగిస్తాను. నేను ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాను.

యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను గూర్చిన మన గొప్ప అధ్యయనంలో, తరువాత ఆయన మనకు ఏమి బయలుపరచబోవుచున్నాడని మనము ప్రతీ వారము గొప్ప ఎదురుచూపుతో ఉంటున్నాము. ఆయన వాక్యము మాత్రమే మన ఏకైక ఆశ్రయము, సమాధానము మరియు ఆదరణయైయున్నది. మనము శ్రద్ధగా మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటాము. ప్రతీ పేరాను మనము చదువుచున్నప్పుడు, వాక్యము మన కన్నుల ఎదుట విప్పబడుచుండగా మనము కేకలు వేయుచూ అరవగోరుచున్నాము. ఎత్తబడు విశ్వాసము వధువు మీదికి వచ్చుచున్నది, మన అంతరాత్మలను నింపుచున్నది.

ఊహించండి, దేవుని స్వరము మీతో మాట్లాడి మరియు తన వాక్యమును బయలుపరచుటను వినడానికి ప్రపంచములో మీరు వెళ్ళగలిగే ఏ ఇతర చోటు లేదు గానీ, అది సరిగ్గా మీ చేతులలోనే ఉన్నది.

ఏ విధంగా దేవుడు ఆ తెరను తీసివేసి, దానిని వెనుకకు లాగి, మరియు యోహానును లోపలికి చూడనిచ్చి మరియు ప్రతియొక్క సంఘము ఏమీ చేయబోవుచున్నదో చూడనిచ్చాడు కదా, మరియు దానిని ఒక గ్రంథమందు వ్రాసి మరియు దానిని మనకు పంపించాడు. పిదప, కాలము సంపూర్ణమైనప్పుడు, దానిని పలుకుటకు, మరియు దానంతటి భావము ఏమిటన్నది బయలుపరచుటకు, దేవుడు తనయొక్క బలిష్ఠుడైన ఏడవ దూతను మనకు పంపించాడు.

యోహాను తాను చూసినదానిని వ్రాశాడు, కానీ దాని అర్థమేమిటో అతనికి తెలియదు. తాను ఇక్కడ భూమి మీదనున్నప్పుడు యేసు కూడా దానిని ఎరుగకయున్నాడు. ఈ దినము, ఈ కాలము, ఈ ప్రజలు, అనగా మనము, ఆయనయొక్క వధువు వచ్చేదాకా కాలములన్నిటిలోనూ ఎవరికినీ అది తెలియదు.

ఆ ముఖ్యమైన గిన్నెలోనున్న వనరులనుండి ఆ ఏడు దీపములు జీవమును మరియు వెలుగును పీల్చుకుంటున్నాయన్నది ఆయన మనకు ఏ విధంగా బయలుపరిచాడు కదా. ప్రతియొక్కటి వాటి వత్తులను ఏ విధంగా అక్కడ ముంచుకొనియున్నవని ఆయన మనతో చెప్పాడు. ప్రతీ సంఘకాల వర్తమానికుడు క్రీస్తులో తన వత్తి ముంచబడియుండి పరిశుద్ధాత్మతో మండుచున్నాడు, క్రీస్తుయొక్క స్వంత జీవమును పీల్చుకొనుచు మరియు సంఘమునకు ఆ వెలుగును ఇచ్చుచున్నాడు. మరియు ఇప్పుడు, అందరు వర్తమానికులకంటే గొప్పవాడైన, మన చివరి దినపు వర్తమానికుడు, క్రీస్తుతో దేవునియందు దాచబడిన ఒక జీవితము ద్వారా ప్రత్యక్ష్యపరచబడిన అదే జీవమును మరియు అదే వెలుగును కలిగియుండెను.

పిదప ప్రతీ వర్తమానికుడు మాత్రమే కాదు గాని, దేవునియొక్క నిజ విశ్వాసులమైన మనలో ప్రతియొక్కరు కూడా అక్కడ చూపించబడ్డారని, మన బలిష్ఠుడైన దూత మనతో చెప్పాడు. మనలో ప్రతీ ఒక్కరము కూడా గురుతులుగా అక్కడ ప్రదర్శించబడ్డారు. ఆ వర్తమానికులు పీల్చుకుంటున్న అదే మూలము నుండి మనలో ప్రతి ఒక్కరమూ పీల్చుకుంటున్న. మనమందరమూ అదే గిన్నెలో ముంచబడ్డాము. మరియు మనకు మనము చచ్చినవారమైయున్నాము మరియు మన జీవితములు మన ప్రభువైన క్రీస్తుయేసుతోపాటు, ఆయనలోనే దాచబడియున్నవి.

ఏ మనుష్యుడును మనలను దేవుని చేతిలోనుండి పెరికివేయలేడని చెప్పుట ద్వారా ఆయన మనల్ని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాడు కదా. మన జీవితములు చరపబడలేవు. మనయొక్క దృశ్యమైన జీవితము మండుచు మరియు ప్రకాశించుచు, పరిశుద్ధాత్మయొక్క వ్యక్తీకరణలను మరియు వెలుగును ఇచ్చుచున్నది. మనయొక్క అంతర్గత, అదృశ్యమైన జీవము దేవునిలో దాచబడి మరియు ప్రభువుయొక్క వాక్యముచేత పోషించబడుచున్నది

పోరాటములు భయంకరముగా ఉన్నవి. ముందెన్నడూ లేనట్లుగా శత్రువు కోపోద్రేకముతో రేగుచున్నాడు, మనలను నిరుత్సాహపరచుటకు, అణగద్రొక్కుటకు ప్రయత్నిస్తున్నాడు, కానీ వాడు దానిని చేయలేడు. స్వయంగా దేవుడే మానవ పెదవుల గుండా మనతో మాట్లాడుచు మరియు, మనము ఆయన ఎన్నుకున్నట్టి, ఆయనయొక్క వధువైయున్నామని, మనకు చెప్తాడు, మరియు అది అపవాదిని ప్రతీసారి ఓడిస్తుంది.

మనయొక్క పరిపూర్ణుడైన ప్రభువు, తనయొక్క పరిపూర్ణమైన వాక్యమును మాట్లాడుచు, ఆయనయొక్క పరిపూర్ణమైన వధువునకు, పరిపూర్ణమైన సమాధానమును ఇచ్చుచున్నాడు.

ఎప్పటిలాగానే, ఆ అసలైన గిన్నెలో, అనగా వధువు కొరకు దాచబడి మరియు భద్రపరచబడిన ఈ వర్తమానములో తమ వత్తిని ముంచుకొనుటకు మేము ప్రపంచమును ఆహ్వానిస్తున్నాము. జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయప్పుడు, దేవుని స్వరము మాట్లాడి మరియు: పత్మాసు దర్శనము 60-1204E లో ఏమి జరిగినదని బయలుపరుచుచుండగా మేము అరచుచు కేకలువేస్తూ ఉంటాము.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్