ఆదివారం
27 అక్టోబర్ 2024
60-1206
The Smyrnaean Church Age

ఆత్మ-నింపుదలగల ప్రియమైన వధువా,

ఈ చివరి కాలములో ఆత్మ చెప్పుచున్నదానిని వినే సామర్థ్యముగల ఒక్క గుంపు ప్రజలు, ఒక్క అత్యంత ప్రత్యేకమైన గుంపు ప్రజలు మాత్రమే ఉన్నారు. అది ఈ కాలమునకైన బయలుపాటును పొందుకున్న ఒక ప్రత్యేకమైన గుంపుయైయున్నది. ఆ గుంపు దేవుని సంబంధమైనది. వినే సామర్థ్యము లేని గుంపు, దేవుని సంబంధమైనది కాదు.

ఆత్మ చెప్పుచున్నదానిని వినే సామర్థ్యము కలిగియుండి, మరియు దానిని వినుచున్న గుంపు, అసలైన బయలుపాటును పొందుకుంటుంది. దేవుని ఆత్మను కలిగియున్నది మనమే. దేవుని మూలముగా జన్మించి మరియు పరిశుద్ధాత్మతో బాప్తిస్మము పొందుకున్నది మనమే. మన కాలమునకైన బయలుపాటును పొందుకున్నట్టి ఆత్మ-నింపుదలగల ఆయనయొక్క వధువు మనమే.

ప్లేను నొక్కడం అంటే మనకు ఏమైయున్నది? ప్రత్యక్షతయైయున్నది! అది ఈ దినమునకై దేవుడు ఏర్పాటు చేసిన మార్గమును వినుచూ, స్వీకరించుచు మరియు దానితో నిలిచియుండుటయైయున్నది. స్వయంగా దేవునియొక్క స్వరమే నేరుగా ఆయన వధువుతో మాట్లాడుటయైయున్నది. అది పరిశుద్ధాత్మ మన హృదయములతోను మరియు మన అంతరాత్మలతోను మాట్లాడుటయైయున్నది.

దేవుడు మాట్లాడుటకు ఆయనయొక్క ఆత్మతో అభిషేకించబడిన పురుషులను ఉపయోగించుకుంటాడని మనకు తెలుసు, అయితే ప్లేను నొక్కి మరియు ఆయనయొక్క ఏడవ దూతయైన, విలియమ్ మారియన్ బ్రెన్హామ్ యొక్క స్వరమును వినుట తప్ప యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనుదానిని వినడానికి వేరే ఏ చోటు లేదు. స్వయంగా పరిశుద్ధాత్మచేత నిర్ధారించబడిన ఒకే ఒక్క స్వరము ఇది మాత్రమేయైయున్నది. ఆయన దేవునియొక్క స్వరమైయున్నాడు, దేవుని ప్రవక్తయైయున్నాడు, మన కొరకు, మరియు ప్రపంచము కొరకైన, దేవునియొక్క సంఘకాపరియైయున్నాడు.

అతడు మాట్లాడినప్పుడు, మనము ప్రతీ మాటకు ఆమేన్ అని చెప్తాము; ఏలయనగా అది దేవుడు తానే మనతో మాట్లాడుటయైయున్నది. ఆయన మాట మాత్రమే అనువాదము అవసరములేనిదైయున్నది. అది దేవుడు తన వధువుతో మాట్లాడుటకు అతని స్వరమును ఉపయోగించుకొనుటయైయున్నది.

అది దేవుడు తానే మనతో ఈ విధంగా చెప్పడమైయున్నది, “నా చిన్నవారలారా, మీరు నన్ను ఎన్నుకోలేదు కానీ, నేనే మిమ్మల్ని ఎన్నుకున్నాను. ఒక్క చిన్న నక్షత్రపు ధూళియైనా లేకముందే; మీ దేవుడిగా నేను మీకు తెలియబడకముందే, నేను మిమ్మల్ని ఎరిగియున్నాను. మీరు నా మనస్సులో, నా నిత్యమైన తలంపులలో ఉనికి కలిగియున్నారు. మీరు నాయొక్క అచ్చమైన పలుకబడిన వాక్య విత్తనపు వధువైయున్నారు.

మీరు నాయొక్క నిత్యమైన తలంపులలో ఉన్నప్పటికినీ, నాయొక్క నియమించబడిన మరియు నిర్ణయించబడిన కాలము వచ్చేవరకు నేను మిమ్మల్ని వ్యక్తపరచలేదు. ఏలయనగా మీరు నా వాక్యముతో నిలిచియుండే నాయొక్క ప్రత్యేకమైన గుంపుగా ఉంటారని నేను ఎరిగియున్నాను. ఇతరులందరూ విఫలమయ్యారు, కానీ మీరు విఫలము కారని నేను ఎరిగియున్నాను.

మీరు నా ప్రవక్తతో నిలబడ్డారు గనుక మీరు హింసించబడుచున్నారని మరియు ఎగతాళి చేయబడుచున్నారని నాకు తెలుసు, అయితే మీరు నా వాక్యమునుండి తొలగిపోకుండా, నా మాటలను పలికే నా ప్రవక్తకు నమ్మకముగాను విశ్వాసనీయంగాను నిలిచియున్న నాయొక్క అసలైన ద్రాక్షావల్లియైయున్నారు.

విశ్వాసనీయంగా బోధించబడిన ఇతరులు అనేకులున్నారు, కానీ నేను నా వర్తమానికుడి ద్వారా పలికినదానిని మాత్రమే పలకడము ఎంత అవసరమన్నది వారు అన్నివేళలా నేర్చుకోరు.”

ఒక్క స్వరమును వినుటకు మనమెంతగా జాగ్రత్తపడవలసియున్నాము కదా, ఏలయనగా ఆత్మ ఒకే ఒక్క స్వరమును కలిగియున్నాడు మరది దేవునియొక్క స్వరమైయున్నది.

ఓ, తన వర్తమానికుల ద్వారా దేవుని స్వరమును విని, మరియు పిదప సంఘములకు చెప్పడానికి వారికి ఇవ్వబడినదానిని చెప్పడం ఎంత ప్రాముఖ్యము కదా.

“నా వాక్యము ఎల్లప్పుడూ నా ప్రవక్త వద్దకు వచ్చినది, అయితే ఈ దినమున, నేను నా వధువునకు ఏమి చెప్పాను అనేదానిలో ఎటువంటి పొరపాట్లు లేకుండునట్లు నేను నా స్వరమును రికార్డు చేపించాను. ఒకే ఒక్క గుండునూలు ఉన్నది, ఒకే ఒక్క ఇనుపదండము ఉన్నది, మరియు అదియే నేను నా దూత ద్వారా పలికిన వాక్యమైయున్నది. ప్రతి కాలములో ఉన్నట్లే, నా ప్రవక్త ఈ దినమునకైన వాక్యమైయున్నాడు.”

టేపులు, ఆయన స్వరము, మనకు ఒక ప్రేమలేఖయైయున్నది. మన పరీక్షలు మరియు హింసలు మరియు కష్టాల ద్వారా శత్రువు మనల్ని స్థిరముగా కొట్టుచుండగా, అది మనకొరకైన దేవునియొక్క ఎన్నికయైన ప్రేమ తప్ప మరొకటి కాదని మనతో చెప్పడానికి ఆయన తనయొక్క బలిష్ఠుడైన దూతను పంపించాడు, మనము కదల్చబడకుండునట్లు ఆయన మనల్ని ఎన్నుకున్నాడని మనకు ఋజువు చేయుచున్నాడు.

ఆయనయొక్క గొప్ప ఉద్దేశ్యము ఏమిటనగా కొంతకాలము మనము శ్రమనొందిన తరువాత, ఆయన మనల్ని పరిపూర్ణులుగా చేసి, స్థిరపరచి మరియు మనల్ని బలపరచును. మన ప్రభువు సైతం తన శ్రమలవలన పరిపూర్ణుడాయెను అని ఆయన మనకు చెప్పాడు. ఆయన మనకొరకు ఎటువంటి ఆశీర్వాదమును విడిచిపెట్టాడు కదా. ఏలయనగా మన శ్రమల ద్వారానే, ఆయన మనలను పరిపూర్ణతలోనికి కూడా తీసుకొనివస్తాడు.

పరీక్షలు మరియు శ్రమల ద్వారా ఆయన మన గుణలక్షణమును-నిర్మిస్తున్నాడు. ఏలయనగా శ్రమలు లేకుండా మన గుణలక్షణము తయారుచేయబడదు. అందుచేత, మన శ్రమలు మనకు ఒక బహుమతి కాదు గాని, ఒక విజయమైయున్నది.

మనము మన ప్రేమను ఆయనకు ఎలా నిరూపించుకుంటాము?

• ఆయన చెప్పినదానిని నమ్ముట ద్వారాను.
• ఆయనయొక్క వాక్యముతో నిలిచియుండుట ద్వారాను.
• ఆయన, తనయొక్క గొప్ప జ్ఞానముచేత, జరుగుటకు అనుమతించిన, మన శ్రమలు మరియు హింసలగుండా సంతోషముగా నడుచుకొనుట ద్వారానుయైయున్నది.

ఆయనయొక్క వాక్యమును వినుటద్వారా ఆయన మన ఆత్మలను ఏ విధంగా ఉల్లాసపరుస్తాడు కదా. ఆయనయొక్క స్వరము మన అంతరాత్మను ఆదరిస్తుంది. మనము ప్లేను నొక్కి మరియు ఆయన మాట్లాడుటను విన్నప్పుడు, మన భారములన్నీ తొలగించబడతాయి. మన శ్రమయంతటిగుండా మనకొరకు ఎటువంటి ధనము ఉంచబడినదో మనము ఊహించలేము.

ఓ, యేసుక్రీస్తుయొక్క వధువా, మీలో ప్రతియొక్కరితో కలిసి వారిలో ఒకరిగా ఉండుటకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఆయన మనకు తన వాక్య బయలుపాటును ఇచ్చాడని ఎరుగుటకు నా హృదయము గొప్ప ఆనందముతో నిండుచున్నది. అది సాధ్యమైతే ఏర్పరచబడినవారిని సైతం మోసపుచ్చేంత దగ్గరగా ఉంటుందని ఆయన మనతో చెప్పుచుండగా, ఆయన మనకు నిజమైన బయలుపాటును ఇచ్చియున్నాడు.

వచ్చి, ఈ ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, మేము ఆయనయొక్క పరిపూర్ణ వాక్యమును వినుచుండగా మాతో కలిసి ఆత్మలోనికి ప్రవేశించండి: 60-1206 — స్ముర్ణ సంఘకాలము.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్